30, నవంబర్ 2011, బుధవారం

జనపదంలో సందేశం బుర్ర కథ

ఓ సమాజపు విశిష్టతని, సంస్క ృతిని భావితరాలకు అందించగలిగేవి కళలే...
తెలుగుదనం మిళితం చేసుకుని తెలుగు భాషని, పాటని, మాటని, తనలో నింపుకుని
తెలుగు జానపద కళారూపాలలో విశిష్టత దక్కించుకున్న బుర్రకధలు...
నిన్నటి సమాజంలో చైతన్య స్పూర్తిని రగిలిస్తూ... సాగిన ఎన్నో జనపదాలను...
జానపదకళల్ని మనకున్న నిర్లక్ష్యం మూలంగా అంతరించిపోయాయి.
ఈ పరిణామంలోనే బుర్రకథలు కూడా చేరుతుండటం ఆందోళన కలిగించే విషయం...
నిన్నటి వరకు సమాజంలో... జరుగుతున్న పరిణామాలను సామాన్య జనం గుండె తలుపు తట్టి మరీ వివరించే ఈ బుర్రకధల కేవలం ప్రభు త్వ ప్రచార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై పోతూ తమ ఉనికిని నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఈ కళకు సంబం ధించిన కళాకారులు కూడా భుక్తి కోసం వేరే వృత్తులవైపు పయనించా ల్సిన దుస్ధితి నెలకొంది. జానపదాలు పేరు చెపితేనే ముందుగా భళరా.. భళి..లాంటి ఎన్నో ఊత పదాలని పరిచయం చేయటమే కాకుండా సంద ర్భోచితంగా హాస్యాన్ని కరుణ రసాన్ని, భీభత్స రసాన్ని ఇలా నవరసాలను మేళవించి సాగే బుర్రకధలే గుర్తుకు వస్తాయి.
నాటి తరంలో పండగొచ్చినా... పబ్బమొచ్చినా... జాతర జరిగినా... తీర్ధా లు చేసినా... భక్తి పారవశ్యంలో మునిగి తేలే జనాలు సినిమాల కన్నా జాన పదకళలలోని మాధూర్యాన్ని ఆస్వాదించేందుకే మొగ్గు చూపే వారు. అందునా అన్నీ కలగలిసిన బుర్రకధలైతే మరీనూ...అసలు ఈ బుర్ర కధలు జనం నడుమనే పుట్టి పెరిగాయని, వస్త్రధారణలోనూ భిన్నంగా ఉంటూనే సంస్క ృతి సాంప్రదాయాలకు అతి పెద్ద పీట వేస్తూఉన్న క్రమం లో అనేక రకాల వాయిద్యాలు పుట్టు కొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయా వాయిదాలు పేర్లకు తగ్గట్టు ఒగ్గు, కొమ్ముల, శారద కొండ్రు, పంబల ఇలా అనేక కులాలు ఏర్పడి జానపదాల కోసం ప్రత్యే కించింది నాటి సమాజమని.. జనపదాలతో జనుల ను విజ్ఞాన వంతులు చేసేందుకు అనేక మంది చేస ిన కృషి ఫలితంగా జముకు, ఒగ్గుపాటలు నుండి బుర్ర కధలు ఉద్భవించినట్లు కళాకారులు చెప్తారు. ఆపై యక్షగాన ప్రభావంతో వినోదం కలగ లిసి దేశీయ కళగా రూపాంతం చెందిన బుర్రకధలు ఈ నాటివి కావని, అనేక కాలలలో జరిగిన రచనల్లో బుర్రకధలపై ప్రస్తావన ఉన్నట్లు చరిత్ర చెప్తోంది. 13 వ శతాబ్ధానికి చెందిన పాల్కురికి సోమన్న శక్తి కధ లు, 14వ శతాబ్ధంలో కాటమ రాజు, కుమార రాముని, గాంధారీ కధలు, 15వ శతాబ్ధంలో శ్రీనాధుడు సైతం జనం కోసం వీరగాధలను సామాన్య జనం భాషలో రచించి కళాకారులకు అందించాడని, ఇలా అంచెలంచెలు గా కొత్త పరిణా మాలను సంతరించుకుని రూపొందిన ఈ కళ తొలి నాళ ్లలో తంబుర కధగా ఆపై తంబురకు బుర్ర ఆకారం ఉండటం వల్ల బుర్ర కధగా రూపాంతం చెందింది. అయితే మిగిలిన జాన పదాలకు భిన్నంగా ఈ కళలో వస్త్రధారణ ఎంత ముఖ్యవెూ, ఛందస్సు, అలంకారాలు, నవరసాలు, నృత్యం, శృతి కలిగిన గానం కలగలిపి కధకుడు కధను రసరమ్యంగా చెపుతుంటే... వంత చెప్పే వారు హాస్యన్ని పండించే వారు చెరోవైపున జనానికి చెపుతున్న కధపై ఏమాత్రం విరక్తి కలగకుండా... సామాజిక అంశాలను కూడా మేళవించి.. సందర్భోచిత హాస్యంలో ముంచెత్తడం కూడా అంతే ముఖ్యం.
అనేక రూపాలు
ఈ బుర్ర కధల్లోనూ ప్రభోదాత్మకాలు, చారిత్రకాలు, మతకధలు, పౌరా ణికాలు, పతివ్రతుల కధలు ఇలా అనేక రూపాలున్నాయి. ప్రభోత్మకా లలోనూ రాజకీయాలు, సాంఘికాలు, ప్రచారకాలుగా విడదీసి చూస్తే. పలువురి రాజకీయనేతలకు చెందిన జీవితాలపై కొందరు బుర్ర కధల ను రాయగా సమాజంలోని రాజకీయ పరిస్ధితిని ఎప్పటికపðడు జనాలకు అర్ధమయ్యేలా చిన్న చిన్నకధల రూపంలో చెప్పే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలే అవలంబించి తన సిద్దాంతాలను జనం మధ్యకు తీసుకువెళ్లేందుకు ఉపయోగించు కున్నాయి. లంచగొండితనం, వరకట్నం, వివక్ష, ఇలా అనేక సామాజిక అంశాల నుకధలుగారూపొందించారు. సమాజం లో జరుగుతున్న స్ధితిగతులపై జనాల్ని చైతన్యవంతం చేసే బాధ్యతల్ని బుర్రకధలు వహించాయి. అలాగే ప్రభుత్వం కూడా తాను ప్రవేశ పెడుతున్న పధకాలను, ప్రగతిని, పేదలకు చేరువ చేసేందుకు తన ప్రచారాన్ని బుర్రకధలసాయంతో ముందుకు తీసుకుపోయింది. చారిత్రికా ల విషయానికి వస్తే... అల్లూరి సీతా రామ రాజు, భగత్‌ సింగ్‌, ఝాన్సీ లకి్ఝ భారు, ఇలా అనేక మంది వీరయో ధుల చరిత్రల్ని సామాన్యుడికి అర్ధమ య్యేలా వివరిస్తూ... నాడు జరిగిన స్వాతంత్ర పోరాటానికి సామాన్య జనాలను కూడా సమాయుత్తం చేసిన కళల్లో బుర్రకధలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి. అలాగే బొబ్బిలి యుద్దం, పల్నాటి యుద్దం, బాల చంద్రుడు ఇలా అనేక చరిత్ర కధలు కడా బుర్ర కధల రూపంలో జనాలకి చేరువయ్యాయి.
ఇక పౌరాణికాలలో కురుక్షేత్రం, వీరాభిమన్యు, ఉత్తర గోగ్రహణం, భక్త ప్రహ్లాద, భగవద్గీత, శ్రీకృష్ణ విజయం ఇలా పౌరాణిక నాటక రూపాలకు హాస్యాన్ని రంగరించి సామాన్య జనం భాషలోనే మరిం త దగ్గర చేసేందుకు ఉపయోగ పడ్డాయి బుర్రకధలు.
పతివ్రతల కధల్లో, బాలనాగమ్మ, మల్ల మ్మ, సతీ అనసూయ ఇలాంటి వారి కధలు స్త్రీలలో పాతివ్రత్య మహత్యం తెలియ చేస్తునే వారిలో ఎనలేని విశ్వాసం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఓ విధంగా ఆత్మ స్ధైర్యాన్ని పెంపొందించాయి.
మత కధలలో... శివ మహత్యం, విష్ణులీలలు, శ్రీనివాస కళ్యాణం ఇలా అనేక దేవుళ్ల కధలని జనంలో భక్తి భావన పెంపొందించేందుకు ఉపయోగ పడ్డాయి.
జగద్విత బుర్ర కధల బృందాలు
బుర్ర కధల చెప్పేందుకు మన రాష్ట్రంలో అనేక బృందాలు జగద్విదితమ య్యాయి, కాకుమాను, నాజర్‌, లకి్ఝ కాంత వెూహన్‌, విఠల్‌ బ్రదర్స్‌, జూనియర్‌ నాజర్‌, బెనర్జీ, కుమ్మరి మాస్టారు, నిదవోలు, అచ్చుతరామ య్య, పడవల శ్రీకృష్ణలే కాకుండా నిత్యం జానపదాలపైనే తమ గమనా న్ని సాగించే ప్రజా నాట్య మండలిలో ప్రత్యేక శిక్షణ తీసుకుని ఎన్నో జన చైతన్య కధలను బుర్రకధల రూపంలో అందించిన వీరమానేని సరోజ, వెూటూరి ఉదయం, తాపీ రాజమ్మ, కొండేపూడి రాధ ఇలా అనేక మంది మహిళా కళాకారులు తమ కళా ప్రదర్శలతో ప్రజలను రంజింప చేసా రు.
వీరిలో కొందరు స్వర్గస్తులు కాగా... మరి కొందరు తమ తరు వాతి తరానికి ఈ కళని అందించలేక పోతున్నామని వ్యధ చెందుతున్నారు.
ఇక బుర్ర కధలకు ఆద్యుడిగా పిలవ బడే నగ్నముని అనేక కధలను బుర్ర కధల కళాకారులు జనాలకి విని పించగా. నిన్నటితరంలో... దండు మూర్తి శ్రీ, నదీరా, సుంకర, నాజర్‌, కామాను, వారణాసి, బద్దిరెడ్డి, ద్వారహిత, సత్యనారాయణ, ఓలే టి ఇలా పలువురు కళాకారులు అనేక కధలను జనపదం లోకి మార్చి... వాటికి హస్యోక్తుల్ని ... సమాజ పరిస్ధితులన్ని అద్ది ... ఈ బుర్రకధలకు ఉన్నత స్ధానం కలిపించడంలో తమ జీవితా లనే అంకితం చేసిన వారు లేకపోలేదు.
రికార్డింగ్‌ డాన్సులుగా మారిపోతున్న బుర్రకధలు
గతంలో విజయనగరం జిల్లాకు చెందిన కుమ్మరి మాష్టారు బుర్ర కధ అంటే జనం పడి చచ్చెవారంటే అతిశయోక్తి కాదు. ఇందు కు కారణం మధ్య మధ్యలో ఆయన చిన్నారులతో భరతనాట్యం, కూచిపూడిలాంటి ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయటం కారణం కావచ్చు .
కానీ నేడు అడపా దడపా చాలా గ్రామాలలో బుర్ర కధలు జరుగుతున్నా.. వాస్తవానికి అక్కడ కధల కన్నా... రికార్డింగ్‌ డాన్సులుగానే కనిప ిస్తున్నా యి. ముందు ముగ్గురుతో ప్రారంభమయ్యే బుర్రకధ వ్యంగ్యోక్తులతో ఆరంభించి ద్వందార్ధాల సంభాషణ లతో పల్లవించి...చివరికి రికార్డింగ్‌ డాన్సు

