10, ఫిబ్రవరి 2011, గురువారం
'బెజవాడ రౌడీలు'లో నాగచైతన్య: అక్కినేని నాగార్జున
అభిమానుల కోసం మంచి స్టోరీ దొరికితే తన కుమారుడు నాగ చైతన్యతో కలిసి నటించి తీరతానని, అటువంటి సినిమా వస్తుందని నాగార్జున తెలిపారు..
సురేఖా! రాజీనామా చెయ్....
పదే పదే అధినేతి సోనియా నిర్ణయాధికారాలను ధిక్కరిస్తూ.. లేఖాస్త్రాలు సంధి స్తున్న ఎమ్మెల్యే కొండా సురేఖ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ డిమాండ్ చేసారు.
గురువారం ఆయన మీడియాలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పారీట నేతలంతా వైఎస్‌ని తామంతా చిన్న బుచ్చుతున్నట్లు చెపుతున్న కొండా సురేఖ ఆయన ఆత్మ విలపించేలా వైస్ ఎక్కువగా అభిమానించే సోనియాపైనే విమర్శలకు దిగుతున్నారనే విషయం గుర్తెగాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ బి-ఫాంతో, హస్తం గుర్తుపై గెలిచిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నా రని.. తమకి వైఎస్పై ఇప్పటికీ అభిమానం చెక్కుచెదరలేదని... అంతమాత్రాన ఆయన కుమా రుడికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేసే హక్కు కొండా సురేఖకులేదని... రాజకీయాల్లో తమ కింతటి ప్రాముఖ్యత కలిపించిన తామెన్నటికీ కాంగ్రెస్‌వాదులుగానే నిలుస్తాం. సురేఖకి ఏ మాత్రం నైతిక విలువలుంటే తక్షణం రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు.
అధినేత్రిపై విమర్శలు గుప్పించే నేతలపైనే కాకుండా జగన్ వెంటవెళ్తున్న ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకునేందుకు ఎట్టి పరిస్ధితిలో కాంగ్రెస్ అధిష్టానం వెనకడుగు వేసే ప్రశ్నే తలెత్తదని తేల్చి చెప్పారు విప్ మురళీమోహన్.
తమ్ముడు పెళ్లికి డేట్ ఖరార్... అన్నయ్య జనాలు బేజార్
మొత్తానికి ఎన్నాళ్లకి గాంధీ కుంటుంబంలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. భాజపా యువనేత వరుణ్‌గాంధీ పెళ్లి పీఠలు ఎక్కేందుకు రెడీ అయిపోతున్నాడు. మార్చి 6వ తేదీని అంగరంగ వైభవంగా వారణాసి విశాలాక్షి సాక్షిగా బెంగాలి యువతి యామిని మెడలో వరమాల వేసేందుకు ముహూర్తం ఖ రారైనట్టు వరుణ్ తల్లి మేనకా గాంధీ మీడియాకు వెల్లడించారు. బెరేలీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వివాహానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు తమ గాంధీ కుటుంబం యావత్తు సోనియాతో సహా పాల్గొంటారని, వీరందరికీ ఆహ్వానాలు సిద్ధం చేస్తునట్టు ఆమె ప్రకటించారు.
అలాగే వరుణ్‌గాంధీని ఎంపీగా ఎన్నుకుంటూ వస్తున్న ఫిలిబిత్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు కూడా విందు ఏర్పాట్లు చేస్తున్నామని, ఢిల్లిలో వివాహ రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు మేనకా మీడియాకు తెలిపారు.
కాగా, వయస్సులో చిన్నవాడైనా కాస్త అటుఇటుగానైనా సమయానికి పెళ్లి చేసుకుంటూ సంసార జీవితంలోనికి వరుణ్ అడుగుబెడుతుంటే ఆయన గారి అన్నయ్య రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి ధ్యాస కలగకపోవడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరుత్సాహం కలుగుతోంది. మరి వీరి కోరిక మన్నించైనా రాహుల్ 2011లోనైనా పెళ్లి కొడుకుగా మారతాడని ఆశిద్దాం.
