15, నవంబర్ 2011, మంగళవారం

మనసుకు వికాసం... మన వన భోజనం

రంగేళీ దీపావళి పూర్తయ్యిందంటే... ఇక పిక్నికలే హడావిడి వచ్చేసినట్లే...

ప్రకృతితో మనిషికున్న బంధాన్ని తెలిపేందుకే వనభోజనాలను ఏర్పాటు చేసారు..

బంధువులతో, స్నేహితులతో పాటు సమాజంలో ఇతర వ్యక్తులను కలుపుకు పోయేందుకు...

వివిధ సంస్క ృతులు, సంప్రదాయాలు, పద్దతులు తెలుసుకునేందుకు...

కార్తీక మాసంలో వచ్చే వనభోజనాలు ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నది వాస్తవం.

కార్తీక మాసంలో ప్రతి రోజూ పిక్నికలే హడా విడి అంతా ఇంతా కాదు. పట్టణ వాతావరణంలో పార్కులకి, విహార కేంద్రాలకి రోజూ వెళ్లి రావటం, అక్కడే భోజనాలు చేయటం పరిపాటిగా మారినా... నేటికీ గ్రామీణ ప్రాంతాలలో కార్తీక సమారాధనలు, వనభోజనాల పేరుతో ఃపిక్నికఃలు జరుగు తున్నాయి.

శ్రీకృష్ణ కాలం నుంచే వన భోజనాలు

వాస్తవానికి వనభోజనాలు ఈనాటివి కాదు. శ్రీకృష్ణుడు చిలిపి తనాన్న్ని వర్ణించిన పోతన తన భాగవతంలో లొట్టలేసేలా ఆయన అల్లరిని వన భోజనాలను వర్ణించాడంటే అప్పటి నుండి ఇవి ఉన్నాయన్న మాట.

కార్తీకేహం కరిష్యామి ప్రతస్ధానం జనార్ధన ప్రీత్యర్ధం దేవా దేవేేశ దావెూదర మయాసహా...

అని కార్తీక మంత్ర జపంతో ప్రతి రోజూ ఉదయాన్నే చన్నీటి స్నాన మాచరించి... దీపంకి వాడే నూనె దైవ గుణానికి, వత్తి సత్య గుణానికి, అది రూపే వెలుగు రాజ గుణాలకు ప్రతీకలని, ఈ మూడు గుణాలు కలగలిసిన ప్రమిద తమ జీవితాలలో జ్ఞానదీపాలను వెలిగిస్తుందని పెద్దలు చెప్తారు. అంటే... రాజస్తవెూ గుణాలను అణచి వేసి సహజ సిద్దమైన మనిషిగా తయార వ్వాలనుకునే వారు సత్య గుణాన్ని అలవరచుకోవాలనిఅపðడే జీవితంలో జ్ఞానాంధకార మనే చీకట్లను తరిమివేస్తూ వెలుగు రేఖలు వికసిస్తాయని తద్వారా వెూక్ష మార్గం కి బాటలు వేస్తుందని మన పూర్వీకుల విశ్వా సం. శివ, విష్ణు భేదాలున్న సమయంలో పవిత్రమైన కార్తీక మాసాన్ని ఏకరీతిన ఆచరించడమే కాకుండా... సమాజంలో సామరస్య పూర్వక వాతావరణాన్ని తీసు కొచ్చేందుకే ఆయా ఆలయాల్లో... కార్తీక దీపా లు పెడితే... పుణ్య మని పూర్వీకులు చెప్పిన మాటల్ని నేటికీ ఆచరిస్తోందీ సమాజం.

కార్తీకంలోనే ఎందుకు

ఇక కార్తీక మాసంలోనే వస భోజనాల ఏర్పాటు చేసేందుకు మన పూర్వీకు లు ఎందుకు నిర్ణయించారంటే... మనకున్న 12 తెలుగు నెలలు ఆరు ఋతువులతో అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి.

చైత్ర, వైశాఖ మాసాలలో వసంత ఋతువు వచ్చే నెలలు. ఈ నెలల్లో ప్రకృతి కొత్త పులకరింతలకు సిద్దమవు తున్నా, ఎండల వేడిమి తీవ్ర వడగాడ్పు లు సాధారణంగా ప్రజల్ని బైటకు వెళ్లే పరిస్ధితి కలిపించవు. ఎండలు పెద్దగా అనిపించకపోయినా, తీవ్ర బడలిక చెందుతాం .

ఇక జ్యేష్ఠ, ఆషాఢంలో గ్రీష్మ ఋతువులో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేరోజులు..ఈ కాలం లోని సాధారణ పరి స్ధితిలోనే మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ కాలంలో బైట తిరగ టం వల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.

ఆపై వచ్చే శ్రావణ, భాద్రపదంలలో వచ్చే వర్షఋతువు కారణంగా ఏ క్షణాన వర్షాభావ పరిస్ధితి ఏర్పడుతుందో తెలియదు. అలాగే... నేలలు చిత్తడిగా ఉండటం, పర్యాటక ప్రదేశాలు, తోటలు, ప్రతి ఒక్కటి బురద గా, అపరిశుభ్రంగా తయారవ్వటంతో ఎక్కడా కూర్చొనే పరిస్ధితి ఉండ దు. ఈ సీజన్‌లో వన భోజనం ఎలాంటి సంతృప్తి ఇవ్వదు సరికాదా రోగాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి.

ఇక ఆశ్వయుజ, కార్తీకా లలో వచ్చే శరద్‌ ఋతువు. ఆశ్వ యుజంలోను వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ కాగా.. కార్తీకంలో కాసింత వేడి, చిరు జల్లులు, సాయంత్రానికి చిన్నపాటి చల్ల గాలులు వెరసి ఓ ఆహ్లాద కరవాతావరణం ఉంటుంది.

ఆపై వచ్చే మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువుకి ప్రతీకలు. ఈ కాలం ఎక్కువగా మంచుకురిసే, క్షణాలే ఎక్కువ. దీంతో ఈ నెలల్లో బైట తిరగాడే చిన్నారుల్లోనే కాదు. సాధారణ వ్యక్తులలోనూ అనేక రుగ్మతలు వచ్చే అవకాశాలు బొలెడున్నాయి.

చలి మంటలు, కాసింత వేడి ఇలా వాతావరణం ఆనందకరంగా ఉన్నా... ఉబ్బసం, శ్వాస సంబంధిత వ్యాధులు, ఇతర వ్యాధులను పైకి వస్తాయి. అలాగే చివరిగా మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే శిశిర ఋతువు చెట్ల ఆకులరును రాలుస్తూ... ప్రకృ తంతా బాధాతత్పహృదయంలో విలవిలలాడుతున్నట్లుం టుంది., పచ్చనివాతావరణ ఎక్కడా కానరాక మనసు కు కూడా ఎలాంటి ఆహ్లాదం దక్కదు.

అందువల్లే కార్తీక మాసం అన్నింటా, అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతుందని ముఖ్యంగా శివకేశవులకు ఇష్ట ప్రదాయకమైన నెలగా భావించిన పెద్దలు ఈ నెలలో సమారాధనలు చేయటం (అన్నదానం) శ్రేష్టమైనదిగా పేర్కొన్నారు.

కార్తీక మాసంలో వర్షాభావ పరిస్ధితి తక్కువగా ఉండటం... ఆశ్వ యుజంలో కురిసిన వర్షాలకు నేల చిత్తడ ిగా మారినా... అవన్నీ ఇగిరి గట్టి పడుతుం డటం, ప్రత్యేకంగా సంతోషకర పరిస్ధితులు ఎక్కువగా ఈ కార్తీక మాసంలో ఉండటం వల్లే వన భోజనాలకు ఈ నెలను ప్రత్యేకించా రోవెూ

వనాలలో భోజనాలు...

ఆహ్లాదకర వాతావరణాన్ని, ఆయుర్వేద గుణాలున్న చెట్లు, మొక్కలపై నుండి వీచే గాలులు పీల్చడం వల్ల కూడా ఆరోగ్యం సిధ్దిస్తుందని భావించిన పెద్దలు ఇలా వనాలలో భోజనాలు ఏర్పాటు చేసే వారని కొంద రు పెద్దలు చెప్తుండగా... ఆధునిక సమాజానికి


దగ్గరవుతూ అనేక ధ్వేషభావనలు పెంపొందించుకుని కులాల గోడలు, అనేక కట్టు బాట్లు విధించుకుని... లేని పోని భేషజాలకు పోయి. సమాజంలో అనేక విపరీత పరిణామాలు సిద్దిస్తున్న దశలో అందరినీ ఊరికి దూరంగా ఓ చోట కూర్చొన బెట్టి పరస్పర చర్చలు సమావేశాలు జరపటం, ఆరోజున ఎలాంటి యుధ్ద పరిస్ధితి నెల కొన కుండా ఆ ప్రాంతాలలో పూజలు, వ్రతాలు, చేసేవారని... అందరికీ సహపంక్తి భోజనాలు జరపి భోజన కాలే... హరిణా మస్మరణే... గోవిందా... గోవిందా... అంటూ భక్తి భావన తోడు చేసేవారు. దీని వల్ల తర తమ భేధాలు తగ్గి వైషమ్యాలు దూరమై సహజీవనా నికి బాటలు పడేవని.. ఈ క్రమంలోనే వనభోజనాలు పుట్టుకొచ్చాయని మరికొందరు పెద్దలు చెప్తారు.

