23, జూన్ 2011, గురువారం
ట్రస్టు వ్యవహారాలపై జీర్ణించుకోలేక పోతున్న భక్తులు
సాయి ట్రస్టు అక్రమాలపై తాత్సారం
మంత్రులు ఆస్తుల వివరాలు వెల్లడించాలి
తన ఆస్తి వివరాలను జూలై 15వ తేదీ లోపల వెల్లడిస్తానని చెప్పారు. ఇందులో పెద్ద విశేషం ఏమీలేదని, మంత్రులు ఎవరెవరు ఎంత సంపాదించారు, లేక ఎంత పోగొట్టుకున్నారు అన్న విషయాన్ని వెల్లడిస్తే సరిపోతుందని మంత్రి పేర్కొన్నారు.
జూలై 2 లేదా 9 వ తేదీలలో మంత్రి వర్గ విస్తరణ?
కడపలో రూ. 10 లక్షల ఆభరణాల చోరీ
ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశానికి ఈనెల 30న నోటిఫికేషన్
గచ్చిబౌలిలోని ఐఐఐటీ ఆవరణలో గల యూనివర్సిటీ కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రవేశాల్లోని రిజర్వేషన్ల విధానాలపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించగా తాత్కాలికంగా ప్రవేశాలను నిలిపివేశామన్నారు.
అయితే న్యాయస్థానం ప్రభుత్వ ఆదేశాలకు లోబడి, ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈనెల 30న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు.
రాహుల్‌ను ప్రధాని కానివ్వను
మరో నిత్య పెళ్లికొడుకు?
నల్లధనం రప్పించడానికి ఉద్యమాలే శరణ్యం
ప్రధాన మంత్రి యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కేవలం పనికిమాలిన ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప, ఈ కేసులు విచారణకు ప్రభుత్వం వైపు నుంచి సహకరించటం లేదని, ప్రభుత్వంలోని పెద్దలు దిగ్విజయ్ సింగ్, కపిల్‌సింగ్ వంటి నాయకులు పౌర సమాజం ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లుకు కొర్రీలు పెడుతూ, అవినీతిని ప్రశ్నించిన వారిపై సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థలను ఉసిగోల్పుతున్నారని, ఈరోజు 2జి స్కాంపై జరుగుతున్న విచారణ కూడా బిజెపి పార్లమెంటును 25 రోజులు స్థంభింపజేస్తే తప్ప ఈ ప్రభుత్వం జెపిసి వెయ్యడానికి ఒప్పకోలేదని, ఆకారణంగానే 2జీ కేసు సుప్రీం ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతోందని ఆయన చెప్పారు.
వాదోపవాదాలు...ఘర్షణలతో...మరింత జాప్యం
ప్రొఫెసర్ జయశంకర్ మృతదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపిలు, ఎంఎల్‌ఏలపై తెలంగాణ వాదులు చేసిన దాడిని ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము చిత్తశుద్ధితో ఉన్నామని, తమ వాదనను గత వారం ఢిల్లీకి వెళ్లినపుడు అధిష్టానం ముందు తీవ్ర స్థాయిలో వినిపించామన్నారు. సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉఉందో..అక్కడే తీవ్ర స్థాయిలో తమ వాదనను వినిపించాలి తప్ప బహిరంగంగా ఢాంబికాలు, ప్రగల్భాలు పలకొద్దని ఆయన హితవు పలికారు. రెండు సమూహాలుగా విడిపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంతరాయం కల్గుతుందని, అలా ఆటంకపరిచే వారు కారణభూతులు అవుతారన్నారు.
ఇసుక మాఫియాకు మంత్రి ధర్మాన ప్రోత్సాహం
ఇసుక మాఫియాపై ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావాలని లేకపోతే భూగర్భజలాలు అడుగంటక తప్పదని విమర్శించారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలోనే పాఠశాల భవనాలు ఎక్కువగా మంజూరు అయ్యాయని, వాటికి ప్రస్తుతం అధికారులు, కాంగ్రెస్ నాయకులు సున్నాలు వేస్తూ, మంత్రిధర్మాన ప్రసాదరావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాల భవనాలలో నాణ్యత లేదని, అధికార యంత్రాంగం నిఘా కరువైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోవడం వల్ల దోపిడీ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు.
