శ్రీవారి పుష్పఆలంకరణలో పులకితుల మనోగతం
మంగళాకారుడు... మా కులదైవం వెంకటేశుడంటూ
కోట్లాదిగా తరలివస్తూ... ఏడుకొండలూ నడచి మరీ ఆ కోనేటిరాయుడి దివ్య మంగళ
రూపాన్ని కళ్లారా వీక్షిస్తూ.... తన్మయత్వంలో మునిగిపోయే భక్తజనం ఎందరో?
పద... పద మంటూ కాపలాదార్లు, కైంకర్య నిర్వాకులు ఎవరెంతలా
నెట్టేస్తున్నా.... గోవిందా... గోవిందా... అంటూ హరినామస్మరణతో ఇహలోకాన్ని
వీడి అదో అద్భుత ప్రపంచం లో విహరించడం స్వామిభక్తులకే చెల్లింది. అందునా
శ్రీవారికి తోమాల సేవా సంబరం జరిగినప్పుడు చూడాలని కోట్లాది భక్తగణం
ఆశించడం సర్వసాధారణ విషయం. మరి తిరుమల శ్రీవెంకటేశ్వరుని మూల విరాట్టుకు
జరిగే ఈ తోమాలసేవలో పూలదే ప్రధాన పాత్ర... పూల మొక్కల పెంపకం నుంచిఈ పూలని
హారాలుగా కూర్చి స్వామివారికి చేర్చే క్రమంలో ఎందరో తమ వంతు కర్తవ్యాన్ని
నిర్వ హిస్తు... శ్రీవారి పుష్ప సోయగాలను నయనానంద భరితం చేసేలా చేస్తున్న
వారిని ఆంధ్రప్రభ లైఫ్ పలకరించింది. ఆ వివరాలు ఇవి..
క లియుగ
ప్రత్యక్షదైవంగా విశ్వవ్యాప్తంగా భక్తజనులతో కీర్తించ బడుతున్న
శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. అందునా తులసి మాలంటే ఆతనికి మరింత ప్రీతి.
అందుకే తిరుమలలోని వెంక న్న సన్నిథిలోని మూల విరాట మూర్తులకు ఉదయం,
సాయంత్రం రెండు పూటలా తోమాల సేవ ఘనంగా నిర్వహించడం తర తరాలుగా ఆనవాయితీగా
వస్తోంది. భక్త జనులలో చాలా మంది తోమాల సేవ పదం వినటమే కాని చాలా వరకు
అక్కడతంతులు, దాని వెనుక వంద లాది మంది చేస్తున్న కృషి గురించి తెలిసేది
తక్కువే... ఇంతకీ తోమాల సేవంటే తోటల నుండి సేక రించిన మాలలతో స్వామి వారి
ని సేవించడం అని అర్థం. ఈ సేవ కోసం పూదోటల నుండి అనేక రకాల పూలతో పాటు
తులసిని సేకరించి మాలలుగా గుచ్చి... శ్రీనివాసునికి అలంకరించే సేవయే తోమాల
సేవ.
తిరుమల క్షేత్రం కొలువై ఉన్న ఏడుకొండలలో సుగంధ పరిమళాలు
వెదజల్లే పుష్ప జాతులకు,పత్రాలకు కొదువే లేదు.. అందునా ఆ దివ్యమంగళ
మూర్తికి అతి ఇష్ట మైన తులసి, చామం తులు, గన్నేరు, సన్నజాజులు, మొల్లలు,
మొగిలి, కమలం (తామర), కలువ పూలు, గులాబీలు, సంపెంగలు, సుంగంధాలు, కనకాంబ
రం,లాంటి పుష్ప జాతులే కాదు... మరువం, మాచీపత్రం, దవనం, బిలువం పత్రా లు...
స్వామి వారి కైంక ర్యాలలో అవసరమ య్య మామిడా కు లు, తమలపాకు లు, పచ్చి
పసుపు చెట్లు కోకొల్లలు. ఈ గిరులలో స్వామి వారి తోమాల సేవ కోసం ప్రత్యేకంగా
ఓ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల్ని పెంచుతూ... నిత్యం ఇక్కడ నుండి
సేకరించిన అనేక రంగు రంగుల పుష్పాలతో పుష్పకైంకర్యం చేస్తున్నారు.
తోమాల సేవ జరిగే తీరిది...
