1, ఫిబ్రవరి 2011, మంగళవారం
రంజిత రాసలీలల వ్యవహారం నా భక్తులు పట్టించుకోలే...
ప్రపంచవ్యాప్తంగా తనకు కోటి మంది భక్తులు ఉన్నారని తనపై సినీనటి రంజిత రాసలీలల వ్యవహారం పూర్తిగా కట్టుకథ .. నీచమైన ఆరోపణలు వచ్చినప్పటికీ భక్తులు పట్టించుకోవడంలేదని నేటికీ లక్షల సంఖ్యలో తమ ఆశ్రమానికి వస్తూనే ఉన్నారని... ఇప్పటికీ ఇంటర్నెట్‌లో తానే అందరికన్నా పాపులర్ గురువునని నిత్యానంద చెప్పుకున్నారు.
చిరంజీవినీ ముంచేస్తుంది
కాంగ్రెస్, ప్రజారాజ్యంల సహజీవనం ఎప్పటి నుంచో
ఇతర పార్టీలోని పరిణామాలతో తమకు సంబంధం లేదని, తమ పని తాము చేసుకొంటూ పోతామని ఆయన చెప్పారు. ఒకరి కోసం అవిశ్వాసాలు పెట్టాల్సిన అవసరం తమకు లేదని...తమ వ్యూహం ప్రకారం తాము ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలోని అనిశ్చితితో మొత్తం రాష్ట్రం నష్టపోతోందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
'కెసిఆర్ తాతలు బొబ్బిలిలో ఏం పేడ తిన్నారు?
అవన్నీ పేడేనా? కెసిఆర్ తాతలు వలస వచ్చినట్లే అనేక మంది చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇక్కడకు సీమాం«ద్రులే రాలేదు. తెలంగాణ ప్రజలు సహృదయులు...నిస్వార్ధపరులని, వారి మనసులను కెసిఆర్ విషపూరితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పీఆర్పీ అంటే 'పీపుల్ రిజక్టెడ్ పార్టీ
రోజా తననైనా తిట్టగలదని జగన్ గ్రహిస్తే మంచిది
ఫీజు రీయింబర్స్‌మెంట్ కి పైసా కూడా విడుదల కాలేదన్న జగన్
పదవుల కోసమే పీఅర్పీని కాంగ్రెస్‌కు తాకట్టు
గంగూలీకి అస్సాం యూనివర్సిటీ డాక్టరేట్
చార్మీ 'గబ్బర్ సింగ్'ని ఒప్పిస్తుందట
కత్తిలాంటి ఫిజిక్ అంటూ నాగార్జున ఇచ్చిన కాంప్లిమెంట్స్ చార్మిలో ధైర్యాన్ని నింపాయి కాబోలు ఏకంగా పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లో ఐటెం పాట కోసం లాబియింగ్ మొదలెట్టింది. హిందీ మాతృక 'దబంగ్'లో 'మున్ని బద్నాం' పాటకు దేవిశ్రీ ప్రసాద్ తెలుగు ట్యూన్ కడుతుంటే, మలైకా అరోరా ఖాన్ స్టెప్పులను చార్మీ నిశితంగా పరిశీలిస్తూ పవన్ కళ్యాన్ని పడగొట్టే పనిలో ఉంది. పవర్ స్టార్ పక్కన నర్తించే అవకాశం దొరికితే అదృష్టం తలుపులు తీసినట్టేనని చార్మీ అప్పుడే తన పాత ప్రియుడు దేవికి బ్రోకర్ పనులు అప్పజెప్పిందట.
తుపాకీ నుంచి
కోర్టులో జడ్జీలకు మల్లికా షెరావత్ డ్యాన్స్ నచ్చింది
అయిదేళ్ళు కోర్టులో కేసు నడిచి, ముసలి జడ్జీలు పదేపదే అదే వీడియోను వందల వేల సార్లు చూసేసరికి మల్లికా ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే మల్లికా చేసిన నృత్యంలో ఏ మాత్రం అశ్లీలత లేదని తమ విచారణలో తేలినట్టు ఓ జడ్జిమెంటు ఇచ్చేసారు. వినోద్ మాత్రం జడ్జీలకు ఈమె రికార్డింగ్ డ్యాన్సులు నచ్చాయేమో కానీ మల్లికాను వదిలేది లేదు అంటూ వీడియోను హై కోర్టు న్యాయముర్తులకు చూపిస్తానంటూ ముంబై హై కోర్టులో మళ్ళీ ఓ పిటీషన్ దాఖలు చేసాడు.