తిరుమలలో మొరాయించిన రోటీ యంత్రాలు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రోటీ యంత్రాలు మొరాయించాయి. దీంతో ఉత్తర భారతదేశ భక్తులు రోటీలు లేక ఇబ్బంది పడ్డారు. ఈ యంత్రాలను ఉత్తర భారతదేశం నుంచి కాకుండా పొరుగునే ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి కొనుగోలు చేశారు. నూతన అన్నదాన భవనంలో జూలై మొదటి వారం నుంచి భక్తులకు రోటీలతో కూడిన భోజనాన్ని పూర్తి స్థాయిలో అందించాలని టిటిడి నిర్ణయించింది. అయితే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఈ యంత్రాలు చెడిపోయాయి. రోటీల తయారీలో పేరెన్నిక గన్న ఉత్తర భారతదేశ యంత్రాలు తేకుండా ఏమీ తెలియని పొరుగు రాష్ట్రం నుంచి తేవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని సిబ్బంది అంటున్నారు.
మాతృ భాషలోనే మాటామంతీ మంచిది!
మాతృదేశము కన్న మాతృ భాష కన్న
మధురమైనదేది మానవులకు!
స్వర్గమైన నేమి సౌఖ్యమ్ము లొనగూర్చు
తల్లి కన్నతల్లి భాష కన్న!
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనీ, దేశ భాషలందు తెలుగులెస్స అనీ గొప్పపేరు తెచ్చుకున్న తేనెలొలికే తెలుగు భాష తెలుగువారి చేతనే నిరాదరణకు గురి అవుతుంటే తెలుగు బాషాభిమానులకు చాలా బాధ కలుగుతోంది. తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినందువల్ల ఏమి ఒరిగింది? చాలామంది తెలుగువాళ్లు తెలుగులో మాట్లాడడం చిన్నతనంగా భావిస్తూ ఇంట్లోవాళ్లతో, బంధువులతో స్నేహితులతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. అది ఒక గొప్ప ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడడమే నిజమైన సంస్కృతీ ఫ్యాషనూ అని తెలుసుకోవడం లేదు వాళ్లు పాపం!
వీళ్లు పిల్లల్ని కూడా తెలుగులో మాట్లాడవద్దనీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడమనీ నూరిపోస్తున్నారు. అందువల్ల ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి తెలుగుమాటలు అర్థం కాక ''అంటే ఏమిటీ'' అని అడుగుతున్నారు. మమ్మీ, డాడీ అని పిల్లల చేత పిలిపించుకుంటూ చాలా మోడ్రర్న్ వాళ్లమని మురిసిపోతున్నారు తెలుగు తల్లితండ్రులు! అమ్మ, నాన్న అనే పిలుపులో ఉన్న మాధుర్యమూ, ఆప్యాయతా వీళ్లకి తెలియడంలేదు.
ఇప్పటి పిల్లలే కదా భావిపౌరులు? వీళ్లకి తెలుగురాకపోతే రాబోయే కాలంలో తెలుగుభాషే వినపడకుండా పోతుందేమోననీ తెలుగు క్రమంగా అంతరించిపోతుందేమోననీ భయం కలుగుతోందంటే అతిశయోక్తి కానేకాదు. ఈ ఇంగ్లీష్ పిచ్చి తెలుగువాళ్లకి ఉన్నంతగా మన దేశంలో ఇతర రాష్ట్రాల వాళ్ల కెవరికీ లేదు. వాళ్లు వాళ్ల మాతృభాషలలోనే మాట్లాడుకుంటారు.
ఈ మధ్య ఒక సినీ కవిగారు అన్నారుట ''నలుగురైదుగురు కూర్చుని ఆపకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారంటే వాళ్లు తప్పకుండా తెలుగువాళ్లే అయి ఉంటారని తెలుస్తుంది అని''.
ఇక్కడ షాపుల వాళ్లకి కూడా ఇంగ్లీష్ మోజు ఎక్కువే! వాళ్లు ఇంగ్లీష్ మాట్లాడుతూ వచ్చిన కస్టమర్లకిచ్చే అతి గౌరవం తెలుగులో మాట్లాడేవాళ్లకివ్వరనిపిస్తుంది.
ఈ ధోరణిని అరికట్టాలంటే, ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడడం మొదలుపెట్టిన వాళ్లతో ఏమాత్రం సందేహించకుండా గట్టిగా ''ఏం? మీకు తెలుగు వచ్చుకదా ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు?'' అని మన నిరసనని వాళ్లకి బాగా తెలియచెయ్యాలి. అలా వాళ్లకి చెప్పడం ఏమీ తప్పుకాదు. తప్పకుండా అందరూ నిర్భయంగా చెప్పాలి కూడాను.
