30, జనవరి 2011, ఆదివారం

దిల్ రాజే ఇప్పుడు అతనికి బెస్ట్ ఫ్రెండ్

బొమ్మరిల్లు'లాంటి సినిమా మాకు ఒక్కటి కూడా తగల్లేదేమిటని పెద్ద హీరోలు ఫీల్ అవుతుంటే, దిల్ రాజు పుణ్యమాని తెలుగులో అదే బొమ్మరిల్లుతో పాగా వేసేసిన సిద్ధార్థ్ మాత్రం వరస ఫ్లాపులతో ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. గుర్రం చేసేది గాడిద చేసినా, గాడిద చేసేది గుర్రం చేసినా ఇలాగే ఉంటుంది.

మాస్ హీరో అవ్వాలి అన్న కల హీరోలందరికీ ఉన్నా ఎవరికి ఏం చేతనవుతుందో అది చేసుకొని ఉన్నంతలోనే తృప్తి పడుతుంటే ఏటికి ఎదురీదినట్టు సిద్ధార్థ్ ధీరుడిలా ఫీలై ఆటాడేసుకోవాలి అనుకున్న ప్రతిసారి ప్రేక్షకులు తగిన శాస్తి చేసి పంపారు. రోజులు దగ్గర పడ్డాయి అనుకున్న తరుణంలో మళ్ళీ దిల్ రాజు నుండి ఫోన్ రావడంతో 'ఓ మై ఫ్రెండ్' అంటూ ప్రేమ కురిపించేసాడు. ఫిబ్రవరిలో మరో 'బొమ్మరిల్లు'ను మొదలెడదాం అని చెప్పేసరికి సిద్ధార్థ్ ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. వేణు శ్రీరాం అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న 'ఓ మై ఫ్రెండ్'కు 'ఓ మై డార్లింగ్' అమృతా రావుగా ఫైనల్ అయిపొయింది.

తుపాకి నుంచి సేకరణ

సునీల్ సంక నాకిపోతాడా

తన సొంత కష్టంతో ఒక్కో మెట్టుగా ఎక్కుతూ, ప్రతి మెట్టుపైన ఓ చెమట బిందువును వదులుకుంటూ వచ్చి ఇప్పుడు అందరికీ నోట్లో నాలుకలా తయారైన కమెడియన్ సునీల్ 'అప్పల్రాజు' మొదలైన దగ్గరి నుండి అందరివాడు కాదు కొందరి వాడైపోయాడని కృష్ణనగర్ జనాలు ముచ్చటిస్తున్నారు.

అందాల రాముడు, మర్యాద రామన్నలు సూపర్ హిట్టు అయిన నాడు కూడా నలుగురిని నవ్విస్తూ కనపడే సునీల్ కొద్ది కాలంగా బిక్కుబిక్కుమంటూ ఉండడం చూస్తుంటే ఇది 'అప్పల్రాజు' మహిమా లేక వర్మా మహిమా అని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. హీరోగా నిలబడాలి అంటే రెండు హిట్లు సరిపోవన్న విషయం తెలిసినట్టే కనపడే సునీల్ తనకు భోజనం పెట్టిన క్యారక్టర్ వేషాలు అసలు వేస్తున్నాడా అంటే క్లారిటీ ఆన్సర్ దొరకట్లేదట.

మరి ఒక్క అపల్రాజు, ఒక్క నెపోలియన్ చిత్రాలతో సునీల్ హీరోగా స్థిరపడిపోతే ప్రాబ్లం లేదు బట్ తేడా పడితే చెప్పుడు మాటలు విన్నందుకు సంక నాకిపోవడం గ్యారంటీ అంటూ సీనియర్ విశ్లేషకులు ఇప్పుడే జాతకం విప్పేస్తున్నారు.

తుపాకి నుంచి సేకరణ


ఈమెది కూడా చిరు ఖాతాలోనే వేసేదా?

చిరంజీవి ఇంట్లోని నలుగురు కుటుంబ సభ్యులు నాలుగు సొంత కుంపట్లు పెట్టుకొని నిర్మాతలై పోతే నేనెందుకు కాకూడదు అనుకుంది చిరు సొంత మనిషిలా ఫీలయ్యే ప్రజారాజ్యం నాయకురాలు శోభారాణి.