లుగా మార్చేస్తారు. ఉత్తరాంధ్రా జిల్లాలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ... యువతపై వల వేస్తూ... కొందరు సొమ్ము చేసు కుంటున్నారన్న ఆరోపణలూ బొలెడు న్నాయి.
సినిమాలలోనూ బుర్రకధలది ప్రత్యేక స్ధానం..
మన పాత చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే... అనేక సందర్భాలలో బుర్ర కధలని వినియోగించుకుని కధలను ముందుకు సాగించేవారు. నాలుగు దశాబ్ధాల పాటు బుర్రకధలకే తన జీవితాన్ని ధారబోసిన నాజర్‌ మాష్టారు తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే.
ఊత పదాలూ.. వంతలూ.. బోలెడు...
బుర్రకధ కళాకారులు సందర్భాను సారంగా అనేక ఊత పదాలను, వంతలని శ్రావ్యంగా వినిపిస్తూ... ప్రజలని ఆయా సన్నివేశాలలోకి తీసు కుని వెళ్లిపోతుంటారు. విషాధఘట్టాలు వచ్చేపðడు ఆయ్యో... అంటూ అని విలపిస్తునే... హరి.. హరీ, రామా.. అంటూ వంత పాడతారు. అలాగే సంతోషకర ఘట్టాలలో భళా భళి, భేష్‌, తుమ్మెదా... తందానా... తానెతందనానా.., శహభాష్‌ అంటూ పాడతారు. ఒక కధకుడు వినార భార త వీర కుమరా విషయము చెపుతానూ... అంటూ ప్రారంభించి వినరా ధీరా విజయం మనదేరా.. అంటూ యుద్ద సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు వీర రసాన్ని ఉద్రిక్త స్ధితికి తీసుకెళ్లి పదునైన భావంతో జనం గుండెల్ని హత్తుకు పోయేలా జనరంజకంగా కధల్ని చెప్తారు.
సాంకేతిక విప్లవం వూపందుకున్నాక సినిమాలు చాలా జనపద కళల్ని నాశనం చేసాయి. టివిలు వచ్చాక పూర్తిగా వాటి ప్రభావం పడి జాన పదాల వైపు కన్నెత్తి కూడా జనం చూడటం మానేసారు. ఒకపðడు బుర్రకధనే నమ్ముకుని ఎన్నో కుటుం బాలు తమ జీవనాన్ని కొనసాగించేవి. దీన్ని వంశ పారంపర్యం వృత్తిగా చేపట్టిన కుటుంబాలు కూడా అనేకం.
ఒక కధని ఏడేసి రోజులు చెప్పినా జనం విని ఆదరించే స్ధాయి నుండి గంట కూడా బుర్రకధని వినే ఓపిక లేని స్ధితికి మనం చేరుకున్నాం ఇపðడు. మన ప్రాచీన కళల మీద మనం చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా అవి తెరమరుగు అవుతున్నాయన్నది వాస్త వం. ఈక్రమంలో తమ తంబరల లో విషాదాన్ని నింపుకుని ఆదు కునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది బుర్రకధ కళాకారుల కుటుంబాలు.
వీటిని కేవలం ప్రచారాలకే పరిమితం చేస్తున్న ప్రభుత్వాలే కాదు... జనం కూడా ఈ జానపదకళ ఆదరిస్తే కానీ భవిష్యతరానికి ఈ వారసత్వ సంపదని అందీయలేని పరిస్ధితి నేడు నెలకొందనటంలో సందేహంలేదు.

మహిళలదీ అగ్రస్ధానమే...
బుర్రకధల దళాలలలో మహిళలకూ పెద్ద పీట దక్కిందని చెప్పాలి. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన లక్షి, దంపుడు లక్ష్మి, శ్రీదేవి సిస్టర్స్‌ ఇలా అనేక మంది మహిళలు బుర్రకధలలో తమ సత్తా చూపిం చారంటే సందేహం లేదు. అనేక కధారూపాలతో పాటు మగవారికి ధీటుగా హాస్యోక్తులు ఒలికించడంలో వీరు తమ ప్రతిభాపాటవాలు చూపించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలలో వారి పేర్లతోనే అనేక బుర్రకధ దళా లు ప్రారంభమయ్యాయి.
కానీ నేడు తగిన ఆదరణ లేక పోవటంతో దాదాపు అన్ని దళాలు కేవలం ప్రభుత్వ ప్రచారానికే పరిమితమై పోతున్నాయన్న ఆందోళనతో పాటు అనేక మంది బుర్ర కధ కళాకారులు పస్తులుండాల్సిన పరిస్ధితి నెల కొందని ఆవేదన సర్వ్‌త్రా వ్యక్తమవుతోంది.


నాజర్‌ గానానికి ముగ్ధుడైన సాలూరి
సినీ పరిశ్రమలో బుర్రకధలు చెప్పడంలోనూ... చెప్పించడంలో బుర్రకధలకు ఆద్యుడిగా చెపðకునే నాజర్‌ మాష్టారు పూలరంగడు చిత్రం కోసం అక్కినేని నాగేశ్వరరావుకి బుర్రకధ నేర్పించారు. అగ్గి రాము డు, భలే బావ, నిలువు దోపిడీ, పెత్తందారులు, మనుష్యులంతా ఒక్కటే తదితర చిత్రాల్లో బుర్ర కధ కళాకారుడిగా కనిపించి మెప్పించడమే కాకుండా బుర్రకధ సన్నివేశాలలో ఘంటశాలతో పాట ని, ఎన్టీఆర్‌, రాజబాబు లాంటిి అగ్రనటులతో డైలాగులు చెప్పించి రస రమ్యత చేకూర్చే వారు. ప్రము ఖ సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు ఆతని గళమాధుర్యానికి ముగ్ధుడై సినీ పాటల అవకాశాన్ని ఇస్తానని చెప్పినా.. వినకుండా తానీ సినీ ప్రపంచంలో నిలువలేనని వచ్చేసి... జీవిత చరమాంతకం వరకు బుర్రకధలకే అంకితం చేసారు. నాజర్‌ మాస్టారు చేసిన సేవలకు పద్మశ్రీనిచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది.