ఎప్పుడైనా తెలుగుమాట సరైనది స్ఫురించకపోతే ఇంగ్లీష్ మాటలు ఉపయోగించడం ఏమీ తప్పుకాదు.
తెలుగు భాష అంతరించిపోకుండా ఉండాలంటే తెలుగు భాషాభిమానులు అందరూ పెద్దఎత్తున ఉద్యమం చేపట్టాలి. తెలుగు భాషను కాపాడుకోవాలి. తప్పకుండా చివరిగా ఒక మాటఏమిటంటే -ఇంగ్లీష్ భాషను ద్వేషించవలసిన అవసరమెంత మాత్రమూ లేదు. అది గొప్ప ప్రపంచ భాష? అందరూ తప్పకుండా నేర్చుకుని ప్రావీణ్యత సంపాదించవలసిన భాష? అందుకేమీ సందేహం లేదు.
--శ్రీమతి కె.హైమవతీ శాస్త్రి
27న మార్కెట్లోకి ఎతియోస్ లివా
'కాకా' పట్టడమూ ఆరోగ్యమే!
ఆఫీసులో మీ బాసు తెగ ఇబ్బంది పెడుతున్నారా? దీంతో అనవసర ఆలోచ నలు చుట్టుముట్టి మీ ఆరోగ్యం చెడిపో తోందా? అయితే ఖచ్చితంగా మీరు కాకా పట్టడం నేర్చుకోవాల్పిందే... మీరు ఆరో గ్యంగా ఉండాలంటే కాకాయే ఉత్తమం అని నిపుణులు నిరారిస్తున్నారు కాబట్టి.
కొందరికి మనుషుల్ని కాకా పట్టి తమ పనులు చేయించుకోవటం అంటే మహా సరదా... అంతెందుకు ఆఫీసుల్లో బాసుల్ని కాకా పట్టి సెలవు సంపాదించ డమో... తోటి ఉద్యోగుల్ని కాకా పట్టి తాము చేయాల్సిన పనిని చేయించుకోవ టమో తరచూ మనం చూస్తుంటాం. పై అధికారులేమంటారో అని కొందరు... వారి వేధింపులకు గురై మరికొందరు మానసిక వేదనలకు గురై తీవ్ర అనారోగ్యం పాలవు తున్నారని వీరికి మనుషుల్ని కాకా పట్ట డం తెలియకనే అని జర్నల్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ ప్రకటించింది. చైనా, అమె రికా లకు చెందిన పలువురు నిపుణు లు దాదాపు 5 ఏళ్ల పాటు చేసిన వివిధ సర్వేలలో తేలిన రిపోర్టును ప్రచురిస్తూ... నిత్యం బాసులని కాకా పడుతూ తిరిగేవారు ఆనం దకర జీవనాన్ని గుడుపుతున్నారని... బాస్ సహచరం, ఆశీస్సులు ఉన్నట్లు ముద్ర పడ్డవారి వైపు సహోద్యోగులు కూడా తొం గి చూసేందుకు భయపడతారని సర్వేలో వెల్లడైంది. బాస్‌ని కాకా పట్టిన వారంతా ఎలాంటి ఆందోళనా లేకుండా తమ విధు లను నిర్వహిస్తు ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంది. మరింకేం... మీరూ మీ బాస్‌ని కాకా పట్ట డం నేటి నుండే ప్రారంభించండి....
శ్రీవల్లి తన్మయ్
త్వరలో యాహు పాఠాలు...
పారిపోయిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్
సర్కస్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్ హీరో. ఒక విగ్రహానికి ఆయన దండ వేసే సన్నివేశం చిత్రీకరణకు ఏర్పాట్లు జరిగాయి. ఆ విగ్రహంకి పక్కన ఏర్పాటు చేసిన నిచ్చెన ఎక్కి పూలదండ వేయాలి ఎన్టీఆర్. ఆర్ట్ డిపార్ట్ మెంట్ వారు ఆ ఏర్పాట్లు చేసారు.