ఇక సమాజంలో వస్తున్న మార్పులు, జరుగుతున్న పరిణామాలతో పాటు వాస్తవ దృక్కోణంలో వివిధ వర్గాల ప్రజల ఆచార వ్యవహారాలను దగ్గర నుండి పరిశీలించే అవకాశాలు ఈ వనభోజనాలు దారి చూపిస్తాయన్నది వాస్తవం.

మరోవైపు మన దేవతలు కూడా ఎక్కువగా ఏ కొండ పైనో, వనాలలోనో వెలసి, తమ భక్తులని తమ దరికి రప్పించుకుంటారు. ఇలా దైవ దర్శనానికి గుంపులుగా వెళ్లే భక్తులు చెట్ల నడుమ భోజనాదులు చేసేవారు.

కాల క్రమంలో పెరిగిన రవాణా వ్యవస్ధ... ఈ వనభోజనాలకు దూరం చేయటం తో... ఏడాదిలో ఓ సారైనా తమ వారం దరితో ఉల్లాసంగా గడిపే క్షణాలుగా వన భోజ నాలను గుర్తించి వీటిని క్రమం తప్పకుండా పాటిస్తు న్నాడని మరికొందరు చెప్తారు. నాగరిక సమాజంలో యాంత్రిక జీవనాన్ని అనుభవిస్తున్న మనిషికి షడ్రుచుల సమ్మేళనమైన భోజనాలతో పాటుగా ఆనందోత్సాహాలను అందించడమే కాదు... భవిష్యతరానికి అనేక విషయాలలో మార్గ దర్శకంగా కార్తీక శోభ, వనభోజనాలు నిలుస్తున్నాయనటంలో సందే హం లేదు.

పెరుగుతున్న కార్పొరేట్‌ కల్చర్‌...

కార్తీక మాసంలో శివుడికి, విష్ణువుకీ దీపారాధన చేసి.. ఉసిరి చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేస్తే... పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందన్నది పూర్వీకులు చెప్పేవారు. కాలక్రమంలో వన భోజనాలు విద్యార్ధులలో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారికి సమాజ కట్టుబట్లు ఇతర విషయా లపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడేవి. అయితే గత మూడు దశాబ్ధాలుగా సమాజంలో వస్తున్న అనేక మార్పులు కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోయి వనభోజనాలు జరుగుతున్నా యి. కాగా మరోవైపు ఈ వన సమారాధనలల్ని నాగరిక సమాజంలో పికనిేకలే పేరుతో విచ్చల విడి తనానికి ప్రతీకగా మారి పోయింది. పేకాట రాయుళ్లకి పిక్నికలుే నిత్యపండగగా మారిపోగా.. పిక్నికలేలో చిన్నారులకు, మహిళలకు ప్రత్యేకంగా జరిగే ఆటల పోటీలు పసందుగా ఉంటాయి. కార్తీక మాసం శివుడికి ఇష్ట ప్రదమైన నెల అని... నదీతీరాలలో పిక్నిక లు ఏర్పాటు చేస్త్తూనే... అక్కడే భక్తి శ్రద్దలతో స్నానాదులు, వంటలు పెడుతు... భక్త కన్నప్ప కూడా మాంసాదులతోశివుడ్ని ఆరాధించాడని చెప్తూ... నేడు పికనిేకలేలో మంసాహార వడ్డన క్రమంగా పెరుగుతోంది. అత్యంత భక్తి భావనతో కార్తీక మాసాన్ని జరుపుకుంటూ మద్య, మాంసాదులకు దూరంగా ఉండే కుటుంబాలు చాలనే ఉన్నాయి. అయితే ఇలా మాంసాదులతో వన భోజ నా లను కలుషితం చేస్తున్నారన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. పెద్ద పెద్ద హౌటళ్లు కూడా ఈ కల్చర్ని ప్రోత్స హిస్తూ... మన పూర్వీకులు కనీసం కార్తీక మాసంలోనైనా మాంసం తినకుండా దూరంగా ఉండి జీవ హింసకి పాల్పడరని ఆశిస్తే... దానికి తిలోదకాలు ఏనాడో ఇచ్చే సారు. ఇలాంటి పరిణామాలకు దూరంగా ఇక ముందైనా పిక్నికలుే జరగాలని ఆశిద్దాం.

వనాలలోనే భోజనాలెందుకు

ఒకపðడు వనాలలో ఉండి ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్య కరంగా ఉండే మనిషి... నాగరికత పెరిగాక ప్రకృతి వైద్యాన్ని వీడి అనేక రకాల వైద్యాల బాట పట్టాడు. చెట్టు బెరళ్లు, వేర్లు, ఆనేక ఆకు పసర్లు, ఇలా అనేక వృక్ష జాతులకు దూరమై...ఈ క్రమంలో అనేక రుగ్మతలకు చేరువయ్యాడు.

దీంతో మళ్లీ మానవాళిని ఏడాదిలో కనీసం ఒక్క రోజైనా వనాలకు వెళితే... కొంతమేరైనా మానసికోల్ల్లాసంతో పాటు ప్రకృతి ఆయుర్వేద ఔషధ గాలులు పీల్చ్చి.. ఆరోగ్యవంతుడవుతాడన్న ఆవస్యకతని తెలియచేస్తూ వనభోజనాలు ఏర్పాటు చేసినట్ల్లు పెద్దలు చెప్త్తారు.

సమిష్టి తత్వానికి ప్రతీకలుగా...

ఇప్పటికే ఉమ్మడి కుటుంబవ్యవస్ధ ఛిన్నాభిన్నమె...ౖ ఆనందాలే కాదు.. ఆచార వ్యవహారాలు దాదాపు మరచిపోతున్న క్రమంలో వన భోజనాలు సమిష్టి తత్వాన్ని పెంపొందించేందుకు అవకాశాలు చూపుతున్నాయనటంలో సందే హం లేదు. వ్యక్తుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటాలకు పిక్నికలుే కూడా వేదికలైపోతుండటం విచారకరం... ఈ వనభోజనాలని తమ స్వార్ధం కోసం వాడకొంటున్న వారిని జనం సమిష్టిగానే తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెలుగు స్మృతుల ఃదీపావళిః

  • జగమంతా వెలుగులిచ్చే దీపావళి వచ్చేసింది.... నాడు దీపావళి అనగానే...
  • ప్రతి ఇంటా కనిపించే హడావిడి నేటికి మచ్చుకైనా కానరావట్లేదు.

ఇందుకు కారణాలు అనేకం .... పెరుగుతున్న ధరలు, పెరగని జీతాలు, ఇవి చాలవన్నట్లు రాష్ట్రంలోని పరిస్ధితులు... సామాన్య జనాన్ని కుదేలెత్తించడంతో ఈ సారి దీపావళి తూతూ మంత్రంగానే కానిచ్చేయాలని చూస్తున్నారు జనం.దీంతో తెచ్చిన సరుకు ఎలా అమ్మాలో అర్ధం కాక బాణసంచా వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు.మా రోజుల్లో దీపావళి ... అంటూ నిన్నటి తరం చెపðకునే ముచ్చట్లు వింటుంటే...ఇక ముందు దీపావళి జ్ఞాపకాలలోనే మిగిలిపోయే పండగ అయిపోయేలా ఉందనిపించక మానదు.

దసరా హడావిడి పూర్తవ్వగానే దీపావళి హడావిడి ప్రారంభమయ్యేది. నిన్నటి తరంలో ఓ పదిహేను రోజులు ముందుగానే అన్ని ఇళ్లకి ఆ సందడి వచ్చేసి... దాదాపు అన్ని రంగాల వారికి ఎంతో కొంత ఉపాధి కలిపించేది. దీపావళి నాడు లకిë పూజ కోసం ప్రత్యేకంగా పూలషాపు మొ దలు కొని, బంగారు షాపు, కొత్త దుస్తుల కోసం బట్టల షాపులు, దర్జీలు ఇలా అంతా బిజీ బిజీగా ఉండే వాళ్లు. దీపావళినాడు డబ్బు లున్న వాళ్లయితే కంపెనీ మందుగుళ్లపై మక్కువ చూపి ఎన్నోరకాల టపాకాయల్ని కాల్చేవారు.

ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమే...

