8, ఆగస్టు 2012, బుధవారం

దొరకునా...ఇటువంటిసేవ

శ్రీవారి పుష్పఆలంకరణలో పులకితుల మనోగతం
మంగళాకారుడు... మా కులదైవం వెంకటేశుడంటూ కోట్లాదిగా తరలివస్తూ... ఏడుకొండలూ నడచి మరీ ఆ కోనేటిరాయుడి దివ్య మంగళ రూపాన్ని కళ్లారా వీక్షిస్తూ.... తన్మయత్వంలో మునిగిపోయే భక్తజనం ఎందరో? పద... పద మంటూ కాపలాదార్లు, కైంకర్య నిర్వాకులు ఎవరెంతలా నెట్టేస్తున్నా.... గోవిందా... గోవిందా... అంటూ హరినామస్మరణతో ఇహలోకాన్ని వీడి అదో అద్భుత ప్రపంచం లో విహరించడం స్వామిభక్తులకే చెల్లింది. అందునా శ్రీవారికి తోమాల సేవా సంబరం జరిగినప్పుడు చూడాలని కోట్లాది భక్తగణం ఆశించడం సర్వసాధారణ విషయం. మరి తిరుమల శ్రీవెంకటేశ్వరుని మూల విరాట్టుకు జరిగే ఈ తోమాలసేవలో పూలదే ప్రధాన పాత్ర... పూల మొక్కల పెంపకం నుంచిఈ పూలని హారాలుగా కూర్చి స్వామివారికి చేర్చే క్రమంలో ఎందరో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వ హిస్తు... శ్రీవారి పుష్ప సోయగాలను నయనానంద భరితం చేసేలా చేస్తున్న వారిని ఆంధ్రప్రభ లైఫ్‌ పలకరించింది. ఆ వివరాలు ఇవి..
క లియుగ ప్రత్యక్షదైవంగా విశ్వవ్యాప్తంగా భక్తజనులతో కీర్తించ బడుతున్న శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. అందునా తులసి మాలంటే ఆతనికి మరింత ప్రీతి. అందుకే తిరుమలలోని వెంక న్న సన్నిథిలోని మూల విరాట మూర్తులకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా తోమాల సేవ ఘనంగా నిర్వహించడం తర తరాలుగా ఆనవాయితీగా వస్తోంది. భక్త జనులలో చాలా మంది తోమాల సేవ పదం వినటమే కాని చాలా వరకు అక్కడతంతులు, దాని వెనుక వంద లాది మంది చేస్తున్న కృషి గురించి తెలిసేది తక్కువే... ఇంతకీ తోమాల సేవంటే తోటల నుండి సేక రించిన మాలలతో స్వామి వారి ని సేవించడం అని అర్థం. ఈ సేవ కోసం పూదోటల నుండి అనేక రకాల పూలతో పాటు తులసిని సేకరించి మాలలుగా గుచ్చి... శ్రీనివాసునికి అలంకరించే సేవయే తోమాల సేవ.
తిరుమల క్షేత్రం కొలువై ఉన్న ఏడుకొండలలో సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్ప జాతులకు,పత్రాలకు కొదువే లేదు.. అందునా ఆ దివ్యమంగళ మూర్తికి అతి ఇష్ట మైన తులసి, చామం తులు, గన్నేరు, సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం (తామర), కలువ పూలు, గులాబీలు, సంపెంగలు, సుంగంధాలు, కనకాంబ రం,లాంటి పుష్ప జాతులే కాదు... మరువం, మాచీపత్రం, దవనం, బిలువం పత్రా లు... స్వామి వారి కైంక ర్యాలలో అవసరమ య్య మామిడా కు లు, తమలపాకు లు, పచ్చి పసుపు చెట్లు కోకొల్లలు. ఈ గిరులలో స్వామి వారి తోమాల సేవ కోసం ప్రత్యేకంగా ఓ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల్ని పెంచుతూ... నిత్యం ఇక్కడ నుండి సేకరించిన అనేక రంగు రంగుల పుష్పాలతో పుష్పకైంకర్యం చేస్తున్నారు.
తోమాల సేవ జరిగే తీరిది...
