5, ఏప్రిల్ 2011, మంగళవారం

లిమిటెడ్ కంపెనీగా టీఆర్‌ఎస్

టీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎంపీ రమేశ్‌రాథోడ్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని .. . ఉద్యమాన్ని కొన్ని పార్టీల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని...టీఆర్‌ఎస్ పై విరుచుకు పడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని.. వీరిని తెలంగాణా ద్రోహులని ప్రకటించి హడావిడి చేసిన కే సి ఆర్ ఇప్పుడు మౌనంగా.. ఉండటం వెనుక ఒప్పందాలు జరిగి ఉంటాయని విమర్శించారు.

కేసీఆర్ కాళ్లు మొక్కి ఆ పని చేయిస్తా

కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామంటే, కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా ఆ పని చేయిస్తానని... తెల్లారేపాటికి తెలంగాణ ఇస్తారా అంటూ కాంగ్రెస్‌కు ప్రజా ఫ్రంట్ కన్వీనర్ గద్దర్ సవాల్ విసిరారు. కాంగ్రెసోళ్లు తెలంగాణను తేలేకపోయారు... ఐక్యంగా పోరాడి రాష్ట్రం సాధించుకుందాం రండని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణకమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయం హింసను ప్రేరేపించే విధంగా ఉన్నదని, రాజకీయ పార్టీలు డెడ్‌లైన్లు పెట్టడాన్ని ఆయన విమర్శిస్తూ, అన్నింటికి పరిష్కారం స్వపరిపాలనే అన్నారు.



సత్య సాయి ఆరోగ్య పరిస్థితిపై సిఎం సమీక్ష

సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వ హించారు. మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు అయ్యారు. కాగా ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుట్టపర్తి పర్యటన కు వెళ్ళాల్సి ఉండగా... అది ఇంకా ఖరారు కాలేదు.

బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగు

సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై ఆయన తాజా బులిటెన్ విడుదల చేశారు.

బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు... హార్ట్ బీట్, బీపీ నార్మల్‌ గానే ఉన్నట్లు వెల్లడించారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ..ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని ఆయన తెలిపారు.