పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలనే డిమాండుతో అ సెంబ్లీ బడ్జెట్ సమావేశాల ను బహిష్కరిస్తామని ఎమ్మె ల్యే రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకుగాను పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఏకమై సమావేశాలను అడ్డుకునేందుకు సహకరించాలని కోరారు. కేం ద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజే పీ సహకారంతో టీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తూ తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించాలన్నారు.
కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలతో టీఆర్ఎస్ బలోపేతానికి కృ షి చేయడం మానుకొని, అందరితో క లిసి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ముందుకు రావాలన్నారు. సోనియా, జగన్‌తో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని ఆరోపించారు. అవసరమనుకున్నప్పుడు 91 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ముందుకెళ్తుందని,. కేసీఆర్ 11మంది ఎమ్మెల్యేతో అ విశ్వాసం పెడితే, అందుకు టీడీపీ మద్దతు పలికే ప్రసక్తే లేదన్నారు.
14, ఫిబ్రవరి 2011, సోమవారం
కాంగ్రెస్ భూస్థాపితమవడం ఖాయం : గద్దర్
ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే వరకు తెలంగాణవాదులంతా సంఘటితంగా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ అ ధ్యక్షుడు గద్దర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలో 24 రోజులుగా సాగిస్తున్న రిలే నిరాహార దీక్ష దీక్షలో కూర్చున్న పద్మశాలీ సంఘం నాయకులకు సంఘీభావం తెలిపారు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియా మౌనం వీడి, ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పె ట్టకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఆటా పాటతో అలరించారు.
సర్కారుని కాపాడే ‘ఆపదాంధవుడు”ని నేనే : చిరు
రాష్ట్ర సర్కారుని కాపాడేందుకే తాను ఆపదాంధవుడి అవతారం ఎత్తానని... ఆ క్రమంలోనే ప్రజాభిష్టం మేరకే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీ నం చేయా లని నిర్ణయించానని తాజా కాంగ్రెస్ నేత చిరంజీవి చెప్పారు.
సోమవారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ... తన అభిమానులకు, తనకు అంతరాన్ని పెంచేందుకు కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు పనికట్టుకుని తప్పుడు కధనాలు ప్రసారం చేస్తున్నాయని.. వీటిని ఎవ్వరూ నమ్మవద్దని అన్నారు.
కొందరు తమకున్న ధనం బలంతో విర్రవీగుతూ కొత్తగా పార్టీ పెట్టేందుకు సిద్దమై పోతున్నారని.. వారికి తన ప్రజారాజ్యంకి వచ్చినన్ని ఓట్టు కానీ, సీట్లు కానీ తెచ్చుకో గల సత్తా ఉందా? అని అన్యోపదేశంగా జగన్‌ని ప్రశ్నించారు.
ప్రజారాజ్యం పార్టీలో తన కార్యకర్తలు, అభిమానుల అండతో ఎదిగిన నాయ కులు ఇప్పుడు తననే విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తునని అన్నారు చిరంజీవి.

కాంగ్రెస్‌కి జీవం పోసిన కుటుంబాన్ని నెట్టేసారు...
జగన్ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు ఆయనపై అభాండాలు వేస్తున్నారని, వాటికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఎవరెన్ని కుయుక్తులు పన్నినా జగన్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు అంబటి రాంబాబు. కాంగ్రెస్ అవసాన దశలో ఉన్న కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీకి జీవం పోస్తే ఆయన మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ బయటకు నెట్టివేసిందని ఆరోపించారు.
కేసిీఆర్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతానంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని , ఒక పత్రిక యాజమాని, మరో ఛానల్ అధినేత, ఇతర పార్టీల వారు ఏకమై జగన్‌పై లేనిపోని అపవాదులు వేస్తూ ద్రుష్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