ఉత్తరాంధ్రాకి పేరు తెచ్చిన కుమ్మరి మాష్టారు
సినీ పరిశ్రమలో బుర్రకధలలో అడపా దడపా కనిపించిన వారిలో విజయనగరంకి చెందిన కుమ్మరి మాస్టారు ఒకరు. దారా అప్పల నారాయణ అసలు పేరైనా బుర్రకధ దళంలో ఆయన పేరు కుమ్మరి మాష్టారుగానే స్ధిర పడిపోయింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడే అయినా... జానపద కళలపై ఉన్న మక్కువతో బుర్రకధల్ని సొంతగా నేర్చు కోవటమే కాకుండా...తన సహచరులైన కుమ్మరి జానకి, రొంగలి సత్యన్నారాయణ మూర్తిలకు నేర్పి వారితోతో కల్సి 1992 వరకు వేలాది ప్రదర్శనలు ఇచ్చా రాయన. ఉత్తరాంధ్రా జిల్లాలలో ఏ ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు కుమ్మరి మాష్టారి బుర్రకధ ఉండి తీరాలనే స్ధాయికి ఆయన ఎదిగారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆంధ్రాయూనివర్శిటీ ఈతనిని కళా ప్రపూర్ణ అవార్డుతో సత్కరించింది.

మణికట్టుకి కనికట్టు

నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో కుర్రకారు దుస్తులకే కాదు...
కళ్లకు ధరించే అద్దాలు, నడుంకి పెట్టుకునే బెల్టులు, చెవి రింగులు, కాళ్లకి వేసే చెపðలు...
చేతికి ధరించే బ్రాస్‌లెట్లు, గడియారాలకీ అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వారి అభిరుచి తగ్గట్లు నేడు అనేక రకాల వాచీలు మార్కెట్లోకి వచ్చేసారు..మారుతున్న కాలంతో పాటుగా...వైరుధ్యానికి పెద్ద పీట వేస్తూ... మార్కెట్‌లోకి ఏ కొత్త తరహా వెూడల్‌ వచ్చి నా కొని పెట్టుకోవా లన్న దృక్పధానికి రెడ్‌ కార్పె ట్‌ వేస్తూ దూసుకుపోతున్న నేటి యవతరం అనేక సరికొత్త సృజనతో రంగరించిన వస్తువులపై మక్కువ చూపుతోంది. అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించి రోజు రోజుకూ దూసుకు వస్తున్న కొత్త కొత్త గడియారాలని చేతికి అలంకరించుకునేందుకు సిద్దమవుతోంది.
ఒకపðడు ఇంట్లో ఒకరికో ఇద్దరికో వాచీలుండేవి. అదీ ఏబొడ్లోనో దోపుకుని సమయం చూసుకునేవారు. కాల క్రమంలో జరిగిన మార్పులు పురుషులు, మహిళలకు వేర్వేరుగా వాచీలు రావటంతో వీటి వాడకం బాగా పెరిగింది.
అయితే సాంకేతిక విప్లవం అందుబాటులోకి వచ్చాక 'కీ' ఇచ్చే వాచీల స్ధానంలోకి బ్యాటరీ సాయంతో నడిచే వాచీలు రంగ ప్రవేశం చేయ టంతో కారు చౌకగా సామాన్యజనం కూడా కొను క్కునేలా వాచీలు తయారై అందుబాటులోకి వచ్చాయి
చిన్న పిల్లాడి నుండి పండు ముదసలి వరకు ఎవరి అభి రుచికి తగ్గట్టు వారికి వాచీలు అందించడానికి అన్ని కంపెనీలు సిద్ద పడ్డాయి. ఈ క్రమంలో ఏ ఐదేళ్లలో ఒకసారో వాచీలు మార్చేందుకు ఇష్టపడే సామాన్యుడి ఇళ్లలో కూడా విభిన్నతకి పెద్ద పీఠవేస్తూ... డజన్లకొద్ది, సమయానికి, డ్రస్‌కి తగ్గట్టుగా వినియోగించేందుకు వీలుగా వాచీలు కొను గోలు చేస్తున్నారన్నది వాస్తవం.
దాదాపు అన్ని కంపెనీల వాచీలకు సినీ తారలని బ్రాండ్‌ అంబాస ిడర్‌లుగా వ్యవహరిస్తుండటంతో కుర్రకారు వీటి కొనుగోళ్లకి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో వాచీల ధరలు కాసింత ఎక్కువగా పెరుగుతు న్నా...వెూడల్‌ నచ్చితే చాలు ఎంత ధరైనా కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే యువత స్పందనల్ని పరిగణలోకి తీసుకుని అనేక రకాల డిజైన్లలో, అనేక వెూడల్స్‌తో ఆకర్షించేలా అన్ని కంపెనీలు చేతి గడియారాలని మార్కెట్‌లోకి తీసుకొస్తునే ఉన్నాయి.
సెల్‌లో వాచ్‌ ఉన్నా సరే...
ప్రస్తుతం ఏ చేతిలో చూసినా సెల్‌ ఫోన్‌ కామన్‌ అయి పోయి న క్రమంలో ఇంకా చేతి వాచీ ఎందుకులే అని అనుకునే వారిని సైతం కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. ప్లాస్టిక, మెటల్‌, గోల్డ్‌, ప్లాటినం కోటింగ్‌లతో వివిధ రకాల చైన్‌లతో, పూసలతో అనేక వాచీలని రూపొందిస్తున్నారు. డిజిటల్‌ మాయాజాలంతో వైవిధ్య భరితమైన అనేక వెూడల్స్‌ అటు అమ్మాయిల్ని, ఇటు అబ్బాయిల్ని తెగ ఆకర్షి స్తున్నాయన్నది వాస్తవం. మరోవైపు ఇంటర్నేష నల్‌ కంపెనీలు కూడా బారతమార్కెట్‌ రంగం లోకి దిగి అనేక రకాల వాచీలను అమ్మకాని కి పెడుతున్నాయి. ఇవి ధరిస్తే... తమ స్టేటస్‌ మరింతగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యువత వీటి కొనుగోలుకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ద పడుతున్నారు. ఇక చైనా నుండి దిగుమతి అవుతున్న అనేక వాచీలు చవక ధరల్లో లభ్యం అవుతుండటంతో చాలా మంది వాటి వైపు మెగ్గుచూపుతున్నారు.అవి ఓ సారి పాడైతే అంతే సంగతులు కావటం విచారకరమే అయినా రోజురోజుకీ వాటి అమ్మకాలు జోరందుకుంటున్నాయం టే సామాన్యుడిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభిస్తున్న వివిధ వాచీలలో కాంతివంతమైన కలర్‌ డైల్‌ ఉన్నవాటికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. దీనికి తోడు సిల్వర్‌, గోల్డు, ఆరెంజ్‌, ఎల్లో, బ్లూ క్లాసి క సిల్వర్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని.. ముి ళలు ఎక్కువగా గోల్డు, బ్లాక కలర్‌తో పాటు మల్టీ కలర్‌ స్ట్రాప్‌ ఉన్న వాటివైపే.. వివిధ రంగు రాళ్లు, గాజులలో వాచ్‌లు పొదిగిన వాటి పైనా.. మక్కువ చూపుతు న్నట్లు వాచ్‌షాప్‌ల యజమానులు చెప్తున్నారు. మణికట్టుపై మాయాజాలాన్ని చూపుతూ కనికట్టు చేసేలా రూపొందుతున్న ఈ చేతి గడియారాలు నేడు బహు మతుల లిస్టులో ప్రముఖ స్ధానం దక్కించుకుంది. మరి మీ మిత్రులకో, బంధువులకో మీరు జీవితాంతం గుర్తుండిపోయేలా చేతివాచీని బహు మతిగా అందించండి.

ఆరోగ్యనిధి దానిమ్మ

మనకు సాధారణంగా లభించే దానిమ్మ పండు ఆరోగ్య నిధి అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అంతేకాదు 1829లో విల్లో చెట్ల నుంచి తీసిన ఆస్ప్రిన్‌ తరువాత మళ్లిd సహజసిద్ధ ఔషధాలలో ఇది అంతటిదని పేర్కొంటున్నారు.
గుండె ఆరోగ్యం, రక్తపోటులతో బాటు, శరీరంలో కొన్ని ప్రాంతాలలో మంటలు వంటి వాటిని తగ్గించడంతో బాటు, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను, లైంగిక లోపాలను కూడా ఇది సరి చేస్తుందనివారు చెబుతున్నారు. మొట్టవె ుుదటిసారిగా వారు దానిమ్మ గింజలు, తొక్క, బెరడు వంటి వాటిలోఉన్న ఔషధ గుణాలను కనుగొన్నారు. దీనిలో 'పునికాలాగిన్స్‌'గా పిలిచే ఒక రకం మొక్కల నుంచి వచ్చే పోషకం గాఢ స్థితిలో ఉంటుందని గ్రహించారు. అంతేకాక 'ఇది దొరికేది కెవలం దాని మ్మ నుంచే అన్నది గమనించాల్సిన అంశం.
ఈ పునికాలాగిన్స్‌ ఆ పండు తొక్క, లోపలి పసుపు రంగు పొరలు, గింజలు వంటి వాటిలో ఉం టాయ ని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్‌ స్ట్ట్రీటెన్‌బర్గర్‌ కనుగొన్నారు. అయితే దానిమ్మ తొక్కల కషాయం విరేచనాలను క ట్టేయటంలో అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేదం కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పిందన్న విషయం ఇక్కడ గమనార్హం. ఈ పండులోని వివిధ భాగాలలో గొప్ప ఔషధ గుణాలు దాగి ఉన్నందున ఇది దీర్ఘకాలిక రోగాల వల్ల వచ్చే అనేక రుగ్మతల చికిత్సలో ఉపయోగపడగలదని భావిస్తున్నట్టు బ్రిటన్‌లోని క్వీన్‌ మార్గరెెట్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ ఎమాద్‌ అల్‌ దుజైలీ తెలిపారు.

