7, ఫిబ్రవరి 2011, సోమవారం

సిఎంకి ధైర్యముంటే స్పష్టంగా ఆ పాటలు పాడాలి...

పోలవరం పొడవు చెపితే సిఎం సీటు ఇస్తామంటూ రాష్ట్ర మంత్రి డి.ఎల్‌ రవీంద్రారెడ్డి చేసిన వాఖ్యలపై జగన్‌ వర్గం ధీటుగా స్పందించింది. సోమవారం జగన్‌ హరిత యాత్రలో పాల్గొన్న అంబటి రాంబాబు పాత్రికేయులతో మాటాడుతూ... మంత్రి డిఎల్‌ ఇనాళ్లు వైఎస్‌ని విమర్శించి పదవిలోకి వచ్చాడని... ఇంకా ఏదో సాధించుకోవాలనే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ని విమర్శించడం ప్రారంభించాడని... ఇలాంటి చచ్చు, పుచ్చు మాటలకు జనం ఎవ్వరూ పడిపోరన్న విషయాన్ని గుర్తెరగాలని విమర్శించారు. సరిగా తెలుగురాని వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ నిలపడం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం... కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ధైర్యముంటే వందేమాతరం, జగనణమన గీతాలు అక్షరం పొల్లు పోకుండా పాడాలని సవాల్‌ విసిరారు.

మరోవైపు నిన్న తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తు వైఎస్‌ హయాం అంతా అవినీతి మయం అని చిరంజీవి విమర్శిస్తున్నా... నాటి వైఎస్‌ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు ఎవ్వరూ స్పందించకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. చిరంజీవితో క్షమాపణలు చెప్పిసారో? లేక తమ పదవులకు రాజీనామాలు సమర్పించి వైఎస్‌ పట్ల గౌరవాన్ని చాటుకుంటారో వారే నిర్ణయించుకోవాలని డిమాండ్‌ చేసారు అంబటి.

మా విలీనం చూసి ‘బాబు’ భయపడుతున్నారు : చిరు

పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ విలీనం కావటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి భయం పట్టుకుందని... అందుకే విమర్శలకు తనపై దిగుతున్నారని తాజా కాంగ్రెస్‌ నేత చిరంజీవి ఆరోపించారు. సోమవారం ఆయన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని కలసిన అనంతరం మీడియాలో మాట్లాడుతూ.... విలీనంపై ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోమని ఆ అవసరం కూడా తమకు లేనే లేదని స్పష్టం చేసారు. ప్రజలకు క్షమాపణలు చెప్పి తిరిగి ఎన్నికల్లో పోటీకి దిగాలంటూ సిపిఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యపై “సీరియస్‌” కానవసరలేదన్నారు. తమ విలీనం చూసి ఎందరో భయపడుతున్నారని... రాష్టంలో పునాదులు కూడా సరిగా లేని బిజేపీ కూడా మాట్లాడితే ఎలా? అన్నారు. వారు ఏనాడో అసిత్వం కోల్పోయిన పార్టీ అని గుర్తెరగాలని సూచించారు. కాంగ్రెస్‌ అధినేతి సోనియా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా నెలవేరేందుకు తానెప్పుడూ సిద్దంగా ఉన్నానని చెప్పారు చిరంజీవి.

ఆ పని చేస్తే... కేసీఆర్‌ కూడా విలీనానికి రడీ....

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ఈ క్షణంలో తెలంగాణా ప్రకటించి ఆ ప్రక్రియను ప్రారంభిస్తే తెలంగాణా రాష్ట్రసమితిని కేసీఆర్‌ విలీనం చేయటానికి సిద్దంగా ఉన్నారని నిజమాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కీ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో కలిసేందుకు కేసీఆర్‌ ఇప్పటికే తన వైఖరి సుస్పష్టంగా ప్రకటించారని... అది తెలంగాణా రాష్ట్రం మాత్రమేనని అన్నారు.

