16, నవంబర్ 2010, మంగళవారం

ఫ్రీజోన్‌ తేల్చే వరకు పరీక్షలు ఆపండి

ఫ్రీజోన్‌ అంశాన్ని తేల్చే వరకు ఎస్సై రాత పరీక్షను నిర్వహించరాదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.
తమ సోదరుల ఉద్యోగాలు వేరొకరు ఆక్రమించు కొంటున్నారని తెలంగాణలోని లక్షలాదిమంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ఫ్రీజోన్‌ అంశంపై సిఎం మాట్లాడకపోవడం బాధాకరమని కేసీఆర్‌ అన్నారు.

15 రోజుల్లోగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని ఏదంటే తమ సత్తా చూపించేందుకు యావత్ తెలంగాణా రాష్ట్ర యువత సిద్దంగా ఉందన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నవరత్న అవార్డు

కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నవరత్న అవార్డును ప్రదానం చేసింది. కంపెనీ సీఎండీ బిస్నాయ్‌కి కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్‌ ఈ అవార్డును అందజేశారు.

‘నవరత్న’ హోదాతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశంతో పాటు పలు ప్రయోజనాలు ఉంటాయి.

కేసీఆర్ని రాళ్లతో కొట్టి తరమటం ఖాయం

డిసెంబర్ 31 త ర్వాత కేసీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి ఉద్యమించాలని, లేదంటే ఆయన పదే పదే చెప్పినట్లు రాళ్లతో కొట్టి తరిమే ఘటన చవిచూడాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి హెచ్చరించారు.

టీడీపీ ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని, వాటిని కార్యకర్తలు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ..కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని అధినేత చంద్రబాబు చెబుతున్న మాట కేసీఆర్, కేకేల భేటీతో నిజమైందన్నారు.

తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ కుటుంబం తమ జాగీరుగా భావిస్తోందని అలాంటి ఆటలు ఇక ముందు సాగనివ్వమని... తెలంగాణ కోసం దేశం కార్యకర్తలు గళం వి ప్పి ఉద్యమిస్తారని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కి వినతి ఇస్తా..

ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అనుమతి లేని సభలో ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొని నినాదాలు చేశాడని, గవర్నర్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకులు సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు.

పోలీస్ ఉత్తర్వులను అతిక్రమించి ధర్నా చేస్తుంటే.. ముఖ్యమంత్రి పక్కన ఉన్నవారందరిని పోలీసులు అరెస్టు చేశారని, రోశయ్యకు ఎందుకు అరెస్టు చేయలేదని దీనిపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 9న ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉండే ఎన్‌డీఏ సభ్యులంతా కలిసి జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ కోసం ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.

తెలంగాణాకోసం తెగించి పోరాడేందుకు సిద్ధం కావాలి

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే తెలంగాణ ప్రజల బాధలు తీరి, న్యాయం జరుగుతుందని...రాష్ట్రం ఏర్పాటుకు ఆదినుంచి కాంగ్రెస్, టీడీపీలే అడ్డంకిగా మారాయని టీఆర్ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ అన్నా రు.

ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రాంతం అన్నివిధాలా వివక్షకు గురైందని ...తెలంగా ణ ప్రాంతానికి ఆడుగడుగున అన్యా యం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలను తెలంగాణ నాయకులు వీడి ఉ ద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు..
కేంద్రం ఇచేసిన తెలంగాణాని ఆంధ్ర పాలకులు కుమ్ముక్కై మూకుమ్మడి రాజీనామాలు చేసి అడ్డుకోన్నారని అందువల్లే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైందని ...శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకు అనుకూలంగా లేకపోతే తెగించి పోరాడేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చా రు

తూలుతూ... కాసులు కురిపిస్తున్న దాబాలు

జాతీయ రహదారిపై దాబాలలొ ఎక్కువ శాతం చీఫ్ లిక్కర్ అమ్మకాలు కొనసాగుతు కాసులు కురిపిస్తునడటంతో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రతి చోటా అక్రమ సిట్టింగులు కొనసాగుతున్నాయి. ప్రతి నిత్యం పో లీసులతో సహా ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులు ఈ రహదారులపై తిరుగుతూన్నా వీటిపై దాడులు జరిగిన ఆనవాళ్లు లేవు.

దాబాల్లో మద్యం విక్రయాలు చేయవద్దు. అక్రమ సిట్టింగులకు ఎలాంటి అనుమతి లేదు. అని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నా దాడులు చేసిన సందర్భాలు అరుదే.. దీంతో లారీ డ్రైవర్లు మద్యం తాగుతూ వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు..

రాజకీయ ఒత్తిళ్లు.. దాబాల నిర్వాహకులు ఎక్సైజ్ సి బ్బందికి నెలనెలా మామూళ్లు పం పడం వల్లే వారు చూసీచూడనట్లు వ్య వహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులకు లొంగని వాళ్లను రాజకీయ ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని పేరు చె ప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.