రోజూ క్రమం తప్పకుండా రెండు పూటలా శ్రీవారికి పుష్ప కైంకర్యంలో వివిధ పుష్ప జాతులతో అలంకరించిన పూల మాలలను జియ్యంగార్లు తలపై పెట్టుకుని, వేదమంత్రోచ్ఛారణలతో మంగ ళ వాయి ద్యాలతో... ఊరేగింప ుగా బయలుదేరి ధ్వజ స్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి, విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమ ర్పిస్తారు. ఆలా జియ్యంగా ర్లు సమర్పించి ఆదివ్యమంగళా కారుడికి అలం కరిస్తారు. ప్రతి రోజు జరిగే పుష్ప కైంకర్య కార్య క్రమానికి సగటున 250 కిలోల పు ష్పాలను వినియోగిస్తుండటం పెద్దవిశేషం. అలా గే ప్రతి గురువారం శ్రీవారి మూల విరాట్‌కి ఉన్న బంగారు ఆభరణాలు తీసివేసి పూలమాలలతో విశేషంగా అలంకరిస్తారు. అందుకేఆ కొండల రాయుడు ప్రతి గురువారం భక్తులకు కొంగ్రొత్త రూపంతో కనువిందు చేసేలా కనిపిస్తాడు. ప్రతి రోజు మూల విరాట్‌ అలంకరణకు సుమారు 275 అడుగుల పూల మాలలను అలంక రిం పడుతున్నాయి. .
పూలంగిసేవ
ప్రతి గురువారం రాత్రి స్వామి వారికి నివేదన ముందు పూలంగి సేవను నిర్వహిస్తారు. సుగంధ పరిమాళిక లతో శ్రీవారికి వస్త్ర రూపముగాను, ఉత్తరీయ రూపముగాను, కిరీట రూపముగాను, శంఖు చక్ర రూపములుగాను, తిరు మేను అంతయూ పుష్ప మయమగునటుల అలంకరి స్తారు. సూర్య కరాటి అను ఆసమయంలో పుష్పాలంకృతు డైన స్వామి వారి దివ్యమంగళ స్పరూపం చూచి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ఈ పూలంగి సేవను, సేవగానే కాకుండా దర్శనంగాను టిటిడి ఏర్పాటు చేసింది.
పూల తోటలు - నందన వనాలు
ఎంతో విశిష్టత కలిగిన స్వామి వారి తోమాల సేవ కోసం టిటిడి 175ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో నందన వనం పూల తోటలను పెంచుతోంది. దీనిని 1959 లో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది . 1961లో కేవలం 15 మంది కార్మికులతో ప్రారంభమైన ఈ పూదోట లు ప్రస్తుతం 825 మంది కార్మికులు స్థాయికి చేరుకుంది. తిరుమల కొండల్లో నారాయణగిరి గార్డెన్‌, టిబి గార్డెన్‌, శంఖుమిట్ట, పద్మావతిపురం, మాధవరం, ఆలపాటి తోట, దివ్వారామం పూలతోట ఇలా పలు చోట్ల గార్డెన్లు ఏర్పాటు చేయిటమే కాక పుష్పవర్ధిని పథకంలో 60 ఎకరాలలో సుగంధ పుష్పాల పెంచుతున్నారు.

టన్నుల కొలది పూలు...
టిటిడికి సాలీనా 40 టన్నుల పుష్పా లు అవసరమవు తాయి. వీటి లో తిరుమలలోని ఆలయా లకు 1,34,578 కేజీలు కాగా, తిరుపతి పరిసర ఆలయాలకు 2,71,000 కేజీల పుష్పాలు అవస మవుతా యి. ఇందులో 60 శాతం విరాళాల ద్వారా, 30 శాతం, ఉత్పత్తి ద్వారా పది శాతం కొనుగోలు ద్వారా టిటి డి సమకూర్చుకుంటోంది. సాలీనా 40 లక్షల రూపాయల విలువ గల పుష్పా లను టిటిడి కొనుగోలు చేస్తు న్నట్లు తెలుస్తోంది. తులసిని నందన వనంలో పండిస్తారు.
