26, అక్టోబర్ 2010, మంగళవారం
బాబు ఇంటి ముందు కాంగ్రెసు ధర్నా!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖను ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెసు సారథ్య బృందం ప్రయత్నాలు చేస్తుంది. మూడు రోజులుగా చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే ఆయన ఇంటిముందు సోమవారం వారు ధర్నా చేస్తామని చెప్పారు.ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను బట్టి తాము తమ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలంగాణ కాంగ్రెసు సారథ్య బృందం చెబుతోంది.
ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఏఐసిసి అధ్యక్షురాలు, ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసే సమయంలోనే తాము చంద్రబాబునాయుడికి హైదరాబాద్ లో తెలంగాణ కోసం విజ్ఞప్తి చేస్తామని సారథ్య బృందం ఇటీవలే ప్రకటించింది.