''షాట్ రెడీ'' అని డైరక్టర్ దాసరి నారాయణరావు అనగానే ఎన్టీఆర్ నిచ్చెన ఎక్కుతున్నారు. కొన్ని మెట్లు ఎక్కాక ఒక అడ్డుమెట్టు విరిగింది. ఎన్టీఆర్ దఢాల్న కింద పడ్డారు. ఆ చప్పుడుకు అందరూ కంగారు పడిపోయారు. విషయం తెలుసుకున్న ఆర్ట్ డిపార్ట్ మెంట్‌కి చెందిన సభ్యులంతా తుపాకీ దెబ్బకు దొరకని వారై ఆచూకీ తెలీకుండా పారిపోయారు.
ఎన్టీఆర్ లేచి నిలబడ్డారు.
ఎవర్నీ ఏమీ అనలేదు. అడగలేదు.
ఏమీ జరగనట్టుగా ''నారాయణరావుగారూ నెక్ట్ ్స సీన్ ఏమిటి?'' అన్నారు కూల్‌గా. ఇంకెవరయినా అయివుంటే ఎంత హడావుడి జరిగేదో కదా అనిపిస్తుంది. అనిపించడమేమిటి చాలా గందరగోళం హడావుడి, ఉరుకులు పరుగులు వుండేవి.
ఎన్టీఆర్‌తో పని చేయడమే ఒక అదృష్టం. ఎన్టీఆర్ శోభన్‌బాబు, కృష్ణ, అక్కినేని, కృష్ణంరాజు తరం ఆర్టిస్టులుతో పనిచేయడం నిజంగా అదృష్టం. తరువాత తరాల్లో కాదా అంటే ఇప్పటి తరంతో నేను పనిచేయలేను. వారంతా మంచి క్రమశిక్షణ గలవారు. క్రమశిక్షణ కాదు చాలా విషయాలు వీరిదగ్గర పనిచేసిన వారు నేర్చుకోవచ్చు. ప్రొఫెషన్ మీద వారికి వుండే గౌరవం అంతా ఇంతాకాదు. ఎన్టీఆర్ నటించిన చిత్రాన్ని నేను డైరక్ట్ చేయలేదు గాని మా గురువుగారు డైరక్ట్ చేస్తున్న వాటికి అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసాను. ఎన్టీఆర్ తన పనేదో తాను చూసుకుంటారు. ఎవరినీ కించపరచరు. అందర్నీ గౌరవంగా సంబోధిస్తారు. బాయ్‌ని కూడా 'బాయ్‌గారూ' అని పిలుస్తారు. నేను సర్కస్‌రాముడు, మనుష్యులంతా ఒక్కటే, బొబ్బిలి పులి వగైరా చిత్రాలకు పనిచేసాను. 'సర్దార్ పాపారాయుడు'కి పనిచేయలేదు గాని షూటింగ్‌కి వెళ్ళేవాణ్ణి.
- డైరెక్టర్ రేలంగి నరసింహ రావు
పిల్లలకు స్కూలంటే భయమా?
మళ్లి పాఠశాలలు ప్రారంభమయినాయి. కొత్త డ్రెస్సులు, బూట్లు, పుస్తకాలతో పిల్లలు పాఠశాలకు ఎంత ఉత్సాహంతో పరిగెడుతుం టారు. మరి కొందరు పిల్లలు స్కూలుకు వెళ్ల మని మారాం చేస్తుంటారు. గత సంవత్సరం మా వాడు బాగానే వెళ్ళాడు కాదా...ఈ సంవ త్సరం ఎందుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలను కోపంతో బెదిరించి ఎలాగోలాగా మళ్లిd స్కూలుకు పంపిస్తారు. కాని స్కూలుకు వెళ్లడానికి గల కారణాలను చాలా మంది తల్లిదండ్రులు తెలుసుకోలేక పోతున్నారు. పిల్లలు ఇలా ఇష్టం లేకుండా పాఠశాలకు పోవ టం వలన మానసిక ఒత్తిడికి గురై చదువుల్లో రానించలేక పోతు న్నారు. వీరికి పాఠశాల అంటేనే భయంతో వణికి పోతుంటారు. పాఠశాలను వీరు జైలులాగా భావిస్తుం టారు. ఇటువంటి స్కూలు ఫోబియా ఉన్న పిల్లల యెడల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లైతే పిల్లలు పాఠశాలలను దేవాల యాలుగా భావించి చక్కగా విద్యాభ్యాసం కొన సాగించేలాగా చేయవచ్చును.