రోజూ
క్రమం తప్పకుండా రెండు పూటలా శ్రీవారికి పుష్ప కైంకర్యంలో వివిధ పుష్ప
జాతులతో అలంకరించిన పూల మాలలను జియ్యంగార్లు తలపై పెట్టుకుని,
వేదమంత్రోచ్ఛారణలతో మంగ ళ వాయి ద్యాలతో... ఊరేగింప ుగా బయలుదేరి ధ్వజ
స్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి, విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి
సన్నిధిలో సమ ర్పిస్తారు. ఆలా జియ్యంగా ర్లు సమర్పించి ఆదివ్యమంగళా
కారుడికి అలం కరిస్తారు. ప్రతి రోజు జరిగే పుష్ప కైంకర్య కార్య క్రమానికి
సగటున 250 కిలోల పు ష్పాలను వినియోగిస్తుండటం పెద్దవిశేషం. అలా గే ప్రతి
గురువారం శ్రీవారి మూల విరాట్‌కి ఉన్న బంగారు ఆభరణాలు తీసివేసి పూలమాలలతో
విశేషంగా అలంకరిస్తారు. అందుకేఆ కొండల రాయుడు ప్రతి గురువారం భక్తులకు
కొంగ్రొత్త రూపంతో కనువిందు చేసేలా కనిపిస్తాడు. ప్రతి రోజు మూల విరాట్
అలంకరణకు సుమారు 275 అడుగుల పూల మాలలను అలంక రిం పడుతున్నాయి. .
పూలంగిసేవ
ప్రతి
గురువారం రాత్రి స్వామి వారికి నివేదన ముందు పూలంగి సేవను నిర్వహిస్తారు.
సుగంధ పరిమాళిక లతో శ్రీవారికి వస్త్ర రూపముగాను, ఉత్తరీయ రూపముగాను, కిరీట
రూపముగాను, శంఖు చక్ర రూపములుగాను, తిరు మేను అంతయూ పుష్ప మయమగునటుల
అలంకరి స్తారు. సూర్య కరాటి అను ఆసమయంలో పుష్పాలంకృతు డైన స్వామి వారి
దివ్యమంగళ స్పరూపం చూచి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ఈ పూలంగి సేవను,
సేవగానే కాకుండా దర్శనంగాను టిటిడి ఏర్పాటు చేసింది.
పూల తోటలు - నందన వనాలు
ఎంతో
విశిష్టత కలిగిన స్వామి వారి తోమాల సేవ కోసం టిటిడి 175ఎకరాల సువిశాలమైన
ప్రాంగణంలో నందన వనం పూల తోటలను పెంచుతోంది. దీనిని 1959 లో ప్రత్యేకంగా ఓ
విభాగాన్ని ఏర్పాటు చేసింది . 1961లో కేవలం 15 మంది కార్మికులతో ప్రారంభమైన
ఈ పూదోట లు ప్రస్తుతం 825 మంది కార్మికులు స్థాయికి చేరుకుంది. తిరుమల
కొండల్లో నారాయణగిరి గార్డెన్, టిబి గార్డెన్, శంఖుమిట్ట, పద్మావతిపురం,
మాధవరం, ఆలపాటి తోట, దివ్వారామం పూలతోట ఇలా పలు చోట్ల గార్డెన్లు ఏర్పాటు
చేయిటమే కాక పుష్పవర్ధిని పథకంలో 60 ఎకరాలలో సుగంధ పుష్పాల పెంచుతున్నారు.
టన్నుల కొలది పూలు...
టిటిడికి
సాలీనా 40 టన్నుల పుష్పా లు అవసరమవు తాయి. వీటి లో తిరుమలలోని ఆలయా లకు
1,34,578 కేజీలు కాగా, తిరుపతి పరిసర ఆలయాలకు 2,71,000 కేజీల పుష్పాలు అవస
మవుతా యి. ఇందులో 60 శాతం విరాళాల ద్వారా, 30 శాతం, ఉత్పత్తి ద్వారా పది
శాతం కొనుగోలు ద్వారా టిటి డి సమకూర్చుకుంటోంది. సాలీనా 40 లక్షల రూపాయల
విలువ గల పుష్పా లను టిటిడి కొనుగోలు చేస్తు న్నట్లు తెలుస్తోంది. తులసిని
నందన వనంలో పండిస్తారు.