దీపావళి కి కావాల్సిన సామన్లు సామాన్య జనం సొంతంగా తయారు చేసుకోవటానికే ఉత్సాహం చూపేవారు. మతాబులు, చిచ్చు బుడ్లు, తూనీగలు, సిసింద్రీలు, తాటాకు టపాకాయ లు, జువ్వలు ఇలా బోలెడన్ని సామగ్రిని ఇళ్లలోనే తయారు చేసుకుని డబ్బుని ఆదా చేసుకునే వాళ్లు. ఈ క్రమంలో దాదాపు అన్ని ఇళ్లు ఓ కుటీర పరిశ్రమలకు కేంద్రాలుగా మారిపోయే వంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇళ్లన్నీ మసి మసిగా తయారవుతా యని పెద్దలు వారించినా... పిల్లలు మాత్రం ఎక్కడో ఓ మూల దేవదారు చెక్కల్ని కాల్సి, వస్త్ర కాగితం పట్టి అందులో సరేకారం, గంధకం కల్పి... సిసింద్రీలు దట్టించి వదిలేవారు. అడ్డూ ఆపు లేకుండా రివ్వుమంటూ ఎగిరే ఈ సిసింద్రీలు ఏ పూరి గుడిసిపైనో పడితే... అరుపులు, కేకలు, నీళ్లతో పరుగులు ఓ వంతైతే... ఇవతల మన వాళ్ల వీపులు విమానం వెూతలతో లకిë బాంబులని తలపించేలా మారు వ్రెూగి పోయేవి. ఇక చిచ్చుబుడ్లు దట్టించేపðడు మొదట్లో పెద్ద వాళ్లు కొంత విసుక్కుని ఏంటీ సంత అంటూ గద్దించినా... బిక్కు బిక్కు మంటూ పిల్లలు దట్టించినవి సరిగా వెలకపోవటవెూ ఏ ఇబ్బందో జరిగితే అలా కాదు ఇలా కాస్త సురే కారం వెరు,ఇంకా గట్టిగా దట్టించు ఇంకా చిట పట మంటూ వెలగాలి అంటూ డైరక్షన్లతో ప్రారంభమై చివరికి లుంగీ ఎగ్గట్టి మందుగుండుని సరి చేసి బుడ్లు దట్టి స్తూ తన చిన్న తనపు దీపావళి కబుర్లు చెపðకుంటూ పనిని పూర్తి చేసే వారన్నది నిజం.

సామాగ్రి ఎండపెట్టడం ఓ ప్రహసనమే...

వంద రూపాయలు పెడితే వచ్చే బుట్టెడు మందుగుండు సామగ్రి (ఇందులో కాకర పువ్వె త్తులు, అగ్గి పెట్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, పాము బిళ్లలు, పెన్సిళ్లు, చిటపట కాకర్లు... ఇలా బోలెడన్ని లెక్కకు మిక్కిలి అన్నట్లు ఉండేవి) వీటిని రోజూ ఎండ పెట్టడం కూడా పిల్లలకి పెద్ద ప్రహసనమే... ఇంట్లో వాళ్లు చూడకుండా దొంగచాటుగా కాల్చేసి నాకేం తెలిదన్నట్లు ముఖం మార్చే సుకునే వారు. కావాలంటే గత తరం వారైన మీ అమ్మా నాన్నల్నో, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలనో అడగం డి.. ఇలాంటి దీపా వళి ముచ్చట్లు బోలెడు చెప్తారు.

మొత్తానికి ఃనరక చతుర్ధశిః వచ్చేసిందంటే.. వీధిలో పిల్లల హడావిడి ఎంతో ఊళ్లో తయారు చేసే టపాసుల శబ్ధాలు, జువ్వల రరు... రరు లు.. సురు మంటూ ఎగిరి పడే పిచ్చుకలు ఎక్కడెవరు ఏం కాల్చినా నిల బడి చూసి ఆనందిస్తునే తానూ మరిన్ని చేయాలంటూ ఇంటికి పరుగులు తీసేవాళ్లు. దీపావళి మరో రోజులో వస్తుందన్న సంతోషం అందరిలోనూ కనిపించేది.పండగ రోజు ఇంట్లో ఉదయం నుండి ప్రతి ఇల్లూ సందడే సందడి. తలంటు స్నానాలు, కొత్త బట్టలకు రిబ్బన్‌ మ్యాచింగ్‌ లేదని అలకలు, ఇందుకోసం పది రూపాయలు పట్టుకుని ఊళ్లోని రిబ్బన్ల షాపు లకి పరుగులు.. ఆ జ్ఞాపకాలు అనుభవించే వారు వర్ణిస్తున్నపðడు వింటే ఎంత బాగుంటుందో..

ఇక మద్యాహ్నం పిండి వంటలతో భోజనాలు ముగిస్తే... సాయంత్రానికి ఆడ పిల్లలు ఇంటి ముందు రంగవల్లులతో ముస్తాబులు చేసేవారు. దేవుడి గదిలో అమ్మ చేస్తున్న లకిëదేవి పూజ ఎపðడు పూర్తవుతుందా అని... దీపాలు ఎపðడు పెడతారా అని పెద్ద పని ఉన్నట్లు వీధులోకి పెరట్లోకి తెగ తిరగేసే వాళ్లు... అసలు దీపావళి అంటేనే పిల్లల పండగ కదా మరి ఆ మాత్రం హడావిడి చేయటక పోతే ఎలా అని పెద్దలు చిరునవ్వులు చిందించిన సందర్భాలూ బోలెడు. అమ్మ దీపాలను తెచ్చి పెట్టడం ప్రారంభించి ఆముదం కర్రని వెలిగించి పిల్లల్తో గుమ్మం దగ్గర కొట్టించే వాళ్లు. ఇలా చేస్తే చేతులు కాలిపోవని చెప్పేవాళ్లు నాటి బామ్మ లు. అమ్మ తెచ్చిన దీపాలను ఇంటి ముందు అందంగా వరుస క్రమంలో పెట్టడంలో ఆడ పిల్లలు నిమఘ్నమైతే... దీపం రావటమే ఆలస్యం అన్నట్లు పరుగు పరుగున వెళ్లి దాచిన సామానులన్నీ బైటకు తెచ్చే వాళ్లు మగపిల్లలు. చేతిలో తాట్రేకు టపాకాయ కాల్చడమంటే ఓ అద్భు త సాహస ప్రక్రియే నాడు. మగ పిల్లల్ని ఆడ పిల్లలు కూడా ఫాలో అవుతూ తిట్లు తిన్న సందర్భాలున్నాయి.

మగ పిల్లలు భూ చక్రాలు, చిచ్చు బుడ్లని కాలుస్తూ... తారా జువ్వలని, పిచ్చుకలని, సిసింద్రీలని కాలుస్తుంటే.. తామూ అవి కాలుస్తామని మారం చేసే ఆడ పిల్లల్ని కాకర పువ్వెత్తులని కాల్చమని వారించే వారు పెద్దలు. అన్నీ కాల్చేయాలనున్నా... పౌర్ణమికి, నాగుల చవితికి అంటూ కాసిన్ని తీసి దాచేయటమే కాకుండా... ఎవరెక్కడ ఏం కాల్చుకు ఛస్తారో అనిలోపల భయపడుతునే మరోవైపు పిల్లలు కాలుస్తున్న మందు గుండు వెలుగుల్లో ఆనంద పడుతూ... తన చేతిలో మాత్రం ఓ బర్నాలో, నూనె గిన్నో రడీగా ఉంచుకునే వాళ్లు అమ్మలు.మొత్తానికి దీపావళి నాడు కాల్చాల్సినవన్నీ కాల్చేసినా... ఇంట్లోకి రండి అని నాన్న గద్దింపుతో లోనకొచ్చి... పాముల బిల్లలు వెలిగించి అది బుస బుస మంటుం టే ఆనందించే రోజులవి.

ఇవి కాక గ్రమంలోని యువకులంతా రెండు వర్గాలుగా వీడి పోయి తారా జువ్వలు, సిసింద్రీలు, పిచ్చుకల్ని ఆకాశంలో కాక భూమిపైనే వదులుతూ... పరుగులు తీస్తూ... ఃపల్లిః అంటూ ఓ గ్రామీణ క్రీడని కేవలం దీపావళినాడే అడే వారు. ఇవన్నీ గత తరం ముచ్చట్లు కాగా... నేడు దీపావళి పేరు చెపితేనే చేతులు కాల్చుకోవటం మాట అటుంచి డబ్బులు కాల్చే పండగగానే పరిగణిస్తున్నారు. అణబాంబులు వినియోగిస్తుండగా లేని భయాలు దీపావళి బాగా జరుపుకుని టపాసు లు కాలిస్తే... ఏర్పడే కాలుష్యం పట్ల జనం బెంబెలెత్తేలా ఉపన్యాసాలు దంచిన ప్రభావంతో పాటు పెరగని జీవన ప్రమా ణాలు సైతం పండగ చేసుకోవాలంటేనే ఖర్చెందుకన్న భావన అందరిలో పెరిగి పోయింది.

