సిగ్గు, శరం, న్యాయం, ధర్మం వదిలివేసి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కొడుకు జగన్ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు, రాష్ట్రాన్ని కొందరు వ్యక్తులకు దోచిపెట్టి, వారి ద్వారా జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారని విమర్శించారు. లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన దొంగలందరూ నేడు చంచల్‌గూడా జైలులో ఉన్నారని తెలిపారు.
ఇంకా కొంతమంది దొంగలు సెక్రటేరియేట్‌లో మిగిలారని చెప్పారు. వారిని ఇంటికి పంపించాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో గజదొంగలు పడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనికిమాలిన, అవినీతి దద్దమ్మ ప్రభుత్వం ఉందని తెలిపారు. దీన్ని సముద్రంలో కలపాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ హయాం కంటే ప్రస్తుతం 300 శాతం పైగా ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటి గురించి ప్రభుత్వాధినేతలకు పట్టడం లేదని విమర్శించారు.