18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

తెలంగాణ నాయకుల ఆగడాలు తాలిబన్ల లను మించి పోతున్నై

లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణపై దాడికి పాల్పడిన వారిని, ఘటనకు కారణమైన కేసీఆర్, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సమైక్యాంధ్ర జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ నాయకుల ఆగడాలు తాలిబన్ల చర్యలను మించి పోతున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం బాధ్యతలు విస్మరించిందని ఆరోపించారు. శాసనసభ్యునికి హైదరాబాద్ నడిబొడ్డున రక్షణలేకపోతే ప్రభుత్వం సామాన్యుని భద్రతకు ఏమి హామీ ఇవ్వగలదని ప్రశ్నించారు

జయప్రకాష్ నారాయణపై దాడికి నిరసనగా శుక్రవారం సీమాంధ్ర పరిధిలోని విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని సమైక్యాంద్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో- కన్వీనర్ ఎం.వెంకటరమణ తెలిపారు.

ఫీజుపోరు’కు మద్దతు: నారగోని

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నుంచి తలపెట్టిన ‘ఫీజు పోరు’కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర నేత వీజీఆర్ నారగోని ప్రకటించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజుల చెల్లింపులో ప్రభుత్వం కప్పదాటు వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. పదవి కాపాడుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని, ఆయనకు ఒక్క క్షణం అధికారంలో ఉండే అర్హత లేదని ధ్వజమెత్తారు.

మేమే అధికారంలోకి వస్తాం. తెలంగాణ ఇస్తాం

చంద్రబాబు, చిరంజీవి, సీపీఎం ఎవరు వద్దన్నా... పార్లమెంట్‌లో బిల్లు పెడితే ఎన్డీఏ బలంతో తెలంగాణ వస్తుంది. 2014లో ఎలాగూ మేమే అధికారంలోకి వస్తాం. తెలంగాణ ఇస్తాం' అన్నారు. 'తెలంగాణ ఇచ్చుడో... కాంగ్రెస్ చచ్చుడో...' ఇప్పుడు ఆ పార్టీ ముందున్న అంశమని పేర్కొన్నారు. ఎన్డీఏ హయాంలో ఏర్పాటైన ఉత్తరాంచల్, చత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేస్తూ...తెలంగాణ వచ్చాక ఇక్కడా బీజేపీ బలపడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, శాసనసభ్యుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

శ్రీకృష్ణ నివేదికలో ఉన్నవి, లేనివి జోడించారు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా లేకపోవడం దురదృష్టకరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి గురువారం వ్యాఖ్యానించారు. కమిటీ తన పరిధి దాటి వ్యవహరించి ఒక పార్టీ చెప్పినట్లుగా నివేదిక రూపొందించినట్లు ఉందని అభిప్రాయపడ్డారు.

శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో రహస్యంగా ఉంచిన అంశాలు బహిర్గతం చేయాల్సిందేనని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారు. నివేదికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇలాంటి నివేదికను ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉన్నవి, లేనివి నివేదికలో జోడించారని న్యాయమూర్తి వాఖ్యానించారు.

సంతోషంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు చోటుచేసుకున్న పరిణామాలు తమకు మంచి మైలేజీ ఇచ్చాయని టీఆర్ఎస్ భావిస్తోంది. సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని, బయట లోక్‌సత్తా అధినేత జేపీపై దాడి చేసిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా కనిపించారు. కాగా.. తెలంగాణ రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చి, దానిని అనుమతించాలని కోరుతూ సభలో ఆందోళనకు దిగనున్నట్లు సమాచారం.

కృష్ణా జిల్లాను 12 రాష్ట్రాలుగా విభజించండి

తమ వాదనలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై భౌతిక దాడులకు దిగుతుంటే బజారు రౌడీలకూ, ప్రజాప్రతినిధులకూ తేడా ఏమిటని ఎంపీ కావూరి సాంబశివరావు ప్రశ్నించారు.శాసనసభలో గురువారం జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యవాదులు బాధపడేవిగా ఉన్నాయన్నారు. . "రాష్ట్రం రెండుగా విభజించడానికేం ఖర్మ.. ప్రతి 50 వేల జనాభాకూ ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్-సికింద్రాబాద్‌లను 8 రాష్ట్రాలుగా, కృష్ణా జిల్లాను 12 రాష్ట్రాలుగా విభజించాలని కోరుకుంటున్నాను'' అని వ్యంగ్యంగా అన్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను కొడితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేరుతుందనుకుంటున్నారేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

ఐదుగురు ఎమ్మెల్యేల అరెస్టు?

శాసనసభలో గురువారం చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్ నరసింహన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. దాడులకు పాల్పడిన ఐదుగురు ఎమ్మెల్యేలను ఉపేక్షించకూడదంటూ సర్కారును ఆదేశించినట్లు సమాచారం. దీంతో.. దాడికి కారకులైన ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెం డ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సర్కారు రంగం సిద్ధం చేసింది.

టీఆర్ఎస్ నేతలకు అద్వానీ క్లాస్

అసెంబ్లీలో గురువారం నాటి సంఘటనపై టీఆర్ఎస్ నేతలకు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ క్లాస్ తీసుకున్నారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌పై దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.