9, ఆగస్టు 2012, గురువారం

అక్షరాభిషేకం

 పదిహేను దశాబ్దాల విద్యావనంలో విశిష్ట చరిత్ర...
    రాష్ట్రపతి నుంచి స్పీకర్‌ వరకు ఇక్కడి విద్యార్థులే...

రేపటి ప్రపంచం తయ్యారయ్యేది తరగతిగదుల్లోనే అని చెప్పిన మహాత్ముడి మాటల్ని నిజం చేస్తూ... ప్రయివేటు పాఠశాలలు, వ్యాపార దృక్పధంతో సాగుతున్న ఈ రోజుల్లో కూడా తన చెంతకు వచ్చిన ప్రతి విద్యార్థినీ అక్కున చేర్చుకుని, భావితరాలకు బాటలు వేస్తూ.. ప్రయోజకులైన విద్యా ర్థులుగా తీర్చిది ద్దటమే కాక వారిని సమాజంలో ఆదర్శవంతమైన పౌరు లు గా...నిలుపుతూ... కార్పొ రేట్‌ కల్చర్‌ని తలదన్నే రీతిలో ఫలితాలు సాధిస్తూ... గత 150 వసంతాలుగా రాష్ట్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతని నిలుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఒడ్రాజుల కాలంలో ప్రారంభించబడి... రాష్ట్రంలో తొలి హయ్యర్‌ సెకెండరీ పాఠశాలగా వాసికెక్కి, దేశానికి రాష్ట్రపతిని అందించిన ఘనత దక్కించుకుందీ పాఠశాల.

నేడు ఉద్దానంగా పిలవబడుతూ... ఈ ప్రాంతానికి జీవంలా ఉన్న వంశధార కాల్వలు లేని రోజుల్లో... విరిసిన విద్యావనానికి ప్రతీక నిలుస్తోంది టెక్కలి ఉన్నత పాఠశాల. మెట్ట భూముల్లో... అక్కరకు రాని పంటలతో... కాలం వెల్లదీస్తున్న క్రమంలో తమ భవిష్యతరం బాగుండాలన్న కాంక్షలతో... ప్రతి కుటుంబంలోనూ అక్కడ 'అక్షరాల' మొలకలేసాయి. నేర్చుకోవాలన్న తపన అనే సాగు విస్తారమై... ఉపాధ్యాయుల నిర్దేశకత్వంలో మొక్కవోని దీక్షతో చదివి, అంచెలం చెలుగా ఎదిగిన విద్యార్థులెందరినో... అనేక ఉన్నత స్థానాలు దక్కించుకు నేలా చేసిందీ పాఠశాల... దేశ ప్రధమ పౌరుడిని సైతం అందించి... నేటికీ అదే స్థాయిలో విద్యాబోధనలతో ఆదర్శంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.

తమ భాషా ఉన్నతికోసమే నాటి రాజులు కృషి చేస్తున్న కాలంలో... నేడు ఒరిస్సాలో ఉన్న పర్లాఖి మిడి సంస్థానాన్ని పాలి స్తున్న గజపతులలో శ్రీలక్ష్మీనారాయణ జగద్దేవ్‌ రాజ్యాధికారాన్ని వహిస్తున్న రోజుల్లో టెక్కలి ప్రాంతంలోని తెలుగు వారికోసం 1961లో ప్రాధమిక పాఠశాలగా ప్రారం భమై ఎందరో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించింది. బ్రిటీష్‌ వారి పాలన లోనూ ఉత్తమ పాఠశాలగా వెల్లివిరిసిన ఈ పాఠశాలలో పెరుగుతున్న విద్యా ర్థులు, వారి ప్రతిభాపాటవాలను చూసి అచ్చెరువొందిన నాటి పర్లాఖిమిడి సంస్థానా ధీసుడైన రాజామధుసూధనదేవ్‌ ఈ పాఠశాలను ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి సల్పారు.