జగన్ దగ్గరేమైనా ‘జాదూ’ ఉందా?
2009 ఎన్నికల్లో తన ఆస్ధి కేవలం 2 కోట్లుగా చూపిన కడప మాజీ ఎంపి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్ తన ఆదాయాన్ని లక్షల కోట్లుగా చూపిస్తు... ముందస్తు పన్నుగా 85 కోట్లుప్రభుతానికి చెల్లించడం వెనుక జాదూ ఏమైనా ఉందేమో? అనే సందేహాన్ని వ్యక్తం చేసారు రాష్ట్త్ర చేనేత, జౌళి శాఖా మంత్రి శంకరరావు .
గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇన్నివేల కోట్లు హఠా త్తుగా రాత్రికిరాత్రే ఎలా పుట్టుకొచ్చాయన్న అనుమానమే తనని కోర్టుకు లేఖ రాసేందుకు పురికొల్పిందని అన్నారు. జగన్ ఆస్తుల మర్మం అందరికీ తెలిస్తే మంచిదే కదా? అన్నారు.
తెలంగాణా రాష్ట్రం కోసమే శ్రీకృష్ణకమిటీని ఏర్పాటు చేసినట్లు కొందరు వాదించడం సరికాదని... కమిటీ కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుంది. వీటిని పరి గణలోకి తీసుకుని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీయే ఏ నాటికైనా తెలంగాణ ఇచ్చెది తెచ్చేది అని తెలిసినా..అని తెలిసినా..కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగుతుండటం వల్లే ఆలస్యమ వుతోందనిపిస్తోందని అన్నారు శంకరరావు.
జగన్‌ని తొక్కేసందుకే అంతా చూస్తున్నారు.... : రోజా
జనంతో కల్సి నడిచేవాడే జన హితుడు, ప్రజా నాయకుడు అవుతాడని.. అలాంటి లక్షణాలనింటిని వారసత్వంగా పుణికి పుచ్చుకున్న వైఎస్ జగన్ తండ్రి చూపిన మార్గంలోనే పోలవరం లక్ష్య సాధన కోసం హరిత యాత్ర పేరుతో లక్షలాది జనంతో పాదయాత్ర చేస్తుంటే అధికార పక్షానికే కాదు విపక్షాలకీ ముచ్చెమటలు పడుతున్నాయని అన్నారు సినీ నటి రోజా.
గురువారం ఆమె పోలవరంలో జగన్ హరితయాత్ర ముగింపుసభలో మాట్లా డుతూజగన్ చేపట్టిన యాత్రకి రాయలసీమ, తెలంగాణా, కోస్తా, ఆంధ్రా ప్రాంతాల నుండి రైతులే స్వచ్చంధంగా తరలివచ్చి మద్దతు తెలుపుతుంటే అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వమే సొంత నిధులతో పోల వరం నిర్మాణం పూర్తికి నడుం బిగించాలని సూచించారు.
జలయజ్ఞం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి నీటిచుక్కని వినియోగించి సస్య శ్యామలంచేసి హరితాంధ్రప్రదేశ్ చేయాలని తండ్రి కన్నకలల్ని నెరవేరేందుకు కృషి చేస్తు న్న జగన్‌ని ఎలాగైనా అణగద్రొక్కాలని అన్ని పార్టీలు కల్సి ప్రయత్నిస్తున్నాయ ని.. వీరందరికీ తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలు పు ఇచ్చారు రోజా. పోలవరం ప్రోజక్టుకు జాతీయహోదా కోరుతూ జగన్‌కి మద్దతు గా నిలచిన ప్రజల్ని చూసైనా కేంద్రప్రభుత్వం తక్షణం జాతీయహోదా ప్రకటించా లని డిమాండ్ చేసారు రోజా.
