16, డిసెంబర్ 2011, శుక్రవారం

చూపుల”మాయ”

చూపులతో గుచ్చిగుచ్చి చంపకే- అంటూ ఒక ప్రేమికుడు వాపోతాడు. ప్రియురాలి చూపు కోసం పరితపించే ప్రియుల గురించి విన్నాం. కోర చూపులు, ఓర చూపులు మహిళల సొంతం. భావాన్ని కళ్లలోనే పలికించగల నేర్పరులు వాళ్లు. అందమైన, ఆల్చిప్పల్లాంటి కళ్లతో వేలాది భావాలు చూపించే భామలు ఉన్నారు. ఇక్కడ స్టిల్స్‌లో కనిపిస్తున్న ఐదుగురు నాయికలు అనుష్క, తాప్సీ, స్నేహఉల్లాల్‌, తమన్నా, శ్రద్ధాదాస్‌లను చూస్తుంటే ఒక్కొక్కరూ ఒక్కొక్క విధమైన చూపుతో. భావాన్ని ఇట్టే పలికించే సామర్ధ్యం ఉన్న వాళ్లు. అనుష్క చిరునవ్వుతో, తాప్సీ ప్రశ్నార్థకంగా, కోర చూపులో స్నేహాఉల్లాల్‌, తమన్నా మత్తెక్కించే చూపుతో, ఓర చూపులో శ్రద్ధాదాస్‌ కనువిందు చేస్తున్నారు.

సమతా మమతల సృజనశీల మల్లెమాల

మట్టివాసనలకు అక్షరాకృతులు జాల్వా ర్చిన సృజన శీల మల్లెమాల. అలతి పదాలతో..కవితామాలికలల్లి... సమాజం లోనిఅసమానతల్ని అక్షరాస్త్రాలతో తెగ నాడిన అభినవ వేమన మల్లెమాల. భావుకతను సామాజిక స్పృహతో రంగ రించి, ఆధ్యాత్మికతలో జీవన సత్యాల ను ప్రభోదించి రామాయణ కావ్యంలో తెలుగుతియ్యదనాలు నింపిన మహిత గుణశీల మల్లెమాల.
నిర్మోహమాటస్ధుడిగా...ముక్కుసూటిగా,నిశ్చల, నిశ్చిత అభిప్రాయలను వెల్లడించే వ్యక్తిగా ఆయనదో విలక్షణ శైలి.
ప్రముఖ నిర్మాత, కవి, సాహితీవేత్త ఎం.ఎస్‌.రెడ్డి. కేవలం సినీ నిర్మాతగానే కాకుండా సాహితీ ప్రపంచంలోనూ తన కవితా గుబాళింపులని 'మల్లెమాల'గా విరజిమ్మిన సామాజిక చైతన్యానికి కూడా కృషి చేశారు.
సమాజాన్ని చదివిన విద్యావేత్త

విద్యాలయాల్లో...విశ్వవిద్యాలయాల్లో చదుకోలేని మల్లె మాల ఈ సమాజాన్ని అన్ని విధాలుగా చదువుకుని విద్యావేత్తగా ఎదిగారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి సమీపంలోని అలిమిలి గ్రామంలో రంగమ్మ, రామ స్వామి దంపతులకు 1924 ఆగష్టు 15న జన్మించిన మల్లెమాల సుందర రామిరెడ్డి (87) గత కొంతకాలం గా అనారోగ్యంలో బాధప డ్డారు. వ్యవసాయ కుటుం బం లో పుట్టినా... కష్టాల కడగళ్లులో మునిగి అర్ధాకలి తో అలమటించిన సందర్భాలూ ఉన్నాయి. సాధారణ రైతు కుటుంబంలోపుట్టినా..వీధిబడిలో...అందునా రచ్చబండలె పాఠశాలుగాచదువుసాగింది. ఉపాధ్యాయుడు చెప్పిన పద్యాన్ని అంతా రాసినాతను రాయకుం డానే ఏకబిగిన చెప్పి ఏకసంథాగ్రాహిగా అప్పచెప్పడంతో అంతా అవా క్కయి.మంచి విద్యార్ధిగా గుర్తిపు తెచ్చుకున్నా కుటుంబ ఆర్ధిక పరిస్ధితి సహకరించకపోవటంతో చదువు చుట్ట బడలై... ఉద్యోగ వేట వైపు పయన మైంది. తండ్రి చేసిన అప్పు లకు కోర్టుజప్తు కు భూమి పోగా వ్యవ సాయం చేయాలని నాగ లికి దరి చేరినా సొంతవారే పాలెగాడని చెప్తున్నప్పు డు బాధప డ్డారు. చిన్న ప్పుడు అప్ప చెప్పిన పద్యాలే ఆయన లో స్పూర్తి రగిలించి... పెద్దయ్యాక కవిత్వంపై మక్కువ పెంచుకుని.. మల్లె మాలగా..అనేక అంశాలపై తన దైనశైలిలో కవిత్వాన్ని వెల యిం చి సహజకవిగావినుతికె క్కారు.
ఉద్యోగం... వ్యాపారం

ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబ పరి స్ధితి గమనించి... 1941లో ఎనిమిది రూపాయల జీతా ని కి మైకా డిపోలో ఉద్యోగంలో చేరారు మల్లె మాల. మూడేళ్లు అక్కడ పనిచేసాక జీతం రెట్టింపు అయినా ఏదో తెలియని భావనలు వెం టాడుతుండటంతో... తన దగ్గరున్న ఇరవై రూపా యలనే పెట్టుబడి గా పెట్టి తాటి పీచు అమ్మకాన్ని ప్రారంభించారు. ఆపై ఆప్రాంతంలో లభించే మిను ములు, పెసలు, మామిడి, తంగేడు, కందులు ఇలా పలు వాటిని కొనటం... అమ్మటం చేస్తు కొద్ది రోజు ల్లోన అంచలంచెలుగాఎదిగితన కుటుంబం కోర్టు జప్తు కాబడ్డ భూములకు రెట్టింపు మొత్తంచెల్లించి స్వాధీన పరుచుకుని...పూరింటిస్ధానంలోచిన్నపాటి పెంకు టిల్లు కట్టించి పూర్వ వైభవాన్ని తేగలిగారంటే వ్యాపార దక్షత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
సంఘ సంస్కర్తగా...

అతి చిన్న వయసులో 1936లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో వెంకటగిరికి వచ్చిన గాంధీజీ ప్రసంగానికి ప్రభావితుడై...గాంధీజీ పాదాలను స్పృశించారు. నాటి నుండి ఆయన చూపినబాటలోఅంటరానితనాన్ని నిర్మూ లించాలని అహర్నిశలూ కృషి చేసిన దేశ భక్తుడు. సంఘ సంస్కర్తగా సమాజానికి సేవలందిస్తూ .. సమాజంలో ప్రతిఒక్కరితో ఆప్యాయత గా అందరి హితాన్ని కోరుకునే వారాయన.సమతా,మమతల భావ నతో ఎన్నో కవితలని అందారు. బెంగాల్‌ కరువు వచ్చి న ్పుడు 'కష్టజీవి' బుర్రకధని తోటి కుర్రాళ్లతో కల్సి ప్రదర్శించి సుమారు పదివేల రూపాయలు కమ్యూని స్టు పార్ట్తీకి పంపారు.
సినీ ప్రస్ధానం

