19, నవంబర్ 2010, శుక్రవారం

లే మంజర్ మీ హీర్మనో చిత్రం లో సెన్సార్ అబ్యంతర సన్నివేసాలివీ...




రేపు సీమాంధ్ర బంద్‌

ఎసై్స రాతపరీక్ష వాయిదాపై నిరసనగా రేపు సీమాంధ్ర ప్రాంత బంద్‌కు సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది.
తెలంగాణ వాదుల ఒత్తిడికి తలొగ్గి ఎస్ఐ రాతపరీక్షలు వాయిదా వేయడం రాష్ట్ర ప్రభుత్వ నైతిక ఓటమికి నిదర్శనమని...ప్రభుత్వ చేతగాని తనంతోనే ఈ నిర్ణయం తీసుకుందని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకుని యథావిధిగా పరీక్ష జరిగేలా చూడాలని సీమాంధ్ర జేఏసీ డిమాండ్‌ చేసింది.

ఎంతో మంది నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలపై ప్రభుత్వం నిళ్లుజల్లడం అన్యాయమని ..వేర్పాటువాదులు చేసే ఉద్యమానికి లొంగిపోయి నిరుద్యుగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. సీఎం రోశయ్యను తక్షణం పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు

ఇది వాయదాల ప్రభుత్వం

ఎస్ఐ పోటీ పరీక్షలు వాయిదా వేయడం వెనుక ముఖ్యమంత్రి కె.రోశయ్య, హొం మంత్రి సబితా ఇంద్రారెడ్డిల ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె.ఎర్రన్నాయుడు.

ఎన్టీఆర్ భవన్'లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లా డుతూ ఎస్ఐ పోటీ పరీక్షను వాయిదా వేసి, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.

ఈ ప్రభుత్వంలో ఏ సమస్యలూ పరిష్కారం కావని ... వాయదాల పద్దతే దేనికైనా ... అన్న తరహాలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు ఎర్రన్న...

సోనియా గాంధీ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలి

ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి మన దేశంలోనే వుందని.. అవినీతికి మన దేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా తీసుకోవచ్చునన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

సాక్షాత్తు కేంద్ర మంత్రులు,రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి తెలిసే కుంభకోణాలు జరుగుతున్నాయని.... సోనియా గాంధీ, సీఎం రోశయ్య ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

సినీ నటి జమునకు కనకాభిషేకం

20న సాయంత్రం 6 గంటలకు అనంతపురం లోని లలితకళాపరిషత్‌లో ‘అష్టమ కళా మహోత్సవం’ నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వరం వెంకటేశ్వర్లు అన్నారు.

ఈసందర్భంగా అతిథిగా విచ్చేస్తున్న అలనాటి ప్రఖ్యాత సినీ నటి జమునకు కనకాభిషేకం చేస్తునామని.. అలగీ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను స్థానిక కళాకారులచే ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రాష్ట్ర రైల్వే పోలీసు పటిష్టంకి 836 పోస్టులు

రాష్ట్ర రైల్వే పోలీసు విభాగానికి కొత్తగా 836 పోస్టులను మంజూరు చేస్తూ హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సివిల్ విభాగంలో 500, ఆర్మ్‌డ్ రిజర్వు(ఏఆర్) విభాగంలో ఆరు ప్లటూన్లకుగాను 336 పోస్టులను కేటాయించారు.

అవగాహన లేకనే 'హర్ష' అలాఅన్నాడు

పోలవరానికి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ హెచ్చరించారు.

రాక్‌ఫిల్ డ్యామ్‌పై అవగాహన లేకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ మార్చాలని ప్రతిపాదిస్తున్న అమలాపురం ఎంపీ హర్షకుమార్‌కు పూర్తి అవగాహన లేదని డిజైన్ మార్పు జరిగితే తాము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు

తెలంగాణ బీసీలకు ఏ పదవులు ఇస్తారో చెప్పండి...

బీసీలను రాజకీయంగా అ ణగదొక్కుతున్న టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు తమకు ప్రథమ శత్రువని బీసీ ఐక్య సంఘర్షణ సమితి నాయకు లు దుయ్యబట్టారు.

బీసీ ఐక్య సంఘర్ష ణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వెల్ది చక్రధర్.. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ...తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎస్సీలకు ముఖ్యమంత్రి, ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ అంటున్నారని, 55శాతం బీసీలకు ఏ పదవులు ఇస్తారో తేల్చి చెప్పాలని అన్నారు..కేసీఆర్ మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మభ్యపెడుతూ రాజకీయంగా పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు.

పోలిసుల పహరా నడుమ ఓయూ

విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు మౌన ప్రదర్శనకు దిగారు. విద్యార్థులు నోటికి నల్లగుడ్డ కట్టుకుని రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు.

కాగా ఓయూ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎనిమిది కంపెనీల బలగాలు పహరా కాస్తున్నాయి.

పోలవరంపై ఉన్న శ్రద్ధ..ఫ్రీ జోన్ పై ఏదీ?

ముఖ్యమంత్రి రోశయ్య, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు...ఇద్దరూ కూడ బలుక్కుని హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ గా చేయాలని చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, శాసనసభ్యుడు హరీశ్‌రావు ఆరోపించారు.

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించి, తెలంగాణ యువత ఉద్యోగాలను కొళ్లగొట్టే యత్నాలను తిప్పికొడతామన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య పోలవరం ప్రాజెక్టుపై చూపుతున్న శ్రద్ధ 14(ఎఫ్) క్లాజ్ తొలగింపుపై చూపడం లేదని ఆయన విమర్శించారు.