5, నవంబర్ 2010, శుక్రవారం
మా ఎమెల్యేని వెతికి పెట్టండి
ప్రజలు, రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూంటే ఎమ్మెల్యే నియోజక వర్గాన్ని, ప్రజలను గాలికి వదిలేసి ఏవో కుంటిసాకులు చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నాడని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. ప్రజలు ఎంతగానో ఆశపడి రమేష్‌బాబును గెలిపిస్తే, గెలిచిన మూడు, నాలుగు ఒద్దులు మినహా ఎప్పుడు కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటంలేదని విమర్శించారు.
కేసీఆర్ ... నరకాసురుడు...
అలజడులు సృష్టి స్తూ రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించేలా కేసీఆర్ నరకాసురుడులా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతికి భగ్నం కలిగిస్తే నరకాసురుడి గతే కే సీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు సాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.రాజారెడ్డి .
నరక చతుర్ధశిని పురస్కరించుకుని సాప్స్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు..రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ జ్యోతికి 271వ రోజులు
ఉద్యమంలో భాగంగా గ్రామ జేఏసీ నాయకులు ఫిబ్రవరి 8న ఈ అఖండ జ్యోతిని వెలిగించారు. తెలంగాణ ఏర్పాటు జరిగేంత వరకు జ్యోతిని వెలుగుతూనే ఉంటుందని గ్రామ జేఏసీ నాయకులు పేర్కొన్నారు.
కేసీఆర్ ఖబడ్దార్! మేం తలచుకుంటే నువ్వు తిరగలేవ్
ఇటీవల రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, టీఆర్‌ఎస్ నాయకులు కార్యక్రమాన్ని అడుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని ... టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు గడప దాటి బయటకు వెళ్లలేరని, కేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
అయోమాయానికి గురిచేస్తున్న దుగ్గల్
తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు విషయంలో కాలయాపన చేయడానికి వివిధ కమిటీలను వేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిసెంబ ర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
చిత్ర విచిత్రాలకు కాంగ్రెస్సే సాటి
ప్రస్తుతం తాత్కాలికంగా నియామకాలు ఆగిపోవడంతో ముందు ముందు రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే అంశం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణసత్తా చాటుతాం
తెలంగాణ రాష్ట్రం తామే సాధించి తీరుతామని ప్రగల్భాలు పలుకుతోన్న కాంగ్రెస్ నేతలు ఒక విషయాన్ని గ్రహించాలి, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది, కెసిఆర్ దీక్షవల్లనే తప్ప, ఇందులో కాంగ్రెస్ నేతల వల్ల కాదని ఆయన కెటిఆర్ గుర్తు చేశారు. డిసెంబర్ తర్వాత మరోసారి తెలంగాణ సమాజమంతా ఏకమై కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమకారుల్ని అతి క్రూరంగా కాల్చిచంపించిన కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వారి విగ్రహాలు తమకు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రనేతల విగ్రహాలపై చీమ వాలితే కూడా స్పందించే చంద్రబాబుకు, తెలంగాణ రాష్ట్రం కోసం వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
మొతేరాలో ‘వీర’ మోత!
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ (173) చెలరేగి ఆడి కివీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించగా, ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ కూడా తనదైన శైలిలో రాణించి సెంచరీతో అలరించాడు.
'జై బోలో తెలంగాణా' లో ముఖ్యపాత్రకి ప్రముఖ హీరో
పవన్‌కళ్యాణ్ చిత్రానికి హాలీవుడ్ డిజైనర్
మిషన్ ఇంపాజిబుల్-3, లెటర్స్ టు జూలియట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు ఆర్టలానీ పనిచేశారు. వార్నర్‌బ్రదర్స్, పారామౌంట్, ట్వంటీయత్ ఫాక్స్, కొలంబియా వంటి సంస్థలకు తన సేవలందించారు. పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం కాన్సెప్ట్ విని పనిచేయడానికి అంగీకరించారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన లొకేషన్స్, సెట్‌లు, మేకప్‌లు, కాస్ట్యూమ్స్ తదితర డిజైన్లు తయారు చేసుకుని 8న భారతదేశానికి వస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో పవన్‌కళ్యాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: భారవి, కెమెరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శేషు, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.