జగన్‌కు అన్ని విధాలా మద్దతు...లక్ష్మీపార్వతీ
స్వేచ్ఛా వాయువుల కోసం ఈజిప్టు నైలునదీ తీరంలో ప్రజలు పోరాటాలు చేస్తుంటే ఇక్కడ సాగు, తాగు నీటి కోసం పోలవరం కట్టాలని గోదావరి తీరానా ప్రజలు పోరాడుతున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. గురువారం జగన్ హరితయాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ప్రజల అవసరాలు ప్రభుత్వాలు గుర్తెరిగి పోలవరం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టుగా గుర్తించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ రాజకీయ కోణంలోనే ఆలోచిస్తూ నేటికీ జాతీయ హోదా కల్పించకపోవడంవల్లే ప్రజలు పోరాటానికి దిగాల్సి వచ్చిందని ఇందుకు గత నాలుగు రోజులుగా లక్షలాదిగా జగన్ వెంట జనం నడుస్తున్న విషయాన్ని గుర్తెరగాలని ఆమె అన్నారు.
తెలుగువారి ఆత్మ గౌరవివాన్ని ఢిల్లి వీధుల్లో కాంగ్రెస్ అధినాయకత్వాల దగ్గర తాకట్టుపెట్టడం ఇష్టంలేని జగన్ ఆ పార్టీపైన పోరాటానికి సిద్ధపడ్డారని ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయన చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతున్న జగన్‌కు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
సోనియాకు సబ్బం ‘హరి’ హెచ్చరికలు
జననేతగా ఎదిగిన జగన్‌ని అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా చేష్టలు చేసి ఇబ్బందులు పెట్టాలని భావిస్తే.....కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ అధిష్టానాన్ని కాంగ్రె స్ పార్టీకే చెందిన పార్లమెంట్ సభ్యుడు, జగన్ వర్గ నేత సబ్బం హరి హెచ్చ రించారు.
గురువారం జగన్ హరిత యాత్ర ముగింపు సమావేశంలో ఆయన మాట్లా డుతూ... ఇందిరాగాంధీ చనిపోయాక ఆయన కుమారుడు రాజీవ్‌ని ప్రధానిని చేసి న కాంగ్రెస్ మన రాష్ట్రంలో మాత్రం మరో తరహాలో వ్యవహరించిందని... వైఎస్ మరణానంతరంఆయన కుమారుడు జగన్‌ని శాసనసభ్యులు తమనేతగా ప్రకటించి నా ఇప్పటికి ఇద్దరి సిఎంలని చేసి ద్వంద్వ పరిణామాలు పాటించిందని... జగన్‌ని ఎందుకు సియం చేయలేదో చెప్పాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాని నిలదీసారు.
జగన్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేసారంటున్న నేతాశ్రీలకు తన జవాబొక్కటే... తన హయాంలో కొన్ని పత్రికలు పనికట్టుకుని కాంగ్రెస్‌ిని విమర్శల పాలు చేస్తుం టే... వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకు జగన్‌తో పత్రికని పెట్టించారని... రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి వైఎస్ కృషి ఎంతుందో...ఆపత్రిక రాసిన వాస్త వాలు చెప్పి రెండోసారి అధికారంలోకి రావటానికి అంతే కృషి చేసిందని... పొగిడి న నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటేదని నిలదీసారు.ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ కుక్కలు చించిన విస్తరిగా మారిందని,వాస్తవాలు ఇలా ఉంటే, తప్పుడు నివేదికలు పంపిన పెద్దలే ఈ స్ధితికి కారణమని అధిష్టానం గమనించాలని సూచించారు.
వాంటెడ్ సెన్సార్ కట్స్
భవ్య క్రియేషన్స్ పతాకాన బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో 'వాంటెడ్' చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి, నిర్మాత వి. ఆనందకుమార్.
గోపిచంద్, దీక్షాసేథ్, జయసుధ, చంద్రమోహన్, ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, సుబ్బరాజు ముఖ్యపాత్రలు పోషించిన 'వాంటెడ్' చిత్రాన్ని ఇసి చూసి 4 కట్స్‌తో 24-01-2011న 'యుఎ' సర్టిఫికెట్ జారీచేసింది.
1. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'నిత్యానందం' పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
2. మూడు నాలుగు రీళ్లలో పిక్చరైజ్ చేసిన 'నా కాయని గిచ్చావ్' అనే డైలాగ్‌లలోని ''కాయ''ని తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.
3. అయిదు ఆరు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో 'స్త్రీలను గర్భిణీ స్త్రీలను చేస్తూ వుంటారు' అనే డైలాగ్‌ని తొలగించి శబ్దం వినబడనీయకూడదన్నారు.
4. తొమ్మిది పది రీళ్ళలో గల 'ముండ' పదాన్ని తొలగించి శబ్దం వినబడనీయ వద్దన్నారు.
16 రీళ్ళ నిడివిగల 'వాంటెడ్' 26-1-2011న విడుదలయింది.
అనగనగా ఓ ధీరుడు సెన్సార్ కట్స్
వాల్ట్ డిస్నీ బెల్లిd ఫుల్ ఆఫ్ డీమ్స్ ఎంటర్ టైన్‌మెంట్ రూపొందించిన 'అనగనగా ఓ ధీరుడు' చిత్రానికి నిర్మాతలు ప్రసాద్ దేవినేని, ప్రకాష్ కోవెలమూడి. ఈ చిత్రానికి దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. సిద్ధార్థ, శ్రుతిహాసన్, లక్ష్మీ ప్రసన్న మంచు ముఖ్యపాత్రల ధరించిన ఈ చిత్రాన్ని ఇసి చూసి ఏ విధమైన కట్ లేకుండా 'యు' సర్టిఫికెట్‌ని 10-1-11న జారీ చేసింది.
3625.31 మీటర్ల నిడివిగల 'అనగనగా ఓ ధీరుడు' 12-01-11న విడుదలయింది.
సికింద్రాబాద్ నుంచి ముంబైకి నాన్‌స్టాప్ రైలు
గుణదలమేరీమాత ఉత్సవాలు ప్రారంభం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు యాత్రికులను అలరించాయి. కోలాటం, మిమిక్రీ, దావీదు విజయం నాటకం, సంసోను- డిలైలా బురక్రథలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రాయిపై రామనామం
విలీనంతో విహీనం!
రాజకీయ లబ్ధిపొందేందుకు జగన్ వర్గం..చంద్రబాబుపై అవాస్తవ ప్రచారం
టీడీపీ హయాంలో కేజీ బేసిన్‌లోని గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి గ్లోబల్ టెండర్లు నిబంధనల మేరకు జరిగిందన్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రిలయన్స్‌కు అక్రమంగా గ్యాస్ నిక్షేపాలు దోచిపెట్టి ఉంటే, ఆ తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించలేదని వారు ప్రశ్నించారు. గ్యాస్ నిక్షేపాల కేటాయింపుల వెనుక అవినీతిని వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన ఏపీ గ్యాస్ అథారిటీని దివంగత వైఎస్ నిర్వీర్యం చేశారన్నారు.
జగన్ రాజకీయలబ్ధి కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో వర్గపోరుతో ప్రజారాజ్యం ఉక్కిరిబిక్కిరి
రీఛార్జి కన్నా... సిమ్‌కార్డు మిన్న..
దీంతో రీఛార్జి షాపులు వెలవెలబోతుండగా సిమ్‌కార్డు విక్రయాల కోసం వెలిసిన డేరాలు కళకళలాడుతున్నాయి. మార్కెట్‌లో దొరుకుతున్న సిమ్‌లు రూ.5 కే విక్రయిస్తు రూ.30 నుంచి 50 టాక్‌టైంతోపాటు ఎస్‌ఎంఎస్ ఆఫర్‌సైతం వర్తింపచేస్తుండడంతో వినియోగదారులు సిమ్‌కార్డులవైపే మొగ్గుచూపుతన్నారు.దీంతో యువకులు జేబులోనే ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలతో తిరుగుతున్నారు. ఏ సంస్థ ఆఫర్ నచ్చితే ఆ సంస్థ సిమ్‌కార్డు కొంటున్నారు.