తన జీవితగమనంలో అనేక వ్యాపారాలు నిర్వహించిన ఆయన సినిమాలపై మక్కువతో గూడూరులో సుందర్‌ సినీ ధియేటర్‌ పేరుతో చిత్రప్రదర్శనశాలను నిర్మించారు. ఆపైమరికొన్ని ధియేటర్లకు యజమాని అయ్యారు. డ బ్బింగ్‌ చిత్రాలతో తన సిని నిర్మాణాన్ని ప్రారం భించిన ఆయన కౌముది పిక్చర్స్‌ సంస్ధని స్దాపించి చిత్ర నిర్మాణ రంగంలోకి దిగారు. 'భార్య' చిత్రంలో మొదలైన ఆయన సినీ నిర్మాణ ప్రస్థానం శ్రీకృష్ణ విజయం, వూరికి ఉపకారి, కోడెనాగు, ముత్యాల పల్లకి, ఏకలవ్య, రామబాణం, పల్నాటిసింహం వంటి చిత్రాలతో కొనసాగింది. పూర్తిగా బాలలతో ఆయన నిర్మించిన రామాయణం రాష్ట్ర ప్రభు త్వనంది అవార్డుతో పాటు, జాతీయ పురస్కారాన్ని కూ డా అందుకోవటం విశేషం. ఈ చిత్రం ద్వారానే జూనియ ర్‌ ఎన్టీఆర్‌ చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యాడు. అంకు శం, ఆగ్ర హం, అమ్మోరు, అంజి, అరుంధతి చిత్రాలను తన కుమారుడు శ్యాం ప్రసాద్‌ రెడ్డితో నిర్మిం పచేసారు. ఎప్పుడూ కధా బలాన్ని నమ్ముకుని చిత్రాలు తీసిన ఆయన పలు చిత్రాలు పరాజయం పాలైనా ఏ మాత్రం దిగులు చెందకుండా... మరింత పట్టుదల తో మరింత అద్భుత చిత్రాన్ని రూపొందించిన ఘనుడాయన.స్వయంగా నటు డిగా అంకుశం చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో కని పించిన ఆయన 'వెలుగు నీడలు' చిత్రంలో ప్రధాన భూమికని పోషించారు.

కవిగా...

మల్లెమాల చక్కని, చిక్కని భావుకుడు మా త్రమే కాదు సమాజం లోని అన్యాయాలను, దురాగతాలను చూసి చలించి పోయిన మాన వతా మూర్తి. అందుకే భావుకతతో అద్భు తమైన పాటల్ని అటు సిని మాలకు మల్లెపూల పరిమళాలు వెదజల్లే కవితల్ని ఇటు సాహితీ ప్రపంచానికి అందిచారు. అదే సమయంలో నిలు వెత్తు సామాజికి స్పృహతో విప్లవ గీతాల్ని, కవితల్ని వెలయించారు. అయితే ఏ రచన చేసినా అచ్చతెలుగులో అలతి పదాలతో మాత్రమే రచనలు చేయంటి మల్లెమాల ప్రత్యేకత. 'ప్రతిదినం ఒక గ్రంధ మైనా చదవందే అడుగు ముందుకు పడదు... ఒక పద్య మైనా రాయందే నిద్రరాదంటూ...' తన సాహిత్యాభిమా నాన్ని చాటుకుంటూ పద్యం తన ఆరోప్రాణంగా అనేక సందర్భాలలో చెప్పారు. సరస్వతీ మాతే తనని పెంచి పోషిస్తోందని... చెప్పుకుని తన ఇంటి పేరునే కలం పేరుగా మార్చుకుని...మల్లెమాలగా.. సినీ కవిగా పలు చిత్రాలకు సుమనోహ రమైన గీతాలు అందించిన ఆయన తన కంటూ ఓ ప్రత్యేకతని దక్కిం చుకున్న ఆయనసహజ కవి, ఆంధ్రా వాల్మీకి లాంటి బిరుదాంకితుడు కూడా... అందుకు తగ్గట్టే ఆతని రాసిన గ్రం ధాలు, రచనలు, పద కవితలు సహజ త్వానికి దగ్గరగా.సాధారణ పదజాలం తో ఉండటం విశేషం. తరాల అంత రాలను తెగనాడుతూ'వృషభ పురా ణం' అనే గ్రంధం ఆవిష్క్కరించారు. తన ప్రతిభాపాటవాలను చాటే విధం గా వాల్మీకి రామాయణాన్ని అనుస రి స్తునే ఆయన విరిచించిన 'మల్లె మాల రామయణం'లో సంస్కృత ఛందస్సుకు తెలుగుదనాన్ని కలగ లిపి ఎక్కడా కృత్రిమత్వానికి చోటి వ్వకుండా పాత్రోచితమైన కల్పనలు చేస్తూ... సుకుమార పద్యాలనుఅద్భుతంగా మల చి రుచి చూపించారు. ఆధునిక కవిత్వ పోకడలున్న కాలంలోనూ పద్య కవితలతో తన సత్తా చూపి కవి సమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ ప్రశంసలందుకున్నారాయన. తేనెటీ గలు, వాడనిమల్లెలు, భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, నివేదన, భారతరత్నాలు వ ంటి రచ నలతో పాటు అనేక మంది సుప్ర సిద్దులను ప్రశంసిస్తూ ఆయన


రచించిన 'ఎంద రో మహాను భావు లు' అన్న గ్రంధం వేనోళ్ల ప్రశంసలందు కుంది. ఇటీవలే తను రాసిన 10 గ్రంధాలను ఆవిష్కరించారు.ఇటీవల ఆయన 'నా కధ' పేరుతో ఆయ న రచించిన ఆత్మకధలో తన సినీ ప్రస్దానంలో ఎదురైన అనేక ఒడిదుడుకులను ప్రస్తావిస్తూ.... పలు చిత్రాల నిర్మాణాల సమయంలో సొంత కుమారుడితో పాటు అనేక మంది సినీ ప్రముఖులపై తనదైన శైలిలో విమర్శ నాస్త్రాలు సంధించడంతో ఆ పుస్తకం వివాదాస్పదమైంది?
సత్కారాలు... పురస్కారాలు...

సాహితీ ప్రపంచానికి మల్లెమాల సేవల్ని గుర్తించిన అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ పురస్కా రాన్ని అందించగా...'మహిత వినయశీల మల్లెమాల ' అన్న మకుటంతో రాసిన నిత్యసత్యాలకు గానూ అభినవవేమన బిరుదు లభించింది. జాతీయ అవార్డు,తో పాటు 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు ఇటీవలే ఆత్రేయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఇక అనేక స్వఛ్ఛంధ సంస్ధలు అందించిన పురస్కారా లు లెక్కకు మిక్కిలి.
రాజకీయానుబంధాలు...
1957లో గ్రామపంచాయితీ ఎన్నికల్లో గెలిచి రాజకీ యాలలోకి వచ్చిన ఆయన సంజీవరెడ్డి హయాంలో సమితి అధ్యక్షుడిగా అవకాశం వచ్చినా దానిని వదులు కున్నాకాంగ్రెస్‌తో తన అనుబంధాన్ని చాటుకుంటూ... వచ్చి చివరకి మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డితో వియ్యమంది బంధుత్వంగా మార్చుకున్నారు.
ఎఫ్‌డిసి చైర్మన్‌గా...
ఆయన నిర్మించిన డాక్యుమెంటరీ 'కన్నీటి కెరటం' దివిసీమ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించి అందరి ప్రశంసలు అందు కున్న క్రమంలో అప్పటి ముఖ్య మంత్రి మర్రి చెన్నారెడ్డి మల్లెమాల సేవలను గుర్తించి 1990లో చలనచిత్ర అభివృధ్ధి
మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి. సమస్యలతో సతమతమవుతున్నదానిని ఒక గాడీలో పెట్టారు.


