2, డిసెంబర్ 2010, గురువారం

రాజీనామా బాటలో మంత్రులు

మంత్రివర్గ విస్తరణలో కేటాయించిన శాఖలపై పలువురు మంత్రులు అసహనానికి గురై రాజీనామ బాటను ఎంచుకున్నట్టు తెలిసింది. తనకు కేటాయించిన శాఖపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వెల్లగక్కి రాజీనామా బాటలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వున్నట్టు సమాచారం.. తెలంగాణకు సంబంధంలేని శాఖను తనకు కేటాయించడం వల్ల కోమటిరెడ్డి నిరసనను తెలిపారు. వట్టి వసంతకుమార్ ఇంట్లో పలువురు మంత్రులు భేటి అయ్యారు.

వెనక్కి తగ్గేదిలేదన్న వట్టి

మంత్రివర్గ విస్తరణలో తనకు దక్కిన శాఖతో మనస్తాపం చెంది రాజీనామా చేసిన మంత్రి వట్టి వసంతకుమార్ బుజ్జగించే పనిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ వున్నారు. రాజీనామా చేసిన వట్టి వసంతకుమార్‌ను శాంతపరిచేందుకు మంత్రి ఆనం ఆనం రాయబారం విఫలమైంది. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదిలేదని వట్టి స్పష్టం చేశారు.

కిరణ్‌కు వట్టి షాక్

మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖలు కేటాయించిన కొద్ది గంటలకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. మంత్రివర్గ విస్తరణ జరిగిన కొద్ది సేపటికే తొలి వికెట్ రూపంలో వట్టి వసంత కుమార్‌ను సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి కోల్పోయారు. ఇలాంటి షాక్‌లు మరికొన్ని తగలవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కేటాయించిన పోర్ట్‌ఫోలియోలపై బహిరంగంగానే మంత్రులు అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది.

1, డిసెంబర్ 2010, బుధవారం

మంత్రులు - వారికి కేటాయించిన శాఖలు

1. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (ముఖ్యమంత్రి): సాధారణ పరిపాలన,విద్యుత్, వాణిజ్య పన్నులు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
2. ఆనం రామనారాయణరెడ్డి : ఆర్ధికశాఖ, లాటరీలు
3. పసుపులేటి బాలరాజు : గిరిజన, సంక్షేమం
4. బొత్స సత్యనారాయణ : రవాణా
5. దానం నాగేందర్ : కార్మికశాఖ
6. ధర్మాన ప్రసాదరావు : రోడ్లు, భవనాలు
7. డొక్కా మాణిక్య వరప్రసాద్‌రావు : గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామి
8. ఏరాసు ప్రతాప్‌రెడ్డి : న్యాయశాఖ
9. కుందూరు జానారెడ్డి : పంచాయితీ రాజ్, నీటిపారుదల
10. కాసు వెంకట కృష్ణారెడ్డి : సహకార శాఖ
11. మానుగుంట మహీధర్‌రెడ్డి : మున్సిపల్ వ్యవహారాలు
12. మోపిదేవి వెంకటరమణారావు : ఎక్సైజ్, మద్యపానం
13. పొన్నాల లక్ష్మయ్య : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
14. నీలకంఠాపురం రఘువీరారెడ్డి : రెవెన్యూ
15. పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి : హోం, జైళ్లు, ఫైర్ సర్వీసులు
16. శత్రుచర్ల విజయరామరాజు : అడవులు, పర్యావనం, సాంకేతిక శాస్త్ర
17. పెంట శంకరరావు : చేనేత, చిన్నపరిశ్రమలు
18. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు : పౌర సరఫరాలు
19. పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి : భారీ, మధ్య తరహా నీటిపారుదల
20. వట్టి వసంతకుమార్ : పర్యాటకశాఖ, క్రీడలు, యువజన సంక్షేమం
21. యెడుగూరి సందింటి వివేకానందరెడ్డి : వ్యవసాయం
22. ధర్మవరపు కొట్టం అరుణ : సమచారం. పౌరసంబంధాలు
23. రాంరెడ్డి వెంకటరెడ్డి : ఉద్యానవనం
24. బసవరాజు సారయ్య : బీసీ సంక్షేమం
25. పినిపె విశ్వరూప్ : పశు సంవర్థక శాఖ
26. సాకె శైలజానాథ్ : ప్రాథమిక విద్య
27. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి : మహిళ, శిశు సంక్షేమం, ఇందిరా క్రాంతి యోజన పథకం, ఫించన్లు
28. సయ్యద్ మహ్మద్ అహ్మదుల్లా : మైనార్టీ సంక్షేమం, వక్ఫ్
29. తుంబలం గుత్తి వెంకటేశ్ : చిన్న తరహా నీటిపారుదల
30. తోట నరసింహం : స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
31. గల్లా అరుణకుమారి : భూగర్భ, గనుల శాఖ
32. దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి రవీంద్రారెడ్డి : వైద్య, విద్య, ఆరోగ్యం, ఆరోగ్యశ్రీ, కుటుంబ సంక్షేమం
33. సిలారపు దామోదర రాజనర్సింహ : ఉన్నత, సాంకేతిక విద్య
34. డాక్టర్ జెట్టి గీతారెడ్డి : భారీ పరిశ్రమలు, చక్కెర
35. జూపల్లి కృష్ణారావు : దేవాదాయం
36. కన్నా లక్ష్మినారాయణ : గృహ నిర్మాణం
37. మూల ముఖేష్‌గౌడ్ : మార్కెటింగ్
38. కొలుసు పార్థసారథి : మాథ్యమిక విద్య
39. పితాని సత్యనారాయణ : సాంఘీక సంక్షేమం
40. కోమటిరెడ్డి వెంకటరెడ్డి : పెట్టుబడులు, మౌళిక సదుపాయాలు