పోనీ ఇంట్లోనే టపాసులు చేసుకోవ టవెూ... చిచ్చుబుడ్లు కట్టుకోవటవెూ చేద్దామనుకుంటే... అందుకు తగిన ముడి పదార్ధాలు దొరకట్లేదు సరికదా బ్రాండెడ్‌ కొందామంటే గత ఏడాదికన్నా రెట్టింపు ధరలు పెరిగి పోవటంతో... పిల్లల సరదా తీర్చేందుకైనా... ఉన్నంతలో మందుగుండు సామాన్లు కొంత కొని.. ఈ సారి దీపావళి ఏదోలా కానిచ్చేదా మన్న భావన సామాన్య జనంలో ఉంది.

పెట్టుబడులు వచ్చేనా

గత కొన్నేళ్లుగా దీపావళి సామాన్లు అమ్ముతూ వస్తున్నా... ఏనాడూ ఇంతటి పరిస్ధితి చూడలేదు. గతంలో మేం కొన్న ఖరీదుపైనే 50 శాతం ధరలు పెరిగాయి. దీనికి తోడు రవాణా ఖర్చులు, తదితరాలు కల్సి ఈ సారి ధరలు పెరిగాయనే చెప్పాలి. దీంతో మందుగుండు సామాన్ల అమ్మకాలు బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తూ... పెట్టిన పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం కూడా కనిపించడంలేదు.

- డి. వెంకటాచారి,

మందుగుండు అమ్మకందారు, ఆనంద్‌బాగ్‌


అపðలు పాలు చేస్తున్న పండగలు

గత నెలంతా బందులు, స్ట్రైకుల వల్ల సంపాదన అంతంత మాత్రమే... వాహనా లు బైటకు పంపాలంటే బాధపడ్డా... సరి కాదా.. ఇంటిని, ట్రావెల్స్‌కి ఖర్చు తడిసి వెూపెడైంది.

ఇపðడు దీపావళి జరపాలంటే... మరింత ఖర్చు పిల్లల సరదాని కాదనలేక... సాంప్ర దాయాన్ని మర్చిపోలేక అపð చేయాల్సి వస్తోంది. ఇక ముందు పండగంటేనే భయపడి పారిపోయేలా పరిస్ధితి తయారవుతోంది. ఇలా అయితే జనం బతికేదెలా

- కృష్ణ, ట్రావెల్‌ ఏజంట్‌

ఆర్‌కె నగర్‌


టీవీల్లో చూడాల్సి వస్తుందేవెూ

నా చిన్న తనం రోజులే గుర్తు తెచ్చుకుని నేటి దీపావళి మనవళ్లతో గడిపేస్తా.. మందుగుండు సామాన్లు కాల్చకుండానే చేతులు కాలే లా ధరలున్నాయి. ఇక ముందు ఎవరైనా దీపావళి జరుపుకుం టుంటే టివిల్లో లైవ్‌ ఇస్తే.. చూసి ఆనందించే రోజులు వచ్చేస్తాయోవెూ అనిపిస్తోంది.

- ఎం.వి. రామశాస్త్రి, ముంగండ, తూర్పుగోదావరి

పండగంటే భయమేస్తోంది

పెరుగుతున్న ధరలే బెంబేలెత్తిస్తున్న దశలో పండగ చేయటమంటే భయమేస్తోంది.ప్రయివేటు ఉద్యోగుల జీతాలు అంతంత మాత్రం. ప్రభుత్వం సంక్షేమం పేరుతో రూపాయికి బియ్యం ఇస్తామని చెప్తూ ... వ్యాట్‌ మాటున నిత్యావసరాల ధరలు మరింత పెంచేసి నడ్డి విరిచేసి, పండగ జరుపుకోనివ్వట్లే.... మేం ఎవ్వరికి చెపðకోవాలి.

- ఎం. సుభద్ర, గృహిణి, వరంగల్‌

వెయ్యికి గుప్పెడు సామాన్లు..

గత ఏడాదే రేట్లు పెరిగాయని అనుకుంటే ఇపðడు సామాన్యుడికి అందుబాటులో లేనంతగా ఎగబాకాయి. వెయ్యి రూపాయలు తీసుకెళ్తే... 10 రకాల సామాన్లు కూడా రాలేదంటే మందుగుండు ధరలు ఎంతలా పెరి గాయో అర్ధం చేసుకోవచ్చు. ఇలానే కొన సాగితే దీపావళి జరుపుకోకుండా మిన్నకుండటమే బెటరని పిస్తోంది.

- శ్రీనివాస్‌, సంకిలి, శ్రీకాకుళం

అంగవైకల్యం అడ్డొచ్చినా.. గ్రామం నుంచి గూగుల్‌కి

విధి వెక్కిరిస్తూ... తనపై దాడి చేసి అంగ వికలాంగుడిగా చేసేసి... మూడు చక్రాల బండిపైనే...

ఇక నీ జీవిత ప్రయాణం అని తన స్ధితి గతిని మార్చేసినా... మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ...

తనని తాను నిరూపించుకోవాలన్న తపన..ఎన్ని ఒడిదుడుకులెదురైనా... ఎదుర్కొని నిలబడుతూ...

తన సంకల్పానికి సాయమందించిన చేతులెన్నో... ఉన్నాయని... తన కాళ్లని తీసేసిన దేవుడు..

ఆకాశమే హద్దుగా సాగిన.. తన లక్ష్య సాధనకి ఎందరో మంచి వ్యక్తులని పరిచయం చేసాడని...

గ్రామీణ ప్రాంతం నుండి...ఐఐటి చదివి... ప్రతిష్టాకర గూగుల్‌లో ఉద్యోగం సంపాదించిన...

నాగ నరేష్‌... నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు

మూడు చక్రాలపై చిరునవ్వులు చిందిస్తూ.. ఆశా వాదిగా కనిపించే నాగ నరేష్‌ మాటలు వింటే గొప్ప ఆధ్యాత్మిక వాది కూడా. అనుకోని ఘటన జరిగితే విధి వంచితుడిగా ఇది తన ఖర్మంటూ తిట్టుకు కూర్చొకుండా ఐఐటి పూర్తి చేసి, గుగూల్‌ లో ఉద్యోగం సంపాదించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

తణుకు దగ్గర్లో గోదావరి తీరాన ఓ కుగ్రామం తీపర్రు. అక్కడ నివాస ముండే ప్రసాద్‌ లారీ డ్రయివర్‌గా పని చేస్తుంటే..ఆతని భార్య కుమారి, తాను తన భర్త నిరక్ష్య రాస్యులు కావటంతో కనీ సం తన ఇద్దరి పిల్లల నైనా బాగా చదివించు కోవా లన్న తపనతో... గుట్టుగా సంసారం నెట్టుకొచ్చేది. అందరి పిల్లల్లానే నాగనరేష్‌ చిన్న తనంలో అల్లర్లు, మారాం చేయటాలు, పరుగులు తీయటాలు నిత్యకృ త్యమే. అయితే పాఠాలు చదవటంలో మాత్రం ఫస్టే. అల్లరెంత చేసినాఎన్ని తిట్లు తిన్నా చదువు విష యం లో ఉపాధ్యాయుల ప్రశంసలందుకునే వాడు.

తన చిన్న తనపు రోజుల్ని గుర్తు చేసుకుంటూ... ఃచదువుకోవాలన్న తనలోని కుతూహలం గమనిం చి... మా నాన్న చదువు కోక పోయినా... దగ్గరుండి మరీ చదివించేవాడు.

నే చెపుతున్నది రైటో.. రాంగో.. తెలియక పోయినా ప్రతి ప్రశ్నకు నాతో పదే పదే జవాబులు చెప్పిస్తూ, పరీక్షల్లో నే క్లాసుకి ఫస్టొస్తే..తానే పాసై పోయి నట్లు తెగ హడావిడి చేసిన రోజులు మరువలేనివి..ః అంటూ తన గతాన్ని నెమరు వేసుకొంటాడాయన.



నా నిర్లక్ష్యం వల్లే నా కాళ్లు పోయాయి.

సంక్రాంతి సెలవులివ్వటంతో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పండగజరుపుకోవాలనుకున్నాం. నాకు బాగా గుర్తు జనవరి 11 , 1993. మరో బంధు వు ఇంట్లో ఓకార్యక్రమం చూసుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు అమ్మా నేను, అక్కా బయలుదేరాం. బంధువు లింట్లో కార్యం అయ్యే సరికి బాగా పొద్దు పోయింది. అమ్మమ్మ వాళ్ల ఊరెళ్లాలంటే ఆ టైమ్‌లో బస్సుల్లేవు. ఏం చేయాలా అని ఆలో చిస్తున్న సమయంలో సరిగ్గా నాన్న లారీ లోడ్‌తో అటుగా వచ్చింది. రోడ్‌పై మమ్మల్ని చూసి ఆపారు.

