27, అక్టోబర్ 2010, బుధవారం

రాజమౌళి, ఎన్టీఆర్ లతో దుర్గ ఆర్ట్స్ చిత్రం

మంత్రి కోమటిరెడ్డికి పిచ్చెక్కింది : ఓయూ జేఏసీ

గతంలో టీడీపీ నేత నాగం జనార్ధన్ రెడ్డికి ఓయూలో పట్టిన గతే ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పడుతుందని ఓయూ జేఏసీ నేత రాజారామ్ హెచ్చరించారు.

గత 54 ఏళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్న నెపంతో
కోమటిరెడ్డి తన అధికార దర్పాన్ని నిలబెట్టుకునేందుకు చూస్తున్నారని ... ఐతే వెంకటరెడ్డి ఇలా మాటలాడటం వెనుక తన సోదరుడితో ఆస్తి తగాదాలు కూడా కారణం . ఇప్పటికే జనం సమస్యల్లు పడదని మ౦త్రిగా పేరున్న కోమటిరెడ్డి కి పిచ్చెక్కిందని, ఆయన సన్నిహితులే.. చెపుతున్తారని ఆయన్ని వెంటనే ఎర్రగెడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలని అన్నారాయన.

తెలంగాణాలోనూ మంత్రి కావాలంటే దానిని బహిష్కరించాల్సి౦దే..


కోమటి రెడ్డి వెంకట రెడ్డి తెలంగాణా లోను మంత్రి కావాలని అనుకొంతే ..రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ నెత కర్నె ప్రభాకర్. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అడ్డుకోవడం సరికాదని మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. అసలైన తెలంగాణ వాది అయితే నవంబర్ ఒకటిన జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని...కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులుగాని, కార్యకర్తలు గానీ కవ్వింపు చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన రీతిలో బుద్ధి చెప్పెందుకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు ప్రభాకర్

విమోచనా దినం చేయని వారు మమ్మల్ని విమర్శిస్తారా?


నవంబర్ 1 ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రులుగా మా బాధ్యత మేము నిర్వర్తించాలని అన్నారు.

ఎవరైన కవ్వింపు చర్యలకు పాల్పడితే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, తెలంగాణ విమోచనా దినాన్ని నిర్వహించనివారికి మమ్మల్ని విమర్శించే హక్కులేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.



ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

2013లో చంద్రయాన్-2


మనిషిని అంతరిక్షంలోకి పంపే పరిజ్ఞానాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. బుధవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న అయన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ రష్యా భాగస్వామ్యంతో 2013లో చంద్రయాన్-2ను ప్రయోగించనున్నట్లు చెప్పారు.










ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

మీ మరుగుదొడ్లకు ఆ పేర్లు పెట్టుకోండి


తెలుగు లలితకళాతోరణం పేరు మారిస్తే బోర్డు పీకేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్‌ నేత సుబ్బిరామిరెడ్డికి అంతగా దానం చేయాలని ఉంటే మురికివాయిడల్లో మరుగుదొడ్లు నిర్మించి రాజీవ్‌, ఇందిరల పేర్లు పెట్టుకోవాలని సూచించారు. పేరు మార్చాలనుకుంటే సాహిత్య సేవ చేసిన సుద్దాల హనుమంతు, సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు

సూర్య సౌజన్యంతో

రైల్వే వెబ్ అడ్రస్ మారింది

దక్షిణమధ్య రైల్వే వెబ్‌సైట్‌ లాగిన్‌ అడ్రస్‌ను మార్చింది. దేశంలోని వివిధ రైల్వే జోన్ల వెబ్‌సైట్లను ఏకీకృత పద్దతిలో నిర్వహించే విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 1 నుంచి వెబ్‌సైట్‌ అడ్రస్‌ ww.scr.indianrailways.gov.in గా మారుతుందని, ప్రయాణికులు ఇతర రైల్వే సేవలు కోరుకునేవారు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు






