2, ఫిబ్రవరి 2011, బుధవారం
శంకర్ త్రీ ఇడియట్స్ షూటింగ్‌కు విద్యార్థుల రౌండప్
హిందీ చిత్రం త్రీ ఇడియట్స్‌కు రీమేక్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కోయంబత్తూర్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ అవినాసి రోడ్డులోని జెన్ని క్లబ్ ఎదురుగా ఊరేగింపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. మార్వాడిల పెళ్లి ఊరేగింపు తరహాలో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సమీపంలోని కళాశాల విద్యార్థులకు ఈ విషయం తెలిసి... గుంపులు గుంపులుగా వచ్చి షూటింగ్ ప్రాంతాన్ని రౌండప్ చేశారు. వాళ్లను అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో విజ య్, ఇలియానాలకు సంబంధించిన పాట షూటింగ్‌ను క్లబ్ లోపలికి మార్చారు శంకర్.
టెలికాం మాజీ మంత్రి రాజా అరెస్టు
కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ. రాజాను సీబీఐ బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేసింది. లక్షా 76వేల కోట్ల కుంభకోణంలో రాజాకు ప్రధాన పాత్ర ఉన్నట్లు పాటిల్ కమిషన్ నిర్ధారించింది. ఈ కేసులో రాజా అవినీతికి పాల్పడ్డారన్న ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది.
ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలకోసం టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరాను, అప్పటి రాజా వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. చందోలియాను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలకోసం టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరాను, అప్పటి రాజా వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. చందోలియాను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
మందు ప్రియుల వీక్ పాయింట్‌ను సొమ్ము చేసు కొంటున్న ప్రభుత్వం
రాష్ట్ర ఖజానా నింపడమే లక్ష్యంగా మందు ప్రియుల వీక్ పాయింట్‌ను సొమ్ము చేసుకునేందుకు రంగంసిద్ధం చేసింది. చల్లటి బీరు ముట్టుకోవాలంటే ఇప్పుడు జేబులు తడుముకునే పరిస్థితులు కల్పించింది. ఊహించని రీతిలో బీరు ధరలను పెంచేసింది. ఈ తంతు ఒక్క బీరుతోనే ఆగిపోయిందంటే అదీ లేదు. చీప్ లిక్కర్ నుంచి కాస్ట్లీ వైన్ వరకూ దేనినీ వదల్లేదు. అన్నిరకాల మద్యం ధరలను పెంచేసింది.
మందుబాబులుఎన్ని మార్లు ధరలు పెంచినా ఏమీ అనరని కాబోలు ఈ సారి కూడా మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సంకల్పించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ధరలను పెంచుతూ అమలులో పెట్టింది. వేసవిలో బీరు విక్రయాలు జోరుగాసాగుతాయి. ఇదే వీక్ పాయింట్ ఆబ్కారీ శాఖకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికే రూ. 80 వరకు విక్రయిస్తున్న బీరు ధరలను రూ. 85 నుంచి 90 వరకు పెంచాలని నిర్ణయించింది.
బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, వైన్‌లాంటి మద్యంపైనా కరుణచూపలేదు. వెరైటీని బట్టి రేట్లు ఖరారు చేసింది. ప్రభుత్వం రూ. 4 నుండి 7 వరకు పెంచితే స్థానిక వ్యాపారులు మాత్రం రూ. 7 నుండి 9 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు

కేసీఆర్‌కు సమైక్యాంధ్ర దమ్ బిర్యాని పార్శిల్
సీమాంధ్ర బిర్యానీపై కేసిీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రుచికరమైన మటన్ దమ్ బిర్యాని తయారు చేసి కేసీఆర్‌కు పార్శిల్ పంపారు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు. కేసఈఆర్ వాడుతున్న పదజాలం సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తోందని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న కేసిీఆర్‌కు అది ముదిరి బట్టలు లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి రాకుండా తక్షణం యర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు.
జగన్‌కు మద్దతు పలికిన వారి పునరాలోచన
కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నదని తెలియడంతో ఎవరిపై వేటు పడుతుందోనని జగన్ వర్గంలో గుబులు మొదలైంది. తొలి విడతగా కనీసం నలుగురైదుగురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని భావిస్తుండడంతో వారు ఎవరు కావచ్చుననే ఆరా మొదలైంది. జగన్‌తో పాటు ఓదార్పు యాత్రలో, విజయవాడ లక్ష్య దీక్ష, ఢిల్లీలో జల దీక్ష, విశాఖలో జన దీక్ష వేదికల్లో పార్టీకి, అధినేత్రికి వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడారన్న పూర్తి సమాచారం ఢిల్లీకి చేరినట్టు సమాచారం.
అనకాపల్లి ఎంపి హరి రెండు నాల్కల ధోరణిని కూడా అధిష్ఠానం గుర్తించిందని.. . గతంలో ఒకసారి పార్టీ నుంచి బహిష్కారానికి గురయ్యారని, అదృష్టం బాగుండి కేవీపీ ఆశీస్సులతో టిక్కెట్ సంపాదించి ఎంపీగా ఎన్నికై దాన్ని కూడా నిలుపుకోలేకపోతున్నారని...ఇప్పుడు జగన్ వర్గంలో చేరి అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఆ పార్టీ వారంతా తప్పుపడుతున్నారు. తొలుత ఆవేశంగా జగన్‌కు మద్దతు పలికిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడడం మరో విశేషం. అసలు సమయం వచ్చేసరికి ఎంత మంది అటువైపు ఉంటారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి జగన్ వర్గంలో గుబులు మొదలైంది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)