ప్రధాన మంత్రి ఎందుకు నోరు విప్పరు

లక్షా 75 కోట్లు అవినీతిలో కుంభకోణంలో 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతి అరోపణులు ఎదుర్కొంటు టె లికాం మంత్రి ఎ.రాజాపై జేపీసీతో వి చారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని తప్పించేందుకే రాజీనామా చేసానని రాజా వ్యాఖ్యానించడంలో అంతర్యమేంటిని ప్రశ్నిం చారు ప్రధాన మంత్రి ఎందుకు నోరు విప్పరన్నారు.

ఆంధ్రలో అవినీతిలో కూరుకు పో యిన కళింకిత మంత్రులపై కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.

మొహిలీతో ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం ఖాయం

ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలనే డిమాండ్‌తో ప్రజలు, రైతులు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉద్యమం చేపట్టాల్సి న అవసరం ఆసన్నమైందని మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పి లుపునిచ్చారు.

శ్రీకృష్ణ కమిటీలో జలవనరుల అంశం కోసం నియమించిన సీడబ్ల్యూసీ సభ్యుడు ఏడీ మొహిలీ గోదావరి జలాలపై ఏక పక్షంగా తెలంగాణకు అనుకూలంగా నివేదించబోతున్నారని ... అందులో భాగంగానే తమ వాదనల్ని అసంతృప్తిగానే విన్నారని చెప్పారు.

పోలవరం, ద మ్ముగూడెం ప్రాజెక్ట్‌లు తెలంగాణ, ఆం ధ్రాలకు ఉపయోగపడతాయని చెప్పినపుడు సైతం దమ్ముగుడెం తెలంగాణకు ఉపయోగపడదని ఆయన ప్రకటించడం ఆందోళన కలిగిస్తుంది. పోలవరం నిర్మిస్తే హైడల్ ప్రాజెక్ట్ ప్రయోజనం కలుగుతుందని చెప్పినపుడు సీలేరు, మాచ్‌కండ్ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ సరిపోతుందిలే అని చెప్పిన మొహిలీ మాటలు ఆంధ్రా ప్రాంతానికి అ న్యాయం చేసే విషయం అర్ధమవుతుందని శ్రీనివాస్ తెలిపారు.

కర్రీ తో ...వర్రీ.. బోలెడు

ఎన్నడూలేని విధంగా కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలలో కూరలు ఉడకడం లేదు. పొయ్యిపై దాక పెట్టి కూరవండే పరిస్థితి లేనప్పుడు తాలింపు ఊసేముంది.. మొత్తంగా పేద వర్గాలలో కూరలు వండుకోవడం మానుకునే పరిస్థితి దాపురించింది.
వారాంతపు సంతలో కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలను చూపించాయి. కూర వండుకునే పరిస్థితి కనిపించకపోవడంతో...ఇంటిలో తయారు చేసుకు న్న కూరకంటే కర్రీ పాయింట్ నుంచి కొనుగోలు చేసిన కూరకే తక్కువ ఖర్చు అవుతుం డటంతో కర్రీ పాయింట్లకు డిమాండ్ పెరిగింది. కర్రీ పాయింట్ల నుంచి రూ.5లు సాంబారు, రూ.10లు కూర కొనుగోలు చేసుకుని పూట గడిచింది అనిపిస్తున్నారు.

ఏ. రాజా రాజీనామాకు రాష్టప్రతి ఆమోదం

కేంద్రమంత్రి ఏ. రాజా రాజీనామాను రాష్టప్రతి అమోదించారు. నిన్న రాత్రి రాజా అందచేసిన రాజీనామా పత్రాన్ని ప్రధాని మన్మోహన్ సూచన మేరకు రాష్టప్రతి ప్రతిభాపాటిల్ వెంటనే ఆమోదించారు.

నిన్నటి వరకు రాజా నిర్వహించిన కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖను అదనపు శాఖగామానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్‌కు కేటాయించారు.

ఓ మంత్రి రూ.15 కోట్లు లంచం అడిగాడు

డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించడానికే రూ.15 కోట్లు ఇవ్వాలని ఓ మంత్రి పరోక్షంగా అడిగారని సంచలన ఆరోపణలు చేసారు ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ..

'21వ శతాబ్దంలో భారత్: అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై జరిగిన చర్చలో టాటా మాట్లాడుతూ "భారత్‌లో దేశీ విమానయాన సర్వీసును ప్రారంభించాలని భావించా. ఇందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాను. వైమానిక రంగంలోకి ప్రవేశించాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని, 1995, 1997, 2001 సంవత్సరాల్లో మూడుసార్లు సంబంధిత ఫైల్‌ను కదిపానని.. మూడు ప్రభుత్వాల హయాంలో ముగ్గురు ప్రధాన మంత్రులను కలిశాం. కానీ, మంత్రి రూ.15 కోట్లు ఇవ్వాలని మా ప్రయత్నాలన్నిటినీ అడ్డుకున్నారు. అందుకే మేం వైమానిక రంగంలోకి అడుగు పెట్టలేకపోయాం. రూ.15 కోట్లు లంచం ఇచ్చి దేశీ వైమానిక రంగాన్ని ప్రారంభించానని అనుకుంటే నేను నిద్రపోలేను'' అని ఆయన వివరించారు.

అయితే, ఆ మంత్రి ఎవరన్న విషయాన్ని మాత్రం రతన్ టాటా బయటపెట్టలేదు.