సూర్య సౌజన్యంతో

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బన్వర్‌లాల్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బన్వర్‌లాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఐవీ సుబ్బారావు కేంద్ర సర్వీసులకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

పరువు నష్టం కేసులో పవన్ కళ్యాణ్ కి నోటీసులు

పీక్కు తింటున్న'మైక్రో'లు

జనంను జలగల పీక్కు తింటున్న మైక్రో ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఏకంగా మైక్రో సంస్థలకు ముకుతాడు వేసెందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ రుణ గ్రహితలకు ఏమాత్రం మేలు చేయడం లేదు. గత నాలుగైదు రోజులుగా మైక్రో ఫైనాన్స్‌ కంపనీల ప్రతినిధులు గ్రామాలలో మహిళలకు ఇచ్చిన రుణాలను బలవంతంగా వసూలు చేస్తున్నారు. సర్కార్‌ చేసిన భిన్న ప్రకటనలతో రుణాలు చెల్లించాల వద్దా అన్న మీమాంసలో ఉన్న డ్వాక్రా మహిళలకు అధికార యంత్రాంగం కూడా సలహలు ఇవ్వక పోవడంతో అప్పులు తెచ్చి మైక్రో రుణాలు చెల్లిస్తున్నారు. బలవంతంగా డబ్బులు వసూలు చేయరాదని, చేసిన లక్ష రూపాయల జరిమాన,మూడేళ్ళ జైలు శిక్ష అంటు చేసిన ప్రకటనలు ఏమాత్రం చెల్లడం లేదు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చాయని... డబ్బులు చెల్లించక పోతే చక్రవడ్డితో భారంగా మారుతుందని మైక్రో ఫైనాన్స్‌ ప్రతినిధులు రుణాలు వసూలు చేసుకుంటు జనాన్ని పీడుస్తున్నారు.
రుణాలు పొందిన మహిళలు భయానికో కొందరు చెల్లించడంతో సంఘంలోని మిగిత సభ్యులు కూడా మళ్ళి బయట అప్పులు తెచ్చికట్టారు. ప్రభుత్వం మహిళలు ఆందోళన చెంది రుణాలు చెల్లిస్తున్నా.... అధికార యంత్రాగం నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహరిస్తున్నారు.

గ్రామ సంఘాలకు రూ.5లక్షల చొప్పున రుణాలు అందిస్తామన్న ప్రభుత్వం.. ఆచరణలో కనిపించకపోవడంతో మహిళలు మళ్ళి మైక్రో ఫైనాన్స్‌లనే ఆశ్రయించవలసి వస్తుందని విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి

:రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ మరణాలకు కాంగ్రెస్‌ పార్టీనే బాధ్యత వహించాలని, ఆ పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ క్షేత్రస్థాయి ప్రచారానికి, పోరాటానికి సిద్ధమవుతోంది..ఒక కాంగ్రెస్‌ ప్రముఖుడి సతీమణికి చెందిన మైక్రో సంస్థలు ప్రజలను పీడించి వేల కోట్ల రూపాయలు గడిస్తున్నాయని..పేద ప్రజలను పీడించే సంస్థలకు కాంగ్రెస్‌ ఏ స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచిందో చెప్పడమే టీడీపీ లక్ష్య0. ఇప్పటివరకూ గుర్తించిన మైక్రో ఫైనాన్స్‌ బాధిత కుటుంబాలను పరామర్శించడమే కాకుండా, రూ. 50 వేలు ఆర్థిక సాయం అందిoచాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

పార్టీల అసలు రంగు తేలేది డిసెంబర్ 31 తరువాతే


డిసెంబర్ 31 తరువాత చేపట్టే వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రజలు సిద్ధమవ్వాలని, డిసెంబర్ 9న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో దీనిపై కార్యాచరణ రూపొందిస్తారని టిఆర్‌ఎస్ మాజీ ఎంపి వినోద్‌కుమార్ అన్నారు.

