29, సెప్టెంబర్ 2012, శనివారం

శిరిడిసాయి సెన్సార్ కట్స్

సాయికృష్ణా ఎంటర్‌టైన్‌మెంట్‌ (ప్రై) లిమిటెడ్‌ పతాకాన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎ.మహేష్‌రెడ్డి నిర్మించారు 'శిరిడిసాయి'. నాగార్జున, శ్రీకాంత్‌, శరత్‌బాబు, సాయాజీ షిండే, శ్రీహరి ముఖ్య పాత్రధారులు.
ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' కట్స్‌ లేకుండా 30-8-12న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది. 6-9-12న విడుదలైన ఈ చిత్రం 2గం||25 ని||ల సేపు ప్రదర్శితమౌతుంది.

లైఫ్‌ బ్యూటిఫుల్‌ సెన్సార్ కట్స్

అమిగోస్‌ క్రియేషన్స్‌ నిర్మించిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రానికి రచయిత దర్శకుడు, నిర్మాత శేఖర్‌ కమ్ముల. అభిజిత్‌ కౌశిక్‌, సుధాకర్‌ కామనల్‌, జారా, షగున్‌ గుప్తా, నవీన్‌, అమల, శ్రియ, అంజలా ఝవేరి ముఖ్య తారాగణం. ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' కట్స్‌ లేకుండా 10-9-12న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది. 2గం||29 ని||పాటు ప్రదర్శితమయ్యే ఈ చిత్రం 14-9-12న విడుదలైంది.

చిక్కితేనే.. అందమా!

అందానికి ఎన్ని మార్కులుపడ్డా అభినయం తోడైతేనే పాస్‌ మార్కులు,ముఖానికి నవ్వే అందం, అందంవల్ల సంతోషం కలుగుతుంది, ఆనం వల్ల ఆరోగ్యం సమకూరుతుంది.కొంతకాలం క్రితం వరకు హీరోయిన్లు ముద్దుగా, బొద్దుగా, ముద్దమందారంలా, ముద్దబంతిపువ్వులా (ఇప్పటికీ తమిళ సినీ పరిశ్రమలో అదే కొనసాగుతుంది) ఉండాలనుకొనే వారు. హీరోలు విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన వొళ్ళు ఉంటే, హీరోయిన్‌కు యెద పుష్టి, బొద్దుగా ఉండే శరీరం కలిగితే చూడముచ్చటైన జంటగా భావించేవారు. ఇప్పుడు ఛాతీ లేదా యెద కన్నా వాటి కింద భాగమైన పొట్టపైనే దృష్టి పెడుతున్నారు. హీరోలు సిక్స్‌ ప్యాక్‌ లేదా ఎయిట్‌ ప్యాక్‌, హీరోయిన్‌ అయితే '0'సైజ్‌. అప్పట్లో ముఖపర్చస్సుతో పాటు నాటకానుభవం, కంఠస్వరం చూసి తీసుకొనే వాళ్ళు. కనుక సినిమా హీరోయిన్లుగా ఛాన్స్‌ కొట్టేసరికి ఏ పాతికపైనో వయస్సుండేది. టీనేజ్‌ అమ్మాయిలు హీరోయిన్లు అవుతారని వారు ఊహించి ఉండరు. ఇప్పుడు ముఖ పర్చస్సు, ముఖంలో హావభావాలు పలికించగలిగి, కొరియో గ్రాఫర్‌ స్టెప్పులకు అనుకూలంగా శరీరాన్ని కదిలించగలిగితే చాలు. కంఠస్వరం, భాష పట్టింపుల్లేవు. కాలం అనేక మార్పులకు లోనవుతుంది. ఆ మార్పులకు నాంది కొత్తదనం. కొత్తొక వింత పాతొక రోతఅనే సామెత వచ్చింది అందుకే! ఈ కొత్త కూడా పాతపడ్డప్పుడు అంతకు ముందున్న పాతదే కొత్తగా (కనిపిస్తుంది) వస్తుంది. దీన్నే కాలచక్రం అనికూడా అనొచ్చేమో! ఉదాహరణకు ముక్కు పుడకనే తీసుకోవచ్చు. నిన్నటి మొన్నటి వరకు ముక్కు పుడకను వాడటాన్ని ఇష్టపడని యువతులు, హీరోయిన్లు నేడు మక్కువ చూపుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే శ్రీదేవి, జయప్రద రాకతో హీరోయిన్‌ అంటే ఇలాగే ఉండాలి అనే భావన అటు ఇండస్ట్రీలోను ఇటు ప్రేక్షకుల్లోనూ కలిగేలా చేసారు. చలాకీగా, హుషారుగా, చిలిపిగా, సరసంగా నటించి (సినిమాలో) అటు హీరో నిద్రలోకి, ఇటు ప్రేక్షకుల నిద్రలోకి కలల రూపంలో చొరబడ్డారు. అప్పటినుండి హీరోయిన్‌ అంటే ముద్దమందారం కాదు సన్నజాజిలా ఉండాలిఅన్న సూక్తిలాంటిది మనస్సులో నాటుకు పోయేలా చేసారు. వీరితోపాటు వచ్చిన జయసుధ, జయచిత్రలు పోటీ ఇచ్చినా చాలా వరకు కుటుంబ కథలకే పరిమితమయ్యారు. గ్లామర్‌ పాత్రలు ఎక్కువగా వేయక పోయినా ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు. జయసుధ సహజనటిఅన్న బిరుదు తెచ్చుకొంది.
ఆ తర్వాత విజయశాంతి, రోజా, రాదిక, రాధ, భానుప్రియ, సుమలత, అంబిక, రమ్యకృష్ణ, నగ్మ, రంభ, రాశి, సౌందర్య, సుజాత వచ్చారు. సుజాత, అంబికలు మహిళల మన్ననలు పొందినా ఎక్కువకాలం నిలువలేక పోయారు. బొద్దుగా ఉండటం యువ హీరోలకు జోడీగా కుదరక పోవడం ఒక కారణం కావచ్చు. ఆ తర్వాత వచ్చిన సౌందర్య మాత్రం మహిళల మన్ననలతోపాటు కుర్రకారు మనసులను దోచి, కుటుంబ కథలకు, ప్రేమ కథలకు, దేవతా చిత్రాలకు అందం, అభినయం అనుకూలంగా ఉండటంతో పరిశ్రమ బ్రహ్మరథం పట్టింది. అకస్మాత్తుగా ఆమె చనిపోవడంతో కుటుంబ కథలు ఒక విధంగా ఆగిపోయాయనే అనుకోవచ్చు. ఇక్కడ అక్కినేని ప్రారంభించిన స్టెప్పులు వేగం పెంచుకున్నాయి. కుటుంబ కథా చిత్రాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో జయసుధ, జయచిత్ర, సౌందర్యల వారసత్వం కోసం ఎవరూ ప్రయత్నించడం లేదు. అంతా గ్లామరే. రాధ, రాధిక, నగ్మాలు కాస్త బొద్దుగా ఉన్నా చిరంజీవికి ధీటుగా ఎనర్జిటిక్‌గా స్టెప్పు లెయ్యడంతో ఎక్కువకాలం రాణించగలిగారు. రాశి, మీనాలు కూడా కాస్తా బొద్దుగా ఉన్నా తమ అందం, నటన దాన్ని డామినేట్‌ చేయడంతో ఇండస్ట్రీలో నిలబడగలిగి, అవకాశాలు దండిగా ఉండగానే పెళ్ళి చేసుకొని పక్కకు జరిగారు. విజయశాంతి, రోజాలైతే వెండితెరను ఏలినంత కాలం ఏలి ఇప్పుడు పొలిటి కల్‌ తెరపై తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.
ఇక్కడ కొత్తదనం మరో స్టెప్పు ముందుకు వేసింది. దాని పేరే మల్లె తీగ లేదా మెరుపు తీగ ఇంతవరకు కొంత మందైనా సినిమా అనేది ఒక కళ అని, ఒక మాధ్యమం అని అంటుండేవారు ఇప్పుడిది పూర్తిగా వ్యాపారం అయ్యింది. నిర్మాణ వ్యయం 20, 30 కోట్లకు చేరింది. 50, 60 కోట్లు వసూలు చేస్తే మామూలు సక్సెస్‌. వందకోట్లు రాబట్టగలిగితే గొప్ప సక్సెస్‌. దానికి దగ్గరి సూత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్‌ చెయ్యడం, వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చెయ్యడం. అంతే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మీడియాలో ఎన్ని స్టంట్స్‌ చేస్తున్నా, తెరపై అందాలను ఆరబోయడానికి కొత్తవారిని ఎన్నుకుంటున్నారు. కొత్తవారైతే తొలి అవకాశం ఇస్తున్నారన్న ఆనందంతో ఆరబోయవచ్చు. పాతవారు ఒప్పుకున్నా ప్రేక్షకులకు కొత్తగా కనిపించక పోవచ్చు. ఈ రెండు కారణములతో కొత్తవారికి ఛాన్సులు మెరుగయ్యాయి. ఒక్కో సినిమాకు ఒక్కరికన్నా ఎక్కువగా కూడా హీరోయిన్సుకు అవకాశాలు దొరకడం మొదలైంది. ఇక్కడ హీరోయిన్‌ జీవితకాలం తగ్గింది. మొదటి మూడు సినిమాలలో మొదటిది హిట్‌ లేదా బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలి.
మిగతా రెండు సినిమాలలో ఒక్కటి కన్నా ఎక్కువగా ప్లాప్‌లుండకూడదు. లేదంటే ఐరన్‌లెగ్‌ముద్ర ఉండనే ఉంది. ఎన్ని సక్సెస్‌లున్నా తన తోటివారితోనే గాక కొత్తవారితో పోటీపడాలి. అంటే ఇక్కడ హీరోయిన్‌ తన అందాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమేగాక ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా కొత్తందాలను చూపగలగాలి. అప్పుడే ఈ రంగుల, గ్లామర్‌, సెలబ్రిటి ప్రపంచంలో నాలుగు కాలాలు ఉండి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.
ఈ తరహా ఆలోచనల్లోంచే పుట్టుకొచ్చింది హీరోలకు సిక్స్‌, ఎయిట్‌ ప్యాక్‌. హీరోయిన్లకు'0'సైజ్‌. ఈ టెక్నాలజీ ముందే ఉన్నా సినిమా తారలతోనే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. సిక్స్‌పాక్‌ బాలీవుడ్‌, కోలీవుడ్‌లో కాక మన టాలీవుడ్‌లో కూడా లేటెస్టుగా సునిల్‌ కూడా సాధించాడు. ఇంతకు ముందు జూనియర్‌ ఎన్టీయార్‌ బొద్దుగా ఉన్న తనను ఎక్సర్‌సైజ్‌తో స్లిమ్‌గా చేసుకున్నాడు. మంచు విష్ణు కూడా ఎక్సర్‌సైజులతో బొద్దుకు దూరమైనా... ముఖంలో గ్లామర్‌ తగ్గినట్లుగా నీరసంగా కనిపిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మహేష్‌బాబు సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేసి ముఖంలో మార్పులు గమనించి ఆపేసాడట. ఇక హీరోయిన్ల విషయానికొస్తే... ఇక్కడ సన్నజాజి కూడా మోటయ్యింది.
అనుష్క, త్రిష, ఇలియానా, ప్రియమణి, నయనతార, తమన్నా, సమంత, కాజల్‌ లాంటి మెరుపు తీగలకే డిమాండ్‌ ఏర్పడ్డది. ఇప్పుడు బాలీవుడ్‌ '0' ఆదరిస్త్తోంది. టాలీవుడ్‌ మధ్యస్థమే ఇష్టపడుతోంది. కొలీవుడ్‌ మాత్రం ఇప్పటికీ బొద్దునే ముద్దు చేస్తుంది. బాలీవుడ్‌ ప్రవేశపెట్టిన '0'సైజ్‌ను ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనుకరిస్తున్నారు. బాలీవుడ్‌ అవకాశాల కోసం కావచ్చు లేదా ఇక్కడి ప్రేక్షకులకు కొత్తదనం చూపడం కోసం కావచ్చు. కాని ఎక్సర్‌సైజ్‌ చేసి ఎముకల గూడులా తయ్యారయ్యారని ఇలియానా, శ్రియ, పార్వతీ మిల్టన్‌ల గూర్చి కామెంట్లు వస్తున్నాయి. ఒక ముఖ చిత్రంపై ఆల్ట్రా మోడరన్‌గా తయ్యారైన శ్రియను చూసిన డమరుకం యూనిట్‌ తమఫోక్‌ సాంగ్‌కు చార్మిని తీసుకున్నారట.
చార్మీ కూడా ఎక్సర్‌సైజులు చేసి వళ్ళు తగ్గించుకుంది గాని మరీ ఇంత కాదు అంటున్నారు. బర్ఫీకోసం బరువు తగ్గిన ఇలియానా ( పాత్రల కోసం బరువు తగ్గడం పెరగడం అన్నది ప్రశంసించే విషయమే...గతంలో కమల్‌, విక్రమ్‌, సూర్య తదితరులు ఇలాగే చేశారు.) మరో బాలీవుడ్‌ అవకాశం దక్కించుకుందిట. మరి ఇదే పర్సనాలిటిని (బాలీవుడ్‌కు మకాం మార్చే అవకాశమున్నట్లుగా వార్తలు వస్తున్న సందర్భలో) మేయింటెన్‌ చేస్తుందో లేక వొళ్ళు చేస్తుందో చూడాలి. అయితే తన సైజుల్లో మార్పు లేదంది ఇటీవల ఇలియానా.
టెక్నాలజీ అయినా ఎక్సర్‌సైజ్‌లైనా మన శరీరానికి, మన వాతావరణానికి, మన పరిశ్రమకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూసుకోవాలి. గ్రాఫిక్‌ఉంది కదా అని కథలేకుండా సినిమా తీయలేం కదా! బంగారు కత్తైనా కూరగాయలను తరుగుతామే కాని మెడను నరుక్కోలేం కదా!
అయినా 'చక్కనమ్మ చిక్కినా అందమే'అన్నారు కాని 'చక్కనమ్మ చిక్కితేనే అందం'అన్లేదు కదా. ఆ రెంటికి తేడా తెలుసుకొంటే అందరికీ (తారలకీ, వారిని అనుసరించే అభిమానులకీ) బాగుంటుంది.

ఎన్‌. మదనాచారి

తాప్సీ మనస్తాపం

ఎప్పుడూ నవ్వుతూ, నవ్వించే తత్వం తాప్సీది. తనపై వస్తున్న గాసిప్స్‌ ఆమెను మనస్తాపానికి గురిచేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. యువ కథానాయకులు ఎవరితో నటించినా ఎఫైర్లు అంటగట్టడమే ఆమె నొచ్చుకోవడానికి కారణమట. తెలుగుతో పాటు తమిళ చిత్రాలు చేస్తున్న ఆమె పలు విభిన్న పాత్రలను చేయాలని కోరుకుంటోంది. ఆ మధ్య ఎన్నో అంచనాలతో విడుదలైన 'మొగుడు' చిత్రం విజయం సాధించకపోవడం ఆమెను నిరాశ పరిచింది. తాజాగా 'గుండెల్లో గోదారి', వెంకటేష్‌ సరసన 'షాడో', చిత్రాలు పేరు తెచ్చిపెడతాయని ఆమె అంటోంది.

బాలుకులతా మంగేష్కర్‌ అవార్డు

రఖ్యాత గాయకులు ఆశాభోంస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్‌ నారాయణ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్‌ సంగీత పురస్కారాలు-2012 ప్రకటించింది. వారితోపాటు ఉస్తాద్‌ గులాం అలీ, పర్వీన్‌ సుల్తానాలకు ప్రత్యేక పురస్కారాల కోసం ఎంపిక చేశామని సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి తెలిపారు. శుక్రవారం జూబ్లిdహాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అలనాటి నేపథ్య గాయని రావు బాలసరస్వతి, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ డి నాగేశ్వర రెడ్డిలతో కలిసి మాట్లాడారు. భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె పేరు మీద వరుసగా మూడో ఏడాది సంగీత పురస్కారాలను ప్రకటించినట్లు చెప్పారు. నవంబర్‌ 2న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అంద జేస్తామని అన్నారు. పురస్కా రాల కింద రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రం, లతా మంగేష్కర్‌ ట్రోఫీ రూపంలో వీణను ప్రదానం చేస్తామని వివరించారు. రంగస్థల గాయకులను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది హైదరాబాద్‌కు చెందిన శ్యామ్‌సన్‌ ముఖేష్‌, సురేఖామూర్తిలకు ఈ అవార్డులను అందజేయనున్నామని అన్నారు. సింగింగ్‌ స్టార్‌ పేరుతో వారిని గౌరవిస్తామని అన్నారు. 'యువ ప్రతిభ' అవార్డు కోసం కోల్‌కతకు చెందిన కౌశికి చక్రవర్తిని ఎంపిక చేశామని చెప్పారు. పండిట్‌ రవిశంకర్‌, గాయకులు పి సుశీల, ఎస్‌ జానకి, చిత్ర, కవితా కృష్ణమూర్తి, అల్కా యజ్ఞిక్‌లకు లతా మంగేష్కర్‌ జీవిత సాఫల్య పురస్కరాలను అందజేస్తామని అన్నారు.
తొలి ఏడాది 'ఇండియన్‌ ఐడల్‌' శ్రీరామచంద్రకు, ద్వితీయ సంవత్సరంలో చిత్ర, శంకర్‌ మహదేవన్‌లకు ఈ అవార్డులను అందజేశామని ఆయన అన్నారు.

రోశయ్యకు ప్రతిష్ఠాత్మక 'భీష్మాచార్య పురస్కారం

తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్యకు ప్రతిష్ఠాత్మక 'భీష్మాచార్య పురస్కారం' లభించింది. స్థానిక టీ నగర్ హబీబుల్లా రోడ్డులోని కర్ణాటక సంఘ్ పాఠశాల ఆవరణలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన శ్రీశ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ చతుర్మాస సేవా సమితి ఆయనకు అవార్డును ప్రదానం చేసింది.

రాజకీయ రంగంలో అపార అనుభవం గడించి, అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేసినందుకే రోశ య్యను సత్కరించినట్టు సమితి ప్రతినిధులు వెల్లడించారు. ఉడిపి పెజావర్ మఠ్ పీఠాధిపతి శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ హాజరై రోశయ్యకు ఆశీస్సులు అందించారు. స్వామీజీ దీవెనల కన్నా పురస్కారాలు, బిరుదులు ప్రధానం కాదని ఈ సందర్భంగా రోశయ్య అన్నారు. స్వామీజీ ఆశీస్సులు దక్కుతాయన్న ఉత్సాహంతోనే వచ్చానన్న ఆయన.. భీష్మ ఆచార్య పురస్కారాన్ని స్వీకరించేంత అర్హత ఇంకా తాను సాధించినట్లు అనుకోవడం లేదని అన్నారు.

ఈ చిప్‌కి ఏమీ కాదట

లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ.. ఈ చిప్‌కి ఏమీ కాదట! 1000 డిగ్రీల వేడి సైతం దీన్లోని డేటాని దగ్ధం చేయలేదట. నీళ్లల్లో పడ్డా నిక్షేపంగా పైకి తేలుతుందట. రేడియేషన్, రసాయనాలతోనూ చెక్కుచెదరదట. ఇందులో దాచే సమాచారం 10 కోట్ల సంవత్సరాల దాకా పాడవకుండా ఉంటుందట. ఇంతకీ ఏమిటీ చిప్? బోలెడన్ని ఫొటోలు.. ఇష్టమైన సినిమాలు.. నచ్చిన పాతపాటలు.. వీటన్నిటినీ దాచుకోవాలంటే మనకు పెద్దఎత్తున స్టోరేజ్ డిస్కులు కావాలి! సీడీలు, డీవీడీలూ, బ్లూరే డిస్కులు గీతల వల్ల పాడైపోయే ముప్పు ఉంది.

టెరాబైట్ల సామర్థ్యం గల ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్కులు కరెంటు సరఫరా సరిగా లేకపోతే అవీ పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో, ఈ సమస్యకు చెక్‌పెట్టే అద్భుత 'చిప్'నొకదాన్ని తయారుచేసినట్టు హిటాచీ కంపెనీ ప్రకటించింది. క్వార్ట్జ్ గ్లాస్‌తో రెండుపొరలుగా ఈ చిప్‌ను రూపొందించినట్టు తెలిపింది. అంతాబానే ఉందిగానీ.. ఒక చదరపుటంగుళం చిప్‌లో 40 ఎంబీ డేటా మాత్రమే పడుతుంది.

