13, నవంబర్ 2010, శనివారం

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి మృతి


అమెరికా రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన యువతి మృతి చెందింది. మరో యువతికి గాయాలయ్యాయి. గత రాత్రి వీరి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిద్దరూ సికింద్రాబాద్‌కు జనరల్‌ బజార్‌కు చెందిన వ్యాపారి కవల అక్కాచెల్లెళ్లు అర్చన, అర్పణగా వీరిని గుర్తించారు.

బీఫార్మసీ పూర్తి చేసి వీరు ఎమ్మెస్‌ చదివేందుకు అమెరికాలోని నాస్విల్‌టెన్నిస్‌కు రెండేళ్లక్రితం వెళ్లారు. ఈ డిసెంబర్‌లో చదువు పూర్తవుతుంది. ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంతో కవలల ఇంట విషాదం చోటు చేసుకొంది... వార్త తెలిసాక జనరల్‌ బజార్లోని పలువురు వ్యాపారులు షాప్స్ స్వచంద్మ్గా మూసివేసి సంతాపం ప్రకటించారు.

కేసీఆర్‌ను విమర్శిస్తే నరికి చంపుతాం

కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు విమర్శిస్తే నరికి చంపుతామంటూ మాజీ ఎమ్మెల్సీ రహమాన్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. దీనిపై రహమాన్‌ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే పది మంది టీం హైదరాబాద్‌ బయలుదేరిందని పోన్‌చేసిన అగంతకులు తనతో అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసీఆర్‌ను విమర్శిస్తే చంపుతామని, బాడీని పది ముక్కలు చేసి పది చోట్ల పడేస్తామని, ఇలాంటి తాటకు చప్పుళ్ళకు బెదిరేది లేదని, ఒకవేళ తనకు ఏదైనా జరిగితే కేసీఆర్‌ కుటుంబం బాధ్యత వహించాల్సి వస్తుందని తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, అలాగని దొరల తెలంగాణను తాను సమర్థించనని రహమాన్‌ అన్నారు.

నిజామాబాద్‌లోని మూడు కాయిన్‌ బాక్స్‌లనుంచి ఈ కాల్స్‌ వచ్చినటుల సమాచారం.

కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల అక్రమ సంబంధం బయట పడింది

తెలంగాణ ఉద్యమం కోసం 600 మంది చనిపోయారని చెప్పే కేసీఆర్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కాకుండా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనడం చూస్తుంటే.. అధికార పార్టీ నుంచి కోట్లాది రూపాయల ముడుపులు అందుకున్నట్లు స్పష్టమవుతుందni టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌లు ఆరోపించారు

కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ కార్యాలయం బ్రాంచి ఆఫీస్‌గా ఏర్పాటు చేసినట్లు స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్లాది రూపాయల ముడుపులు అందుకోవడమే గాక తన ఆస్తులను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రకటించారని కేసీఆర్ అసలు రంగు, నిజ స్వరూపం బయట పడ్డాయన్నారు.

కేసీ ఆర్ మాటలతో కాంగ్రెస్, టీ ఆర్ ఎస్‌కు అక్రమ సంబంధం ఉన్నట్లు తేటతెల్లమైందని,. తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్ అని పదే పదే వ్యాఖ్యానించే కేసీ ఆర్ టీడీపీని, చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేకు కల్పిస్తున్న భద్రత ఎంత?

నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేకు కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన వివరాలను సమాచార చట్టం కింద వెల్లడించడానికి గల అభ్యంతరాలు ఏమిటని హైకోర్టు ప్రభుత్వ0ని ప్రశ్నించింది. చిత్తూరు ఎమ్మెల్యే సీ.కే. బాబుకు నేరచరిత్ర ఉందని, ఆయనపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయనకు కల్పించిన భద్రతపై సమీక్ష జరపాలంటూ దాఖలయిన ఓ పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విచారిస్తూ వివరాలు ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నారని ... ప్రశ్నించారు.

గన్‌మ్యాన్‌లను దుర్వినియోగం చేస్తున్న సీకే బాబుకు కల్పించిన భద్రతకు సంబంధించిన వివరాలను ఆర్‌టిఐ యాక్టు కింద కోరితే అధికారులు తిరస్కరించ దమేంతని నిలదీస్తూ... అన్ని వివరాలు సోమవారంలోగా అందించాలని కేసు విచారణను వాయిదా వేశారు.

వరంగల్‌ టీఆర్‌ఎస్‌ సభకు ముంబై నుంది భారీగా వస్తాం

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో జరుగుతున్న ఉద్యమానికి ముంబై ప్రజలు నైతిక మద్దతు పలకాలని టీఆర్‌ఎస్ ముంబైశాఖ అధ్యక్షుడు బి. హేమంత్‌కుమార్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు అధిక సంఖ్యలో తెలంగాణవాదులు హాజరు కావాలన్నారు.