ఆంధ్రప్రభతో అనుబంధం
అంధ్రప్రభతో మల్లెమాల అనుబంధం సుదీర్ఘం, అత్యంత బలీయం. ఆవిషయం ఆయనే వివిధ సాహితీ, సాంస్కృతిక సభల్లో చెప్పేవారు. ఒక్క రోజు ఆంధ్ర ప్రభ ప్ర్రతిక ఆయనకు రావటం ఆలస్యమైతే వెంటనే ఫోన్‌ చేసి ఫిర్యా దు చేసేవారు. ఎన్ని పేప ర్లు వచ్చినా... ముందు గా ఆంధ్రప్రభనే చదువు తానని దశాబ్దా లుగా ఇది తన అలవాట ని పేర్కొన్నారు. 'చివరి అంకం'లో కైడా ఆయన రచనలు చేసింది ఆంధ్ర ప్రభకే శరీరం సహక రించక పోయినా... ఒక లేఖకుని ఏర్పాటు చేసుకు ని రచనలు చేసి ఒకటికి నాలుగు సార్లు కరెక్షన్స్‌ చేయించి 'మల్లెమాల కాలమ్‌' కి పంపేవారు. 'కాలమ్‌' బావుండక పోతే.. ఆపేయ మని, మొహమాట పడవద్దని మధ్య మధ్యలో సంపాదకుడికి ఫోన్‌ చేసేవారు. అంధ్రప్రభ కార్యాల యంలో ఏప్రియల్‌ రెండవ తేదీన నిర్వహించిన ఉగాది కవితా విజేతల బహుమతీ ప్రధా నోత్సవ సభకు ప్రత్యేకంగా హాజరయ్యారు.
ఈ సంద ర్భంలో ఆయతీసుకు వెళ్లేందుకు చెయ్యి పట్టుకోగా ఒళ్లు పెనంలా కాలిపోతూ ఉంది. వాకరు తో నడుస్తున్న ఆయన్ని 'ఏమిటి సార్‌! ఒళ్లు ఇంత వేడిగా ఉంది? అని ప్రశ్ని స్తే... 'బాగా జ్వరం... కానీ ఆంధ్ర ప్రభ కార్య క్రమానికి రాకుండా ఎలా? అందుకే ఓపిక చేసుకుని జ్వరమైనా లెక్క చేయకుండా వచ్చాను' అన్నారు. తాను వ్యక్తుల్నిగానీ, వ్యవస్ధలని గానీ అభిమానిస్తే... ఆ అభి మానం అంత ప్రగాఢం గా ఉంటుందనటానికి ఇంతకు మించిన ఉదాహ రణ మరొకటి ఏముం టుంది. నిలువెత్తు వ్యక్తి త్వానికి, సాహితీ సేద్యాని కి, తెలుగు ఆత్మ గౌరవా నికీ ప్రతీకగా భాసిల్లే మల్లెమాల చివరి రోజుల్లో మృత్యువుని కూడా అంతే ధై ర్యంగా ఆహ్వానించారు. చావంటే తనకు భయం లేదని నిర్భయంగా వెల్ల డించేవారు.
అయితే తుది శ్వాస వరకు తన రచన కొనసాగాలన్న తన అభిలాషను వ్యక్తం చేసారు మల్లెమాల. అటు వంటి ఆయన కలానికి బ్రేకులు వేసింది కుటుంబ సభ్యులే కావటం అత్యంత విషాదం అంటారు ఆయన గురించి తెలిసిన వారు. ఏది ఏమైనా సహజ కవి మల్లె మాల సాహితీ ప్రపంచంలో ఒక సంచలనం.

వ్యధమిగిల్చిన 'ఇది నా కథ'
తను చనిపోయేలోగా 'ఇది నా కథ' గ్రంధం పూర్తి చేస్తానో లేదో అని యం.యస్‌.రెడ్డి తెగ బాధపడేవారు. ఇదే విషయాన్ని చాలా మంది ప్రముఖుల వద్ద, సాహితి, సంస్కృతి సభల్లో బహిరంగంగా వ్యక్తం చేసేవారు. అయితే ఆయనకు ఆ గ్రంధ రచన పూర్తిచేయడం ఆనందం కలిగించిందేమోకానీ, అంతకు మించి ఇబ్బంది కలిగించిందనే చెప్పాలి. 'ఇది నా కథ'లో కొంతమంది ప్రము ఖులపై ఆయన చేసిన వ్యాఖ్యానాలు పెద్ద దుమా రాన్ని లేపాయి. ఈ దుమారాన్ని చల్లార్చడానికి ఆయన కుటుంబసభ్యులు, హడావుడిగా మార్కెట్‌ నుండి కాపీలు వెనక్కి తెప్పించి, బహిరంగ మార్కెట్లో కాపీ దొరక్కుండా కట్టడి చేసినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. అంతేకాకుండా సుప్రసిద్ధ నిర్మాతగా ఇమేజ్‌ సంపాదించుకుని, పరిశ్రమలో మంచి సంబంధబాంధవ్యాలు నెరపుతున్న ఆయన కుమారుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తన ఈ వ్యవహారం తననెప్పిగా తయారైందని, ఆయన కుటుంబసభ్యులు భావించి, మల్లెమాల మీద ప్రత్యక్షంగా ఆగ్రహం వెలిబుచ్చారని, కొంతకాలం పాటు ఫోన్‌ సౌకర్యం కూడా అందుబాటులో లేకుండా చేశారని, ఆయన రచనలకు సహాయకుడిగా పనిచేసే వ్యక్తిని కూడా తీసివేసి, ఆయనకు దాదాపు బయటి వ్యక్తులతో సంబంధం లేకుండా ఒంటరిని చేశారని, చిత్రపరిశ్రమలో, సాహితీ రంగాల్లో చెప్పుకున్నారు.