ప్రజారాజ్యంని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయటం వల్ల తెలంగాణాలో కన్నా సీమాంధ్ర ప్రాంతంలోనే తమ పార్టీ ప్రయోజనాలు ఎక్కువగా పొందుతుందన్నారు.ఇక మున్ముందు కాంగ్రెస్‌ నేతగా అధిష్టానం నిర్ణయాలకు చిరంజీవి బద్దుడై వ్యవహరిస్తారన్న నమ్మకం తమకుందని... ఆయనతో కల్సి పనిచేయటానికి ఎలాంటి అభ్యంతరం లేదని యాష్కీస్పష్టం చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని ... తెలంగాణాపై త్వరిత గతిన కేంద్రం నిర్ణయం ప్రకటించాలని తాను మొయిలీని కోరినట్లు చెప్పారాయన

విలీనానికి ఇక తెరాసనే తరువాయి : దేశం

హైదరాబాద్‌ : రాష్ట్త్ర రాజకీయాల్లో మరోమారు కాంగ్రెస్‌ శాసనసభ్యుల కొనుగోళ్లకు తెరలేపిందని... తరువాత అస్త్రం తెరాసపైనేనని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. సోమవారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ మీడియాలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీల విలీనం చారిత్రాత్మకం అని చిరంజీవి, మొయిలీ చెప్పుకుంటున్నారని... అయితే దీని వెనుక చారిత్రిక ఒప్పందాలు కూడా బైటకు చెప్పాలని డిమాండ్‌ చేసారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే పోరాటానికి సిద్దమని చెప్పిన చిరంజీవి తన శక్తి చాలట్లేదని.. అందుకే కాంగ్రెస్‌తో కలిసానని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారాయన. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను హోల్‌ సేల్‌ ధరలో అమ్మేందుకు బేరం కదుర్చుకున్న చిరంజీవిని కాదని ఇద్దరు ఇప్పటికే జగన్‌ వెంట నడిచారని... ఇక తరువాత అస్త్రం తెరాసపైనేనని కాంగ్రెస్‌ నేతలు ప్రకటనలు చేస్తున్నారని... జగన్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా 2014 నాటికి జగన్‌ని కూడా కాంగ్రెస్‌ పంచన చేర్చేందుకు ఇప్పటినుండే కొందరు ప్రయత్నిస్తున్నామని చెపున్న విషయం గమనించాలని అన్నారు.

విలీనంపై వివరణకు ‘చిరు” భారీ బహిరంగ సభ

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందో ప్రజలకు సాధారణ కార్యకర్తలకు వివరించేందుకు త్వరలోనే ఓ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసున్నట్లు తాజా కాంగ్రెస్‌ నేత, మాజీ రాజ్యసభ సభుడు సి.రామచంద్రయ్య ప్రకటించారు.

సోమవారం ఆయన నూఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.... ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనానికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని... సోనియాతో భేటీ విశేషాలను వివరించేందుకు తమ పార్టీకి చెందిన నేతలు, శాసనసభ్యులతో రేపటి నుండి రెండ్రోజుల పాటు ప్రత్యేక సమావేశాన్నిఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారాయన.


పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు చాలా మందికి ఇష్టంలేదంటూ మీడియాలో వచ్చిన కధనాలు వాస్తవం కాదని...తమ పార్టీలో ఒకరిద్దరు తమ అభిప్రాయాలు చెప్పారని... అయినా మెజార్టీ సభ్యుల నిర్ణయం మీదే చిరంజీవి పార్టీని విలీనానికి అంగీకరించారని స్పష్టం చేసారు రామచంద్రయ్య.

కాంగ్రెస్‌ నేతలకి మెంటలెక్కింది... : జూపూడి

జగన్‌ పెడుతున్న పార్టీని ఎలా ఎదుర్కొనాలో అర్ధంకాని కాంగ్రెస్‌ నేతలకు మెంటల్‌ వచ్చినందునే ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్నారని... ఇక ఆ పార్టీ ఉన్నా లేనట్లేనని జగన్‌ వర్గ నేత, కాంగ్రెస్‌ పార్టీ ఎమెల్సీ జూపూడి ప్రభాకరరావు వాఖ్యానించారు. సామాజిక న్యాయం చేస్తామంటూ పుట్టుకొచ్చిన చిరంజీవివి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసేందుకు గత ఎన్నికల తరువాత నుండే చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయని అన్నారు.