విషయం చెప్పాక... రాత్రంతా ఇక్కడెందుకు.. ఇంటి కొచ్చి.. ఉదయం వెళ్ధురుగానీ అనటంతో, అప్పటికే లారీ కేబిన్‌లో జనాలున్నా.. సర్ధుకోవాలని ఓ వైపు రిక్వస్టు చేస్తునే... అమ్మా, అక్క లని బోనెట్‌పై కూర్చో పెట్టి, నన్ను తన సీటు పక్కన ఉన్న డోర్‌ దగ్గర కూర్చోపెట్టుకున్నాడు నాన్న.లారీ కదిలి. స్పీడ్‌ అందు కుంది. ఓ వైపు నిద్రి స్తున్నా... రోడ్లపై తిరుగుతున్న వాహనాలు, ఇళ్లు, షాపులు చూడాలన్న ఉత్సాహం.. అల్లరి చిల్లరి ఆలోచనలకు ఎలానూ కొలవు లేదు గా... ఈ నేపధ్యం లో నా పక్క నున్న డోర్‌ లాకపౖేె పడింది నాచెయ్యి. అంతు ఒక్క సారిగా అది ఊడి రావటం లారీ నుండి నే కింద పడటం క్షణాల్లో జరిగి పోయాయి. అదే సమ యం లో లారీ వెనక ఉన్న ఇనుప కమ్మెలు నాకాళ్ల ని చీల్చేసాయి. వెంటనే నాన్న లారీ అపే డు. యాక్సిడెంట్‌ అయిన ప్రాంతానికి దగ్గరో ్లనే ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి నన్ను అర చేతుల మీదే పరుగు పరుగున తీసుకెళ్తే పోలీస్‌ కేసు పెట్టాకనే రండి అంటూ నిఖ్ఖఛ్చి గా చెప్పేయటంతో.. చేసేది లేక దిగాలుగా బైటకొచ్చిన నాన్నకి ఎదురుగా రోడ్డు మీద ఓ కానిస్టేబుల్‌ కనిపించాడు. ఆయనకి పరిస్ధితి వివరిం చడంతో... ఆయనే నన్ను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యులు కాళ్లకి కట్లుకట్టి, పేగులు మెలి తిరిగి ఉన్నాయని చిన్న పాటి ఆపరేషన్‌ కూడా చేసి సవరించారు. అయితే విధి రాతని ఎవ్వరూ తప్పించ లేవెూవెూ కాళ్లకి ఇన్ఫెక్షన్‌ సోకి సెప్టిక అయ్యాయి.దీంతో నన్ను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లాలని మా నాన్నకి చెప్పేసారు అక్కడి వైద్యు లు. నన్ను అక్కడికి మార్చాక... నా కాళ్లు తొలగిం చేసారు. ఆసుపత్రిలో. అంతా నా మీద జాలి చూపిస్తూ... నన్ను చిన్న పిల్లాడిలా నన్ను లాలి స్తుం డటంతో కాస్త ఆనందంగా.. తెచ్చే పళ్లు, బ్రెడ్‌లు తింటూ హాయిగా కాలక్షేపం జరిగి పోతోంది.మూడు నెలల తరువాత నన్ను డిస్చార్జ్‌ అయ్యి ఇంటి కెళ్లానో లేదో ఊరు ఊరంతా నన్ను పరామర్శించడానికి వచ్చింది. ఊళ్లో చలాకీగా తిరిగిన నేను కాళ్లు లేకుండా మంచాన పడటం అందరినీ కలచి వేసిం ది. అయినా నన్ను అంతా చూటానికి వస్తున్నారనే సంతోషం.నన్ను చమ ర్చేది. నా మిత్రులంతా ప్రతి క్షణం నాచుట్టూనే ఉం టూ కబుర్లు చెప్తూ.. నా బాధ ని మరిచి పోయేలా చేస్తుండేవారు. కొన్నాళ్ల తరువా త వాళ్లే తమ చేతులపై నన్ను ఆడుకున్నా... ఎక్కడి కైనా వెళ్లినా తీసుకు ని వెళ్లడం ప్రారంభించారు. అసలు నాకు యక్సిడెంట్‌ కాక ముందే తణుకు పట్ట ణానికి వలస వెళ్లి పోవాలనుకున్నాం. కాబట్టి తప్పనిస్ధితిలో మేం తణు కు కి షిఫ్టయ్యాం. అప్పటికే నేను చదువులో ఫస్టొచ్చే వాడిని కావటంతో అక్కడి మిషనరీ స్కూల్‌ వాళ్లు తమ స్కూల్లో నాకు సీటిచ్చారు. అక్క కూడా ఆ స్కూల్లోనే చేరింది.

ఇక ఉదయం స్కూలుకి తీసుకెళ్లింది మొదలు అన్నీ నాకు అక్కే...నన్ను వెూసుకుపోయేది. చదివించేది. బోధించేది. మేం పడుతున్న బాధ భరించ లేకో ఏవెూ, నాన్న స్కూలు పక్కనే ఓ స్ధలం చూసి ఇల్లు కట్టుకునేందుకు సిద్దపడ్డాడు. స్కూల్లో స్నేహితులు కూడా ఎక్కువవ్వటంతో వాళ్లు ఇంటికి వచ్చి మరీ నన్ను తీసుకు పోయేవారు. మూడో క్లాసులో ఉండగా జైపూర్‌ కాళ్లు అమర్చారు. నాకు పూర్తిగా కాళ్లు తొల గించిన క్రమంలో వాటితో నడవటం కాస్త బాధా కరంగా ఉండేది. దాదాపు రెండేళ్లు వాటితో కుస్తీ పట్టినా నడవటం సాధ్యం కాకపోవటం, కూర్చో వటం ఇబ్బంది కరంగా మారటం తో.. ఇక నాతో కాదని కుంగిపోతున్న సమ యంలో మూడు చక్రాల సైకిల్‌ బాగా సాయపడింది. అందరికీ వెూసే భారం తగ్గింది. అయినా ఎపðడూ నాకు వెన్నంటి ఉండే స్నేహితులు, అక్క సైకిల్‌ని తోస్తూ... క్లాసులోకి వెూసుకు పోయేవాళ్లు. క్లాసులో అందరితో పోటీపడి మరీ చదివే వాడ్ని... క్లాసు ఫస్టు రావాలని పరితపించే వాడిని. ఈ క్రమంలో మా లెక్కల మాషా ్టరు ప్రవెూద్‌లాల్‌ గారు నన్ను టాలెంట్‌ టెస్టులపై దృష్టి పెట్టమని ప్రేరేపిస్తే... అప్పటికే ఐఐటి కోసం ప్రిపేర్‌ అవుతున్న నాకు సీనియర్‌, మిత్రుడు చౌదరి నాకు ప్రేరణ ఇచ్చాడు. వీరిద్దరి ప్రోత్సాహంతో 10 వ తరగతిలో 542 మార్కులు సాధించి స్కూల్‌ ఫస్టొచ్చా. దీంతో గౌతమ్‌ జూనియర్‌ కాలేజిలో తమ కాలేజీలో ఫీజు మినహాయింపు ఇస్తూ... ఇంటర్‌ సీటి చ్చారు. ఇందుకు ప్రవెూద్‌ సార్‌ చేసిన కృషిని ఎంత చెపðకున్నా తక్కువే. ఇంత కాలం అమ్మా, నాన్న, అక్క స్నేహితుల నడుమ ఉన్న నేను ఒక్కసారిగా రెసిడెన్షియల్‌ వాతావరణా నికి మారటం కాస్త ఇబ్బందిగా మారింది. దానికి అల వాటు పడటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఓ సారి లైబ్రరీలో ర్యాంకుల రారాజు భాస్కర్‌ అంటూ వచ్చిన వార్త నన్ను ఆకర్షించింది. ఓ పేద జాలరి కుటుంబం నుండి ఐఐటిలో మొదటి పది ర్యాంకర్లలో ఒకడిగా నిలవటమే కాకుండా ఏఐ ట్రిపుల్‌ ఈ లో ప్రధమ ర్యాంకరుగా ఎదిగిన ఈ కె కె ఎస్‌ భాస్కర్‌ గురించి చదివా... అప్పటికే ఎంసెట్‌లోనూ ఫస్టు ర్యాంకరు భాస్కరే. ఆయనని స్పూర్తిగా తీసుకుని నేనూ ఎందు కు ఎదగ కూడదనిపించింది.ఈ క్రమం లో విద్యార్ధు లని ఉత్తేజ పరిచేందుకు ఏర్పాటు చేసన కార్యక్ర మానికి భాస్కర్‌ కూడా వస్తున్నాడని తెల్సి ఆతన్ని కలవబోతున్నందుకు ఆనందంగా ఫీయ్యా. చివరికి ఆయనని కలిసా... దాదాపుగా నా కన్నా ఓ రెండేళుపెద్దే ఉంటాడెవెూ కానీ ఆయన సాధించిన విజ యాలు నన్ను అబ్బురపరిచాయి. ప్రేరణ కలిగించా యి. నా తల్లిదండ్రులు, అక్క సహకారం అంతా ఇం తా కాదు. ఎక్కడైనా నేను విఫలమై బాధ పడితే ఓదా రుస్తూ... ఇంకా చదువు తప్పక విజయం సాధి స్తావ ని ప్రోత్సహించేవాళ్లు... చదువు పట్లనే చూపి స్తున్న శ్రద్ద నేను సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం కావచ్చు. ఎలాగైనా ఐఐటి సీటు సాధించాలన్న దీక్ష తో చదవటం ప్రారంభించి చివరికి విజయం సాధిం చా. ఐఐటిలో నాకొచ్చిన ర్యాంకు 992 పెద్దది కాక పోయినా వికలాంగుల కోటాలో నేను నాలుగో వాడ ిగా నిలిచా. మద్రాసులోని ఐఐటిలో కంప్యూటర్‌ సైన్స్‌ లో చేరా... అయితే నా మూడో తరగతిలో జైపూర్‌ కాళ్లు అమర్చిన వాళ్లు నే కాస్త ఎదిగాక నాకో జీవనో పాధి కలిపిస్తామని వచ్చారు. అపðడు ఐఐటి నా లక్ష్యం అది తప్పక సాధిస్తా... నే అందులో చేరాక సాయం చేయండని చెపితే..తప్పక అని హామీ ఇచ్చా రు. గుర్తుంచుకుని మరీ నే ఐఐట ిలో చేరాక ఫీజులు తదితరాలు వాళ్లే చూసుకునే వాళ్లంటే గొప్ప విషయమే కదా. దీంతో నా తల్లిదండ్రులకు నా చదువు భారం కాకుండానే సాగుతుం దన్న ధైర్యం నాకొచ్చింది. ఐఐటిలో పరిచయమైన కార్తీక అనే సీనియర్‌ అన్నింటి నాకు దశా దిశ నిర్ధేశన చేస్తూ ఓ విధంగా రోల్‌ వెూడల్‌గా నిల చాడు. తొలి ఏడాది పూర్తయ్యాక సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చే సరికి కాలేజ్‌లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా లిఫ్ట్‌ స్ధానంలో మెట్ల మార్గంకి తోడుగా వాలుగా ఉండే ర్యాంప్‌ ఏర్పాటు. ఇది నేను ఏ క్లాసుకైనా ఓ అంతస్తునుండి మరో అంతస్తుకి వెళ్లాలనుకుంటే... ఇబ్బందే.. ఏం చేయాలో పాలు పోని దశలో విద్యార్ధి విభాగానికి జనరల్‌ సెక్రటరీగా ఉన్న ప్రసాద్‌, డీన్‌ ప్రొఫసర్‌ ఇడి చాందీలు విద్యుఛ్చక్తిలో నడిచే చక్రాల కుర్చీ కొనుకునేందుకు ఏభై ఐదు వేల రూపాయలు అప్పటికపðడు సమకూర్చి ఇచ్చారు. ఈ కుర్చీ నా జీవన గతినే మార్చేసింది. ఐఐటిలో ప్రొఫసర్‌ పాండు రంగన్‌ గారు చేసి హెల్ప్‌ చాలా గొప్పది. ఇంటర్న్‌ షిప్‌ కోసం నన్ను బోస్టన్‌కి పంపించారాయన.

