17, నవంబర్ 2010, బుధవారం

తెహల్కాకు ఐపిఐ అవార్డు

పత్రికా రంగంలో ఈ ఏడాది కనబరిచిన విశిష్ట సేవలకు గుర్తింపుగా తెహల్కా వారపత్రికకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ ఇన్‌స్టిట్యూట్‌- ఇండియా (ఐపిఐ) అవార్డు లభించింది. ఈ అవార్డు కింద రెండు లక్షల నగదు బహుమతితో పాటు ఒక ట్రోఫీని, జ్ఞాపికను విజేతకు అందచేస్తారు.

మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎఎస్‌ ఆనంద్‌ నేతృత్వంలోని ఈ అవార్డు ఎంపిక జూరీలో హిందూ పత్రిక సంపాదకుడు ఎన్‌ రవి, మళయాళ మనోరమ మేనేజింగ్‌ ఎడిటర్‌ ఫిలిప్‌ మాథ్యూ, పిటిఐ ప్రధాన సంపాదకుడు ఎంకె రజ్దాన్‌, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక సంపాదకుడు టిఎన్‌ నైనన్‌ సభ్యులుగా వున్నారు. ఈ అవార్డును వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో అందజేయనున్నారు.

బిగ్‌బాస్‌, రాఖీ లపై కేంద్రం ఆగ్రహం

రియాల్టీ షోలను ప్రభుత్వం నిషేధించాలని ప్రజాసంఘాలు ఇప్పటికే డిమాండ్‌ చేస్తున్న నేపద్యంలో... బిగ్‌బాస్‌-4, రాఖీ ఇన్సాఫ్‌ రియాల్టి షో లు పేరుతొ బహిరంగంగా అశ్లీల దృశ్యాలు, మాటలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి షోలను రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇటీవల రాఖీ ఇన్సాఫ్‌ కార్యక్రమంలో రాఖీసావంత్‌ ఓ పార్టీసిపేంట్‌ను నపుంసకుడు అని తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే... అలాగే ఎస్ ఎస్ మ్యూజిక్ టివి ప్రసారలపైనా వారం రోజులు బాన్ విధించిది

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన విద్యార్థులు

ఎసై్స రాతపరీక్షను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఓయూలో ముగ్గురు విద్యార్థులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిచకపోతే పైనుంచి దూకుతామని బెదిరిస్తున్నారు.

ఇదిలా ఉండగా...ఇదే అంశంపై పలువురు తెలంగాణ వాదులతో సమావేశమయి చర్చించారు. పరీక్ష వాయిదాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సబిత వెల్లడించారు. అన్ని విషయాలు సిఎంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కరుణానిధి చేతుల మీదుగా "జెమిని" జీవిత చరిత్ర

ఐదు దశాబ్దాలపాటు తమిళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన ప్రఖ్యాత తమిళ నటుడు జెమిని గణేషన్ 90 వ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని జీవిత చరిత్రను పుస్తక, డివిడీ రూపంలో ఆవిష్కరించనున్నట్టు జెమిని గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

నవంబర్ 21 తేదిన ముఖ్యమంత్రి కరుణానిధి చేతుల మీదుగా జెమిని గణేషన్ జీవిత చరిత్రను పుస్తకాన్ని
ఆవిష్కరిస్తుండగా... తొలి ప్రతిని ప్రముఖ సినీ రచయితలు వాలీ, వైరముత్తులు అందుకోనున్నారు. అలాగే
జెమిని తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు అందించిన సేవల్ని పొందు పరిచిన డీవీడీ తొలి కాపీని ప్రముఖ దర్శకుడు బాలచందర్ స్వీకరించనున్నారు.

