14, నవంబర్ 2010, ఆదివారం

ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకోవడం భ్రమే

ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకోవడం కొందరు రాజకీయ నాయకుల కల్పనేనని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు...

600 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 6 లక్షల మంది హాజరవుతున్న ఈ రోజుల్లో కొత్త ఉద్యోగాలు ఎలా కల్పించగలరని రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి కన్నా చిన్నదైతే అభివృద్ధి కుంటు పడుతుందని, చిన్న రాష్ట్రాల కన్నా పెద్ద రాష్ట్రాల వల్లనే లాభాలు ఎక్కువ అని ఆయన అన్నారు.

వైఎస్‌ను తెలంగాణ ద్రోహిగా పరిగనిస్తున్నాం

తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులకు పాస్‌పోర్టు కావాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించడంతోనే తెలంగాణ ద్రోహిగా పరిగణిస్తున్నామని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.

వైఎస్‌కు మొదటి అభిమాని తానేనని, తెలంగాణ ఏర్పడితే పాస్‌పోర్టు అడుగుతారని ప్రకటించినప్పటి నుంచి వైఎస్‌ను ద్రోహిగా భావించామన్నారు. త్యాగధనుల సభలో వైఎస్ చిత్రపటం పెట్టొద్దని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా సమష్టిగా నిర్ణయం తీసుకున్నామన్నారు.

రాజా.. రాజీనామా

2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేత, కేంద్ర టెలికాం మంత్రి ఏ రాజా మెట్టు దిగినట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి నేరుగా ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి ఆదివారం వెళ్లిన రాజా.. ప్రధానికి తన రాజీనామా సమర్పించారని తెలుస్తోంది.

ఈ కుంభకోణంపై కాగ్ నివేదిక నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లో పదవీ నుంచి దిగిపోనని చెప్పిన ఆయన... గత కొంతకాలంగా తనను కలవరపెడుతున్న వివాదాలను నివారించేందుకు ...పార్లమెంటులో శాంతి, సామరస్యాలను నెలకొల్పడానికి రాజీనామా చేయమని డీఎంకే అధినేత కరుణానిధీ తనకు చెప్పినట్లు రాజా తెలిపారు

కుంభకోణంపై రాజాపై వేటు వేయాలని భగ్గుమన్న విపక్షాలు.. శీతకాల సమావేశాలలో రభసా సృష్టిస్తున్నాయి.

బాబూ...ఓ ఐదేళ్ల పాటు రాజకీయ సన్యాసం పుచ్చుకో

చంద్రబాబు ఈయన ఐదేళ్ల పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గుంతకల్లు ఎంఎల్‌ఏ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న అతను ఏ ప్రాంతంలో కాలు పెడితే, ఆ ప్రాంతంలో కరువు సంభవించడం ఖాయం... పంటలు బాగా పండుతున్నాయని అనంత రైతు భావిస్తున్న తరుణంలో పంటల పరిశీలనకని చంద్రబాబు జిల్లాలో అడుగు పెట్టడంతోనే పంటలు కాస్త దిగుబడి లేక తిరిగి కరువు సంభవించిందని ఎద్దేవా చేశారు.

టిడిపి అధ్యక్ష పదవిని ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యులకు అప్పగించి, ఐదేళ్లు రాజకీయ సన్యా సం పుచ్చుకుంటే కాంగ్రెస్‌ సర్కారు ఈ రాష్ట్రాన్ని సంతోషాంద్రప్రదే శ్‌గా మారుస్తుందని ఎంఎల్‌ఏ కొట్రికె చెప్పారు.

బంగారం ధర పైపైకి ... దెబ్బతింటున్న జీవితాలు

బంగారమే... సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి వెళ్ళిపోయింది...ఈ వారంలో గతంలో ఎన్నడూ లేనంతగా కాసు బంగారం ధర 15300 రూపాయలకు పెరిగి ఆల్‌టైమ్‌ హైలో నిలిచింది. గత ఏడాది ఇదే రోజుల్లో 11 వేల రూపాయలు ఉన్న కాసు బంగారం సంవత్సరం తిరిగే సరికి నాలుగువేల రూపాయలు పెరిగి 15100 రూపాయల వద్దki చేరటంతో జనం బంగారం షాప్స్ వైపు చూడడం లేదు.

పెళ్ళిళ్ళ సీజన్‌, కార్తీక మాసం మొదలైనా... ప్రకృతి వైపరీత్యాలతోపాటు, ధరలు కూడా అమాంతం పెరగడంతో కొనుగోళ్ళు తగ్గిపోయాయని...దీని ప్రభావం వల్ల బంగారం పనులపైనే నడిచే వర్క్‌షాపులపైన, ఇతర సిబ్బందిపైన తీవ్రంగా ఉంటుందని.. కనీస రోజువారి కూలి డబ్బు కూడా రాని పరిస్తితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.