శ్రీవారికి పుష్పాలు సమర్పించి చరిత్రకెక్కిన భక్తులు
శ్రీవారికి అనేక మంది భక్తులు పుష్పాలు సమర్పించి మోక్షమార్గం పొందినట్లు భక్తుల విశ్వాసం. ఆ కోవలో తిరుమలనంబి తొలి సారి గా శ్రీవారి సేవలకు కావాల్సిన పుష్పా ల కోసం ఉద్యా నవనాలు పెంచి మోక్ష సిద్ధి పొందారు. అలాగే అనంతాళ్వారు శ్రీ వారి కోసం తను పెంచిన పూతోటలో పూసిన పూలనుమాలలుగా కట్టి తీసుకొచ్చి స్వామివారికి అలంకరించే వారు.ఈ ఉద్యానవనాన్ని నిరంతరాయంగా అభివృద్ధి చేసిన ఆయన పూల మొక్కలకు కావాల్సిన నీటి కోసం తవ్వించిన చెరువు నేటికీ అనంతాళ్వారు ట్యాంక్‌గా భాసి ల్లు తోంది. 1053లో జన్మించిన ఆయన 84 ఏళ్లు తిరుమలలో ఉండి స్వామి సన్నిధిలో పరమపదించారు. నేటికీ స్వామివారి 'యమునాతురై' పుష్పం కైంకర్యం ఆయన పేరు మీదే జరుగుతుండటం విశేషం. ఇక భక్తాగ్రేసర శిఖామణి తరి గొండ వెంగమాంబశ్రీవారిని సేవించేందుకు తులసి వనం పెంచి, తులసి మాలలు సమర్పించి భక్తిని చాటు కొంది.
అన్నింటా పుష్పాలంకరణ...
తిరుమలలో శ్రీవారికి జరిగే కళ్యా ణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్స వం, పద్మా వతి పరిణ యం, అణి వార ఆస్థానంలో పుష్పపల్లకీ ఇలా అన్నింటా పుష్పాలంకరణకే పెద్ద పీట. ఇది కాక ఏటా శ్రీ వారికి జరిగే పుష్ప యాగం కోసం 7 టన్నుల పుష్పాలను నివేదిస్తారు. ఇందులో 18 రకాల ప్రధాన సాంప్రదాయ పుష్పాలను శ్రీవారు హృదయాన్ని తాకేవరకునివేదన చేసిస్వామి వారిని పూ లతో ముంచెత్తుతారు. అటు పిమ్మట వాటిని తొలగించి మళ్లిd పుష్పార్చన చేస్తారు. ఇలా మలయ ప్ప స్వామికి 20 పర్యాయాలు నివేదన జరుగుతుంది.
పూలబావి....
శ్రీవారి మూల విరాట్టుకు అలంకరింపచేసే పుష్పాలని తొలగించిన తర్వాత వాటిని ఆలయంలో ఉన్న పూల బావి లో వేస్తారు. భక్తులకు ఇవ్వరు. తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవి పంచమి ఉత్సవాలలో శ్రీవారికి అలంకరించిన పు ష్పాలను సారెగా పంపుతారు. ఆ ఒక్క రోజు స్వామివారికి అలంకరణ పుష్పాలు బయటకు వస్తాయి. ఇందుకు ఇతిహాస చరిత్ర ఉంది. శ్రీరంగదాసు అనే భక్తుడు బావిని త్రవ్వి ఆ బావిలోని నీటిని వాడుతూ శ్రీమహావిష్ణువుని పూజకై సంపెంగ, చామంతులను తోటలో పెంచి పూజ చేసేవారు. అతని మరణానంతరం మరుజన్మలో తొండమాన్‌ చక్రవర్తిగా జన్మించగా ఆతనికి వేంకటేశ్వరుడు కలలో కనిపించి గతజన్మలో నిర్మించిన బావి నేడు శిథి లమై పోయిందని... ఈ బావిని మళ్లిd పునరుద్ధరించమని ఆదేశించాడని... దీంతో తొండమానుడు రాతితో బావిని పునరుద్ధరించి దానిద్వారా ఒక రహస్య బిలం ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళ్తు..శ్రీ స్వామివారికి ప్రీతి పాత్రుడైనట్లు చెప్తారు. ఒకనాటి యుద్ధంలో శత్రువులచే తరమబడుతూ తప్పించు కొన్న తొండమానుడు ఏకాంత సమయంలో ఆలయ ప్రవేశం చేశాడని ఆసమయం లో శ్రీదేవి సిగ్గుతో శ్రీనివాసుని వక్ష స్థలంలో భూదేవి బావిలో దాక్కుందని వేంకటా చల మహాత్యంలో తెలియచేస్తుంది. శ్రీ రామానుజుల వారు తిరుమల సందర్శించినపుడు తొలగించిన పూలను భూదేవి నివసిస్తున్న బావిలో వేయమని ఆదేశిం చారు. అప్పటి నుంచి శ్రీవారికి అలంకరించిన పూలను బావిలో వేస్తారు. అందుకే ఆ బావికి పూల బావి అని పేరు వచ్చింది. తిరుమలలో పూచిన పుష్పాలన్నీ స్వామి వారి కైంకర్యాలకే. అందుకే తిరుమలలో పూలు పెట్టుకోరాదు అని టిటిడి ప్రకటనలను గుప్పిస్తుంది. తిరుమల క్షేత్రం ఫల పుష్పాలతో నందనవనంగా విరాజిల్లుతుంది.
