28, జనవరి 2011, శుక్రవారం

ప్రతిపక్షానికి ఆధైర్యం లేదని అనడం మంచిది కాదు

రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఎన్నికలను కోరుకోవడం లేదని మాజీముఖ్యమంత్రి డాక్టర్ కె రోశయ్య అన్నారు. అవిశ్వాసతీర్మానం ప్రతిపాదించాల్సిన అవసరం లేదన్నారు.మళ్ళీఎన్నికలు వస్తే ప్రజలపై మరింత భారం పడుతుందని , ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనికొంతమంది వ్యాఖ్యానించడం, ప్రతిపక్షానికి ఆధైర్యం లేదనిఅనడం మంచిది కాదన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాలుసంయమనంతో వ్యవహరించాలన్నారు.

జగ్గారెడ్డి ఎక్కడ కనిపించినా తరిమికొట్టాలి : తెరాస పిలుపు

తెలంగాణ మాటలతో రాదని, పల్లెపల్లెనా ఉద్యమం తీవ్రతరం చేసి, యుద్ధం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో పాలనను స్తంభింపచేసి, తెలంగాణ వ్యతిరేకులను తమిరికొట్టాలన్నారు.
విద్యార్ధి, యువత ఉద్యమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకుంటున్నాయని, శ్రీకృష్ణ కమిటీ అంతా బోగసని, కమిటీ సభ్యులు ఆంధ్రనాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి చీడ పురుగులు తెలంగాణకు అడ్డం కి అలంటి వారిని ఎక్కడ కనిపించినా తరిమికొట్టాల''ని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

రజాకార్ల జమానాను తలపిస్తున్న పోలీసులు

ర చ్చబండలో పోలీసుల రాజ్యం కనిపిస్తోంది. ఏగ్రామానికి వె ళ్ళినా జన ం కంటే పోలీసులు అధికంగా కనిపిస్తున్నారు. ఇద్దరు సీఐలు, 8మంది ఎస్సైలు, 30 మంది పోలీసులు రచ్చబండ విజవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. జై తెలంగాణ అంటే చాలు వారిని పోలీసులు పట్టుకుని పోయి జీపుల్లో ఎక్కిస్తున్నారు.

సమావే శం జరుగుతున్న సమీప ప్రాంతంలో తెలంగాణ ముచ్చట వినబడితే చాలు తెలంగాణ అన్న వారిని పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తున్నారు. దీంతో చాలా మంది రచ్చబండ వద్దకు రావడానికి జంకుతున్నారు. మహిళలు పూర్తిగా భయపడుతున్నారు. వందేమాతరం అంటే బ్రిటిష్‌వాళ్ళు భారతీయులను పట్టుకుపోయినట్లు ప్రస్తుతం జై తెలంగాణ అంటే పాపం అన్నట్లుగా మారిందని, ఒకప్పటి రజాకార్ల జమానాను తలపిస్తోందని వృద్ధులు వాపోతున్నారు.

రచ్చబండకు దూరంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు

తెలంగాణా జిల్లాల్లో జరుగుతున్నా రచ్చబండ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదు. హాజరైన వారిని అడ్డుకునేందుకు తెలంగాణవాదులు, టీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతుండటంతో అధికార పార్టికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రచ్చబండకు దూరం గా ఉండిపోయారు.
టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చబండను బహిష్కరించగా పలు చోట్ల తప్పని స్తితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరవుతూ ప్రజల నిరసనలు చవిచూస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని బహిస్కరించి చాల చోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించ గా... వి ద్యార్థులు శుక్రవారం నుంచి జరగుటున్న పరీక్షలను బహిష్కరించాలని నిర్ణ యి0చి తమ హాల్ టికెట్స్ చేపేసి నిరసనలు తెలుపుతున్నారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తా రోకోలు, కొనసాగుతున్నై.

శ్రీవారి ప్రసాదాల ధరలు పెంపు

తిరుమలేశుని ప్రసాద ధరలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వడ రూ. 4 నుంచి రూ. 25కి, జిలేబీ రూ.25 నుంచి రూ.70కి, మురుకు రూ.7 నుంచి 30 కి, పోలీ ప్రసాదం రూ.1 నుంచి రూ.20 కి పెంచింది. ముడి సరుకుల ధరలు పెరిగినందువల్లే ధరలు పెంచినట్లు, ధరలు శుక్రవారం నుండి అమలు జరగనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ధరల పెంపులో లడ్డూను మినహాయించారు. లడ్డూ ధర యధాతథంగా ఉంటుంది.

Anitha's BIKINI Hungama



పరమ వీర చక్ర సెన్సార్ కట్స్


దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో తేజా సినిమా పతాకం పై రూపొందిన చిత్రం 'పరమ వీర చక్ర'. అమీషా పటేల్‌, నేహా ధూపియా, షీలా, జయసుధ, మురళీమోహన్‌, విజయ్‌చందర్‌, విజయ్‌కుమార్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ ముఖ్య తారాగణం. సి. కళ్యాణ్‌ నిర్మించిన 'పరమ వీర చక్ర' చిత్రాన్ని తలిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడాలనే క్లాజ్‌తో యుఎ సర్టిఫికెట్‌ని 6 కట్స్‌తో 31-12-2010న జారీ చేసారు.

