29, జనవరి 2011, శనివారం

బికినీకి రెడీ అవాల్సిందే

ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు అన్నట్టు ఉత్తరాది హీరోయిన్ల మీద ఆధార పడ్డందుకు మనకు వాచిపోతుంది. మోడలింగ్ రంగం నుండి డైరెక్టుగా దిగుమతవుతున్న ముద్దుగుమ్మలు ఒడ్డు పొడుగు ఉన్నా అసలు యాక్టింగ్ స్పెలింగ్ కూడా వచ్చినట్టు అనిపించటం లేదు.

మొన్నే ఫ్రెష్షుగా దిగిన దీక్ష సేథ్ కూడా ఈ పనికిరాని లిస్టులో చేరిపోయింది. వేదం, మిరపకాయలలో చిన్న పాత్రల్లో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనపడేసరికి విషయం ఉందని పొరపాటు పడ్డ దర్శక నిర్మాతలకు తాను కూడా 'బెబ్బే'నన్న సంగతి 'వాంటెడ్'తో చెప్పేసింది. ముఖంలో ఏ భావమూ పలకని హీరోయిన్లు అందుకునే పాత పాట స్కిన్ షో. దీక్షా సేథ్ కూడా అంగాంగ ప్రదర్శనకు మొహమాటం చెప్పే అడ్డంకులు ఏమీ పెట్టుకోవట్లేదు.

'మా అమ్మకి డబ్బులు కట్టుకోండి. నాకు బికిని చుట్టుకోండి' అంటూ అప్పుడే ఆఫర్లు మొదలెట్టేసింది. 'వేదం'లో చూపిన దానికన్నా మిగిలినవి ఏమైనా ఉంటె దర్శకులు ట్రై చేసుకోవచ్చు.

తుపాకి నుంచి సేకరణ

ఇలియానాను నానపెడుతున్నారు

అప్పుడెప్పుడో 'సలీం'లో చూసిన ఇలియానా అందాలు మళ్ళీ వీక్షించడానికి ఇంత టైం పడుతుందని ఎవరూ అనుకోలేదు. ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ గ్రీకు శిల్పం మళ్ళీ రానా చేతిలో పూరీ ఉలితో చెక్కుతున్న 'నేను నా రాక్షసి'తో బయటకు రాబోతోంది. అదిగో వస్తోంది ఇదిగో వస్తోంది అంటూ రెండు నెలలుగా వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు పూరీ కనీసం ఓ ఝలక్ కూడా ఇవ్వటంలేదు.

అప్పుడో ఇప్పుడో వర్మానే ఇలియానాను గోకుతుంటే ఊహించుకోవడం తప్ప సరైన పోస్టర్ ఒక్కటి కూడా బయటకి వదల్లేదు అంటే పూరీ ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. వేసవిలో విడుదల అంటూ ఇప్పటికైతే చెప్పారు గానీ మళ్ళీ ఏం తేడా చేస్తారో అని ప్రేక్షకులు అనుమానిస్తుంటే, మీకు ఇలియానాను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటూ యూనిట్ సభ్యులు కూడా తమ వంతు డప్పేస్తున్నారు.

ఇంతలా ఊరిస్తూ, నానపెడుతుంటే ఇలియానా మాత్రం నాకేమి తెలియదన్నట్లుగా నవ్వేసి ఊరుకుంటోంది.

తుపాకి నుంచి సేకరణ

పవన్ కళ్యాణ్ భజన మండలి

ఫీల్డులో సీనియర్ మోస్ట్ అయినా టేస్టులో పక్కా సిల్లీ, నాటు ఫెలో అనిపించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ 'మిరపకాయ'తో ఇంత పెద్ద హిట్టు కొడతానని కల్లో కూడా అనుకోలేదు. 'అసలు నేను తీసింది ఎంత. మీరు చూపిస్తున్న ఆదరణ ఎంత?' అంటూ తన సినిమాతో తనకే షాకు కొట్టినట్టు ఫీలవుతున్నాడు.