పూలని కట్టడం కూడా ఓ కళే...
గత జన్మలో పుణ్యఫలం నేటికి శుభప్రదం అవుతోందన్నది పూలు కట్టే ప్రతి ఒక్కరి సమాధానం... ఇంతకంటే భాగ్యం మరొకటి లేదన్న ఆత్మ సంతృప్తి అందరి కళ్లలో కనిపిస్తుంది. ఇక ఉత్సవ సమయంలో నిపుణులు ఆకృతులలో పూల ను అమర్చి అవి వాడిపోకుండా శ్రద్ద వహిస్తారు. అత్యంత సువాస నలు వెదజల్లే 'మసిలం' పుష్పాలు అలంకరణలో ఓ ప్రత్యేక ఆకర్షణ.

అంతా స్వామి వారిదే
తిరుమలలో ఉన్న పశుక్షాదులు, వృక్షసంపద, లతలు అన్నీ కూడా స్వామి వారికి చెందుతాయి.
పుష్పాలన్నీ స్వామి వారికైంకర్యానికే నివేదింప బడాలి అంచేత తిరుమలలో తలలో పూలు పెట్టుకోరాదని తిరుమలలో వివా హం చేసుకొనే వధూవరులకు పూలమాలలు అలంకరింప చేయ రని, దానికి ప్రత్నామ్నాయంగా ఇతర దండలు వినియోగిస్తారు. తిరుమలను సుందర నందన వనంగా రూపు దిద్దేందుకు పూల తోటలలోని పూలని స్వామి వారికి అలంకరణకు , కైంకర్యాలకు మాత్రమే వినియోగించాలి. భక్తులు ఈ విషయంతో దేవస్థానంతో సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
- రమణ దీక్షితులు ప్రధానర్చకులు,తిరుమల తిరుపతి దేవస్థానం


శ్రీ వారికి అలంకరించే పూలు కట్టడం మా అదృష్టం
ప్రతి నిత్యం చెన్నయ్‌, శ్రీరంగం, గోవా, ఉడిపి, బెంగళూ రు నుంచి తిరుమలకు పూలు చేరుకుంటాయి. 40 మంది కార్మికులు స్వామివారికి మాలలు అలంకరించడంలో నిమగ్నమైపోతారు. స్వామివారికి వివిధ కొలతలలో పూ ల మాలలను సిద్ధం చేస్తారు. వాటిని బుట్టలలో నింపి ఆల యానికి పంపుతాం. స్వామి వారి సన్నిధిలో పనిచేయడం ఒక వరమైతే, పూలు కట్టడం, కట్టిన పూలమాలలు స్వామి వారికి సమర్పించడం పూర్వజన్మ సుకృతంశ్రీవారి కరసేవ కులు కట్టిన మాలలు కొలతలకు తగ్గట్టు సరిచేసి పంపడం తమ బాధ్యత డోనర్‌ల నుంచి వచ్చిన పూల మాలలు సిబ్బందిచే జాగ్రత్తగా పరిశీలించి, వాటిని కొలతల ప్రకారం సరి చేయించి నిర్ణీత సమయానికి శ్రీవారి సన్నిధికి పంపడం తమ బాధ్యత.
రామమూర్తి, పూల మాలల పర్యవేక్షకుడు


శ్రీవారికి అలంకరింపబడే మాలలు ఇవి
శిఖామణి : కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే దండను శిఖామణి అని పిలుస్తారు. ఇది ఎనిమిది మూరల దండ.
సాలిగ్రామ మాల : శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతున్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన మాలలు. ఇవి రెండు మాలలు, ఒక్కొక్కటి నాలుగు మూరలు.
కంఠసరి : మెడలో రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ. ఒకటి మూడున్నర మూరలు.
వక్షస్థల లక్ష్మీ : శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవిలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.
శంఖుచక్రం : శంఖు చక్రాలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక మూర.