ఉప్పెనలా జగన్‌ వెంట నడుస్తున్న జనవాహినిని చూసి కాంగ్రెస్‌ పార్టీ బెంబేలెత్తి పోతోందని... రాష్టంలో కాంగ్రెస్‌ పార్టీని నిలదొక్కుకునేందుకు అవకాశాలు ఏమాత్రం లేనేలేవని... ఇక రాష్ట్రం ఏకధాటిగా పాలించే పార్టీ జగన్‌ పార్టీయేనని జోస్యం చెప్పారు. చిరంజీవివినే కాదు ఏ శక్తులని కాంగ్రెస్‌ వినియోగించినా జగన్‌ ముందు బలాదూర్‌ అన్నారు జూపూడి.

పోలవరం పొడవు చెప్పి సిఎం సీటు తీస్కో

పోలవరం కుడి కాలువ పొడవెంతో చెపితే జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తామని కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన హరిత యాత్రపై రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని కోరుతూ జగన్ పాదయాత్రపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఏ నదిమీద ఉందో కూడా తెలియని జగన్‌.పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాలన్న లక్ష్యమే గానీ ప్రజా సమస్యలు పట్టవని.. ముఖ్యమంత్రి పదవి కోసం... తండ్రి అంత్యక్రియలు పూర్తికాకముందే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేపట్టిన ఘనుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు.

కడప జిల్లాలోనే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరిగితే ఆ లెక్కే వేరన్నారు. జగన్ వద్ద ఓటర్లను, నేతలను కొనేందుకు డబ్బు ఉందన్నారు. కడప, పులివెందులకు జరిగే ఉప ఎన్నికలను రెఫరెండంగా స్వీకరించలేమని.. ఈ ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి సందేహం లేదన్నారు. చిరంజీవి వల్ల తమకు కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగినా.. మొత్తంమీద ఎక్కువ లాభం చేకూరుతుందని డీఎల్ వ్యాఖ్యానించారు.

'చెప్పు'ల జాబితాలో చేరిన ముషారఫ్‌

ఈమధ్య ప్రపంచ వ్యాప్తంగా ప్రజా నేతలని చెప్పుకునే వారివి మీద చెప్పులు విసిరి సత్కరించే సంస్కృతి పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌పై కూడా చెప్పు సత్కారం జరిగింది. సోమవారం ఆయన లండన్‌లో ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చెప్పు విసిరి సత్కరించబోయాడు. అయితే అందరిలాగానే ముషారఫ్‌ కూడా ఈ సత్కారాన్ని అనూహ్యంగా తప్పించుకోవడం విశేషం.

సదరు చెప్పు విసిరి వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు తనదైన శైలిలో వివిచారణ చేపట్టారు. ఇప్పటికే ఇలా చెప్పును విసిరేయించుకున్న వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్‌, మన ప్రస్తుత కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

వైఎస్‌ హయాంలో అవినీతికి పోల’వరం”