సింగరేణికి ‘సహాయ నిరాకరణ’ దడ
ఈ ఏడు రికార్డు స్థాయి లో 51.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ 100శాతం వార్షిక ఉత్పత్తి సాధించాలంటే మిగిలిన 50 రోజల్లో ఇంకా 8.40 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలి. ప్రస్తుత పరిస్థితులు ఉత్పత్తి లక్ష్యసాధనకు ప్రతి బంధకంగా కనిపిస్తున్నాయి.
మే 18న ఐసెట్ 14న నోటిఫికేషన్...
నిబంధనల మేరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఇస్తారు. దరఖాస్తులు ఈ-సేవా సెంటర్లలో, ప్రధాన తపాలా కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఉన్న తపాలా కార్యాలయాలు, ఆంధ్రాబ్యాంక్ ప్రధాన శాఖల్లో లభిస్తాయి. మరిన్ని వివరాలకు www.icet2011.net, www.andhrauniversity. info, www.apsche.org వెబ్‌సైట్‌లలో సందర్శించవచ్చు.
అనూషకి ఎంత కష్టం.. ఎంత కష్టం...
రాజమండ్రికి చెందిన అనూష చెల్లెలే ఈ ప్రసన్న . ప్రేమోన్మాది రాజేష్ చేతిలో అనూష తల్లిదండ్రులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఏడాది తిరక్కముందే అనూషకు ఇప్పుడు మరోకష్టం వచ్చిపడింది.
చిరంజీవి పచ్చి మోసగాడు
డబ్బులు ముట్టిన తరువాత తనతో ఆదరంగా వ్యవహరించేవారని, అయితే చివరికి చేవెళ్ల స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో తాను ఘోరంగా మోసపోయానని, అలాగే ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆమె చెప్పారు. డబ్బుల గురించి అడిగితే సమాధానం దాటవేస్తూ వచ్చారని జయలక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిరంజీవి పచ్చి అవినీతిపరుడని ఆమె విమర్శించారు. ఈనెల 15వతేదీ లోగా తన డబ్బు తిరిగి విఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేపడతానని ఆమె ప్రకటించారు.
మాట నిలబెట్టుకోకపోవటం ఇటలీ సంస్కృతా ?
తన పుట్టినరోజు కానుకగా ఇచ్చిన తెలంగాణను సోనియ వెనక్కి తీసుకుని, పనికిమాలిన శ్రీకృష్ణ కమిటీని వేశారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవటం ఇటలీ సంస్కృతా అని ఇటలీ సంస్కృతిని సోనియా దేశంలోకి డంప్ చేస్తున్నారన్నారు. వెంకటస్వామికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటం దళితుల్ని అవమానించినట్లే...వైఎస్‌తో కలిసి రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన డీ శ్రీనివాస్‌ను సీఎంను చేయకుండా రోశయ్యను తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేశారని అవమానించారని... దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న హామీ ఏమైందన్నారు.
ఏ బాధ్యతైనా స్వీకరిస్తా..
బుధవారం ఆయన పిసిసి ఛీఫ్ డిఎస్‌ని కలిసిన అనంతరం మీడియాలో ముచ్చటిస్తూ... విలీన ప్రక్రియకు సంబంధించి చట్టబద్దంగా అన్ని కార్యక్రమాలు పూర్తయాక విలీన సభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తానని, సోనియా నాయకత్వాన్నిబలపరుస్తానని, అధినాయకత్వం ఏ బాధ్యతలు ఇచ్చినా నెరవేరేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు.
వైఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఢిలీలో చేసిన ఆరోపణకు కట్టుబడి ఉంటారా? అని చిరంజీవిని ప్రశ్నించిన విలేఖరులకు ఎవరని హయాంలో అవినీతి జరిగినా దానిపై విచారణ కోరటం తప్పెలా అవుతుందని ఆయన సమాధానమిస్తుండగా...డిఎస్ కలుగచేసుకుని వైఎస్ హయాంలో అని ప్రత్యేకంగా చిరంజీవి చెప్పలేదంటూ సర్ధిపుచ్చేయత్నం చేయటం గమనార్హం.
