6, నవంబర్ 2010, శనివారం

వారికి సొంత జండా కన్నా కేసీ ఆర్ ఎజండాలే ముఖ్యం

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటిస్తున్న అజెండాను మోయటానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు పోటీపడుతున్నారని, వారికి స్వంత అజెండాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఎద్దేవా చేశారు.

సనివారం అయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31 పూర్తయ్యాక రాష్ట్రం ఏమైపోతుందోననే భయాందోళన
కన్నా... తమ రాజకీయాలు ఏమైపోతనో అనే భయం పట్టుకోందని...శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక ఏదైనా..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ ప్రక్రియ ద్వారానే జరగాలని, ఈ పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టటం మంచిది కాదని, దీని వల్ల తెలంగాణకే నష్టం జరుగుతుందని చెప్పారు.

వెంకటేష్ 'నాగవల్లి' చిత్రం లోగోని ఆవిష్కరణ

మానాయుడు స్టూడియోలో సీక్వెల్'గా విక్టరీ వెంకటేష్, ప్రియమణి, విమలారామన్ కధానాయక నాయకులుగా నటిస్తున్న వస్తున్న 'నాగవల్లి' చిత్రం లోగోని ఆవిష్కరించారు. కన్నడ చిత్రం 'ఆప్తమిత్రయే'ని తెలుగులో తిరిగి నిర్మించారు.

ఈ చిత్రంలో హీరోగానటించారు. ఈ సినిమాకు దర్శకుడు పి.వాసు, నిర్మాత బెల్లంకొండ సురేష్, మాటలు పరుచూరి బ్రదర్స్, పాటలు చంద్రబోస్.

ఈ నెల 16 పాటలు విడుదల కానున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తారు.

ఆ రెండు తప్ప.. రాయల్ తెలంగాణాకి ఒకే ...

ఇప్పటికే హైదరాబాద్ని ప్రత్యెక రాష్త్రం చేయాలన్న డిమాండు గ్రేటర్ మంత్రులు వినిపిస్తూ0టే... మరో వైపు కాంగ్రెస్ ఎంఎల్ ఎ లు ఇందుకు విచిన్నంగా వ్యవహరిస్తున్నారు... ముఖ్యంగా ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మరో అడుగు ముందుకేసి రాయల్ తెలంగాణకి జై కొట్టారు...

ఐతే తెలంగాణలో మొత్తం రాయలసేమని కలిపేందుకు తను వ్యతిరేకమని చెపుతూనే... అనంతపురం, కర్నూలు జిల్లాలను మాత్రమే తీసుకుంటామని చెప్పారు. కంటోన్మెంట్ ఎంఎల్ శంకర్‌రావుకు హోంమంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందంటేనే మద్దతు ఇస్తాను' అని కేఎల్ఆర్ ప్రకటించడం చర్చనీయంసమవుతోంది

తెరాసలో బ్లాక్‌మెయిలర్లు మిగిలారు : దేశం

టిఆర్ఎస్ పార్టీలో నుంచి నిజమైన తెలంగాణవాదులంతా బయటకు పోయి బ్లాక్‌మెయిలర్లు మిగిలారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు.

ఇప్పుడు కెసిఆర్‌ కోరుకునే బ్లాక్‌మెయిలర్లు, పదవులను ఆశించేవారు..రాజకీయ లబ్ధిని కోరుకునే వారే ఇప్పుడు తెరాసలో ఉన్నారని విమర్శించారు అయన... తెలంగాణా వస్తే స్నాకు ఇబ్బందులు తప్పవని భావిచీ... తెలంగాణా ఏర్పాటు చేతికి అందివచ్చిన ప్రతి దశలోనూ కెసిఆర్ ప్రవర్తన వల్లే వెనక్కు దని విమర్శించారు .

