7, ఏప్రిల్ 2011, గురువారం

ధర్మాన కుటుంబంలో జగన్ చిచ్చు

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తన కుటుంబమంతా కృషి చేస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. తాను తన సోదరులకు, కుటుంబానికి దూరమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుందని.తన సోదరుడు ధర్మాన ప్రసాద రావు మంత్రి గా కాంగ్రెస్స్ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తాను  రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయకూడదని లేదు కదా అని ఎదురు ప్రశ్నించారు. 
సోనియా తన కుటుంబంలో చిచు పెట్టిందని చేప్తున్న జగన్ ధర్మాన కుటుంబంలోనూ అదేపని చేశాడంటూ వస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు.  తామంతా ఐకమత్యంగానే ఉన్నామని, ఉంటామని ..రాజకీయంగా ఎవరి మార్గం వారు ఎంచుకున్నంత మాత్రాన ఈ విధమైన ప్రచారాలు చేయడం కొంతమందికి తగదన్నారు.. రాజకీయాలు మధ్యలో వచ్చాయని, రాజకీయాల కంటే ముందు రక్త సంబంధం, అనుబంధం ఉన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు..ప్రస్తుతం తానూ కాంగ్రెస్లో ఉన్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేరుగా చేరి పార్టీ అభివృద్ధికి దోహద పడాలంటూ తనకు తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని, జిల్లా నలుమూలల నుంచి నాయకులు వచ్చి స్వాగతిస్తున్నట్లు కృష్ణదాస్ చెప్పారు.




రానున్న రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే

రానున్న రోజులు జగన్ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవేనని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. అధికార కాంగ్రెస్, ఇతర పార్టీలతో ప్రజలు విసిగి పోయార ని . కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రతి పక్షాల చేతకాని తనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని దీంతో రాష్ట్ర ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చూస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టిన పథకాలు సక్రమంగా అమలు కావాలంటే తమ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు.

కాంగ్రెస్ హామీని మరచిపోయింది

ఇచ్చిన హామీలను విస్మరించి, విద్యుత్ చార్జీలను పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పి.అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. 2014 వరకు విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మరచిపోయిందని దుయ్యబట్టారు. సేవాపరమైన సమస్యలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం చార్జీల పెంపుతో మరింత ఇక్కట్లపాలు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో వర్షాభావ పరిస్థితుల్లోనూ సక్రమంగా విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తెరగాలని అశోక్ చెప్పారు.


విపరీత, వికార బుద్ధిలా ఉంది

 ప్రపంచకప్ విజయంతో కోట్లాది మంది భారతీయుల్లో ఉల్లాసం, ఉత్సాహం తొణికిసలాడుతోందని బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ తెలిపారు. దేశప్రజలందరినీ ఏకతాటిపైకి తేవటంలో క్రికెట్‌ను, సినిమాను మించింది మరొకటి లేదని తన బ్లాగ్‌లో  పేర్కొన్నారు.   కోట్లాది ప్రజలను రంజింపజేశారు..కానీ వారం రోజుల్లోపే వారి ప్రవర్తనలో రానున్న విచిత్ర మార్పు తనకెందుకో విపరీత, వికార బుద్ధిలా అనిపిస్తోందని అసంతృప్తి వెలిబుచ్చారు.

దీనికంతటికీ అసలు కారణం శుక్రవారం ప్రారంభంకానున్న ఐపీఎల్ నాలుగో సీజన్  టోర్నమెంట్‌లో భారత క్రికెటర్లందరూ ఒకే జట్టుకు ఆడకుండా వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తూ పోరాడుకోవటం అమితాబ్‌కు అస్సలు నచ్చలేదు. అందుకే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు

ఖాకీల చేతిలో ప్రశాంత నిలయం బందీ

ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తి ప్రస్తుతం ఖాకీ వలయంలో చిక్కుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా పుట్టపర్తిలో భారీగా పోలీసులను మోహరించారు. ఎటుచూసినా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలను అనుమతించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా సోదాలు చేస్తున్నారు. దీంతో ప్రేమను పంచే ప్రశాంతి నిలయానికి పోలీసుల సంకెళ్లేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ప్రస్తుతం పుట్టపర్తిలో ప ది మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది దాకా ఎస్‌ఐలు, సుమారు 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో? పోలీసులు అతిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో? దీన్ని ప్రభుత్వం ఎం దుకు ప్రోత్సహిస్తోందో? అంతుచిక్కడం లేదని భక్తులు వాపోతున్నారు.





చేవెళ్ల అంటూ కోట్లు నోక్కేసారు

ప్రాణహిత-చేవెళ్ల ప్రా జెక్టు పేరుతో కాంగ్రెస్ నాయకులు, సంబంధిత కాంట్రాక్టర్ భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఎ మ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి ఆరోపిం చారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే సర్వే పేరుతో రూ. వెయ్యి కోట్లు మెక్కారని, మరో రూ.250 కోట్లు నొక్కేయడానికి పైరవీలు చేస్తున్నారన్నారు. టెండర్ పూర్తయి ఆరు సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదని పే ర్కొన్నారు. రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సాగునీరు అందిస్తామని శంకుస్థాపనలు చేశారే తప్ప ఒరిగిందేమీ లేదన్నారు.