'సినిమాలో నేను చేసింది ఏమీ లేదు అంతా అన్నయ్య (చిరంజీవి అనుకునేరు కాదు రవితేజ అన్నయ్య) ఎనర్జీ మహిమే. అసలు మా అన్నయ్య అంటే. ......' అంటూ ఎక్కడ దొరికితే అక్కడ రవితేజను ఆకాశానికి ఎత్తుకుంటున్న హరీష్ దగ్గర దర్శకత్వం ఏమో గానీ తనని తాను మార్కెట్ చేసుకునే తెలివితేటలు ఎక్కువేనట. ఎప్పుడు లేనిది రవితేజకు కూడా ఓ భజన మండలిని స్థాపించిన హరీష్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న పవన్ కళ్యాణ్ భజన మండలిలో మొన్నే సభ్యత్వం పుచ్చుకున్నాడట.

ఒక్కసారి షూటింగ్ ముహూర్తం పెట్టారంటే అక్కడి నుండి ప్రతిరోజు సామూహిక భజనలు, హరికథలు, బుర్రకథలు రెగ్యులర్ గా నిర్వహించి 'గబ్బర్ సింగ్' అయిపోయేలోపు ఎలాగైనా భజన మండలి చైర్మన్ పోస్టు కొట్టేసి అక్కడి నుండి మెగా భజన మండలిలో ప్రవేశం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడట. అంటే మిరపకాయ పబ్లిసిటిలో భాగంగా ఆల్రెడీ చాలా చోట్ల మెగా కీర్తనలు పాడేసాడు అనుకోండి.

తుపాకి నుంచి సేకరణ

గోపీచంద్, కృష్ణవంశీ - ఎవరు ఎవరిని మారుస్తారో?

ఖాళీగా కూర్చుంటే ఎంతటి వారినైనా లోకం లోకువగానే చూస్తుంది. కానీ కృష్ణవంశీ విషయంలో ఈ ఫార్ములా పని చేయదు. క్రియేటివిటి అన్న పదానికి కమర్షియల్ హంగులను జోడించడంలో తనకంటూ ఓ ముద్రను ఏర్పరుచుకున్న కృష్ణవంశీ గత కొద్దికాలంగా గడ్డు పరిస్థితినే కల్లజూసాడు.

మహాత్మా, శశిరేఖా పరిణయంలాంటి సినిమాలు తీసి ఎటూ కొరగాకుండా పోయాడు. కుటుంబ కథా చిత్రాలను, యువతను ఆకట్టుకునే చిత్రాలను, సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రాలను...ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జోనర్లలోను తన మార్క్ చూపించుకున్న కృష్ణవంశీ ఇప్పుడు ఏ కథనైనా ఒకే యాక్షన్ కథలా ఫీలయ్యే గోపీచంద్ తో సినిమా ఒప్పుకున్నాడంటే ఎలా ఉండబోతుందో అన్న ఉత్సూకత స్టార్ట్ అయ్యింది.

'వాంటెడ్'తో మోస్ట్ అన్ వాంటెడ్ హీరోల జాబితాలో చేరిపోయిన గోపీచంద్ మరి కృష్ణవంశీనే మారుస్తాడో లేక రివర్స్ జరిగే చాన్సులు ఏమైనా ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

తుపాకి నుంచి సేకరణ

జూనియర్ ఎన్టీయార్ గుడ్డి వాడయ్యాడా?

సింహాలో నటన చూసిన తర్వాత ఒక్క బాలయ్యను చూడడానికే రెండు కళ్ళు సరిపోలేదు. అటువంటిది పరమవీరచక్రలో బాబాయ్ రావణబ్రహ్మగా పదితలకాయలు చూడడానికి ఎన్ని కళ్ళైనా చాలవు' అని పరమవీరచక్ర పబ్లిసిటి కోసం జూనియర్ ఎన్టీయార్ అన్న మాటలు నిజం అయినట్టే ఉన్నాయి.

ఎన్ని కళ్ళైనా సరిపోవు అన్న మా బుడ్డోడికి బాలయ్య దెబ్బతో ఉన్న ఆ రెండు కళ్ళూ పోయినట్టున్నాయి అంటు అభిమానులు భయపడిపోతున్నారు. అవును మరి, ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ ఉండే జూనియర్ 'పరమవీరచక్ర' విడుదలకు కొద్ది రోజుల ముందు నుండి సుమారు నెల రోజులుగా కనపడుటలేదు. అభిమానులను కనీసం బాబాయ్ సినిమా రిపోర్టు అడగడానికైనా వస్తాడనుకుంటే ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది.