శ్రీవారికి పుష్పాలు సమర్పించి చరిత్రకెక్కిన భక్తులు
శ్రీవారికి
అనేక మంది భక్తులు పుష్పాలు సమర్పించి మోక్షమార్గం పొందినట్లు భక్తుల
విశ్వాసం. ఆ కోవలో తిరుమలనంబి తొలి సారి గా శ్రీవారి సేవలకు కావాల్సిన
పుష్పా ల కోసం ఉద్యా నవనాలు పెంచి మోక్ష సిద్ధి పొందారు. అలాగే అనంతాళ్వారు
శ్రీ వారి కోసం తను పెంచిన పూతోటలో పూసిన పూలనుమాలలుగా కట్టి తీసుకొచ్చి
స్వామివారికి అలంకరించే వారు.ఈ ఉద్యానవనాన్ని నిరంతరాయంగా అభివృద్ధి చేసిన
ఆయన పూల మొక్కలకు కావాల్సిన నీటి కోసం తవ్వించిన చెరువు నేటికీ అనంతాళ్వారు
ట్యాంక్‌గా భాసి ల్లు తోంది. 1053లో జన్మించిన ఆయన 84 ఏళ్లు తిరుమలలో ఉండి
స్వామి సన్నిధిలో పరమపదించారు. నేటికీ స్వామివారి 'యమునాతురై' పుష్పం
కైంకర్యం ఆయన పేరు మీదే జరుగుతుండటం విశేషం. ఇక భక్తాగ్రేసర శిఖామణి తరి
గొండ వెంగమాంబశ్రీవారిని సేవించేందుకు తులసి వనం పెంచి, తులసి మాలలు
సమర్పించి భక్తిని చాటు కొంది.
అన్నింటా పుష్పాలంకరణ...
తిరుమలలో
శ్రీవారికి జరిగే కళ్యా ణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ,
వసంతోత్స వం, పద్మా వతి పరిణ యం, అణి వార ఆస్థానంలో పుష్పపల్లకీ ఇలా
అన్నింటా పుష్పాలంకరణకే పెద్ద పీట. ఇది కాక ఏటా శ్రీ వారికి జరిగే పుష్ప
యాగం కోసం 7 టన్నుల పుష్పాలను నివేదిస్తారు. ఇందులో 18 రకాల ప్రధాన
సాంప్రదాయ పుష్పాలను శ్రీవారు హృదయాన్ని తాకేవరకునివేదన చేసిస్వామి వారిని
పూ లతో ముంచెత్తుతారు. అటు పిమ్మట వాటిని తొలగించి మళ్లిd పుష్పార్చన
చేస్తారు. ఇలా మలయ ప్ప స్వామికి 20 పర్యాయాలు నివేదన జరుగుతుంది.
పూలబావి....
శ్రీవారి
మూల విరాట్టుకు అలంకరింపచేసే పుష్పాలని తొలగించిన తర్వాత వాటిని ఆలయంలో
ఉన్న పూల బావి లో వేస్తారు. భక్తులకు ఇవ్వరు. తిరుచానూరు శ్రీ పద్మావతీ
దేవి పంచమి ఉత్సవాలలో శ్రీవారికి అలంకరించిన పు ష్పాలను సారెగా పంపుతారు. ఆ
ఒక్క రోజు స్వామివారికి అలంకరణ పుష్పాలు బయటకు వస్తాయి. ఇందుకు ఇతిహాస
చరిత్ర ఉంది. శ్రీరంగదాసు అనే భక్తుడు బావిని త్రవ్వి ఆ బావిలోని నీటిని
వాడుతూ శ్రీమహావిష్ణువుని పూజకై సంపెంగ, చామంతులను తోటలో పెంచి పూజ
చేసేవారు. అతని మరణానంతరం మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించగా
ఆతనికి వేంకటేశ్వరుడు కలలో కనిపించి గతజన్మలో నిర్మించిన బావి నేడు శిథి
లమై పోయిందని... ఈ బావిని మళ్లిd పునరుద్ధరించమని ఆదేశించాడని... దీంతో
తొండమానుడు రాతితో బావిని పునరుద్ధరించి దానిద్వారా ఒక రహస్య బిలం ఏర్పాటు
చేసి తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళ్తు..శ్రీ స్వామివారికి