ఆపై శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు తరువాత ఇదే పాఠశాలలో చదువుకుని జిల్లాపరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికైన బెండి కూర్మన్న హయాంలో పాఠశాలలో మౌళిక వసతులు ఏర్పాటయ్యాయి. ఇకిదే పాఠశాలలో చదువుకుని టెక్కలి శాసనసభ స్థానం నుండి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై... స్పీకర్‌గా పనిచేసిన రొక్కం లక్షీ ్మనరసిం హదొర ఈ పాఠశాల అభివృద్దికి, భవన నిర్మాణాలకు కృషిచేసారు. శాసనసభ స్పీకరుగా ఎన్నికైన ఆయన పాఠశాల బోర్డు స్కూల్‌ చేయటంలో కీలక భూమిక వహించడంతో పాటు నిధుల వరదపారించి భవనాలు, లాబరేటరీ, లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పించారు. నేడు సెకండరీ విద్యను దాటి 'హయ్యర్‌' విద్యాకళాశాలపై నాటి రాష్ట్ర ప్రభుత్వం నియమిం చిన 'లక్ష్మణదాస్‌ మొడలియర్‌ కమిటీ ఈ పాఠశాలను సందర్శించి... నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయ వర్గం, అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో చదువుతున్న విద్యార్థుల ను చూసి ఆశ్చర్యచకితులై... 'హయ్యర్‌సెకెండరీ' పై నివేదిక ఇస్తూ... దాన్ని ప్రారంభిం చందుకు టెక్కటి పాఠశాలను ఎంపిక చేసింది. అలా రాష్ట్రంలోనే తొలి హయ్యర్‌ సెకెండరీ పాఠశాలగా నిలిచి పోయిందీ పాఠశాల.

ఓ విద్యార్థి సమాజంలో అత్యున్నత పౌరుడిగా తీర్చిదిద్ద పడాలంటే... కేవలం చదువే కాదు నియమం, నిబద్ధతగల జీవితం...దానికి క్రమశిక్షణ తొడవ్వాలని నమ్మిన ఎల్లాపంతు కృష్ణమూర్తి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తూ... విద్యార్థిలోకానికి కొత్తవెలుగులు ఇచ్చే దిశగా కృషిచేసారు. పాఠశాల పేరు ప్రఖ్యాతులు వినుతికెక్కేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆచరించిన పద్ధతులు నేటికీ ఉపాధ్యాయ వర్గాలకు అనుసరణీయమే...

స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహ పిలుపు నిచ్చిన గాంధీజీకి ఈ నిర్ణ యానికిది సరైన సమయం కాదు కదా? అన్న వైవి మాష్టారి ప్రశ్నకు బాపూజీ కూ డా అవునని సమాధానం ఇచ్చారంటే... కాల మాన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావల్ని విద్యా ర్థుల్లోకూడా ఆయన ఎంతలా పెంపొం దించారో తెలిపే ఘట నే. దేశ ప్రధమ పౌరుడిగా జన నీరాజనాలందుకున్న వి.వి.గిరి ఈ పాఠశాల విద్యార్థి కావటం నేటికీ ఇక్కడి విద్యార్థిలోకం గర్వంగా చెప్పుకుని... స్పూర్తిగా తీసుకుంటారు.

ఇక ఆధునికాంధ్ర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న కవిపండితుడు ఆచార్య రోణంకి అప్పలస్వామి ఇదే పాఠశాల విద్యార్థి. దేశం విడచి ఎక్కడికి వెళ్లకుండానే 14 యూ రోపియన్‌ భాషల్లో విశేష ప్రావిణ్యతని దక్కించుకున్న ఘను డీయన.. దీనివెనుక ఉన్న రహస్యమేంటని ప్రశ్నించే వారికి నా తండ్రి తెలుగుభాషని ఉగ్గుపాలతో రంగరించి నాకు పట్టిస్తే... దానికి నా పాఠశాల ఉపా ధ్యాయులు మరిన్ని పరి మళాలు అందేలా చూసారు... అందుకే ఆయా భాషలు నేర్చుకోవటం నాకు చాలా సులభతరమైందంటూ... తెలుగు భాషలోని మాతృ మాధుర్యాన్ని చాటి చెప్పి... తెలుగు 'వాడి'ని ప్రద ర్శించారు.