ఈ క్రమంలో నాలుగేళ్లు ఎందరినో కలిసే అవకా శాలు వచ్చాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నా... ల్యాబ్‌లో పనిచేసే వాళ్లతో మాటా ్లడుతుంటే నిజమే ఈ లోకంలో కొందరే చెడ్డవాళ్లు అంతా మంచి వాళ్లే ..అన్న వాస్తవం తెలిసింది. నాకు సాయం చేసిన వారినెన్నడూ మర్చిపోనని వారిఇఎన్నడూ కృతజ్ఞతలు చెప్తున్నా... నా మిత్రులంతా పిహెచ్‌డి చేయమని ప్రోత్సహించినా... ఇన్నాళ్లు నా కోసం కష్టపడ్డ తల్లి దండ్రులకు అండగా నిలవటం కోసం ఉద్యోగ వేట ప్రారంభించా. ఈ దశలో నాకు వెూర్గాన్‌ స్టాన్లీ కంపె నీ నుండి మంచి ఆఫర్‌ వచ్చినా... నాకు గేమ్స్‌ థీరీ, అల్గారి ధమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లపై విపరీతమైన ఆసక్తి ఉండటంతో తరువాత వచ్చిన గుగూల్‌ ఆఫర్‌కే ప్రాధాన్యత ఇచ్చా... ఇదండీ నా పోరాటం వెనుక ఉన్న కధాకమామిషు.

కాళ్లు తీసేసి ప్రాణాలు కాపాడారు..

నా నిర్లక్ష్యం. ఆకతాయి తనం కారణంగానే నేను లారీ కింద పడితే... నన్ను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లాక... వైద్యులు పరీక్షించి బాగా నిర్లక్ష్యం చేయటం వల్లే నా కాళ్లకి సెప్టిక అయ్యిందని అది వెూకాళ్లకి కూడా పాకిందని, కాళ్లు తీసేయక పోతే ప్రాణాలకే ప్రమాదం అంటూ దాదాపు నడుం వరకు నా రెండు కాళ్లని ఆపరేషన్‌ చేసి తొలగించేసారు.

నాకు తెలివొచ్చాక అంతా అగమ్య గోచరం. లేవబోయా సాధ్యం కాలే.. ఇదేంటని చూసా..నా కాళ్లు కని పించ లేదు. ఏమైందని అడిగా ఎదురుగా ఉన్న అమ్మని. ఆమె భోరున ఏడుస్తూ విషయం చెప్పింది. మిన్ను విరిగి మీద పడ్డట్టు అయ్యింది.

స్పూర్తి రగిలించిన ర్యాంకుల రారాజు

నేను ఇంటర్‌ చదువుకునే రోజుల్లో మా కాలేజికొచ్చిన ర్యాంకుల రారాజుగా అప్పట్లో పిలుచుకునే భాస్కర్‌ నాలో స్పూర్తి రగిలించాడనే చెప్పాలి. ఆయనని ఒ సారి కలిసానో లేదో... నేనూ ఎందుకు ఆయనలా మంచి మార్కులు తెచ్చుకోకుని ర్యాంకులు సాధించకూడదన్న భావన నాలో మెదలైంది.

అప్పటి నుండి ఐఐటి నా లక్ష్యంగా ఎంచుకుని దాన్ని చేరేందుకు ఎంత కష్టమైనా ఒర్చుకుని ముందుకు సాగా... నా విజయం వెనుక ఎందరో మిత్రులు, మరెందరో సన్నిహితులతో పాటు ఎన్నో ఆపన్న హస్తాలు కూడా అండగా నిలచాయి. వారే లేకుంటే నేనెక్కడ ఉండే వాడినో...

సాటి ప్రయాణీకుడు నా హాస్టల్‌ ఫీజు కట్టాడు..

నే బిటెక రెండో ఏడాది పూర్తవ్వ గానే అనుకుంటా ఓ కాన్ఫరెన్సు కోసం రైల్లో వెళ్తున్న నాకు కో పాసింజర్‌గా పరిచయమైన సుందర్‌ అనే వ్యక్తి.. నాగురించి కొద్దిగా తెలుసుని నా హస్టల్‌ ఫీజుని భరిం చాడంటే... నాకు ఎందరి ఆపన్న హస్తాలందాయో అర్ధం చేసుకోవచ్చు.

లేేకుంటే తొపర్రు లో వ్యవసాయం చేసుకుంటూ ఏ పశువులో మేపుకునేం దుకు పరిమితమై పోవాల్సిన నాకు ఎందరో చేసిన సాయమే నన్ను ఇంతటి వాడిని చేసిందన్నది యదార్ధం.

ఈయనదో వి'చిత్ర' ప్రపంచం

అందరి జీవితాలలొ ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. అయితే అలాంటి వాటినుంచి ప్రేరణపొంది తనని తానుతీర్చిదిద్దుకుంటూ ముం దు కేగడమే కాకుండా అదే సమయంలో తానే చేసే పనితో తన కంటూ ఓప్రత్యేక గుర్తింపు తెలుసు కున్న వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నేడు ప్రపంచంలో మాక్రో ఫోటోగ్రఫీకి కింగ్‌గా వెలుగొందుతున్న థామస్‌ షహీన్‌ ఒకడు.