తెలుగుదేశం పార్టీ వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతి వ్యవహరాలపై ప్రచురించిన ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌” పుస్తకంలోని ప్రతి అక్షరాన్ని ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు వల్లె వేస్తున్నారని... తెలుగుదేశం పార్టీ వాఖ్యానించింది. సోమవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... తన తండ్రి హయాంలోనే పోలవరానికి అంకురార్పణ జరిగిందని చెప్తున్న వైఎస్‌ జగన్‌ తాను పార్లమెంటు సభుడిగా ఉన్నపుడు ఏనాడు పోలవరం గూర్చి మాట్లాడలేదని... పైగా వైఎస్‌, కేవీపీ, జగన్‌లో జలయజ్ఞం ముసుగులో కోటుల దోచుకుని ప్రోజక్టు పనులు పూర్తి కాకుండా చేసారని... ఇప్పుడు పోలవరం అంటూ కేవలం రాజకీయాలు చేసేందుకే జగన్‌ పాదయాత్రలు చేసున్నాడని విమర్శించారు. రోశయ్య ప్రభుత్వ హయాంలో పనులేమీ జరగక పోయినా...500 కోట్ల బిల్లులు అప్పనంగా చేయించుకున్న ఘనుడు జగనేనని... ఆపై వారి మధ్య వాటాలు కుదరక పోవటం వల్లే అసలు విషయాలు ఇప్పుడే తెలినట్లు కాంగ్రెస్‌ నేతలు బైటకు తెస్తున్నారని వాఖ్యానించారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసుకుని చిరంజీవిని కేంద్ర మంత్రిని చేయాలంటూ వైఎస్‌ బతికున్నపుడ 5 పేజీల లేఖరాసాడని చెప్తున్న ఉండవల్లి దానిలోని ప్రతి అంశాన్ని ఎందుకు మీడియాకు వెల్లడించడంలేదని... ఆ లేఖ మేరకే అప్పట్లో జరిగిన ఒప్పందాలే... ఇప్పుడు తిరిగి సోనియా, చిరుల మధ్య జరిగి అమలుకు హామీ లభించాకనే రెండు పార్టీల విలీనం ఖరారైనట్టు కనిపిసోందని విమరించారు చంద్రమోహన్‌ రెడ్డి.

చిరుని పంచెలూడదీసి గొట్టమని పవన్‌ పిలుపు ఇస్తాడా? : కిషన్‌ రెడ్డి

కాంగ్రెస్ నేతల పంచెలూడదీసి కొట్టాలన్న తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ ఇపుడు అన్నయ్య పంచెలూడగొట్టాలని పిలుపు ఇవ్వాలని ఇస్తాడా? అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు కిషన్‌రెడ్డి సూచించారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పై పీఆర్పీ నిప్పులు చెరిగి ఇప్పుడు వారి పంచన చేరడం ఏమిటని ...కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి 18 సీట్లు గెలుచుకున్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారనిప్రశ్నించారు.

చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటును కూడా చెల్లించడం లేదని...ప్రభుత్వం వెంటనే ఫీజులు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చౌక్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్సుమెంటు చెల్లించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

చిరు నాకు పోటీ కాదు : విహెచ్‌

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం వల్ల కాంగ్రెస్‌లో మరింత సామాజిక న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ...ఇప్పటికే కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటిస్తుందని.. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరడం వల్ల మా బలం పెరగడమే కాకుండా నాయకత్వం కూడా పెరుగుతుందన్నారు.

సామాజిక న్యాయం కోసం వారు చిరంజీవిని ఎంతో నమ్ముకొని ఆయన వెంట ఉన్నారన్నారు. కాబట్టి వారికి సరియైన ప్రాధాన్యం కల్పించాల్సిన బాధ్యత చిరంజీవిపై ఉందని చెప్పారు. చిరంజీవి మీకు పోటీ అని భావిస్తున్నారా ? అని ఓ విలేకరి ప్రశ్నించగా ... నాకెవరూ పోటీ కాదని పార్టీలో మంచి బలం ఉందని వ్యాఖ్యానించారు

జగన్‌తో నష్టం కాస్త.. చిరుతో లాభంగా మారింది : బొత్స

కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడటం వల్ల కొంత నష్టం జరిగిందని, అయితే చిరంజీవి కలవడం వలన కాంగ్రెస్ ఎంతో లాభం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం పట్ల కొంతమంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ... విలీనం కావటం వల్ల రెండు పార్టీలకు లాభమని..పార్టీలో అందరినీ కలుపుకొని వెళుతామని చెప్పారు ప్రజారాజ్యం పార్టీకి రాష్టంలో వచ్చిన 18 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయింపు అవుతాయని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు.

‘దేశం” పట్టబ్రధుల ఎమ్మెల్సీలు వీరే...