సమైక్యవాదుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు

సమైక్య వాదాన్ని వినిపించేందుకు సమైఖ్యాం'ద సంర'ణ సమితి విజయవాడ ప్రకాశం 'ా్యరేజిపై ఈ నెల 30న తలపెట్టిన మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఆం'లను దష్టిలో పెట్టుకొని సమైక్యాం'ద మార్చ్‌కు అనుమతి నిరాకరించినట్లు వెస్ట్ జోన్ ఏసీపీ టి.హరికష్ణ తెలిపారు.సమైక్యవాదుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు' సమైక్యాం'ద రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి

సమైక్యవాదుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనటానికి ఈ నెల 30న తాము తలపెట్టిన సమైక్యాం'ద మార్చ్‌కు నగరంలో అనుమతి నిరాకరించడమే నిదర్శనమని సమైక్యాం'ద సంర'ణ సమితి రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి అన్నారు. ఈ విషయమై స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోక్యం చేసుకొని అనుమతి ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు. లేనిప'ంలో నాలుగు రోజుల్లో తాము ఓ ప్రణాళికను రూపొందించి ప్రణాళికాబద్దంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమైక్యాం'ద ప్రాంతంలోని సమైక్యవాదులు వారి వారి ప్రాంతాల్లోని గాం'దీ విగ్రహాలకు పూలమాల వేసి గాం'దీ మార్గంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు ప్ర'దాన మంత్రి, ముఖ్యమంత్రులకు సమైక్యవాదులు ఉత్తరాలు రాయనున్నట్టు తెలిపారు.

రూ.7.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

వినాయక నిమజ్జనంలో ప్రత్యేకంగా నిలిచే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. రూ.7.50 లక్షలకు పన్నాల గోవర్ధన్ లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూ ధర గత ఏడాది కంటే రూ.2.05 లక్షలు ఎక్కువ పలికింది. గతేడాది లడ్డూ ధర రూ.5.45 లక్షలు. నాన్న చివరి కోరిక మేరకు లడ్డూను దక్కించుకున్నట్లు గోవర ్ధన్ తెలిపారు. బాలాపూర్ లడ్డూ బరువు 21 కిలోలు. దీనిని తాపేశ్వరంలో ప్రత్యేకంగా తయారుచేయించడం జరుగుతుంది. 1994లో మొదటి సారి లడ్డూ ధర రూ.450 పలికింది

27, సెప్టెంబర్ 2012, గురువారం

బాబు ముస్లిం సాధికారిక విధాన0

ముస్లింల సాధికారిక విధానాన్ని(ఎంపవర్‌మెంట్ పాలసీ) తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రకటించారు. శాసనసభలో ముస్లింలకు 15 ఎమ్మెల్యేల సీట్లు రీజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ముస్లిం మహిళలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు.

నిరుద్యోగ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి పథకాలు, ముస్లింల ఆర్థికాభివృద్ధికి, సామాజికభ్యున్నతికి వీలుగా వార్షిక బడ్జెట్‌లో రూ. 2,500 కోట్లు కేటాయించాలని చంద్రబాబు నాయుడు మైనారిటీ విధాన నిర్ణయంగా ప్రకటించారు.

హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు

ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. నగరమంతటా నవంబర్ 18 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ సీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలను కూడా ఈ నిషేధాజ్ఞల పరిధిలో చేర్చారు. నగరంలో ఎక్కడా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుపరాదని నిషేధాజ్ఞల్లో పేర్కొన్నారు.

వ్యతిరేకత విషయం ఆజాద్‌కు తెలియదట

 బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విభజన సమయంలో వ్యతిరేకత వచ్చిన విషయం ఆజాద్‌కు తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గొంటానని, నాయకత్వం వహిస్తానని పేర్కొన్నారు.
తెలంగాణపై ఏకాభిప్రాయం అవసరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ అంశంపైనా ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఆయన తెలిపారు.

మార్చ్‌కు ప్రభుత్వం వ్యతిరేకం కాదు

రత్యేక తెలంగాణపై రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోనే తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. విభజనపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఏకాభిప్రాయం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నిర్ణయంపై కేంద్రానికి గడువు విధించలేమని, స్వేచ్చగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి అవకాశం ఇవ్వాలని సీఎం కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అన్ని పార్టీలతో కేంద్రం చర్చించాల్సి ఉందన్నారు.

చిత్రసీమకు వరాల పంట విఠలాచార్య

జానపద చిత్రాలే విఠలాచార్యకు మంచిపేరు తెచ్చాయి. జానపదాలకు భక్తినిగాని ఫాంటసీ గాని మేళవించి ఆకట్టుకునేలా తీశారు. సాంఘిక చిత్రాలు రూపొందించి అదే విధమైన పేరు తెచ్చు కోవాలని కృషి చేసినా ఆయనకు అచ్చిరాలేదు. కాంతారావుతో రూపొందించిన తొలి సాంఘిక 'కన్యాదానం' చలం, కృష్ణకుమారితో 'వద్దంటే పెళ్లి' తీశారు. ఆ తర్వాత 'పెళ్లి మీద పెళ్లి' అన్నా చెల్లెలు, చిత్రాలు చాలాకాలం తర్వాత అక్కినేనితో రూపొందించిన 'బీదలపాట్లు' వంటి సాంఘిక చిత్రాలు ఇందుకు ఉదాహరణ.

ఫొటోగ్రఫీ జిమ్మిక్సూ, గ్రాఫిక్సూ తెలియని కాలంలో దెయ్యాలూ భూతాలు లాంటి అభూత కల్పనలతో, చిత్రవిచిత్రమైన ప్రయోగాలతో సినిమాలు రూపొందించిన విఠలాచార్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన 'వైర్‌ వర్క్‌'ని తనదైన శైలిలో జానపద చిత్రాల్లో చూపిస్తూ అచ్చెరువొందేలా చేశారు బి. విఠలాచార్య. కన్నడ దేశస్తుడు అయినప్పటికీ తెలుగు చిత్రాల నిర్మాణం చేపట్టారు. దర్శకత్వంలో అపురూపమైన మెలకువలు చూపారు. మాతృభాష కన్నడంలో కేవలం అయిదు చిత్రాలే డైరెక్టు చేశారాయన.
హీరో ప్రముఖుడైనప్పుడు ఆయన్ని ఎలా చూపించినా, ఎన్ని సాహసాలు చేయించినా అందులోని లోపాలను ప్రేక్షకులు పట్టించుకోరని, అదే తన టెక్నిక్‌ అని చెప్పేవారాయన. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్‌ పెరగడానికి, పెంచడానికి కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. ఏ నిర్మాత అయినా అలా తన చిత్రాల్లో నటించే వారికి పారితోషికం పెంచుతున్నారని తెలిస్తే వారితో వాదించి పారితోషికం పెంచకుండా అడ్డుకునేవారు. అలానే ఆర్టిస్టు కనుక సహకరించకపోయినా లేదా తన పంథాను విమర్శిస్తున్నట్లు తెలిసినా సినిమాలో కథను మార్చేసి శాపగ్రస్తుడిగా చేసి చిలుకగానో, పాముగానో, రాయిగానో మార్చేసేవారని విఠలాచార్య గురించి తెలిసిన సన్నిహితులు చెప్తుంటారు.
జానపద చిత్రాలే విఠలాచార్యకు మంచిపేరు తెచ్చాయి. జానపదాలకు భక్తినిగాని ఫాంటసీ గాని మేళవించి ఆకట్టుకునేలా తీశారు. సాంఘిక చిత్రాలు రూపొందించి అదే విధమైన పేరు తెచ్చుకోవాలని కృషి చేసినా ఆయనకు అచ్చిరాలేదు. కాంతారావుతో రూపొందించిన తొలి సాంఘిక 'కన్యాదానం' చలం, కృష్ణకుమారితో 'వద్దంటే పెళ్లి' తీశారు. ఆ తర్వాత 'పెళ్లి మీద పెళ్లి' అన్నా చెల్లెలు, చిత్రాలు చాలాకాలం తర్వాత అక్కినేనితో రూపొందించిన 'బీదలపాట్లు' వంటి సాంఘిక చిత్రాలు ఇందుకు ఉదాహరణ. విఠలాచార్య వాస్తును, జాతకాలను, గ్రహాలను ఎక్కువగా నమ్మేవారు. సినిమా పూజా కార్యక్రమాల్లో ఎవరైనా సరిగా కొబ్బరికాయ కొట్టకపోతే వంకరగా పగులుతుందేమో, అలా పగిలితే సినిమాకి విఘాతం కలుగుతుంది అని గాఢంగా విశ్వసించేవారు.
జయవిజయ, వరలక్ష్మి వ్రతం, ఖైదీ కన్నయ్య, మదన కామరాజు కథ, గురువును మించిన శిష్యుడు. నవగ్రహ పూజామహిమ, జ్వాలాద్వీప రహస్యం, అగ్గిదొర, ఇద్దరు మొనగాళ్లు, చిక్కడు దొరకడు, పేదరాశి పెద్దమ్మ కథ, భలే మొనగాడు, బందిపోటు, అగ్గిపిడుగు, మంగమ్మ శపథం, అగ్గిబరాటా, గండికోట రహస్యం, లక్ష్మీకటాక్షం, అలీబాబా 40 దొంగలు, జగన్మోహిని - మొదలైన చిత్రాలు విఠలాచార్య రూపొందించినవే. 'కదలి వచ్చిన కనకదుర్గ' ఆయన రూపొందించిన చివరి చిత్రం. ఆరోజుల్లో ఇప్పటిలా టెక్నాలజీ లేదు. అయితేనేం అభూత కల్పనలతో కూడిన ఫాంటసీ చిత్రాలు రూపొందించి గొప్ప టెక్నిక్‌ కనబరిచారు. విఠలాచార్య చిత్రసీమకు వరాలపంట అంటే అతిశయోక్తి కాదు.
- వి.ఎస్‌.కేశవరావ్‌

పెళ్లి ఉత్తరం

ఆదివారం అంటే గవర్నమెంట్‌ ఉద్యోగస్తులకు తెగ ఆనందం. ప్రతిరోజూ ఆఫీసులో చేసేది ఏమీలేనప్పటికీ, విధిగా ఆదివారం మాత్రం ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశంతో ఉన్న అనేకమందిలో సత్యమూర్తి ఒకరు. మార్నింగ్‌ ఇంట్లో పేపర్‌ చదువుతూ కాఫీ తాగుతు న్నాడు. భార్యతో సండే ప్రోగ్రామ్స్‌ గురించి చర్చించాడు. 'సండే రోజున ఎవరైనా పెళ్ళికి పిలిస్తే బావుండు. ఎంచక్కా భోజన ఖర్చులు కలిసివచ్చేవి అనుకున్నాడు' మనసులో. ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది. ''సండే నాడు ఎవరా అనుకుంటూ'' విసుగ్గా తలుపుతీశాడు. ఎదురుగా కొరియర్‌ బాయ్‌ చిరునవ్వులు చిందిస్తూ ''గుడ్‌మాణింగ్‌ మీకు కొరియర్‌ వచ్చింది'' అంటూ సిన్సియర్‌గా చెప్పాడు.

కొరియర్‌ అనగానే సత్యమూర్తి కళ్ళలో మెరుపు మెరిసింది. అనారోగ్యంతో ఉన్న తన అత్తయ్య ఢమాల్‌మని కొంతకాలమైంది. ఆస్తి కాగితాలు పంపిందేమో అనుకుంటూ కొరియర్‌ ఇచ్చిన కవర్‌ ఆతృతగా విప్పబోయాడు. ప్రమాదాన్ని శంకించిన కొరియర్‌ బాయ్‌ టక్కున మూర్తి చేతిలోని కవర్‌ లాక్కున్నాడు. మూర్తి వంక అనుమానంగా చూశాడు. ''సత్యమూర్తి అంటే నిజంగా మీరేనా?'' డౌట్‌తో అడిగాడు.
''అవునవును ఎందుకలా అడిగావ్‌?''
''సైన్‌ చేయకుండా కవర్‌ చించేస్తుంటే అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది మీ ఐడీ కార్డు చూపించండి'' అంటూ కవర్‌ను వెనక దాచేసుకున్నాడు.
సత్యమూర్తికి ఆవేశం వచ్చేసింది. తమాయించుకున్నాడు. తానే తొందరపడినట్టు గ్రహించాడు. కూల్‌గా ''చూడు మిస్టర్‌.. జస్ట్‌ కవర్‌లో ఏముందో చూడాలనే టెన్షన్‌తో అలా చేశానన్నమాట. అందుకే చింపబోయాను. నిజంగా నేనే సత్యమూర్తినయ్యా, కావాలిస్తే నేమ్‌బోర్డు చూడు'' అంటూ గోడకున్న తన నేమ్‌బోర్డును చూపించాడు. దాంతో కొరియర్‌ బాయ్‌ శాంతించాడు. సంతకం తీసుకుని, కవర్‌ ఇచ్చేశాడు. బాయ్‌ వీధి మలుపు తిరిగాక, కవర్‌ ఓపెన్‌ చేశాడు. అందులో మూర్తి ఆశించినట్టు ఆస్తి కాగితాలు లేవు. శుభలేఖ ఉంది. ఫ్రమ్‌ అడ్రస్‌ చూశాడు. తన బంధువు.. వరుసకు బాబాయ్‌ అవుతాడు. అతని కుమారుడి పెళ్ళి అని అర్థమైంది. భర్తచేతిలో శుభలేఖ చూసి ఆనందంగా దగ్గరకు వచ్చింది భార్య ప్రసూన. ''పెళ్ళి ఎవరిదండీ.. మొన్న కొనుక్కున్న పట్టుచీర కట్టుకుంటాను'' అని ఆతృతగా అంది.
సత్యమూర్తి మాత్రం ఎలాంటి భావాలు పలికించకుండా ఉన్నాడు. దానికి కారణం శుభలేఖతో పాటుగా కనిపించిన లెటర్‌. శ్రీమతి అండ్‌ శ్రీ అని ప్రింట్‌ చేసివుంది. ఆ పక్కన సత్యమూర్తి పేరును పెన్నుతో రాశారు. మిగతా మ్యాటర్‌ మొత్తం ప్రింటింగ్‌లో ఉంది. శుభలేఖతో పాటుగా ఇలాంటి లెటర్‌ రావడం ఆశ్చర్యం కలిగించింది. ప్రసూన కూడా సేమ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి ''లెటర్‌ ఏమిటండీ?'' ఉండబట్టలేక అడిగేసింది.
''నేనూ అదే చూస్తున్నాను. సరే లెటర్‌ చదివి చెబుతాను'' అంటూ కుర్చీలో రిలాక్స్‌డ్‌గా కూర్చుంటూ అన్నాడు.
''నో నో నేను కూడా చదువుతాను. శుభలేఖతో లెటర్‌ అంటే టీవీ సీరియల్‌లో ఉన్నంత ట్విస్ట్‌ ఉందనిపిస్తోంది. 'చావులేఖా.. శుభలేఖా' సీరియల్లో హీరోయిన్‌ ఇలాగే చేసిందండి..''
''అబ్బ ఇప్పుడు కూడా సీరియల్స్‌ గురించేనా కాస్త కుదురుగా ఉండు లెటర్‌ చదివేస్తాను'' విసుగ్గా అన్నాడు మూర్తి.
''మళ్ళీ మాట తప్పుతున్నారండీ ఇద్దరం కలిసి చదువుదాం నాకు టెన్షన్‌గా ఉంది''
భార్య తన మాట వినదని గ్రహించిన సత్యమూర్తి ఎప్పటిలాగే కాంప్రమైజ్‌ అయ్యాడు. ''సరే ఇద్దరం కలిసే చదువుకుందాం. కాస్త కాఫీ తీసుకురా''
భర్త ఎత్తుగడ తెలిసిన ప్రసూన ''అబ్బ ఆశ.. కాఫీ తేవడానికి నేను వెళ్ళగానే మీరు లెటర్‌ చదివేస్తారు. ఆ పప్పులేం ఉడకవ్‌. నిజంగా కాఫీ కావాలంటే ఆ లెటర్‌ ఇటు ఇచ్చేయండి. కాఫీతో వచ్చాక ఇస్తాను''
ఇకలాభం లేదనుకున్నాడు సత్యమూర్తి. ''సరే మనిద్దరి డిస్కషన్‌ వల్ల ఆల్‌రెడీ హాఫెనవర్‌ వేస్ట్‌ అయింది'' అంటూ ఇద్దరు కలిసి లెటర్‌ చదవడానికి ఉపక్రమించారు.
''శ్రీ, శ్రీమతి సత్యమూర్తిగారికి నమస్కారాలు. శుభలేఖలో నా పెళ్ళి డీటెయిల్స్‌ ఉన్నాయి. నెక్ట్స్‌ సండే నా పెళ్ళి...'' అని చదువుతూ, మధ్యలో ఆపి, భార్యవంక చూసి ''వచ్చే ఆదివారం మనకు ఫుడ్‌ ఖర్చు తగ్గిందే. ఎంచక్కా పెళ్ళికి వెళ్ళిరావచ్చు'' అన్నాడు మూర్తి.
లెటర్‌ చదువుతుంటే మధ్యలో బ్రేక్‌ వేయడం నచ్చలేదు ప్రసూనకు. ''అబ్బ ఎప్పుడూ తిండిధ్యాసే మీకు. ముందు లెటర్‌ కంటిన్యూ చేయండి'' అన్నది.
మూర్తి కంటిన్యూ చేయసాగాడు. ''నేడు అందరూ బిజీగా ఉంటున్నారు. వారి పర్సనల్‌ లైఫ్‌ను డిస్టర్బ్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో కూడా ఇంతే. దాన్నే నేను ఫాలో అవుతున్నాను....'' మళ్ళీ మూర్తికి డౌట్‌ వచ్చింది. 'ఇంతకీ వీడు ఏం చెప్పబోతున్నాడు?' అనే అనుమానం వ్యక్తపరుస్తూ భార్య వైపు చూశాడు.
ప్రసూన కళ్ళు మిటకరించడంతో సిన్సియర్‌గా లెటర్‌ చదవడం కంటిన్యూ చేయసాగాడు. ''...అందువల్ల నేను పెళ్ళికి పిలిచానని భావించవచ్చు. పిలిచి మీ పర్సనల్‌ టైమ్‌ వేస్ట్‌ చేయలేను. అందుకే జస్ట్‌ నేను పెళ్ళి చేసుకుంటున్న విషయాన్ని మాత్రమే మీకు ఇన్‌ఫామ్‌ చేస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్‌, కజికిస్థాన్‌లో కూడా ఇలాగే ఇన్‌ఫామ్‌ చేస్తుంటారు. అందుకే నేను మీకిలా తెలియజేస్తున్నాను...'' లెటర్‌ చదువుతున్న సత్యమూర్తి ఫేసులో రంగులు మారసాగాయి. భర్త ముఖంలో రంగుమారడం ప్రసూనకు తెగ ఆనందం కలిగింది. ''ఏవండేవండీ మీ ఫేస్‌ బ్లాక్‌ కలర్‌ నుండి రోజ్‌ కలర్‌కు మారుతోంది. అబ్బ తెగ ముద్దొస్తోంది. కనీసం మన పెళ్ళి రోజైనా ఇలా రోజ్‌ కలర్‌లో కనిపించవచ్చుకదా!'' మురిపెంగా అడిగింది. ఊసరవెల్లిలా భర్త కలర్స్‌ మార్చడం ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
సత్యమూర్తి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. లెటర్‌ లోని విషయాలే చిత్రంగా అనిపిస్తూ, ప్రమాదసూచికను తెలియజేస్తున్నాయి. ధైర్యం తెచ్చుకుని లెటర్‌ కంటిన్యూ చేయసాగాడు ''...అందువల్ల జస్ట్‌ శుభలేఖ ద్వారా నా పెళ్ళి విషయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అయితే నా పెళ్ళి చూడాలని మీకు తెగముచ్చటగా ఉండవచ్చు. అందుకే పెళ్ళైన మరుక్షణమే వీడియోను యూ ట్యూబ్‌లో పెడతాను. ఇంకా నా బ్లాగ్‌లో కూడా ఉంటుంది. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్‌ సర్వం బ్లాగ్‌స్పాట్‌లో చూడండి. వన్‌ వీక్‌ తర్వాత మీ ఇంటికి కొరియర్‌లో మా పెళ్ళి సీడీ పంపిస్తాను...'' లెటర్‌ చదువుతున్న సత్యమూర్తి చేతులు వణికాయ్‌. కోపం హండ్రెడ్‌ డిగ్రీలకు చేరుకుంది. భర్తతో పాటుగా లెటర్‌ ఫాలో అవుతున్న ప్రసూనకు కూడా కోపం వచ్చినా అది కొద్దిసేపే. ''ఏవండీ ఈ ఐడియా బావుంది కదూ... మనబ్బాయిలకు కూడా ఇదే ఫాలో అవుదామా'' ఉత్సాహంగా అడిగింది. భార్య అడిగిన ప్రశ్నతో సత్యమూర్తి కోపం ఒక్కసారిగా జీరో డిగ్రీలకు పడిపోయింది. లెటర్‌ పూర్తిగా చదివేశాక తన నిర్ణయం ప్రకటిద్దామనుకున్నాడు. ''....మా పెళ్ళి సీడీ చూశాక సేమ్‌ బ్లాగ్‌కు మీ అభిప్రాయాలను పోస్ట్‌ చేయండి. పెళ్ళికి రాలేదని, గిఫ్ట్‌లు ఇవ్వలేదని, పెళ్ళి భోజనం చేయలేదనే బాధ మీలో ఉంటుందని నాకు తెలుసు. అందుకే మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్‌లకు ఒక సౌకర్యం ఏర్పాటు చేశాను. డీటెయిల్స్‌ నా బ్లాగ్‌లో ఉంటాయి. ఇక పెళ్ళి భోజనం చేసే వీలు కూడా కల్పించాను. శుభలేఖతో పాటుగా నాలుగు భోజనం టికెట్స్‌ పంపిస్తున్నాను. ఇవి నాలుగువారాలు చెల్లుబాటులో ఉంటాయి. మీరెప్పుడైనా అమీర్‌పేట్‌ వచ్చినపుడు అక్కడ మెస్‌లో ఈ భోజనం టికెట్స్‌ ఇచ్చి భోంచేయండి. ఇట్లు మీ వీధేయుడు సూర్యనారాయణమూర్తి'' అని ఉంది. లెటర్‌ పూర్తిగా చదివాక సత్యమూర్తి, ప్రసూన దంపతుల ముఖంలో మల్టిdకలర్స్‌ కనిపించసాగాయి. శుభలేఖ వంక దానివెంట వచ్చిన లెటర్‌ వంక వారిద్దరూ ఎగాదిగా చూడసాగారు.


''శ్రీ, శ్రీమతి సత్యమూర్తిగారికి నమస్కారాలు. శుభలేఖలో నా పెళ్ళి డీటెయిల్స్‌ ఉన్నాయి. నెక్ట్స్‌ సండే నా పెళ్ళి...'' అని చదువుతూ, మధ్యలో ఆపి, భార్యవంక చూసి ''వచ్చే ఆదివారం మనకు ఫుడ్‌ ఖర్చు తగ్గిందే. ఎంచక్కా పెళ్ళికి వెళ్ళిరావచ్చు'' అన్నాడు మూర్తి.
లెటర్‌ చదువుతుంటే మధ్యలో బ్రేక్‌ వేయడం నచ్చలేదు ప్రసూనకు. ''అబ్బ ఎప్పుడూ తిండిధ్యాసే మీకు. ముందు లెటర్‌ కంటిన్యూ చేయండి'' అన్నది.

- రామనారాయణరాజు

వైకాపా నిర్లక్ష్యం గిరిజనుల నిలదీత

భద్రాచలంలో బుధవారం జరిగిన వైకాపా నియోజకవర్గ సమావేశంలో తిరుగుబాటు గళం పెల్లుబికింది. గతంలో మాదిరిగానే ఈ సమావేశంలో కూడా వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒకే సామాజిక వర్గానికి జిల్లా నాయకత్వం కొమ్ముకాస్తుందంటూ గిరిజనులు ఎదురుదాడికి దిగారు. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గిరిజనులు జిల్లా నాయకత్వాన్ని నిలదీశారు. ఈ సమయంలో జిల్లా కన్వీనరు పువ్వాడ అజయ్‌కుమార్‌కు, వివిధ మండలాలకు చెందిన గిరిజన నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. సభా వేదికపైకి ఒకే వర్గానికి చెందిన నాయకులను పిలిచి గిరిజనులను వేదికపైకి పిలవకుండా కించపరిచారంటూ సమావేశంలో నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వివాదంకు దిగిన గిరిజన నాయకులపై జిల్లా నాయకులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో డివిజన్లో భద్రాచలం, చింతూరు మండలాల్లో వైకాపా కోసం కష్టపడుతున్నగిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చూస్తున్నారని జిల్లా నాయకత్వాన్ని ఆ మండలానికి చెందిన పలువురు గిరిజన నాయకులు నిలదీశారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. కష్టపడుతున్న వారిని విస్మరించి ఒక సామాజిక వర్గానికి జిల్లా నాయకత్వం కొమ్ముకాస్తుందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే డివిజన్‌స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆందోళనకారులను జిల్లా నాయకులు సర్ది చెప్పేందుకు పలుమార్లు ప్రయత్నించారు.

కేసీఆర్ తీరుపై జగన్ అసంతృప్తి

తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంటే ఢిల్లీలో కేసీఆర్ ఏమి చేస్తున్నారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అన్నారు. కేసీఆర్ తీరుపై జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ మార్చ్ విజయవంతం చేయడానికి కృషి చేయాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అంతేకాక తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాక తెలంగాణపై తాజాగా చంద్రబాబు లేఖ ఇవ్వడాన్ని డ్రామా కొట్టిపడేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని జగన్ విమర్శించారు.

టీడీపీకి బైరెడ్డి బై.. బై..

తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కానీ రాయలసీమ అంటే ఎందుకు చంద్రబాబుకు లెక్కలేనితనం ఉందోనని బైరెడ్డి మండిపడ్డారు. బాబుకు సలహాలు ఇస్తున్నవారు పార్టీని ముంచడానికే తప్ప, పెంచడానికి కాదని టీడీపీ నేతలను విమర్శించారు.

తనకు రాజకీయాల కన్నా రాయలసీమ ప్రయోజనాలే ముఖ్యమని బైరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు అవ్వడానికి రాయలసీమను ఉపయోగించుకుంటున్న నేతలు ఆ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమ నాలుగు జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 40 రోజులపాటు రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర చేస్తానని ఆయన తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ప్రవీణ్‌రెడ్డి

ప్రత్యేక తెలంగాణపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధానమంత్రికి లేఖ రాయడంపై ఆ పార్టీ సీమాంధ్ర నేతల్లో చిచ్చురేపుతోంది. తంబళ్లపల్లి టీడీపీ శాసనసభ్యుడు ప్రవీణ్‌రెడ్డి చంద్రబాబు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమవాసి అయ్యిండి ఇలా లేఖ రాయడం సరికాదని అన్నారు. టీడీపీ అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. లేదంటే టిడిపి పేరును తెలంగాణ దేశంగా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.

మార్చ్ అంటే సీమాంధ్రులపై పరోక్షంగా దాడి జరిపుతున్నట్లే ప్రవీణ్‌రెడ్డి అన్నారు. అలాంటి మార్చ్‌కి తమ సహచర తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మద్దతివ్వడం దారుణమన్నారు. తెలంగాణపై పార్టీ ఇచ్చిన లేఖను నిరసిస్తూ తాను ఆయన నిర్వహించబోయే పాదయాత్రలో నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. టిడిపి అంటే తెలంగాణ దేశం పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.  కాగా ప్రవీణ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకు తగిన కారణం దొరకక ఇంతకాలం అగినట్లు తెలిసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానికి రాసిన లేఖ కారణంగా చూపుతూ పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు తెలియవచ్చింది. 

సచివాలయానికి తాళం... ప్రభుత్వం అదేశాలు

తెలంగాణసెగ రాష్ట్ర సచవాలయానికి తాకింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ రాజకీయ జేఏపీ పిలుపు మేరకు ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో సచివాలయంపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున, పోలీసుల ఉత్తర్వుల మేరకు 29, 30 ఈ రెండు రోజులు సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. అలాగే సచివాలయం ప్రాంగంలో ఐదుగురు గుమిగూడి ఉండకుండా 144 సెక్షన్‌ను అధికారులు విధించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు

ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా ఆన్‌లైన్ విధానం పిటిషన్‌పై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అన్‌లైన్ అడ్మిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ గురువారం సుప్రీం తీర్పు నిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు విచారణ జరిపిన సుప్రీం కోర్టు విద్యా సంవత్సరం మధ్యలో నిబంధనలు మార్చడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

కావాలంటే వచ్చే సంవత్సరం నుంచి ఆన్‌లైన్ విధానం అవలంభించ వచ్చని సూచించింది. ఇంజినీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆన్‌లైన్ విధానంపై దాఖలైన కేసులో తీర్పునిస్తూ ఆన్‌లైన్ విధానం చెల్లదని ప్రభుత్వాన్ని తప్పుబడుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో పైతీర్పు వెలువడింది.

26, సెప్టెంబర్ 2012, బుధవారం

విజయసాయితో లింకేంటి?

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా ఎబికె ప్రసాద్ అసత్య కథనాలు రాస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు ఎర్రన్నాయుడు బుధవారం అన్నారు. ఐఎంజి భూములను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రద్దు చేశాక ఇప్పుడు పిటిషన్ వేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును దెబ్బతీసేందుకు ఐఎంజి భూముల వ్యవహారం తెర పైకి తీసుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ సాయి రెడ్డితో ఎబికె ప్రసాద్‌కు ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విజయ సాయి రెడ్డి తరఫున ఎబికె ప్రసాద్ ప్రమాణం చేయాల్సిన అవసరమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఎంజి కేసులో అవతవకలు లేవని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని గుర్తు చేశారు. ఎలాంటి అక్రమాలు లేవని ఎసిబి కోర్టు కేసును కొట్టేసినప్పటికీ ఇదే విషయంపై పిటిషన్ వేయడం, కొట్టి వేసిన అంశాన్ని ఆ పిటిషన్‌లో ప్రస్తావించక పోవడం అందరూ గుర్తించాలన్నారు. పదవి ఇచ్చారు కాబట్టే ఎబికె ఆరోపణలు చేశారన్నారు.

కాగా ఐఎంజి కేసులో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై ఎర్రంనాయుడు రెండు రోజుల క్రితం కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దేశంలో మూడో ఫ్రంట్ ఆవిర్భావం కోసం ప్రయత్నిస్తున్నందునే చంద్రబాబుపై ఐఎంజీ కేసు వంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐఎంజీ వ్యవహారంలో చంద్రబాబు నిర్దోషి అని అనేక సందర్భాల్లో కోర్టులు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ధర్మాసనం ఆదేశిస్తే 'ఐఎంజీ భారత' సంస్థకు భూ కేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక విచారణ చేస్తామని సిబిఐ తెలిపిన నేపథ్యంలో ఎర్రంనాయుడు ఆ మాటలు అన్నారు. ఆ విషయం తెలియజేస్తూ సోమవారం హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఐఎంజీ భారత సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నగర శివార్లలోని అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ న్యాయవాది శ్రీరంగరావు, ప్రముఖ పాత్రికేయులు ఎబికె ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

వీటిని సోమవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఐఎంజీ భారత సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంలోని అక్రమాలపై ప్రాథమిక విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2006లో జీవో 310ను జారీ చేసిందని, అంతకుముందే ఔటర్ రింగ్‌రోడ్ భూసేకరణలో అక్రమాలపైనా ప్రాథమిక విచారణ కోరిందని కోర్టుకు సిబిఐ తెలిపింది.

తగిన సిబ్బంది లేకపోవడంతో ఐఎంజీ వ్యవహారంపై రాష్ట్రస్థాయి దర్యాప్తు అధికారులతోనే ప్రాథమిక విచారణ చేయించాలని, ఆధారాలు లభిస్తే సీబీఐ విచారణను కోరాలని రాసిన లేఖపై ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపింది. ప్రస్తుతం తాము దర్యాప్తు చేస్తున్న కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని, సిబ్బంది కొరత సమస్య ఉండే పరిస్థితి లేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. తాజాగా సీబీఐ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఎలమంచిలి ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి

మకుటం లేని మహారాజుగా చెలామణి అయిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధిగా ఉంటూ రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, మద్యం వ్యాపారాల ద్వారా సంపాదించిన ఆస్తులు వందల కోట్ల రూపాయల్లో ఉండడంతో అవన్నీ అక్రమాస్తులేననే ఆరోపణలు అధికమయ్యాయి. విశాఖ నగరం నడిబొడ్డున(హోటల్ మేఘాలయ) భారీ స్థలం, అందులో చేపడుతున్న షాపింగ్‌మాల్, సినిమా థియేటర్ల నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ స్థలం రిజ్రిస్టేషన్ విలువే 26 కోట్ల రూపాయలు ఉంటే...వాస్తవంగా మార్కెట్ విలువ ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చునంటూ ఆయన ప్రత్యర్థులు సవాళ్లు విసురుతున్నారు. సీతమ్మధారలో ఆయన నిర్మించుకున్న భవంతికి విశాఖ నగర పాలక సంస్థ ఎందుకు అనుమతులు ఇవ్వలేదు? నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినా ఎందుకు చర్యలు చేపట్టలేదో అధికారులు నోరు విప్పాలనే వాదన ఊపందుకుంది. ఆ భవనం, అందులో స్విమ్మింగ్‌పూల్ సినిమా సెట్‌ను తలపిస్తున్నాయంటే..ఆయన ఎంత సంపాదించారో అంతుచిక్కడం లేదంటూ పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. ఆయన ఎంత సంపాదించుకున్నా ఫరవాలేదని, అయితే తినడానికి కూడు లేని పేదలు తన దగ్గర పనిచేస్తుంటే..వారి పేరు మీద బ్యాంకులో రుణం తీసుకొని, ప్రభుత్వం నుంచి కోటి రూపాయల రాయితీని అక్రమంగా కొట్టేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

వీటిని విజిలెన్స్ విభాగం నిర్ధారించి, ఎమ్మెల్యే కుమారుడు తేజపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ప్రభుత్వం మిన్నకుండిపోవడంతో ఆయన ప్రత్యర్థులు ఇక న్యాయస్థానమే దిక్కుగా భావించి నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన కొయిలాడ వెంకట్రావు ఎమ్మెల్యే అక్రమ ఆస్తులు, ఎస్సీల పేరుతో ఆయన ప్రభుత్వం నుంచి పొందిన రాయితీపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు విజిలెన్స్ ఏ నివేదిక ఇచ్చిందో తమకు సమర్పించాలని ఆదేశించింది.

దాంతో ఎమ్మెల్యే కన్నబాబు గుండెల్లో రాయి పడింది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో మేనేజ్ చేయగలిగినా న్యాయస్థానానికి వచ్చేసరికి ఏం చేయాలో పాలుపోక ఆపసోపాలు పడుతున్నారు. అది సరిపోదు అన్నట్టు విశాఖ ఏసీబీ కోర్టులో ఆడారి ఆదిమూర్తి ఎమ్మెల్యే అక్రమ సంపాదన, కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులపై కేసు వేశారు. దానిపై విశాఖలో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. జిల్లాలో ఇలాంటి కేసును ఎదుర్కొంటున్న మొదటి ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం.

ఏసీబీ విచారణ మొదలుపెడితే..ఆదాయ వ్యయాలు, పన్నుచెల్లింపులు, కొనుగోళ్లు అమ్మకాలు అన్నింటిపైనా కూపీ లాగుతుంది. మొత్తం వ్యవహారాలు బయటకొస్తాయి. వీటికి తోడుగా భూమి విషయంలో ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నారంటూ ఇటీవల సన్యాశిరాజు అన్యే భూ వ్యాపారి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కొక్కటిగా కేసులు పడుతుండడంతో రాజకీయ దురుద్దేశాలతో ప్రత్యర్థులు దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి ఈ ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు.

వచ్చే ఎన్నికల సంగతి ఏమో కానీ వీటన్నింటిపై విచారణ జరిగితే...ఎమ్మెల్యేపైన, ఆయన కుమారుడిపైనా క్రిమినల్ కేసులు నమోదు కావడం ఖాయమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కన్నబాబురాజు సీరియస్‌గా వుడా అధ్యక్ష పదవికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ కేసులన్నీ దాఖలు కావడంతో ఆయన అవకాశాలు నీరుగారిపోయినట్టేనని ప్రత్యర్థులు సంతోషం ప్రకటిస్తున్నారు. ఈ పదవి కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేయడానికి నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ముందుకొస్తే...వారికి ఏమాత్రం తీసిపోకుండా పార్టీకి ఫండ్ ఇస్తానంటూ కన్నబాబు వుడా ఛైర్మన్ గిరి కోసం పోటీ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈయనకు జిల్లా మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావుల మద్దతు ఉండడంతో దాదాపుగా పదవి ఖాయమని భావిస్తున్న తరుణాన ఈ కేసులతో ఆ పదవి వస్తుందో రాదోననే అనుమానం మొదలైంది. ఈ కేసులు ఏ మలుపులు తిరుగుతాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మార్చుకు అనుమతి ఇప్పించే యత్నం : కేకే

తెలంగాణ మార్చ్‌పై సీఎం, హోమంత్రి తనతో మాట్లాడారని అయితే ఇప్పటికే ఆలస్యమైందని, మార్చ్ వాయిదా వేయలేమని తేల్చి చెప్పినట్లు కేకే తెలిపారు. తాను మధ్యవర్తిత్వం జరిపే ప్రసక్తే లేదన్నారు. మార్చ్ వాయిదా ప్రయత్నం చేస్తున్నామని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులమంతా కలిసి మార్చుకు అనుమతి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కేకే పేర్కొన్నారు
కాశ్మీర్‌లో 45 మంది సర్పంచ్‌లో రాజీనామా చేస్తే దీనిపై రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారని, అయితే తెలంగాణ కోసం 118 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినా మాట్లాడినవారు లేరని, ఇది ఎంతో ఆవేదన కల్గిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మార్చ్‌లో హింసకు అవకాశం

ఈనెల సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్‌లో హింస జరిగే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమాచారం ఉందని లా అండ్ ఆర్డర్ డీజీ హుడా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తెలంగాణ మార్చ్, వినాయక నిమజ్జనంపై డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు.

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, ప్రజల ఆస్తులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ మార్చ్‌కు వచ్చే వారంతా కేసులు లేని వారన్నారు. మతఘర్షణలు,తీవ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉన్నట్లు హుడా తెలిపారు. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు వస్తున్నారని, ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని హుడా పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలో మార్చ్ నిర్వహించే అవకాశం ఉంద న్నారు. అసెంబ్లీ, ట్యాంక్‌బండ్, నెక్లస్‌రోడ్డు పైనా దాడుల చేస్తారనే సమాచారం ఉందని హుడా చెప్పారు. జేఏసీ ఆయుధాలను అడ్డు కట్టేందుకు తమ వద్ద ఆయుధాలు ఉన్నాయన్నారు. దాడులు జరిగినా రబ్బరు బుల్లెట్లు ఉపయోగించబోమని, ముందస్తు అరెస్ట్‌లు తప్పవని హుడా ప్రకటించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, మిలియన్ మార్చ్ అనుభవంతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు డీజీ హుడా తెలియజేశారు.

మార్చ్ వాయిదాపై సీఎం ఫోన్‌ మంతనాలు

తెలంగాణ మార్చ్ వాయిదాపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కొందరు తెలంగాణ మంత్రులతో సీఎం కిరణ్ ఫోన్‌లో సంభాషణలు జరిపారు. తెలంగాణ జేఏసీ నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి, సీనియర్ నేత కేకేలకు అప్పగించారు.

తెలంగాణ పొలిటికల్ జేఏసీతో మాట్లాడి మార్చ్ వాయిదా వేసేలా చూడాలని తెలిపారు. జీవవైవిద్య సదస్సు తర్వాత మార్చ్ జరిగేలా జేఏసీ నేతలను విజ్ఞప్తి చేయాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం తనతో చర్చించారని,అటు మార్చ్‌కు అనుమతి ఇప్పించాల్సిందిగా జేఏసీ నేతలు కూడా కోరారని ఈ విషయాలన్నింటిపైనా పార్టీ నేతలు సీఎం చర్చిస్తారని జానారెడ్డి తెలిపారు.