నాగబాబు అంజన ప్రొడక్షన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, పవన్ కళ్యాణ్ తన క్రియేటివ్ వర్క్స్ తో పాటుగా రామ్ చరణ్ కూడా నాన్న నూట యాభయ్యో చిత్రానికి తల్లి సురేఖ పేరు మీద బ్యానర్ స్థాపించే పనిలో ఉన్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా సామాజిక న్యాయం మీద కథను రెడీ చేయించేసి చిరంజీవి ఆశీసులు కూడా పొందిన శోభారాణి రేపో మాపో ఓ స్వీట్ డబ్బా ముందు పెట్టి ఈ సినిమా శుభవార్త మీడియాకి విడుదల చేసే పనిలో ఉందట.

చిరంజీవి నాలుగు స్తంభాలాట అంటూ ఇప్పటికే మీడియా దంచేస్తుంటే ఈ బ్యానర్ కూడా చిరు ఖాతాలోకే వెళితే ఐదో స్థంభం ఎక్కడ పాతేది?

తుపాకి నుంచి సేకరణ

దాసరి పుండు మీద 'మిరపకారం' చల్లాడు

అసలే 'పరమవీరచక్ర'కు ఇంటర్ నేషనల్ పరమ చెత్త అవార్డులు ఎన్ని వస్తాయో అంటూ దాసరి నారాయణ రావు టెన్షన్ పడుతుంటే బుడ్డోడు అల్లు శిరీష్ పుండు పైన కారం చల్లినట్టు మాట్లాడుతున్నాడు.

నిర్మాత సి.కళ్యాణ్ పరమ కలెక్షన్ల గూర్చి పట్టించుకోవడమే మానేసి పోలీసుల చుట్టూ తిరుగుతుంటే తన సినిమా మీద మమకారం చావని దాసరి అడపాదడపా టీవీల్లో కనపడుతూ ఎప్పుడో పడుకున్న దాన్ని లేపే విఫలయత్నాలు చేస్తున్నాడు. పరమవీరచక్రకు సరైన సినిమా హాళ్ళు ఇవ్వడంలో అల్లు అరవింద్ వర్గం గీతా ఫిలిమ్స్ ద్వారా రాజకీయం చేసిందంటూ దాసరి వర్గం చిర్రుబుర్రులాడితే, దీనికి సంబంధించి అల్లు శిరీష్ పిల్ల బుద్ధులను మరోసారి ట్విట్టర్లో ప్రదర్శించేసాడు.

'మన గీతా ఫిలిమ్స్ మీద విడుదలైన ప్రతి సినిమాకు మంచి థియేటర్స్ దొరుకుతాయి. మంచి కలెక్షన్లు రాబడతాయి. సినిమా ఫ్లాపైనా కలెక్షన్లు హిట్టుకంటే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ మిరపకాయ' అంటూ మిరపకారం చల్లి వదిలేసాడు. అసలే అల్లు అన్నా గీతా అన్నా కుల్లుకుంటున్న దాసరి మరి ఈ వాగుడుకాయని కూడా పట్టించుకుంటాడా?

తుపాకి నుంచి సేకరణ

29, జనవరి 2011, శనివారం

"మిరపకాయ్"2 వీక్స్ కలెక్షన్స్

యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, సెన్సేషనల్ హీరో మాస్ రాజా రవితేజ హీరోగా నటించగా, రీచా గంగోపాథ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్లుగా, "షాక్"ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల అనే నూతన నిర్మాత నిర్మించిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రం "మిరపకాయ్".ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించి,హీరో రవితేజ సినీ కెరీర్‍ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనీ, అందుకు రుజువుగా ఈ చిత్రం రెండు వారాల కలెక్షన్లను నిర్మాత మీడియాకు అందజేశారు.

