2, నవంబర్ 2010, మంగళవారం

షర్మిలా ఆందోళనకు దశాబ్దo


సామాన్య జనం పాలిట శాపంగా మారిన సైనిక శాసనాన్ని రద్దు చేయాలని దశాబ్ద కాలంగా ఆందోళన చేస్తున్న సహనశీలి ఈరమ్ షర్మిలా చాను...

ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో 10 మంది పౌరులను పొట్టనపెట్టుకోవడంతో మణిపూర్‌లో వివాదస్పద 1958 నాటి సైనికదళాల ప్రత్యేక చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరాహార దీక్ష చేపట్టి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి..

జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు జేఎన్ ఆస్పత్రిలో ముక్కు ద్వారా ద్రవాహారాన్ని ఎక్కిస్తున్నా... శాంతియుత సమరాన్నే శ్వాసగా చేసుకుని కర్కశ సైనిక చట్టంపై పోరాటం చేస్తున్న...చెక్కు చెదరని సంకల్పానికి ప్రతీక ... మొక్కవోని ఆత్మవిశ్వాసానికి ఆ చైతన్యమూర్తి....ప్రత్యక్ష నిదర్శనం

షర్మిలా దీక్ష చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పలు సామాజిక సంఘాలు మణిపూర్‌లో పలుచోట్ల బైఠాయింపులు జరిపాయి. విప్లవమూర్తికి సంఘీభావంగా రిక్షావాలాలు ర్యాలీలు నిర్వహించారు.

చిరంజీవిదీ రెండుకళ్ళ సిద్ధాంతం


రాజకీయాలు, సినిమాలు తనకు రెండు కళ్లలాంటవని పీఆర్‌పీ అధినేత చిరంజీవి అన్నారు. ఇక మీద నెలలో 10 రోజులు సినిమా షూటింగులకు కేటాయిస్తానని చిరంజీవి అన్నారు. ఫ్రిబ్రవరిలో తన కొత్త సినిమా ప్రారంభమయ్యే అవకాశముందని, దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని ఆయన వివరించారు. ప్రస్తుతం బన్నీ పెళ్లి పనుల్లో నిమగ్నమయినందువల్ల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని చిరు తెలిపారు.

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌లో విజిలెన్స్‌ సోదాలు


ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు జరిపారు. ఏఐసీసీ భూములు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై విచారణలో భాగంగా మాదాపూర్‌లోని రహేజా ఐటీ పార్క్‌లో ఉన్న ఎమ్మార్‌ సంస్థ కార్యాలయంపై విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

డీఐజీ హరికుమార్‌ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఎమ్మార్‌, ఏపీఐఐసీ మథ్య అగ్రీమెంట్‌ చేసుకున్న పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.




from surya

డీఎస్సీ నియామకాలలో జోక్యం చేసుకోo

: డీఎస్సీ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోమని రాష్ట్ర హైకోర్టు స్ఫష్టం చేసింది. కామన్‌ మెరిట్‌కు విరుద్ధంగా ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని, డీఎస్సీ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ బీఎడ్‌ అభ్యర్థులు సోమవారం వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో జీఓ నెంబర్‌ 28 ప్రకారమే డీఎస్సీ నియమాకలు జరగనున్నాయి. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో సెలెక్షన్‌ జాబితాను విద్యాశాఖ ప్రకటించింది. బుధవారం నుంచి కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. గత రెండు రోజులుగా సిర్టిఫికేట్ల వేరిఫికేషన్‌ ఇవాల్టితో ముగిసింది

సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్‌కి అరుదైన గౌరవం


భారతీయ సినీ పరిశ్రమలో తనదైన కెమెరా పనితనంతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ పోలాండ్‌లో జరిగే చలనచిత్రోత్సవం సందర్భంగా నిర్వహించే సినిమాటోగ్రఫీ పోటీలకు ఎంపికయ్యారు. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీకి భారత్ నుంచి తాను ఎంపిక కావడం పట్ల రవి కె.చంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈనెల 27వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు పోలాండ్ దేశంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన రవి కె.చంద్రన్ ప్రస్తుతం తమిళంలో '7ఆమ్ అరివు', హిందీలో 'అగ్నిపథ్' చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.