అటు సీఎం ప్రతిపాదనపై సీనియర్ నేత కేకే అసంతృప్తి వ్యక్తపరిచారు. కాశ్మీర్‌లో 45 మంది సర్పంచ్‌లు రాజీనామా చేస్తే దీనిపై రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారని, అయితే తెలంగాణ కోసం 118 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినా మాట్లాడినవారు లేరని, ఇది ఎంతో ఆవేదన కల్గిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ మార్చ్‌పై సీఎం, హోమంత్రి తనతో మాట్లాడారని అయితే ఇప్పటికే ఆలస్యమైందని, మార్చ్ వాయిదా వేయలేమని తేల్చి చెప్పినట్లు కేకే తెలిపారు. తాను మధ్యవర్తిత్వం జరిపే ప్రసక్తే లేదన్నారు. మార్చ్ వాయిదా ప్రయత్నం చేస్తున్నామని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులమంతా కలిసి మార్చుకు అనుమతి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కేకే పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ మార్చ్ నేపథ్యంలో వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు, ప్రధాన రహదారుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. పలువురు టీఆర్ఎస్, జేఏసీ, విద్యార్థి జాక్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో 16 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

అంతరిస్తున్ననగర పచ్చదనం

నగర పచ్చదనంపై నిర్లక్ష్యపు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి పేరిట జరుగుతున్న నిర్మాణాల కింద మహా వృక్షాలు మాయమవుతుంటే కొత్తగా చెట్లు నాటేందుకు ఎవరికీ చేతులు రావడంలేదు. సుమారు కోటి మంది జనాభా గల నగరంలో పచ్చదనం ప్రశ్నార్థకంగా మారుతోంది. పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని అడవులతో పాటు, మహా వృక్షాలను సైతం నరికివేయడంతో జీవరాశుల మనుగడ ప్రశ్నార్తకంగా మారుతోంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా కాలుష్యం పెరిగి నగర జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. పర్యావరణ సమతుల్యత పాటించాల్సిన అధికార యంత్రాంగం మానవాళికి మేలు చేసే చెట్లను నరికి నగరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మర్చివేస్తున్నారు. వృక్ష సంపద అంతరించడం వల్ల జరిగే నష్టాన్ని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనీ, ఫలితంగా కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని సేవ్ కన్వీనర్ విజయరాం అన్నారు.

మహా వృక్షాలు మాయంనగరంలో చేపట్టిన పలు నిర్మాణాల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందించి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే వృక్షాలను నరికి బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. ఫలితంగా పచ్చదనం నాశనమై నగరం కాంక్రీట్ జంగిల్ మారుతోంది. మొక్కల పెంపకానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న హెచ్ఎండీఏ ఆ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటోంది. ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా వందల ఏళ్లనాటి మర్రి, వేప, కానుగ చెట్లను సుమారు 400పైగా తొలగించారు. ట్రాన్స్‌లొకేషన్‌కు అవకాశమున్నా ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం గమనార్హం. బెంగళూరు, విజయవాడ హైవేలపై ఒకనాడు కనిపించిన మహా వృక్షాలు కనుమరుగయ్యాయి. గతం లో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం సందర్భంగా వందల వృక్షాలను తొలగించారు. వాటిలో సుమారు 40కి పైగా చెట్లను ప్రైవేటు వ్యక్తులు తీసుకోవడం గమనార్హం. విస్తరణలో భాగంగా...నగర విస్తరణలో భాగంగా చుట్టూ ఉన్న అడవులను నరికి నిర్మాణాలు చేపట్టారు. భారీ పరిశ్రమలు, సెజ్‌ల నిర్మాణంలో వందల చెట్లను నరికి వేశారు. ఫలితంగా ఆయా చెట్లపై ఆధారపడి జీవించే లక్షల జీవులు అంతరించాయి. నగరం చుట్టూ ఒకప్పుడు వందల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుండేది. ఫాం హౌస్‌లు, కాలేజీలు, సెజ్‌ల పేరిట వందల ఎకరాల్లో సాగును ధ్వంసం చేసి, కంచెలు నిర్మించుకుంటున్నారు. వృక్ష, జంతుజాలం అంతరించడం మూలంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోందని 'ఆంత్ర' సంస్థకు చెందిన ఆశాలత అంటున్నారు.

పెరుగుతున్న కాలుష్యంకార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరించి మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ అందించే మొక్కలు నరికివేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. నగరంలో పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం మూలంగా ప్రజలకు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించే ఉద్యానవనాల పట్ల సైతం హెచ్ఎండీఏ లాంటి సంస్థలు నిర్లక్ష్యం వహించడం మూలంగా కాలనీలలో పచ్చదనం నశిస్తోంది. మొత్తంగా మనిషి మనుగడకు ఉపయోగపడే, ఒకనాడు నగరంలో విరివిగా కనిపించిన మర్రి, వేప, చింత, కానుగ లాంటి వృక్షాలు కానరాకుండా పోయాయి. నగరంలో జీవవైవిధ్య సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆర్భాటం సంవత్సరం పొడువునా పచ్చదనాన్ని కాపాడడంపై చూపాలని నగర వాసులు కోరుతున్నారు.

నిమజ్జన ఊరేగింపు దారులివి

వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 29న జరిగే సామూహిక నిమజ్జనానికి హుస్సేన్ సాగర్‌కు వచ్చే విగ్రహాలు, ఊరేగింపు కోసం ప్రత్యేక రూట్‌లను రూపొందించారు. ప్రధాన ఊరేగింపునకు సాధారణ ట్రాఫిక్‌తో ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. విగ్రహాలు ఇలా వెళ్లాలిజూ ప్రధాన ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమై నాగుచింత. ఫలక్‌నుమా, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ పైకి లేదా ఎన్‌టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. జూ సికింద్రాబాద్ ప్రాంతం వినాయక విగ్రహాలు ఆర్‌పీ రోడ్డు, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్, ఆర్‌టీసీ, నారాయణగూడ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళతాయి. జూ ఉప్పల్ నుంచి వచ్చే విగ్రహాలు రామంతపూర్, అంబర్‌పేట, ఎన్‌సీసీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ మీదుగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.జూ పడమర నుంచి వచ్చే ఊరేగింపు తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.జూ విగ్రహాల తరలింపు సమయంలో సాధారణ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 29వ తేదీ ఉదయం ఆరు నుంచి 30వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు పలుప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఊరేగింపు జరిగే ప్రాంతంలో సా«ధా రణ వాహనాల అనుమతిని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరం నుంచి తూర్పుకు వచ్చే వాహనాలకు బషీర్‌బాగ్ జంక్షన్, బేగంపేట ప్రాంతాల్లో మాత్రమే మళ్లింపులు ఉంటాయి. మరికొన్ని మళ్లింపు దారులు దక్షిణం: కేశవగిరి, మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల చింత, హిమ్మత్‌పూర్, హరిబౌలి, అస్రాఆస్పతి, మొగుల్‌పురా, లకడ్‌కోఠి, మదీనా క్రాస్‌రోడ్స్, ఎంఏ బ్రిడ్జి, దారుల్‌షిపా క్రాస్‌రోడ్స్, సిటీ కాలేజీ ప్రాంతాల్లో మళ్లింపులు ఉంటాయి.తూర్పు: చంచల్‌గూడ జైల్ క్రాస్ రోడ్స్, మూసారాంబాద్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, సాలార్‌జంగ్ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలి క్రాస్ రోడ్స్, ట్రూప్‌బజార్, జామ్‌బాగ్ క్రాస్‌రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద మళ్లింపులు ఉంటాయి.పడమర: తోప్‌ఖానా మసీదు, అలాస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ గంజ్, శంకర్‌బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద అంజతా గేట్, అబ్కారీ లేన్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద మళ్లింపులుంటాయి.మధ్యమం (సికింద్రాబాద్): వాహనాలను నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించారు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ క్రాస్‌రోడ్స్, పాట్నీ క్రాస్ రోడ్స్, బాటా క్రాస్ రోడ్స్, మండి క్రాస్‌రోడ్స్ మీదుగా మళ్లిస్తారు.వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేయాలినిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే సందర్శకులు వాహనాలను పోలీసులు సూచించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి. ఇందు కోసం పది పార్కింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేశారుఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఖైరతాబాద్, ఎంఎంటీఎస్ స్టేషన్, ఖైరతాబాద్, ఆనందనగర్ కాలనీ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ జంక్షన్ వరకు, బుద్ధ భవనం వెనుకవైపు, గో సేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్‌టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్.లారీలకు...జూ విగ్రహాలతో వచ్చిన లారీలు ఎన్‌టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం పూర్తి చేసుకున్న అనంతరం నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ గేస్ట్‌హౌస్ వైపుకు వెళ్లి అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరుకోవాలి.జూ అప్పర్ ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం అయిన వెంటనే ఖాళీ లారీలు పిల్లల పార్కు, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదు గా వెళ్లాలి.జూ రవాణా కోసం వచ్చే లారీలను 29, 30వ తేదీలలో నగర రోడ్లపైకి అనుమతించరు.ట్రాఫిక్ నిబంధనలు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయని పోలీసులు చెబుతున్నారు.

జూ మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులు మాసబ్‌ట్యాంకు వరకు నడుస్తాయి.

జూ కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు వీవీ విగ్రహం వరకే నడుస్తాయి.

జూ సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు సీటీఓ, వైఎంసీఏ, రేతిబౌలి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టావర్, చిలకలగూడ క్రాస్‌రోడ్స్ వరకు నడుస్తాయి.

జూ ఉప్పల్ నుంచి వచ్చే బస్సులు 6 నెంబర్ క్రాస్ రోడ్స్ వరకు నడుస్తాయి.

హైదరాబాద్ శాస్త్రవేత్తలకు రజత పతకాలు

హైదరాబాద్‌లోని నేషనల్ జి యోగ్రాఫికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)కు ఉత్తమ పరిశోధనా సంస్థల మూడోవిభాగంలో రజత పతకం లభించింది.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసె ర్చి (సీఎస్ఐఆర్) 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వివిధ వి భాగాల్లో ఉత్తమ పరిశోధనా సంస్థ లు, శాస్త్రవేత్తలకు మంగళవారం అ వార్డులు బహూకరించారు. సీఎస్ఐఆర్ కార్యాలయంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వయలార్ ర వి చేతుల మీదుగా.. ఎన్‌జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్‌కే చద్దా, ఏ వో ఎ.బాలకృష్ణ, ఎస్‌వో జీ.వెంకటేశ్వర్లు రజత పతకాలు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

22, సెప్టెంబర్ 2012, శనివారం

కొత్త గెటప్‌లతో హీరోలు

నేటిట్రెండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని హీరోలంతా ఉవ్విళ్లూరుతున్నారు. తాము చేసే సినిమా కథ మొదలుకుని పాత్ర వరకు అన్నింటిలోను వారు జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. పాత్ర డిమాండ్‌ మేరకు ఎంతైనా కష్టపడి తమ బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడానికి కూడా సంసిద్ధమవుతున్నారు. ఇందుకోసం సన్నబడటమే కాదు ఒక్కోసారి బరువు పెరగాలన్నా వెనుకాడటం లేదు. అంతేకాదు సిక్స్‌ప్యాక్‌ అవసరమైతే దానిని కూడా ఆచరణలో పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... పాత్ర తీరుతెన్నులను అనుసరించి అభిమానులను ఆకట్టుకునేందుకు హెయిర్‌ స్టైల్‌, డ్రస్సులు, గాగూల్స్‌ వరకు అన్నింటా కొత్తదనాన్ని ప్రదర్శించేందుకు హీరోలు పోటీపడుతున్నారు. కాగా కొందరు పేరున్న హీరోలు చేస్తున్న చిత్రాలను, పాత్రలను విశ్లేషిస్తే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తేటతెల్లమవుతాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే...!
బాలకృష్ణ: ఆ మధ్య 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముడిగా పౌరాణిక పాత్రలోను, ఆ తర్వాత 'అధినాయకుడు'లో మాస్‌ పాత్రలోను కనిపించిన బాలకృష్ణ ఈ మధ్యనే 'ఊకొడతారా... ఉలిక్కిపడతారా'లో జమీందార్‌ గెటప్‌లో కనువిందుచేశారు. ఇప్పుడేమో 'శ్రీమన్నారాయణ'లో పవర్‌పుల్‌ జర్నలిస్టుగా ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించడం విశేషం. పైపెచ్చు ఈ చిత్రంలో పదేళ్ళ వయసు వెనుకకు వెళ్లినట్లుగా బాలకృష్ణ ఎంతో గ్లామరస్‌గా కనిపించారని విశ్లేషకులు అంటున్నారు. కొన్ని సన్నివేశాలలో డ్రస్సులు మొదలుకుని గాగుల్స్‌ వరకు ఆయన తనదైన ప్రత్యేకతను కనబరిచారు. అభిమానులు సైతం ఇదే అభిప్రాయాన్ని ఆనందంతో వ్యక్తీకరిస్తుండటం విశేషం. కాగా బాలకృష్ణ చేయబోయే కొత్త చిత్రం గురించి ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, అదేమిటన్నది ఇంకా ధ్రువీకరణ కాలేదు.
నాగార్జున: 'రాజన్న' లాంటి చారిత్రాత్మక చిత్రం చేసిన అనంతరం నాగార్జున భక్తిరస చిత్రంలో శిరిడిసాయి పాత్రలో కనిపించారు. ఇక వీటికి పూర్తి భిన్నంగా 'లవ్‌ స్టోరి' చిత్రంలో ఆ కథ, పాత్రకు అనుగుణంగా న్యూ లుక్‌తో ఫ్రెంచ్‌ గడ్డంతో ఆయన కనిపించబోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇదిలావుండగా, ఆయన నటించిన మరో చిత్రం 'డమరుకం' విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ తరహా సోషియో ఫాంటసీ చిత్రం చెయ్యడం తన కెరీర్‌లోనే మొదటిసారని నాగ్‌ ఆ మధ్య అన్నారు కూడా. ఇక ఈ చిత్రం క్లైమాక్స్‌ ఎంతో హైలైట్‌గా ఉంటుంది. ఆయా సన్నివేశాల్లో గెటప్‌ పరంగా కూడా ఆయన కొత్తగా కనిపించబోతున్నారు. నాగార్జున మరో కొత్త కోణంలో కనిపించబోయే 'భాయ్‌' చిత్రం కూడా త్వరలో సెట్స్‌పైకి రానుందని అంటున్నారు. ఇందులో కూడా మరో కొత్తకోణంలో ఆయన కనిపిస్తారని చెబుతున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగచైతన్య ముగ్గురు కలసి నటించబోయే చిత్రం కూడా నాగార్జునకు ఇంకో వైవిధ్యభరితమైన చిత్రం అవుతుందని అంటున్నారు.
వెంకటేష్‌: ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'బాడీగార్డ్‌' అంచనాలకు చేరువ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ ఇప్పుడు ఒకటికి రెండు చిత్రాలలో నటిస్తున్నారు. మహేష్‌బాబుతో కలసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'లో వారిద్దరూ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న ఆయనకు ఈ చిత్రంలోని పాత్ర ఎంతో పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇక మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'షాడో' చిత్రంలో అండర్‌ వరల్డ్‌ డాన్‌ పాత్రలో నటిస్తున్నారు. హెయిర్‌స్టైల్‌ మొదలుకుని డ్రస్సు వరకు అన్నివిధాలా కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇక వివేకానందుడి పాత్రలో కూడా నటించాలని వెంకటేష్‌ ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చిత్రాల తర్వాత వివేకానందుడి చిత్రం మొదలవుతుందని అంటున్నారు. ఈ చిత్రాలు, ఇందులోని పాత్రలు వేటికవే విభిన్నమైనవి కావడం గమనార్హం.
పవన్‌ కల్యాణ్‌: 'గబ్బర్‌సింగ్‌' ఘన విజయం సాధించిన నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతవరకు తన కెరీర్‌లో చెయ్యని జర్నలిస్టు పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుగా ఆయనెంతగానో ఒదిగిపోయారని దర్శకుడు పూరి జగన్నాధ్‌ అంటున్నారు. దాదాపు 12 ఏళ్ళ క్రితం కెరీర్‌ మొదటి దశలో వీరిద్దరి కలయికలో 'బద్రి' వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇందులో న్యూ లుక్‌తో మరింతగా ప్రేక్షకాభిమానులను ఆయన ఆకట్టుకోనున్నారని పూరి చెబుతున్నారు. ఈ చిత్రం తర్వాత నిర్మాత కొండా కృష్ణంరాజు హిందీ, తెలుగు భాషల్లో నిర్మించే చిత్రంలో పవన్‌ నటించనున్నారు. దీనిద్వారా ఆయన బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నారు.
మహేష్‌బాబు: 'దూకుడు', 'బిజినెస్‌మేన్‌' వంటి విభిన్నమైన చిత్రాల అనంతరం మహేష్‌ చేస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'. ఇది పూర్తిగా ఫ్యామిలీ సెంటిమెంట్‌ చిత్రం కావడంతో ఇందులో మహేష్‌ తన హెయిర్‌స్టైల్‌ మార్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన స్టిల్స్‌లో ఆ విషయాన్ని గమనించవచ్చు. కొన్ని మాస్‌ చిత్రాల తర్వాత కుటుంబ చిత్రంగా మహేష్‌కు ఇది ఓ విభిన్నం కానుంది. ఇక సుకుమార్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తీస్తున్న చిత్రంలో కూడా మహేష్‌ నటిస్తున్నారు. దీనికోసం మహేష్‌ సిక్స్‌ప్యాక్‌ చేస్తున్నారని వినికిడి.
జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌.: 'దమ్ము' చిత్రం తర్వాత జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌. చేస్తున్న చిత్రం 'బాద్‌షా'. మాఫియా నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌. కొత్తగా కనిపిస్తారని చెబుతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆయన ఫ్రెంచ్‌ గడ్డంతో కనిపించ బోవడం ఓ విశేషం. ఇంతవరకు ఇటలీ, బ్యాంకాక్‌ వంటి విదేశాలలో ఈ చిత్రం భారీ షెడ్యూల్‌ను జరుపు కుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పూరీ జగన్నాథ్‌, హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ఎన్‌.టి.ఆర్‌. చిత్రాలు చేస్తారని అంటున్నారు.
రామ్‌చరణ్‌: 'రచ్చ' తర్వాత రామ్‌చరణ్‌ ఇప్పుడు ఒకటికి మూడు చిత్రాలు చేస్తుండటం విశేషం. పేరున్న యువ కథానాయకులకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకమవుతోందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'నాయక్‌' చిత్రంలోను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు'లోను రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. అలాగే హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'జంజీర్‌'లో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాల్లోను పొంతన లేకుండా అటు పాత్రో చితంగాను, ఇటు లుక్‌ పరంగాను విభిన్నంగా కనిపించేందుకు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారట.
ప్రభాస్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌కు మాస్‌ చిత్రాలు, పాత్రలు పెట్టిందిపేరు. అయితే ఆ ఇమేజ్‌కు భిన్నంగా ఆయన నటించిన చిత్రాలు 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రాలు వరుసగా విజయవంతం కావడంతో నటుడిగా ప్రభాస్‌ ఎంతో పరిణతి సాధించాడని కృష్ణంరాజు కూడా ఎంతో మెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ తన ఇమేజ్‌కు అనుగుణమైన మాస్‌ పాత్రలో 'రెబల్‌' చిత్రం ద్వారా కనువిందు చేయబోతున్నారని ఆ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్‌ అన్నారు. ప్రభాస్‌ కెరీర్‌లోనే ఇంతకుముందెన్నడూ జరగనంత జాప్యం ఈ చిత్ర నిర్మాణంలో చోటుచేసుకుంది. ఈ చిత్రం పూర్తయ్యేందుకు ఒకటిన్నర సంవత్సరానికి పైగా పట్టింది. క్వాలిటీ కోసమే అంత సమయం తీసుకున్నామని లారెన్స్‌ అన్నారు. ఇందులోని పాత్రలో ప్రభాస్‌ లుక్‌ పరంగా కూడా చాలా కొత్తగా కనిపించనున్నారు. విడుదలైన కొన్ని స్టిల్స్‌లో డ్రస్సుల్లోను, గాగుల్స్‌లోను ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం 'వారధి' కూడా ఆయనకు విభిన్నమవుతుంది. ఇందులో మరో కోణంలో ఆయన కనిపించనున్నారు. వీటి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రం చేస్తారని అంటున్నారు.
శ్రీకాంత్‌: ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌ మరోవైపు మాస్‌ చిత్రాలలో కూడా నటిస్తున్న విషయం తెలియంది కాదు. ఆ మధ్య 'శ్రీరామరాజ్యం'లో లక్ష్మణుడిగా పౌరాణిక పాత్రలో సైతం పేరుపొందిన ఆయన ఇప్పుడు 'దేవరాయ'లో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో దొరబాబు అనే మరో మాస్‌ పాత్రను కూడా చేస్తున్నారు. తాను శ్రీకృష్ణదేవరాయలు పాత్ర చేసేందుకు 'శ్రీరామరాజ్యం'లోని పాత్ర ఎంతో ప్రేరణను ఇచ్చిందని శ్రీకాంత్‌ అన్నారు. ప్రస్తుతం వెంకటేష్‌ 'షాడో'లో ఆయన ఓ కీలక పాత్రను చేస్తున్నారు. అలాగే 'శత్రువు' అనే మరో చిత్రంలో మాస్‌ పాత్రలో నటిస్తున్న ఆయన ఇవన్నీ తనకు విభిన్నమైనవని అంటున్నారు. కాగా ఈ హీరోల చిత్రాలు కొన్ని త్వరలోను, మరికొన్ని విజయదశమి, దీపావళి, ఇంకా ఈ ఏడాది ఆఖరులోను, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధ మవుతున్నాయి. ఈ పోటీలో ఎవరు విజేతలవుతారన్న అంశం ప్రేక్షక న్యాయస్థానంలోనే తేలుతుంది.
- శ్రీరామ్‌

రీల్‌ వెనుక....