అలాగే ఇంగ్లీష్‌ గ్రామర్‌ అంటే భయపడిపోతున్న ఆరోజుల్లో దానికి గ్లామర్‌ తెచ్చిన ఘనత మంత్రి ప్రగడ శేషగిరిరావు మాష్టారిది.విద్యార్థిని ఉన్నత శిఖరాల వైపు నడిపించాలంటే మాతృభాషతో పాటు ఇంగ్లీషు రావాలని భావించి పాఠశాల లో చదివే ప్రతివిధ్యార్థిని ఇంగ్లీష్‌ నేర్చుకోవాలని కుతూహలం కలిగేలా పాఠాలు చెప్పేవారాయన. ఆయన చెప్పిన పాఠాలు నేటికీ నాటి శిష్యులు వల్లెవేసుకుం టారంటే... ఎంతలా హత్తుకు పోయాయో చెప్పకనే చెప్పొచ్చు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా ఎదిగిన సత్తారు ఉమాపతి, టెక్కలి నియోజకవర్గ కేంద్రంగా శాసనసబ్యులుగా ఎన్నికై... శాసనసభల్లో కీలక భూమికలు పోషించిన హనుమంతు అ ప్పయ్యదొర, సత్తారు లోకనాధం, ప్రముఖ గజల్‌ గాయకుడు ప్రధాన ఆదినారా యణ ఇలా చాలా మంది మాష్టారి శిష్యగణంలో సభ్యులే... మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుతో ప్రత్యేక అనుబంమున్న రాష్ట్ర డిజిపిగా పనిచేసిన హెచ్‌.జే. దొర సైతం ఈ పాఠశాల విద్యార్థే కావటం విశేషం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు డి గా పురస్కారాన్ని అందుకున్న హనుమంతు వీరన్న, తెన్నేటి సత్యన్నారాయణ, స్వతంత్ర సమరయోధుడు, ప్రముఖ పాత్రికేయుడుగా వినుతుకెక్కిన జంధ్యాల లక్షి ్మ నారాయణ, ప్రజాపోరాటలకే తన జీవితా న్ని అంకితం చేసిన అట్లరాములు ఇలా ఎందరో ఈ పాఠశాలలో చదువుకున్న వారే... ఇక్కడే చదువుకుని ఉపాధ్యా యు లుగా... ప్రధానోపాధ్యాయులుగా పని చేసి... ఎందరో విద్యార్థులకు విద్యాదా నం చేసిన వారే... నిబద్దతతో చదువుకున్న విద్యార్థులకు ప్రతిసందర్భంలో ప్రోత్సాహకంగా నిలచిన వారే.. ప్రస్తుతం అధునాతన భవనాలతో... తెలుగు, ఒరియా, ఇంగ్లీష్‌ మీడియంలతో... ఈ పాఠశాల నడుస్తోంది. ప్రయివేటు పాఠశాల లకు ధీటుగా కంప్యూటర్‌ ల్యాబ్‌, రసాయనిక, భౌతికశాస్త్ర పరికరాలతో పాటు ఒరి యా, తెలుగు మీడియంలకు ప్రత్యేకం గా గ్రంధాలయాలు కలిగి ఉండటం గమ నార్హం. గత ఐదుతరాలుగా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి స్తూ... భావితరాలను ఉన్నతంగా ఉండే లా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయగణం నేటికీ అదే స్పూర్తి కొనసాగిస్తుండటం ఈ పాఠశా ల ప్రత్యేకం. బాలల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి పెంపొందించేందుకు వారికి కవితల పోటీలు పెట్టడం విశేషమిక్కడ.

శోధించి మరీ...