news from andhajyoti

చైనాలో.. జనగణనకు శ్రీకారం

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా.. జనగణనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 65 లక్షల మంది సిబ్బందితో చేపట్టిన ఈ భారీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. విడతల వారీగా జనాభా లెక్కలను పూర్తి చేసి 2011 ఏప్రిల్ చివరి నాటికి తుది జాబితాను ప్రకటించేలా ప్రణాళికను రూపొందించింది. పూర్తి వివరాలు సేకరించేలా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్(ఎన్‌బీఎస్) 18 ప్రశ్నలతో ఒక సమాచార సేకరణ పత్రం, 45 ప్రశ్నలతో మరో పత్రాన్ని రూపొందించింది.

సోమవారం(నవంబర్ 1) నాటికి జన్మించిన వారితో సహా అందరి వివరాలను సేకరించనున్నారు. అలాగే సోమవారం తర్వాత జన్మించే వారి వివరాలు 2020లో చేపట్టే జనగణనలోనే నమోదవుతాయి. ప్రస్తుతం చేపట్టిన ఈ భారీ కార్యక్రమానికి 10 కోట్ల 30 లక్షల అమెరికన్ డాలర్ల వ్యయం కానుంది.



news from andhajyoti

‘పశ్చిమ’లో బాబు పర్యటన వాయిదా?


ఈశాన్య రుతు పవనాలు సైతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. హోరున పడుతున్న వర్షాలు బాబు ‘పశ్చిమ’ పర్యటన దిశను మార్చేసేలా ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవానికి గత నెల 27,28,29 తేదీల్లో చంద్రబాబు పర్యటించాల్సి ఉంది.. ఇప్పటికే ఒకమారు వర్షాల కారణంగా బాబు పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆయన పర్యటన షెడ్యూల్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. మరోమారు ఆయన పర్యటనలో మార్పు లు చేసేలా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం..

‘పశ్చిమ’లో చంద్రబాబు పర్యటించి వరి, ఆక్వా రైతులను పరామర్శిస్తే బాగుంటుందని నేతలు భావిస్తున్నారు. మిగిలిన రెండు రోజుల్లో మెట్ట ఏజెన్సీల్లోని పొగాకు, మొ క్కజొన్న, వరి, తదితర పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేలా షెడ్యూల్‌లో మార్పు చేసేలా పార్టీ నేతలు భావిస్తున్నారు.

సినీ నిర్మాత అశోక్ కుమార్ ఇంట్లో చోరీ

ఫిల్మ్‌నగర్‌లో సినీ నిర్మాత కొల్లా అశోక్ కుమార్ నివాసంలో చోరీ జరిగింది. దుండగులు సుమారు రూ.50 లక్షల విలువ చేసే బంగారం, నగదును అపహరించుకుపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

కేఆర్ విజయ పరిస్థితి విషమం

ప్రముఖ సినీనటి కేఆర్ విజయ అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు. కేఆర్ విజయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అశోక్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు.

ఫిల్మ్‌నగర్‌లో ప్రముఖ సిని నిర్మాత, నటుడు అశోక్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు... రెండు రోజుల క్రితం సాయి దర్సనానికి షిర్డీ వెళ్ళిన అశోక్ కుమార్ కుటుంబం ఈ రోజు తిరిగి వచ్చె సరికి... తాళాలు బద్దలై ఉన్న విషయాన్ని గమనిoచారు.. . దుండగులు సుమారు రూ.50 లక్షల విలువ చేసే బంగారం, నగదును అపహరించుకుపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కల్తీ కక్కుర్తి... ప్రజారోగ్యం గాలికి......


డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో ఆహార పదార్థాలు, నిత్యావసరా లు కల్తీ అవుతున్నాయి. వినియోగదారుల అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు కక్కుర్తికి పాల్పడుతున్నారు. నిత్యావసరాలైన పప్పులు, మంచినూనె, కారం, టీపొడి వంటి పలు సరుకులు కల్తీ అవుతున్నాయి. హోటళ్లలో నాణ్యత పాటించకపోవడంతో కొద్ది రోజులు క్రమం తప్పకుండా హోటల్‌లో భోం చేసిన వారు మంచం పట్టక తప్పడం లేదు. హోటళ్లలో నాణ్యమైన సరుకులు వాడకపోవడంతో వినియోగదారులు వ్యాధుల భారిన ప డుతున్నారు. కల్తీ లేకుండా నియంత్రించాల్సిన ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు చో ద్యం చూస్తున్నారు.