ఇంతకీ జూనియర్ ఎన్టీయార్ ఎక్కడున్నట్టు, అసలు కళ్లున్నాయా లేక దాసరి ధాటికి....? ఇక్కడ అంతా కుషలమే. నీ వైపు నుండి అంతా కుషలమైతే వెంటనే ట్విట్టర్ ద్వారా యోగక్షేమాలు తెలపగలవు...ఇట్లు నీ అభిమానులు. సరిపోతుందిగా బ్రదర్స్. ఎనీ డౌట్స్?

తుపాకి నుంచి సేకరణ

ఆంటీ కొత్త బిజినెస్ మొదలెట్టింది

ఆమె వయసు నలభై మూడేళ్ళు. కానీ చీర చెంగును బొడ్డులో చెక్కి ఒక్కసారి డ్యాన్సు కట్టిందంటే దద్దరిల్లాల్సిందే. ఆమే మాధురి దీక్షిత్. ఇండియన్ సినిమా చరిత్రలో ఈమె అంతటి గొప్ప డ్యాన్సర్ రాలేదు ఇక రాబోదు అన్న వాక్కు అక్షరాలా నిజం.

ఇద్దరు పిల్లల తల్లైనా ఫీల్దుని వదిలి ఉండలేక అమెరికా నుండి ముంబైలో ఊడిపడ్డ మాధురి సినిమాలను అటుంచి బుల్లి తెర మీద మాత్రం రాణించే సూచనలు కనపడుతున్నాయి. వచ్చీరాగానే ఓ రియాలిటీ షోలో ఈమె చేసిన నృత్యం మేటి కొరియోగ్రాఫర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.

మాధురి అంతటి అల్టిమేట్ డ్యాన్సర్ లేదు అన్నది కన్ఫర్మ్ అయిపొయింది కాబట్టి ఇక రానున్న కొత్తతరాలకి మన నృత్యం పట్ల అవగాహన కలిగించేందుకు వరల్డ్ వైడ్ డ్యాన్సు స్కూళ్ళను స్టార్ట్ చేసి దీన్ని కొత్త రకం బిజినెస్ లాగా రూపొందించాలని పక్కా ప్రణాళికతో ముంబైలో వర్క్ మొదలెట్టింది. మల్లెతీగ లాంటి నడుమును మెరుపుతీగ లాగా ఊపడం చూసిన అభిమానులు ఇక మున్ముందు మాధురిలో ఓ టీచరమ్మను చూస్తారు.

సిద్ధార్థ బావ బుద్ది మారదా?

యంగ్ హీరోల్లో సిద్ధార్థది ఓ వింత స్టైల్. కొత్త దర్శకులను పరిచయం చేయటంలో అందరు హీరోలకన్నా ముందుండే ఈ బావకు ఈ మధ్య ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తను నమ్ముకున్న సూత్రాన్ని మాత్రం వదలను అంటున్నాడు.

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేసింది మొదలు చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు వరకు హిట్టైనా ఫట్టైనా కొత్త దర్శకుడు ఫార్ములా మాత్రం వదలలేదు. ఇకనైనా బుద్ది తెచ్చుకొని సీనియర్లకు కూడా చాన్సులివ్వు అని ఎందరు చెప్పినా వినకుండా '180'కి జయేంద్రని, 'ఓ మై ఫ్రెండ్'తో వేణు శ్రీరాం అనే ఇద్దరు దర్శకులని తెరకు పరిచయం చేయబోతున్నాడు.

జయాపజయాలు ఎలాగున్నా సిద్ధార్థ్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం కొందరికి ఇబ్బందిగా ఉన్నా కొత్తవారికి మాత్రం ఉత్సాహంగా ఉంది. మణిరత్నం, శంకర్ బడి నుండి వచ్చాడు కాబట్టి కొత్త వారిలో ఉండే కసి పైన సిద్ధార్థకు మంచి గురి ఉంది.
తుపాకి నుంచి సేకరణ