చీరాల : పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం చీరాలలో విడుదల చేశారు.

అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కడప, అనంతపురం జిల్లాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకటస్వామిరెడ్డి

చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా హనుమంతరావు

విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా భాస్కరరావు

పోలవరం పూర్తి కాకపోతే రాష్ట్రం ఎడారే : జగన్‌

రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్‌గా మారిపోవాలంటే పోలవరం ప్రోజక్టు తప్పని సరిగా పూర్తి కావాలని మహా నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కలలు కన్నారని... దానిని సాకారం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు మాజీ కడప ఎంపి వైఎస్‌ జగన్‌. సోమవారం రావుల పాలెం నుండి తన హరిత యాత్రని ప్రారంభిస్తూ... పోలవరం వల్ల కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం జరిగి తెలంగాణా, కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బాగు పడతాయని... ఈ ప్రోజక్టు పూర్తి కాక పోతే రాష్టంలో అనేక జిల్లాలు ఎడారిగా మారిపోయే అవకాశముందని ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు గ్రహించి కేంద్రంపై వత్తిడి తెచ్చి జాతీయ ప్రోజక్టుగా నిధుల రప్పించేందుకు యత్నించాలని... కృష్ణా ట్రిబ్యునల్ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం సాధనకే తాను హరితయాత్రను చేపట్టానన్నారు.

తనతో పాటుగా పోలవరం సాధించేందుకు లక్షలాది రైతులు పాదయాత్ర చేసేందుకు సిద్దంగా ఉన్నారని... పోలవరంతో పాటు చేవెళ్ల, ప్రాణహితని కూడా పూరిత చేయాల్సిన అవసరముందని.. రైతుల ఆశలు ప్రభుత్వాలు తీర్చక పోతే నాశనమైపోతాయని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు వ్యాఖ్యానించారు జగన్‌.

పెద్దల ఆశీస్సుల కోసం హస్తినలొ ‘చిరు”బిజీ.. బిజీ...

న్యూఢిల్లీ : నిన్ననే పీఆర్పీ పార్టీకి మంగళం పాడేసి... నేటి నుండి కాంగ్రెస్‌ నేతగా మారిపోయిన చిరంజీవి ఇక ఢిల్లీ పెద్దల ఆశీస్సులకోసం బిజీ అయిపోయారు. ఈమేరకు ఆయన సాయంత్రం 4.30 గంటకు కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్‌. జైపాల్‌ రెడ్డిని కలుస్తుండగా... రాత్రి 8.30కి కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణాబ్‌ ముఖర్జి తదితరులను కలుస్తారు. మరో రెండు రోజుల పాటు హస్తినలోనే ఉండి అందరీన కల్సి రావాలన్న అభిలాషలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది.

తెరాస విలీనం ప్రశ్నే తలెత్తదు... : హరీష్‌

హైదరాబాద్‌: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయటమన్నది ఆరెండు పార్టీలకు సంబంధించిన వ్యవహరమని... అంత మాత్రాన తెలంగాణా రాష్ట సమితిని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దమవుతున్నట్టు వసున్న కధనాలను తెరాస శాసనసభుడు హరీష్‌రావు కొట్టిపారేసారు.

తెలంగాణా రాష్ట ఏరాటే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన తెరాస లక్ష్య సాధన నుండి కించత్‌ కూడా వెనకడుగు వేసే ప్రశ్న తలెత్తదని స్పష్టం చేసారు. తెరాస కూడా కాంగ్రెస్‌లో విలీనం అయ్యే సూచనలున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావుతో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు చేసున్న ప్రకటనలు కేవలం ప్రజల్ని అయోమయంకి గురి చేయటానికేనని.. అలాంటి ప్రశ్న భవిష్యత్‌లో కూడా తలెత్తబోదని వ్యాఖానించారు హరీష్‌రావు.