నిషేదిత ప్రాంతంలో ఎలాధర్నా చేసారు... రోసయ్యకి ప్రతిభ సూటి ప్రశ్న

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం ఎంతవరకు సమంజమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు కావలి ప్రతిబాభారతి విమర్శిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిషేదిత ప్రాంతంలో ధర్నా నిర్వహించడం ... ముఖ్య మంత్రి కె.రోశయ్య ధర్నా లో పాల్గొనడం విడ్డూరంగా అనిపించలేదా.. అని నిలదీసారు..

సోనియాగాంధీ ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి రోశయ్య ధర్నాలో పాల్గొన్నారని పోలీసులు ఆ యనను అరెస్టు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.

అదుర్స్ నిర్మాత ..తనపై తానే హత్యాయత్నం చేయించుకునే అవకాశం ఉంది

తెలుగుదేశం పార్టీ నేత, అదుర్స్ చిత్ర నిర్మాత వల్లభనేని వంశీ మోహన్ గన్‌మన్ ఉపంసహరణ సమీక్ష కమిటీ (ఎస్.ఆర్.సి) నిబంధనల ప్రకారమే తొలగించినట్లు పోలీస్ కమిషనర్ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు చేశారు.

తన ను హత్య చేసేందుకు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, అనంతపురానికి చెందిన మద్దెల చెరువు సూరి ప్రయత్నిస్తున్నారని ..వీరికి సీపీ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు వంశీ ఆరోపణలు కలకలం సృష్టించాయి.

అయితే ఆ ఆరోపణలు సీపీ ఖండించారు. ఆయ న ప్రాణానికి నగర కమిషరేట్ పరిధి లో ఎలాంటి హానిలేదని .. నగరంలో నెహ్రూ, బాజీ నుంచి ఎలాంటి ఆపదారాదని తెలిపారు. గన్ మన్ కోసం వంశీ స్వయంగా తనపై తానే హత్యాయత్నం చేయించుకునే అవకాశం ఉందని వంశీపైనే సీపీ ప్రత్యారోపణ చేయడం తో గన్‌మన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

కాం గ్రెస్ అధికారంలో ఉన్న రాష్టాలలో వేలకోట్ల అవినీతి

అరున్నర సంవత్సరాల యూపీఏ పాలనలో కాం గ్రెస్ అధికారంలో ఉన్న రాష్టాలలో వేలకోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి.

జలయజ్ఞంలో ఇప్ప టి వరకు రూ. 60వేలకోట్లు ఖర్చుచేయగా దీంతో రూ. 20వేల కోట్లు కమీషన్ల పేరిట కాంగ్రెస్ నేతలు దండుకున్నారని... అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట లక్షకోట్లు దోచుకున్నవైఎస్.రాజశేఖర్‌రెడ్డి ర్రాష్టాన్ని సర్వనాశనం విధాల చేసాడని ఆరోపించారు.

కేసీఆర్ విధానాల మూలంగానే బలిదానాలు జరిగాయని వీటికి ఆయన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఓ మాయల ఫకిరు

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ పార్టీకి బ్రోకర్‌లా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అరవిందకుమార్‌గౌడ్ ధ్వజమెత్తారు.


కేసీఆర్ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడని .... కేసీఆర్‌ను పావుగా వాడుకొని టీడీపీని భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ ఓ మాయల ఫకీరని అతన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు

వనభోజనాలకు కొత్త భాష్యం

శివ, కేశవులకు ప్రీతిపాత్రమైనది కార్తీకమాసం. ఈ మాసంలో ఉసిరి చెట్ల కింద పనస ఆకుల విస్తళ్ళలో వనభోజనం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని సంప్రదాయం. ప్రకృతిపరంగాను వనభోజనాలకు ఒక ప్రత్యేకత ఉంది. పచ్చటి చెట్లు, హరితవనాలు కింద వన భోజనాలు చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చని ప్రతీతి.

నగరాలు, పట్టణాలలో అపార్టుమెంట్ అంతరాలను చెరిపేసి వారాంతపు వినోదానికి వనభోజనాలు మంచి వేదికలవుతున్నాయి. తరతమ బేధం లేకుండా భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అభిరుచులు కలిగిన వారందరినీ ఒక్కచోటికి చేర్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆత్మీయతను పెంచుతున్నాయి.

గతంలో 'పులిహోర, పూర్ణాలు మేము తెస్తాం.. పచ్చళ్ళు, కూరలు పొరిగింటివారు తీసుకురావాలి..' అని వంతులు వేసుకొనేవారు. ఇప్పుడంతా కాలం మారిపోయింది. చేతి చమురు వదిలినా క్యాటరింగే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఫలానా 'మెనూ' కావాలంటూ ఎంచక్కా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు. ఆడి, పాడి ఆనక కడుపునిండా ఆరగించి ఆధునిక వనభోజనాలకు కొత్త భాష్యాన్ని చెబుతున్నారు.