ఇరాక్ యుద్ధంలో చాలా తప్పులు చేశా....: బుష్
సచిన్ నేటి బ్రాడ్‌మన్
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 22 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటీష్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో దూసుకోపోతున్న మాస్టర్ బ్లాస్టర్‌ను "నవయుగ బ్రాడ్‌మన్"గా అభివర్ణించింది.
టెస్టు క్రికెట్‌లో శతకాల 'అర్ధ సెంచరీ'కి అడుగు దూరంలోనే ఉన్న సచిన్, కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ రికార్డును అధిగమిస్తాడని బ్రిటన్‌కు చెందిన 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది. ది టైమ్స్ పత్రిక రాసిన ఓ కాలమ్‌లో ప్రముఖ క్రీడా విశ్లేషకుడు జాన్ వుడ్‌కాక్ సచిన్‌ను నేటి కాలపు బ్రాడ్‌మన్‌గా కొనియాడాడు. సచిన్ ఆడినన్ని ఇన్నింగ్స్ బ్రాడ్‌మన్ ఆడుంటే మాత్రం శతకాల సంఖ్య 100కు చేరేదని వుడ్‌కాక్ చెప్పాడు. ప్రస్తుతం బ్రాడ్‌మన్ కనుక ఉండివుంటే.. సచిన్ తరహా ఆటతీరుతో యావత్తు క్రికెట్ అభిమానులను అలరించేవాడని వుడ్‌కాక్ చెప్పాడు.
సోనియా 9, మనోహ్మన్ 18
ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత శక్తిమంతుల జాబితా-2010లో భారత్ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌లకు చోటు దక్కింది.
సోనియా 9, మనోహ్మన్ 18వ స్థానాల్లో నిలిచారు. ముఖేష్ 34, లక్ష్మీ మిట్టల్ 44, రతన్ టాటా 61 ర్యాంక్ దక్కించుకున్నారు.
'గాలి' సోదరులకు ఈసీ నోటీసులు
‘బద్రీనాథ్’ తరువాతే బన్ని ‘హ్యాపీ’గా వరుడవుతాడట...
‘బద్రీనాథ్’ సినిమా షూటింగ్ జనవరి చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నట్టు ఆయన
జగన్ అభిమానులను పదవులను నుంచి తప్పించేందుకు టాలెంట్ హంట్
అసలు లీకువీరులు సీఎం పేషీ అధికారులేనని అన్నారు. ఏపీఐఐసీ వ్యహారంలో డీఎల్ రవీంద్రారెడ్డితో సీబీఐ విచారణకు డిమాండ్ చేయించింది రోశయ్యేనని ఆయన ఆరోపించారు. టాలెంట్ హంట్ ద్వారా యూత్ కాంగ్రెస్ నేతల ఎంపికలో అవినీతి, అవకతవకలు జరిగాయన్నారు. వైఎస్సార్, జగన్ అభిమానులను పదవులను నుంచి తప్పించేందుకు టాలెంట్ హంట్ జరిపారని అంబటి ధ్వజమెత్తారు.
సోనియా పుట్టిన రోజు మళ్ళి వస్తోంది ..
. నాగం జనార్ధనరెడ్డి, కడియం శ్రీహరి, హరీశ్వర్ రెడ్డి గురువారం మీడియా తో మాట్లాడుతూ 1956 నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే వస్తోంది. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి కేంద్రం డిసెంబర్ 23వ వెనక్కు తీసుకొంది. తెలంగాణ ప్రజలను మోసం చేసింది..తెలంగాణ ప్రకటనను కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకొన్న డిసెంబర్ 23వ తేదీని విద్రోహ దినంగా పాటిస్తామని ప్రకటించారు.
నాలుగు వందల మంది చనిపోయినా ..నిర్ణయించాంనిన్న ఎఐసిసి సదస్సులో దేశంలోని అన్ని విషయాలు మాట్లాడి తెలంగాణ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు గుర్తు చేయడానికి విద్రోహ దినంగా పాటించాలని నిర్ణ యించినట్లు చెప్పారు
.