19, మార్చి 2011, శనివారం

కావాల్సిన చీఫ్ బట్టి రేటు ఫిక్స్...

అవినీతికి అలవాటు పడిన విద్యాశాఖ అధికారులకు పదో తరగతి పరీక్షలు కాసులు కురిపిస్తున్నాయి. ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్ లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు (డీఓ), అసిస్టెంట్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ల(ఏడీఓ)ను నియమించే విషయంలో బేరసారాలు పెట్టారు. కాపీలు కొట్టించి, అధిక సంఖ్యలో విద్యార్థులను పాస్ అయ్యేలా చేసి ఉతీర్ణత పెంచుకునేందుకు కొన్ని పాఠశాలల యజమానులు సంబంధిత అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి కోరుకున్న అధికారులను చీఫ్‌లుగాను, డీఓ, ఏడీఓలుగా నియమించుకుంటున్నారని సమాచారం. పరీక్ష కేంద్రాలకు చీఫ్‌లు, డీఓలు, ఏడీఓల నియామకంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలే ఆరోపిస్తున్నాయి. సెంటర్ల కేటాయింపు మొదలుకుని ప్రతి పనినీ తప్పు పడుతున్నారని, తీరా మామూళ్లు ముట్టజెపితే నియమ, నిబంధనలను పట్టించుకోవడం లేదని చెబుతున్నాయి. ముడుపులు దండుకుని సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను తగ్గించి, అరకొర సౌకర్యాలున్న ప్రైవేటు పాఠశాలలకు అధిక సంఖ్యలో విద్యార్థులను కేటాయించినట్లు తెల్సింది. ఏ పాఠశాలలో ఎంత మంది పరీక్షలు రాయాలో అధికారులు సంఖ్యను వేసి సెకెండరీ ఎడ్యుకేషన్ బోర్డుకు పంపుతారు. ముడుపులు దండుకున్న అధికారులు ఆ సమయంలోనే సంఖ్యను కోరుకున్న విధంగా వేసి పంపినట్లు సమాచారం. కోరుకున్న, కావాల్సిన చీఫ్ కావాలంటే పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి రేటు ఫిక్స్ చేశారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే రూ. 1,500 నుంచి సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారని తెల్సింది.

జగన్‌ వర్గం ఎమ్మెల్యేల్లో చీలిక?

శాసనసభ్యుల కోటాలోని 10 ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని దెబ్బకొట్టడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వేసిన పాచిక పారలేదు. సరికదా! తప్పుడు వ్యూహంతో అభాసుపాలయ్యారు. ఫలితంగా సొంత పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటువేసిన ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతుపై పునరాలోచనలో పడ్డారు. ఓటింగ్‌ విషయంలో జగన్‌ సరైన వ్యూహం రచించకపోవటం వల్లే తాము విమర్శలకు గురవుతున్నామని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఆత్మప్రబోధం మేరకు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ప్రకటించారు. ఓటింగ్‌ విషయమై తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పొడచూపడంతో ఖిన్నుడైన జగన్‌ ఎంఐఎం అభ్యర్థులకు ఓటు విషయంలో అభ్యంతరం చెప్పకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఓటింగ్‌ వ్యవహారంలో విభేదాలు తలెత్తటంతో జగన్‌కు మద్దతు ఇచ్చే విషయంలో కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీకి దూరమయ్యేందుకు వారు విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకే జైకొట్టేందుకు నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల్లో వారు తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

భలే మొగుడు-భలే పెళ్ళాం సెన్సార్ కట్స్

భలే మొగుడు భలే పెళ్ళాం చిత్రం ఉషాకిరణ్‌ క్రియేషన్స్‌ పతాకాన నిర్మితమయింది. రాజేంద్రప్రసాద్‌, సహాసిని, నరేష్‌, కావేరిఝా, ఝాన్సీ, రఘబాబు, రజిత, రమ్యశ్రీ ముఖ్యపాతల్రు పోషించారు. గంగోత్రి విశ్వనాథ్‌ డైలాగ్స్‌, ఇ.ఎస్‌.మూర్తి సంగీతం, మురళి రామయ్య కూర్పు నిర్వహించిన ఈ చిత్రానికి దర్శకుడు దినేష్‌ బాబు. నిర్మాత జొన్నాడ రమణమూర్తి.

5 గురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 8 కట్స్‌తో 0.13 అడుగుల ఫిలిం కత్తిరించి 11-1-11న ‘యు’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. 14 రీళ్ళ – ‘భలే మొగుడు భలే పెళ్ళాం’ చిత్రం 25-2-11 విడుదల అయింది.

1. ఒకటి రెండు రీళ్ళలో ‘దానికి బ్లౌజ్‌ ఎందుకు’ అని ఉన్న డైలాగ్‌లోని ‘బ్లౌజ్‌’ని కత్తిరించి శబ్దం వినబడకూడదన్నారు.

2. ఒకటి రెండు రీళ్ళలో ఒక దృశ్యంలో వచ్చిన టి.వి.9, టి.వి పదాలను సౌండ్‌తో సహా తొలగించారు.

3. ఒకటి రెండు రీళ్ళలో వున్న ‘ఆడంగి’ పదాన్ని శబ్దంతో సహ తొలగింప చేసారు.

4. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనేది చూపమన్నారు జనరల్‌గా.

5. మూడు నాలుగు రీళ్ళలో ‘కోర్టుకి అండర్‌వేర్‌’ లేకుండా వెళతావా’ అనే డైలాగ్‌లోని ‘అండర్‌ వేర్‌’ పదం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

6. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో గల ఏ వర్కన్నా ఎక్సట్రా చార్జి ఇస్తే చేస్తావా’ అనే డైలాగ్‌ని శబ్ధంతో సహా తొలగించారు.

7. అయిదు ఆరు రీళ్ళలో టీవీ నటి చేతులు పిరుదుల్ని రాజేంద్ర ప్రసాద్‌ తాకే దృశాలను ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 0.05 అడుగులు నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

8. ఏడు ఎనిమిది రీళ్ళలో రాజేంద్రప్రసాద్‌, సుహాసిని ముద్దులిచ్చుకునే దృశ్యాలన్ని ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 0.08 అడుగుల ఫిలిం కత్తిర పాలయింది.