నాటి తరంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలు వారికి వివిధ అంశాలపై ఉన్న శ్రద్ధాశక్తుల్ని ప్రతిబింపచేసేలా ఉండేవని... వాటికి జవాబిచ్చే క్రమంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని, తెలియని విషమాన్ని తెలుసుకుని, గ్రంధాలు శోధించి మరీ జవాబులు ఇచ్చి విద్యార్థులు ప్రగతికి కృషి చేసేవారని ఓల్డు స్టూడెం ట్స్‌ అసోషియేషన్‌ సబ్యులు లైఫ్‌తో చెప్పారు. అప్పట్లో తమ పాఠశాల ఉదయం 7 గంటలకే ప్రారం భమ య్యదని... తమ ఉపాధ్యాయులు నిర్విరామంగా రాత్రుళ్లు కూడా తమని చదివించేందుకు... తమకు వచ్చే సంశయాలు తీర్చేందుకు మిక్కిలి కృషి చేసేవారని... చెప్పారు. నాటి విద్యార్థుల కృషి ఫలితమే... నేడు దేశ విదేశాల్లో అనేక ఉన్నత స్థానాల్లో టెక్కలి విద్యార్థులు ఉన్నారని.. ఇది తమ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని చెప్పారు.

అంతెందుకు ఓసారి రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న దామో దరం సంజీవయ్య ఈ పాఠశాలని సందర్శించేం దుకు లోనకు వస్తున్న సమయంలో 'విద్యాపరి మళాలు గుభాళించాల్సిన చోట... సిగార్‌ వాసనలు వస్తు న్నాయంటూ... సున్నితంగా చెప్పిన వైకె మాస్టారికి 'సారి' చెప్పి మీరు చెప్పింది అక్షరాలా నిజం పంతులు గారూ! అంటూ తన హుందాతనాన్ని చాటి చెప్పుకుని ప్రదర్శించిన విజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం. ఈ సన్నివేశం అసెంబ్లీ ప్రాంగ ణాలలో... నిండు కొలువుల్లో ... నిషేధిత ప్రాంతాలలో సైతం సిగరెట్లు వెలిగించి రింగు ల పొగలొదులుతున్న నేటి మన శాసనసభ్యులకు నిజంగా చెంప పెట్టులాంటిదే...

విదేశీయులూ ఉపాధ్యాయులుగా...

బ్రిటన్‌లో న్యాయకోవిదుడిగా ఉన్న ప్రెంట్‌ కామ్లీ, అమెరికా నుండి వచ్చిన షెటల్‌ సుల్తాన్‌లు ఈ పాఠశాల వాతావర ణానికి ముచ్చటపడి ఇక్కడ ఉపాధ్యాయు లుగా పనిచేసారు. తరువాత కాలంలో తిరిగి సొంత దేశానికి వెళ్లినా ఈ పాఠశాల పై మమకారాన్ని వదులు కోలేదు... 2006లో ప్రెంట్‌ కామ్లీ ఈ పాఠశాలని తన కుటుంబంతో సహా సందర్శించి... అప్పటి జ్ఞాపకాలని నెమరేసుకోవటం పెద్దవిశేషం.

పూర్వవిద్యార్థి సంఘం...

1964లో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన పప్పు హనుమంతరావు మాష్టారికీ ఈ పాఠశాలలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1971 వరకు ఇక్కడ ఉపాధ్యాయుడిగా... ఆపై ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన క్రమశిక్షణ, నిశిత అధ్యయనం విద్యార్థులకు అలవరిస్తే... వారిని అత్యున్నత స్థానాలు అందుకునేలా తీర్చి దిద్దవచ్చని నిరూపించారు. కులమతాలకు అతీతంగా విద్యార్థులని చేరదీసి, సొంత మనుష్యులుగా వారిని భావించి తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చి, ఆర్థికంగా... హార్థికంగా ఆదుకున్న మాష్టారి దగ్గర చదువుకున్న వారిలో ఉన్నత శిఖరాలు అందుకున్న వారు ఎక్కువే. గురువుకి తగ్గ శిష్యులుగా వారంతా ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థి సంఘంగా ఏర్పడి సేకరించిన నిధులని స్రకమంగా వినియోగిస్తూ.నేటా గురుపూజోత్సవం రోజున శ్రీకాకుళం జిల్లాలో, టెక్కలి కేంద్రంలో ఏడో తరగతి, పదోతరగతి, ఇంటర్‌లలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలు అందిస్తున్నారు.