నడుం జర భద్రం


ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచం నేడు మన భారత మగువల మనసుల్నికూడా దోచుకుంటోందన్నది వాస్తవం. దీంతో వారి వస్త్ర అలంకరణలో ఎన్నో మార్పులు పుటుకొచ్చాయన్నది జగమెరిగిన సత్యం. నిన్న టి తరం చీరలు, లంగా ఓణీలు కేవలం పండగ పబ్బాలకో పెళ్లి పేరంటాలకో పరిమితం చేసిన నేటి తరం మహిళలు కొత్త కొత్తగా పుట్టు కొస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో అడుగు పెడుతూ.. మైమరిచిపోతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో జీన్స్‌ ధరించిన మహిళలే కాకుండా వివిధ డ్రస్సులకు తగ్గట్టు బెల్టులు పెట్టడం బాగా పెరుగుతోంది. ఇన్‌షర్టు చేసుకుంటే దాని హూందా తనమే వేరుగా ఉండటంతో మహిళల్లో ఇన్‌ చేసుకుని, బెల్టు వాడే పద్దతి బాగా పెరుగుతోంది.
దీంతో వారి దృష్టి మార్కెట్‌లోకివస్తున్న అనేక రకాల బెల్టులపై పడింది. అనేక రంగుల్లో, కళ్లు చెదరగొట్టేలా కనిపిస్తున్న ఈ బెల్టులు విషయంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
స్త్రీల నడుము నాజూకుగా ఉంటుంది కనుక వీరు లావుపాటి, మందంగా ఉండే బెల్టులు వాడితే నడుము కంది పోయి, ఎలర్జీలు ఇతర రుగ్మతలకు దారి తీసే అవకాశాలున్నాయని... నడుముకు సరిపోయిన, మెత్తని, సన్నని బెల్టుని వాడుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. బెల్టులు, లెదర్‌ షాపులకి వెళ్లేప్పుడు మీరు కంఫర్ట్‌ బెల్టు అడిగితే మంచిదని... వారు చెప్పారు.

24, నవంబర్ 2011, గురువారం

నడుం జర భద్రం

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచం నేడు మన భారత మగువల మనసుల్నికూడా దోచుకుంటోందన్నది వాస్తవం. దీంతో వారి వస్త్ర అలంకరణలో ఎన్నో మార్పులు పుటుకొచ్చాయన్నది జగమెరిగిన సత్యం. నిన్న టి తరం చీరలు, లంగా ఓణీలు కేవలం పండగ పబ్బాలకో పెళ్లి పేరంటాలకో పరిమితం చేసిన నేటి తరం మహిళలు కొత్త కొత్తగా పుట్టు కొస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో అడుగు పెడుతూ.. మైమరిచిపోతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో జీన్స్‌ ధరించిన మహిళలే కాకుండా వివిధ డ్రస్సులకు తగ్గట్టు బెల్టులు పెట్టడం బాగా పెరుగుతోంది. ఇన్‌షర్టు చేసుకుంటే దాని హూందా తనమే వేరుగా ఉండటంతో మహిళల్లో ఇన్‌ చేసుకుని, బెల్టు వాడే పద్దతి బాగా పెరుగుతోంది.
దీంతో వారి దృష్టి మార్కెట్‌లోకివస్తున్న అనేక రకాల బెల్టులపై పడింది. అనేక రంగుల్లో, కళ్లు చెదరగొట్టేలా కనిపిస్తున్న ఈ బెల్టులు విషయంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
స్త్రీల నడుము నాజూకుగా ఉంటుంది కనుక వీరు లావుపాటి, మందంగా ఉండే బెల్టులు వాడితే నడుము కంది పోయి, ఎలర్జీలు ఇతర రుగ్మతలకు దారి తీసే అవకాశాలున్నాయని... నడుముకు సరిపోయిన, మెత్తని, సన్నని బెల్టుని వాడుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. బెల్టులు, లెదర్‌ షాపులకి వెళ్లేప్పుడు మీరు కంఫర్ట్‌ బెల్టు అడిగితే మంచిదని... వారు చెప్పారు.

తెలుగు జాతి వెలుగు జాతే..

  • ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొక్కటే...
  • నేడు తెలుగువారందరిదీ ఒకటే రాష్ట్రం..
  • భవిష్యత్‌లో రెండు రాష్ట్రాలు, మూడు రాష్ట్రాలు ఏర్పడ వచ్చు.
  • కానీ తెలుగువారి సమైక్యతకు సమగ్రతకు పోరాడిన చరిత్రను విస్మరించలేం. మనముందు నూతన చరిత్ర ఆవిష్కృతమైనా..
దానితో పాటు పూర్వ చరిత్రనూ స్మరించుకోవలసిందే త్యాగధనుల్ని తలచుకోవాల్సిందే.
వారి త్యాగాల స్పూర్తిగా తెలుగువారి సమగ్రాభివృధ్ధికి ముందుకు సాగాల్సిందే...
సువిశాల భారత సామ్రాజ్యానికి స్వాతంత్రం వచ్చాక అంతే స్ధాయిలో రాష్ట్రం కోసం పోరాటం జరగటం ఆంధ్ర ప్రదేశ్‌తోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. 1912 లోనే తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండా లని టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవ రెడ్డి, భోగరాజు పట్ట్టాభి సీతారామయ్య తదితరుల సారధ్యంలో అలుపెరగని పోరాటం జరిగింది. 40 ఏళ్ల పాటు పోరా డినా... అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం కానీ తరువాత వచ్చిన స్వతంత్ర భారత ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రజల ఆకాంక్షని నెరవేర్చలేదు. ఆ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటులో పొట్టి శ్రీరాములు చేసిన ఎనలేని కృషి చిరస్మరణీయం.అని చెప్పక తప్పదు.
అమరజీవి...
1901 మార్చి 16న చెన్న పట్టణంలో జన్మించిన పొట్టి శ్రీరాములు ప్రాధమిక విద్య పూర్తయ్యాక శానటరీ ఇంజనీ రింగ్‌ కోర్సు చేసి పశ్చిమ రైల్వేలో ఉద్యోగం చేసేవారు. ఈ క్రమంలో నాడు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది పాల్గొనటంతో ఉత్తేజభరితుడై స్వాతంత్ర సమరం వైపు అడుగులు వేసాడు. ఓ వైపు తన తల్లి చనిపోయినా... వెర వక మాతృభూమిని విదేశీ కబంధహస్తాల నుండి కాపా డటమే లక్ష్యంగా గాంధీ సాగించిన మహౌద్యమానికి తానూ బాసటగా నిలచి ఉపð సత్యాగ్రహం, క్విట్‌ ఇండి యా ఉద్య మాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశంలో 22 జిల్లాలో తెలుగు మాట్లాడే వారుండేవారు. 1952లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఉండి దక్షణ భారత దేశంలో సాంప్రదాయలకు పెద్ద పీట వేస్తూ వచ్చిన తెలుగు జాతి ఎన్నో ఈసడిం పులకు అవమానాలకుగురవుతు ఏహ్యభావం పెరుగుతున్న దశలో వాటిని సహించలేక తెలుగుభాష మాట్లాడే వారందరినీ ఒకే రాష్ట్ర పరిధిలోకి తేవాలన్న ఏకైక డిమాం డ్‌తో 1952 అక్టోబ ర్‌ 19న చెన్నై పట్టణంలోని బులుసు సాంబ మూర్తి ఇంట్లో ఆమరణ దీక్షను ప్రారంభించారు. అంచెలం చెలుగా ఆమరణ దీక్ష ఫలితాలు తెలుగునాట విస్తరిం చడంతో పాటు తెలుగునాట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపం దుకుం ది. లక్షలాది ప్రజలువీధుల్లోకొచ్చి పొట్టి శ్రీరాములుకు మద్దతుగా ప్రదర్శనలు, నిరసనల దీక్షలు చేపట్టారు. నాటి కేంద్ర సర్కారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దీక్ష విర మణకు ససేమిరా అనటంతో పాటు తెలుగురాష్ట్ర ఏర్పా టుకు భీష్మించడంతో క్రమేణా ఆరోగ్యం కృసించి 1952 డిశంబర్‌ 15న దీక్షలోనే ఆయన పరమపదిం చారు.
డిశంబర్‌ ప్రకటన.
పొట్టిశ్రీరాములు మరణ వార్త యావత్‌ ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేసింది. మద్రాసు నుంచి విశాఖ సాగర తీరం వర కు లక్షలాది ప్రజలు ఆమరజీవి మరణం పట్ల ఆగ్రహావే శాలు వ్యక్తం చేస్తూ. విధ్వంసానికి దిగారు. అనేక హింసా త్మక చర్యలకు కూడా పాల్పడ్డారు. నాడు జరిగిన పోలీసు కాల్పు ల్లో అనేక మంది అసువులు బాసారు. చివరికి ఆయన చేసినప్రాణత్యాగాన్ని గుర్తించిన నాటి ప్రధాని జవహ ర్‌ లాల్‌ నెహ్రూ 1952 డిశంబర్‌ 19 నఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.. 1953 అక్టోబర్‌1న తెలుగు వారి కోసం ప్రత్యేక ఆంధ్ర ఏర్పా టు చేసారు.అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్టల్‌ ఆంధ్రా, రాయలసీమ జిల్లాలను విడి రాష్ట్ర ఏర్పాటు సన్నాహాల దిశలో ఉండగా నాడు ఉమ్మడి ముఖ్యమంత్రిగా వ్యవహరి స్తున్న చక్రవర్తుల రాజగోపాలచారి.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పా టు చేస్తే,వెంటనే ఆంధ్రులు వెళ్లిపోవాలని తెగేసి చెప్పడం తోరాజధానిఏర్పాటుపై అనేక తర్జనభర్జనలు జరిగాయి.
రాజధాని కోసం తర్జన భర్జనలు...
ఈ క్రమంలో ఆంధ్రకు రాజధానిగా కాకతీయులు పాలించిన వరంగల్‌ని రాజధానిగా చేస్తే అందరికీ సౌల భ్యంగా ఉంటుందని... అలాగే రాజమండ్రిని పరి గణలో కి తీసుకోవచ్చని రాజ్యాంగ ప్రదాత బాబా సాహేబ్‌ అంబే డ్కర్‌ ప్రతిపాదనచేసారు. మధ్యే మార్గంగా విజయ వాడని కూడా ఎంపిక చేయాలని తలచారు. అయితే అప్పటికే విజయవాడని కమ్యూనిస్టులు తమ కంచుకోటగా మార్చు కోవటంతో అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బం దులు ఏర్పడటం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు ససేమిరా అనటంతో రాజధాని కధ మళ్లీ మెదట ికొచ్చింది.
అదే సమయంలో చెన్నైకి దగ్గరగా ఉన్న తమని ఆంధ్ర లో కలపడం వల్ల రాజధాని దూరం అవుతుందని.. తద్వారా తమ రాయలసీమ జిల్లాల అభివృధ్ధి ఆగిపోతుందని... అక్కడి కాంగ్రెస్‌ నేతలు కొత్త మెలిక పెట్టడంతో పాటు రాజధానిని కోస్తా ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే తాము అంగీకరించే ప్రశ్నే లేదని, కోస్తా వారిని తాము ఎట్టి పరి స్ధితిలోనూ నమ్మబోమంటూ రాయల సీమలోనే రాజధాని ఉండాలి. లేదంటే తమకు ప్రత్యేకరాష్ట్రమే అవసరం లేదం టూ నీలం సంజీవరెడ్డి లాంటి నేతలు ఎదురు తిరగటం ఓ వైపు అయితే తిరువళ్లూరు, బళ్లారీ, బరంపురం తది తర తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కూడా వదులుకునేందుకు సిద్దపడాల్సి వచ్చింది మరో వైపు.. మద్రాసు రాష్ట్రాన్ని వదిలి పెట్టి ఎట్టి పరిస్ధితిలోనూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాలని ఒకే ఒక కాంక్షతో రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు రాజ ధానిగా చేసి 1953 అక్టోబర్‌1న ఆంధ్ర రాష్ట్రంని ఏర్పాటు చేసారు. దీనికి తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేశరి టంగు టూరి ప్రకాశం పంతులు వ్యవహరించారుఆపై ఆంధ్ర రాష్ట్రంలోనిజాంస్టేట్‌లోని తొమ్మిది జిల్లాలను కలిపి 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేసి దీనికి హైదరా బాద్‌ని రాజధానిగా చేసారు. నాటి నుండి తెలుగు వాళ్లు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చూపి స్తూ, తెలుగుభాషకు, మన రాష్ట్రానికి ఎనలేని పేరు ప్రఖ్యా తులు తెచ్చి పెట్టారు. ఖండా తరాలలోనూ తెలుగువాడి ఖ్యాతి మిన్నంటింది. తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు దిగిన ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా కాపా డుతూ వస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌, రాయపేట హైవే రోడ్డులో ఉన్న 126 నంబర్‌ ఇంటిని మీరెపðడైనా చెన్నై వెళ్తే దర్శించండి. ఇక మన రాష్ట్ర ప్రభుత్వ ఆ మహనీ యుని పేరు మీద పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వ విద్యాల యాన్ని స్ధాపించగా... 2008 లో నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసింది.
రాష్ట్రం సరే... భాషను కాపాడుకొందాం...
కానీ నేడు తెలుగు రాష్ట్ర భవి ష్యత్‌ అగమ్యగోచరంగా తయా రైంది. మా తెలుగు తల్లికి మల్లె పూదండ... అం టూ తెలుగు భాషకి అమ్మలోని కమ్మదనాన్ని మేళవించి చేసిన శంకరంబాడి కలం విన్యా సాలు... చేయెత్తి... జై కొట్టు తెలు గోడా... గతమెంత ఘన కీర్తి కల వోడా... అంటూ వేముల పల్లి శ్రీకృష్ణ తెలుగు జాతి గొప్ప తనాన్ని... నిండు గౌరవాన్ని ప్రపంచం పిక్కరి ల్లేటట్లు చేసినా అవి పాటలకే పరిమితం అయిపో వాల్సిన దుస్ధితి నెలకొంది. కనీ సం తెలుగుభాషకీ గౌరవం దక్కకుండా పోతోంది.
విదేశీయులు మన భాషని ఆశ్వాదిస్తుంటే...
ఒకపðడు ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌గా... దేశ భాషలందు తెలుగు లెస్సగా ఎందరో దేశ విదేశాలకు చెందిన అనేక మంది ఈ భాషపై మక్కువతో...తెలుగు నేర్చుకుని.తమ అభిమానాన్ని చాటుకొంటు ప్రపంచంలోని ఏ భాషకూ లేని తెలుగు భాష నుడికారాన్ని, వీనుల విందైన పదకట్టు విన్యాసాలని నేర్చుకుని మన భాష సౌందర్యాన్ని ఆస్వాది స్తుంటే... మనం మాత్రం పరాయి భాషల వెూజు లో పడి తెలుగుభాష కమ్మదనాన్ని పక్కకు నెట్టేస్త్తూన్నా మన తెలు గు భాష అంత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రాధాన్యతా క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 6వ స్ధానాన్ని భారతదేశంలో 2వ స్ధానాన్ని దక్కించుకొందంటే మనమింకా అప్రమత్తతగా ఉంటే ఆస్ధాయి ఎక్కడికి పెర గొచ్చో, తెలుగు భాషలోని జాతీయాలు, మాట్లాడేందుకు ఉండే సౌలభ్యం ఉన్నతంగా ఉండటంతో అనేక మంది తెలుగు వారిని తమభాషల్లో కలిపేసు కోవాలని చూసినా అనేక అనువాదాలను తెరపైకి తెచ్చినా వీలుకా లేదు.మన భాషాబలం అలాం టిది మరి.
జాతికి ద్రోహం చేసినట్లే....
కానీ మన వాళ్లే సొంత ఇంటి భాషని నిర్లక్ష్యం చేస్తూ... పరాయి భాషల చూరు పట్టుకు వేలాడుతున్నారు. ఉపాధి కోసం ఇంగ్లీషు నేర్చుకున్నంత మాత్రాన తెలుగు భాషని మరచిపోవాలన్న రూలేమీ లేదు. మాతృభాషలో ఎవరైనా మాట్లాడటం వింటే చాలు...వికృత ముఖం పెట్టి చూడ టం...తెలుగు వచ్చినా మాట్లాడకుండా సాటి తెలుగు వారి ని ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొడటం అంటే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే భావించాలి. ఇక తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటిగా ఉండాలని నినదించిన వారిని ఏహ్యభావనతో చూడటం ఆశ్చర్యకరం. తెలుగు జాతి, భాషావికాసాలకు ఎనలేని కృషి చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మాండలికా లను యావత్‌ తెలుగు జాతి మొత్తానికీ పరిచయం చేసిన ఎందరో మహనీయులని, కవులు, కళా కారులని తలచుకుంటూ.వారు చూపిన బాటలో నడుస్తూ భవిష్యత్‌లో మన రాష్ట్రం ఎన్ని ముక్కచెక్కలైనా తెలుగు వాళ్లంతా తమ భాష సంస్క ృతులును కాపాడుకోవాల్సిన అవసరం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఏ మాత్రం సందేహ పడనఖ్ఖర్లే...
అక్కడ వికసిస్తూ.. ఇక్కడ మందగిస్తూ...
విదేశాల్లో ఆటా, తానా, సిలికానాంధ్ర పేర్లతో అక్కడ ఉన్న తెలుగు వారు తమ మాతృభాష గొప్పదనాన్ని ఎప్పటిక పðడు గుర్తు చేసుకుంటూ తెలుగు సంస్కృతి, భాషా వికా సాలకి ఎంతగానో తొడ్పడుతుసాటి తెలుగువారిలో జాతీ యతా భావాన్ని రగిలిస్తున్నాయి. తెలుగు పతాకాన్ని అక్కడ రెపరెపలాడిస్తున్నా.. మన తెలుగు గడ్డపై మాత్రం తెలుగు జాతి ఏకీకరణకుగానీ, భాష పట్ల గౌరవాన్ని కానీ ప్రదర్శిం చక పోవటం విచారకరం.ఇప్పటికే ఇంగ్లీషు మాద్యమానికే పెద్ద పీట వేస్తూ... మాతృభాషలో విద్యాబోధన పట్ల చిన్న చూపు జరుగుతున్న క్రమంలో నేడు స్పోకెన్‌ ఇంగ్లీషు కేంద్రాలొచ్చినట్లే... భవిష్యత్‌లో స్పోకెన్‌ తెలుగు కేంద్రాలు పుట్టుకు వచ్చినా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...
ప్రభుత్వమేం చేయాలి...
ఇప్పటికే ఇంటర్నెట్‌లో తెలుగు భాష చదువుకునేందుకు వీలుగా జరిగిన ఏర్పాట్లు సామాన్యజనానికి కూడా అర్ధమ య్యేలా చట్టాలను తెలుగు భాషలోనే అందుబాటులోకి తీసుకు రావాలి. అలాగే ఏ ప్రభుత్వ పధకమైనా ధరఖా స్తు తెలుగులో ఉంటేనే పరిశీలనకు తీసుకుంటామని.. ప్రభుత్వం ప్రకటించాలి. పాలనాపరమైన సౌలభ్యం పేరు తో ఇంగ్లీషు ఎంత ముద్దనుకున్నా...ప్రతి ఆదేశాన్ని ప్రజల చెంతకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ప్రతి జిఓ ప్రజలకు తెలుగులోనే అందుబాటులోకి తీసుకు రావాలి. మరో స్వాతంత్ర పోరాటం జరిపినట్లే తెలుగు ప్రజలంతా యాసలకు, ప్రాంతీయా విధ్వేషాలకు అతీ తంగా ఐక్యంగా మన భాషని రక్షించుకోవటానికి ప్రతి తెలుగు వాడూ నడుంబిగించాలి.