టిఆర్‌ఎస్ పల్లెబాట కార్యక్రమంలో. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల నుండి విన్పిస్తోందని, వారి ఆశయాల కనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయకుండా ప్రజలు అడ్డుపడి ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నారని, రాష్ట్రం ప్రకటించకుండా తాత్సారం చేయవద్దని, ప్యాకేజీలు ఇవ్వవద్దని తెలంగాణ ప్రకటించకుంటే ఊహించని సంఘటనలు జరుగుతాయన్నారు.

శ్రీకృష్ణ కమిటి నివేదిక ఇచ్చినాక, డిసెంబర్ 31 తరువాత రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల రంగు బయటపడనుందని తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అంటున్న కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ బండారం, తెలంగాణ కోసం పోరాటం మాదే అసలైనదంటున్న టిడిపి, మేమే సాధిస్తామంటున్న బిజెపి తదితర రాజకీయ పార్టీల నిజస్వరూపం శ్రీకృష్ణ కమిటి నివేదిక తరువాత బట్టబయలవుతుందన్నారు.

నవంబర్ 18 నుండి సత్యసాయి జన్మదినోత్సవ వేడుకలు


సత్యసాయి 85వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు సత్యసాయి హిల్‌వ్యూస్టేడియంలో జరిగే జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు రాష్టప్రతి, ప్రధానమంత్రి లాంటి అతిరథ మహారథులతో పాటు అంతర్జాతీయంగా ప్రతినిధులు హాజరవుతున్నారు. సర్వమత సమ్మేళనాన్ని చాటే విధంగా అంతర్జాతీయంగా దాదాపు 200దేశాలకు చెందిన జాతీయపతాకాలు ఎగురవేయడంతో పాటు సుందరంగా స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు .. .వేడుకలను తిలకించడానికి విచ్చేసే దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు, లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తని రీతిలో తాత్కాలిక వసతిసౌకర్యాలతో పాటు బసచేసే వారికి అన్ని రకాల వౌలిక వసతులను కల్పిస్తున్నారు

నవంబర్ నెల 18 నుండి జన్మదిన వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యే వేడుకల్లో భాగంగా 19న జరిగే మహిళాదినోత్సవానికి రాష్టప్రతి ప్రతిభాపాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేస్తారు. 22న జరిగే సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహాయంతో అంతర్జాతీయంగా సత్యసాయి జన్మదిన వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రసార సౌకర్యాన్ని కూడ కల్పిస్తున్నారు. నవంబర్ 17 నుండి 24 దాకా జన్మదిన వేడుకల్లో పాల్గొనే భక్తులకు 40 కౌంటర్ల ద్వారా ఉచిత అన్నదానాన్ని ఎ ర్పాటు చేయటం తో పాటుగా లేజర్‌షోలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తోంది సత్య సాయి ట్రస్ట్ .

మంత్రులంతా విద్రోహదినాన్ని పాటి౦చాల్సిందే : విమలక్క


నవంబర్ 1న తెలంగాణ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని, తెలంగాణ ప్రజాప్రతినిధులు, మంత్రులంతా విద్రోహదినాన్ని పాటించాలని సమష్టి కార్య నిర్వాహక కమిటీ రాష్ట్ర నాయకులు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ విమలక్క. కోరారు.