థామస్‌షహీన్‌ చిన్నతనంలో సరదాగా గీసిన గీత లు మెచ్చుకోలుగా ఉండటంతో...చిత్రలేఖనం వైపు నడిపిం చింది.. విద్యార్ది దశలో ఆర్థోపోడా, సాలీడు లాంటి.. చిత్రాలను అందంగా పెన్సిల్‌తో గీస్తూనే.. వాటిలో సహజత్వాన్ని కంటికింపుగా... స్పష్టంగా కనిపించేలా చేసి టీచర్ల ప్రశంసలందుకున్న థామస్‌ షహీన్‌ మరిన్ని కీటకాల బొమ్మల్ని గీయటం ప్రారంభించాడు. ఓ సారి మిత్రుడొకరు కెమేరాతో చేస్తున్న హడావిడి ఫోజుల్ని చూసి తానెక్కువగా ఇష్టపడే కీటకాలను కెమేరాలో బంధిస్తే ఎలా? ఉంటుందన్న దిశగా ఆలోచ నలు మొగ్గతొడిగింది.

అందుకు అనుగుణంగా ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకుని...తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ

ఫోటోగ్రఫీని నేర్చుకొనేందుకు తొలినాళ్లలో ఇబ్బం దులుఎదుర్కొన్నా... సాధారణ ఫోటోల కన్నామాక్రో లెన్స్‌ని ఉపయో గించి తీసిన ఫోటోలు తీయటం కష్టమైన పనే నని తెలుసుకున్నా... తన కం టూ ఓ ప్రత్యేకతని నిలుపుకునే కోణం లో అడుగులు వేసాడు.

సహజ సిద్ధంగా ప్రకృతి ప్రేమికుడు కూడా కావడంతో ప్రకృతిలోని అందాలనే కాదు... పశు, పక్షాదుల్ని బంధించి... తమ ఆల్బమ్‌లలో భద్రపర చుకుంటున్న వారికి భిన్నంగా తాను చిన్నప్పుడు చేసుకొన్న సాలీడునే మోడల్‌ చేసుకొని ఫోటోలు తీసాడు. ఇవి వైరుధ్యాన్ని... కలిగి ఉండటంతో.. తాను తీసిన ఫోటోలు అనేకమందికి చూపిస్తూ... వారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ... వారిచ్చే సూచనలు పాటి స్తూ తనలోని విద్యని మరింత మెరుగు పర్చుకుని... దృష్టి నంతా కీటకాల వైపు మరల్చి... అహోరాత్రాలు శ్రమించి ఎన్నో కీటకాలు, దోమలు, చీమల ఫోటోలు తీసి ప్రపంచమే విసు ్తపోయాలే చేసాడు.

ఇప్పటికే ఫోటోగ్రఫీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎందరికో ఫోటోగ్రాఫర్లు ఉన్నా మాక్రో ఫోటోగ్రఫీలో మకుటంలేని మహారాజులా ముందు

కు దూసుకుపోతున్నాడు థామస్‌ షహీన్‌.

ఫోటోగ్రఫీలో అందరూ చూసే అందాలను సహజ సిద్ధంగా కెమెరాలతో బంధించే ప్రక్రియ అంతా పాటిం చడం సర్వసాధారణం. అయితే అందుకు భిన్నంగా మన కంటికి కనిపించే చిన్న చిన్న జీవుల్ని చిత్రీకరిం చడంలో ప్రత్యేక ఆనందం మాటలకందలేనిదని.. కీట కాల ఫోటోలు తీయటమంటే సాధారణ విషయం కాదు. ఎంత నేర్పు...అంతకుమించిన ఓర్పు కావాలని చెప్తాడాయన... కీటకాలు ఫోటోలు తీసే సమయాలలో ఎదుర్కొనే ఒడిదుడుకులెన్నో... ఒక్కోసారి అవి దండు గా మనపై దాడిచేసే సందర్భాలూ తాను ఎదుర్కొన్నా నని, ముఖ్యంగా జీవప్రపంచాన్ని ఫోటోలుగా తీయాల నుకుని ఈ రంగాన్ని ఎంచుకునేవారు అత్యంత ప్రాణ ప్రదమైన జంతువులనే కాదు...ప్రమా దకర జంతువు తో, కీటకాలతో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుంది. అన్నిటిని తట్టుకుంటూ భయా న్ని వీడి ముందుకు సాగాల్సి ఉంటుందని సలహా ఇస్తారాయన ఔత్సాహికులకి.నాకు అత్యంత ఇష్టమైన కీటకాలలో సాలీడు ప్రధానమైంది... దాని తీరువేరు. అదిగూడుకట్టుకొనే విధానం ప్రత్యే కంగా ఉంటుంది. అలాంటి చిత్రీకరణ నాకెం తో నచ్చుతుందని చెప్పాడు. ఎంత అసహ్యిం చుకున్నా..కీటకాలలోనూ ఆనందం,విషాదం, కోపం అన్ని ఉంటాయి. వాటిని మానవాళికి అర్ధమయ్యేలా చూపడమే తాను చేస్తున్నదని ధామస్‌ చెప్తాడు.వేసవిలో ఫోటో లు తీయటం కాస్త ఇబ్బందే... కీటకాలు తమ ఇతర అన్వేషణలో ఉంటాయి. ఆ సమయంలో వాటిని చిత్రీకరిస్తే వాటికి కోపం రావచ్చు.. ఇలాంటి సమయాల్లో దాడులు చేసే కంపించుకున్న సందర్భా లు నా జీవితంలో ఉన్నాయి.

కీటకాలనే కాదు వాటి తలలు, కీళ్ల సందులనీ చిత్రీ కరిస్తూ అద్భుత ప్రపంచంలో విహరిస్తున్నా... వన్య ప్రాణి మ్యూజియంలలో, వెబ్‌సైట్లలోనే తీసిన చిత్రాలు చూసుకొన్నప్పుడు కలిగే ఆనందం ఇంత అంతా కాదు. అలాగే... మనం చూసే... చిన్ని చిన్ని కీటకాలే అనేక రంగురంగుల్లో అద్భుతాలని ఆశ్వాదిస్తున్న వారిని చూస్తుంటే సంతృ ప్తి పడుతున్నాఅని చెప్పే ఆయన 1980 లో కొనుక్కున్న పాతకాలాపు పిన్టెక్స్‌ 28ఎంఎం తాకుమాన్‌, నేటికీ నాకు ఉపయోగపడుతోంది...2-టెలీ కన్వర్టర్‌కి తోడుగా ఎస్‌ఎంసి పెన్‌టెక్స్‌ వాడుతూ పెన్‌టెక్స్‌ ఐఎస్‌టి డిఎల్‌ఎఫ్‌ 1.750 ఎంఎం లీవ్‌ డిఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా... ఇప్పుడు వాడుతున్నా... ‘తైరీస్టార్‌ 3500 మాక్రోలెన్స్‌ పాత వివిటార్‌ ప్లాష్‌ గోల్డ్‌ ఫిష్‌ బాక్స్‌ రిప్లక్టర్లుగా వాడుతున్నా... అంటూ తాను వాడే కెమేరాలు అందరూ వాడేవేనని అయితే నాలుగేళ్ల క్రితం వరకు ఫిల్మ్‌లని వాడీ కెమెరాలనే వాడుతూ.. కొత్తగా డిజిటల్‌ కెమెరాని కొన్నా... నాపాత పనిముట్ల ని జత చేరిస్తే కానీ సంతృప్తికరమైన ఫోటోలు తీయ లేక పోతున్నట్లు చెప్తాడు థామస్‌.

సాంకేతిక విప్లవం ఎంత ఎదిగినా కంప్యూటర్లపై హడావిడి చేసినా ఫోటోగ్రఫీలో ప్రవేశించినా.. మాక్రో ఫోటోగ్రఫీలో మాత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిం చ లేకపోయిందనే చెప్పాలి. కెమెరాతో తీసిన క్వాలిటీ... ఫోటోషాప్‌లో సృష్టించలేకపోతోందన్నది సుస్పష్టమని వాస్తవ దృక్కోణం చూపులతో ఫోటో అద్భుతమనే తన అనుభవాలని రంగరించి మరీ ధీమాగా చెప్తున్నా డు థామస్‌. ఔత్సాహిక ఫోటోగ్రఫీర్లని ప్రోత్సహించే క్రమంలో తన వెబ్‌సైట్‌ ద్వారా.. మాక్రో ఫోటోగ్రఫీకి సంబంధించిన అనేక మెళకువలు, సలహాలు... సూచ నలు ఇస్తున్నాడు థామస్‌ మరికెందుకాలస్యం ఇంకా మీకు ఫోటో గ్రఫీపై ఉండే అనుమానాలను తెలియ చేసి... వాటిని తీర్చేసుకోండి.

ఇప్పటికే మీరు ఫోటోగ్రఫీ రంగంలో ఉంటే మాక్రో లెన్సుతో పాటుగా ఓ అడాఫ్టర్‌ని కొని మీరూ పురుగులో పుట్రలో తీయటం ప్రారంభించి ధామస్‌ లెవెల్లో కాక పోయినా కొంతమేరైనా ఖ్యాతిని కొట్టేయచ్చు ఏమంటా రు మరి.