1. మూడు, నాలుగు రీళ్ళలో (17వ సీన్‌గా) జాతీయ పతాకాన్ని తిరగేసినట్టు చూపిన దృశ్యాలను పదకొండు పన్నెండు రీళ్ళలో (సీన్‌ నెం 66) బాంబ్‌ జాతీయ పతాకంలో చుట్టినట్టున్న దృశ్యాలను తొలగించారు.

2. తొమ్మిదవ రీలులో (సీన్‌ నెం 40) చిత్రీకరించిన 'బ్లడీ ఇండియన్స్‌', భారత్‌ కి కుత్తే' పదాలను తొలగించారు.

3. అయిదు ఆరు రీళ్లలో (సీన్‌ నెం 26) చిత్రీకరించిన ''పైనైతే నేను ఒక్కడినే పడుకుంటాను, ఇక్కడ అయితే పదిమంది, బయటకెళ్తే వందమంది బట్టలు కూడా తీస్తారు పైన పడుకుంటారు'' అని హీరోయిన్‌తో విలన్‌ అన్న డైలాగ్‌ని కత్తిరించారు.

4. పదిహేనవ రీలులో (సీన్‌ నెం 85) చిత్రీకరించిన ''నీ పెళ్లాం పక్కలో పడుకోమంటావా'' డైలాగ్‌ని తొలగించారు.

5. పదకొండు పన్నెండు రీళ్ళలో మేజర్‌ కుమారునికి ఎ.కె.47 గన్‌ని స్వాధీనం చేసే దృశ్యాలను కత్తిరించారు.

6. అయిదు ఆరు రీళ్ళలో బాత్రూమ్‌ నుంచి మహిళ బయటకి వచ్చాక ఆమె శరీరంపై గల పుట్టుమచ్చల గురించి రోబో చర్చించే డైలాగ్‌ని తొలగించారు.

16 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 12-1-11 న విడుదల అయింది.

ఇక పోలీస్‌స్టేషనే కోర్టు

కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్రంలో సీ ఆర్ పీసీ (నేర న్యాయ శిక్షా స్మృతి) సవరణలు యుద్ధప్రాతిపదికన అమలులో కి వచ్చాయి. ఈ కొత్త చట్టం ప్రభావంతో ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు ఇక పోలీస్‌స్టేషనే కోర్టు కానుంది. అయితే కొత్త నిబంధనలు పోలీస్ యంత్రాంగానికి గుదిబండగా మారాయి.

ప్రస్తుతం పోలీసులు పలు కేసులకు సంబంధించి నిందితులను ఆయా కోర్టులకు తీసుకువెళితే సంబంధిత న్యాయమూర్తులు కొన్ని కేసులను తమ పరిధి కావంటూ అప్పుడే తిప్పిపంపడంతో కేసుల పరిష్కారానికి పోలీసులే చొరవ చూపాల్సి న పరిస్థితి ఏర్పడింది.


భారత శిక్షా స్మృతిలో 511, 89 సెక్షన్‌లలో మాత్రమే ఏడు సంవత్సరాల పైబడి ముద్దాయిలకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మిగిలిన కేసుల కు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే స్టేషన్ ష్యూరిటీల ఆధారంగా కొత్త నిబంధనల ప్రకారం బెయిల్ ఇవ్వాల్సి ఉంది. ఫలితంగా పోలీసులకు పని భారం తీవ్రతరం కానుంది.

ఈ కొత్త చ ట్టం అమలులోకి రావడం వల్ల పోలీసులకు బాగా పని పెరిగినా, ఇక న్యా యవాదుల ఉనికికే ప్రశ్నార్ధకంగా మా రింది. కొత్త నిబంధనల నేపధ్యంలో కో ర్టుల్లో కేసుల సంఖ్య బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరకొ ర కేసులకు పరిమితమైన న్యాయవాదులు పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది. అంతేకాక ఈ కొత్త చట్టం అ మలు వల్ల పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది న్యాయవాదుల వా దన.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం

తెలంగాణను ప్రకటించకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అవు తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలంతా రచ్చ బండను బహిష్కరించినా ప్రభుత్వం పోలీస్ బలగాలతో రచ్చబండను నిర్వహించే యత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రచ్చబండకు హాజరు కాలే ని పరిస్థితి ఉన్నా ఇంకా బుద్ది రావడం లేదన్నారు. ప్రజల ఛీత్కారానికి గురైనా నాయకులకు పదవుల్లో కొనసాగే హక్కు లేదన్నారు.