సినిమా రంగుల ప్రపంచంలో వెలుగునీడలు పక్కపక్కనే ఉంటాయి. సినిమాను నమ్మకుని చిత్రసీమకు చేరుకున్న చాలామందిలో కొందరు అందలమెక్కితే మరికొందరు ఎదుగుబొదుగులేని జీవితం గడుపుతున్నారు. కళ్ళముందే వచ్చిన వాళ్ళు ఎదుగుతుంటే తమ దురదృష్టానికి చింతిస్తూ కుమిలిపోతున్నవారెందరో కనిపిస్తారు. ఉదయం నుండి ప్యాకప్‌ చెప్పేవరకు యూనిట్‌ అందరికీ తిండి తిప్పలు చూసే ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ల జీవితాన్ని పరిశీలిస్తే కష్టాలే కనిపిస్తాయి. వందలాది మంది ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ల జీవితాలు ఇంతే. ''నెలలో పనిదొరికేది కేవలం వారం పది రోజులే, మిగతా రోజుల్లో పస్తులు ఉండాల్సిందే. రోజు భత్యంగా కేవలం 500 మాత్రమే ముడుతాయి'' అంటున్నారు ప్రొడక్షన్‌ అసిస్టెంట్స్‌ పొంబల రాజు, చంటి (రాజు).
''మా పని సూర్యుడు ఇంకా రాకముందే అంటే నాలుగు గంటలకే మొదలవుతుంది. ప్రొడక్షన్‌ మేనేజర్‌ చెప్పిన ప్రొగ్రామ్‌ ప్రకారం నడుచుకుంటాం. నాలుగు గంటలకే అడ్డాకు చేరుకుని, అక్కడికి మేనేజర్‌ పంపిన వ్యాన్‌లో మెస్‌కు చేరుకుంటాం. ముందురోజు రాత్రి ఆర్డర్‌ చేసిన టిఫిన్లు వ్యాన్‌లోకి ఎక్కించుకుని ఉదయం ఆరు గంటలకల్లా లొకేషన్‌ చేరుకుంటాం. లొకేషన్‌లోనే టీ తయారు చేసి, యూనిట్‌ అందరికీ సప్లయ్‌ చేస్తాం. ఆ తర్వాత టీఫిన్లు సిద్ధం చేస్తాం. హీరో హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాత, ఇతర ప్రధాన టెక్నీషియన్స్‌కు ఎవరికివారికే ప్రత్యేకంగా క్యారేజ్‌లు కట్టి ఉంచుతాం. వాటిని వారి గదికి చేర్చాలి. మిగతావారికి స్వయంగా వడ్డిస్తాం. టిఫిన్స్‌ పూర్తికాగానే మళ్ళీ మెస్‌కు చేరుకుని మధ్యాహ్న భోజనాల ఏర్పాట్లు, ఆ తర్వాత డిన్నర్‌కు కావాల్సినవి ఏర్పాట్లుచేసుకోవాలి. సినిమాకు సంబంధించి మొట్టమొదట వచ్చి, చివర్లో వెళ్ళిపోయేవాడు ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌'' అని రాజు చెప్పారు.'' ''మాది అనంతరపురం జిల్లా సింగనమల మండలం, అలంకరాయనిపేట గ్రామం. పనికోసం వెతుక్కుంటూ 28 సంవత్సరాల క్రితం చెన్నై వెళ్ళాను. కొన్నాళ్ళు విజయకృష్ణ ఆఫీసులో బాయ్‌గా చేశాను. సీనియర్‌ నటుడు నరేష్‌కు అసిస్టెంట్‌గా కొద్దికాలం చేశాక. 'అలజడి' సినిమా నుండి ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా మారాను. అక్కడ (చెన్నై), ఇక్కడ (హైదరాబాద్‌) యూనియన్లలో మెంబర్‌ షిప్‌ ఉంది. అప్పట్లో 3,500లకు సభ్యత్వం ఇచ్చేవారు. ఇప్పుడైతే రూ.లక్ష డెబ్బైఅయిదు వేలు తీసుకుంటున్నారు. ఇక మాకు పని దొరికే రోజులు తక్కువే. ఈ రంగంలో కూడా పోటీ పెరిగింది. కొందరు మేనేజర్లు తమ బంధువులను పిలిపించి, యూనియన్‌ సభ్యత్వం ఇప్పించి, పనికల్పిస్తున్నారు. దీనివల్ల మాలాంటి సీనియర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి రక్షణ లేని జీవితాలు మావి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిదే వైద్య ఖర్చులకోసం యూనియన్‌ కొంత అప్పు ఇస్తుంది. అయితే ఇదంతా తీర్చాల్సిందే. నా వ్యక్తిగత విషయానికి వస్తే నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్‌ చదువుతోంది. అబ్బాయి ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. పదిహేనేళ్ళ క్రితం కొందరి సూచనమేరకు హైటెక్‌ సిటీ ప్రాంతంలో కొంత స్థలం తీసుకున్నాను. అక్కడే రేకులతో ఇళ్ళు నిర్మించుకున్నాను. అందులో కొంతభాగం అద్దెకిచ్చాను. ఆ అద్దె మా కుటుంబాన్ని పోషిస్తోంది. సినిమా అంటే ఉన్న ఇష్టం వల్ల ఇబ్బందులు ఎదురైనా కొనసాగుతున్నాం. నాలాంటి వారు చాలా మంది ఉన్నారు'' అని పొంబల రాజు వివరించారు. ''మాలాంటివారికోసం ప్రభుత్వం కానీ పరిశ్రమ కానీ ఏదైనా చేస్తే బావుంటుంది. పని గ్యారంటీలేని జీవితాలుమావి. అందుకే మా పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నాం'' అని ముక్తాయించారు.
- పృథ్వీ

నృత్యప్రధానంగా ఎబిసిడి

ఆధునిక పోకడలతో రూపొందిన సంగీత నృత్య ప్రధాన చిత్రం ఎబిసిడి: 'ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌'. నృత్య దర్శకుడుగా, నర్తకుడుగా, దర్శకుడుగా, హీరోగా రాణిస్తున్న ప్రభుదేవా ఒక డ్యాన్సర్‌గా నటించారు రిమో డిసౌజా దర్శకత్వంలో. రోన్నీ స్క్రూవాలా, యూటివి మోషన్‌ పిక్చర్స్‌ సి.ఇ.ఓ. సిద్దార్థ రాయ్‌ కపూర్‌ కలసి నిర్మించి తన చిరకాల స్వప్నం నిజం చేసారని దర్శకుడు రియో డిసౌజా పేర్కొన్నారు. యుటివి మోషన్‌ పిక్చర్స్‌ అన్నివిధాల అండగా నిలవడంతో 3డిలో రూపొందించానని, విడుదలయ్యాక కుటుంబ ప్రేక్షకులను అలరిస్తూ అద్భుతాలు సృష్టిస్తుందనే నమ్మకం తనలో నాటుకుపోయిందన్నారాయన.
ప్రధానపాత్ర పోషించిన ప్రభుదేవా అయితే మిగతా డ్యాన్సర్లతో కలిసి నటిస్తుంటే పునరుత్తేజం పొందారు. యువ నృత్యకళాకారులతో కలిసి నటిస్తున్నప్పుడు సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయట. అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళతో కలసి స్టెప్స్‌ వేయగలనా, డ్యాన్స్‌ చేయగలనా అని పలుమార్లు ఆలోచనలో పడ్డారు కూడా. దాంతో తను టీనేజ్‌ యువకుడుగా మారి నటనకంటే డ్యాన్స్‌లకే ప్రాధాన్యత ఇచ్చారు ప్రభుదేవా.
అమెరికన్‌ డ్యాన్స్‌ రియాల్టిdషోల ద్వారా పాప్యులర్‌ అయిన లారెన్‌ గొట్‌లైబ్‌ మరొక కీలకమైన పాత్ర పోషించడమేకాక తన నృత్యాలతో ఆశ్చర్యం కలిగించారు. హాలీవుడ్‌లో నటించాలన్న లక్ష్యంతో చాలా ప్రయత్నాలు చేసినా నెరవేరక పోవడంతో బాలీవుడ్‌ ద్వారా నటుడుగా, డ్యాన్సర్‌గా నిరూపించుకునే అవకాశం ఏర్పడటం తన అదృష్టంగా భావిస్తున్నారు.
ప్రముఖ డ్యాన్సర్‌ గణష్‌ ఆచార్య మరో కీలక పాత్ర పోషించారు. డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ రియాల్టిd షోలో విజేతలైన సల్మాన్‌ యూసఫ్‌ ఖాన్‌, ధర్మేష్‌ యలండే, మయురేష్‌ వాడ్కర్‌, వృశాలి చవాన్‌ అద్భుతంగా డ్యాన్స్‌లు చేసినట్టు తెలుస్తోంది. పునీత్‌ పథక్‌, కిశోర్‌ అమన్‌, భావనా ఖండూజ, సాజన్‌ సింగ్‌, జితేంద్ర ఆచార్య, అంకిత్‌ గుప్తా మిగతా పాత్రధారులు. దర్శకుడు రియో డిసౌజా కూడా నటించారు.
సబీన్‌ జిగార్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం 1గంట 50 నిముషాల పాటు ప్రదర్శితమయ్యేలా రూపొంది 28వ తేదీన విడుదలవుతోంది.

'లైట్‌' తీస్కో ...

బస్టాప్‌లో బస్‌ కోసం నిలబడతాం. దూరం నుంచి బస్‌ వస్తోంది. చెయ్యెత్తాం. తీరా బస్‌ ఆగలేదు. మనం మామూలుగా కాకుండా తల నిమురుకున్నట్టుగా చేతిని కిందికి దించుతాం. ఏదో ఒక పార్టీకి వెళ్లాము. అందరికంటే మన బట్టలు సరిగ్గా లేవని మనసులో అనిపించింది. ఇక పార్టీ అయి ఇంటికి వెళ్లే వరకు ఆ ఆలోచన వదలదు. ఆఫీస్‌లోనో, ఇంట్లో బంధువులో మనకు తగిన విలువ ఇవ్వలేదు. మనసులోంచి ఆ విషయం ఎంత తీసేయాలన్నా సాధ్యం కావటం లేదు-ఇవన్నీ మనందరికీ ఎపðడో ఒకపðడు జీవితంలో ఎదురయ్యేవే. ఇతరుల అంచనాలకు తగినట్టుగా లేమేవెూ అనే ఆలోచన. మనల్ని చూసి ఎవరేమనుకుంటున్నారో అనే బిడియం - నిరంతరం మనుషుల్ని వెంటాడుతుంది. కొందరిలోఎక్కువగా, కొందరిలో తక్కువగా. ఇలాంటి అనవసరమైన విషయాలు మనల్ని అతిగా బాధపెడుతుంటే జీవితం పట్ల మన ఆలోచనలు సరిగ్గా లేవని అర్థం. తేలిగ్గా తీసుకోవాల్సిన విషయాలను కూడా భారంగా చూస్తున్నామంటే కొన్నాళ్లకు మనకు మనమే భారంగా మిగులుతాం -

టేకిటీజీ పాలసీ లేకపోతే....

- జీవితం సంక్లిష్టంగా లేదు...మన ఆలోచనలే అలా ఉన్నాయి. జీవితం ఎపðడూ సింపుల్‌గానే ఉంటుంది. సింపుల్‌గా ఉండటంలోనే సత్యముంది - ఆస్కార్‌వైల్డ్‌
- ఏడుపు అనేది మన కన్నీళ్లను వృథా చేసే ప్రక్రియ, ఎవరికోసం ఏడుస్తావెూ వారు మన కన్నీళ్లకు అర్హులు కారు. అలాంటి అర్హత ఉన్నవారు అసలు మనకు కన్నీళ్లే తెప్పించరు.
- సంతోషం అనేది సీతాకోకచిలుక. మనం వెంటబడుతుంటే దొరకకుండా తప్పించుకుంటుంది. వదిలేసి ప్రశాంతంగా కూర్చున్నపుడు వచ్చి మన భుజంపై వాలుతుంది
- బాధలు తప్పవు... ఎదుర్కొనే శక్తిని పెంచుకోవాలి సమస్యలు తప్పవు... అధిగమించే నైపుణ్యం పెంచుకోవాలి. సవాళ్లు తప్పవు... పోరాడే తెలివితేటలు పెంచుకోవాలి
- భగవంతుడు ఈ భూమ్మీద బోలెడు కామెడీ నాటకాలు రాశాడు. అయితే జరిగిన పొరబాటు ఎక్కడంటే వాటిలో నటించడానికి సరైన నటుల్ని ఎంపిక చేసుకోలేదు.
- తెలివితేటలు అనుభవం నుంచి వస్తాయి. అయితే చాలా అనుభవాలు మనకు తెలివితేటలు లేకపోవటం వలన కలుగుతాయి.
పువ్వులాంటి జీవితాన్ని ముల్లుగా ఎందుకు చూస్తున్నాం
అక్కర్లేని విషయాల్లోనే ఎందుకు చక్కర్లు కొడుతున్నాం
భారం, భయం, బోర్‌, బేజారు... వీటిని తప్పించుకోలేమా
టేకిటీజీ - అనే పదం అంత కష్టమా
చిన్నతనంలో అందరికీ జీవితం తెెలిగ్గా కనబడుతుంది. అందంగా ఉంటుంది. సీతాకోకచిలుక కనిపించినా, ఇష్టమైన చిరుతిండి తిన్నా, ఆరుబయట ఆడుకున్నా బోలెడు ఆనందం కలుగుతుంది. నవ్వుతున్నవాళ్లంతా మంచి వాళ్లలా, కోపంగా ఉన్నవారంతా చెడ్డ వ్యక్తులుగా కనబడుతుంటారు. కానీ రానురాను పెద్దయిన కొద్దీ ఆనందాలు మాయమవుతుంటాయి. ప్రపంచంలో ఉన్న చెడు అనుభవంలోకి వస్తుంది. ఇతరులు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించడం మొదలుపెడతాం. జీవితంలో అవమానాలు, కష్టాలు, అపజయాలు తెలుస్తుంటాయి. మనసుకి నొప్పి కలుగుతుంది. ఇంకెప్పుడూ అలాంటి నొప్పి లేకుండా బతకాలనిపిస్తుంది. ఇక అక్కడితో మనం మనలాగా కాకుండా ఇంకోలా ప్రవర్తించడం అలవాటు చేసుకుంటాం. ఇవన్నీ భారంగా కనిపిస్తాయి.
మనం బాధపడకుండా ఉండాలంటే, విజయాలు సాధించాలంటే ఇతరులకంటే ముందుండాలంటే ఏంచేయాలో ఆలోచిస్తాం. ఇక అప్పటినుండి ఈర్ష్య, అసూయలు, భయాలు, మైండ్‌గేమ్‌లు అన్నీ మొదలవుతాయి. వీటిమధ్య జీవితం మరింత క్లిష్టంగా మారిపోతుంది.
న లైట్‌తీస్కో అంటున్న యువతరం!
ఈ మధ్యకాలంలో యువతరం, పిల్లల నోటివెంట ఒకమాట ఎక్కువగా వినబడుతోంది. అది లైట్‌తీస్కో- ఒ క రకంగా ఇది మంచి మార్పే. జీవితాన్ని ఇదివరకటికంటే తేలిగ్గా తీసుకోవటం ఈ తరం వారికి అలవాటవుతోంది. అయితే ఇక్కడొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీవితంలో అన్ని విషయాలు లైట్‌గా తీసుకునేవి కావు. అలాగే అన్నీ భారంగా భావించాల్సినవీ కావు. పరీక్షలు ఫెయిలయినపుడూ, వ్యాపారంలో నష్టాలు వచ్చినపుడూ, చేయాల్సిన పనులన్నీ పేరుకుపోతున్నపుడూ- లైట్‌తీసుకున్నామంటే ఇక అంతే సంగతులు. జీవితం కూడా మనల్ని లైట్‌గా తీసుకుని మనకంటూ ఎక్కడా గుర్తింపు, గౌరవం లేకుండా చేసేస్తుంది.
న అనవసరమైనవి వదిలించుకోవడమే తెలివి
మన స్థాయిని పెంచి మేలుచేసే విషయాలను చాలా గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఎందుకూ పనికిరాకపోయినా కొన్ని విషయాలు మనల్ని జిడ్డులా పట్టుకుని వదలనంటుంటాయి. వీటిని వదిలేస్తుండాలి. అంటే పట్టువిడుపులన్నమాట.
ఒక్కసారి రెండుమూడు తరాల ముందుజీవితాలను పరిశీలిస్తే, అప్పటిరోజుల్లో ఉన్న మాటపట్టింపులు, అలకలు, సంవత్సరాల తరబడి మాట్లాడకుం డా బిగదీసుకుపోవడాలు, అవమానం ఎదురైతే కుమిలిపోవడాలు... ఇప్పుడు అంతగా లేవు. మనం గమనిస్తే ఇరవైఏళ్ల క్రితం వరకు మన సినిమాల్లో సంవత్సరాల తరబడి మాట పట్టింపులతో విడిపోయి బతికే భార్యాభర్తలు, సే ్నహితులు, అన్నదమ్ముల పాత్రలు కనిపిస్తుండేవి. ఇప్పుడు జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకుని బాధల్ని మూటలు కట్టుకుని ముం దురోజులకు తీసుకుని పోదామని ఎవరూ అనుకోవటం లేదు. ఇదంతా మంచి పరిణామమే. మనకీ అవతలివారికి కూడా ఏమాత్రం మేలుచేయని అంశాలను పట్టుకుని వేళ్లాడేబదులు వాటిని టేకిటీజీ...అనివదిలేయడమే మేలు.
న క్రమశిక్షణకు హాస్యం అడ్డుకాదు
మనం చాలాసార్లు చాలా తప్పుడు అభిప్రాయాలతో ఉంటాం. తల్లి ఎప్పుడూ పిల్లలకు ఏమీ తెలియదని, తాను వాళ్లని చక్కదిద్దుతున్నాననే అభిప్రాయంతో ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులు టీచర్లు, ఇరుగుపొరుగు, కొలీగ్స్‌, బంధువులు...ఇలా ఒకచోట కలిసి పనిచేస్తున్నపుడు మనం అవ తలి వారిపట్ల ఒక అభిప్రాయంతో ఉంటాం . అందుకే అవ తలి వ్యక్తుల మాటలు, పనులు, చలోక్తులు లాంటివి పెద్దగా గమనించము. అన్నిచోట ్ల అందరూ స్వేచ్ఛగా ఉండవచ్చు- అనే అభి ప్రాయం బలంగా ఉన్నపుడు మాత్రమే మనం ఇతరుల మాటలకు విలువనివ్వగలం. వారితో కాస్త హాస్యాన్ని జోడించి మాట్లాడగలం. వారు వేసే జోకులకు మనస్ఫూర్తిగా నవ్వగలం. అలాంటి వాతావరణం తేలిగ్గా ఉంటుంది.
కొంతమంది ఎక్కువగా నవ్వడాన్ని ఒక నేరంగా పరిగణిస్తారు. క్రమశిక్షణ, హద్దులు వీరికి బాగా నచ్చిన పదాలు.
జీవితంలో మనం ఏర్పరచుకున్న ఏ నియమమైనా మనకు ఆనందాన్ని విశాలత్వాన్ని ఇవ్వాలి. అలాకాకుండా నేను చాలా ఉన్నతంగా, క్రమశిక్షణతో బతుకుతున్నాను- అనే భావనతో ముడుచుకుపోయి సీరియస్‌గా ఉండటం వలన జీవితం దానికున్న సహజమాధుర్యాన్ని కోల్పోతుంది. చరిత్రలో మనకు తెలిసిన చాలామంది పెద్దవాళ్లు హాస్యాన్ని ప్రేమించారు. ఇతరులపట్ల చాలా ఆదరంగా ఉన్నారు. తాము సాధించాల్సిన కార్యాలకోసం మాత్రం సీరియస్‌గా పనులు చేశారు.
నపనిలో పట్టుదల...ఫలితం టేకిటీజీ!
టేకిటీజీ పాలసీకి వ్యతిరేక పదం చెప్పాలంటే పర్‌ఫెక్షనిజం. తీసినగ్లాసు తీసినచోట, పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంచడంతో మొదలైన పర్‌ఫెక్షనిజం పెద్దపెద్ద విషయాల వరకు వెళ్లిపోతుంది. ఇదంతా క్రమశిక్షణలో భాగంగా చిన్నతనంలో నేర్చుకుంటాం. ఇది ఇలాగే ఉండాలి- అనటంలో ఒక సీరియస్‌నెస్‌ ఉంది. అయితే ఇక్కడ క్రమశిక్షణని తక్కువ చేసి మాట్లాడటం కాదు. జీవితాన్ని సౌకర్యంగా మార్చుకోవడానికి మనం పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాం. ఃఈ విధానాలు మనకోసంః అనుకున్నంతసేపు బాగుంటుంది...మరి కాస్త ముందుకువెళ్లి ఈ గొప్ప పద్ధతులు పాటించడానికే మనం పుట్టాము- అనుకుంటేనే వస్తుంది సమస్యంతా.
కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగినా తట్టుకునే ఓర్పు, సహనం ఉండాలి. సందర్భానికి అనుగుణంగా మనల్ని మనం సవరించుకునే శక్తి ఉండాలి. ఇదే ఫ్లెక్సిబిలిటీ. అయితే ఎక్కడ ఎంతవరకు పట్టుదలగా ఉండాలి, ఎక్కడ సడలించవచ్చు...లాంటి విషయాలు మన విచక్షణమీద ఆధారపడి ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే పనిచేసేటప్పుడు గట్టిపట్టుదలతోనే చేయాలి. కానీ ఫలితం విషయంలో టేకిటీజీ పాలసీతో ఉండాలి. ముఖ్యంగా ఏం చేసినా మారని విషయాల్లో, అనుకోకుండా ఫలితం తారుమారు అయినపుడు, ఇతరులు మనవల్ల బాధపడతారు అనుకున్నపుడు, ఒక విషయం ఎక్కువ సమయం మనల్ని బాధకి గురిచేస్తున్నపుడు టేకిటీజీయే శ్రీరామరక్ష.
నఈజీగా గాయపడతాము...
ఎవరే చిన్నమాటన్నా కొంపలు మునిగిపోయినంత బాధకలుగుతుంది. ఈజీగా తీసుకునే అలవాటు ఉండదు కాబట్టి ఏ విషయాన్నీ అలా తీసుకోలేము. ఎవరు ఏమన్నా తట్టుకోలేకపోవటం అం టే అది అన్ని వేళలా ఆత్మాభిమానం అవ్వదు. ఒక గాజు మేడని లోపల నిర్మించుకుని ఎవరు రాయేస్తారోననే దిగులుతో గడపటం. అదే మన లోపల ఒక కంచుకోట ఉంటే...
న గతంలో చేసిన తప్పులనుంచి బయటపడలేము
పొరబాట్లు తప్పులు చేయకుండా జీవితాలే ఉండవు. వాటినుండి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలి. పొరబాట్లని తేలిగ్గా తీసుకోలేకపోతే అది ఆ పొరబాటుని మించినది అవుతుంది. ఎందుకంటే గతాన్ని తీసేయలేకపోవటం అంటే భవిష్యత్తుని వదిలేసుకోవటం. ముందున్న గమ్యాన్ని చేరడానికి వెనక్కి నడిచినట్టుగా ఉంటుంది. ఇతరులు చేసిన పొరబాట్లను కూడా ఇలాగే చూడాలి. త్రాసు పట్టుకుని ఇతరులు చేసిన తప్పుల్ని, మన పొరబాట్లని కొలతలు వేసుకుని తీర్పులు ఇవ్వడానికి మనం పైనుంచి దిగివచ్చిన న్యాయమూర్తులం కాదు. జరిగిపోయిన విషయాల్లోంచి ఒక కొత్త విషయాన్ని నేర్చకోవటం తప్ప మరే ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి.
నఇతరులనుంచి ఎక్కువ గౌరవం, కృతజ్ఞత ఆశిస్తాము
మనం చాలా గొప్పవ్యక్తులమనీ, అందరూ మనల్ని గౌరవించాలనే మిథ్యాభావన ఒకటి ఉంటుంది. అలాంటి గౌరవం దక్కకపోతే తట్టుకోలేము. ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడిపోతాం. గౌరవం, కృతజ్ఞత బయటనుంచి మనకు వచ్చేవి కావు. ఇవి మనలోపలే ఉంటాయి. ఃనీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను అవమానించలేరుః అంటారు మహాత్మా గాంధి. గౌరవం అంటే మనపట్ల మనకున్న విశ్వాసం. కృతజ్ఞత అంటే జీవితంలో మనకు లభించిన ఎన్నో మంచి విషయాలను గుర్తించి, వాటిని కలిగి వున్నందుకు ఆనందంగా, సంతృప్తిగా ఉండటం. ఇతరులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది వారి సొంత విషయం. దానికి, మన ఆనందానికి ముడిపెట్టి చూడడం హాస్యాస్పదం.
నమన లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తాము
జీవితంలో లక్ష్యాన్ని మాత్రమే చూడాలంటే అనసరమైన విషయాలను నిర్లక్ష్యం చేయాలి. పరిస్థితులు, మనుషులు ఎలా ఉన్నా లక్ష్యం మాత్రమే కనిపించాలంటే మిగిలిన అన్నింటినీ టేకిటీజి అని వదిలేయాలి.
నవ్వటం, హాస్యంగా మాట్లాడటం, త్వరగా గాయపడకుండా ఉండటం, ఇతరులతో మృదువుగా మాట్లాడటం, మార్పుని అంగీకరిస్తూ ముందుకు సాగటం, ఇతరుల వల్ల హాని, అవమానం కలుగుతుందనే భయం లేకుండా ఉండటం....ఇవన్నీ జీవితాన్ని భారంగా కాకుండా ప్రియంగా చూడగల సామర్ధ్యాలు. వీటిని సాధనతోనన్నా సమకూర్చుకోవాల్సిందే.
-వడ్లమూడి దుర్గాంబ

