4, ఏప్రిల్ 2011, సోమవారం

ఆదరిస్తున్న అందరికి 'ఉగాది' శుభాకాంక్షలు

పోచారంకి పూలు.. చంద్రబాబు కి చెప్పులు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ వి షయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన వ్యక్తం చేసింది. ఆది లాబాద్ జిల్లా బెల్లం పల్లెలో తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక ఈ విన్నూత్న నిరసన కార్యక్రమం చేసింది.

శివాజి హీరోగా పెళ్ళాం ఊరెళితే... సీక్వెల్

శ్రీకాంత్, వేణు కాంబినేషన్ లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్సకత్వంలో వచ్చిన పెళ్ళాం ఊరెళితే చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది.శివాజి హీరోగా ఈ చిత్రం త్వరలో తెరకెక్కబోతోంది. కామిడీ చిత్రాల డైరక్టర్ గాంధీ ఈ సినిమా కి డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం..గతంలో అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ, శ్రీరామచంద్రులు వంటి ఫ్యామిలీ చిత్రాలలో నటించిన శివాజి ఈ చిత్రం తో మళ్ళి ఓ వెలుగు వేలుగుటాడని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి.

14 న పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ చిత్రం ఈ నెల 14 వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాత గణేష్ బాబు ప్రకటించారు.

ఈ సందర్బంగా నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...పవన్‌కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అద్భుతం. పవన్‌కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే వంద శాతం స్క్రీన్‌మీద ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుం దన్నారు.

ఎన్టిఆర్ వివాహానికి ఆనందసాయి భారీ సెట్

మే ఐదున జరగబోయే ఎన్టిఆర్ వివాహానికి భారీ సెట్ వేస్స్ భాద్యతలు సినీ ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి తీసుకొన్నారు. తాజాగా పనిచేసిన శక్తి చిత్రం విడుదలై రిజల్ట్ ఎలా ఉన్నా అందులోని ఆనందసాయి వేసిన సెట్స్ కు మంచి పేరు వచ్చాయి. 35 అడుగుల కాళికా దేవి విగ్రహాన్ని ఆయన రూపొందించిన తీరు చిత్ర సీమలో నే కాదు యావత్ ఆంధ్ర దేశమంతా
చర్చనీయాంశంగా మారింది. ఈ నేపద్యంలో ఎన్టిఆర్ వివాహానికి పెళ్లి సెట్ వేసీ అవకాశం రావటం తో ఉబ్బి, తబ్బిబ్బవుతున్నాడు.

గొంతు తడిపేందుకు.. బీరు, విస్కీలు పుష్కలం

అసలే వేసవి కాలం.. అందులో భ గ్గున మండే ఎండలు.. గుక్కెడు నీళ్లు తాగి దూప తీర్చుకోవడం కంటే చల్లని బీరు తాగి సేద తీరడమే మేలంటున్నా రు 'బీర్' ప్రియులు. గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్లు దొరకకున్నప్పటికీ చల్లని బీర్లు మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అం తటా మద్యం దుకాణాలు వెలిశాయి. ఇక ప్రతి పల్లెలోనూ, పల్లెల్లోనీ వాడల్లోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. పల్లెల్లో చెంబెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సి ఉండగా బీర్లు మాత్రం ప్రతి పల్లెలోని ప్రతి గల్లీలో దొరుకుతున్నాయి.

మంచినీళ్లు దొరకకున్నప్పటికీ బీర్లు మాత్రం పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోనప్పటికీ అబ్కారీ అధికారుల పుణ్య మా..! అని పల్లె పల్లెల్లో వెలసిన బెల్ట్‌షాపుల మూలంగా చల్లని బీర్లు లభిస్తున్నాయి.

పల్లె ప్రజానీకానికి తాగునీరందించేందుకు పెద్దగా శ్రద్ధాసక్తులు కనబరచని ప్రభుత్వం ప్రతి ఏటా మద్యం విక్రయాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఫలితంగా ఇటు మద్యం దుకాణాలతోపాటు అటు దాబాలు, బెల్ట్‌షాపుల్లో చల్లనీ బీరు, విస్కీలు పుష్కలం గా లభిస్తున్నాయి.

తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చేందుకు నిరాకరించే మందుబాబులు చల్లని బీర్లు తెచ్చుకుని తాగడంపైనే మక్కువ కనబరుస్తున్నారు.

స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా?

భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా అన్నంత ఆనందం ప్రతి ఒక్కరిలో కలిగిందని అమితాబ్ ట్విట్టర్‌లో రాసుకున్నారు. సాధారణంగా భారత్ మ్యాచ్ జరిగేటప్పుడు తాను అసలు చూడనని, అయినా 33 పరుగులకు 2 వికెట్లు పడిపోయినా.. చివరి మ్యాచ్ విన్నింగ్ షాట్ లో కెప్టెన్ ధోని సిక్స్ కొట్టేవరకూ టెలివిజన్‌కు అత్తుకుపోయి కూర్చున్నానని ఆయన తెలిపారు. భారత్ గెలిచినా ఆనందంలో.. నేనే అది గెలిచానన్న ఫీలింగ్ కలిగి చిన్నపిల్లలా మాదిరిగా అభిషేక్, ఐశ్వర్యల తో కలిసి కారు టాప్‌పై కూర్చుని త్రివర్ణ ప్రతాకాన్ని ఊపడం చెప్పనలవి కాని గొప్ప అనుభూతి అని అన్నారు. అల్లాగే సినీ ఇండస్ట్రీ లో సాద్యం కాని రజని, గజనీ, ధోనీల అపూర్వ కలయిక క్రికెట్ తో సాధ్యమైంది అని తెగ ఆనంద పడిపోయారు అమితాబ్...