తుపాకీ నుంచి
బుడ్డోడిని బురిడి కొట్టిస్తారట
ఈజిప్టు రాకుమారి పాత్రలో నటిస్తున్న ఈ 'చిట్టెమ్మ మొగుడు' డాక్టరమ్మకు కెమెరా ముందు మొహమాటపడే గుణమే లేదు కనక దర్శకుడు మెహెర్ రమేష్ ఏ రెంజులో ఈ ఆంటీని ఆడేసుకున్నాడో అనే గుసగుసలు మొదలయ్యాయి. పూజాకి తోడు ఇలియానా తాజా అందాలు కూడా ఏడాది గ్యాపు తర్వాత అంగట్లో పెట్టేస్తోంది కాబట్టి 'శక్తి'కి ఈ ఇద్దరు అసలైన శక్తి కానున్నారని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే బుడ్డోడిని బురిడీ కొట్టించే సత్తా వీరిలో ఉందంటే అభిమానులు ఊరుకుంటారా?
తుపాకీ నుంచి
వాళ్ల ముఖాలకు బిర్యానీ చేయడం వచ్చా?
రాష్ట్రంలో రాజకీయ అంత్యాక్షరి సాగుతోంది : రోజా
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి తానే అనేక సలహాలిచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జగన్ వర్గం నేత, సినీనటి రోజా ముఖ్యమంత్రికి సూచించారు. సలహాలివ్వడం గొప్పతనం కాదని, కార్యక్రమాల్ని అమలు చేయడమే గొప్ప అని ఆమె అన్నారు. పేద ప్రజల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని అమలు చేశారని రోజా తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ గూడు కట్టుకున్నారన్నారు.
రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమౌతున్న ప్రజలకు మంచి నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అంత్యాక్షరి సాగుతోందని రోజా ఆరోపించారు. జగన్‌పై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు వంత పాడుతున్నాయన్నారు. పరిటాల హత్యకేసులో జగన్‌కు ఎలాంటి సంబంధంలేదన్న విషయం అందరికి తెలిసిందేనని అన్నారు.
రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కలిసిపోయి జగన్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. జగన్‌పై ఆరోణలు చేయకుండా ఏమైనా ఆధారాలుంటే చూపాలని ఆమె డిమాండ్ చేశారు.
బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1
రేలంగి, రమణారెడ్డి, నాగభూషణం, అల్లురామలింగయ్య, రాజబాబు వీళ్ళు తెరమీద కనిపించగానే (అంతకుముందు వారు నటించిన చిత్రాలు చూసి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుకున్న కారణంగా) పడీ పడీ నవ్వుతారు. వీళ్ళు విలన్ తరహా పాత్రలు చేసినా హావభావాలు కిసుక్కున నవ్వేటట్టు చేస్తాయి. ఈ కోవలోకి చేరినందుననే బ్రహ్మానందం కూడా తెరమీద కనిపించగానే ఏ డైలాగూ చెప్పక పోయినా నవ్వు వచ్చేస్తుంది. కొంటె చూపులు, తిక్కతిక్కగా వున్నట్టు కనిపించడం, వెంగళాయిలా ప్రవర్తించడం, పెదవులు బిగించడం, లేదా రెండు చేతులూ తలమీద పెట్టుకోడం, నడిచే తీరు, ఇతర మేనరిజాల వల్ల ప్రేక్షకులకు చచ్చినట్టు అంటూ నిజంగా చచ్చినట్టు కాదు అసంకల్పికంగా నవ్వేస్తారు, నవ్వుకుంటారు, నవ్వుతూంటారు.
ఇక డైలాగ్స్ కూడా పాత్ర స్వభావానికి అనుగుణంగా రూపొందినట్లైతే అవి పేలిపోయి, థియేటర్ని నవ్వులతో పేల్చేస్తాయి. పక్కవాళ్ళు భుజాలు నొప్పి పెట్టడం వల్లనో, వీపు మార్మోగడం వల్లనో బాధపడే సందర్భాలు, ఆ బాధని వచ్చే నవ్వులో మరచిపోవడాలు కామన్. ఇంకా బెమ్మానందంని చూసిన తరువాత కడుపునొప్పి వచ్చినా, పళ్ళు కటకటాడినా, పెదవిగాని, నాలుక గాని కొరుక్కోవడం వల్ల రక్తం చిందినా ఆ బాధలు తెలియడానికి కొంత టైమ్ పడుతుంది. తెలిసాక అనుభవించిన భోగం వల్ల బాధ అంతగా బాధించదు.
గతంలో కామెడీ ఆర్టిస్టులు అవసరం వుండేది సినిమాకి. జంధ్యాల ప్రారంభించిన కామెడీ చిత్ర యజ్ఞం ఊపు అందుకుని ఇ.వి.వి. సత్యనారాయణ, రేలంగి నరసింహారావు వంటి దర్శకులుతో మహాయజ్ఞంగా మారి కామెడీ కామెడీ ఆర్టిస్టులు అవసరం కాదు అత్యవసరం అనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏర్పడటానికి కారకుల్లో ఒకరైన బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1.