'మేడ్‌ ఇన్‌ ఇండియా'

ఆర్థిక ప్రగతి పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు మారిందనడానికి సూచిక ఇది. ఆసియా దిగ్గజాలైన భారత్‌, చైనాలలో తయారైన వస్తువులకు పశ్చిమ దేశాల్లో క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ఫార్చ్యూన్‌ మేగజైన్‌ చేసిన సర్వేలో ఈ విషయం స్పస్టమైంది. అందులోనూ భారత్‌ వస్తువులకు మరింత గిరాకీ పెరిగింది.
'మేడ్‌ ఇన్‌ ఇండియా' ఉత్పత్తులకు అమెరికాలో గిరాకీ బాగానే ఉందని ఒక సర్వేలో వెల్లడైంది. అదే విధంగా, మేడ్‌ ఇన్‌ చైనా ఉత్పత్తుల పట్ల వినియో గదారులు అంతగా ఆసక్తి చూపడం లేదని తేలింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్‌ మేగజైన్‌ ఈ విశేషా లను వెల్లడించింది. ఈ వస్తువుల్లో ఆట వస్తువులు కూడా ఉన్నాయి. అమెరికాకు చెందిన ఆట వసు ్తవుల కంపెనీ మట్టెల్‌ చైనా నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుండగా, వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. 57 శాతం మంది అమెరి కన్లను మేగజైన్‌ సంప్రతించగా, అయిదుగురిలో ముగ్గురు చైనా ఉత్పత్తుల పట్ల ఆంతగా ఆసక్తిని వ్యక్తపరచలేదు. అయితే, సర్వే జరిపిన వారిలో 52 శాతం మంది 'మేడ్‌ ఇన్‌ ఇండియా' ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత చూపలేదని మేగజైన్‌ పేర్కొంది. మొ త్తం అమెరికన్లలో 35 శాతం మంది భారతీయ వస్తువుల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదని, 11 శాతం మంది అత్యధికంగా ఆసక్తి చూపుతున్నారని వివరించింది. అదేవిధంగా చైనా వస్తువుల పట్ల 11 శాతం మంది కొద్దిగా ఆసక్తి చూపుతుండగా, 30 శాతం మంది అసలు పట్టిం చుకోవడం లేదని పేర్కొంది. గత నెలలో జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కూడా బయటపడ్డాయి. ఆయా వస్తువులు అసలు ఏ దేశంలో తయారవుతున్నదీ అమెరికన్లు పట్టించు కోవడం లేదని, అయితే, చైనా వస్తువలు అయితే మాత్రం జాగ్రత్త పడుతున్నారని తేలింది. తూర్పు ఐరోపాలో తయారైన వస్తువులను 57 శాతం మంది, పశ్చిమ ఐరోపా వస్తువులను 55 శాతం మంది, కెనడా ఉత్పత్తులను 53 శాతం మంది, భా రత ఉత్పత్తులను 52 శాతం మంది, ఆఫ్రికా ఉత్పత్తులను 51 శాతం మంది, మెక్సికో ఉత్పత్తులను 48 శాతం మంది, జపాన్‌ ఉత్పత్తులను 47 శాతం మంది, దక్షిణ కొరియా ఉత్పత్తులను 46 శాతం మంది అమెరికన్లు ఇష్టపడుతున్నారు.

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పదిలక్షల మందితో సమైక్యాంధ్ర మార్చ్

ఈ నెల 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టనున్న తెలంగాణ మార్చ్‌కు ధీటుగా తాము సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర ప్రదేశ్ రైతాంగ సమాఖ్య శుక్రవారం ప్రకటించింది.
తెలంగాణ మార్చ్ నిర్వహించే రోజునే తాము సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత నేతలు సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందుకు రాని వారిని సమైక్యాంధ్ర వ్యతిరేకులుగా గుర్తిస్తామని, తమకు మద్దతు పలికే వారిని వచ్చే సాధారణ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీలు రాజీనామా చేయాలని వారు పిలుపునిచ్చారు.  తెలంగాణ నేతలు లక్ష మందితో మార్చ్ చేస్తే తాము పదిలక్షల మందితో చేస్తామన్నారు.

యూపీఏకు ములాయం మద్దతు

ములాయం సింగ్ యాదవ్ యూపిఏ ప్రభుత్వాన్ని ఆపద సమయంలో ఆదుకున్నారు. యూపీఏ సర్కాకు బయట నుంచే మద్దతు ఇస్తామని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. అయితే డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. మతతత్వ శక్తులు అధికారంలో రాకూడదనే యూపీఏకు మద్దతునిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యూపిఏకి మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రజా వ్యతిరేక కేంద్ర విధానాలపై తాము ఉద్యమిస్తామన్నారు. 2014లో మూడో ఫ్రంట్‌దే విజయమని ధీమా వ్యక్తపరిచారు. ప్రస్తుతం మద్యంతరానికి అవకాశం లేదని ములాయింసింగ్ యాదవ్ తేల్చిచెప్పారు.


ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

ఆ డబ్బు ఎక్కడనుండి తేవాలి ?

ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను ఏ ప్రభుత్వమూ తీసుకోదని ప్రధాన మంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించడానికై ప్రధాని శుక్రవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని, ఇటువంటి పరిస్థితులలో క్లిష్టమైన నిర్ణయాలను కఠినంగా అమలు చేయకపోతే దేశం పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. యు.పి.ఎ. ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేదని చెబుతూ ప్రభుత్వం కొనసాగింపునకు ఎటువంటి అవరోధాలూ లే వని ఆయన చెప్పారు.

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులవల్ల రైతులకు మేలు జరుగుతుందంటూ మాల్స్ వంటివి రావడంవల్ల ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. వైద్య, విద్య, తదితర ఉపాధి రంగాలలో అవకాశాలు పెరగడానికి వీలుగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. సంస్కరణలను అమలు చేస్తున్నది ఇందుకోసమేనని ఆయన చెప్పారు. సబ్సిడీల భారం ప్రభుత్వానికి పెరిగిపోతున్నదంటూ, ఖరీదైన కార్లు వినియోగించేవారికి డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.


ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

కేంద్రం "దింపుడు" కళ్ళెం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్లపై ఇప్పటి వరకు వసూలు చేస్తూ వచ్చిన కస్టమ్, ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆరు సబ్సీడీ సిలిండర్ల తర్వాత బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే ఒక్కో సిలిండర్‌ ధరపై రూ.140 తగ్గనుంది. ఇది వంటగ్యాస్ వినియోగించే పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కో వంటగ్యాస్ సిలిండర్‌ను సబ్సిడీ ధర రూ.394కు చొప్పున అందజేస్తోంది. అదే బహిరంగ మార్కెట్‌లో అయితే ఈ ధర రూ.754గా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల సబ్సిడీకి ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను యేడాదికి ఆరింటికి కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆపై సిలిండర్లు కావాలనుకునే వినియోగదారులు బహిరంగ మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏడో సిలిండర్ ధరపై రూ.140 తగ్గనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శుక్రవారం ప్రకటించారు. అలాగే డీజిల్‌పై బీహార్ ప్రభుత్వం రెండు శాతం పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని మంత్రి స్వాగతించారు. అదేసమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సబ్సిడీకి వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని చిదంబరం కోరారు.

19, సెప్టెంబర్ 2012, బుధవారం

సీనియార్టీకి ఏదీ గౌరవం!

ఏదైన ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన చదివితే అందులో అనుభవం ఉన్నవారికే తొలి ప్రాధాన్యత అని తప్పకుండా ఉంటుంది. అనుభవం వల్ల సంస్థ పనితీరు బావుంటుందనేది వారి అభిప్రాయం. ఏ రంగంలో అయినా సరే అనుభవానికే పెద్దపీట వేస్తారు. చివరికి డ్రైవర్‌ ఉద్యోగానికి సైతం అనుభవం కావాలి. అయితే ఎలాంటి అనుభవం అవసరం లేని రంగం ఒకటుంది. అదే చిత్రరంగం. ఇక్కడ అనుభవం కంటే కొత్తవారికే ప్రాధాన్యత ఎక్కువ. కళారంగంలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం సబబే అయినప్పటికీ, సీనియర్లను పక్కన పెట్టడం సరికాదు. నేటి స్టార్లు, సూపర్‌స్టార్లు, మెగాస్టార్లు ఇలాంటి సీనియర్ల చలువ వల్లే నేడున్న స్థానాన్ని పొందగలిగారనేది అందరూ అంగీకరించేదే. చరిత్ర చెప్పుకునే చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన పలువురు సీనియర్‌ దర్శకులు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. అపారమైన వారి అనుభవం దేనికీ ఉపయోగపడడం లేదు. నాడు కొత్తవారిని ప్రోత్సహించి, వారు నిలబడడానికి దోహదం చేసిన వారున్నారు. అలాగే కొత్తగా వచ్చిన వారికి స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టిన పాత్రలను ఇచ్చినవారున్నారు. మహిళా ప్రేక్షకులను కంట తడిపెట్టించిన చిత్రాలను, మాస్‌ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించిన సినిమాను, విమర్శకులను సైతం ఆలోచింపజేసిన చిత్రాలను అందించిన మహనీయ దర్శకుల అనుభవం ఎందుకు ఉపయోగపడకుండా పోతోంది. పరిశ్రమ బాగుకోసం, మంచి సినిమాల నిర్మాణం కోసం వారి సలహాలు తీసుకునే ఆలోచనే పరిశ్రమకు లేదు. ఆధునిక పరిజ్ఞానం పాతవారికి తెలియదని చులకనగా చూసే వారికి, నేటి కంప్యూటర్లు లేనప్పడే మాయలు, మంత్రాల చిత్రాలను అందించిన ఘనత వారిదని గ్రహించలేకపోతున్నారు. కేవలం ఒకటి రెండు సక్సెస్‌లు అందించి కొత్త నిర్మాతలకు నిర్మాణంలో మెళకువలు నేర్పిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించుకునే నిర్మాతలు సీనియర్లను కేవలం ట్రంకు పెట్టెలో దాచిపెట్టే ఆస్థిగానే చూస్తున్నారు. మరికొందరైతే వారి సేవలకు గౌరవం కల్పించాలి ముఖ్య కో డైరక్టర్‌ అంటూ ప్రత్యేక పోస్ట్‌ను సృష్టించి వాడుకుంటున్నారు.
సినిమా అంటేనే కల్పితం ఇక్కడ అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ తెరపైనే చూపిస్తారు కానీ, నిజ జీవితంలో ఉండవని అంటారు. తమ కెరీర్‌కు అద్భుతమైన పునాదులు వేసిన దర్శకులను చివరి రోజుల్లో పలకరించడానికి సైతం హీరోలు ఇష్టపడరు. తమ తొలిచిత్రం దర్శకుడని చెప్పడానికి ఆసక్తి చూపించరు. ఈ రంగం గురించి విపులంగా తెలిసిన వారంతా ఇదంతా మామూలే అని తేలిగ్గా కొట్టిపారేస్తారు.
సీనియర్ల సేవలను దూరం చేసుకోవడం వల్ల తెలుగులో అద్భుత చిత్ర రాజాలు వస్తున్నాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఇప్పటికీ ఘనంగా చెప్పుకునే పాత చిత్రాల సృష్టికర్తలు మనముందే ఉన్నప్పటికీ వారికి ఏ విధంగానూ గౌరవించలేకపోతున్నారు.
పరిశ్రమనే కాదు సీనియర్లకు ప్రభుత్వ పరంగా లభిస్తున్న గౌరవం కూడా తక్కువే. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఇప్పటికీ పద్మశ్రీ పురస్కారం లభించలేదంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. పొరుగు రాష్ట్రాల్లో తప్పటడుగులు వేస్తున్న వారికి సైతం ఇలాంటి గౌరవం దక్కింది. ఇలాంటి అనేక విషయాల్లో తెలుగు సీనియర్లకు జరుగుతున్న అన్యాయం గురించి పరిశ్రమ పెద్దలు మాట్లాడితే బావుంటుంది.
శతాధిక చిత్రాల సృష్టికర్తలు దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పరిశ్రమకు రెండు కళ్ళలాంటివారు. నేటి యువదర్శకుల చిత్రాలకు వారి చిత్రాలే ప్రేరణ. కొత్తతరం సాధిస్తున్న విజయాలు చూస్తూ పాతతరం కూడా వారితో పోటీపడడానికి ముందుకు రావడానికి ఉత్సాహపడుతుంది. మధ్యతరగతి జీవితాల్లోని సంఘర్షణకు వెండితెర రూపం ఇచ్చి అనేక చిత్రాలను సృష్టించి భారతీయ సినిమా రంగానికే ఆదర్శంగా నిలిచిన దాసరి నారాయణరావు ఏడాదిగా మెగా ఫోన్‌ పట్టడం లేదు. ఆయన శిష్యగణంలో కొందరు మాత్రం చిత్రాలు తీస్తూ వస్తున్నారు.
మాస్‌ ప్రేక్షకుల పల్స్‌ పట్టుకుని, హీరోలకు గ్లామర్‌ నగిషీలు చెక్కిన కమర్షియల్‌ చిత్రాల సృష్టికర్త కె.రాఘవేంద్రరావు పదేళ్ళ క్రితమే తన పంథా మార్చేశారు. రక్తి చిత్రాల నుండి భక్తి చిత్రాలకు మారారు. అయినప్పటికీ స్టార్‌ హీరోలతో భక్తిని ప్రేక్షకులకు చూపిస్తూ 'అన్నమయ్య, శ్రీరామదాసు', తాజాగా 'శిరిడిసాయి' అందించారు. మధ్యలో 'గంగోత్రి, ఝమ్మందినాదం' అంటూ తనదైన తరహా చిత్రాలు అందించినప్పటికీ, భక్తి చిత్రాలు ఆయన సెకండ్‌ ఇన్నింగ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. దర్శకుడిగా గ్యాప్‌ తీసుకోకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు.
కళాత్మక చిత్రాల సృష్టికర్తలు బాపు, కె.విశ్వనాథ్‌ అడపాదడపా తమ తరహా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇటీవలే బాపు 'శ్రీరామరాజ్యం' చిత్రం ద్వారా నేటి యువతరం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కె.విశ్వనాథ్‌ ఆ మధ్య 'శుభప్రదం' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది సంగీతం, నాట్యం ప్రధానాంశాలుగా తీసిన సినిమానే.
దక్షిణాదిలో పలు అద్భుత చిత్రాలు తీసిన సింగీతం శ్రీనివాసరావు ఇటీవల గ్యాప్‌ తీసుకున్నారు. 'ఘటోత్కచ' యానిమేషన్‌ సినిమా నిరాశపరిచింది. అయితే ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌ తీస్తారని ప్రచారం జరుగుతోంది. క్రీస్తుకు సంబంధించిన చిత్రంలో కొంతవర్క్‌ జరిగింది.
ఇటీవలే 'అరుంధతి' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన కోడిరామకృష్ణ తదుపరి చిత్రం కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. గ్రాఫిక్స్‌ సినిమాలను అందించిన ఘనత ఆయనది. శతాధిక చిత్రాలు తీసినా అలుపెరుగని ఉత్సాహంతో చిత్రాలు రూపొందిస్తుంటారు. తాజాగా పుట్టపర్తి సాయిబాబు జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ చిత్రాలంటే పి.సి.రెడ్డి సినిమా చూడాల్సిందే. ఎందరో శిష్యులను తయారుచేసి పరిశ్రమకు అందించిన పి.సి.రెడ్డి అనుభవానికి తగిన చిత్రం చేసే అవకాశం చాలాకాలంగా రావడం లేదని చెప్పవచ్చు. ఈ మధ్య తీసిన రెండు చిత్రాలు నిలబడలేదు.
కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ రేలంగి నరసింహారావు సినిమాలు. 'నేను మా ఆవిడ' నుండి వరుసగా ఆయన ఈ తరహా చిత్రాలే అందించిన తన ఇంటిపేరును సార్థకం చేసుకున్నారు. ఇతర దర్శకులకు భిన్నంగా సినిమాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. కామెడీ చిత్రాలు తీసేవారికి ప్రేరణగా నిలిచారు. రేలంగి కొంతకాలంగా కొత్త చిత్రాలేవీ చేయడం లేదు. ఆయన సేవలనూ పరిశ్రమ ఉపయోగించుకోవడం లేదు.
'పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం' విమర్శకుల ప్రశంసలు పొందిన అభ్యుదయ చిత్రాలు. చిరంజీవితో 'అన్నయ్య, హిట్లర్‌' చిత్రాలు అందించిన చరిత్ర ఉన్న దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. సెంటిమెంట్‌ పండించడంలో దిట్ట. మధ్యతరగతి కథలతో ఆయన తీసిన 'అమ్మాయి కాపురం, కలికాలం' వంటి చిత్రాలు ఆలోచింపజేసేవే. కొంతకాలంగా 'ముత్యాల సుబ్బయ్య' విరామం తీసుకున్నారు.
తెలుగు సినిమా చరిత్రలో తొలి బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా 'పెదరాయుడు'. సంచలన విజయం సాధించిన 'చంటి, యుముడికి మొగుడు', కంటతడి పెట్టించిన 'పుణ్యస్త్రీ' వంటి చిత్రాల దర్శకుడు రవిరాజా పినిశెట్టి చాలా కాలంగా మెగాఫోన్‌కు దూరంగా ఉన్నారు. తరం మారడమే ఇందుకు కారణమా?.
దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకున్న విజయనిర్మల ఎందరో మహిళలకు ప్రేరణ కలిగించిన దర్శకురాలు. నవలా చిత్రాలను, గ్రామీణ కథాంశం ఉన్న సినిమాలను ఆమె అందించారు. విజయం సాధించారు. కొద్దిరోజుల క్రితమే 'నేరము- శిక్ష' పేరుతో చిత్రం తీశారు. ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మంచి కథ లభిస్తే సినిమా చేయడానికి సిద్ధమే అంటున్నారు.
'న్యాయంకావాలి' చిత్రం తర్వాత ఎ.కోదండరామిరెడ్డి తీసిన 'ఖైదీ' ఘనవిజయం సాధించింది. చిరంజీవిని స్టార్‌ని చేసింది. అప్పటి నుండి కోదండరామిరెడ్డి పేరు చెబితే కమర్షియల్‌ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. క్షణం తీరిక లేకుండా అందరి హీరోలతో చిత్రాలు తీసిన కోదండరామిరెడ్డి శత చిత్రాలకు చేరువలో ఉన్నారు. ఇప్పుడాయన చేతిలో సినిమాలే లేవు. నాడు ఆయన డేట్స్‌ కోసం వెంటపడిన హీరోలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమంది ఉన్నారు. కొత్తతరం వస్తే పాతతరం పక్కకి తప్పుకోవాలనేది నిజమే అయినప్పటికీ, వారి సేవలను ఉపయోగించుకుంటే పరిశ్రమలో మరిన్ని ఆరోగ్యవంతమైన చిత్రాలు రావడానికి దోహదపడినట్టు అవుతుంది. నేటి చిత్రాల ఫలితాలు ఎలా ఉంటున్నాయనేది తెలిసిందే. నేటి ఆధునిక యువత మెచ్చే చిత్రాలు పాతతరం దర్శకులు తీయలేనేది అపోహ మాత్రమే. కె.రాఘవేంద్రరావు తీసిన 'ఝుమ్మందినాదం', 'అన్నమయ్య'. 'శిరిడిసాయి', బాపు తీసిన 'శ్రీరామరాజ్యం', కోడి రామకృష్ణ అందించిన 'అరుంధతి' వంటి చిత్రాలు ఎలాంటి సంచలన విజయం సాధించాయో తెలిసిందే. నేటితరం దర్శకులకు తెలిసింది కేవలం ఖర్చు పెట్టడమే. ఆ తరానికి తెలిసింది పెట్టిన ఖర్చు తెరపై కనిపించేలా చేయడం. ఇలాంటి వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ తరం సినిమాలను ఇప్పటికీ ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. అందువల్ల ఎవరిగౌరవం వారిదే.