‘అసంతృప్త తెలంగాణా’ పార్టీ ఖాయం

కేసీఆర్‌ తెరాస లోని అసంతృప్త లోససి తో పాటు అన్ని పార్టీలలోని అసంతృప్త తెలంగాణా నేతలంతా కల్సి ఓ పార్టీని పెట్టుకునేందుకు సిద్దమైపోతు… అందుకు అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలరు రడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా లో తనదే పేటెంట్‌ అనే రీతిలో వ్యవహరిస్తూ…తెలంగాణా అంశాన్ని గాలికొదిలేసి ఇతర పార్టీల నేత ల్ని తెరాస వైపు మళ్లించి రానున్న ఎన్నికల నాటికి బలంగా రూపాంతరం చేసేందుకు చూపుతున్న శ్రద్దలో ఇసుమంత కూడా తెలంగాణా కోసం ఢిల్లీలో యత్నాలు చేయని కేసీఆర్‌ వైఖరిపై విసిగేసిన నేతలకు ఈ మధ్య సోనియాని విమర్శించి పార్టీని పొమ్మని పొలికేక పెట్టిన కాకా నాయకత్వం తోడు కావటంతో వీరంతా తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తులైన కడియం, నాగం, ఎర్రబిల్లి తదితరుల్ని కలుపుకు పోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

కేసీఆర్‌ని దెబ్బ కొట్టాలంటే అందుకు తెరాసలో అసంతృప్త నేతగా ఉన్న హరీష్‌రావుని దువ్వటంమే ప్రధానంగా భావించిన ఈ నేతలు ప్రస్తుతం ఆపనిలో ఉన్నారని, హరీష్‌ కూడా వీరి ప్రయత్నాలను అభినందిస్తూ.. అవసరమైతే తెరాసను వీడి వచ్చి పని చేసేందుకు సిద్దమేనని హామీ ఇవ్వటం జరిగిందని కధనాలొస్తుండటంతో…మరి కొద్ది రోజుల్లో ఈ ‘అసంతృప్త తెలంగాణా’ పార్టీ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుల భావన.

అందాలను ఆరబోస్తు.. కొవ్వు కరిగించుకుంటోందట


ఇండిస్టీలో దాదాపు చిన్న హీరోల నుండి సూపర్‌ స్టార్‌ల వరకు అందర్నీ చూసేసిన శ్రియాకి రజనీతో చేసిన శివాజీ దెబ్బతో బాలీవుడ్‌కి ఆపై హాలీవుడ్‌కి వెళ్లినా, ఆ బక్కపల్చని అందాలే శాపంగా మారి ఆశించిన ఫలితం వ్వకపోవటంతో గోడక్కొట్టిన బంతిలా దక్షిణాదికి వచ్చి పడింది. ఎలాగైనా హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేయాలని చేయని ప్రయత్నంలేదు. అడపాదడపా సినిమాలొస్తున్నా.. గార పళ్లేసుకుని నవ్వితే జనం భయపడిపోయేలా ఉన్న అమ్మడి వికారాలని చూస్తే..హీరోయిన్‌గా కన్నా నువ్వు ఐటమ్స్‌కే పనికొస్తావని డిసైడ్‌ చేసి పడేసారు మరికొందరు.

అయినా పట్టువదలని ఈ విక్రమార్కుడి చెల్లెలు.. తన అందాలను ఈ మధ్య నెట్లలో పెట్టాలని కోరుతూ తెగ ఫోజుల్విటం ఆరంభించేసింది. చెన్నై ఫ్యాషన్‌ వీకలోే శ్రియా చేసిన హడావిడి అటు ఫోటోగ్రాఫర్లకి, ఇటు నెటిజన్లకి కనువిందు చేసింద నటంలో సందేహంలేదు. మొత్తానికి శ్రియా తన అందాలను ఇలా ఆరబోస్తు.. కొవ్వు కరిగించుకుంటోం దన్నమాట అని సెటైర్లేస్లున్నారు సినీజనాలు…

మాలో మరో గ్రూప్ వచ్చి పడింది అంతే…

హన్సికకు ఇంకా వయసు రాలేదట!