తమిళ, తెలుగు, హిందీ, మళయాళ, కన్నడ భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించిన జెమినీ మార్చి 22, 2005 సంవత్సరంలో కన్నుమూసిన విషయం విదితమే

23వ తేదీలోగా ఓటరుగా నమోదు కండి

కొత్త ఓట్ల నమోదుకు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రా ష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 1నాటికి 18 ఏళ్ళ వయస్సు నిండిన యువతీయువకులు ఈ ఓట్లు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఓట్లు నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుందన్నారు. ఫారం-6ను పూర్తి చేసి ఫొటోలతో కొత్త ఓటుకు దరఖా స్తు చేసుకోవాలన్నారు. గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన వారు పేర్లను తొలగి స్తారని అన్నారు. ఓటర్లు జాబితాలో పేర్లు ఉండి ఫొటోలు లేకపోయిన, ఫొటోలు ఉండి పేర్లు లేకపోయినా? నమోదు చేసుకోవచ్చని... పేర్లు నమోదు సరిచేసుకునేందుకు ఫారం-8ను పూర్తి చేసి అధించాలన్నారు.

పోలవరంతో గోదావరి జిల్లాలకు ప్రమాదం

150 అడుగుల ఎత్తుతో పోలవరం వద్ద నిర్మించతలపెట్టిన మట్టి కట్ట వల్ల ఉభయగోదావరి జిల్లాలకు ప్రమాదం పొంచి ఉందంటూ ..డ్యామ్ నిర్మించకుండా కాల్వలు తవ్వడం వల్ల కాంట్రాక్టర్లు లాభపడ్డారని.... కాంగ్రెస్ పార్టీకి చెందిన అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ లేవదీసిన వివాదం చిలికిచిలికి గాలివానలా మారే పరిస్థితి కన్పిస్తోంది.

రెండు లక్షల మంది గిరిజనులు ఈ ప్రాజెక్టు ముంపుతో నిర్వాసితులవుతున్నారని.. వారందరికీ మె రుగైన పునరావాసం కల్పించాలంటూ హర్షకుమార్ డిమాండ్ చేయటం.. చర్చకు తెరలేపడమీ కాక... పోలవరానికి ప్రస్తుతం తలపెట్టిన నిర్మాణానికి ప్రత్యామ్నాయాలు ఉన్నావాటిపై దృష్టి సారించలేదని ...ప్రస్తుత డిజైన్ మార్చి నిర్మాణం చేపట్టకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించ డం చర్చనీయంసమవుతొన్ది .

బాబు పర్యటనకు అడ్డొస్తే సహించం

తెలంగాణ జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు అడ్డొస్తే సహించేది లేదని, టీఆర్‌ఎస్ శ్రేణులను ఎదిరిస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంపీ రాథోడ్ రమేశ్ హెచ్చరించారు..

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని, పార్లమెంటులో ఒక్కసారి కూడా తెలంగాణ అంశం ప్రస్తావించలేదని ..
తెలంగాణ ఎవరి జాగీరు కాదని, నాలుగు కోట్ల ప్రజల సొంతమని అన్నారు..

ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని... రోశయ్య సిఎం గా పదవిలోకి వచ్చి ఏడాది అయినా.. పాలనపై పట్టు లేదని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు.

యడ్యూరప్పని కొనసాగాలా? వద్దా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప భవితవ్యాన్ని తేల్చేందుకు త్వరలో రాష్ట్రానికి పరిశీలకులను పంపి రహస్యంగా శాసనసభ్యుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు.

అవినీతి ప్రకరణలకు సంబంధించి కేంద్రంలో బీజేపీ దుమ్మెత్తి పోస్తూ, కర్ణాటకలోని అవినీతిపై మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చింది
భూ కుంభకోణాలు, ఇతర అవినీతి ఆరోపణల్లో కూరుకున్న యడ్యూరప్ప ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన పార్టీ హై కమాండ్ పంపే కమిటీ ప్రత్యేకంగా శాసనసభ్యులను కలసి రాష్ట్రంలో యడ్యూరప్ప నాయకత్వం కొనసాగాలా? వద్దా? అనే అంశాన్ని గురించి అభిప్రాయాలను సేకరించనున్నారు