6, ఏప్రిల్ 2011, బుధవారం

పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే

హిందీ భాషా వ్యతిరేకినని చెప్పుకునే కరుణానిధి ఏ మొహం పెట్టుకుని ఉత్తరాదికి చెందిన ఖుష్బూను ఎన్నికల ప్రచారానికి పిలిచారని ప్రముఖ హాస్యనటుడు సెంథిల్‌ప్రశ్నించారు. కరుణానిధి కలర్ టీవీలను ఉచితంగా ఇచ్చి, కేబుల్ కనెక్షన్‌ల ద్వారా ఏడాదికి రూ. 500 కోట్లను తన ఇంటికి తరలిస్తున్నారని ఆరోపించారు. పెళ్లికి ముందు సెక్స్ ఆమోదయోగ్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖుష్బూను తూర్పారబట్టిన పీఎంకే, వీసీకే పార్టీ నేతలు ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తున్న పార్టీకి ఎలా మద్దతుగా నిలిచారని నిలదీశారు. పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే కపట రాజకీయాలు ఆడే పార్టీలన్నీ ఒకే గొడుగుకిందకి చేరాయని, వాటిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఓటర్లకు పిలుపునిచ్చారు.

చెన్నైలో ‘పీపుల్ ఫర్ జగన్’ కి శ్రీకారం

తమిళనాడులోని వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులను ఏకం చేసేందుకు జగన్ యూత్ ఫోర్స్ నేతృత్వంలో ‘పీపుల్ ఫర్ జగన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా యువత హాజరయ్యారు. తమిళనాడులో ఉన్న అపారమైన యువశక్తిని, తెలుగు వారిని ఒక గొడుగు కిందికి తీసుకురావచ్చ ని, జగన్ స్ఫూర్తితో నవ సమాజ నిర్మించాలని, ప్రజలను భాగస్వామ్యం చేసి సేవా కార్యక్రమాల్ని విస్తృత పరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి తెలిపారు. తన వంతుగా తమిళనాడులోని యువశక్తిని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

సాయి కిరణ్ ఇంటర్వ్యూ

మొదటి సినిమా ‘నువ్వే కావాలి’తో మెగాహిట్ సాధించినా తొలి ప్రాధాన్యం మాత్రం బుల్లితెరకేనంటూ వర్ధమాన టీవీ, సినీ నటుడు సారుుకిరణ్ స్పష్టం చేశారు. ప్రముఖ సినీగాయకుడు రామకృష్ణ కుమారుడే సాయికిరణ్. నటుడిగానే కాకుండా గాయకుడుగా కూడా రాణిస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యంతో కూడిన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తుండి పోవాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. బుల్లితెరను తన మజిలీగా మలచుకున్న సాయికిరణ్ న్యూస్‌లైన్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సినీరంగంలోకి రాకముందు..
హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి చెన్నైలో ఉద్యోగంలో చేరా. పనిలో పనిగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. సినిమా రంగంలో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాను. నటుడిగా ప్రయాణం ప్రారంభించా.
మొదటి సినిమా గురించి..
నేను నటించిన మొదటి సినిమా ‘నువ్వే కావాలి’. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజులకే మంచి టాక్ వచ్చింది. ఆ చిత్రం సూపర్‌డూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ సినిమాలో నేను పాడిన ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట కూడా నాకు మంచి పేరు తె చ్చి పెట్టింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో పాడా. ‘ప్రేమించు’వంటి మరికొన్ని చిత్రాల్లో నటించా.

పాటలు పాడడం గురించి..
మా నాన్న వీ రామకృష్ణ ప్రముఖ సినీగాయకులుగా మీకందరికీ తెలిసిందే. ఆయన ప్రభావం నాపై ఉంది. పాటలు, పౌరాణిక పద్యాలంటే నాకు చాలా ఇష్టం. అయితే సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని నిర్మాత, దర్శకులను బలవంతం చేయను. వారు పాడమంటే అందుకు సిద్ధం.
ఏ తరహా పాత్రలు ఇష్టమంటే..
వైవిధ్యంతో కూడిన పాత్రలంటే నాకిష్టం. ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల అవి తప్పితే వేరేవి చేయలేరనే ముద్ర పడుతుంది. అందుకే వైవిధ్యంతో కూడిన పాత్రలను, నెగటివ్ షేడ్‌లు ఉండే పాత్రలైనా చేయడానికి సిద్ధం

బుల్లి తెర గురించి..
నేడు సినిమాలకంటే బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. టీవీ సీరియల్స్‌ద్వారా ప్రతి ఇంట్లో మన గురించి తెలుస్తుంది. ఎక్కువ ప్రచారం కూడా వస్తుంది. పైగా ఎక్కువ సీరియల్స్‌తోపాటు వైవిధ్యంతో కూడిన పాత్రలను చేసే వీలుంటుంది. బుల్లితెరకే నా మొదటి ప్రాధాన్యత.

ప్రస్తుతం నటిస్తున్న సీరియల్స్..
సుందరకాండ సీరియల్‌లో నటిస్తున్నా. మే నెలలో మహాభారతం సీరియల్ ప్రారంభమవుతుంది.

ఇక నా వ్యక్తిగతానికి వస్తే.. బాపు, రామానాయుడువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటా. వారితో కలిసి పనిచేయడం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెంపొందుతాయి. సినీరంగంలో నేను అమితంగా అభిమానించే నటుడు రజనీకాంత్. నేను ఆయన అభిమానిని. నటుడిగా గొప్ప అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటా. 55 సంవత్సరాలు దాటాక ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతా.

5, ఏప్రిల్ 2011, మంగళవారం

లిమిటెడ్ కంపెనీగా టీఆర్‌ఎస్

టీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎంపీ రమేశ్‌రాథోడ్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని .. . ఉద్యమాన్ని కొన్ని పార్టీల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని...టీఆర్‌ఎస్ పై విరుచుకు పడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని.. వీరిని తెలంగాణా ద్రోహులని ప్రకటించి హడావిడి చేసిన కే సి ఆర్ ఇప్పుడు మౌనంగా.. ఉండటం వెనుక ఒప్పందాలు జరిగి ఉంటాయని విమర్శించారు.

కేసీఆర్ కాళ్లు మొక్కి ఆ పని చేయిస్తా

కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామంటే, కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా ఆ పని చేయిస్తానని... తెల్లారేపాటికి తెలంగాణ ఇస్తారా అంటూ కాంగ్రెస్‌కు ప్రజా ఫ్రంట్ కన్వీనర్ గద్దర్ సవాల్ విసిరారు. కాంగ్రెసోళ్లు తెలంగాణను తేలేకపోయారు... ఐక్యంగా పోరాడి రాష్ట్రం సాధించుకుందాం రండని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణకమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయం హింసను ప్రేరేపించే విధంగా ఉన్నదని, రాజకీయ పార్టీలు డెడ్‌లైన్లు పెట్టడాన్ని ఆయన విమర్శిస్తూ, అన్నింటికి పరిష్కారం స్వపరిపాలనే అన్నారు.



సత్య సాయి ఆరోగ్య పరిస్థితిపై సిఎం సమీక్ష

సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వ హించారు. మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు అయ్యారు. కాగా ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుట్టపర్తి పర్యటన కు వెళ్ళాల్సి ఉండగా... అది ఇంకా ఖరారు కాలేదు.

బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగు

సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై ఆయన తాజా బులిటెన్ విడుదల చేశారు.

బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు... హార్ట్ బీట్, బీపీ నార్మల్‌ గానే ఉన్నట్లు వెల్లడించారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ..ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని ఆయన తెలిపారు.