ప్రీతి పాత్రుడైనట్లు చెప్తారు. ఒకనాటి యుద్ధంలో శత్రువులచే తరమబడుతూ
తప్పించు కొన్న తొండమానుడు ఏకాంత సమయంలో ఆలయ ప్రవేశం చేశాడని ఆసమయం లో
శ్రీదేవి సిగ్గుతో శ్రీనివాసుని వక్ష స్థలంలో భూదేవి బావిలో దాక్కుందని
వేంకటా చల మహాత్యంలో తెలియచేస్తుంది. శ్రీ రామానుజుల వారు తిరుమల
సందర్శించినపుడు తొలగించిన పూలను భూదేవి నివసిస్తున్న బావిలో వేయమని ఆదేశిం
చారు. అప్పటి నుంచి శ్రీవారికి అలంకరించిన పూలను బావిలో వేస్తారు. అందుకే ఆ
బావికి పూల బావి అని పేరు వచ్చింది. తిరుమలలో పూచిన పుష్పాలన్నీ స్వామి
వారి కైంకర్యాలకే. అందుకే తిరుమలలో పూలు పెట్టుకోరాదు అని టిటిడి ప్రకటనలను
గుప్పిస్తుంది. తిరుమల క్షేత్రం ఫల పుష్పాలతో నందనవనంగా విరాజిల్లుతుంది.
పూలని కట్టడం కూడా ఓ కళే...
గత
జన్మలో పుణ్యఫలం నేటికి శుభప్రదం అవుతోందన్నది పూలు కట్టే ప్రతి ఒక్కరి
సమాధానం... ఇంతకంటే భాగ్యం మరొకటి లేదన్న ఆత్మ సంతృప్తి అందరి కళ్లలో
కనిపిస్తుంది. ఇక ఉత్సవ సమయంలో నిపుణులు ఆకృతులలో పూల ను అమర్చి అవి
వాడిపోకుండా శ్రద్ద వహిస్తారు. అత్యంత సువాస నలు వెదజల్లే 'మసిలం' పుష్పాలు
అలంకరణలో ఓ ప్రత్యేక ఆకర్షణ.
అంతా స్వామి వారిదే
తిరుమలలో ఉన్న పశుక్షాదులు, వృక్షసంపద, లతలు అన్నీ కూడా స్వామి వారికి చెందుతాయి.
పుష్పాలన్నీ
స్వామి వారికైంకర్యానికే నివేదింప బడాలి అంచేత తిరుమలలో తలలో పూలు
పెట్టుకోరాదని తిరుమలలో వివా హం చేసుకొనే వధూవరులకు పూలమాలలు అలంకరింప చేయ
రని, దానికి ప్రత్నామ్నాయంగా ఇతర దండలు వినియోగిస్తారు. తిరుమలను సుందర
నందన వనంగా రూపు దిద్దేందుకు పూల తోటలలోని పూలని స్వామి వారికి అలంకరణకు ,
కైంకర్యాలకు మాత్రమే వినియోగించాలి. భక్తులు ఈ విషయంతో దేవస్థానంతో
సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
- రమణ దీక్షితులు ప్రధానర్చకులు,తిరుమల తిరుపతి దేవస్థానం
శ్రీ వారికి అలంకరించే పూలు కట్టడం మా అదృష్టం
ప్రతి
నిత్యం చెన్నయ్, శ్రీరంగం, గోవా, ఉడిపి, బెంగళూ రు నుంచి తిరుమలకు పూలు
చేరుకుంటాయి. 40 మంది కార్మికులు స్వామివారికి మాలలు అలంకరించడంలో
నిమగ్నమైపోతారు. స్వామివారికి వివిధ కొలతలలో పూ ల మాలలను సిద్ధం చేస్తారు.
వాటిని బుట్టలలో నింపి ఆల యానికి పంపుతాం. స్వామి వారి సన్నిధిలో పనిచేయడం
ఒక వరమైతే, పూలు కట్టడం, కట్టిన పూలమాలలు స్వామి వారికి సమర్పించడం
పూర్వజన్మ సుకృతంశ్రీవారి కరసేవ కులు కట్టిన మాలలు కొలతలకు తగ్గట్టు
సరిచేసి పంపడం తమ బాధ్యత డోనర్‌ల నుంచి వచ్చిన పూల మాలలు సిబ్బందిచే
జాగ్రత్తగా పరిశీలించి, వాటిని కొలతల ప్రకారం సరి చేయించి నిర్ణీత సమయానికి
శ్రీవారి సన్నిధికి పంపడం తమ బాధ్యత.