- రామనారాయణరాజు

సుడిగాడు సెన్సార్ బిట్స్

సుడిగాడు సెన్సార్ బిట్స్ 
అల్లరి నరేష్‌ 'సుడిగాడు'గా టైటిల్‌ రోల్‌ పోషించి ద్విపాత్రాభినయం చేసిన చిత్రంలో మోనాల్‌ గజ్జర్‌ నాయిక. బ్రహ్మానందం, ఎం.ఎస్‌.నారాయణ, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని, కోవై సరళ ముఖ్యపాత్ర ధారులు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుంధతి మూవీస్‌ పతాకాన చంద్రశేఖర్‌ డి.రెడ్డి నిర్మించారు. 'సుడిగాడు'ని చూసిన 'ఇసి' తలిదండ్రుల నిర్దేశకత్వంలో పిల్లలు చూడాలంటూ 5 కట్స్‌తో 'యుఎ' సర్టిఫికెట్‌ 17-8-12న జారీ చేసింది.

1. ''ఒక్క బబుల్‌ గమ్‌ ఎంతసేపు నముల్తారు'' కత్తెర పాలైంది.

1. ''శివ హైకోర్టు'' దృశ్యాలు కత్తెరింపుకి గురి అయ్యాయి.

3. ''పైన తగిలితే పనికి రాకుండా పోతావు'' డైలాగ్‌ తొలగించడమో శబ్దం వినరాకుండా చేయమనో సూచించగా తొలగించారు.

4. 'దానమ్మ, నీ యమ్మ, నీ తల్లి, నీ యయ్య, ఆడు ఎక్కించుకున్నాడు, కామనాథులు, గుడి, గర్భగుడి' పదాలున్న చోట శబ్దం వినరాకుండా చేయడమో, తొలగింపుకు గురి చేయమనో చెప్పగా తీసివేసారు.

5. ''ఆ బూతులు ఏంటి అధ్యక్షా - బూతులు వినబడుతున్నాయనే ఇది మన అసెంబ్లి అయ్యుంటుంది'' డైలాగ్‌ కత్తెర పాలైంది. 2గం20ని||ల సేపు ప్రదర్శితమయ్యే సుడిగాడు 24-8-12న విడుదల అయింది.

నగరంలో వినాయకుడు సెన్సార్ కట్స్‌

భారతం క్రియేషన్స్‌ పతాకాన ప్రేమ్‌చంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నగరంలో వినాయకుడు'. కృష్ణుడు, రమ్య నాయకా నాయికలుగా కృష్ణ భగవాన్‌, దువ్వాసి మోహన్‌ ఇతరపాత్రలు పోషించారు. మాటలు, పాటలు బి.కె. ఈశ్వర్‌, సంగీతం సాహిణి శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం జె. గణశన్‌, కూర్పు అనిల్‌ మల్నాడ్‌ నిర్వహించిన ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' ఏ విధమైన కట్స్‌ లేకుండా 4-7-12న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది. 17-8-2012న విడుదల అయింది. నిర్మాత ఎం. సూర్యకమల.

శ్రీనివాస కళ్యాణం 25

యువచిత్ర పతాకాన కోడి రామకృష్ణ దర్శకత్వంలో కె. మురారి నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' సెప్టెంబర్‌ 1982లో విడుదలై ఈ 25వ తేదీతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కె. మురారి నిర్మించిన మంచి చిత్రాల్లో ఇది ఒకటి. జి. సత్యమూర్తి కథ సమకూర్చారు.
తలిదండ్రులను కోల్పోయిన శ్రీనివాస్‌ (వెంకటేష్‌) అతని సోదరి మేనమావ (సుత్తివేలు) ఇంట ఉంటారు. సుత్తివేలు వారిని ఆదరంగా చూడడు. దాంతో సుత్తివేలు కూతురు (గౌతమి) సలహాతో ఇల్లుని వదిలివెళ్ళి రైల్వేట్రాక్‌ పక్కన గల కాలనీలో వుండే గొల్లపూడి మారుతీరావు ఆశ్రయంలో వార్తా పత్రికలు పంపిణీ వంటి పనులు చేస్తూ పెరుగుతారు. ఉద్యోగాన్వేషణలో వచ్చిన లలిత (భానుప్రియ) తన అక్క ఇంట వుంటూ శ్రీనివాస్‌కి పరిచయం అవుతుంది. భానుప్రియకి ఆసక్తిగల డ్యాన్స్‌ స్కూల్లో జేర్పిస్తాడు శ్రీనివాస్‌. భానుప్రియ శ్రీనివాస్‌ ప్రేమలో పడుతుంది. గొల్లపూడి ఇంట్లో అద్దెకుండటానికి వచ్చిన గౌతమి తన బావ శ్రీనివాస్‌ని గుర్తిస్తుంది. ఆమె కూడా ప్రేమలో పడడంతో కథ మలుపులు తిరుగుతుంది. గొల్లపూడి మారుతీరావు, వై. విజయ, లంబోదరంగా మోహన్‌బాబు చక్కని నటనతో ఆకట్టుకుంటారు. ప్రసాద్‌బాబు, శుభలేఖ సుధాకర్‌, వంకాయల సత్యనారాయణ, భీమేశ్వరరావు, వరలక్ష్మి మిగతా పాత్రధారులు. కె.వి.మహదేవన్‌ సంగీతం సమకూర్చిన 'ఎందాకా ఎగిరావమ్మా... జాబిల్లి వచ్చి.... తుమ్మెదా ఓ దుమ్మెదా.... తొలి పొద్దులో... కదలిక కావాలిక... ఇలా అయిదు పాటలు ఉన్నాయి. వెంకటేష్‌ నటించిన 7వచిత్రం సాత్వికమైన పాత్ర పోషించారు.

కొన్ని జ్ఞాపకాలు
- గొల్లపూడి మారుతీరావు
శ్రీనివాస కళ్యాణం కోడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. నా పాత్రల మీద ప్రత్యేకమైన శ్రద్ధ, అప్పటి నా పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దేవాడు కోడి. ఆ చిత్రానికి నేనే మాటలు రాశానేమో గుర్తులేదు! ఒక్కటి ప్రస్ఫుటంగా గుర్తుంది. గౌతమికి అది మొదటి చిత్రం. ఆమె నా మిత్రులు డాక్టర్‌ శేషగిరిరావు గారి కుమార్తె. ఆయన విశాఖలో మా రోజుల్లో ప్రముఖ రేడియాలజిస్టు. గౌతమితో ఆమె అమ్మగారు ఉండే వారు. చెన్నై విమానాశ్రయం దాటాక పల్లవరంలో ఒక ఇంట్లో షూటింగ్‌. పక్కనే రైలు ట్రాక్‌. రైళ్లు వచ్చినప్పుడల్లా ఆ దృశ్యం బాక్‌ డ్రాప్‌గా ఉండేటట్టు షాట్‌ తీసేవాడు కోడి. అదొక ఏనిమేషన్‌. ప్రతీరోజూ షూటింగ్‌ తల్లితో మా ఇంటికి వచ్చేది గౌతమి. మేం ముగ్గురం కలిసి షూటింగ్‌కి వెళ్లేవారం. నాది ఆమెకి తండ్రిలాంటి పాత్ర. గౌతమికి కాంటాక్ట్‌ లెన్స్‌లు వుండేవి. సీన్‌ అయ్యాక కళ్ల వెంబడి వచ్చే నీళ్లు. కళ్లు ఎప్పటి కప్పుడు తుడుచుకుంటూ ఉండేది. చక్కని క్రమశిక్షణ, సంస్కారం ఉన్న వ్యక్తి గౌతమి. ఇప్పటికీ నన్ను తన తండ్రిలాగ గౌరవిస్తుంది.
మురారి నిర్మాత. నేనూ వై.విజయ ఇంటి పొరుగున ఉండే దంపతులం. చక్కని ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించాడు దర్శకుడు. చిత్రం బాగా నడించింది. అభిరుచికి పెట్టింది పేరు మురారి. కాస్త చాదస్తం ఉన్నా చివరకు మంచి సినిమాతో ఆయన చాదస్తాన్ని, పెళుసుతనాన్నీ అంగీకరించేటట్టు చేస్తాడు, వెంకటేష్‌కి కూడా అదొక భిన్నమైన పాత్ర.
మా అందరికీ ఓ మంచి పాట ఉన్న గుర్తు. ఆ ఇంటిముందు మామిడి చెట్టు నీడల్లో చేశాం. కొన్ని సినిమాలు చక్కని జ్ఞాపకాలుగా మనస్సుల్లో నిలిచిపోతాయి. అలాంటి చిత్రాలలో 'శ్రీనివాస కళ్యాణం' ఒకటి.

- వి.ఎస్‌.కేశవరావ్‌

30 సంవత్సరాల 'మేఘసందేశం'

చక్కని నాటకీయత, వినసొంపైన పాటలతో, కుటుంబం పరువు ప్రతిష్ఠలు గురించి ఆలోచించే వ్యక్తులు, సెంటిమెంట్స్‌తో అక్కినేని దాసరి నారాయణరావు కాంబినేషన్లో రూపుదిద్దుకుని కళాత్మక చిత్రం 'మేఘసందేశం'. దాసరి నారాయణరావు గానీ, కె. రాఘవేంద్రరావు గానీ సంగీత ప్రధానమైన కళాత్మక చిత్రం ఏదైనా తీసారా అని అభిమానులు విజయవాడలో ఓ సినిమా పంక్షన్‌ తర్వాత వాదోపవాదాలకి తీవ్రంగా దిగడంతో ఇది విన్న తర్వాత దాసరి, రాఘవేంద్రరావు ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం చేసారు. కొంతకాలానికి దాసరి అక్కినేని నాగేశ్వరరావుతో మేఘసందేశం'. చాలా కాలం తర్వాత నాగార్జునతో కె. రాఘవేంద్రరావు 'అన్నమయ్య' చిత్రాలు రూపొందించడం ఈ రెండు చిత్రాలు విశేష ఆదరణ పొందడం విశేషం.
4-9-82న సెన్సార్‌ శాఖ నుంచి 'యు' సర్టిఫికెట్‌ని కట్స్‌ లేకుండా లభించగా సెప్టెంబర్‌ 1982లో విడుదలైన 'మేఘసందేశం' 24వ తేదీతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య, మంగళంపల్లి బాలమురళికృష్ణ, సుభాషిణి ముఖ్యతారాగణం. తారక ప్రభు ఫిలింస్‌ పతాకాన దాసరి పద్మ నిర్మించగా సంగీతం రమేష్‌నాయుడు, ఛాయాగ్రహణం పి.ఎన్‌.సెల్వరాజ్‌ సమకూర్చారు. కథ మాటలు స్క్రీన్‌ప్లే దర్శకత్వం దాసరి నారాయణరావు సమకూర్చారు. 2 జయదేవ్‌ గీతాలు, 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతాలు, 4 వేటూరి పాటలు రాయగా, జేసుదాస్‌, సుశీల, మంగళంపల్లి బాలమురళికృష్ణ ఆలపించారు.
జేసుదాస్‌ పాడిన 'ఆకాశ దేశాన ఆషాడ మాసానా.... ప్రియే చారుశీలే... నవరస సుమ మాలికా.... బాల మురళీకృష్ణ ఆలపించిన 'పాడనా వాణి కళ్యాణిగా... పి సుశీల పాడిన ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై... ముందు తెలిసినా ప్రభూ...సిగలో అవి విరులో... శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు... నిన్నటి దాకా శిలనైనా... జేసుదాస్‌, సుశీల కలసి ఆలపించిన రాధికా కృష్ణా రాధికా... గీతాలు హిట్‌ కావడమే కాక పలు ప్రశంసలు పొందాయి. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకత్వం, ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డులు సాధించింది 'మేఘసందేశం'. రాష్ట్రస్థాయిలో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడు (అక్కినేని) ఉత్తమనటి (జయసుధ), ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ గీత రచయిత (దేవులపల్లి), ఉత్తమ గాయకుడు (జేసుదాస్‌), ఉత్తమ గాయని, ఉత్తమ ఆడియో గ్రాఫర్‌ అవార్డులు లభించాయి. ఇండియన్‌ పనోరమ, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమై ప్రముఖుల ప్రశంసలు పొందింది.
చక్కగా సంసార జీవితాన్ని గడిపే రవీంద్రబాబు (అక్కినేని నాగేశ్వరరావు) కవి, మంచి మనసున్న వ్యక్తి. ఈయన భార్య జయసుధ, బావమరిది జగ్గయ్య. ఒకానొక సందర్భంలో దేవదాసి (జయప్రద) కనిపించడంతో రవీంద్రబాబులో కవితావేశం, సృజనాత్మక భావాలు మరింత పెంపొందుతాయి. జయప్రదతో వుండడం, ఆ తర్వాత కుటుంబ పరంగా మనస్పర్థలు రావడంతో కథ మలుపులు తిరుగుతుంది.

అపోహలు మధ్య సమంత

వివాదాలు, అనుమానాలు, అపోహలు వీటి మధ్య నటి సమంత కెరీర్‌ కొనసాగుతోంది. ఐదు నెలలుగా 'ముఖం చాటేసిన సమంత ఇటీవల చెన్నైలో మీడియా ముందు ప్రత్యక్షమయింది. కొద్దిరోజులుగా కారణాలు చెప్పకుండానే సినిమాలు వదిలేసుకున్న సమంత ఆరోగ్యంపై రకరకాల వదంతుల షికారు చేశాయి. ఆమె అనారోగ్యంతో ఉన్నారని, కాదు స్కిన్‌ సమస్య వల్ల ముఖంపై మచ్చలు వచ్చాయని ఈ కారణం చేతనే సినిమాలు వదిలేసుకుందని అంటున్నారు. అగ్రదర్శకుడు శంకర్‌, మణిరత్నం చిత్రాలను సైతం సమంత వదులుకుంది. ఇద్దరు పెద్ద దర్శకుల సినిమాలు కూడా కాదనుకోవడంతో ఆమె ఇప్పుడు తీవ్ర సమస్యతో బాధపడుతోందని వదంతులు పుట్టుకొచ్చాయి. వీటిని సమర్థిస్తున్నట్లుగా తన వ్యక్తిగత సిబ్బందికి సైతం ఆమె కొద్దిరోజులు సెలవు మంజూరు చేశారు. ఈ ఐదు నెలలూ సమంత మీడియా ముందుకు రాలేదు. అయితే పక్షం రోజుల నుండి ఆమె షూటింగ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందింది. పూర్తి ఆరోగ్యవంతురాలుగా తిరిగివచ్చి తన పాత కమిట్‌మెంట్‌ను పూర్తి చేయడానికి సిద్ధమైంది. సమంత వెనకడుగు వేయడంతో ఆమె పోటీదారులు 'కాజల్‌, తమన్నా' కొంత రిలాక్స్‌ అయ్యారు అని చెన్నైవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మీనన్‌ చిత్రం చెన్నైలో జరిగిన ఆడియో విడుదల వేడుకలో సమంత పాల్గొని అపోహలకు తెరదించారు.