కఠారి సరం : శ్రీవారి బొడ్డున వున్న నందక ఖడ్గానికి అలంకరింపబడే దండ. ఒకటి రెండు మూరలు.
తావళములు : రెండు మోచేతుల క్రింద, నడుము నుండి మోకాళ్ల పై హారాలుగా మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే మూడు దండలు. ఇవి అన్ని కలిపి పది మూరలు.
తిరువది దండలు : శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర.
ఇవిగాక ఉత్సవ మూర్తులు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువ శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సహిత ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీ సీతా రామ లక్ష్మణులు, శ్రీ రుక్మిణీ కృష్ణులకు, చక్రత్తాళ్వారులకు, అనంత, గరుడ, విశ్వక్సేనులకు, సుగ్రీవ, హనుమంతు, ఆగంధులకు ఆలయంలో ఉన్న ద్వార పాలకులు, పరివార దేవతలకు, తిరుమలలో వేంచేసి ఉన్న బేఢీ ఆంజనేయస్వామి, వరాహ స్వామితోపాటు ఇతర ఆలయాలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పుష్ప కైంకర్యం జరుగుతుంది.


ఇంతటి భాగ్యం ఎందరికి దక్కుతుంది?
నేను కట్టిన పూలు స్వామి పూలు వారికి అలంకరించడం గత జన్మలో నేను చేసుకున్న పుణ్య ఫలమనే నానమ్మకం... ప్రతి రోజు ఉదయం 8.00గంటలు నుండి సాయంత్రం 4.00 గంటల వరకు స్వామి వారికి పూల మాలలు కూర్చటంలో నిమగ్నమైపోతా.. మాలలు కట్టే సమయంలో శ్రమ తెలియడం లేదని, ఇది స్వామి వారి కృపే... ఇంతటి మహత్‌ భాగ్యం ఎందరికి దక్కుతుంది?
- వై. రామసుబ్బమ్మ, టిటిడి ఉద్యోగిని


బ్రహ్మోత్సవాలలో పుష్ప నివేదనలే
స్వామివారికి జరిగే ఏటా బ్రహ్మోత్సవాల కోసం 40 టన్నులకు పైగా పుష్పాలను వినియోగిస్తారు. ఇందులో 16 నుంచి 18 రకాల పుష్పాలను స్వామివారి అలంకరణకు వాడుతున్నట్లు ఉద్యా నవన శాఖ అధికారులు చెప్పారు. ఇందులో కృత, త్రేత, ద్వాపర యుగాలలో స్వామివారి అవతా రాలను, సప్తద్వారాలు, ఉత్సవాలలో ప్రతిరూపాలను పు ష్పాలతో అలంకరించి భక్తులకు కన్నుల పండుగ గావిస్తుంది. ఇందుకోసం నాలుగు వందల మంది గార్డెన్‌ సిబ్బంది ఎంతో శ్రమించి తమ కళానైపుణ్యాన్ని చాటు కుంటారు. ఇక ఏటా శ్రీవారికి మూడు రోజుల పాటు జరిగే పద్మావతీ పరిణయానికి పుష్ప సోయగాలే ప్రధాన ఆకర్షణ.

ఒక్కక్లిక్‌చాలు ప్రాణాలుకాపాడేందుకు...

  • క్షణాల్లో క్షతగాత్రుల చెంతకు చేరుస్తూ....
  • ఆన్‌లైన్‌లో రక్తదానం చేయిస్తూ...
  • పైసా ఖర్చులేకుండా అందరికీ బాసటగా నిలుస్తూ....

వివిధ సందర్భాలలో క్షతగాత్రులైన వారికి.. అనేక ఆప రేషన్‌లప్పుడు అవసరమయ్యే రక్తం కోసం ఉరుకులు.. పరుగులు తీసే పని లేకుండా కేవలం క్లిక్‌ ద్వారా రక్తదాత మన చెంతకు చేరే విధంగా అం తర్జాలం ద్వారా రక్తదా తలకు సమాచారం అందించి ఇప్పటికి యాభైవేలమందికి పైగా ప్రాణాలను కాపాడి.. రక్తదానాన్ని ఓ మహొద్యమంగా ... జనచైతన్య కల్గించే దూసుకుపోతున్నారు ఆ యు వకులు. తాము ఏర్పాటు చేసుకున్న ూూూ.ౌస|nd2షూూుసష.ుసగ -వబ్‌ సైట్‌ ద్వారా వాడవాడలా విస్తరిస్తూ... అందరి ప్రశంసలూ పొందుతున్నారు.
ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాం... అని ఆలోచించడం మానేసి...ఈ సమాజం నాకేమిచ్చిందన్న భావన ఎక్కువై పోవ టంతో సామాజిక పరంగా అనేక సమస్యలు వస్తునే ఉన్నాయి. ఎవరెలా పోతే మాకేం... నేను... నాకుటుంబం... బాగుంటే చాలు అనుకునేవారే ఎక్కువ ఈరోజుల్లో ... సాటి మనిషి ప్రమాదానికి గు రైతే... చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే... ఆదుకోవాల్సిన బాధ్యత మనదన్న భావననుండి మనకేమైపోతుందో అన్న భావ నతో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు కొందరు.
అలాగని ఈ సమాజంలో అందర్నీ ఒకే గాటాన కట్టేయలేం... నన్నీ స్థితికి తీసుకువచ్చిన సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని ఆలోచించే వారూ ఉన్నారు. అయితే యువతరంలో ఈ సమా జానికి ఏదో ఒకటి చేయాలన్న తపన చాలానే ఉంది. అయితే చిన్న పాటి నిర్లిప్తతలతో చేయాలనుకున్న పనిని ముందుకు తీసుకుపోలేని వారు కొందరైతే....నలుగురూ మెచ్చేలా సేవ చేయాలి అని నిర్ణ యించు కున్నా... దానికి ఓ కార్యరూపం ఎలా ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడేవారు మరికొందరు. రంధ్రా ణ్వష ణలు జరిపి దాని ద్వారా లబ్దిపొందుతున్నట్లు జరిగే దుష్ప్రచారానికి భయపడి సేవలం దించేం దుకు వెనుకడుగు వేసేవారు మరికొందరు. కొంత మంది యువకులు... భావన, నవజీవన నిర్మాతలు... అంటూ మహాకవి శ్రీశ్రీ చేసిన ప్రశంసలు నిజంగా ఆయువకులకు వర్తిస్తాయి. సమయా నుకూలంగా రక్తం అందక ప్రాణాలు అనంత వాయువుల్లో కల్సిపో తున్న వారిని కాపాడేందుకు ఐదుగురు యువకులు చేసి చిరు ప్రయత్నం నింగికెగిసింది.
కృషి, పట్టుదల, కార్యధీక్ష, ఉంటే సమాజానికి తమ వంతు సహా యం చేయగలం అని నిరూపించారు ఈ ఐదుగురు యువకులు. ూూూ.ౌసnd2షూూుసష.ుసగ వెబ్‌సైట్‌ ద్వారా అవసరమైన అన్ని ప్రాంతాలలో సామాన్యులే కాదు... అన్ని తరగతుల ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రక్తాన్ని పొందేందుకు గానీ... దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ... ఎందరి ప్రాణా లనో కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం అందరి మన్నలను పొందుతోంది.
గుంటూరు జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు 2005 సంవత్స రంలో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. షరీఫ్‌, నవీన్‌, ఫణీ, కోటేశ్వ రరావు, మురళీకృష్ణ మిత్ర బృందం ఆలోచనల నుండి పుట్టిన ఈ అంతర్జాలం ఎందరి ప్రాణాలనో నిలుపుతోంది. ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సైట్‌ పై సన్నిహితులకు, స్నేహితులకు, తమ కుటుం బ సభ్యులకు బంధుమిత్రులకు ఇలా అందిరికీ సమాచారం అందిస్తే... అందులో బ్ల్లడ్‌ డోనర్స్‌గా చేరింది కేవలం 250 మంది మాత్రమే... అయినా వారు నిరుత్సాహపడిపోలేదు... తాము అనుకున్న లక్ష్యాలను చేరేందుకు సమయం చిక్కినప్పుడల్లా... ఆన్‌లై న్‌లో రక్తదానం చేయటం ఎలాగో... కావాల్సిన రక్తాన్ని పొందటం ఎలాగో అవగాహన కల్పిస్తు ముందుకు సాగారు. దీంతో నేడు ఈ వెబ్‌ సైట్‌లో రక్తదాతల సంఖ్య లక్ష పైచిలుకు దాటడం వారి నిర్విరామకృషికి నిదర్శనంగా చెప్పాలి.