రామమూర్తి, పూల మాలల పర్యవేక్షకుడు
శ్రీవారికి అలంకరింపబడే మాలలు ఇవి
శిఖామణి : కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే దండను శిఖామణి అని పిలుస్తారు. ఇది ఎనిమిది మూరల దండ.
సాలిగ్రామ
మాల : శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతున్న సాలిగ్రామాల
మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన మాలలు. ఇవి రెండు మాలలు,
ఒక్కొక్కటి నాలుగు మూరలు.
కంఠసరి : మెడలో రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ. ఒకటి మూడున్నర మూరలు.
వక్షస్థల లక్ష్మీ : శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవిలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.
శంఖుచక్రం : శంఖు చక్రాలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక మూర.
కఠారి సరం : శ్రీవారి బొడ్డున వున్న నందక ఖడ్గానికి అలంకరింపబడే దండ. ఒకటి రెండు మూరలు.
తావళములు
: రెండు మోచేతుల క్రింద, నడుము నుండి మోకాళ్ల పై హారాలుగా మోకాళ్ల నుంచి
పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే మూడు దండలు. ఇవి అన్ని కలిపి పది మూరలు.
తిరువది దండలు : శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర.
ఇవిగాక
ఉత్సవ మూర్తులు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువ శ్రీనివాసమూర్తి, శ్రీదేవి,
భూదేవి, మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సహిత ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీ
సీతా రామ లక్ష్మణులు, శ్రీ రుక్మిణీ కృష్ణులకు, చక్రత్తాళ్వారులకు, అనంత,
గరుడ, విశ్వక్సేనులకు, సుగ్రీవ, హనుమంతు, ఆగంధులకు ఆలయంలో ఉన్న ద్వార
పాలకులు, పరివార దేవతలకు, తిరుమలలో వేంచేసి ఉన్న బేఢీ ఆంజనేయస్వామి, వరాహ
స్వామితోపాటు ఇతర ఆలయాలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పుష్ప కైంకర్యం
జరుగుతుంది.
ఇంతటి భాగ్యం ఎందరికి దక్కుతుంది?
నేను
కట్టిన పూలు స్వామి పూలు వారికి అలంకరించడం గత జన్మలో నేను చేసుకున్న
పుణ్య ఫలమనే నానమ్మకం... ప్రతి రోజు ఉదయం 8.00గంటలు నుండి సాయంత్రం 4.00
గంటల వరకు స్వామి వారికి పూల మాలలు కూర్చటంలో నిమగ్నమైపోతా.. మాలలు కట్టే
సమయంలో శ్రమ తెలియడం లేదని, ఇది స్వామి వారి కృపే... ఇంతటి మహత్ భాగ్యం
ఎందరికి దక్కుతుంది?
- వై. రామసుబ్బమ్మ, టిటిడి ఉద్యోగిని
బ్రహ్మోత్సవాలలో పుష్ప నివేదనలే
స్వామివారికి
జరిగే ఏటా బ్రహ్మోత్సవాల కోసం 40 టన్నులకు పైగా పుష్పాలను వినియోగిస్తారు.
ఇందులో 16 నుంచి 18 రకాల పుష్పాలను స్వామివారి అలంకరణకు వాడుతున్నట్లు
ఉద్యా నవన శాఖ అధికారులు చెప్పారు. ఇందులో కృత, త్రేత, ద్వాపర యుగాలలో
స్వామివారి అవతా రాలను, సప్తద్వారాలు, ఉత్సవాలలో ప్రతిరూపాలను పు ష్పాలతో
అలంకరించి భక్తులకు కన్నుల పండుగ గావిస్తుంది. ఇందుకోసం నాలుగు వందల మంది
గార్డెన్ సిబ్బంది ఎంతో శ్రమించి తమ కళానైపుణ్యాన్ని చాటు కుంటారు. ఇక ఏటా
శ్రీవారికి మూడు రోజుల పాటు జరిగే పద్మావతీ పరిణయానికి పుష్ప సోయగాలే
ప్రధాన ఆకర్షణ.