5, ఏప్రిల్ 2011, మంగళవారం

బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగు

సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై ఆయన తాజా బులిటెన్ విడుదల చేశారు.

బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు... హార్ట్ బీట్, బీపీ నార్మల్‌ గానే ఉన్నట్లు వెల్లడించారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ..ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని ఆయన తెలిపారు.

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉప ఎన్నికల్లో గెలుపు మాదే : నన్నపనేని

కడప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించిన ఆమె అందుకు రుజు వులు చూపించగలరా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే దుస్థితికి దిగజారదని స్పష్టం చేశారు. కడప ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరు కదా అన్న ప్రశ్నకు మైసూరారెడ్డి ఉన్నారు కదా...ఎవరు అభ్యర్థులుగా ఉన్నా గెలవడమే తమ లక్ష్యమన్నారు.

"దమ్మరో దమ్" పై హైకోర్టుకెళ్లనున్న గోవా మంత్రి

రానా, అభిషేక్ బచ్చన్, బిపాసా బసు, దీపికా పదుకునె నటిస్తున్న "దమ్మరో దమ్" చిత్రంపై హైకోర్టుకెళ్లనున్నట్లు గోవా పర్యాటక మంత్రి నీలకంఠ హలార్కర్ తెలిపారు. చిత్ర దర్శకుడు రోహన్ సిప్పీ గోవా ప్రతిష్టను దిగజార్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు.

ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అసెంబ్లీలో సైతం లేవనెత్తారు గోవా మాజీమంత్రి మిక్కీ . ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించనీయకుండా అడ్డుకోవాలని ప్రజలకి సూచిన్చారాయన. భారతదేశంలోనే ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న గోవాను చిత్రంలో దారుణంగా చూపారనీ, ఈ చిత్రం వల్ల పర్యాటకం కేంద్రంగా భాసిల్లుతున్న గోవాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సోనియా ఇక ఇటలీకి వెళ్లక తప్పదు

డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పార్టీకి క్వార్టర్ బాటిల్ గుర్తు ఇచ్చి ఉండాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి ఎద్దేవా చేశారు. తాగిన మైకంలో విజయకాంత్ తన అభ్యర్థిని ప్రచారసభలో కొట్టడం దారుణమన్నారు. జీ స్పెక్ట్రం కుంభకోణంలో రాజా ఒక్కరే నిందితుడు కాదని ఇందు లో దయాలు అమ్మాళ్, రాజాత్తి అమ్మాల్, కనిమొళి, చిదంబరం కూడా ఉన్నారని, చిదంబరం దేశంలోనే పెద్ద కోటీశ్వరుడు ... ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో రూ. 50 వేల కోట్లను దాచి ఉంచారని ఆరోపించారు. మాఫి యా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు పాల్వాకు లెసైన్స్ ఇవ్వకూడదని హోంమంత్రి చిదంబరం అప్పటి టెలి కాం శాఖ మంత్రి రాజాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఇక రోజు లు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని, సోనియాగాంధీ ఇక ఇటలీకి వెళ్లక తప్పని పరిస్థితి వస్తుం దని అన్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం తథ్యమన్నారు.

పూనం నగ్నప్రదర్సన ప్లేస్ మారింది

మొన్నా మధ్య భారత జట్టు ప్రపంచకప్‌ గెలుచుకుంటే... ఆ క్రీడామైదానంలోనే తాను నగ్నప్రదర్శన చేస్తానని సంచలన ప్రకటన చేసిన బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే .. మాచ్ విన్ అయ్యాక మనిషి కనిపించాడ మానేయతమే కాకుండా. మీడియాకి అందుబాటులో లేకుండా సెల్ స్విచా ఆఫ్ చేసి పడేసింది. నగ్నప్రదర్శన పూర్తిగా వ్యక్తిగతమైనది పెద్దలకు ఇదొక చికిత్సాధ్యయనం లాంటిది ఇది ఎంతమాత్రం నేరం కాదు అని గర్వంగా ప్రకటించు కొన్న ఈ భామా.. తన ప్రదర్సన ముంబై లో జరగకపోవటం విచారం వ్యక్తం చేస్తూ... ప్రేమనగరంగా ఖ్యాతిగడించిన పారిస్‌కు మర్చేసినట్లు సన్నిహితుల వద్ద ప్రకటించిందట. అభిమానుల నిరాసాని అర్ధం చేసుకొనే పూనమ్‌ పాండే గుర్తించారో నగ్నప్రదర్శన చేస్తానంటూ ప్రకటించింద ట. భారత్‌లో కాకుంటే మరే దేశంలోనైనా తన నగ్నప్రదర్శనకు అవకాశం కల్పించాలని కూడా అమ్మడు బికికిఐ కి చేసిన విజ్ఞప్తి పై ఇప్పటికే భోపాల్‌ కోర్టులో ఓ కేసు నమోదైంది. అంతేగాక ముంబై పోలీస్‌ కమిషనర్‌కు కూడా బిజెపి మహిళా నేత అరుప్‌ పట్నాయక్‌ ఫిర్యాదుచేశారు. ఈనేపధ్యంలో పూనమ్‌ తన పంతం ఎలా నేరవేర్చుకొంటుందోచూడాలి

మా ఆయన తగ్గితే.. పులివెందుల బరిలో నేనున్నా

దివంగత మహానేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్.విజయలక్ష్మిపై తన భర్త రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి పోటీకి వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నట్టు సతీమణి వైఎస్.సౌభాగ్యమ్మ తన కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగాది పర్వదినాన.. వివేకా కుటుంబ సభ్యులంతా ఇంట్లో సమావేశమై.. పులివెందుల ఎన్నికల గురించి మాట్లాడు కొన్నట్లు తెలుస్తోంది. పులివెందులలో పోటీ తప్పుకోవడం ద్వారా వైయస్ అంటే అధిష్టానానికి అభిమానం ఉందనే సానుభూతిని కడప పార్లమెంట్ స్తానంలో ఉపయోగించుకోవాలని తద్వారా పార్లమెంటు అభ్యర్థిగా వివేకాను పోటీకి నిలిపితే జగన్ మెజార్టీ భారీగా తగ్గిన్చవచ్చాన్న వాదనతో సౌభాగ్యమ్మ అంగీకరించలేదు సరికదా... తన భర్త వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పడంతో అడిసగా కాంగ్రెస్స్ పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆత్మగౌరవం కోసం రాజీనామాలివ్వల్సిందే

తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు పదవులను పట్టుకుని వేలాడుతూ రాజీనామాలు చేయకపోవడంతోనే కేంద్రం స్పందించడంలేదన్నారు.

ఇప్పటికైనా తెలంగాణలోని ఎంపీ,ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.