ఆరోగ్యాన్నిచ్చే అందాల వంటిల్లు

తానెంత ఎదిగినా... ఇల్లాలుగా.. మాతృమూర్తి పదవులకే ప్రధమస్ధానం ఇచ్చే మహిళలు...
అన్ని బాధ్యతల్ని సరితూకం చేసుకుంటూ... నెగ్గుకు వస్తున్నా సతమతం తప్పట్లేదన్నది నిజం...
ఈ తరుణంలో ...నిమిషాలలో పనులు చేసి పెట్టే అద్భుత యంత్రాలతో పాటు..
కొత్త తరహా వంటిల్లులు అందుబాటుకిి వచ్చి కొంత సేద తీర్చేలా చేస్తున్నాయనే చెప్పాలి.
మహిళలు... మహరాణులూ... అంటూ కవితలల్లిం ది ఎవరో తెలియదు కానీ... నేటితరంలో అన్ని రంగాలలో దూసుకుపోతున్న యువతిని చూస్తుంటే.. వంటింటికే కాదు యావత్‌ ప్రపంచానికీ మహరాణు లమే అని నిరూపిస్తున్నా రనిపిస్తుంది. ఆర్కిటెక్చర్లు గా, డిజైనర్లుగా, ఇంజనీర్లుగా... రిసెప్షన్‌ నుండి... మేనేజింగ్‌ డైరెక్టర్ల వరకు, సామాన్య ఉద్యోగి నుండి దేశాధ్యక్షుని వరకు.. పైలట్‌ నుండి వ్యామ గామి వరకు ఎక్కడైనా తనకో ప్రత్యేకత నిరూపించుకుం టూ...సత్తా చూపిస్తూ..ఎన్నెన్నో కీర్తిప్రతిష్టల్ని సంపా దిస్తునే ఉన్నారు. అయినా ఆడవారికి అమ్మగా లాలింపు... పాలింపు తప్పనిసరి తన చేతివంటని ఆనందంగా తింటున్న బిడ్డల్ని చూసి ఆనందించని అమ్మ ఉండదు. ఈ క్రమంలోనే అమ్మ వంట చేసేం దుకు అనువుగా వంటిల్లు కూడా ఉండాల ని..ఆమెలోనూ నూతనోత్సాహం నింపా లన్న పలు వురి ఆర్కిటెక్చర్‌ల ఊహలలోంచి రూపు దాల్చినదే ఆధునిక వంటిల్లులు.
ఆధునిక పరికరాలు రాని రోజుల్లో కూడా మన ముం దు తరాలవారు ఉమ్మడి కుంటుంబాలలో ఆనందంగా వంట చేసుకుని హాయి, హాయిగా తిని ఆరోగ్యకంగానే ఉండే వారు.
నేడు అన్ని అందుబాటులోకి వచ్చినా. ఉమ్మడి కుటుంబాలు అవసరార్ధం విచ్చిన్నమైన క్రమంలో ఇంట్లో ఉన్న నలుగురికి వంట చేసేందుకే నానా హైరానా పడిపోతూ... చెమటలు పట్టేస్తూ... వంటెవడు కనిపెట్టా డురా భగవంతుడా అని విసుర్లు విసురుతున్న మహిళల్ని చూసి... నేడు వంటిల్లు తెల్లబోతోంది.అసలు దాని ముఖం చూసేందుకు కూడా నచ్చని నేటితరం అమ్మాయిల్లో చాలా వరకు వంట రాకపోవటం కూడా అదో కారణం కావచ్చు.
పూర్వంలో మన బామ్మలు, అమ్మమ్మలు...కాలంలో పిడక ల పొయ్యలు, కట్టెల పొయ్యలు, బొగ్గుల కుంపట్లు.. ఇలా నిత్యం ఇంట్లో అగ్నిహౌత్రం వెలుగుతూ ... ఇల్లంతా మసక బారు స్తున్నా... ఏం లేకు న్నా... అంత రుచి కరంగా అమ్మ చేసిన వంట నేడు లభించిన దాఖలాలే లేవన్న ది నిన్నటి తరం వారు చెప్పే మాట. రుబ్బురోళ్లలో నలిగిన పిండితో చేసిన అట్ల రుచి, రోకళ్లతో కొట్టిన పొడుల గుభాళింపులు, తిరగ ళ్లలో నలిగిన కందిపొడి.. బండలతో చితక్కొట్టిన పచ్చళ్లు, అప్పడాల కర్రలు ఇలా వేటికవే ప్రత్యేకత సంతరించు కునేవి. నాడు ఆ పొగ పొయ్యలపై కళ్లు మండుతున్నా... పిండి వంటలు, మిఠాయిలు చిటికెలో ఎలా చేసి పడేసే వారో నేటికీ అర్ధం కాని ప్రశ్నే...
కానీ నేడు గ్రేండర్లు, మిక్సీలు, స్టౌల్‌లు, ఒవెన్లు ఇలా అన్నీ అందుబాటులోకి వచ్చినా... మనం మాత్రం సమయా భావం పేరుతో ఏ స్వగృహా ఫుడ్స్‌పైనో, కర్రీ పాయింట్ల పై నో ఆధార పడి గడిపేస్తూ వంట ప్రాధా న్యతని తగ్గించేసు కుంటున్నాం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయటం నేడు పెరుగు తున్న ఆర్ధిక భారాల దృష్టా తప్పనిదే కావటం.... పిల్లలు చదువులు, ఇంట్లో ఉరుకులు, పరుగులతో పనులు చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్లేందుకు సమయం తక్కువ గా ఉన్న క్రమంలోనే దాదాపు ప్రధాననగరాలలో ప్రతి వీధిలో, గల్ల్లీ చివర్లలో కర్రీ పాయింట్లు పుట్టుకొచ్చాయి. స్వీట్‌ స్టాళ్లు మూడు పువ్వులుగా వర్ధిల్లుతున్నాయి.
కత్తి పీటల స్ధానంలోకి చాకులు, పీలర్లు వచ్చి పడ్డాయి. ఆ క్రమంలో నేడు కూరగాయలు క్షణాల్లో అన్నింటినీ కట్‌ చేసే యంత్రాలు, పపð వేస్తే చాలు క్షణాల్లో రుబ్బి పెట్టే గ్రేండర్లు, మంత్రం వేసినట్లు నిమిషాల్లో అన్నం, కూరలు, చేసి పడేసే ఎలక్ట్రానిక కుక్కర్లు, చపాతీలు, పుల్కాలకు రోస్టర్లు, టి, కాఫీలకూ ప్రత్యేకంగా మిషన్లు అందుబాటు లోకి వచ్చినా... చాలా మంది తమ వంటిళ్ల ని ఇష్టాను సారంగా వాడిపడేస్తుంటారు. దీంతో పని మనిషి కన్నా.. ఆ వస్తువులు పాడైతే బాగు చేయించడానికో.. తిరిగి కొను గోలు చేయటానికో ఎక్కువ అవుతుందని గమనిం చుకోండి.
మరి కొందరైతే అవసరం ఉన్నా లేకున్నా ఇష్ట్టానుసారం వస్తువుల్ని కొనేస్తుంటారు. దీంతో బైటకు కనిపిస్తే ఇబ్బంది అని అన్నీ వంటగదిలోనే చేరిపోతుండటంతో ఉన్న గది ఇరుకై ఇబ్బందులు... విసుగు తెప్పిస్తుంటాయి. అద్దె ఇళ్ల లో ఉన్న వాళ్లు ఎలానూ సర్ధుకు పోక తప్పదు... కానీ సొంత ఇళ్లు ఉన్నవారికోసం నేడు ఎన్నో హంగులతో అవసరాలకు తగ్గట్టు అధునాతనరీతిలో రూపొందిన వంట ిళ్లు వచ్చేసాయి.
వంటింటి ఓ వైపునే అన్ని ఉండేలా చూసుకునేవారు గతంలో.. కానీ నేడు రెండు వైపులా ర్యాకలుే, చిన్నపాటి రాతిపలకలు వేసి.. ఉన్న తక్కువ స్ధలాన్నే విశాలంగా చేస్తున్నారు. ఇందుకు ఎక్కువ శాతం లేత గ్రానైట్‌ వాడుతుం డటంతో ఆహ్లాద కరంగా ఉంటుంది. ఇక వంటిల్లు చిమ్మచీకట్లు చిందేలా కాకుండా వెలుగులతో ప్రతిబింబించేలా చేస్తూనే... వంటల నుండే వెలువడే ఆవిర్లు పోయేందుమార్గాలను ప్రత్యే కంగా ఏర్పాటు చేస్తారు. ఫ్రిజ్‌, ఒవెన్‌, గ్రేండర్‌, మిక్సీ ఇలా ప్రతి ఎలక్ట్రానిక వస్తు వు వినియోగానికి వీలు గా ప్లగ్‌పిన్‌లు ఏర్పాట్లు పాత్రలు శుభ్రపరుచుకునే షింక మొదలు, క్రిందన ఉండే మ్యాట్లు వరకు... అన్ని శుభ్రపరుచుకునే ఏర్పాట్లు గిన్నెలు ఉంచే స్టాండ్స్‌... వంటకు దినుసులు అందు బాటు లో ఉంచేలా నిర్మిస్తున్న అలమరాలు ఇలా అన్ని ఓ ఎత్తయితే... వంటింట్లో ఇండోర్‌ ప్లాంట్ల కు సైతం కాసింత చోటిచ్చి మరింత ఆహ్లాదపరి చేలా చేస్తున్నారు నేటి ఆర్కిటెక్చర్లు.
మరో వైపు ఆధునికంగా ఉన్న చిన్న పాటి స్ధలంలోనే గుండ్రని ఆకారంలో షింక, స్టౌవ్‌, సామాన్లు ఉంచేందుకు అలమరాలు, ఒవెన్‌, ఫ్రిజ్‌, ఇలా తదితరాలు పెట్టుకునేందుకు ప్రత్యేక అమరికల్ని ఏర్పాటు చేసి అందిస్తున్నారు. వీటిలో చాలా మేరకు గ్యాస్‌ సిలండర్లను ఇంటి బైటే ఉంచి ప్రత్యేక పైపు ద్వారా స్టౌకి గ్యాస్‌ పంపడం వల్ల ప్రమాదాలు చాలా తక్కువగా ఉండటంతో నేటి ఆధునిక మహిళలు పెద్ద పెద్ద వంటిల్లు స్ధానంలో చిన్నగా చూసేందుకు అందంగా కనిపి స్తున్న ఈ వంటిల్లు పట్ల మక్కువ చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పాత వంటిల్లునే మీకు నచ్చిన రీతిలో రూపొందిం చేందుకు నిర్మాణ కంపెనీలు, ఆర్కిటెక్చర్లు ప్రత్యేక తరహాలో మీకు ఉన్న ప్రదేశానికి తగ్గట్లు వీటి నిర్మాణం చేస్తున్నారు. వంటింటికి సంబంధించిన వివిధ పరికరాలను అందిచే కంపెనీలు కూడా తమ తమ ఔట్‌లెట్ల లో ఇందుకు సంబంధించి అనేక రకాల డిజైన్లు అందిస్తున్నాయి.
ఇప్పటికే మార్కెట్‌లో అందమైన రంగుల్లో వివిధ రకాల డిజైన్లతో పలు షింకలుే, ట్యాప్‌లు, టేబుల్స్‌, ప్రొవిజన్‌ స్టాండ్స్‌, ఐటమ్‌ స్టాండ్స్‌, హ్యాంగింగ్‌ స్టాండ్స్‌, ఇలా అన ేకం లభిస్తున్నాయి... ప్రొవిజన్స్‌ స్టాండ్స్‌లలో ఏవి ఎక్కడు న్నాయని పేర్లు రాసుకునేందుకు ఉన్నవి కొన్నయితే... ఏకంగా పారదర్శకంగా కనిపించేలా అన్‌ బ్రేకబుేల్‌ ప్లాస్టికతోే తయారైన సీసాలతో కల్సి సెట్‌గా లభిస్తున్నవి మరి కొన్ని. ఇక వాష్‌ బేసిన్‌ పక్కన మిర్రర్లు,టవల్‌ స్టాండ్లు... పాత్రలు శుభ్రం చేసే సబ్బులు, పౌడర్లు, లిక్వి డ్లు ఉంచుకునేందుకు అక్కడే ప్రత్యేక అలమరాలు... అవి కడగటం పూర్తి కాగానే మీ చేతులు తుడుచుకునేందుకు తువ్వాలు పెట్టుకునే స్టాండ్లు, కాస్త ఖర్చెక్కువైనా పర్వాలే దని అనుకుంటే... పనిమనిషితో సంబంధంలేకుండా ఇంట్లో మీరు నిత్యం వాడుకునే పాత్రలు కడిగి పెట్టే డిష్‌ వాషర్లు సైతం వీటిలో ఏర్పాటు చేస్తారు. ఆధునిక వంట గదిలలో వచ్చి... ఏదీ కనిపించ డం లేదనేందుకు లేకుండా వచ్చి చేరాయి. మరెందుకు ఆల స్యం మీ ఇంటిని కూడా అందంగా చక్కదిద్ధుకోండి..