అపðడెందుకు పాల్గొన్నారు
రాష్ట్రం ఎన్నిగా విభజించినా, అది జరిగే వరకు అంతా కల్సి ఉండాల్సిందే కదా ఆంధ్ర ప్రదేశ్‌ అవరతణ దినోత్సవం అంతా జరుపుకోవాల్సిందే...
2004లో మంత్రివర్గంలో ఉన్న నేటి విభజనవాదులు అప్పట్లో ఎందుకు అవతరణ దినోత్సవాలలో పాలొ ్గన్నారు... నేడెందుకు బ్లాకడేేలుగా పాటిస్తున్నారన్న విష యంపై ప్రజల కు వివరణ ఇవ్వాల్సిందే కాదా
వి.శ్రీనివాస్‌, పాలకొండ, శ్రీకాకుళం


పరస్పరం గౌరవించుకోవటం అవసరం
గతంలో జరిగిన జైతెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలను చూసిన నాకు ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్న పరిస్ధితి చూస్తుంటే బాధ కలుగుతోంది. విధ్వేషాలు రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్న రాజ కీయనేతలకు దూరంగా ఈ సారి రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణ బాధ్యతల్ని కలెక్టర్ల కివ్వటం సరైనదే, ఇక నుండి వారు రాజ కీయ వత్తిళ్లకు లొంగకుండా జనం బాధల్ని గుర్తెరిగి జాగుర కతతో వ్యవహరించాలి. అడుగున పడుతున్న సంక్షేమం ప్రజల ముంగిటకు చేర్చాలి. ప్రజలు కూడా రాజకీయ నేత ల మాటలకు రెచ్చి పోకుండా కేంద్రం విభజన రేఖలు పూర్తి చేసే వరకు సాటి తెలుగు వారిని పరస్పరం గౌరవిం చుకోవాల్సిన అవసరం ఉంది.
- మనోరంజన్‌ రావు, రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి,
ఆర్‌కె నగర్‌, సికింద్రాబాద్‌



రెచ్చగొట్టే వారిని శిక్షించాలి...
రాష్ట్రంలో విపరీత ధోరణులు పెరిగి పోవటానికి నేతల స్వార్ధ రాజకీ యాలే కారణం అన్నది వాస్తవం. లక్ష్య సాధన కన్నా తమ రాజకీ య భవిష్యత్‌పైనే దృష్టి పెడుతూ ఇష్టా నుసారంగా ప్రవర్తిస్తూ... జనానికి సమస్యగా తయారయ్యా రు. ఇలాంటి వారిని జనమే శిక్షించాలి.
గోపాల్‌ రెడ్డి, హౌసింగ్‌ బోర్డు కాలనీ,
ఇసీఈఎల్‌, సికింద్రాబాద్‌


రెండు రాష్ట్రాలు ఏర్పడితే తప్పేంటి
తెలుగువారికి రెండు రాష్ట్రాల డిమాండ్‌ తప్పుకాదు. నాడు పొట్టి శ్రీరాములు అప్పటి పరిస్ధితిలకు అనుగుణంగా తెలుగువారికి రాష్ట్రాన్ని సాధించారు. అలాగే తెలంగాణా వారికి ఇప్పుడొక రాష్ట్రం కావాలి. మరి తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడితే తపేపండి అయితే తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తూనే తెలుగు వారిని గౌరవించాలి. పొట్టి శ్రీరాములును స్మరించాలి. అదే భావ సమైక్యతకు, తెలుగు జాతి మనుగడకి శ్రేయాేెదాయకం.
- ప్రసాద్‌, శ్రీకాకుళం


ప్రత్యేక దేశం కావాలన్న నిజాం
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడానికి పూర్వమే హైదరా బాద్‌ నిజాంపాలనలో ఉండేది. భారతదేశానికి స్వాతం త్రమొచ్చినా...తాము మాత్రం అందులో కలిసేది లేదని ససేమి రా అంటూ ప్రత్యేకదేశంగా ఏర్పాటు కావాలని నిజాం తన ప్రయత్నాలు ప్రారం భించా డు. ఈ క్రమంలో ఆయుధాల సమీకరణ చేసుకొంటూనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించి సైన్యాన్ని పెంచుకొన్నారు. ఆపై రజాకార్ల హింస పెరిగి పోవ ట తో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి దిగారు. దీంతో హైద రాబాద్‌లో హింస ప్రజ్వరిల్లటంతో 1948లో సెప్టెంబర్‌ 13న భారత ప్రభుత్వం పోలీ సుచర్యకి దిగింది. 5 రోజుల పాటు సాగిన ఈ పోరులో నిజాం ఓటమి పాలవ్వగా 18న పోలీసులు నిజాం సంస్ధానాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో తప్పని పరి స్ధితిలో భారత దేశంలో తన సంస్ధానాన్ని కలిపేసేందుకు అంగీకరించాడు.


సైనిక పాలన నుంచి సమైక్యం వైపునకు...
హైదరాబాద్‌ని సైనిక పాలనలోకి తీసుకు వచ్చి సైనిక గవర్నర్‌గా మేజర్‌ జనరల్‌ జెఎస్‌ చౌదరిని నియమించారు. 1949 చివరి వరకూ గవర్నర్‌ పాలనలో ఉన్న నిజాంను హైదరాబాద్‌ రాష్ట్రంగా ప్రకటించి 1950లో రాజ్‌ ప్రముఖ్‌గా నిజాంని ప్రకటించి... ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిని చేసారు. ఆపై 1952లో జరిగిన ఎన్నికల్లో భూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే 1953లో ఏర్పాటైన సయ్యద్‌ ఫజిల ఆలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమి టీ, విశాలాంధ్ర ప్రయోజనాలు గుర్తిస్తునే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సై అంది. దీనిపై విభేదించి.. హైదరాబాద్‌ అసెంబ్లీ మెజార్టీ సభ్యులతో పాటు కమ్యూనిష్టులు విశాలాంధ్ర ఏర్పాటును సమర్ధించడంతో తెలంగాణా, ఆంధ్రా నేతల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగి 1956 నవంబర్‌1న ఆంధ్ర ప్రదేశ్‌ అవతరించింది.

