కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశం, రాష్ట్రంలో అవినీతి పెరిగిందని ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు విమర్శించారు. హద్దుల్లేకుండా పెరిగిపోతున్న అవినీ తి ప్రభావం అన్ని రంగాలపై పడుతు ందన్నారు. అవినీతి తారాస్థాయికి చేరి న నేపథ్యంలో దీనిపై టీడీపీ ప్రజల్లో విస్తృత స్థాయి చర్చకు తెర తీసిందన్నారు.
14, ఆగస్టు 2011, ఆదివారం
శోభన్ బాబు సూచన మేరకు పెట్టుబడులు
భూమిని నమ్మి నష్టపోయినవారుండరని సినీనటుడు, బిల్డర్ మురళీమోహన్ చెప్పారు తాను ఇతర వ్యాపారాల్లో నష్టపోయినట్లు చెప్పారు. సినీనటుడు శోభన్ బాబు సూచన మేరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలు గణించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ది చెందుతున్న నగరాల్లో గుంటూరు ముందువరుసలో ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే వందల రెట్లు లాభాలు వస్తాయని చెప్పారు.
సంస్కరణల చాప చుట్టేశారు
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు సంస్కరణలను పంచకళ్యాణిలా పరుగులు తీయించింది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకంటే ఎంతో ముందు నిలిచింది. అందుకే, ప్రపంచ బ్యాంకుకు చాలా ముద్దొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి రంగంలో, ప్రతి శాఖలో తలదూర్చి తన విధానాలతో శాసించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకు మన రాష్ట్రం చేదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం తదుపరి దశ సంస్కరణలకు అనుకూలంగా లేదని, రాజకీయ అనిశ్చితితో పాలన గాడి తప్పుతోందని భావిస్తోంది.
ఏపీతో కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ మూడో ఆర్థిక సంస్కరణల రుణం అమలు తీరుపై ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికను తయారు చేసింది. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. గతంలో అప్పులు ఇచ్చినప్పుడు తాము పెట్టిన షరతులను సరిగా అమలు చేయడంలేదంటూ ఈ నివేదికలో వాపోయింది. టెండర్ల విధానాన్ని సంస్కరించే ప్రొక్యూర్‌మెంట్ బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదని పేర్కొంది.
"ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినప్పటికీ... అది ఆమోదిస్తారనే నమ్మకం లేదు. ప్రాథమిక విద్యారంగంలో టీచర్ల నియామకంపై చేసిన సూచనలను కూడా పట్టించుకోలేదు. రుణ ఒప్పందం షరతులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు'' అని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. తమ షరతుల్లో ఎంతో కీలకమైన విద్యుత్ రంగంలో పూర్తి స్థాయిలో సంస్కరణలు తేవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది.
"విద్యుత్ సరఫరా, పంపిణీ రంగాల్లో పలు మార్పులు తెచ్చినప్పటికీ... సబ్సిడీలతో ఆ రంగం కుదేలైపోతోంది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని మేం చెప్పినా అమలు చేయలేదు. వ్యవసాయ విద్యుత్ రేట్లను పెంచలేదు. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న సూచననూ బేఖాతరు చేశారు. రాజకీయ కారణాలు చూపుతూ మా సలహాలను తోసిపుచ్చుతున్నారు'' అంటూ ప్రపంచ బ్యాంకు ఆక్రోశం వెళ్లగక్కింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ మూడో దశను నిలిపివేసిందని కూడా ఆరోపించింది.
ఆహార భద్రత పేరుతో ఇస్తున్న బియ్యం సబ్సిడీ ఇంకా పెరుగుతుందని, బోగస్ కార్డులను తొలగించినా ప్రయోజనం లేకుండా పోతోందని తెలిపింది. ఈ కారణాలను చూపిస్తూ... ఇక నుంచి రాష్ట్రానికి నేరుగా ఎలాంటి రుణాలివ్వాల్సిన అవసరం లేదని తేల్చేసింది. తాము విధించిన షరతులను అమలు చేయడంలేదంటూనే... రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి మాత్రం తామే కారణమని ప్రపంచ బ్యాంకు చెప్పుకొంది. వైద్య, విద్యా, ఆర్థిక రంగాలతోపాటు ఇతర అన్ని రంగాల్లో రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందిందంటే.. అది తామిచ్చిన రుణాల పుణ్యమేనని అభిప్రాయపడింది.
"రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోపాటు ప్రభుత్వ శాఖల్లో పరిపాలనాపరంగా, విధానాలపరంగా మేం సూచించినట్లుగా సంస్కరణలు తెచ్చి, తాము ఊహించినదానికంటే ఎక్కువ చర్యలను చేపట్టడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ఎంతో పురోగతి సాధించింది. వైఎస్ మరణంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పెరిగి, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితి 2014 వరకు, ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంది'' అని నివేదికలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పురోగతి ఎంతో బాగున్నా... అవినీతిని బహిర్గతం చేసే విజిలెన్స్ నివేదికలను శాసన సభకు సమర్పించడంలో ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించింది.
మరీ ముఖ్యంగా... ప్రొక్యూర్‌మెంట్ చట్టాన్ని తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదో అర్థం కావడం లేదని, రాజకీయ కారణాలేమిటో అంతుబట్టడం లేదని పేర్కొంది. "ప్రగతిశీల రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగడం బాధాకరంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర ప్రదేశ్‌కంటే ఇతర పేద రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించడం సబబుగా ఉంటుంది. అందుకే... రాష్ట్రానికి ఇకపై రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ రాష్ట్రానికైనా ఒక్క ఆర్థిక సంస్కరణల రుణాన్ని మాత్రమే ఇస్తాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కు మూడు రుణాలను ఇచ్చాం'' అని పేర్కొంది.
అన్నీ అమలు చేశాం: ఆర్థిక శాఖ
ఆర్థిక సంస్కరణల రుణాల ఒప్పందాల్లో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేశామని ప్రపంచ బ్యాంకుకు ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది. నివేదికలో పేర్కొన్న అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పుష్పా సుబ్రహ్మణ్యం ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ రాబర్ట్ జఘాకు లేఖ రాశారు. ప్రపంచ బ్యాంకు రుణంలోని సింహభాగాన్ని అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చుకోవడానికి వాడుకున్నట్టు తెలిపారు. ఆ నిధులను విద్య, ఆరోగ్య రంగాల్లో ఖర్చు చేసినట్టు తెలిపారు. ఎఫ్ఆర్‌బీఎం చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు నుంచి రెవెన్యూ మిగులు సాధనతోపాటు ద్రవ్య లోటును కూడా తగ్గించుకున్న విషయాన్ని వివరించారు.
"ఉచిత విద్యుత్ ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాం. ప్రణాళికా సంఘం సూచించినట్టుగా విద్యుత్ సబ్సిడీకి ప్రత్యామ్నాయ మార్గాలపై అంతర్జాతీయ జల నిర్వహణ సంస్థతో కలిసి ఒక అధ్యయనం చేస్తున్నాం. విద్యా రంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీక రణ విషయంలో అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నాం. భూ సంస్కరణలను అమలు చేశాం. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం కోసం సెజ్‌లను ప్రోత్సహించాం'' అని పుష్పా సుబ్రమణ్యం ప్రపంచ బ్యాంకుకు తెలిపారు.

భారవి 'ఆదిశంకర'లో నాగార్జున
భారవి 'ఆదిశంకర'లో నాగార్జున అక్కినేని నాగార్జున అదృష్టమేమో... కొన్ని అద్భుతమైన పాత్రలు ఆయననే వరిస్తున్నాయి. గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలను పోషించి, తాజాగా షిరిడీ సాయిబాబా పాత్రను కూడా ధరించనున్న నాగార్జునకు, ప్రముఖ రచయిత జె.కె.భారవి మరో అద్భుతమైన పాత్రను ఆఫర్ చేశారు. ఆయన డైరెక్ట్ చేస్తున్న 'ఆది శంకర' సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించడానికి నాగార్జున అంగీకరించారు. ఆది శంకరుని జీవితాన్ని మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషించిన ఓ మాస్ పాత్రను నాగార్జున పోషిస్తున్నారు. ఈ సినిమా కథ విని, ఇంతవరకు తీసిన రషెస్ చూసి ఇన్స్ పైర్ అయిన నాగార్జున ఈ పాత్ర చేయడానికి యాక్సప్ట్ చేశారు. ఈ సినిమా మూడో షెడ్యులు త్వరలో మొదలవుతుంది. |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)