మొదటి సినిమా ‘నువ్వే కావాలి’తో మెగాహిట్ సాధించినా తొలి ప్రాధాన్యం మాత్రం బుల్లితెరకేనంటూ వర్ధమాన టీవీ, సినీ నటుడు సారుుకిరణ్ స్పష్టం చేశారు. ప్రముఖ సినీగాయకుడు రామకృష్ణ కుమారుడే సాయికిరణ్. నటుడిగానే కాకుండా గాయకుడుగా కూడా రాణిస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యంతో కూడిన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తుండి పోవాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. బుల్లితెరను తన మజిలీగా మలచుకున్న సాయికిరణ్ న్యూస్‌లైన్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సినీరంగంలోకి రాకముందు..
హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి చెన్నైలో ఉద్యోగంలో చేరా. పనిలో పనిగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. సినిమా రంగంలో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాను. నటుడిగా ప్రయాణం ప్రారంభించా.
మొదటి సినిమా గురించి..
నేను నటించిన మొదటి సినిమా ‘నువ్వే కావాలి’. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజులకే మంచి టాక్ వచ్చింది. ఆ చిత్రం సూపర్‌డూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ సినిమాలో నేను పాడిన ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట కూడా నాకు మంచి పేరు తె చ్చి పెట్టింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో పాడా. ‘ప్రేమించు’వంటి మరికొన్ని చిత్రాల్లో నటించా.
పాటలు పాడడం గురించి..
మా నాన్న వీ రామకృష్ణ ప్రముఖ సినీగాయకులుగా మీకందరికీ తెలిసిందే. ఆయన ప్రభావం నాపై ఉంది. పాటలు, పౌరాణిక పద్యాలంటే నాకు చాలా ఇష్టం. అయితే సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని నిర్మాత, దర్శకులను బలవంతం చేయను. వారు పాడమంటే అందుకు సిద్ధం.
ఏ తరహా పాత్రలు ఇష్టమంటే..
వైవిధ్యంతో కూడిన పాత్రలంటే నాకిష్టం. ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల అవి తప్పితే వేరేవి చేయలేరనే ముద్ర పడుతుంది. అందుకే వైవిధ్యంతో కూడిన పాత్రలను, నెగటివ్ షేడ్‌లు ఉండే పాత్రలైనా చేయడానికి సిద్ధం
బుల్లి తెర గురించి..
నేడు సినిమాలకంటే బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. టీవీ సీరియల్స్‌ద్వారా ప్రతి ఇంట్లో మన గురించి తెలుస్తుంది. ఎక్కువ ప్రచారం కూడా వస్తుంది. పైగా ఎక్కువ సీరియల్స్‌తోపాటు వైవిధ్యంతో కూడిన పాత్రలను చేసే వీలుంటుంది. బుల్లితెరకే నా మొదటి ప్రాధాన్యత.
ప్రస్తుతం నటిస్తున్న సీరియల్స్..
సుందరకాండ సీరియల్‌లో నటిస్తున్నా. మే నెలలో మహాభారతం సీరియల్ ప్రారంభమవుతుంది.
ఇక నా వ్యక్తిగతానికి వస్తే.. బాపు, రామానాయుడువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటా. వారితో కలిసి పనిచేయడం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెంపొందుతాయి. సినీరంగంలో నేను అమితంగా అభిమానించే నటుడు రజనీకాంత్. నేను ఆయన అభిమానిని. నటుడిగా గొప్ప అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటా. 55 సంవత్సరాలు దాటాక ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతా.
6, ఏప్రిల్ 2011, బుధవారం
5, ఏప్రిల్ 2011, మంగళవారం
లిమిటెడ్ కంపెనీగా టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎంపీ రమేశ్‌రాథోడ్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని .. . ఉద్యమాన్ని కొన్ని పార్టీల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని...టీఆర్‌ఎస్ పై విరుచుకు పడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని.. వీరిని తెలంగాణా ద్రోహులని ప్రకటించి హడావిడి చేసిన కే సి ఆర్ ఇప్పుడు మౌనంగా.. ఉండటం వెనుక ఒప్పందాలు జరిగి ఉంటాయని విమర్శించారు.
కేసీఆర్ కాళ్లు మొక్కి ఆ పని చేయిస్తా
కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామంటే, కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా ఆ పని చేయిస్తానని... తెల్లారేపాటికి తెలంగాణ ఇస్తారా అంటూ కాంగ్రెస్‌కు ప్రజా ఫ్రంట్ కన్వీనర్ గద్దర్ సవాల్ విసిరారు. కాంగ్రెసోళ్లు తెలంగాణను తేలేకపోయారు... ఐక్యంగా పోరాడి రాష్ట్రం సాధించుకుందాం రండని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణకమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయం హింసను ప్రేరేపించే విధంగా ఉన్నదని, రాజకీయ పార్టీలు డెడ్‌లైన్లు పెట్టడాన్ని ఆయన విమర్శిస్తూ, అన్నింటికి పరిష్కారం స్వపరిపాలనే అన్నారు.
సత్య సాయి ఆరోగ్య పరిస్థితిపై సిఎం సమీక్ష
సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వ హించారు. మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు అయ్యారు. కాగా ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుట్టపర్తి పర్యటన కు వెళ్ళాల్సి ఉండగా... అది ఇంకా ఖరారు కాలేదు.
బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగు
సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై ఆయన తాజా బులిటెన్ విడుదల చేశారు.
బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు... హార్ట్ బీట్, బీపీ నార్మల్ గానే ఉన్నట్లు వెల్లడించారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ..ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని ఆయన తెలిపారు.
4, ఏప్రిల్ 2011, సోమవారం
ఉప ఎన్నికల్లో గెలుపు మాదే : నన్నపనేని
కడప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించిన ఆమె అందుకు రుజు వులు చూపించగలరా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే దుస్థితికి దిగజారదని స్పష్టం చేశారు. కడప ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరు కదా అన్న ప్రశ్నకు మైసూరారెడ్డి ఉన్నారు కదా...ఎవరు అభ్యర్థులుగా ఉన్నా గెలవడమే తమ లక్ష్యమన్నారు.
"దమ్మరో దమ్" పై హైకోర్టుకెళ్లనున్న గోవా మంత్రి
రానా, అభిషేక్ బచ్చన్, బిపాసా బసు, దీపికా పదుకునె నటిస్తున్న "దమ్మరో దమ్" చిత్రంపై హైకోర్టుకెళ్లనున్నట్లు గోవా పర్యాటక మంత్రి నీలకంఠ హలార్కర్ తెలిపారు. చిత్ర దర్శకుడు రోహన్ సిప్పీ గోవా ప్రతిష్టను దిగజార్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు.
ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అసెంబ్లీలో సైతం లేవనెత్తారు గోవా మాజీమంత్రి మిక్కీ . ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించనీయకుండా అడ్డుకోవాలని ప్రజలకి సూచిన్చారాయన. భారతదేశంలోనే ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న గోవాను చిత్రంలో దారుణంగా చూపారనీ, ఈ చిత్రం వల్ల పర్యాటకం కేంద్రంగా భాసిల్లుతున్న గోవాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అసెంబ్లీలో సైతం లేవనెత్తారు గోవా మాజీమంత్రి మిక్కీ . ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించనీయకుండా అడ్డుకోవాలని ప్రజలకి సూచిన్చారాయన. భారతదేశంలోనే ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న గోవాను చిత్రంలో దారుణంగా చూపారనీ, ఈ చిత్రం వల్ల పర్యాటకం కేంద్రంగా భాసిల్లుతున్న గోవాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)