మార్చి నెలలో ‘మనపార్టీ” వచ్చేస్తోందోచ్.... : జగన్
వైఎస్ సమాధి వద్ద తమ పార్టీని ప్రకటిం చబోతున్నట్టు కడప మాజీ ఎంపి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. సోమ వారం ఆయన బద్వేల్ లో మీడియాలో మాట్లాడుతూ... తన తండ్రి వైఎస్ జన సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ప్రతి పధకాన్ని తుంగలో తొక్కుతూ నిధుల పేరిట మురగేసిందని.. దీంతో విద్యార్ధుల నుండి లక్షలాది ప్రజలు తగిన ప్రభుత్వ సాయం అందక బిక్కు బిక్కుమని కాలం వెల్లదీయాల్సిన పరిస్ధితి నెలకొందని విమర్శించారు.
ఫీజు రీఎంబర్‌స మెంట్‌కింద చెల్లించాలిన బకాయిలు చెల్లించడానికి కూడా మనస్కరించకుండా విద్యార్ధులని ఆత్మహత్యలకి పురిగొల్పుతున్న ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేసినా తప్పులేదని వాఖ్వానించారు.
మార్చి నెలలో తమ పార్టీ వైఎస్ పాదాల చెంత ఆవిష్కరింపబడబోతోం దని... పేదల సంక్షేమం కోరే వైఎస్ ఆశయాలు ముందుకు తీసు కెళ్లాలని కోరుకునే ప్రతి ఒక్కరు తనతో కలిస రావాలని సూచించారు.
మళ్లీ వైఎస్ స్వర్ణయుగ పాలనని మనమే తెచ్చుకుందాం.. ముఫై ఏళ్లు ఈ రాష్ట్రాన్ని మనమే పాలించుకుని సుసంపన్నం చేసుకుందాం.. అంతా తనతో చేతలు కలపాల్సిందిగా ప్రజల్ని కోరారు జగన్,.

జగన్‌కి తెలంగాణా జేఏసీ మద్దతు
హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన దీక్షకు తెలంగాణ ప్రజసంఘాల జేఏసీ మద్దతు ప్రకటించింది.
సోమవారం జేఏసీ కన్వీనర్ గజ్జెల కాంతం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ జగన్ చేపట్టనున్న దీక్షకు విద్యార్థులు వేలాదిగా తరలి రావాలని.. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా ఫీజులు చెల్లించరా.. సర్కార్ నాన్చుడు ధోరణి అవలంభిస్తే 24న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని...తెలంగాణా వాదానికి, విద్యార్ధుల భవిష్యత్‌కి ముడి పెట్టి మాట్లాడటం తగదని... భవిష్యత్ అంతా విదార్ధులు, యువతదేనని.. ఓ వైపు చెపుతూనే.. ప్రభుత్వం వారిపై నిర్లక్ష్యదోరణి ప్రదర్శిసూందని ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజుల్ని చెల్లించేందుకు తగురీతిన స్పందించట ం లేదు సరికదా.. ఇంజనీరింగ్ కళాశాలలు మూసేసామని చెప్పడంతో విద్యారులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మిన్నకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజసంఘాల జేఏసీ కన్వీనర్ గజ్జెల కాంతం మండిపడ్డారు.

అవిశ్వాసం ఎదుర్కొనటానికి మేం రడీ : డిఎస్
ప్రభుత్వంపై తెరాస అధినేత కేసీఆర్‌తో సహా ఎవరు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టినా ఎదుర్కొనటానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు పిసిసి ఛీఫ్ డి.శ్రీనివాస్.
సోమవారం ఆయన హైదరాబాద్ - గాంధీ భవన్‌లో మీడియాలో మాట్లా డుతూ.. బలంగా ఉన్న ప్రభుతాన్ని కొందరు అస్ధిర పరచాలన్న యుక్తులు చేస్తు న్నారని ఆరోపించారు. వారి ప్రయత్నాలు ఫలించవన్న విషయం వారికీ తెలిసి నా..కేవలం అయోమయం సృష్టించాలనే ఇలా ప్రకటనలు చేస్తున్నారనిపిస్తోం దన్నారు. అవిశ్వాసం నిజంగా ప్రవేశ పెడితే.. జగన్‌కి చెందిన శాసనసభ్యులతో సహా మిత పక్షాలు తమకు మద్దతు ప్రకటిస్తారని.. ధీమా వ్యక్తం చేసారు డి.ఎస్.
మరోవైపు తెలంగాణా ఉద్యోగ జెఎసీ సహాయ నిరాకరణలో పాల్గొనటం వల్ల సామాన్య ప్రజలు సైతం ఇక్కట్లపాలవుతారని ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే ఉదోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమా ర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెపారాయన.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)