ఉపాధ్యాయుడిదే ఉన్నత స్థానం

సమాజంలో ఉపాధ్యాయు డికే ఉన్నత స్థానం ఉంది... నా తండ్రి ప్రేరణతో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన నాకు నాటి సామాజిక పరిస్థితుల నడుమ చదువుకోవా లన్న తపనతో వచ్చే విద్యార్థులకి బాసటగా నిలచి, వారిలో ప్రతిభని వెలికి తీసి, ప్రయోజకుల్ని చేయటం వృత్తి ధర్మంగా, విధినిర్వహణలో భాగంగా చేసాను. నాదగ్గర చదువుకున్న విద్యార్థులు నేనూహించిన దాని కన్నా మిన్న గా ఎదగటం హర్షించదగ్గ పరిణామం. చాలా మంది ఈ సమాజానికి సేవలందించే అనేక ఉన్నత స్థానాల్లో ఉండటం నాకు గర్వం గా ఉంది.
- పప్పు హనుమంతరావు, పూర్వ ప్రధానోపాధ్యాయులు, టెక్కలి ఉన్నత పాఠశాల

వారి స్పూర్తినే ముందుకు...

ఎందరో ప్రముఖులు చదవిని చోట పనిచేయ టం నిజంగా నా అదృష్టం నేటికీ నిన్నటి తరం అందించిన స్పూర్తిని విద్యార్థు లకు అందించడంలో ఉపాధ్యాయ సిబ్బంది ఎన లేని కృషి చేస్తోంది. మారిన పరిస్థితుల కు అనుగుణంగా ప్రయివేటు పాఠశాలకు ధీటు గా ప్రచారం చేయలేక పోయినా వాటికి మిం చి న ఫలితాలు సాధించడంలో మాస్కూల్‌ ముందుంటోంది. ఎందరో ఈ పాఠశాలలో చదువుకుని దేశం లోనూ, విదేశాలలోనూ ఉన్నత పద వులు అలంకరించిన తీరుతెన్ను లు నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలచే లా ఇక్కడ విద్యాబోధన జరుగు తోంది. స్థానికంగా ఉన్న అధికారులు, పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులతో పాటు పాఠశాలకు కావాల్సిన సౌకర్యాల విషయం లో స్థానిక ప్రజా ప్రతినిధు లు చొరవ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఈ పాఠశాల విద్యార్థులు కావటం మాకు ఆనందదాయకం.
- సిహెచ్‌. రాజేశ్వరరావు ఆచారి, ప్రధానోపాధ్యాయులు,
టెక్కలి ఉన్నత పాఠశాల

గురుపూజోత్సవం మాకు పండగే

కౌన్సిలింగ్‌ అంటే తెలియని ఆరోజు ల్లోనే విద్యార్థుల పరిశీలనా శక్తి సామ ర్థ్యా లను అంచనా వేసి ఎవరు ఏఏ అంశాలలో ప్రతిభాపాటవాలు ప్రదర్శి స్తుంటారో వారి కి ఆసక్తి ఉన్న అంశాలనే ఆలంబనగా చేసు కుని... జీవితాన్ని ముందుకు సాగేలా అనె క సూచనలు చేసేవారు. దీని వల్లే అనేక మంది ఉన్నత శిఖరాలు అందుకోగలి గారు. మేమంతా కల్సి పప్పు హనుమంత రావు మాష్టారి పూర్వవిద్యార్థుల సంఘం పెట్టుకుని... మాగురువులందర్నీ గుర్తుంచుకునేలా ప్రతి ఏటా సెప్టెంబర్‌5 గురుపూజోత్సవాన్ని పండు గలా జరుపుకుంటాం... విద్యాసేవలందించి ప్రతిప్ట గడించిన ఉపాధ్యాయుల్ని సన్మానించుకుంటాం. ప్రతిభా అవార్డుల పేరుతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఈ కార్య్‌క్రమానికి ఏపూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవుతునే ఉంటారు.

- ఆకుల ప్రకాష్‌, కరస్పాండె ంట్‌, ట్రెజరర్‌,
పూర్వవిద్యార్థుల సంఘం, టెక్కలి ఉన్నత పాఠశాల.

-యం.రాంగోపాల్‌, ఫొటోలు : కృష్ణారావు,టెక్కలి