సినీ పరిశ్రమ రారాజు డీవీఎస్ రాజు

గులేబకావళి క«థ, గండికోట రహస్యం వంటి మహోజ్వల జానపద చిత్రాలు ఎన్నింటినో నిర్మించిన డీవీఎస్ రాజు మృతి పశ్చిమ గోదావరి వాసులను కలచివేసింది. . వివాద రహితుడిగా నిరాండంబరుడిగా రారాజుగా వెలుగొందిన డీవీఎస్.రాజు పూర్తి పేరు దాట్ల వెం కట సూర్యనారాయణరాజు.

1928లో పోడూరు మండలం కవిటం లో జన్మించారు.. ఆయన తండ్రి దాట్ల బలరామరాజు, రాజకీయ దురంధరుడిగా పేరుపొందారు. 1962 నుంచి రెండు సార్లు నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి వారసత్వంతో చిన్నప్పుడే ప్రతిభను పుణికిపుచ్చుకున్నారు. కాకినాడ పీఆర్ కళాశాలలో చదువు పూర్తయ్యాక వ్యా పారం నిమిత్తం మద్రాసు వెళ్లి అనూహ్యంగా సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు.

1950లో సినోలితో వర్క్స్ పేరుతో వా ల్‌పోస్టర్ ముద్రణ సంస్థను ప్రారంభించిన ఆయన పిచ్చి పుల్లయ్య సినిమా పోస్టర్ ముద్రణ సమయంలోనే ఎన్టీ రామరావుతో పరిచయం కలిగింది. ఆ పరిచయంతో ఎన్‌టిఆర్ సోదరుడు త్రివిక్రమరావు ప్రారంభించిన ఎన్ఏటి సం స్థలో భాగస్వామి అయ్యి తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం, గులేబకావళి వంటి చిత్రాలను నిర్మించారు.

1964లో తన సొంత సంస్థ డీవీఎస్ఎన్ ప్రొడక్షన్ ప్రారంభించి మంగమ్మ శపధంతో జైత్రయాత్రను ప్రారంభించారు. గండికోట ర హస్యం, గులేబకావళిక«థ, తిక్క శంకరయ్య, మాబాబు, ధనమా దైవమా, పిడుగు రాముడు వంటి 25 చిత్రాలను నిర్మించారు. 1975లో జీవన జ్యోతి సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డుlanu అందుకున్న ఆయన సినీ దక్షిణ భార త చలనచిత్ర మండలికి గౌరవ కార్యదర్శిగా పదేళ్లు పనిచేశారు.

1977లో దక్షిణ భారత చలనచిత్ర మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆయన కృషితోనే చలనచిత్ర మండలి ఏర్పడింది. ఈ మండలి ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్, చిరంజీవీ వంటి ఎందరో శిక్షణ పొందిన వారే.

1978లో ఫిల్మోత్సవం నిర్వహించిన రాజు గారు 1984-89 మధ్య ఏబీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండోసారి 1990లో ఎన్నికయారు. ఫిలిం డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ తొలి అధ్యక్షుడి గా పనిచేశారు.
1989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1995లో తమిళ పరిశ్రమ గ్రిష్మా పురస్కారం పొందారు. ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది. పలు హోదాల్లో చలనచిత్ర రంగానికి, కళాకారులకు, సామాజిక సేవ కార్యక్రమాలకు సహకరించారు.

తండ్రి బలరామరాజు పార్లమెంటు సభ్యుడిగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్దికి కారకుడు అయితే సినీ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా డీవీఎస్ రాజు వెలుగొందడం గర్వకారణం.

త్వరలో కాంగ్రెస్‌లోకి నాగం

తమని పదే.. పదే.. విమర్శిస్తున్న తెలుగుదేశం నేత నాగం జనార్దనరెడ్డి చరిత్ర తెలంగాణా ప్రజలు అందరికి తెలుసని.. త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు..

టీఆర్ఎస్ కాంగ్రెస్ లో జసిపోతుందని నాగం చేసిన విమర్శలపై మంది పడుతూ సబ్ పార్టీ పార్టీతో కలవదని స్పష్టం చేశారు. తెలంగాణాని సాధించే దిశలో టీడీపీతో ఉంటే ఒప్పు, కాంగ్రెస్‌తో ఉంటే తప్పా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టిన తెలంగాణ టీడీపీ నేతలు దద్దమ్మలని మండిపడ్డారు.

'దేశంలో' అడుగిడుతున్న ప్రజా కళాకారిణి ఉష?

ఇప్పటి వరకూ ప్రజా ఉద్యమాల్లో తన తండ్రితో కలిసి పాల్గొంటున్న..ఉత్తరాంధ్రకు చెందిన విప్లవ గాయకుడు వంగపండు ప్రసాదరావు కుమార్తె, ప్రజా కళాకారిణి వంగపండు ఉష టీడీపీలో చేరనున్నారు. ఈమేరకు ఆమె భవన్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకుల చొరవతో ఆమె టీడీపీలో చేరాలని నిర్ణయించుకొన్నారni సమాచారం . కొద్ది రోజుల్లో ఆమె పార్టీలో చేరనున్నారని విజయనగరం జిల్లాకు చెందిన దేశం నేతలు చెబుతున్న వివరాలు బట్టి తెలుస్తోంది..