టిక్కెట్లమ్ముకుని ఛానల్ పెట్టిన ఘనత బాబుదే...
నిన్న చంద్రబాబు పర్చురు నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ అధినేతి సోనియా హయాం అవినీతి రాజ్యంగా మారిపోయిందంటూ చేసిన విమర్శ లపై స్పందిస్తూ బుధవారం ఆయన పలు ఆరోపణలతో మీడియాకు ఓలేఖ విడుదల చేసారు. తెలుగుదేశం పార్టీ మహానాడు సమయంలో వేలలో చందా లు వసూళ్లు చేసుకున్న ఘనుడు చంద్రబాబేనని, ఈవిషయం తెలిసి ఎన్టీఆర్ తో మందలింపులించినా కలక్షన్లు చేయటం మానలేదని, తరువాత తాను అధి కారంలోకి వచ్చాక కూడా పార్టీటికెట్లు సైతం అముకున్నాడని ఆరోపించారు.
తాజాగా రాజ్యసభ సీట్లుని 20 కోట్ల చొప్పున అమ్ముకుని ఆ సొమ్ముతో టివి ఛానల్ కొన్న విషయం నిజ ం కాదా? అని నిలదీసారు. ఆపధర్మ ముఖ్య మంత్రిగా ఉంటూ గచ్చిబౌలిలో ఐఎంజికి వెయ్యి ఎకరాలు కేటాయించిన చంద్రబాబుకు ఎమ్మార్‌లో విల్లులు ఉన్న సంగతి వాస్తవంకాదా? అని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక చంద్రబాబు హస్తం ఉందని, అవినీతికి ఆదు్యడెన అలాంటి వ్యక్తి తమ పార్టీ అధినేత్రి సోనియాని విమ ర్శించడం చూస్తుంటే నవ్విపోదురు నాకేటి సిగ్గనేలా ఉందని అన్నారు వెంకటేశ్వరరావు.
నిన్నటిదాక ఆయన చిరంజీవి... నేడు ‘చిరు’ జీవి
బుధవారం జగన్ హరిత యాత్ర సందర్భంగా వచ్చిన ఆయన కాసేపు మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి ఏలక్ష్యంతో పార్టీపెటుకునారో? దానిన ఎందుకు కాంగ్రెస్‌లో కలిపేసుకున్నాడో అర్ధంకాక ఆయన సినీ అభిమానులు సైతం విమర్శలు దిగుతుండటం చూస్తుంటే చిరంజీవి ఏ పరిస్ధితిలో ఉన్నా రో అర్ధం చేసుకోవచ్చన్నారు.
చిరంజీవి చరిష్మాను వాడుకుని కాంగ్రెస్ బతికి బట్ట కట్టాలని చూసి బేరసారా లు జరిపితే...కాంగ్రెస్ నైజం తెలిసికూడా చిరంజీవి పార్టీనిమూసేసి ఇన్నాళ్లు విమర్శించిన పార్టీలో కలిసిపోవటం విడ్డూరంగా ఉందని.. చిరంజీవి జనాలకి చూపిస్తానన్న మార్పు ఇదేనేమో అని వ్యాఖ్యానించారు.
2003లో వైఎస్ పాదయాత్రలో పాల్గొన్న నాకు.. ఇప్పుడు పోలవరం సాధన కోసం జగన్ చేసున్న పాదయాత్రలోనూ పాల్గొనే అదృష్టం కలిగిందని అందు కు ఆనందిస్తున్నానని పేర్కొన్నారు. జగన్ పెట్టే పార్టీ కోసం ప్రజలెంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనఖ్ఖరేదని... ఆయన త్వరలోనే తన తండ్రి సమాధి వద్దనే పార్టీపేరు ప్రకటించి ప్రచారానికి కూడా శ్రీకారం చుడ తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అంబటి.