ప్రజారోగ్యాన్ని అధికారులు గాలికొదిలేస్తున్నా రు. మామూళ్ల మత్తులో పడి తనిఖీల ఊసే మ రచిపోయారు. హోటళ్లు,రెస్టారెంట్లు,దాబాలు, కిరాణం షాపులు, స్వీట్‌హోంలు, ఆహార పదార్థాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నుంచి వా రివారి స్థాయిని బట్టి కొందరు అధికారులు, సి బ్బంది మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. చిన్న, చిన్న కిరాణం షాపులను కూడా వదలడం లేదనే విమర్శలున్నాయి. శ్యాంపిళ్ల సేకరణలో ఈ శాఖ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నార, మామూళ్లు ఇచ్చిన వారి జోలికి అసలు వెళ్లడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఒకవేళ వెళ్లినా శ్యాంపిళ్ల సేకరణలోనే జాగ్రత్త పడుతున్నారు. ఏటా తమకున్న లక్ష్యా లను చేరుకునేందుకు శ్యాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు పంపి కల్తీలే లేవని చేతులు దులుపుకుంటున్నారు. హాటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ప్రోవిజనల్ స్టోర్లు, కిరాణం షాపులు, ఆహార పదార్థాల తయారీ ఫ్యాక్టరీల నుంచి ప్రతినెలా ఆహార పదార్థాలు, సరుకుల శ్యాంపిళ్లను సేకరించి, పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపాలి.

ఆ ల్యాబ్‌లో పదార్థాలు కల్తీ అని తేలితే సంబంధిత సంస్థల వ్య క్తులపై ఆహార కల్తీ నివారణ చట్టం (1954) ప్ర కారం కేసులు నమోదు చేయాలి. కొన్ని సంవత్సరాలుగా ఈ శాఖ అధికారులు నమోదు చేసిన నామమాత్ర కేసులను పరిశీలిస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

తెలంగాణను ప్రకటిస్తే మన్యసీమ ఇవ్వాల్సిందే..


తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే మన్యసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని మన్యసీమ సాధన సమితి కో- కన్వీనర్ మాలువ సింహా చలం డిమాండ్ చేశారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు పూర్తయినా రాష్ట్రంలోని ఆదివాసీల స్థితిగతులు మెరుగుపడలేదన్నారు. ఆదివాసీల కోసం కేంద్రం జారీ చేసిన 1/70, పీసా చట్టాలు, జీఓ నంబర్ 3, 73, 5వ షెడ్యూల్ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఇక ఆరవ షెడ్యూల్ అమలు చేయాలని కోరితే దీన్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజ నుల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టిం చుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితిలో తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వరకు గల 10 ఐటీడీఏ ప్రాంతాలను కలుసుకుని ప్రత్యేక మన్యసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

తెలంగాణ ఏర్పాటు చేయకుంటే... చిదంబరం ఇంటిని ము ట్టడిస్తా...


డిసెంబర్ తొమ్మిదిలోగా తెలంగాణ ఏర్పాటు చేయకుంటే కేంద్ర హోంమంత్రి చిదంబరం ఇంటిని ము ట్టడిస్తామని బీజే పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వాలని ఉంటే వేరు కుంపట్లు పెట్టే అవసరం లేదని.... తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించినా, కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోందని విమర్శించారు.