కాలమేదైనా... నోరూరించే.. ఐస్‌క్రీమ్‌

వేసవి కాలమే... కాదు... శీతాకాలం లో నైనా... చలిపులి చంపేస్తున్నా.... ఐస్‌క్రీమ్‌ చూస్తే... తినాల్సిందే...
అనేక రకాల రంగుల్లో.. అనేక రుచుల్లో... వివిధ వాసనల్లో ఏదైశస్ధులైనా...
ఏ ప్రాంతానికి చెందిన వారినైనా అబ్బురపరిచేలా ఇట్టే ఆకర్షించేది ఐస్‌ క్రీమ్‌.
చిన్నా.. పెద్ద్ద, ముసలి, ముతక అని వయసు తేడాలే లేకుండా మక్కువ చూపిస్తుంటారంటే...
ప్రపంచంలో దీన్ని దాదాపుగా ఇష్టపడని వారే ఉండరనే చెప్పాలి.
చల్లగా... మనసుని ఆహ్లాదకర తీరాలకు చేర్చే సత్తా ఐస్‌ క్రీమ్‌ల సొంతం అని అన్నా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...
ఒకప్పుడు కేవలం ఖరీదైన కుటుంబాలకే పరిమి తమైన ఈ ఐస్‌ క్రీమ్‌ నేడు సామాన్యుడికి చాలా అందుబాటు లోకి వచ్చింది. ఇప్పుడు సామాన్యుడి ఇంట కూడా ఏఫంక్షన్‌ చూసినా... అక్కడ జరిగే లంచ్‌, డిన్నర్‌, పార్టీ లు ఐస్‌క్రీమ్‌తోనే ముగియాల్సిందన్నంతగా మనం చేరి పోయామంటే...ఐస్‌ క్రీమ్‌లని ఎంతలా ఇష్టపడుతున్నా మో అర్ధం చేసు కోవచ్చు.
తొలి నాళ్లలో ఐస్‌ క్రీమ్‌ కోసం ప్రత్యేకంగా డైరీ పార్ల ర్లు ఉండగా... కాల క్రమంలో అవి దాదాపుగా ఐస్‌ క్రీమ్‌ పార్ల్లర్లుగా మారిపోయాయి. దీనికి తోడు డైరీ ఫాంలతో పాటు అనేక కార్పొరేట్‌ సంస్ధలు కూడా ఈ ఐస్‌ క్రీమ్‌ తయారీలోకి రావటంతో ఐస్‌ క్రీమ్‌ ఉత్పత్తి దారులు తమ అమ్మకాలను మరింత పెంచు కునే దశలోలో నేరుగా సామాన్యుడి ఇంటి ముంగిటికే ఐస్‌క్రీమ్‌ చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి ఐస్‌ క్రీమ్‌వ్యాపారం కూడా అభివృద్ది పధంలో పయనిస్తోంది.
తొలినాళ్లలో ఐస్‌ క్రీమ్‌ని నిలవ ఉంచేందుకు తగిన స్ధాయి సామా న్యుడికి లేక పోవటంతో అది ఏ రాజ ప్రాసాదాలకో, ధనవంతులు, సంపన్నకుటుంబాలకో పరిమితమైనా..ఈ క్రమంలో జరిగిన సాంకే తిక విప్లవం కారణంగా ధరలు తగ్గి... చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు వచ్చి చేరాక సామాన్యుడికి బాగా అందుబాటులోకివచ్చింది.
మరోవైపు ఇంట్లో మహిళలు కూడా ఐస్‌క్రీమ్‌ తయారు చేసుకు నేందు కు తెగ ఆసక్తి ప్రదర్శించారు. ఇందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీలు ఇందుకు కావాల్సిన సామగ్రిని అందుబాటులోకి తెచ్చాక ఇంట్లోనే ఐస్‌క్రీమ్‌ తయారవ్వటం ప్రారంభించింది.
ఇంతకీ ఐస్‌ క్రీమ్‌ వెనక కధ ఏంటంటే...
రుచికరంగా మనం తింటున్న ఈ ఐస్‌ క్రీమ్‌ల వెనుక పెద్ద్ద కధే ఉంది. దాదాపు 700 ఏళ్ల్ల క్రితం చైనాలోని మార్కొపోలో అక్కడి వంట వాళ్లు, మంచుకి పాలు చక్కెర కలిపి రుచికరమైన ఐస్‌ని తయారు చేసారు. అక్కడి నుండి ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలను చేరిన ఈ వంటకం అమెరికాతో సహా ప్రపంచమంతా విస్తరించినట్లు ఓ కధ ప్రచారం లో ఉండగా... అసలు ఐస్‌ క్రీమ్‌ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకమే కాదని నాటి కాలంలో ఇంగ్లాండ్‌ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మొదటి ఛార్లెస్‌ దగ్గర ఫ్రెంచి వంటకాలు తయారు చేసేందుకు ప్రత్యే కంగా ఓ వంట వాడు ఉండేవారు. మత్తు పానీయాలను తాగే క్రమం లో వాటిని చల్లబరుచుకుని తాగెె వాడు. ఓరోజు ఇదే విధంగా ప్రిన్స్‌కి కూడా అందచేయగా... మత్తు పానీయంతో తయారు చేసిన ఐస్‌ గడ్డ లు రుచికరంగా ఉన్నాయని ఈ విధానాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆదేశాలు జారీచేసినా... ఆ వంటవాడు తన సహచరులకు వివరించ డం... అది వారి ద్వారా యూరోపియన్లకు చేరటం జరిగిందని... అక్కడి నుండి ఈ ఐస్‌ క్రీమ్‌ రహస్యం అమెరికాకు పాకింద ని... అప్పట్లోనే న్యూయార్క్‌ కు చెందిన పలు వార్త్తా సంస్ధలు కధనాలు ప్రచురించినట్లు చెప్తారు. ఇలా అమెరికా పాకిన ఈ ఐస్‌ క్రీమ్‌పై అనేక మంది ఐస్‌ని రకరకా లుగా చేసే విధానాలపై ఎన్నో ప్రయోగాలు చేయటం వల్లనే ఇప్పు డు మనం తింటున్న ఐస్‌ క్రీమ్‌ పుట్టిందని చెప్తారు.
అంచెలంచెలుగా ఎదిగి...
1851లొ బాలిమోర్‌కి చెందిన జేకబ్‌ ఫన్సల్‌ తొలిసారి ఐస్‌క్రీమ్‌ని మార్కె ట్‌లో అమ్మకాలు ప్రారంభిస్తూ... ఓ షాపుని ఏర్పా టు చేయగా... 1903లో డెమాస్కస్‌ నుంచి వచ్చిన సిరియా దేశస్దుడైన ఎర్నెస్ట్‌ ఏ హాంనీ ఐస్‌ క్రీమ్‌లు ప్రత్యేకంగా తినేందుకు వీలుగా కోన్‌ లని తయారు చేసి... వీటిలో అమ్మడం ప్రారం భిం చాడు. ఈ క్రమంలోనే న్యూ జెర్సీకి చెందిన నాన్సీ జాన్సన్‌ సులభ పద్ధతిలో ఐస్‌ క్రీమ్‌ తయారు చేసేం దుకు మిషన్‌ని రూపొందించడంతో ఐస్‌క్రీమ్‌ వాణిజ్యం మరింత విస్తృతమైంది.
1904లో సెయింట్‌ లూయిస్‌లో
జరిగిన ప్రపంచప్రదర్శనలో తొలిసారిగా ఐస్‌ క్రీమ్‌ని ప్రద ర్శించగా...1920లో నీటి ఆవి రి, విద్యుత్‌ శక్తులతో ఐస్‌ తయారీ విధానం అందుబాటు లోకి రావటంతో 1921లో తొలి ఐస్‌ క్రీమ్‌ బార్‌ని తెర చారు. ఇక రెండో ప్రపంచ యుద్ద కాలంలోదక్షిణ ఫసిపిక్‌ నౌకా శాఖలో పనిచేస్తూ.. ఐస్‌ క్రీమ్‌ పై అనేక ప్రయోగాలు చేసిన బుర్టన్‌ బుచ్‌ బాస్కిన్‌ ఐస్‌ క్రీమ్‌ ఫీజర్‌తో తొలిసారిగా 31 రకాలలో ఐస్‌ క్రీమ్‌లని రూపొందించి ప్రపం చ దృష్టిని ఆకర్షించాడు.
1945లో పరిచయమైన ఇర్విన్‌ రాబిన్స్‌ అనే వ్యక్తితో కల్సి చేసిన అనేక ప్రయోగాల అనంతరం ప్రపం చానికి చాక్లొట్‌, వెనిలా, స్టాబెర్రీ ఫ్లావర్లను పరిచయం చేయగలి గాడు. దీంతో ఐస్‌ క్రీమ్‌ తయారీలోనూ పెను మార్పులు సంభవిం చాయ నే చెప్పక తప్పదు.