విదేశాల్లో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్న తన స్నేహితులతో కల్సి హైదరా బాద్‌ వెబ్‌సైట్‌ డిజైనర్‌గా పని చేస్తున్న షరీఫ్‌ రక్తదానంపై అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఆన్లైన్‌ బ్లడ్‌ డొనేషన్‌ సైట్‌ దేశ వ్యాప్తంగా విస్తరించి... ఎందరో సభ్యుల్ని చేర్పించేలా చేసింది.
దేశ వ్యాప్తంగా...వాలంటీర్లు
వెబ్‌సైట్‌ ద్వారా స్వచ్ఛంద రక్తదాన సేవలందిస్తున్న ఈ సంస్ధకు మన రాష్ట్రంలో 30వేల పై చిలుకు సభ్యులున్నారు. ఈ ఫ్రెండ్సు 2 సపోర్ట్‌ వెబ్‌సైట్‌ సేవలు ఆంధ్ర ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వినేందుకు వింత గొలుపుతున్నా... జరు గుతున్న వాస్తవాన్ని గమనించి స్వచ్చంధంగా రక్తాన్ని ఇచ్చేందుకు ముందు కొచ్చేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో షరీఫ్‌ ఆతని మిత్ర బృందంలో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలోనే తమి ళనాడు, కర్నా టక, మహారాష్ట్ర, కేరళా, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఉత్తర్రపదేశ్‌, గుజరాత్‌, రాజ స్థాన్‌లకి విస్తరించి అక్కడ సభ్యులతో... వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించేందుకు, రక్తదాన అవసరంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలలో వాలంటీర్లుగా సీనియర్‌ సిటిజన్స్‌, డాక్టర్లు, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు, కళాశాల విద్యార్ధులు ఇలా సమా జంలో ప్రతి ఒక్కరినీ భాగస్వా మ్యం చేసింది. వీరంతా ఆయా ప్రాంతాల్లో వారు రక్తదానం పై అవేర్‌నెస్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తూ, సైట్‌ద్వారా బ్లడ్‌ డోనర్స్‌, సభ్యులుగా చేర్పిెంచే ప్రయ త్నాలు చేస్తున్నారు.
రక్తదానం ఇలా....
నిజానికి శరీరం నుండి తీసిన రక్తం 21 రోజులు మాత్రమే నిలవ చేయగలం తరు వాత దానిని పయోగించడం ప్రమాదకరమన్నది వైద్యనిపుణుల హెచ్చరికలే త మ వెబ్‌సైట్‌లో రక్తదానం ఇచ్చే వారికి ఉపయోగపడుతున్నట్లు చెప్తున్నారు నిర్వా హకులు. ఈ వెబ్‌ సైట్‌లో ఎవరైనా, ఎక్కడివారైనా.. ఇందులో సభ్యుడిగా చేరి, తానున్న చోట ఎవరికై, ఎక్కడైనా రక్తం అవసరమైన వారికి రక్తదానం చేసే అవకాశాన్ని కల్పించడం ఇక్కడి విశేషం. దాతలు నివసించే ప్రాంతం, జిల్లా వివరాలు, బ్లడ్‌ గ్రూఫ్‌, ఫోన్‌ నంబర్‌ వివరాల పొందపరుస్తారు... ఇక రక్తం కావాల్సిన వారు ఈ వెబ్‌ సైట్‌లో ఆయా ప్రాంతాలు, బ్లడ్‌ గ్రూప్‌ వారిగా ఉండే బటన్‌ని క్లిక్‌చేస్తే చాలు సమీప ప్రాంతలలోని దాతల వివరాలు ఫోన్‌, నెంబర్లు క నిపిస్తాయి. దీని ఆధారంగా రక్తదాతలని పిలుచుకుని బాధితుల ప్రాణాలను కాపాడుకునే వీలుంటుంది. అంతే కాదు.... రక్తం కావాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లో తామున్న ప్రాంతం, కావాల్సిన రక్తం గ్రూప్‌ తదితర వివరాలు అ భ్యర్ధన చేస్తే చాలు... సంబంధిత బ్లడ్‌ గ్రూప్‌, అందుబాటులో ఉండే దాతలకు సమాచారం అందించి రక్తాన్ని ఇచ్చేలా చూస్తారు.
అవార్డులు, రివార్డులు...