ముంబై తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి తో పాటు 119 మంది టీఆర్‌ఎస్‌లో చేరారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో తము కుడా భాగస్వాములవుతామని తెలిపారు.

నన్ను చంపేందుకు కుట్ర : అదుర్స్ నిర్మాత ఆందోళన

మద్దెలచెరువు సూరితో, కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ చేతులు కలిపి నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. సూరి అనుచరులతో రెక్కీ నిర్వహించారు' అని వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్య లు విజయ వాడలో కలకలం సృష్టిం చాయి

పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఈయన విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. 2004 తరు వాత కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే పరిటాల రవీం ద్ర రాజ గురువు మాలపాటి వెంకటేశ్వరరావు, మరో ముఖ్య అనుచరుడు తగరకుంట ప్రభాకర్ వరుస హత్యలు జరిగాయి. వారి హత్యలతో పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుల్లో ఒకింత అభద్రతా భావం నెలకొనడంతో సందేహం లేదు.

. రవి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడిగా అభి యోగాలు ఎదుర్కొంటున్న మద్దెల చెరువు సూరి కారు బాంబు కేసులో జైలు శిక్ష పడి కొన్ని నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు... ఈ క్రమం లో పరిటాలను కాల్చి చంపినమొద్దు శీను హత్యకేసు నిందితుడు ఓంప్రకాష్ తొలుత తానే ఆ హత్య చేశానని ఒప్పుకున్నా ఆ తరువాత తనకు సంబంధం లేదని దివం గత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, సూరీలే మొద్దుశీనును హత్య చేయించి తనను అన్యాయంగా ఆ కేసులో ఇరికించారని ఆక్రోశం వెళ్లగక్కాడు.

. ఈ నేపథ్యంలో వంశీ తాజాగా మద్దెలచెరువు సూరిపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి

కేసీఆర్ ని చరిత్రహినుడిగా చూస్తారు

టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావ్ కాంగ్రెస్‌కు తొత్తుగా మారి తెలంగాణ సాధన విషయంలో వెన్నుపోటు పొడుస్తున్నారని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్ అన్నారు.

కాంగ్రెస్ పా ర్టీకి ఎజెంట్‌గా మారి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానంటే చంద్రబాబు అ డ్డుపడుతున్నాడని అనడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని దుయ్యబట్టారు. కేసీఆర్ తాను వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చేప్పాలని, లేదంటే తెలంగాణ ప్రజలు ఆయనను చరిత్రహినుడి గా చూస్తారని అన్నారు.

ఉద్యమం పేరుతో కోట్లు కూడబెట్టిన కేసీఆర్

టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని పాలకుర్తి ఎమ్మెల్యే టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు..ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వ హోమంత్రి చిదంబరంతో చర్చలు జరుపడానికి వెళ్లిన సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక రోజు మొత్తం కనిపించకుండా ఢిల్లీలో కనుమరుగయ్యాడని, ఆరోజే అనుమానం కలిగిందన్నారు.

ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకుంటోందni తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పూనుకోకముందే కేసీఆర్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నాడన్నారు.తెలంగాణ మేధావులు, విద్యార్థులు ఇప్పటికైనా వాస్తవాలను గమనించాలని దయాకర్‌రావు అన్నారు.

రోడ్డెక్కిన రోశయ్య

సాక్షాత్తూ సీఎం రోశయ్యే రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతంలో ధర్నా జరిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తరఫున పనిచేస్తున్నారని ఆరెస్సెస్ మాజీ అధినేత సుదర్శన్ ఇటీవల విమర్శి 0చినందుకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రే బషీర్‌బాగ్ కూడలిలో అమాలులో ఉన్న సెక్షన్‌ను ఉల్లంఘించి ధర్నాలో పాల్గొన్నారు.

'పీసీసీ ధర్నాలో సీఎం రోశయ్య ప్రసంగిస్తూ.. సోనియాకు సంఘీభావం తెలిపేందుకు తానూ ధర్నాలో పాల్గొన్నట్లు చెప్పారు. సోనియా త్యాగాలు వెలకట్టలేనివి. ప్రధాని పదవిని ప్రజలు రెండు సార్లు చేతిలో పెట్టినా.. ఆమె వద్దన్నారు. ప్రజల కోసం కష్టపడతానంటూ ప్రధాని పదవినే త్యాగం చేసిన సోనియాను విమర్శించడం సరికాదు. సుదర్శన్ తక్షణం బహిరంగక్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.