కేవలం తన కుటుంబ వ్యాపారాలను పెంచుకోవడానికి తెలంగాణ ఒక సాధనంగా ఆంధ్రావారిని భయపెట్టి బ్లాక్‌మెయిల్ చేసి వారితో బలవంతంగా వ్యాపార భాగస్వామ్యాలను తీసుకోనేందుకే వాడుకున్నారని... ఇది కాకపోతే తెలంగాణా జిల్లాలలో ట్రాక్టర్ల డీలర్‌ షిప్పులు, ఇతర వ్యాపారాలు ఆయన కుటుంబానికి ఎక్కడ నుంచి వచ్చాయి' అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

కెసిఆర్‌కు దమ్ముంటే పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌తో బిల్లు పెట్టించాలి. ఏ ప్రాంతమనే దానితో నిమిత్తం లేకుండా లోక్‌సభలో టిడిపికి ఉన్న మొత్తం ఆరుగురు ఎంపీలు దానికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్తున్నా.. బిల్లుకి మద్దతు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పారి పట్టించుకోని కెసిఆర్ తమ పార్టీ నేతలని ఉసిగొలిపి... చంద్రబాబు పర్యటనలు అడ్డు కొంటు న్నారని విమర్శించారు ఎ ర్రబిల్లి ,

తెరాస నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి.. మాలమహానాడు డిమాండ్

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ దినోత్సవం నేపద్యంలో గీతారెడ్డి నివాసంపై దాడి చేసిన వారిపట్ల ఎస్సీ, ఎస్టీ అత్యాచార, దాడుల నిరోధక చట్టం కింద కేసులు ఎందుకు పెట్టకూడదో హరీష్‌రావు సమాధానం చెప్పాలని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజి డిమాండ్ చేశారు.

సనివారం అయన మీడియా తో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడితే దళితులను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ దళిత మంత్రి నివాసంపై ఎవరి అనుమతితో దాడికి దిగి వస్తువులు, ఫర్నిచర్ దంసం చేసారో చెప్పాలని డిమాండు చేస్సారు..

తమ పార్టీ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు వెంటనే మంత్రి గీతారెడ్డికి క్షమాపణ చెప్పాలని కారెం శివాజి డిమాండ్ చేశారు

అసలు టిఆర్ఎస్కి తెలంగాణ రావాలని లేదు

నిజంగా తెలంగాణా ఏర్పాటు కోసమే పుట్టామని చెప్పుకునీ టిఆర్ఎస్ పార్టీకి అసలు తెలంగాణ రాష్ట్రం రావాలని లేదని, అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మాని టిడిపిపై పడుతోందని తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర నేత ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు..

తెలంగాణ వచ్చేస్తే ఇక తమకు పని ఉండదని వారి భయం. అందుకే కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవడం లేదు. దాని బదులు ఆ పార్టీతోనే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణలో టిడిపిని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది అన్నది అక్షర సత్యమని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారాయన.

తెలంగాణ ఇచ్చేది...తెచ్చేది తామేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. టిఆర్ఎస్‌ను అడ్డుపెట్టుకొని నాటకం తుంటీ... రాకుండా తామే ఆపామని సీమాంధ్రలోని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఇందులో ఏది నిజమని ఆయన ప్రశ్నించారు..కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ తన వైఖరిని వెల్లడించలేదని... టిఆర్ఎస్ వ్యవహారం చూస్తుంటే
కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడింది ' అని వ్యాఖ్యానించారు ముద్దు కృష్ణమ.

ఒబామాకు రేపు భారత్ లో దీపావళి

భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదివారం ముంబై పిల్లలతో కలిసి దీపావళి వేడుకలలో పాల్గొంటారు. ఆ తరువాత వ్యవసాయ ప్రదర్శనను తిలకిస్తారు.

రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో విందుకు హాజరవుతారు.

సోమవారం ఉదయం భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్'తో కీలకమైన చర్చలు జరుపుతారు. సాయంత్రం పార్లమెంట్'లో ప్రసంగిస్తారు. సోమవారం రాష్రపతి ప్రతిభా పాటిల్ ఇచ్చేలో ఒబామా హాజరవుతారు.