ఎప్పటికైనా బీజేపీ మద్దతుతో తెలంగాణ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 9న మండ ల కేంద్రాల్లో జరిగే ధర్నాలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు

తెలంగాణ బిడ్డనే, రాజకీయాలు తెలియవు


పల్లెలన్నా పల్లె ప్రాంతాల ప్రజలన్నా తనకు చాలా ఇష్టమని ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాదవ్ అన్నారు అత్తగారి ఊరైన శాయంపేటకు తల్లి సావిత్రి, భార్య వాణి శ్రీ, పిల్లలు ప్రభాకర్, సావికర్‌లతో వచ్చిన సందర్భంగా కాసేపు మీడియాతో మాట్లాడుతూ ..గ్రామంలోని ఆం జనేయస్వామి ఆలయంలో నవగ్రహ, భూ లక్ష్మీ, బొడ్రాయి విగ్రహాల ప్రతిష్టాపన వేడుకల కోసం వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 350 చిత్రాల్లో నటించినట్లు తెలిపా రు.

శాయంపేట గ్రామంలో కళ్యాణ వేదిక, కళావేదికలను, స్థానిక పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా కత్తి కాంతారావు, కత్తి అనే రెండు సి నిమాల్లో నటించానని, విడుదలకు సిద్ధం గా ఉన్నాయన్నారు. తన పిల్లలను సినిమారంగం వైపు మల్లించనని చెప్పారు. తెలంగాణపై అభిప్రాయం అడగ్గా, తాను తెలంగాణ బిడ్డనని, రాజకీయాల గురించి తెలియదని అన్నారు.

రాజీనామా చేస్తారా.. రాజీ పడతారా


డిసెంబర్ తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ పదవులకు రాజీనామా చేస్తారా లేక రాజీపడి సీమాంధ్రులకు తొత్తులుగా ఉంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ బిడ్డలుగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని, సీమాంధ్రుల మోచేతి నీల్లు తాగుతూ పదవులనంటి పెట్టుకుని ఉండొద్దని హితవు పలికారు. తెలంగాణకు ద్రోహం చేసేవారికి నాగం జనార్దన్‌రెడ్డికి పట్టిన గతే పడుతుందన్నారు.

ఇక్కడో మాట, అక్కడో మాట మారుస్తున్నానా .....


హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో తాను ఇక్కడో మాట, అక్కడో మాట మారుస్తున్నానని న్యాయవాదులు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవని న్యాయశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.

ఏడాదికి పైగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు ఈ డిమాండ్ సరైనది కాదన్నారు. హైకోర్టు బెంచ్ డిమాండ్ ఈ నాటిది కాదని, 40 ఏళ్ల నుంచి ఉన్నదేనని.... డిమాండ్ న్యాయబద్ధమైనదే అన్న విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి విభేదం లేదని చెప్పారు. ఆందోళన విరమించి కోర్టులకు హాజరు కావాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేసి నా నిరసనలు కొనసాగించడం శోచనీయమని.... ఇప్పటికైనా కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు ఆందోళనలు విరమించాలని కోరారు

24న బీఈడీ ఇన్‌స్టెంట్ పరీక్ష

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ విద్యార్థులకు ఈ నెల 24న ఇన్‌స్టెంట్ పరీక్ష నిర్వహించ నున్నట్టు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి తెలిపారు. 2009-10సంవత్సరం బ్యాచ్‌కు సంబంధించి ఆగస్ట్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో ఒక థియరీ పేపర్‌లో ఫెయిలైన విద్యార్థులు మాత్రమే ఇన్‌స్టెంట్‌కు అర్హులు. ఈ నెల 12వ తేదీలోగా రూ. 3 వేల ఫీజు చెల్లించాలి. పరీక్ష 24వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

ప్రకృతి మరోసారి రైతన్నపై కన్నెరజ్రేసింది



ప్రకృతి మరోసారి రైతన్నపై కన్నెరజ్రేసింది. వర్షం రూపంలో విరుచుకుపడింది. చెరువులను, కాలువలను పంట చేలపైకి ఉసిగొల్పింది. సాయం చేస్తున్నట్టే నటించి దొంగదెబ్బ తీసింది. చేతికందిన పంటను నోటికి అందకుండా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంటను కళ్ల ముందే కాటేసింది. మరో పక్షం రోజుల్లో కోతలు ప్రారంభించాలనుకున్న వేలాది మంది రైతుల ఆశ ల్ని నీట ముంచింది. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక అన్నదాత కంటికిమంటికీ ఏకధారగా రోదిస్తున్నాడు.