శత వసంతాల రాజధాని ఢిల్లీ

కౌరవ సామ్ర్రాజ్యానికి రాజధానిగా నిలచిన హస్తిన...
మొఘలాయీ చక్రవర్తుల మొదలు ఎందరి పాలనకో రాజధానిగా నిలచి...
ఆపై జార్జి వి చక్రవర్తి పాలనలో రెండో సారి రాజధానిగా ప్రకటించబడి...
దినదినాభివృద్ధి చెందుతూ... వందేళ్లు పూర్తి చేసుకుని...
ఏడాది పాటు శతవసంతాల సంబరాలు జరుపుకుంటోంది.
ఢిల్లీకి హస్తినగా దాదాపు మూడు వేల ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. పాండవుల కాలంలో ఇంద్రప్రస్ధంగా వెలిగిన మహానగరమే నేటి ఢిల్లీ ప్రాంతమని చరిత్ర కారులు చెపుతారు. మొఘల్‌ల కాలంలో షాజహాన్‌ చక్రవర్తి 1639 ప్రాంతంలో షాజహానాబాద్‌ పేరుతో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిం చాడు. ఆపై భారతా వనిని పాలించిన అనేకమంది చక్రవర్తులు,రాజులు, సరాజులు రాజధానిగా పాలిం చినా...ఒక్కోక్కరు ఒక్కోప్రాంతాన్ని తమకు అనుకూలంగాభావించి అనే క కోటలు, దర్బారులు ఏర్పాటు చేసు కోవటం తో ఎనిమిది రాజ్యాలు ఢిల్లీ చుట్టు పక్కల ఏర్ప డ్డాయి. అలా ఏర్పడ్డ రాజ్యాలలో సుందర ప్రాంతాన్ని గుర్తించిననాటి బ్రిటీష్‌ పాలకులకుడైన జార్జి చక్రవర్తి-5 తన పాలనా సౌల భ్యం కోసం కోల్‌ కత్తా లోనిపరిపాలనా యంత్రా గాన్ని ఢిల్లీకి తరలిం చాల ని తలచి...1911 డిశంబ ర్‌ 11న తన సతీమణి మేరీ కింగ్స్‌ క్యాంప్‌తో కల్సి ఢిల్లీ దర్బారు స్ధలంలో పునాది వేసి 7 నగరాల ను కలిపి న్యూఢిల్లీగా మార్చి అదే పాలనా కేంద్రంగా తన పాలనని సాగించారు. నాటి నుండి మరోమారు ఢిల్లీ రాజధా ని నగరంగా వెలు గొందింది. బ్రిటీష్‌ పాలకుల నుండి మనదేశానికి స్వాతంత్రం వచ్చినా అనేక భవనాలు పాలనకు సౌలభ్యంగా ఉండటంతో మన పాలకులు కూడా న్యూఢిల్లీనే రాజధానిగా చేసుకున్నా రు. ఇప్పటికి న్యూఢిల్లీ రాజధానిగా ఏర్పడి వందేళ్లు పూర్తి కావటంతో అక్కడ శత వార్షికోత్సవ సంబరా లను ఏడాది పాటు నిర్వహిస్తోంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం.

అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజధానిగా వెలుగొందుతున్న న్యూఢిల్లీ...చరిత్ర తరచి చూస్తే అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ శతాబ్ధ కాలంలో అనేక కొత్త పోకడలకు నాంది పలికిందనే చెప్పాలి. ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న నగరాలైన జహా నపాన, దినపానా, షేర్‌గఢ్‌, షా హజనానా బాద్‌, తుగ్గకాబాద్‌, సిరి ఇలా ఏడు నగరాలను న్యూఢిలీ ్లగా చేయాలని సంకల్పించిన నాటి నుండి పాండవుల కాలం నాటి ఇంద్ర ప్రస్ధ ప్రాంతంలో ున్న రైజినా గ్రామం వద్ద పాలనకోసం కావాల్సి న భవన నిర్మాణ పనులని ప్రారంభించారు. బ్రిటీష్‌ పాలకులు తమ పాలనాపట్ల ప్రజలకువినయ విదేయతలు కలిగేలా భవన నిర్మాణాలు ఉండాలని యోచించిన నాటి పాలకులు బ్రిటీష్‌ సామ్రాజ్య దర్పణం అందరికీ తెలియచేసేలా మహానగరాన్ని నిర్మించేందుకు ప్లాన్లు అనేక మంది ఆర్కిటెక్చర్లు రూపొందించారు. వీటిలో ఎడ్విన్‌ లాండ్‌ సీర్‌ లుటె న్స్‌, హెర్‌బెర్ట్‌ బాకెర్‌ అనే ఆర్కిటెక్చర్లు డిజైన్‌ చేసిన భవన ప్లానులకు జార్జి నుండి అనుమతి లభించ డంతో నాటి రాజరికపు ప్రతి బింబాలు గా నిలచే భవనాలు నిర్మాణం జరిగింది.నేడు ఢిల్లీలో కనిపించే రాష్ట్రపతి భవన్‌, సెక్రటేరియట్‌లు చూడవచ్చు.
ఆ క్రమంలో పాలనాయంత్రాంగం కోసం భవనాలు ఏర్పాటు చేసారు. 1922లో ఢిల్లీలో యూని వర్శిటీని ఏర్పాటు చేసినా భవన నిర్మాణాల విష యంలో పెద్దగా శ్రద్ద చూపక,తమ పారి పాలనకు అనువుగా వరుస భవనాలు నిర్మించు కుంటూ ... పోవటంతో ఆగ్రహం చెందిన విద్యార్ధులు, నాయ కులు పోరాటాలకు దిగాల్సి వచ్చిం ది కూడా. అయినా వెరవక కౌన్సిల్‌హౌజ్‌ నిర్మాణం పూర్తి చేసి ప్రారం భించడంతో అప్పటికే స్వాతంత్ర సమరంలో అనేక మంది త్యాగధనులు ప్రాణాలర్పించిన క్రమంలో వారి నుండి స్పూర్తి పొందిన భగత్‌సింగ్‌ లాంటి నేతలు దానిపె ౖకన్నేసి దానిని పేల్చేందుకు ప్రయత్నించారు. నాటి కౌన్సిల్‌ హౌజే నేడు మనకి పార్ల మెంట్‌గా మనం ఉపయోగిస్తున్నాం.
బ్రిటీష్‌ పాలకుల దాష్టికాలు రోజు రోజుకీ హెచ్చు మీరిపోతుండటంతో... విసిగి వేసారి న సామాన్య జనం కూడా బాపూ బాటలో నడిచి బ్రిటీష్‌ పాలకులకు తమ నిరసనల రుచి చూపించారు. ఊరూ వాడా ఏకమై...పల్లె పల్లె కదిలి... స్వాతంత్ర మహా సంగ్రామంలో పాల్గొనటంలో చివరికి ఎట్టకే లకు భారతావనికి దాస్య శృంఖలాలల నుండి విముక్తి చేస్తున్నట్లు ప్రక టించారు. దీంతో 1947 ఆగష్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం రాగా మన జాతీయ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై వెల్లివిరిసింది. అయితే ... నాటి దేశ విభజన సమయంలో పాక నుండి వచ్చిన వారిని తనలో చోటిచ్చిన ఢిల్లీని పాలకులు సరిగా పట్టించుకోక పోవటంతో ఇష్టౄను సారం గా నిర్మాణాలు పెరిగి పోయాయి. 1957లో ఏర్పడ్డ ఢిల్లీ డవలప్‌ మెంట్‌ అధారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌లు కలగల్సి రూపొందించిన మార్గదర్శకాలకు అను గుణంగా తిరిగి సుందర నగరంగా విస్తరణకు ప్రయత్నా లకు బీజం పడటంతో...నాటి ప్రధా ని నెహ్రూ సూచన లతో అనేక ఉద్యానవనాలు విశాలమైన రోడ్ల్లు నిర్మించారు.


విభిన్న సంస్కృతుల సమాహారం...

దేశ రాజధాని నగరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు స్ధిరనివాసం ఏర్పాటు చేసుకోవటంతో నేడు ఢిల్లీ జనా భా రెండు కోట్ల 20 లక్షలు (2011 జనాభా లెక్కల ప్రకారం) వీరిలో అత్యధికు లు హిందువులే అయినా...
దాదాపు అన్ని మతాల ప్రజలు ఉండటంతో ప్రతి రోజు ఏ పండగ వాతావరణం కనిపిస్తుం ది. ఎవరు ఏ పండగ జరిపినా మిగిలిన మతాల వారు సైతం దానికి హాజరైతమ అను బం ధాలను చాటుకుంటారు. ఇక స్వాతంత్ర దినోత్స వం, గణతంత్ర వేడుకల్లో అయితే ఆ కోలాహలమే వేరు. నిత్యం కార్పోరేట్‌ కల్చర్‌ తో కళకళలాడుతూ ఉండే ఈ నగరం ఖరీదైన జీవనానికి ప్రతీకగా నిలుస్తు... నేటికీ తన దర్పాన్ని నిలబెట్టుకుంటూ ప్రపంచగుర్తింపు పొందుతోంది.




రాజరికం వెనక్కి...

బ్రిటీష్‌ రాజరిక స్మృతులు చెరిపి వేసే క్రమంలో అనేక మార్గాలకు మన భారత నాయకులు పేర్లు పెట్టారు. దీంతో యార్క్‌ రోడ్‌ వెూతీలాల్‌ నెహ్రూ మార్గ్‌గా... తీన్‌ మూర్తి మార్గ్‌ రాబర్ట్‌ రోడ్‌ గా, ఓల్‌ మిల్‌ రోడ్‌ని రఫీ మార్గ్‌గా, కింగ్స్‌ వేని జన్‌పథ్‌గా ఇలా పలు మార్పులుచోటుచేసుకున్నాయి
చూడాల్సినవీ
బోలెడు...

మూడు వేల సంవత్సరాలు రాజరికంలో ఉన్న ఢిల్లీ లో వారి నిర్మాణాలు , నాటి సాంప్ర
దాయాలు ఎక్కువగా కనిపిస్తాయి.ప్రస్తుతం పర్యాటకం గానూ అభివృద్ధి చెందిన ఢిల్లీలో చూడాల్సిన వాటిలో కన్నాట్‌ ప్లేస్‌, అక్షర్‌ధామ్‌, ప్రగతీమైదాన్‌లోని ఆటో ఎక్సపో, పార్లమెంట్‌, ఇండియాగేట్‌, ఎర్రకోట, జమా మసీదు, లెటస్‌టెంపుల్‌, ఇస్కాన్‌ టెంపల్‌ విజరు చౌక, వెూఘల్‌గార్డెన్‌, రాజ్‌ఘాట్‌, బాపూఘాట్‌, సెక్రటేరియట్‌, పురానా ఖిల్లా, లకిë నారాయ ణ టెంపుల్‌, రాష్ట్రపతి భవన్‌,అక్షరధామం, జంతర్‌ మంతర్‌, కుతుభ్‌ మినార్‌, ఇలా చాలానే చూసేందుకు ఉన్నాయి.