ఆ వివరాలు మీకోసం.
నైజాం - 6,75,23,000
సీడెడ్ - 4,30,04,000
కృష్ణా - 1,40,00,000
గుంటూరు - 2,01,00,000
నెల్లూరు - 92,00,000
వైజాగ్ - 2,10,08,000
ఈస్ట్ - 1,60,20,000
వెస్ట్ - 1,30,15,000
ఓవర్సీస్ - 2,40,60,000
కర్ణాటక - 1,64,25,000
ఒరిస్సా - 28,85,000
తమిళనాడు - 32,00,000
ఈ విధంగా "మిరపకాయ్" చిత్రం రెండు వారాలకు గాను 25 కోట్ల,నాలుగు లక్షల,నలభై వేలు వసూలుచేసిందని ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేస్తూ, ఇమతటి ఘనవిజయం అందించిన ఆంధ్ర ప్రేక్షకులకూ, తమ హీరో రవితేజకూ, దర్శకుడు హరీష్ శంకర్ కూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

బొడ్డులో చీమ సుందరికి మొగుడు కావాలట

సింహాద్రిలో జూనియర్ ఎన్టీయార్ చేత బొడ్డులో గండు చీమల్ని తోలించుకున్న రస్నా బేబి అంకితకు మొగుడు కావాలంట. కెరీర్ మొత్తం చేజేతులా సర్వనాశనం చేసుకున్న అంకిత గత కొద్ది కాలంగా అమెరికాలో స్థిర పడింది అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయి.

న్యూ యార్క్ లోని ఓ లోకల్ చానల్ నడుపుతున్న మ్యాట్రిమోనియల్ ప్రోగ్రాములో ఓ జ్యూయిష్ కోటీశ్వరున్ని పడగొట్టేందుకు అంకిత ఆడుతున్న అబద్ధాలు యౌ ట్యూబ్ సాక్షిగా బయటపడ్డాయి. తనకు తాను ఓ పాపులర్ బాలివుడ్ నటినని కోటీశ్వరుడైన మొగుడి కోసం గొప్పలు బొంకిన అంకిత మగాన్నైతే పట్టిందో లేదో గాని అక్కడున్న తెలుగు వారికి మాత్రం అడ్డంగా బుక్కయి పోయింది.

ఇంతకీ ఈమె హిందీ సినిమాల్లో ఎప్పుడు నటించింది అని అందరు బుర్రలు గోక్కుంటుంటే, అంకిత పెద్ద అబద్దాలకోరు అని ఏనాడు హీరో నవదీప్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. అమెరికా మొగుడేనా లేక ఇండియా వాడయినా సరిపోతుందా రస్నా పిల్లా?

తుపాకి నుంచి సేకరణ

ఈమె కూడా గర్భవతే

ఓయబ్బో ఒకప్పటి హీరోయిన్ ఆంటీలకు గర్భం సీజన్ వచ్చిపడింది. అందుకే ఒకరి వెంట ఒకరు క్యూ కట్టి మరీ ప్రెగ్నెంట్ అవుతున్నారు లేదా పిల్లలనే కనేస్తున్నారు. మొన్నే మీనా, రంభల పేర్లు వినబడితే నిన్న బాలివుడ్ పేర్లు మాన్యత, మందిరా బేడి ఇప్పుడు ప్రీతి ఝాంగియాని కూడా లిస్టులో చేరిపోయింది.

ఇంతకీ ఈ ప్రీతి ఎవరంటే పవన్ కళ్యాణ్ 'తమ్ముడు'లో డీసెంట్ యాక్టింగ్ చేసి తర్వాత బాలకృష్ణ, మోహన్ బాబు చేతుల్లో నలిగిపోయిన బ్యూటి. పర్వీన్ దబాస్ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన ప్రీతికి ఇది మొదటి కాన్పు కావటంతో జాగ్రత్తగా ఉన్నానని, అందుకే డెలివరి డేట్ ఎవరికీ చెప్పటం లేదని మీడియాకి ఒప్పుకుంది. ఒకనాడు హీరోయిన్లుగా నటించిన అందగత్తెలందరికీ ఈ మధ్య అమ్మాయిలే పుడుతుండడం ఇంకో కొసమెరుపు.