పిల్లలు బాగా ఉన్నత చదువులు చదవా లని మంచి ఉద్యోగం చేయాలని ప్రతి తల్లిదం డ్రులు కోరుకుంటారు. కాని పిల్లలకు చదు వుతో పాటుగా సామాజిక సేవ, ఆధ్యాత్మికత, యోగ, ఆటలు కూడా నేర్పే ప్రయత్నం చేయాలి. దీని వల్ల పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
స్కూలు ఫోబియా కారణాలు:
- పాఠశాలలో మాస్టరు చదువుమని దండించటం, పాఠశాలలో సదుపాయాలు సరిగా లేకపోవటం.
- పాఠశాలలో ఆటలకు, సృజనాత్మకతకు సమయం కేటాయించక అస్థమానం చదువమని బెదిరించటం.
- తోటి విద్యార్థుల కంటే చదువులో వెనక బడటంతో టీచర్ నిత్యం మందలించటం.
- కొత్తగా స్కూలుకు వెళ్లే చిన్న పిల్లలు తల్లిదండ్రులను ప్రధమంగా వదిలి వెళ్లుట వలన భయంతో ఏడుస్తుంటారు.
- పాఠశాలలో తోటి విద్యార్థులు దౌర్జన్య పూరితంగా నిత్యం వేదించటం.
- పాఠశాలలో కఠినమైన నిబంధనలు ఉండటం.
భయం-లక్షణాలు :
- చెమటలు పట్టడం, కాళ్లు చేతులు వణుకు రావడం.
- ఆకలి తగ్గి ఆహారం సరిగా తీసుకోక పోవడం.
- ఆలోచనలతో నిద్ర పట్టకపోవటం.
- మాటలు తడబడటం. ఎవరితో సరిగా మాట్లాడలేక పోవడం.
- వీరి ప్రవర్తన బాధ్యతారహితంగా వుంటుంది.
- ఏ పనిపై శ్రద్ద పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం
-ఏకాగ్రత లోపించటం, తలనొప్పి రావడం
-తమలో తామే బాధ పడటం వంటి లక్షణా లతో ఉంటారు
ఏం చేయాలి?
-పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే భయపడు తున్న కారణాలు తెలుసుకొని, వారిని నెమ్మదిగా నచ్చజెప్పాలి.
-పాఠశాల యాజమా న్యంతో, పాఠశాలలో బో ధించే టీచర్స్‌తో మాట్లాడి వివరణ తీసుకోవాలి.
- పాఠశాలకు వెళ్లా లంటే భయపడుతున్నా రని పాఠశాలకు పం పుట మానుకోవద్దు. అలా చేస్తే వారికి ఎప్ప టికి పాఠశాలంటే భయమే ఉంటుంది.
- వారికి ఉన్న సందేహాలను, భయా లను తొలగించి నచ్చ జెప్పి పాఠశాలకు దగ్గర ఉండి కొన్ని రోజులు తీసు కెళ్లాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా వుండాలి.
- వారికి పాఠశాల మీద శ్రద్ద కలిగించే ఆదర్శవంతమైన మంచి మాటలు చెప్పి స్కూలుకు పంపే ప్రయత్నం చేయాలి.
చికిత్స
హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి వుంటుంది. కావున మానసిక రుగ్మతలకు హోమియో ఒక వరం. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగు తుంది కనుక సమూలంగా రుగ్మతలను చేయ డం సాధ్యం అవు తుంది.
మందులు :
ఆర్జెంటం నైట్రికం :
వీరు ఏ పని తలపెట్టాలన్నా గందర గోళం లో పడిపోతుంటారు. రేపు స్కూలుకు వెళ్లా లంటే ఈ రోజు రాత్రి వీరికి నిద్రపట్టదు. పాఠ శాల సమాయని కంటే ముందే స్కూలుకు వెళ్లాలనుకుంటారు. మానసిక స్థాయిలో ఈ రోగికి పంచరాద, తీపి అంటే ప్రాణం. వీరు లిఫ్ట్‌లో వెళ్లాలన్నా రోడ్డు మీద నడవాలన్నా, వంతెన దాటాలన్నా భయాందోళనకు గురౌ తారు. ఇటువంటి లక్షణాలుండి స్కూలంటే భయపడే వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.
