28, అక్టోబర్ 2010, గురువారం

హామీ ని మరచిన చిరు... అంధుడైన అభిమాని

'సాక్షి'కి 600 కోట్లు ఎక్కడివో నేను చెప్తా

తెలంగాణవాదుల ఒత్తిడికి దిగివచ్చిన ప్రభుత్వం

తెలంగాణవాదుల ఒత్తిడికి దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై తెలంగాణ పోరాట వీరుడు కొమురం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది భీమ్ విగ్రహాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో సాంస్కృతిక శాఖ పని ప్రారంభించింది. మొత్తం 30 లక్షల రూపాయల వ్యయంతో కొమురంభీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహస్థాపనకు స్థలం కేటాయించాల్సిందిగా రాష్ట్ర పర్యాటకశాఖ హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్‌కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది

కామన్వెల్త్ కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు

కామన్వెల్త్‌ పనుల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు పలువురు సీడబ్ల్యూజీ కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. 150 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో పలుచోట్ల దాడులు జరిపారు. నిర్మాణపనులకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను వారు నిశితంగా పరిశీలించి అవి పారదర్శకంగా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.



ప్రజాశక్తి సౌజన్యం తో

ఎట్టకేలకు పెద్దపల్లి రైల్వేలైన్‌ పనులకు మోక్షం

ఎట్టకేలకు నిజామాబాద్‌ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న పెద్దపల్లి రైల్వేలైన్‌ పనులకు మోక్షం లభించింది. జగిత్యాల వరకు ఈ పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో రైల్వేలైన్‌కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించకపోవటంతో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు జగిత్యాలనుంచి మోర్తాడ్‌ వరకు రైల్వేలైన్‌ పనులకోసం 140 కోట్లు మంజూరుకావటంతో అధికారుల్లో కదలిక వచ్చింది.

ప్రారంభమైన ఫాంట్ పరిమాణంపనులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలించారు. 2011 మార్చి కల్లా జగిత్యాలనుంచి మోర్తాడ్‌వరకు రైల్వేలైన్‌ పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పరిపాలనాధికారి సుకుష్‌కుమార్‌ శర్మ తెలిపారు.

ప్రజాశక్తి సౌజన్యం తో

ఏనుగుల మరణాలు.. వేధిస్తున్న అధికారులు... అయోమయంలో గిరిజనులు

ఏనుగుల బారినుంచి కాపాడండి..వాటివల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వండని.. మొరపెట్టుకున్నా కనికరించని అటవీశాఖ అధికార్లు గిరిజనులపై తమ ప్రతాపం చూపించేపనిలో పడ్డారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మృతిచెందిన ఏనుగులను పాతిపెట్టారని .. అటవీశాఖ చట్టం కింద 9,12బి,36,51 సెక్షన్లు కింద కేసులు నమోదు చేసి ఎనిమిదిమంది గిరిజనులని అరెస్టు చేశారు. మరో 20 మంది అటవీశాఖ అధికార్ల అదుపులో ఉన్నట్టు తెలిసింది...

వివరాలలోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం కుంబడి ఇచ్చాపురం అటవీ ప్రాంతంలో గతంలో ఏనుగుల బారి నుండి రక్షించేందుకు ఆపరేషన్ గజ చేపట్టిన అధికారులు... ఆపై ఏనుగుల్ని లఖేరి అడవులకు తరలిస్తున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక రెండు మరణించాయి. అందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కారణాలపై ఎలాంటి విచారణ జరపలేదు. తరలించడం చేతకాకనే మిగిలిన ఆరు ఏనుగులను సీతంపేట ఏజెన్సీలో వదిలేశారు.

ఆరు ఏనుగుల మరణాలపై ఒడిషా ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. అది ఇంకా విచారణలోనే ఉంది. నాటి మరణాలకు అధికార్లే కారణం. అందుకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడలేదు.

గతంలో అధికార్లు వదిలేసినా ఏనుగులు ఇక్కడి గిరిజనాలను అష్టకష్టాలు పెట్టి... ఐతే ఉహిచని విధంగా రెండు ఏనుగులు మృత్యు పాలయ్యితే వాటి దుర్వాసన భరించలేక గిరిజనం పూడ్చిపెట్టారు. ఐతే పూడ్చిన 15 రోజుల తరువాత మీడియా వెలుగులోకి తెచ్చినంతవరకూ అధికార్లకు తెలియలేదు. ఉన్నతాధికార్ల చివాట్లతో .అటవీశాఖ సిబ్బంది ఇచ్చాపురం గ్రామాన్ని చుట్టుముట్టి గిరిజనులను బెదిరించడం, భయపెట్టడం వేధిస్తున్నరని సమాచారం. కాగా దంతాలు కోసం అటవీ స్మగ్లర్లె ఏనుగుల్ని చంపేసి పడేస్తే... వారని పట్టుకోలేని అధికార్లు... తమని ఇబ్బంది పాలు చేస్తున్నారని గిరిజనం ఆరోపిస్తున్నారు. అరెస్టులకు సంబంధించి అదుపులోకి తీసుకున్నవారికి సంబంధించి మీడియా దృష్టికి తీసుకెళ్లరాదని అదుపులోకి తీసుకున్నవారి కుటుంబసభ్యులను, గ్రామస్తులను హెచ్చరించారని తెలిసింది.

