పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ చిత్రం ఈ నెల 14 వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాత గణేష్ బాబు ప్రకటించారు.
ఈ సందర్బంగా నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...పవన్‌కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అద్భుతం. పవన్‌కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే వంద శాతం స్క్రీన్‌మీద ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుం దన్నారు.
4, ఏప్రిల్ 2011, సోమవారం
ఎన్టిఆర్ వివాహానికి ఆనందసాయి భారీ సెట్
మే ఐదున జరగబోయే ఎన్టిఆర్ వివాహానికి భారీ సెట్ వేస్స్ భాద్యతలు సినీ ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి తీసుకొన్నారు. తాజాగా పనిచేసిన శక్తి చిత్రం విడుదలై రిజల్ట్ ఎలా ఉన్నా అందులోని ఆనందసాయి వేసిన సెట్స్ కు మంచి పేరు వచ్చాయి. 35 అడుగుల కాళికా దేవి విగ్రహాన్ని ఆయన రూపొందించిన తీరు చిత్ర సీమలో నే కాదు యావత్ ఆంధ్ర దేశమంతా
చర్చనీయాంశంగా మారింది. ఈ నేపద్యంలో ఎన్టిఆర్ వివాహానికి పెళ్లి సెట్ వేసీ అవకాశం రావటం తో ఉబ్బి, తబ్బిబ్బవుతున్నాడు.
చర్చనీయాంశంగా మారింది. ఈ నేపద్యంలో ఎన్టిఆర్ వివాహానికి పెళ్లి సెట్ వేసీ అవకాశం రావటం తో ఉబ్బి, తబ్బిబ్బవుతున్నాడు.
గొంతు తడిపేందుకు.. బీరు, విస్కీలు పుష్కలం
అసలే వేసవి కాలం.. అందులో భ గ్గున మండే ఎండలు.. గుక్కెడు నీళ్లు తాగి దూప తీర్చుకోవడం కంటే చల్లని బీరు తాగి సేద తీరడమే మేలంటున్నా రు 'బీర్' ప్రియులు. గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్లు దొరకకున్నప్పటికీ చల్లని బీర్లు మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అం తటా మద్యం దుకాణాలు వెలిశాయి. ఇక ప్రతి పల్లెలోనూ, పల్లెల్లోనీ వాడల్లోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. పల్లెల్లో చెంబెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సి ఉండగా బీర్లు మాత్రం ప్రతి పల్లెలోని ప్రతి గల్లీలో దొరుకుతున్నాయి.
మంచినీళ్లు దొరకకున్నప్పటికీ బీర్లు మాత్రం పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోనప్పటికీ అబ్కారీ అధికారుల పుణ్య మా..! అని పల్లె పల్లెల్లో వెలసిన బెల్ట్‌షాపుల మూలంగా చల్లని బీర్లు లభిస్తున్నాయి.
పల్లె ప్రజానీకానికి తాగునీరందించేందుకు పెద్దగా శ్రద్ధాసక్తులు కనబరచని ప్రభుత్వం ప్రతి ఏటా మద్యం విక్రయాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఫలితంగా ఇటు మద్యం దుకాణాలతోపాటు అటు దాబాలు, బెల్ట్‌షాపుల్లో చల్లనీ బీరు, విస్కీలు పుష్కలం గా లభిస్తున్నాయి.
తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చేందుకు నిరాకరించే మందుబాబులు చల్లని బీర్లు తెచ్చుకుని తాగడంపైనే మక్కువ కనబరుస్తున్నారు.

స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా?
భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా అన్నంత ఆనందం ప్రతి ఒక్కరిలో కలిగిందని అమితాబ్ ట్విట్టర్‌లో రాసుకున్నారు. సాధారణంగా భారత్ మ్యాచ్ జరిగేటప్పుడు తాను అసలు చూడనని, అయినా 33 పరుగులకు 2 వికెట్లు పడిపోయినా.. చివరి మ్యాచ్ విన్నింగ్ షాట్ లో కెప్టెన్ ధోని సిక్స్ కొట్టేవరకూ టెలివిజన్‌కు అత్తుకుపోయి కూర్చున్నానని ఆయన తెలిపారు. భారత్ గెలిచినా ఆనందంలో.. నేనే అది గెలిచానన్న ఫీలింగ్ కలిగి చిన్నపిల్లలా మాదిరిగా అభిషేక్, ఐశ్వర్యల తో కలిసి కారు టాప్‌పై కూర్చుని త్రివర్ణ ప్రతాకాన్ని ఊపడం చెప్పనలవి కాని గొప్ప అనుభూతి అని అన్నారు. అల్లాగే సినీ ఇండస్ట్రీ లో సాద్యం కాని రజని, గజనీ, ధోనీల అపూర్వ కలయిక క్రికెట్ తో సాధ్యమైంది అని తెగ ఆనంద పడిపోయారు అమితాబ్...
3, ఏప్రిల్ 2011, ఆదివారం
భారత జట్టుపై జరిమానా
వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంకంటే ఎక్కువ సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకపోవడంతో ప్రపంచకప్ విజేత భారత జట్టుపై ఐసీసీ మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో జరిమానావిధించాడు. భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ నిబంధన 2.5.1 ను అతిక్రమించడంతో ఐసీసీ విధించిన ఈ జరిమానాను భారత జట్టు అంగీకరించింది
కడపలో ఉప ఎన్నికల యుద్ధం
కడపలో ఉప ఎన్నికల యుద్ధం జరగబోతోందని అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పులివెందులలో బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ప్రయత్నిస్తోందన్నారు. అలాగే కడపలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి టీడీపీకి సహకరించేలా రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు సోనియాగాంధీ, వైఎస్ఆర్‌ల మధ్య జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు.
15న జగన్ నామినేషన్
కడప పార్లమెంట్ స్థానానికి ఈనెల 15వ తేదీ వైఎస్ఆర్ పార్టీ తరపున మాజీ ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 16న పులివెందుల అసెంబ్లీకి విజయమ్మ నామినేషన్ వేయనుండగా అదేరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నామినేషన్ వేయనున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)