26, నవంబర్ 2010, శుక్రవారం

2011లో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సెలవులివే..

2011 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అధికారికంగా వర్తించే సెలవుల వివరాలను తాజాగా ప్రకటించారు.
అవి..
మకర సంక్రాంతి-జనవరి 14 (శుక్రవారం),
రిపబ్లిక్ డే-జనవరి 26 (బుధవారం),
మిలాద్-ఉన్-నబి-ఫిబ్రవరి 16 (బుధవారం),
ఉగాది-ఏప్రిల్ 04 (సోమవారం),
మహావీర్ జయంతి-ఏప్రిల్ 16 (శనివారం),
గుడ్‌ఫ్రైడే-ఏప్రిల్ 22 (శుక్రవారం),
బుద్దపూర్ణిమ-మే 17 (మంగళవారం),
స్వాతంత్ర దినోత్సవం-ఆగస్టు 15 (సోమవారం),
ఈద్ ఉల్ ఫితర్-ఆగస్టు 31(బుధవారం),
వినాయక చవితి-సెప్టెంబర్ 01(గురువారం),
గాంధీ జయంతి-అక్టోబర్ 02(ఆదివారం),
దసరా-అక్టోబర్ 06 (గురువారం),
దీపావళి-అక్టోబర్ 26 (బుధవారం),
బక్రీద్-నవంబర్ 07 (సోమవారం),
గురునానక్ జయంతి- నవంబర్ 10 (గురువారం),
మొహర్రం-డిసెంబర్ 06 (మంగళవారం),
క్రిస్మస్- డిసెంబర్ 25(ఆదివారం).

23, నవంబర్ 2010, మంగళవారం

7న ఒంగోలులో సమైక్యాంధ్ర గర్జన

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించేందుకు గడువు దగ్గరపడుతుండటంతో సమై క్యవాదులు కూడా ఆందోళనలకు స మాయత్తమవుతు.. ఈనెల 7న ఒంగోలులో సమైక్యాంధ్ర గర్జన నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు వివరించి వారి లో కూడా పోరాట స్ఫూర్తిని నింపనున్నారు

తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు సమయం ఆసన్నమైందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలన్నారు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ శ్యా మ్యూల్ ..

కొంత మంది వేర్పాటువాదులు ఉస్మాని యా యూనివర్సిటీని అడ్డంపెటు ్టకొని కొంత మంది ని వాడు కుంటున్నారని, వారికి నెలవారీ జీతాలు కూడా చెల్లిస్తున్నారని,,ప్రజలను భయభ్రాంతులకు గురిచ్చెస్తున్నారని ఆరో పించారు.

బాలల వారోత్సవాల పేరిట కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం

రం రోజుల పాటు నిర్వహించిన బాలల వారోత్సవాల సందర్భంగా కార్మికులుగా పని చేస్తున్న బాల బాలికలను గుర్తించి వారిని బడిలో చేర్పించాల్సి వుంది.. అధికారుల అలసత్వం... ఎవరేం చెలేరన్న మొండి ధైర్యానికి నిలువెత్తు నిదర్సనంగా నేటికీ . అనేక మంది బాల బాలికలు కార్మికులుగా పని చేస్తూ దర్శనమి స్తున్డటం తో వారం రోజుల పాటు నిర్వహించిన బాలల వారోత్సవాలు నిరుపయోగంగా మారాయని చెప్పవచ్చు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతు.... ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరక పోగా కార్ఖాణాలలో బాలలు మగ్గిపోతూనే వున్నారు.

అనేక మంది బాల కార్మికులను గుర్తించి స్కూల్స్‌లో చేర్పించామని సంబంధితులు లెక్కలు చెపుతున్నా.. ఇవన్నీ కాకి లెక్కలు అన్నది ప్రభుత్వానికీ తెలిసిన నిజం అనడంలో స౦దేహం లేదేవ్వరికీ,,