ఫ్రెండ్స్‌ టూ సపోర్ట్‌ డాట్‌కామ్‌ ద్వారా యువకులు చేస్తున్న కృషి అం తర్జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చింది. ఇంటర్నెట్‌ ద్వారా సమాజ సేవలో వినూత్న కలిగి ఉండడం, అధికంగా డోనర్లు నమోదు కావడంపై యూనిసెఫ్‌ నిర్వహించిన యూత్‌ వరల్డ్‌ సమ్మిట్‌లో అవార్డు పొంది ంది. లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
తొంభై వేలకు పైగా సభ్యులు..
ప్రస్తుతం 90 వేల డోనర్లు, దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రతి రోజు 10నుండి 20 మంది వెబ్‌సైట్‌ ద్వారా రోగులు దాతలు నుండి రక్తాన్ని పొందుతున్నారు. రక్తాన్ని ఇచ్చిన సదరు దాత పేరు 90 రోజుల వరకు సైట్‌లో కనిసించవు. మూడు నెలల తరువాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా సభ్యుడు పేరును నమాెెదు చేసుకోవాలని గుర్తుకు చేస్తూ, సందేశాన్ని కూడా పంపిస్తుంది.
రక్త వ్యాపారం చూడలేక...
బ్లడ్‌ బ్యాంకులంటే రక్తాన్ని వ్యాపారంగా మార్చేసి... వేలల్లో నిర్వహణ ఖర్చు లంటూ వసూలు చేస్తున్నారు. అసలే కష్టా ల్లో ఉన్న వారు... వారు అడిగినంత ఇచ్చు కుని తమ వారి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు... నేను చూసాను ఆ కోణంలోనే మిత్రులతో ఆలోచించి ఈ తరహాలో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసాం....
కోటేశ్వరరావు, యు.ఎస్‌.ఎ.

అవసరమైన రక్తం దొరక్క
మన చుట్టూ ఉన్న వారిలో కొందరు ఊహిం చని విధంగా క్షతగాత్రులైనప్పుడు అవ సరం అయిన రక్తం తగిన మోతాదులో దొరక్క మర ణాల పాలవుతున్న వారి సంఖ్య పెరు గుతున్న ట్లు వచ్చిన కథనాలు మా మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఆ క్రమంలోనే రూపొం దించిన వెబ్‌సైట్‌ మంచి ఫలితాలు అందివ్వటం ఆనందంగా ఉంది.
- మురళీకృష్ణ , మలేషియా
సరిగా అందుతుందో లేదో

రక్తదానం చేయాలని ఉన్నా... అది నిజమైన బాధితులకు సరిగా అందుతుందో లేదో అన్న ఆం దోళన చాలా మందిలో ఉం టుంది. ఎం దు కంటే సేకరిం చిన రక్తం సకాలంలో వాడక కొం త, అవగాహన లేమితో మ రికొం త పా డవుతోంది. ఇలాంటి పరి ణామాలనుంచి త ప్పించి కా వాల్సిన గ్రూప్‌ రక్తాన్ని నేరుగా దాతే వచ్చి అందిస్తే... ఎలా ఉంటుందన్న ఆ లోచనలోంచి పుట్టిన వెబ్‌సైట్‌ నేడు దశ దిశలా వ్యాప్తి చెందిన ఆనందానికి మించి ఎందరి ప్రాణాలో కాపా డగలుగుతున్నామన్న ఆనందం మాకు ఎక్కువగా ఉంటోంది.
- నవీన్‌ రెడ్డి, ఫణీ సుందర్‌, యుఎస్‌ఏ

సామాజిక బాధ్యతగా
దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఘటనల్లో క్షతగాత్రులకు, వివిధ చికిత్సల కోసం ప్రతి రో జు సగటున రెండు కోట్ల యూనిట్ల రక్తం అవసమవుతోంది. అయితే కేవలం నలభై లక్షల యూనిట్ల రక్తం మాత్రమే అందు బాటులో ఉంటోంది... దీంతో రక్తం అందక చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోం ది. అం దువల్లే సామాజిక బాధ్యతగా వెబ్‌సైట్‌ ద్వారా స్వచ్ఛంద రక్తదానాన్ని చేయడం ప్రారంభించాం.. ప్రతి ఒక్కరూ ప్రెండ్స్‌టూ సఫోర్ట్‌ ఆర్గనైజేషనలో డోనర్‌ సభ్యుడుగా నమోదయితే మరిందరికి ప్రాణదానం చేసినవారమవుతాం.
- షరీఫ్‌, వెబ్‌సైట్‌ నిర్వాహకులు, హైదరాబాద్‌