ఏడాది పాటు కార్యక్రమాలు...

దేశ రాజధాని నగర గత వైభవాన్ని ప్రజలకు తెలియ చేసేలా ఢిల్లీ సర్కారు ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయిుంచింది. ఏడాది పాటు జరిగే ఉత్సవాలను భారత సాంస్కృతిక మండలి సారధ్యం లో జరగనున్నాయి. ఇప్పటికే దస్తన్‌ ఎ ఢిల్లీ పేరుతో ఢిల్లీ నగర గత చరిత్రను ఏర్పాటుకు దారి తీసిన పరిస్ధితిని వివరిస్తూ... ఢిల్లీ ప్రభుత్వం రూపొం దించిన పుస్తకాన్ని విడుదల చేసారు. దీనిలో నగర సంస్కృతి, వారసత్వ సంపదల వివరాలు తో పాటు అనేక ఛాయా చిత్రాలను ప్రజలకు వివరింస్తూ శతాబ్ధి ఉత్సవాలను ప్రజలలోకి చొచ్చుకు పోయేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రానున్న జనవరి నుండి ప్రారంభం కాన ున్న ఈ కార్యక్రమాల కోసం వందలాది కళాకారులు సిద్దమవుతున్నారు. ముఖ్య మంత్రి షీలా దీక్షిత్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తేజేంద్ర ఖన్నా... ఈ శతాబ్ధి ఉత్సవాలనుఎప్పటికపðడు పర్యవే క్షించేందుకు సిద్దమయ్యారు.
ఎవరెన్ని అవాంతరాలు చేస్తున్నా... పరమత చిహ్నానికి ప్రతీకగా నిలుస్తూ ... ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజధాని నగరం నిత్యం అనేక మందితో తెగ సందడి సందడి గా ఉంటుంది... ఇలాంటి నగరాన్ని ఒక్కసారైనా వీక్షించాలని అంద రి కీ ఉంటుంది.ఈ సారి సెలవుల్లో ఢిల్లీ వెళ్లి మీ వారందరితో అక్కడి ప్రద ేశా లు, నాటి మన చరిత్ర, సంప్రదాయాలను చూసి ఆనందంగా గడిపి రండి.. అదీ శతాబ్ధి ఉత్సవాలు ముగిసేలోగా అయితే మరీ మంచిది... ఇపðడైతే బోలుడు విషయా లు తెలుస్తాయి.

బాంబుల పేలుళ్లతో తల్లఃఢిల్లీః
మన దేశానికి స్వాతంత్ర వచ్చిన నాటి నుండి ఢిల్లీయే రాజధానిగా వెలుగొందు తున్నా.. పరమత సహనానికి ప్రతీకగా నిలు స్తున్నా... ముష్కరుల కళ్లనీ రాజధానీ మీదే ఉన్నాయి. గత రెండు దశాబ్ధాలలో 20కి పైగా పేలుళ్లు జరిపినా నిలదొక్కుకు వస్తోం ది...ఒక్క 1997లో వరుసగా ఏడ సార్లు పేలుళ్లు జరపారంటే మన భారతా వనిపై ఉగ్రవాదులు ఎంత గురిపెట్టారో అర్ధం చేసు కోవచ్చు. నేటికీ ఎక్కడో ఓచోట బాంబు పెట్టామంటూ బెదిరింపులకు దిగుతున్న సంద ర్భాలు అనేకం మనం చూడోచ్చు. ఇక గత 20 ఏళ్లలో జరిగిన పేలుళ్ల సంఘ టనల్ని అవలోకన చేసుకుంటే...
1993 మార్చి 12న పేలుళ్లలో 257 మంది మృత్యువాత పడ్డారు.
1997 జనవరి 9న ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద పేలుళ్లు.
అక్టోబర్‌1న సర్ధార్‌బజార్‌లో పేలుళ్ళు
అక్టోబర్‌10న కౌరియా పూల్‌, కింగ్స్‌ వే క్యాం ప్‌, శాంతివనాలలో పేలుళ్లు10మంది మృతి.
అక్టోబర్‌ 10 రాణీ బాగ్‌లో ,,
నవంబర్‌ 30 ఎర్రకోట వద్ద జంట పేలుళ్లు.
డిశంబర్‌ 30న పంజాబీబాగ్‌లో బస్సు పేల్చివేత.
1998 జూలై 26న కాశ్మీరీ గేట్‌ వద్ద అంతర్జా తీయ బస్సు పేలుడు.
2000 జూన్‌ 18 ఎర్ర కోట వద్ద పేలుడు.
2001 అక్టోబర్‌ 1న పేలుళ్లలో 35 మంది మృత్యువాత పడ్డారు.
డిశంబర్‌ 13న పార్లమెంట్‌పై దాడి 5 గన్‌మాన్‌లతో సహా 12 మంది మృతి.
2005 మే 22 సినిమా హాళ్లలో పేలుళ్లు.
అక్టోబర్‌లో ఢిల్లీమార్కెట్‌లో పేలుడు 62 మంది మృత్యువాత.
2006 ఏప్రియల్‌ 14న జామా మసీద్‌ ప్రాంగ ణంలో బాంబు పేలుళ్లు..
2008 సెప్టెంబర్‌ 13న వరుస పేలుళ్లు.. 25 మంది చనిపోయారు.
ఏప్రియల్‌ 26 మొహ్రౌలీ ఫ్లవర్‌ మార్కెట్‌లో బాంబు పేలుడు.
ఏప్రియల్‌ 27 వెూహ్రౌలీ మార్కెట్‌లోపేలుడు.
2001 మే25న హైకోర్టు పార్కింగ్‌లో పేలుడు
2011 సెప్టెంబర్‌ 2న జరిగిన బాంబు పేలుళ్లలో 9 మంది చనిపోగా 45 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

మారియో! భళారే వి'చిత్రాలు'

రేఖాచిత్రాల నిలయంగా మార్చేసి... తన చెరగని చిరునామాగా తీర్చిదిద్దిన
మారియో... కళాభిమానుల హృదయ ఫలకాలపై చిరంజీవే ఎన్నటికీ....
మారియో మిరాండా కార్టూన్‌ చూస్తే గోవా వెళ్లినట్లే. అని గోవాని సందర్శించనివాని నుద్ధేశించి ఈ మాటలన్నది ఎవరో కాదు. గోవా ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌. ?
భారతదేశంలో కార్టూనీdస్టులలో ప్రముఖులు మారియో. వారు క్రైస్తవులైనా, వారి కోరిక మేరకు హిందూ స్మశాన వాటికలో సోమ వారంనాడు అంత్యక్రియలు జరిగాయంటే ఆయనలోని పరమత సహనం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
మారియో కార్టూన్లు సహజత్వానికి ప్రతీకలు. బొమ్మలో నీడలు తీసుకురావటం వారికే సాటి అన్నంతగా ప్రఖ్యాతి చెందారాయన. ప్రఖ్యాత ఆంగ్ల వార పత్రిక ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో కథలకు వేసిన బొమ్మలు చాలా ఆకర్షణీయంగా వుండేవి. పద విన్యాసాల కార్టూన్లు నిత్య నూతనత్వ హాస్యంతో అలరా రేవి. --

ఎసnd, ఈుషnషసాపn, nd ప ాుషస ాశసలో 'ౄశస' వాడ టం :ుషఠస షుnగష బదులు :షసdస షుnగషతో చురకలు వేసేవారు. మారియో పూర్తి పేరు మారియో జోవో కార్లోస్‌డో రోసారియో డె బ్రిట్టోమిరాండా, కార్టూన్లు పిన్న వయసులోనే ప్రారంభించిన ఆయన ముంబైలో డిగ్రీ చదివాక... తన కిష్టమైన ఆర్కిటెక్ట్‌ కోర్సులో చేరారు.
కార్టూనిస్ట్‌గా....