ఎకోనైట్ : స్కూలుకు వెళ్లే ముందు 'టెన్షన్' పడేవారికి ఈ మందు తప్పక పని చేస్తుందను కోవటం లో ఎలాంటి సందేహం లేదు. వీరికి మానసిక స్థాయిలో ఆందోళన, అస్తిమితం, ఉద్వేగపూరితమైన భయానికి లోనవుతారు. వీరికి నాడి వేగంగా, బలంగా కొట్టుకుంటుంది. వీరికి జన సమూహం, చీకటి అన్నా ఎక్కువగా భయంతో వీరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడినచో చక్కని ఫలి తం వుంటుంది.
జెల్సిమియం:
విద్యార్థులు స్కూ లంటేనే భయంతో పాటుగా తత్తరపడి పోతారు. తత్తర పాటుతో విరేచ నాలు కావడం ఈ రోగి గమనించద గిన ప్రత్యేక లక్ష ణం. పాఠశాలంటేనే వణుకు, దడ, తలనొప్పి మొదలవుతుంది. మూత్ర విస ర్జన అనంతరం తలనొప్పి తగ్గిపోవుట ఈ రోగి యొక్క మరొక విచిత్ర విశిష్ట లక్షణం. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయో జనకారి.
ఈ మందులే కాకుండా కాల్కేరియాఫాస్, జెన్సింగ్, సెఫియా, ఫాస్ఫరస్, బెల్లడొనా, కాల్కే రియా కార్బ్, సల్ఫర్, జింకం మెట్, ఆరంమెట్ వంటి మందులను లక్షణ సముదాయంను అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకొని స్కూలు ఫోబియా (భయం) నుండి విముక్తి పొందవచ్చును.
- డా|| పావుశెట్టి శ్రీధర్
దేశంలో 1974 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు
ఎన్టీఆర్ పై బూట్లు విసిరిన సంగతి మర్చిపోయి
ఎన్టీఆర్ విగ్రహంపై దాడి పట్ల ఖండన
నాలుక చీరేస్తాం ! : పొన్నాలకు టీఆర్ఎస్ హెచ్చరిక
సీమాంధ్ర నాయకుల మోచేయి నీళ్లు తాగుతూ..వాళ్ల ప్రాపకంతో పదవులు పొందిన పొన్నాలది సీమాంధ్రుల ఆగడాలను నిలదీసిన జయశంకర్‌కు పదవులు ఇప్పించే స్థాయా... సొంత డబ్బా కొట్టుకుంటున్న పొన్నాల..డాలర్ లక్ష్మయ్యగా సమర్థత కంటే డబ్బే ప్రధానంగా రాజకీయాల్లో ఎదిగి, అక్రమంగా సంపాదించిన డబ్బు, అధికార మదంతో మాట్లాడుతున్నారని మధుసూదనాచారి ప్రశ్నించారు. "స్థాయి మరిచి చేస్తున్న మతిలేని ప్రేలాపనలు మానుకో. చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే నీ నాలుకను తెలంగాణ జాతి రెండుగా చీలుస్తుంది..జాగ్రత్త !'' అని హెచ్చరించారు.
డీజీల్, వంటగ్యాస్ ధరల పెంపు?
వందేమాతరం అవమానించిన కలెక్టర్
కలెక్టర్ నటరాజన్ గుల్జార్ వందేమాతరం, జనగణమన పాడవద్దని చెప్పడం జాతిని అవమానపరచడమేనని జిల్లా కలెక్టర్ ఇలా వ్యవహరిస్తే, మిగతా వారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.
తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం
ప్రభుత్వం ఆ మాట మరిచిపోయింది.
‘ఈసారి న్యాయం చేస్తారనుకుంటున్నా’
సోంపేట విద్యుత్ కేంద్ర నిర్మాణానికి భూ కేటాయింపులపై హై కోర్టు స్టే
హైదరాబాద్, జూన్ 23 : సోంపేటలో నిర్మించతలపెట్టిన విద్యుత్ కేంద్రానికి భూ కేటాయింపులపై హై కోర్టు స్టే విధించింది. సోంపేట విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ జి.ఓ.పై అన్ని తదుపరి చర్యలనూ నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
సోంపేటలో విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 2008లో రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన జి.ఓ. కూడా అప్పుడే జారీ అయ్యింది. ఇప్పుడు ఆ జి.ఓ.పై హై కోర్టు స్టే విధించింది.
సోంపేటలో విద్యుత్ కేంద్రం వద్దంటూ అక్కడి ప్రజలు కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.