11, సెప్టెంబర్ 2017, సోమవారం

అన్నా.. నేనూ ఒకే పార్టీలో చేరతాం:


వాల్మీకిపురం(చిత్తూరు జిల్లా): కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వాల్మీకిపురం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో మండల జేఎస్పీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్లు నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినా ఓటర్లు గుర్తించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచినవాళ్లు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం వలన అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. చివరకు ఎమ్మెల్యే ఇంటిముందు కూడా సిమెంటు రోడ్డు వేసింది తమ ప్రభుత్వంలోనేనని గుర్తుచేశారు. అన్ని మండలాల్లో పర్యటించి కార్యకర్తల అభిప్రాయం మేర కు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కొంతమంది అన్న ఒక పార్టీ నేనొక పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రసక్తే లేదని ఇద్దరమూ ఒకే పార్టీలో ఉంటామన్నారు.