అటవీచట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం అధికార్లకు ఒకటి, గిరిజనులకు ఒకటి ఉండదు. ఆ ప్రాథమిక అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా అధికార్ల చర్యలు తీసుకుంటే అది పూర్తిగా గిరిజనుల వ్యతిరేక చర్య అవుతుంది.

బాబుతో 'కుప్పం'లోనే చర్చకు 'వట్టి' రెడీ

తెలుగు లలిత కళా తోరణంకి రాజీవ్ పేరు పెట్టడం తప్పేనన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు


తెలుగు లలిత కళా తోరణంని రాజీవ్ గాంధీ పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతుండటం విశేషం. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ని దర్శించు కున్న కుత్బుల్లాఫూర్, మల్కాజిగిరి, శాసన సభ్యులు శ్రీశైలంగౌడ్, ఆకుల రాజేందర్‌లు విలేకరులతో మాట్లాడుతూ ... పలు ప్రాంతాల నుండి వస్తున్నా నిరసనలు... తెలుగు భాషకి సంభందం లేని రాజీవ్ గాంధీ పేరు పెడితేనే డబ్బులిస్తా అని ఓ ఎంపి చెప్పినంత మాత్రాన జిఒ విడుదల చేయటం.. సరికాదని అన్నారు. అధిక శాతం తెలుగు ప్రజలు తెలుగు లలిత కళా తోరణం పేరు మార్పు కోరుకోవటం లేదని... స్పష్టమవుతుందని, ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు . .

హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశంపై పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందవలసి ఉందని, ఆమోదం పొందిన తర్వాతనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుం దన్నారు. పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు తమ స్వేచ్ఛ కొలది మాట్లాడుతున్నారు. ఏ అంశంపైనైనా అధిష్ఠానందే తుది నిర్ణయమని వారు స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకే డిసెంబర్ 31న ప్రత్యేక తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికను తాము స్వాగతిస్తామన్నారు.. రాష్ట్ర విభజనపై తమ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామన్నారు.

మిగిలిన సలహాదారులు ఏం చేస్తారు?


ప్రభుత్వానికి సలహాదారులుగా 6 గురువ్యవహరిస్తున్నా... ఒకరిద్దరు తప్ప మిగిలినవారు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు కూడా ఏమీ లేవని, వారివల్ల ప్రయోజనం ఏమీ లేదన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.

ఈ నేపద్యంలో సీఎం కార్యాలయంలో పని చేస్తున్నా.... తనంతట తానుగా చొరవ తీసుకొని పని చేయాల్సి వస్తోందని . తనకు ఏ శాఖా కనీస గౌరవం కూడా ఇవ్వలేదని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, సీఎంవోలోని ఇతర అధికారులు కూడా తన ప్రమేయాన్ని అంగీకరించడం లేదన్న అసంతృప్తి తో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య వ్యక్తిగత సలహాదారు మాజీ ఐఏఎస్ అధికారి పీకే అగర్వాల్ ఆ పదవి నుంచి తప్పుకొన్నారు

భద్రతా వ్యవహారాల సలహాదారుగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఆర్థిక సలహాదారుగా సోమయాజులు, ఐటీ సలహాదారుగా సీఎస్ రావు, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబడులకు కేంద్రంలో సలహాదారుగా పీటర్ హసన్, విదేశీ పెట్టుబడులకు సంబంధించిపోస్ట్‌ను ప్రచురించున సలహాదారుగా సీసీ రెడ్డి వ్యవహరిస్తున్నా . ముఖ్యమంత్రికి పనికొచ్చే సలహాలు, సూచనలను ఆయన ఏమీ ఇవ్వలేక పోయరన్నది వాస్తవం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అగర్వాల్ పని చేసినప్పుడే ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన జరిగింది. కొంతకాలం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎండీగా వ్యవహరించారు..తాజాగా అగర్వాల్ సలహాదారు పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో మిగిలినవారు ఏం చేస్తారు!? వారి విషయంలో ప్రభు త్వ వైఖరి ఎలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.