26, జూన్ 2011, ఆదివారం

జూ. ఎన్టీఆర్‌ మీద సిల్లి కామెంట్స్‌, సెంటిమెంట్స్‌

సినీ పరిశ్రమలో సిల్లిd కామెంట్స్‌, సెంటిమెంట్స్‌ మామూలుగా వుండేవే.
జూ. ఎన్టీఆర్‌ మీద ఈ మధ్యకాలంలో ఓ కామెంట్‌ మొగ్గ తొడిగింది. ఎన్టీఆర్‌ ప్రక్కన నటించిన హీరోయిన్‌ కెరీర్‌ గల్లంతు కావడమో లేక ఒడిదుడుకులకు లోను కావడం జరుగుతుందని. ఆలోచిస్తే....
'స్టూడెంట్‌ నెం.1' సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌ గజాలా కెరీర్‌లో ఒడిదుడుకులు ప్రారంభమైయాయి. 'అల్లరి రాముడు' రిలీజ్‌కు గజాలా దాదాపు కనుమరగు అయింది.
'ఆది' సూపర్‌హిట్‌. అందులో నటించిన హీరోయిన్‌ కీర్తీచావ్లా కెరీర్‌ ఫట్‌మంది.
'సింహాద్రి' హిట్‌. ఇందులో రెండో హీరోయిన్‌గా నటించి అంకిత 'చీమచీమ' అంటు యువ హృదయాలను కొల్లగొట్టింది. ఆమె కెరీర్‌ కూడా అంతే.
'రాఖీ'తో చార్మికి కాస్త ఒడిదుడుకులు.
'యమదొంగ' సూపర్‌హిట్‌. యమదొంగలో నటించిన రెండో హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ కెరీర్‌ అంతంత మాత్రంగానే వుంది.
'కంత్రి' సూపర్‌హిట్‌. ఈ సినిమా హీరోయిన్‌ హన్సిక తమిళనాడులో సెటిలయింది, వెంటనే కాదనుకోండి.
'అదుర్స్‌'లో నయనతార, షీలా నటించారు. నయనతారకు వివాదాలు. షీలా ఏం చేస్తోందో!
'ఏ మాయ చేసావే' రిలీజ్‌తో సమంత సినిమా ఇండస్ట్రీకి, యువ హృదయాలకు కలల రాణి అయింది. ఇంటర్నెట్లో అయితే ఆమె ఫొటోలు, క్లిప్పింగ్స్‌ ఎన్ని డౌన్‌లోడ్‌ అయ్యాయో లెక్కలేదు.
బృందావనంలో రెండో హీరోయిన్‌గా నటించింది. కథలు వింటున్నాను అంటోంది. అంతే. టాలీవుడ్‌లో ఆమె కెరీర్‌ గల్లంతు అయ్యే సమయంలో 'దూకుడు'లో అవకాశం వచ్చింది.
సిల్లిdకామెంట్స్‌ అని వదిలేద్దాం!

ముఖం చాటేసిన మేఘం

ఆరుగాలం శ్రమించి పండిస్తే ధర ఉండదు. అయినా ప్రత్యామ్నాయం లేక రైతు వ్యవసాయాన్నే నమ్ముకుంటాడు. కష్టనష్టాలు ఎదురవుతున్నా మరో పని చేయలేక.. చేతకాక అన్నదాత భూమాతనే నమ్ముకుంటాడు. ఏటేటా.. ప్రతీ సీజనులోనూ ఎదురుదెబ్బ లు తగులుతూనే ఉన్నా.. నష్టాల గాయాలను మాన్పుకుని మళ్లీ కష్టాలసాగుకు సమాయత్తమవుతాడు రైతన్న. అయితే ఈ ఖరీఫ్ సీజనులో మేఘాలు ముఖం చాటేశాయి. వర్షం వస్తుందన్న ఆశతో సాగుకు సమాయత్తమైన అన్నదాత విత్తనాలను చల్లాడు. మండుతున్న ఎండలకు ఆ విత్తనాలు మొలకెత్తకుండా ఎండిపోతున్నాయి. దీంతో మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేయాల్సి వస్తోంది. ధాన్యం ధర బాగా లేదని నేతల్ని నిందించినా.. క్రాప్ హాలిడే అంటూ ఆగ్రహించినా..

మట్టితో విడదీయలేని బంధం రైతన్నది. గడచిన సీజనులో కష్టనష్టాలను ఇంకా మరువకముందే ఖరీఫ్‌కి సన్నద్ధమైన రైతన్నకు అప్పుడే కష్టాలు ఆరంభమయ్యాయి. జూన్ తొలి వారంలో రావాల్సిన రుతుపవనాలు రెండోవారంలోనూ దోబూచులాడాయి. రుతుపవనాల ప్రభావం లేకపోయినా రెండు, మూడు వారాల్లో జిల్లాలో అక్కడక్కడా అడపాదడపా వర్షాలు కురిశాయి. జూన్ రెండో వారం లో వచ్చే వర్షాలతో వ్యవసాయం ఆరంభిస్తారు. రెండు, మూడు వారాల నాటికి వ్యవసాయ పనులు బిజీగా ఉంటాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ సందడి కానరావడంలేదు.

తెలంగా ణ పట్ల నాన్చుడు ధోరణి

ఆదిలాబాద్ ని యోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేణుగోపాల చారిలు పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తుంటే మీరు తెలంగా ణ పట్ల నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమించాలని బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే గెడెం నగేష్‌ను   లింగి గ్రామస్థులు అడ్డుకున్నారు
తెలంగా ణ కోసం ఎందరో ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే పదవులను పట్టుకుని పాకులాడడం స మంజసం కాదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు గల్లీలో ఒకమాట, ఢిల్లీలో మరోమాట మాట్లాడుతూ తెలంగాణ నాలుగు కో ట్ల ప్రజలను మోసం చేస్తున్నారని వా రు విమర్శించారు.

కట్నంతో వరుడు పరారీ



గుంటూరు: మరికొద్ది సేపట్లో ముహూర్తం. తెల్లారితే పెళ్ళితంతు మొదలు. తీరా చూస్తే ఏముంది? పెళ్ళికొడుకు లేచిపోయాడు. కట్నం డబ్బు తీసుకుని ఉడాయించాడు. గుంటూరు ఆనందనగర్‌లో ఆదివారం ఉదయం పది గంటలకు వివాహం జరగాల్సి వుండగా వరుడు ఇర్ఫాన్ రూ.లక్ష కట్నం డబ్బుతో సహా పరారయ్యాడు. పెళ్ళికుమార్తె తనకు నచ్చలేదంటూ వంకలుపెట్టి వెళ్లిపోయాడు. దీనితో మనస్తాపం చెందిన పెళ్ళికుమార్తె ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే సకాలంలో స్పందించిన స్థానికులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ వరుడి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు