29, జనవరి 2011, శనివారం

సిద్ధార్థ బావ బుద్ది మారదా?

యంగ్ హీరోల్లో సిద్ధార్థది ఓ వింత స్టైల్. కొత్త దర్శకులను పరిచయం చేయటంలో అందరు హీరోలకన్నా ముందుండే ఈ బావకు ఈ మధ్య ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తను నమ్ముకున్న సూత్రాన్ని మాత్రం వదలను అంటున్నాడు.

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేసింది మొదలు చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు వరకు హిట్టైనా ఫట్టైనా కొత్త దర్శకుడు ఫార్ములా మాత్రం వదలలేదు. ఇకనైనా బుద్ది తెచ్చుకొని సీనియర్లకు కూడా చాన్సులివ్వు అని ఎందరు చెప్పినా వినకుండా '180'కి జయేంద్రని, 'ఓ మై ఫ్రెండ్'తో వేణు శ్రీరాం అనే ఇద్దరు దర్శకులని తెరకు పరిచయం చేయబోతున్నాడు.

జయాపజయాలు ఎలాగున్నా సిద్ధార్థ్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం కొందరికి ఇబ్బందిగా ఉన్నా కొత్తవారికి మాత్రం ఉత్సాహంగా ఉంది. మణిరత్నం, శంకర్ బడి నుండి వచ్చాడు కాబట్టి కొత్త వారిలో ఉండే కసి పైన సిద్ధార్థకు మంచి గురి ఉంది.
తుపాకి నుంచి సేకరణ

పబ్లిక్ గా నవనీత్ కౌర్ వివాహం

2011 జనగణన గాలికొదిలేసి స్తానిక ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వం

జూన్, జూలై నెలల్లో జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు, గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోనున్న నేపథ్యంలో ఎన్నికలను సకాలంలోనే నిర్వహించే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ సన్నద్ధమౌతోంది. ఐతే 2011 జనగణన చివరి దశకు చేరుకొన్నప్పటికీ .. పట్టించుకోకుండా 2001 గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని 'స్థానిక సంస్థల' ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమౌ తుండటమే చర్చనీయంసమవుతోంది .
బీసీ, మహిళలకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్న డిమాండ్‌తో పాటు జనగణన పూర్తి అయితే తమకు తప్పక ప్రాతినిథ్యం పెరుగుతుందని వివిధ వర్గాలు పెట్టుకొన్న ఆశలు ప్రభుత్వ యోచనతో అడియాశలయ్యే పరిస్థితి ఏర్పడింది. మునిసిపల్ ఎన్నికలనే ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి కొనసాగుతుండగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు ఆ శాఖ ఉత్సాహం చూపు తూ... 2006 రిజర్వేషన్లనే ప్రాతిపదికగా తీసుకొంటూ సన్నద్ధం అవుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.

కాంగ్రెస్ ప్రతినిధులే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం పద్దతి కాదు

సోనియాను, పార్టీని వ్యతిరేకిస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులేనని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదన్నారు మాజీ మంత్రి గాదె వెంకటరెద్ది.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాను మొదటి నుంచి కోరుకుంటున్నట్లు, శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రతిపాదనలు కాక మరో ప్రతిపాదన లేదni, తెలంగాణపై ఏ నిర్ణయమైన కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణపై కాంగ్రెస్ కొత్త నాటకం

తెలంగాణపై కేంద్రంలో కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఉంది కానీ యూపీఏ వ్యతిరేకిస్తోందని, మరో కొత్త నాటకాన్ని కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నారని టీఆర్ఎస్ శాసన సభ పక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమవుతోందని, ఇందు కోసం జేఏసీ ప్రణాళికలు సిద్దం చేసిందని.. వచ్చేపార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ... సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అన్యాయానికి గురయ్యారని, తెలంగాణ రాష్ట్రంతోనే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

వసూళ్ల పార్టీగా మారిన టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించేందుకు వెలసిన టీఆర్ఎస్ పూర్తి గా వసూళ్ల పార్టీగా మారిపోయిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజు యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే ప్రభుత్వం దిగివస్తుందని, తెలుగుదేశం ప్రతినిధులు రాజీనామాలు చేస్తే ఎన్నికలు తప్ప తెలంగాణ రాదని గుర్తించుకోవాలని హితవు పలికారు ఉద్యమించేది పోయి ఉద్యమాలు చేపట్టకుండా కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో కుమ్ముక్కవుతూ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తిగా బహిర్గతం చేయాలనీ హై కోర్టుకు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక , చాప్టర్-8లో శాంతి భద్రతలకు సంబందించిన అంశాలపై సీల్డ్ కవర్‌లో ఇచ్చిన అంశాలను బహిర్గతం చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ, న్యాయవాది ఎం.నారాయణరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఒక భాగాన్ని రహస్యంగా ఉంచడం సమంజసం కాదని, ఇది రాజ్యాంగంలోని అధికరణం 21కి వ్యతిరేకమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.