2, ఫిబ్రవరి 2011, బుధవారం
మంత్రిపై మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్
పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినమంత్రి పి.శంకర్‌రావుపై చర్య తీసుకోవాలంటూ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపద్యంలో విచారణ కోరుతూ మంత్రి పి.శంకర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడంపై స్పందన కోరగా 'రాత్ గయీ... బాత్ వోహీ' అని జవాబిచ్చారు.

బాబ్బాబు ...కాస్త సాయపడండి ... మీపేరుతో బస్సు నడుపుతాం
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అన్వేషిస్తోంది. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి భారీ సాయం కోసం ఒక వైపు యత్నిస్తూనే, మరోవైపు ఆర్టీసీకి విరాళమిచ్చిన పక్షంలో ఆయా సర్వీసులకు దాతలు సూచించిన పేర్లను పెట్టాలన్న ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు.
దాతలనుంచి ఆర్థిక సాయాన్ని పొందగలిగితే..కొంతమేరకైనా ఆ లోటును పూడ్చుకోవచ్చని.. వారెవరైనా విరాళమందిస్తే వారు సూచించిన పేర్లను నిర్ణీత కాలం వరకు గానీ సదరు సర్వీసులకు పెట్టాలన్నది ఆర్టీసీ భావిస్తోంది.

కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ స్థాయి పదవులకు బేరం పెట్టాలి?
కాంగ్రెస్‌తో పొత్తుకు సై అనాలా? వద్దా? ప్రభుత్వంలో చేరడంపై ఏం చేయాలి? చేరే పక్షంలో ఏ స్థాయి పదవులకు బేరం పెట్టాలి? నాలుగైదు పదవులు తీసుకొని ఇలా ప్రభుత్వంలో చేరిపోతే.. ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి ఏం కావాలి? వారికి న్యాయం జరిగేదెలా?.. ఇవీ ప్రస్తుతం ప్రజారాజ్యంలోని వివిధ స్థాయి నేతల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు.
సోనియాతో భేటీలో విలీనం ప్రస్తావనే వస్తుందని విశ్వసిస్తున్న పార్టీ నాయకత్వం.. ఆ దిశగానే విస్తృత కసరత్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం. "విలీనం ప్రతిపాదనే వస్తే.. ముఖ్యమంత్రితో సమాన స్థాయి కలిగిన చిరంజీవికి అంతటి ప్రాధాన్యమున్న పదవినే అడిగే అవకాశం ఉంది. ఆయనకు ఆ స్థాయి పదవి వస్తేనే.. పార్టీని నమ్ముకున్న నేతలను కొంతైనా పైకి తీసుకురాగలుగుతారు'' అని పార్టీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. పీఆర్పీ వెళ్లి కాంగ్రెస్ సముద్రంలో కలిస్తే తమ పరిస్థితేమిటన్నది ద్వితీయ శ్రేణి నేతల ప్రధాన ప్రశ్నగా ఉంది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)