3, ఏప్రిల్ 2011, ఆదివారం

భారత జట్టుపై జరిమానా

వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంకంటే ఎక్కువ సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకపోవడంతో ప్రపంచకప్ విజేత భారత జట్టుపై ఐసీసీ మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో జరిమానావిధించాడు. భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ నిబంధన 2.5.1 ను అతిక్రమించడంతో ఐసీసీ విధించిన ఈ జరిమానాను భారత జట్టు అంగీకరించింది

కడపలో ఉప ఎన్నికల యుద్ధం

కడపలో ఉప ఎన్నికల యుద్ధం జరగబోతోందని అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పులివెందులలో బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ప్రయత్నిస్తోందన్నారు. అలాగే కడపలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి టీడీపీకి సహకరించేలా రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు సోనియాగాంధీ, వైఎస్ఆర్‌ల మధ్య జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు.

15న జగన్ నామినేషన్

కడప పార్లమెంట్ స్థానానికి ఈనెల 15వ తేదీ వైఎస్ఆర్ పార్టీ తరపున మాజీ ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 16న పులివెందుల అసెంబ్లీకి విజయమ్మ నామినేషన్ వేయనుండగా అదేరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నామినేషన్ వేయనున్నారు.

2, ఏప్రిల్ 2011, శనివారం

మనమే విజేతలం.. మీరు నమ్మండి,, నమ్మకపోండి ...

శ్రీలంక బౌలర్ కులశేఖర వేసిన వేసిన బంతిని సిక్స్‌గా మలిచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా పది బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. శ్రీలంకపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించింది. ప్రపంచ కప్ టైటిల్ భారత్ దక్కించుకోవడం ద్వారా సచిన్ టెండూల్కర్ కలను నెరవేర్చింది. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్ సాధించింది. భారత ఆటగాళ్లు మైదానంలోకి చేరుకుని ఆనంద భాష్పాలతో విజయాన్ని ఆనందించారు. హర్భజన్ సింగ్ సంతోషంతో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు అది గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ప్రపంచ కప్ పూర్తి కావడంతో ఆయన భారత కోచ్‌ పదవి నుంచి తప్పుకోబోతున్నాడు. భారతదేశమంతటా దీపావళి పర్వదినమే కనిపించింది. పెద్ద యెత్తున టపాసులు పేలుస్తూ విజయాన్ని తనివి తీరా ఆస్వాదించారు.

31, మార్చి 2011, గురువారం

భోపాల్‌ ఇకపై భోజ్‌పాల్‌

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌ను ఇకపై భోజ్‌పాల్‌ పేరుగా వ్యవహరిస్తారు. రాజా భోజ్‌ 11వ శతాబ్దంలో మాల్పా ప్రాంతాన్ని పాలించాడు. మహ్మద్‌ గజనీపై 1024లో రాజాభోజ్‌ విజయం సాధించాడు. భోపాల్‌లో రాజాభోజ్‌ పట్టాభిషేకం మిల్లేనియం లేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ రాజ్‌సింగ్‌ చౌహాన్‌ భోపాల్‌కు భోజ్‌ పాల్‌ పేరును ప్రతిపాదించారు. భోపాల్‌లోని బడా తలావో సరస్సును ఇకపై 'భోజ్‌ తాల్‌' గా వ్యవహరిస్తారు. అలాగే విఐపిరోడ్‌ను 'రాజాభోజ్‌' మార్గ్‌గా పిలుస్తారు. బొంబాయి ని ముంబైగా, మద్రాసును చెన్నైగా, కలకత్తాను కోల్‌కత్తా, బేంగళూర్‌ను బెంగుళూరుగా వ్యవహరిస్తున్నందున భోపాల్‌ను భోజ్‌పాల్‌గా ఎందుకు పరిగణించకూడదంటారు.

నేతల ఆస్తులపై ఇడి ఆరా?

నల్ల ధనం రారాజు హసన్‌ అలి అరెస్టు తదనంతర పరిణామా లు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిశోధనలో రాష్ట్రానికి చెందిన పలువురు బడా రాజకీయ నేత లు, పేరుమోసిన వ్యాపారులతోనూ ఈ గుర్రాల నవాబుకు లావాదేవీలున్నాయని రూఢీ అవడంతో దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) లోతుగా ఆరా తీయ సాగింది. రాష్ట్ర o నుంచి పది వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని విదేశాలకు తరలించినట్లు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు రంగం లో దిగిన ఇడి హవాలా రాయుళ్ల కదలికలపై నిఘా వేసింది. ఎక్కువ భాగం రాజకీయ నేతలకు సంబంధించినవేనని ఆరోపణ లు వస్తుండడంతో నేతల ఆస్తులపై ఇడి ఆరా తీయసాగింది. పదేళ్ల కాలంలో అతి సంపన్నలైన నేతల వివరాలను సేకరించడంపై ఇడి దృష్టి సారించింది.

ఎవరెన్ని అవరోధాలు కల్పించినామనదే అధికారం : జగన్

వైఎస్ ఖ్యాతిని చరిత్రపుటల్లోంచి చెరిపేసేందుకు పాలక, విపక్షాలు ఏకమై కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎం.పి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని... రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని పార్టీ వర్గాలకు భరోసానిచ్చారు.