హైకోర్టు బెంచ్ ఏర్పాట్లపై స్పంది0చిన సిఎం

గత కొంత కాలంగా పలు ప్రాంతాల నుంచి వినిపిస్తున్న హైకోర్టు బెంచ్ ఏర్పాటున్న డిమాండ్‌లపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి రోశయ్య స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి సమీక్షించి నివేదిక సమర్పించాలని న్యాయశాఖ కార్యదర్శిని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పధాన కార్యదర్శి సీఎస్వీ ప్రసాద్ శనివారం నోట్ జారీ చేశారు.

మన మహా నగరంలో ఇవి సర్వసాధారణ దృశ్యాలు























సేకరణ : కరెంట్ వీక్ నుంచి

మీరు చూడని 'సచిన్'











మాతృ ప్రేమ మాధుర్యం గొప్పది..







ఇటీవల్ జైపూర్ లో ... తన సుపుత్రుడిని వెంట పెట్టుకొని వెళ్తున్న కోతికి అనుకూని అవాంతరం.. రోడ్ దాతే సమయంలో... ఓ వాహనం చిన్న కోతిని గుద్దేయటం... గాయాలపాలైన ఆ కోతి పిల్లని ఓ సునక రాజు నోట చేజిక్కించుకోవాలని చూడటం... పట్టువదలని కోతి... కుక్కపై దడి చేసి తరిమి కొట్టడం ఊ ఫోటో గ్రాఫర్ కి చిక్కి..

మానవత్వం మరచి... కన్నవాళ్ళ నే చెత్తకుప్ప లో పడేస్తున్న వల్లకిది కను విప్పు కావాలి...
మాతృ ప్రేమ మాధుర్యం తెలుసు కోవాలి.

ఈ యాడ్ సూపర్ గురూ...

ఈ బైకులు కొనాలంటే లక్షలు కావాల్సిందే ...








బాబు వల్లే.. రాష్టంలో ఈ వరదలు.. ఉప్పెనలు వస్తునయత

ఒబామా బృందానికి ఘన స్వాగతం


అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌లో మూడురోజుల పర్యటన నిమిత్తం భార్య మిషెల్లితోపాటు శనివారం మధ్యాహ్నం ముంబాయికి చేరుకున్నారు. మహారాష్ట్ర సీఎం అశోక్‌చవాన్, మంత్రి సల్మాన్ ఖుర్షిద్ తదితరులు ఒబామా బృందానికి స్వాగతం పలికారు. ఒబామా వెంట 200 మంది సీఈవోలతో సహా 3000 మంది ప్రతినిధులు ఉన్నారు

ఒబామా భారత్ పర్యటన నేపథ్యంలో ముంబై నగరం అంతటా పోలీసుల పహారతో నిండిపోయింది. ఎటు చూసినా పోలీసుల మయమే. ఒక విధంగా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది.

'వైట్‌హౌస్' పరివారం తరలి రావటంతో వారి బస కోసం తాజ్ హోటల్‌లోని దాదాపు 800 రూములను బుక్ చేశారు.

ప్రైవేటు ఆపరేటర్లకు దీటుగా బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్‌లో 'ఫైబర్ టు ద హోం (ఎఫ్‌టిటిహెచ్)' సేవలు ప్రారంభమయ్యాయి. ముందస్తుగా హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సేవలను త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. దీంతోపాటు... ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతోన్న పోటీని దీటుగా ఎదుర్కొనే క్రమంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్ కొడితే చాలు...బిఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ మన ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు.

దరఖాస్తు నింపడం దగ్గరనుంచి అతనే చూసుకుంటాడు. ఈ క్రమంలో కొత్త కనెక్షన్లను కావాలంటే... 94000 54141 నంబరుకు కాల్ లేదా బిబి అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపడం కానీ చేయవచ్చు. ఇక ఎఫ్‌టిటిహెచ్ అందుబాటులోనికి రావడంతో మరెన్నో టెలికాం సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. వాయిస్, డాటా, వీడియో తదితర సౌకర్యాలను ఎఫ్‌టిటిహెచ్ ద్వారా వినియోగదారులు పొందవచ్చు. ఆప్టికల్ ఫైబర్ సర్వీస్ (ఒఎఫ్‌సి) ద్వారా ఎఫ్‌టిటిహెచ్ సేవలనందిస్తారు.