నల్లగొండలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎన్నికలు కూడా పోరాట రూపమేనని, ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధనకు పోరాటం కొనసాగిస్తునే ఎన్నికల ప్రక్రియను కూడా లక్ష్యసాధనకు ఉపయోగించుకోవాలన్న సిద్ధాంతంతోముందుకు సాగుతోందని
తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మాత్రమే గద్దర్ ఫ్రంట్‌తో విభేదించామని, ఫ్రంట్ ఎజెండా తమ ఎజెండా ఒక్కటేనని అన్నారు. భవిష్యత్తులో ఈ భేదాభిప్రాయలు తొలగిపోయి తెలంగాణ ఉద్యమ శక్తులన్ని ఏకత్రాటిపై సాగుతాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. విద్యార్థులను జెండాలు, పార్టీల వారిగా చీల్చి పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని ... తెలంగాణ సాధన కోసం ప్రజలు సాగిస్తున్న లొల్లికి మద్దతు ఇవ్వకుండా పార్టీలు ఢిల్లీలో లొల్లి చేస్తు గందరగోళం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థుల త్యాగపూరిత పోరాటాలతో సాధించిన డిసెంబర్ 9న ప్రకటనను పార్టీలు శాంతి ఒప్పందం ద్వారా నీరుగార్చాయని విమర్శించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ సమస్యకు పరిష్కారం కాకుండా ప్రత్యామ్నాయాలు మాత్రమే చూపుతుందని, ఈ పరిస్థితుల్లో డిసెంబర్ 31పిదప తెలంగాణ ఉద్యమం బలపడకుండా రాజకీయ పార్టీలుఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటిదాక సాగిన తెలంగాణ ఉద్యమాలు ఏక వ్యక్తి నాయకత్వం క్రింద సాగినందునే సత్ఫలితాలు ఇవ్వలేదని, అందుకే తాము సమష్టి కార్యనిర్వాహక కమిటీ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రికి కోటీ ఉత్తరాల కార్యక్రమంలో అంతా పాల్గొని తెలంగాణ సాధన ఆకాంక్షను కేంద్రానికి బలంగా తెలుపాలని వారు పిలుపునిచ్చారు

డిసెంబర్ 15 నుంచి జగన్ విశాఖ ఓదార్పు



విశాఖ జిల్లాలో వై.ఎస్.జగన్ ఓదార్పు యాత్ర డిసెంబర్ 15వ తేదీ నుంచి జరగనుంది. ఈ మేరకు కొణతాల వర్గీయులు సమావేశమై జగన్ పర్యటన మార్గాన్ని ఖరారు చేశారు

వై.ఎస్.మరణానంతరం ఆ ఆవేదనను తట్టుకోలేక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చాలా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ అర్బన్ ప్రాంతంలో ఒక్కరు కూడా ఈవిధంగా చనిపోయిన వారు లేరు. రూరల్ ప్రాంతంలో కొంతమంది ప్రాణాలు విడిచారు. వీరిని ఓదార్చేందుకు జగన్ డిసెంబర్ 15 నుంచి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.

కనీసం వారం రోజులపాటు సాగేలా ఏర్పాట్లు చేస్తున్న ఈ ఊదార్పు యాత్రలో జగన్ గాజువాక, పరవాడ, అచ్యుతాపురం, పాయకరావుపేట,నర్సీపట్నం, అనకాపల్లి లలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతారు.

అరకులోయలో ‘పేరెంట్స్’ షూటింగ్


అరకులోయ పరిసరాల్లో పేరేంట్స్ సినిమా షూటింగ్ జరుగుతోంది. వంశీకృష్ణా, రుతికాబొబ్బర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అంజోడా గ్రామ సమీపంలో జరుగుతుంది. మంచి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆనందరవి దర్శకత్వం వహిస్తున్నారు. టేక్-1 ప్రొడక్షన్ బేనర్‌పై ఈ సినిమాను ఫ్రెండ్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్.కె.బాలచంద్ర సమకూరుస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో రెండు రోజులపాటు పేరెంట్స్ సినిమా పాట, ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించి వైజాగ్‌లో మరో రెండురోజులు షూటింగ్ జరుపుతారు. పేరెంట్స్ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు ఆనందరవి తెలిపారు

వెబ్ మీడియాలో వార్తలు రాయాలనుకునే మిత్రులారా జాగ్రత్త..మన కష్టం దోచుకునే రాబందులు ఉన్నాయ్ ఇక్కడ...