మారియో 1953లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో కార్టూనిస్ట్‌గా చేరి పనిచేస్తూనే... తదుపరి ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో పనిచేసారు. 1960 తర్వాత లండన్‌లో ప్రముఖ పత్రికల్లో చేరి... ఆయన గీసిన కార్టూన్లు అన్ని దేశాల వారి అభిమానాన్ని చూడగొ న్నాయి. 22 దేశాలలో ఆయన కార్టున్లు, చిత్ర ప్రదర్శన జరిగింది. అమెరికా, జపాన్‌, బ్రెజిల్‌, ఆల్ట్రేలియా, ఫ్రాన్స్‌, సింగపూర్‌, యుగోస్లోవియా, పోర్చుగల్‌లో వారి కార్టూన్లు ప్రజాదరణ పొందాయి.
మారియో, విదేశాల నుండి తిరిగి వచ్చాక ఎకనామిక్‌ టైమ్స్‌లో చేరారు. ప్రముఖ వ్యాపార సంస్థల క్యాలెండర్లకు చిత్రాలు వేశారు. వారు వేసిన చిత్రాలలో 'మిస్‌ నింబు పాని', మిస్‌ ఫోన్సెకా ప్రాచుర్యం పొందాయి.
బిరుదులు...

భారత ప్రభుత్వం మారియో ను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్‌ బిరుదులతో సత్కరించింది. డబ్బు కోసం ఎప్పుడూ వెంప ర్లాడని ఆయన చిత్రాలను కళగానే భావించేవారు...గోవాలోనిలౌటోవిమ్‌లోని ఇంటి ని తనఅభిరుచికి తగ్గట్టు అభీష్టం మేరకే నిర్మిం చు ున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం. చెట్లు, చేమలు, అనేక రకరకాల పక్షులు, జంతువులతో, సందర్శకుల దర్శనంతో ఎప్పుడూ కోలా హలం గా వుంటుంది. ఇక గోడలవైపు దృష్టి సారిస్తే, పేపర్‌ సైజుకంటే పెద్దగా కార్టూన్లతో అందరినీ అలరిస్తాయిదేశ విదేశాల నుండి సంద ర్శకులు వారి ఇంటిని చూడటానికి బారులు తీరుతారు.
దూరదృష్టిమెండు

మారియోకు దూరదృష్టిమెండు. ఒకసారి ముంబై రేడియోలో మోరార్జీదేశాయ్‌ ప్రధాని పదవిని చేపట్టనున్నారని వార్త రావడంతో, మిరాండా వెంటనే మొరాజ్జీ దేశాయ్‌, మద్యపాన నిషేధంపై కార్టూను వేశారు. మొరార్జీ దేశం కేవలం-10 నిమి షాలలోనే మద్యపానాన్ని నిషేధిం చారు.
ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో ఆయన కార్టూన్‌ చూసి కానీ, మిగతావి చూసే వారు కాదు. ఆయ న రేఖా చిత్రాలు జనం హుృద యా లను దోచుకునేవి. ముఖ్యంగా నిత్యం జరిగే సం ఘటన లతో, ఆమ్‌ ఆద్మీని తలపించేవి.
ఆయన చిత్రాలు చూడంగానే, తక్కువ పదాలతో, ఎక్కువ అర్థాన్ని ఇనుమడిం చేవారు. ధరల పెరుగుదల, అవినీతి, లంచగొండి తనం, కప్పల తక్కెడ రాజకీ యాలు, ఇలా ఒకటేమిటి? అన్ని కోణా లపై వారు చిత్రాలను వేసేవారు.
మారియో చిత్రాలు గోవాను ప్రతి బింబించేవి. ఇతర రాష్ట్రాలవారికి, వారు గోవాను పరిచయం చేసారనే చెప్పాలి. వారి కార్టూన్లు నిత్యం కొం గ్రొత్తగా వుండి అలరించేవి.
ఏదో ఒక గీతతో సంతృప్తిపడేవారు కాదాయన.. ముఖ్యంగా ఆఫీస్‌ బాస్‌, సెక్రటరీ, మధ్యతరగతి ఇళ్లలోని సంసారంలో సరిగమలు ఇలా ఎన్నో వైవిధ్య భరిత చిత్రాలు గీసి అందరినీ అలరించేవారు.

సర్వమత సమానత్వం...
తన 85వ ఏట నిద్రలో కన్ను మూసిన మారియో భార్య హబీబా చక్కటి ఉర్దూ మాట్లాడు తుంది. వారు జన్మత: క్రైస్తవులు. భార్యకు ముస్లిం సంప్ర దాయ ప్రభా


వం ఉండగా... ఆతని కుమారులు రఫద్‌, రావుల్‌పై హిందూ సంప్రదాయం ఆచరించేవారు. మారియో మరణానంతరం అంతిమదర్శనానికి వారి స్వగ్రామం లౌటోలి మ్‌లోని వరల్డ్‌ చర్చిలో వుంచారు. ఐరిష్‌, పోర్చుగీస్‌ పాటలను ఆలా పన చేశారు. వారి అంతిమ యాత్రలో సందర్శకు ల కళ్లు తడి ఆరలేదని ఓ ప్రముఖ రచయిత వ్యాఖ్యానిం చారు.
వివిధ రంగాల ప్రముఖులు పద్మశ్రీ మారియా ఆరోరా, సంగీత విద్వాంసుడు రెయోఫెర్నాండెజ్‌, ఆర్టిస్ట్‌, హెరిటేజ్‌ లవర్‌ విక్టర్‌ హ్యూగో గోమ్స్‌, కార్టూనిస్ట్‌ అలెగ్జ్‌, పారిశ్రామిక వేత్తలు దత్తరాజ్‌, శ్రీనివాస్‌ డెంపో, జడ్జి డి.సిల్వా ఫెర్డ్‌ నాండ్‌ రెబెల్లో, ప్రముఖ రచయిత విక్టర్‌, తదితరు లున్నారు.
ప్రముఖ కార్టూనిస్టులకు, రచయితలకు చావులేదు. వారు ఎప్పుడూ జీవిస్తూ వుంటారు. వారి రేఖలకు లక్ష్మణరేఖలు లేవు. అవి హద్దుల ను చెరిపేస్తాయి. లౌటోలియంలోని మారియో ఇల్లే దేవాలయం, అదే చిత్రాలయం, మూగజీవాలకు నిలయం, సందర్శకులకు చెరిగి పోని చిరునామా, అదే మారియో మిరాండా! తనువు వీడినా ఎందరో చిత్రాభి మానుల హుృదయాలలో తనకంటూ ఓ చోటు చేసుకున్నారు.
- దండు కృష్ణవర్మ