నేర చరిత్ర గలిగిన వారి సభ్యత్వం ఇవ్వం అంటున్న రాహుల్

‘రండి.. విధానాల్ని మారుద్దాం..!’ అంటూ కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ యువతను పార్టీలోకి ఆహ్వానించారు. యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం కర్నాటక లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిలో గురువారం పర్యటించి యువతతోనే ఎక్కువసేపు గడిపారు.
యువతరం రాజకీయాల్లో చేరాలని, రాజకీయ విధానాన్ని మార్చాలని , దేశం కోసం, పార్టీ కోసం కష్టించి, నిజాయితీగా పనిచేసిన వారికే యువజన కాంగ్రెస్ పదవులు లభిస్తాయన్నారు. నేర చరిత్ర గలిగిన వారి సభ్యత్వాన్ని నిరాకరిస్తామని పేర్కొన్నారు. మరి ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో సాధ్యమేనా? ఇప్పటి వరకు నేర చరిత్ర అవినీతి ఆరోపణలున్న వారిని పార్టీ నుంచి పంపెస్తారా ? సమాధానం రాహుల్‌గాంధీ య్యే చెప్పాలి.

ఆమ్ ఆద్మీ బీమా క్లెయిమ్‌లు పరిష్కారం ఎప్పుడూ ..?

పేదల కోసం ప్రవేశ పెట్టిన ఆమ్ ఆద్మీ బీమా పథకం సంవత్సరాలు గడుస్తున్నా క్లెయిమ్‌లు పరిష్కారం కావడం లేదు. డ్వా క్రా సంఘాల మహిళలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2008-09 నుంచి ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద బీమా చేసిన డ్వాక్రా మహిళ కుటుంబ యజమాని మృతి చెందితే బీమా కంపెనీలు డబ్బు చెల్లించాల్సి ఉం టుంది. మృతి చెందిన వెంటనే అంత్యక్రియల కోసం రూ.5వేలు ఇవ్వాలి. తరువాత ప్రమాదవశా త్తు మృతి చెందితే రూ.70వేలు, సహజ మరణమైతే రూ.30వేలు చొప్పున చెల్లిస్తారు. జిల్లాలో ఈ పథకం ఫైళ్ళు పైసలుంటేనే కదులుతున్నాయి. బీమా కంపెనీ కింద మండలానికి ఒక మిత్ర కార్యకర్తను నియమించారు.

ఒక్కొక్క కేసుకు జిల్లాసమాఖ్య నుంచి రూ.500 చొప్పున పరిహారం ఇస్తారు. 2008-09 నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఆయా కుటుంబాలకు పరిహారం అందలేదు. యజమాని మృతి చెంది సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు మాత్రం రావడం లేదు. డీఆర్‌డీఏలో దీనికోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ అవినీతికి నిలయంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో బోగస్ రికార్డులను సృష్టించి అంత్యక్రియల పేరుతో డబ్బు డ్రా చేశారు.

సమాచారం అందిన 24 గంటల్లో మృతి చెందిన యజమాని కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఇచ్చి రావాలి. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అంత్యక్రియల కోసం ఇచ్చే రూ.5వేలు కూడా బీమా సొమ్ములో కలిపి ఇస్తున్నారు. సమాఖ్యలోని పలుకుబడి, పరపతి ఉన్న వారు వెంటనే క్లెయిమ్‌లను సెటిల్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఆమ్ ఆద్మీ బీమా యోజనలో ఉన్న డబ్బును ఇతర పథకాలకు మరలించడం వలన ఇక్కడ క్లెయిమ్‌ల పరిష్కారానికి జాప్యం జరుగుతోంది.

కలామ్ స్పూర్తితో విద్యార్థులకి "ఇన్‌స్పెయిర్"

విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన, ఆసక్తి పెంచి యువ శాస్త్రవేత్తల తయారీకి 'సిద్దం చేయాలన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సూచనల మేరకు రూపొన్దుకున్న అతిముఖ్యమైన కార్యక్రమంగా ఇన్‌స్పెయిర్ (ఇన్నోవేషన్ ఇన్ సైన్సు ఫర్‌స్యూట్ ఫర్ ఇన్ స్పెయిర్ రీసెర్చ్)ను కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ0 రూపొందించింది.

ఇందులో భాగంగా ప్రాథమిక స్థాయి నుంచి సైన్సులో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఉన్నత పాఠశాలలోను 6, 7,8 తరగతుల నుంచి ఒకరిని 9,10 తరగతుల నుంచి ఒకరిని అలాగే యూపీ పాఠశాలల్లో 6, 7 తరగతుల నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఆయా పాఠశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసిన ఒక్కొక్క విద్యార్థికి రూ.5 వేలు వంతున ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ సొమ్ములో 50 శాతాన్ని ఆ విద్యార్థి తాను రూపొందించే ప్రాజెక్టుకు వినియోగించవలసి ఉంటుంది.

మిగిలిన సొమ్మును జిల్లా స్థాయిలో తన ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వెచ్చించవలసి ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఉన్నతి కల్పిస్తారు. ఈ విధంగా జాతీయ స్థాయికి చేరుకున్న యువ శాస్త్రవేత్తలకు తగిన వేతనాలు కల్పిస్తారు. ఇన్‌స్పయిర్ విధానంలో సైన్సులో విద్యార్థి ప్రతిభ గీటురాయిగా ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింతమంది ప్రతిభావంతులను తయారు చేసే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని ఆశించవచ్చు.

తమ్ముడు అంటే శ్రీకాంతే నట