ఐస్‌ క్రీమ్‌
ఎలా తయారు చేస్తారంటే...
రిఫ్రిజిరేటర్లు వచ్చాక ఐస్‌ క్రీమ్‌లలో అనేక మార్పులు ఊపందుకున్నాయి. పాలు, చక్కెరలతో పాటు తేనె, కోడి గుడ్లు, చాక్లెట్లు, అనేక రకాల పళ్లు, ఆరోగ్యాన్ని అందించే మొలకలతో కూడా ఐస్‌ క్రీమ్‌లు తయారు చేయ టం ప్రారంభమైంది. కమర్సియల్‌ గా కూడా ఐస్‌ క్రీమ్‌లు అనేక రూపా లను సంతరించుకుని ఆకర్షణీయంగా తయా రవుతున్నాయి.
మిల్క్‌ సాలిడ్‌లు, నీళ్లు, పాలు, సుగర్‌, ఫ్యాట్స్‌పూర్తి స్ధాయిలో కలిపి వాటిని ఐస్‌క్రీం ప్లాంట్లలో 'పాయిశ్చరైజర్‌' చేస్తారు. ఆపై హోమోజె నెజేషన్‌ పేరుతో జరిగే ప్రక్రియతో అందులోని కొవ్వు పదా ర్ధాలని కరిగించి, దాదాపు 4 గంటల పాటు స్టోరేజ్‌ ట్యాంకులలో నిలవఉంచాక ఆమిశ్రమాన్ని విభజించి...కావా ల్సి న రంగులు, రుచుల కోసం ఫ్లేవర్లు కలుపు తారు. దీన్ని లిక్విడ్‌ అమోనియంతో 30 డిగ్రీల సెంటీగ్రేట్‌ టెంపరేచర్‌ వద్ద స్ధిర పరుస్తారు.
ఓవర్‌ రన్‌ తప్పని సరి...
ఈ ఏర్పాడ్డ గట్టి పదార్ధాన్ని నేరుగా తింటే కేవలం ఐస్‌గడ్డలు తిన్నట్లుగా ఉంటుంది కనుక గాలిని చొప్పించాల్సింటుంది. గాలి చేకూరిస్తేనే మెత్త్తబడి... తినేందుకు వీలవుతుంది. అందు కు అత్యధిక వేగంగా తిరిగే బ్లేడ్లు ఉన్న ఫీజర్లలో ఉంచి బాగా మిక్స్‌ చేస్తారు. దీని వల్ల ఐస్‌ క్రీమ్‌ తేలిక పడి పరిణామం కూడా పెరుగు తుంది.ఇలా ఐస్‌గా ఉన్న దాన్ని గాలి చొప్పించి క్రీమ్‌గా మార్చే విధానాన్ని ఓవర్‌ రన్‌ అని పిలు స్తారు. ఇంటి అవసరాలకు కావాల్సిన ఐస్‌ క్రీమ్‌లలో 80 శాతం ఈ ఓవర్‌ రన్‌ ఉండాల్సిందే.
ఆపై ప్యాకింగ్‌ చేసే ముందుకు అనేక పళ్లు, రక రకాల విత్తనాలతో అలంక రించి 'హార్డెనింగ్‌ రూమ్‌లో పెట్టి 23 డిగ్రీల సెంటీగ్రేడ్‌ టెంపరే చర్‌లో 12 గంటలు తక్కువ కాకుండా ఈ హార్డెనింగ్‌ కొనసాగిస్తారు. దీని వల్ల ఐస్‌ క్రీమ్‌లో ఉన్న నీటి భాగం గడ్డ కట్టి... తీసుకు వెళ్లేందుకు వీలు కలిగేలా చేస్తుంది.
ఐస్‌క్రీం యూనివర్శిటీ...
నిజమే.. సెంట్రల్‌ ఇటలీలో ఐస్‌ క్రీమ్‌ తయారు చేయటంలో శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా యూనివర్శిటీనే నెలకొల్పారంటే ఆశ్చర్యం కలగక మానదు. బొలొగ్నా సమీపంలో కారిగానీ గెలాటో పేరుతో ఏర్పాటు చేసిన ఈ విశ్వ విద్యా లయంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు ఐస్‌ క్రీమ్‌ తయారీపై శిక్షణ ఇస్తారు అలాగే వారం నుండి నాలుగు వారాల సర్టిఫికేట్‌ కోర్సులు కూడా ఆఫర్‌ చేస్తోందీ విశ్వ విద్యాలయం.
ఐస్‌క్రీమ్‌ తయారీలో అనేక పద్దతులు, పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు కూడా రాసిన మాల్కొల్మ్‌ స్టోగో 1992లో ఈ యూనివర్శి టీని స్ధాపించాడు. చైనా, స్పెయిన్‌, యూనైటెడ్‌ స్టేట్స్‌ ఇలా పలు దేశా ల్లో శాఖలున్న ఈ వర్శిటీలో అమెరికాతో సహ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅనేక దేశాల నుండి ఐస్‌ క్రీమ్‌ ప్రేమికులైన విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారు.
అనేక రకాల సాంప్రదాయ కళలతో కలగల్సి ఐస్‌ క్రీమ్‌లని తయారు చేసేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకు ఈవర్శిటీలో 400 మంది ఉద్యో గులు పనిచేస్తుండగా..ఏటా 12 వేల మంది విద్యార్ధులు శిక్షణ పొందు తున్నారు. రస్ప్‌ బెర్రీ, హసెల్‌ నట్‌, ఫెనెన్న్ల్‌, మోర్టాడెల్లా, లెమన్‌ ఇలా పలు ఫ్లేవర్లకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ఐస్‌ క్రీం తయారీ విధానాలపై సెమినార్లని నిర్వహించ డమే కాకుండా డెవలప్‌ మెంట్‌, ఎడ్యుకేషన్‌, ప్రోడక్ట్‌రీసెర్చు, ఫ్లేవర్స్‌, కన్సల్టింగ్‌ బుక్స్‌లపై శిక్షణ ఇస్తారు. అలాగే అన్ని కోర్సులలో టెక్నికల్‌, మార్కె టింగ్‌, మేనేజ్‌ మెంట్‌, విభాగాలలో శిక్షణ పొందిన విద్యార్ధులు అన్ని యూనివర్శిటీలలోగానే ప్రాక్టికల్స్‌ని కూడా చేసి అందులోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఈ యూనివర్శిటీలో చేరే విద్యార్ధులకు ఉచిత వసతిసౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అయితే నెలపాటు ఉండే ఒక్కో కోర్సుకు సగటున 1150 యూరోలతో పాటు ఇతర టాక్సులు వసూలు చేసా ్తరు. అంటే దాదాపుగా 19 లక్షల పైమాటే... ఇక వారం కోర్సులు, రెండు వారాల కోర్సులు కూడా ఉన్నాయి. ఇందుకు 6 నుండి 10 లక్షలు వ సూలు చేస్తారు.
మరి మీకూ ఐస్‌క్రీమ్‌ తయారీపై ప్రత్యేక శిక్షణ పొందాలనుకుంటే... ఈ కోర్సుల్లో చేరిపోండి. మరెందుకు ఆలస్యం.

సొంత తయారీకే మహిళల మక్కువ
బైట ఎన్ని పార్లర్లు వెలసినా. కమర్షియల్‌గా తయారయ్యే ఐస్‌ క్రీమ్‌లకి ధీటుగా నిలవకపోయినా... చాలామంది గృహిణిలు ఐస్‌ క్రీమ్‌ల తయారీ పట్ల మక్కువ చూపుతూ... స్వయంగా తయారు చేసుకుకొంటు సంతృప్తి చెందుతున్నారు. వెనిలా, చాక్లెట్‌, పిస్తా, ఫ్రూట్స్‌ ఇలా అనేక ఫ్లేవర్లు అందు బాటులోకి రావటంతో ఐస్‌ క్రీమ్‌ తయారీ ఈజీ అయిపోయింది. దీనికితోడుగా... పిల్లలు అమితంగా ఇష్టపడే... పళ్లను చాక్లెట్‌ ముక్కలను, కేకులని, ఫుడ్డిం గ్‌ ఐటమ్స్‌ని అద్దుతూ... ఆకర్షణీయంగా రూపొందించడమే కాకుండా వారి ఆరోగ్యాన్నిపరిరక్షించడంలోతగిన జాగ్రత్తలు తీసు కోవటం గమనార్హం.