వెనకబడ్డ వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, షాడో' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌ పూర్తిచేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. 'బాడీగార్డ్‌' తరువాత వెంకటేష్‌ చిత్రమేదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. రెండు సంవత్సరాల క్రితం మాంచి ఊపుమీదున్న ఆయన ఈ మధ్య నెమ్మదించారు. తన సహచర నటులు బాలకృష్ణ, నాగార్జున చాలా స్పీడ్‌ మీదున్నారు. వారు ఎక్కువ చిత్రాలు అంగీకరిస్తూ మూడు, నాలుగు నెలలకు ఒక్కో చిత్రం పూర్తిచేస్తూ మళ్ళీ కొత్తవి కమిట్‌ అవుతున్నారు. వారి సమకాలికుడైన వెంకటేష్‌ మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నారని ఆయన సన్నిహితులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్యప్రధానమైన కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా పేరున్న వెంకటేష్‌ కొంతవేగాన్ని పెంచితే బావుంటుందని పరిశ్రమ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.

17, సెప్టెంబర్ 2012, సోమవారం

తండ్రి చిత్రంలో నటించని తనయ

దర్శక నిర్మాత మహేష్‌ భట్‌ రెండవ కుమార్తె అలియా భట్‌ హీరోయిన్‌గా బాలీవుడ్లో కెరీర్‌ ప్రారంభించింది. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రూపొందిన 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' చిత్రం ద్వారా ఈమెతో బాటు నటుడు డేవిడ్‌ ధావన్‌ కుమారుడు వరుణ్‌ ధావన్‌, సిద్దార్థ మల్హోత్రా కూడా పరిచయం అవుతున్నారు. షారుఖ్‌ ఖాన్‌తో కలసి కరణ్‌ జోహార్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 19న విడుదల అవుతోంది.

సంఘర్షణ చిత్రంలో బాలనటిగా 1999లో. ప్రీతిజింటా చిన్న పిల్లగా ఉన్నప్పటి ప్రీతి ఒబెరాయ్‌ పాత్ర పోషించింది అలియా. కరణ్‌ జోహార్‌ చిత్రంలో అలియా హీరోయిన్‌ అయినందుకు ఆనందంగా వుందని ప్రీతి జింటా పేర్కొంది.

అలియా గురించి కరణ్‌ జోహార్‌ చెబుతూ ''స్కూల్‌ యూనిఫాంలో తన 17వ ఏట నన్ను కలిసింది అలియా భట్‌. వయసుకు మించిన బరువు కూడా వుంది. అలియా నా చిత్రానికి పనికిరాదని అనుకున్నాను. ఆ తర్వాత 500మంది ఆడిషన్‌ టెస్ట్‌లో పాల్గొనగా స్వెట్టర్‌ ధరించి ఆడిషన్లో పాల్గొన్న అలియానే ఎంపిక చేసాం 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో హీరోయిన్‌గా'' అన్నారు.

''నిజానికి మా నాన్నే పెద్ద దర్శక, నిర్మాత. ఆయన రూపొందించే చిత్రంలో హీరోయిన్‌గా పరిచయం కావడం సులభమే. కానీ నాకు ఆసక్తి లేదు. ఈ చిత్రంలో నటించడం ద్వారా ఎలా నటించాలో కరణ్‌ వద్ద నేర్చుకున్నాను. అంతేకాదు మా నాన్న రూపొందించే చిత్రాలకు సహాయకురాలిగా కూడా పనిచేసాను'' అంది ఆలియా భట్‌.

ధర్మా ప్రొడక్షన్స్‌ పతాకాన రూపొందిన 'స్టూడెంట్‌ ఆప్‌ ది ఇయర్‌' చిత్రంలో హైస్కూల్‌ డ్రామాతోబాటు, లవ్‌, రొమాన్స్‌ అంశాలు కూడా సమ్మిశ్రమయ్యాయి.

సిగరెట్టుతో సిగపట్టు

సిగరెట్‌ తాగేవారికి కంటినిండా కునుకుండదని అర్జెంటీనా పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్‌ అలవాటు లేనివారిలా వీరు నిద్రలో విశ్రాంతిని పొందలేరని 2000మందిపై చేసిన పరిశోధన ద్వారా వీరు కనుగొన్నారు. సిగరెట్‌ తాగేవారిలో 17శాతం మంది తాము ఆరుగంటలు కూడా నిద్రపోవటం లేదని చెప్పారు. 28శాతం మంది తమకు ఎప్పుడూ కలత నిద్రేనని పేర్కొన్నారు. జర్మనీలోని ఛారిటీ బెర్లిన్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు.

సిగరెట్‌తాగేవారితో పాటు తాగని వారిని కూడా ఎంపిక చేసుకుని ఇరువర్గాల వారి నిద్రని పోల్చి చూశారు. జీవితకాలంలో ఎలాంటి మానసిక సమస్యలు లేనివారిని ఈ పరిశోధనకోసం ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే మానసిక సమస్యలున్నవారు, ఆ కారణంగా సిగరెట్లు ఎక్కువగా కాల్చడం, తద్వారా నిద్రమేలుకునే అవకాశం ఉండటం వలన ఎలాంటి సమస్యలు లేనివారినే పరిశోధనకు ఎంపిక చేసుకున్నారు.

సిగరెట్లు నేరుగా నిద్రని ఆపుతాయని చె ప్పలేమని, సిగరెట్‌తోపాటు ఇతర అలవాట్లు ఉండటం, టివి ఎక్కువగా చూడటం కూడా నిద్రలేమికి కారణం అవుతాయని పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన స్టీఫెన్‌ కోర్స్‌ అన్నారు. సిగరెట్‌లో ఉండే నికోటిన్‌లో ఉత్తేజపరచే గుణం ఉండటం వలన కూడా ఇలా జరగవచ్చని ఆయన అంటున్నారు. సిగరెట్‌ అలవాటు ఉండి నిద్రలేమికి గురవుతుంటే ఈ సమస్యని కూడా సిగరెట్‌ వదలడానికి కారణంగా భావించవచ్చునని, నిద్రపట్టకపోవటం అనేది మరిన్ని అనారోగ్యాలకు దారితీస్తుంది కాబట్టి, నిద్రలేమికి, స్మోకింగ్‌కి ఉన్న సంబంధాన్ని పరిగణనలోకి తీసుకుని సిగరెట్లు మానేస్తే మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. నిద్రలేమి వలన మధుమేహం, అధికబరువు, గుండె సమస్యలు కూడా తలెత్తుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

పొగతాగనివారిని, తాగేవారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. సిగరెట్‌ తాగేవారిలో నాలుగోవంతుమంది తమకి చాలా నిద్ర సమస్యలున్నట్టు తెలిపారు. వీరంతా తీవ్రమైన నిద్ర సమస్య ఇన్‌సోమ్నియాకు దగ్గరగా ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. పెద్ద వయసు, ఆల్కహాల్‌ తీసుకోవటం, అధికబరువు ఇవన్నీ కూడా నిద్రని తగ్గిస్తాయి. అయితే పరిశోధకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. పై సమస్యల వలన కాకుండా రూఢీగా సిగరెట్లు మాత్రమే నిద్రకి హాని చేస్తున్నట్టు వారు కనుగొన్నారు.


ఆంద్రప్రభ నుంచి సేకరణ

స్నేహదాసులు...స్వేచ్ఛా పిపాసులు!

అమెరికన్‌లలో స్నేహ పూరితమైన వాతావరణంఎక్కువగా ఉండటం వలన వారు పరిచయస్తులను త్వరగా పేరుపెట్టి పిలుస్తారు. ఇంటిపేరుకి మిస్టర్‌, మిస్‌లాంటివి తగిలించి చనువుగా మాటకలుపుతారు. తమకంటే పెద్దవారు, లేదా అధికారంలో ఎక్కువయిన వారయితేనే డాక్టర్‌, సర్‌లాంటివి కలుపుతారు. అలాగే తమని కూడా పేర్లతో పిలవాలని కోరుకుంటారు. టైమ్‌కి బాగా విలు వనిస్తారు. ఎవరినైనా చెప్పిన సమయానికి కలవాలనుకుంటారు. అది అవతలివారికి ఇచ్చే గౌరవంగా భావిస్తారు. అయితే ప్రయివేటుగా చేసుకునే పార్టీలకు, ఇళ్లలో ఏర్పాటుచేసుకున్న గెట్‌టుగెదర్‌లకు సమయం పాటించడాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఎవరి ఇంటికైతే వెళ్లాల్సిఉందో వారికి ఫోన్‌ చేసి టైమ్‌కి రాలేకపోతున్నామనే సమాచారం మాత్రం అందిస్తారు.

కాలేజిపిల్లలు క్లాసు రూములకు, లెక్చరర్లతో అపాయింట్‌మెంట్‌లు తీసుకున్న పుడు టైమ్‌కి తప్పనిసరిగా హాజరు కావాలి. ఎక్కువసార్లు ఆలస్యమవుతుంటే విద్యార్థుల గ్రేడ్‌ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.

చాలామంది ఇన్‌స్ట్రక్టర్లు విద్యార్థుల సందేహాలను వ్యక్తిగతంగా తీర్చేందుకు అంగీకరిస్తారు. క్లాసురూములో పిల్లలు ప్రశ్నలు అడగటాన్ని ఎక్కువ ప్రోత్పహిస్తారు. గౌరవం, మర్యాద సహనం ఈ గుణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు గుర్తు వారి మాటల్లో ఎక్కువగా వినిపించే ప్లీజ్‌, థాంక్యూ అనే పదాలు. వీటిని బాగా దగ్గరవారి విషయంలోనో, పెద్దవారి విషయంలోనో కాదు...అందరి వద్దా, అన్ని ప్రదేశాల్లో ఈ పదాలను వినియోగిస్తారు. క్లాస్‌రూములు, వీధులు, షాపులు ఎక్కడ చూసినా ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. మర్యాద పూర్వకంగా అడగటం వలన అవతలి వ్యక్తి స్పందనను త్వరగా పొందవచ్చని భావిస్తారు.

కనీసదూరం

ఇతరులతో కలిసి ఉన్నపుడు కనీసం 18 అంగాళాలు అంటే 43 సెంటీమీటర్లు తమ వ్యక్తిగత ప్రదేశంగా భావిస్తారు. ఆ మేరకు దూరాన్ని పాటిస్తారు. ఇది వారికి చాలా ముఖ్యం. ఈ వ్యక్తిగత పరిధి తగ్గితే వారు చాలా అసౌకర్యానికి గురవుతారు. అభినందనలు తెలుపుకునేటపుడు కూడా కౌగిలించుకోవటం చేయరు. షేక్‌హ్యాండిచ్చుకోవటం, తలలకు తాకిం చుకోవటం చేస్తారు. మా ట్లాడేటపుడు కూడా ఒకరి నొ కరు ముట్టుకోరు. అయితే చేతులు, భుజాలను కాస్త తాకటం ఆప్యాయ తగా భావిస్తారు. పరిచ యం స్నేహంగా మారాక మహిళ లు మాత్రం ఒకరినొకరు దగ్గరకు తీసుకోవటం కౌగిలిం చుకోవటం చేస్తారు.

అతిచనువుని హర్షించరు

పర్సనల్‌ స్పేస్‌ అనేది వారికి చాలా ముఖ్యం. తమ వ్యక్తిగత విషయాల్లో మితిమీరిన చనువు చూపినా, తమ వస్తువుల్ని అనుమతి లేకుండా వాడినా ఊరుకోరు. ఇల్లు, కారు, బట్టలు ఇవన్నీ సమకూర్చుకోవడానికి చాలా కష్టపడతారు. వారి వస్తువులను వాడుకోవాలంటే ముందుగా వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవాలి.

గెట్‌ టు గెదర్‌లలో...

యూనివర్శిటీ క్యాంపస్‌లో ఫార్మల్‌ డ్రస్‌లు తక్కువగా వాడతారు. విద్యార్థులు చాలావరకు జీన్స్‌, షర్టులు, స్కర్టులు, టీషర్టులు, స్వెట్‌షర్టులు, స్వెట్టర్లు ధరిస్తుంటారు. ఇంటర్వూ లకు, క్లాస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగు తున్నపుడు విద్యార్థులను వారికి నచ్చిన విధంగా ఫార్మల్‌ దుస్తుల్లో రమ్మని చెబుతారు. ఏదైనా ఫంక్షన్‌కి హాజరుకావాల్సినపుడు ఆహ్వానించిన వారినే దుస్తుల గురించి అడిగి సలహా తీసుకుంటారు.

ఇతరుల ఆహ్వానంపై విందు వినోదాలకు వెళ్లినపుడు- కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి.

న ఆహారాన్ని చిన్న చిన్న పరిమాణంలో తీసుకోవాలి.

న సూప్‌లు. పానీయాలు తీసుకుంటున్నపుడు పెద్దగా శబ్ధం చేయరాదు.

నఅందరూ టేబిల్‌ వద్ద చేరుకున్న తరువాత మాత్రమే తినటం మొదలుపెట్టాలి.

న నోటిని పూర్తిగా మూసి ఉంచే నమలటం చేయాలి.

న మౌనంగా ఉండకుండా మర్యాద పూర్వకంగా సంభాషణలు చేయవచ్చు.

స్నేహంగా ఉంటారు....దగ్గరి స్నేహితులు తక్కువ

అమెరికన్లు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వారి మాటల్లో మనం చాలా సార్లు- హౌఆర్‌యు, హౌ ఈజ్‌ఇట్‌ గోయింగ్‌- అనే మాటలు వినవచ్చు. అయితే వీటిని ప్రశ్నలుగా అనుకోవాల్సిన పనిలేదు. ఈ ప్రశ్నలకు వారు సమాధానాలు కూడా ఆశించరు. ఈ మాటలను వారు పలకరింపుగా వాడతారు. అలాగే చాలా స్నేహంగా మాట్లాడినా దగ్గర స్నేహితులుగా మారరు. క్లాస్‌మెట్స్‌ని కూడా స్నేహితులుగా చెబుతారు కానీ వాటిని నిజమైన స్నేహాలుగా పరిగణించరు. వారికి నిజమైన స్నేహితులను సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుంది.

అనుబంధంలో స్వేచ్ఛ

అమెరికాలో డేటింగ్‌ అనేమాట తరచుగా వినబడుతుంటుంది. దీనికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంది. అనుకున్న సమయంలో, అనుకున్న ప్రదేశంలో కలుసుకుని కొంత సమయం గడపడాన్ని డేటింగ్‌ అంటారు. డేటింగ్‌ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు. డేటింగ్‌కి వెళ్లినపుడు సాధారణంగా అబ్బాయే రెస్టారెంట్‌ బిల్లులవంటివి చెల్లిస్తాడు. విద్యార్థులు 'గో డచ్‌' అనే పేరుతో కలుస్తుంటారు. ఇలాంటపుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఇరువురూ ఖర్చుపెడుతుంటారు.

అమెరికా సంస్కృతిలో డేటింగ్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలేజి వయసు నుండి అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మామూలు స్నేహం నుండి, భావోద్వేగపరంగా ఒకరిపై ఒకరు ఆధారపడే స్థాయి వరకు రకరకాల స్నేహాలుంటాయి. అయితే ఇక్కడ ఎవరూ అయిష్టంగా ఒక అనుబంధంలో ఉండటానికి ఒప్పుకోరు. తమ మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్‌గా చెప్పడానికి ఇబ్బంది పడరు. సహజంగా ఉండే స్నేహతత్వాన్ని వ్యక్తిగత ఇష్టంగా అనుకుంటేనే సమస్యలు ఎదురవుతాయి. డేటింగ్‌లో ఆల్కహాల్‌ తీసుకోవటం చాలాసార్లు సమస్యగా మారుతుంది. హోమో సెక్పువాలిటి, గే, లెస్బియన్‌, బై సెక్సువల్‌...ఇలాంటివాటిని మరీ సీరియస్‌గా తీసుకోరు. ఇదివరకటి కంటే ఇప్పటితరం లైంగిక ఇష్టాయిష్టాలను పూర్తిగా వ్యక్తిగతమైనవిగా భావిస్తున్నారు. అయితే వీటిని అంగీకరించనివారు కూడా ఉంటారు.

మతం చర్చలు నచ్చవు

ఇక్కడ రకరకాల సంస్కృతులవాళ్లు కలిసిమెలసి జీవిస్తుంటారు. ఎవరైనా తమ ఆచారాలు సంప్రదాయాలను స్వతంత్రంగా పాటించవచ్చు. వివిధ మతాలకు చెందినవారు గ్రూపులుగా ఏర్పడటం కనిపిస్తుంది. ఇక్కడ చర్చికి వెళ్లేవారు ఇతర దేశాలతో పోల్చినపుడు చాలా ఎక్కువ సంఖ్యలో కనబడతారు కానీ, మతం గురించి మాట్లాడటం మాత్రం వారికి అంతగా నచ్చదు. చాలామంది నిజాయితీగా, ముక్కుసూటిగా ఉంటారు. అయితే కొంతమంది ఇతరులను తమ మతంలోకి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.

నిషేధం...మీరితే చర్యలు

ఆల్కహాల్‌, స్మోకింగ్‌ విషయంలో ప్రభుత్వ చట్టాలున్నాయి. 21 సంవత్సరాలలోపువారు వీటిని కొన్నా, కొనడానికి ప్రయత్నించినా, తీసుకున్నా, వీటికి సంబంధించిన ఫ్యాక్టరీలలో పనిచేసినా చట్టరీత్యా నేరం. 21 సంవత్సరాలు లో పు వయసున్నవారికి వీటిని అమ్మటం కానీ, బార్‌ల్లో ఇవ్వటం గానీ చేయరు. విద్యార్థులు ఆల్కహాల్‌ కొనాలనుకుంటే ఫొటోతో కూడిన ఏమైనా రెండు గుర్తింపు కార్డులు చూపించాలి. ఈ విషయంలో తప్పుడు గుర్తింపు కార్డులు చూపినా మరో విధంగా ఆల్కహాల్‌కోసం ప్రయత్నించినా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.

నాన్‌రెసిడెన్షియల్‌ ప్రదేశాల్లో, యూనివర్శిటీల్లో, స్మోకింగ్‌ నిషేధం. అయితే రెస్ట్‌ రూములు, లంచ్‌బ్రేక్‌ రూములు, ప్రయివేటు ఆఫీసులు, వర్క్‌స్టేషన్లు, వెయిటింగ్‌ రూములు, కాన్ఫరెన్స్‌ రూములకు మినహాయింపు ఉంది

ఆంద్రప్రభ నుంచి సేకరణ

నాలో..నేను.. సెన్సార్ కట్స్

పి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో మదన్‌ బి.జె. నిర్మించిన 'నాలో..నేను..' చిత్రంలో సంపత్‌రాజ్‌, రోహిత్‌, శ్రీ, చెన్నకేశవరెడ్డి, నిర్మల, శ్రీలక్ష్మి ముఖ్యపాత్రధారులు.
ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' 29-2-12న 5 కట్స్‌తో 'ఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1. సినిమాలో 'బాస్టర్డ్‌, నీ యబ్బ, నా కొడకా, నాయాలా' పదాలు ఎక్కడున్నా తొలగింపుకు గురి అయ్యాయి.
2. పబ్లిసిటీ పోస్టర్‌ని తొలగించమనగా తీసివేసారు.
3. సినిమాలో ధుమపానం, మద్యపానం సీన్లు ఎక్కడ వచ్చినా హెచ్చరికను ప్రదర్శించమన్నారు.
4. సినిమాలో 3 నుంచి 12వ రీలు వరకు గల ప్రేమ (రేపింగ్‌)కి సంబంధించిన దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమనగా, ఆ షాట్స్‌ తీసి అంగీకరించిన అంతే నిడివిగల వేరే దృశ్యాలను ఉంచారు.
5. ''వాళ్లకి ఒక్కటే నాకు రెండు ముంతలు'' అనే డైలాగ్‌ కత్తెర పాలైంది.
2గం||15 ని||ల సేపు ప్రదర్శితమయ్యే ఈ చిత్రం 22-8-12న విడుదలైంది.