19, ఫిబ్రవరి 2011, శనివారం
22, 23 తేదీలలో తెలంగాణా బంద్
ఆ రెండు రోజులు తెలంగాణా ప్రజలంతా ఎలాంటి రాక పోకలు సాగించ కుండా... రోడ్లపైనా, రహదారులపైనా బైటాయింపులు జరపాలని.. రైల్ రోకోలు నిర్వహించి రైల్ల రాకపోకల్ని కూడా అడ్డు కోవాలని కోదండరామ్ సూచించారు.
మరో సెంచరీతో భారత్ మెరుపులు
ప్రపంచ కప్-2011లో సెహ్వాగ్ తొలి శతకం
కొందరిని ప్రమోట్ చేయడానికే సర్వేలు : డి శ్రీనివాస్
కొందరిని రాజకీయంగా ప్రమోట్ చేయడానికే సర్వేలు చేస్తున్నారన్నారు. సర్వేలకు ఇది సమయం కూడా కాదన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ఇంకా మూడేళ్లు గడువున్నా..ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు లేకున్నా.. సర్వే నిర్వహించాల్సిన ఆవశ్యకత .. ఎందుకొచ్చిందో? ఆ ఛానల్‌కి, ఏజన్సీకే తెలియాలి అని ఎద్దేవాచేసారు... ఎవరెందుకోసం పాట్లు పడుతున్నారో? ప్రజలు చూస్తున్నారని.. తగిన సమయంలో నిర్ణయం తీసుకోగల విజ్ఞత వారికి ఉందని వాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మహాత్మాగాంధీ పద్ధతిలో పోరాడుతామని చెప్పారని .. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఘటన ఆయనకు గాంధేయవాదంలా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై, గవర్నర్ నరసింహన్ చేతిలోని ప్రతులు చించివేయడం వంటి చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయన్నాని.. కొందరు తెలంగాణ పేరుతో హింసకు పాల్పడుతూ తెలంగాణ ప్రజల పరువు తీశారన్నారు. ఒక సాధారణ డ్రైవర్ ఓ ఎమ్మెల్యేపై దాడి చేయడం దారణమని... అభీష్టం నెరవేరకుంటే అందరూ నిరసనలు చేయవచ్చని... అయితే ఆ నిరసనలకు హద్దు ఉంటుందని అన్నారు.
తెలంగాణ కోసం అంటూ ఇక్కడ ఉద్యమాలు చేస్తే సరిపోదని..కేంద్రం స్థాయిలో ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వెళ్లినట్టు అందరూ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు.
ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన : నల్లపురెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివాదం
జగన్‌కు టిఆర్ఎస్ మద్దతు
ఎన్నికలు వస్తే ఇరువురు లాభపడే పరిస్థితి కనిపిస్తున్నందునే వారు కలిసి ముందుకు సాగుతున్నట్టుగా .. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రాంతంలో ఏ మాత్రం పట్టులేని జగన్‌కు టిఆర్ఎస్ మద్దతు ఇచ్చి ఫీజు పోరును విజయవంతం చేయాలని .. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జగన్ ప్రారంభించిన దీక్షకు టిఆర్ఎస్ అనుబంధ విభాగం.. టిఆర్ఎస్‌వి సమీకరించే బాధ్యత తీసుకున్నట్టుగా సమాచారం.
ట్యాంక్‌బండ్ వద్ద లోక్‌సత్తా మానవహారం
నోములపై కోడిగుడ్లతో దాడి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వనం ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మృతి
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వనం ఝాన్సీ శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలం కడ్తాల్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున వాహనాన్ని మరో వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఝాన్సీని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. సంతోష్‌నగర్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రి వైద్యులు ఝాన్సీ మరణించినట్లు నిర్థారించారు. కాగా ఝాన్సీ మృతితో బీజేపీ వర్గాలు దిగ్బ్రాంతి చెందాయి.