29, ఏప్రిల్ 2011, శుక్రవారం
జగన్ తో మా పొత్తు ఉండదు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తో పొత్తుకు తహ తహలడుతూనదంటూ వస్తున్న కధనాలు వాస్తవం కాదని బీజేపీ జాతీయ నాయకుడు ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్-టీడీపీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయ ని... దాని మరుగున పరిచేందుకు వైఎస్ జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మైనారిటీలకు పది శాతం రిజర్వ్ వేష న్స్ కలిపిస్తామంటే బెజెపి తో జత కడతామని జగన్ చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు
రాజకీయాలని శాసించాలని చూస్తున్న జగన్
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని...డి.ఎల్.రవీంద్రారెడ్డిని ఎంపిగా, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గె లుస్తారని రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్స్ పార్టీ పటిష్టం గా ఉన్న కడప పార్లమెంట్, పులివెందుల శాసనసభ ఎన్నికలు రావాల్సిన అవరమంతా ధన బలంతో విర్రవీగుతూ.. రాజకీయాలని శాసించాలని చూస్తూ.. పదవీకాంక్ష తోనే జగన్ ఎన్నికల ను ముందుకు తీసుకు వచ్చారన్నారు. ధనంతో ఓటర్లను కొనే రోజులు పోయాయని , ఇన్నాళ్ళు తమకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకొంతారని... ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధనంతో ఓటర్లను కొనే రోజులు పోయాయని అన్నారు.
జగన్ ఓటమే... వైఎస్ కుటుంబ దోపిడికి అడ్డు కట్ట..
కడప జిల్లా పులివెందులలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, అక్కడి ప్రజలు ఇప్పటికీ దోపిడి రాజ్యంలోనే మగ్గుతున్నారని, వీటిని అరికట్టాలంటే వైఎస్ తనయుడు జగన్‌ను ఓడించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిలుపునిచ్చారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుటుంబం, బంధువర్గం ఓ వంద మంది మాత్రమే కోట్లాది రూపాయలు ఆర్జించారే కానీ అక్కడి ప్రజల జీవితాలు మాత్రం దుర్భరమయ్యాయని ఆరోపించారు.
పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎదురిస్తే ప్రాణాలతో మిగలరని, అక్కడి జనం భయాందోళనల్లోనే బతకాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆయన చెప్పారు.
పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎదురిస్తే ప్రాణాలతో మిగలరని, అక్కడి జనం భయాందోళనల్లోనే బతకాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆయన చెప్పారు.
ఉద్యమ పోరాట స్వరూపాలను చూపే 'పోరుతెలంగాణ '
ప్రత్యేక తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న, ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఆత్మీయంగా వీడిపోవాల్సిన అవసరం ఉందని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. విద్యార్ధులు ఆత్మబలిదానాల తో తెలంగాణా రాదని.. బతుకి ఉండి పోరాటం చేస్తే తెలంగాణ సాధ్యమవుతుందన్న దే తన పోరుతెలంగాణ సినిమా ద్వారా చెప్తానని చెప్పారు. 1952 నుండి జరుగుతున్న తెలంగాణ ఉద్యమ వివిధ దశల పోరాట స్వరూపాలను ఆనాటి ముల్కి ఉద్యమం నుండి నేటి తెలంగాణ పోరాటం వరకు అన్ని విధాలా దృశ్యాలను ఈ చిత్రంలో చూపెట్టనున్నాnani నారాయణ మూర్తి చెప్పారు.
'నగరం నిద్రపోతున్న వేళ' ఆడియో విడుదల
‘నగరం నిద్రపోతున్న వేళ’ చిత్రం ఆడియో హైదరాబాద్, శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప ఆడియో సీడీలను విడుదల చేసి, తొలి సీడీని హీరో జగపతిబాబుకు అందజేశారు. ఈ వేడుకలో కథానాయిక చార్మి, తిప్పేస్వామి, నటుడు బాబూమోహన్, సహ నిర్మాత టేకుల ముక్తిరాజ్, దర్శకులు సాగర్, చంద్రసిద్ధార్థ, కాశీవిశ్వనాథ్, చంద్ర మహేష్, రాంప్రసాద్, గీత రచయితలు సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్, ఆదిత్యా మ్యూజిక్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)