అంతర్జాలంలో తెలుగు వెలుగులు

తెలుగు భాష మనది... నిండుగ వెలుగు జాతి మనది... అని పాటలు పాడకునే దిశ నుండి

ప్రపంచ వ్యాప్తంగా మరింత అభివృద్ధి దిశగా వేసిన అడుగులు ఫలించాయి.

అంతర్జాలంలో మన మాతృభాషలోనే భావ సందేశాలు, చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని రాసుకునేందుకు వీలుగా యునికోడ్‌ కాన్సిర్టియంలోకి ఎట్టకేలకు ప్రవేశించే అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు భాష- ఇక విశ్వజనీతం కావటం ఖాయమని... నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే తమిళ, హిందీ, భాషలు యూనికోడ్‌ కాన్సిర్టియంలోకి ప్రవేశించి తమ సత్తా చాటు కోవటం ప్రారంభించాయి. తాజాగా తెలుగు భాషకు కూడా యూనికోడ్‌లో ప్రవేశం దక్కడంతో పాటు పూర్తి అధికారిక సభ్యత్వం కూడా సంపాదించుకోవటం పట్ల తెలుగు భాషాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు వివిధ సాంకేతి క సంస్ధలు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అడోబ్‌ సిస్టమ్స్‌, యాపి ల్‌ ఇంక, మెక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌, ఒరాకిల్‌ అమెరికా, గూగుల్‌, ఐబి ఎం కార్పొరేషన్‌, ఎస్‌ఎపి తదితర ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్ధలు కూడా తమ సాఫ్ట్‌వేర్‌లని తెలుగు భాష కు మద్దతు ఇచ్చేలా రూపొం దించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి.

ఇటీవల కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ తెలుగు అంతర్జాలసమావేశంలో తెలుగు భాషకు యునికోడ్‌లో ప్రాధా న్యత లభించడంతో దీనిని ఆసరాగా తీసుకుని భాషని విస్తృత పరచాలని ఈ మేరకు అనేక ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించా రు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగు మాట్లాడేవారు 7కోట్ల పైచిలుకు కాగా, ప్రపం చ వ్యాప్తంగా వీరి సంఖ్య 18 కోట్లు ఉంటుం దని ఓ అంచనా.

తాజాగా జరిగిన నిర్ణయాలతో ఇన్నాళ్లూ ఇంగ్లీషు భాషలో ఉండి... తగు రీతిన అర్ధం కాని పరిస్ధితి నెలకొన్న చట్టాలను కానీ, ఇతర ప్రభుత్వ నిర్ణయాలను, గవర్నమెంట్‌ ఆర్డర్లను, టెండర్లు, ఇలా చాలా విషయాలు ఇక ముం దు తెలుగులోనే కనిపించనున్నాయి. దీంతో సామాన్యుడికి సమాచారం అర్ధమయ్యేలా రూపొందటం వల్ల వారిలో మరింత చైతన్యం వెల్లి విరిసే అవకాశాలు బోలెడున్నాయని సామాజిక వేత్తలు కూడా చెప్తున్నారు.

అలాగే అనేక మంది రచయితల రచనలు, ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక విశేషాలను యునికోడ్‌లో తెలుగు రంగ ప్రవేశం తరువాత నేరు గా మన స్వీయ భాషలోనే చదువుకునే అవకాశం ఉందని సాహితీ ప్రియులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాచార సాంకేతిక విప్లవం దూసుకు వస్తున్న క్రమంలో ఇపðడు గ్రామ గ్రామానా ఇంట ర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే భారత ప్రభుత్వ టెలికాం సంస్ధతో పాటుగా వివిధ ప్రయివేటు టెలికాం సంస్ధలు కూడా అనేక ప్యాకేజీలు ఇచ్చి ఇంటర్నెట్‌ని విస్తృత పరచడం తో తెలుగు వెలుగులు మరింతగా విరజిమ్మేందుకు అవకాశం ఉందన్న ది వాస్తవం. యూనికోడ్‌ పరిధిలోకి తెలుగు భాష వచ్చి చేరడంతో... విదేశాలలో ఉండే తన బంధు మిత్రులతో తెలుగులోనే ఛాటింగ్‌ చేసు కుంటూ వారు మనపక్కనే ఉండి మాట్లాడుతున్నారనే భావన కలగటం ఖాయమని.. వ్యక్తి గత ఆలోచనల్ని, అక్షర రూపాల్లో వివిధ బ్లాగుల్లో ఇప్పటికే తెలుగులో వెలువరిస్తున్న రచయితలకు కూడా తాజా పరిణామాలు మరింత ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయమని పలు వురు బ్లాగర్లు చెప్తున్నారు.

కాగా యునికోడ్‌ తెలుగు ఫాంట్లుపై మరిన్ని సాంకేతిక పరమైన ప్రయోగా లు జరుగుతున్న దశలో ప్రస్తుతం ఉన్న విండో స్‌ ఎక్సపీ ద్వారానే అన్ని భారతీయ భాషలనీ వాడుకుంటున్నట్లే... తెలుగునీ వాడుకునే అవ కాశాలున్నాయి. చాలా మందికి యాప ిల్‌, ఫొనిటికకీే బోర్డు మాత్రమే తెలుగు లో వాడటం అలవాటు. అయితే ఎక్సపి ఇన్‌ స్క్రిప్ట్‌ కీబోర్డుకి పని చేస్తుం ది. అలాంట పðడు కీ బోర్డు ఆప్షన్‌ మార్చుకోవాల నుకుంటే సీడాక సంస్ధ వెబ్‌ సైట్‌ నుండి బోర్డ్‌ డ్రైవ్‌లు ఉచితంగా డౌన్‌ లోడ్‌ చేసుకుని ఇనిస్టాల్‌ చేసుకుంటే మీకు నచ్చిన కీబోర్డుతో టైపింగ్‌ చేసుకోవచ్చు.

యునికోడ్‌లో తెలుగు భాషకు అరుదైన గౌర వం దక్కడంతో ఇక తెలుగుఃవాడఃిని చూపిం చడమే తరువాయి. ఐటి దిగ్గజాల సరసన మనం కూడా చేరి సభ్యత్వం పొందటంతో ఇంటర్నెట్‌లో తెలుగు లిప ిలో జరుగుతున్న పొరపాట్లను సవరిస్తూ... యూనికోడ్‌ లిపి ప్రమాణా లకు అనుగుణం గా కొత్త లిపిని రూపొందించేందుకు సాంకేతిక నిపుణులు కృషి చేసున్నారు. అలాగే ఇందుకు గాను ఆరు ఇంటర్నెట్‌ ఫాంట్లను రూపొందిస్తూ... వీటన్నింటినీ ఉచితంగానే డౌన్‌లోడ్‌ చేసు కునే ఆస్కారం కలిపించాలని నిర్ణయించింది ప్రభుత్వం. తెలుగు భాష టైప్‌ చేసేపð డు వచ్చే తపðలను దిద్దేందు కువీలుగా ప్రత్యేకంగా ఓ స్పెల్‌ చెక సాఫ్ట్‌వేర్‌ని కూడా రూపొందించే పనిలో పడ్డాయి

మరికొన్ని సంస్ధలు. అలాగే ఇపðడు అంతా వాడుతున్న వివిధ కీ బోర్డులకు అనుగుణంగానే యూనికోడ్‌లో తెలుగును శాశ్వత ప్రమా ణాలతో రూపొందించాలని తెలుగు భాషపై మక్కువ ఉన్న అనేక మంది విదేశాలలో ఉన్న సాంకేతిక నిపుణులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని అనేక ప్రయోగాలకు నడుం బిగించారు. మరోవైపు తెలుగు భాషలో ఉన్న వివిధ రకాల వెబ్‌ సైట్లనుఒకే వేదిక పైకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా ఓ బ్రౌజర్‌ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలను ముమ్మ రం చేసింది. ఏది ఏమైనా... మన భాషని విస్తృత పరిచే క్రమంతో అంతర్జాలంలో ప్రత్యేక స్ధానం దక్కించుకుంటూ వస్తున్న సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ... దూసుకు పోవాలని మనమూ ఆశిద్దాం...

తెలుపు నలుపైతే.....పొరపాటు లేదోయ్‌...

నిన్న మొన్నటి వరకు నలుపు దుస్తులు ధరిస్తేనే శనీశ్వరుడు పట్టిపీడిస్తారని..

ధవళ వస్త్రాలవైపే మోజు చూపించిన సమాజం నేడు అంచెలంచెలుగా...

తన ధోరణి మార్చుకుంటూ నలుపు వైపు పయ నిస్తోం ది.

చీకటి లేకుంటే వెలుగు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు ఈ క్రమంలోనే..

మన నిత్య జీవిత గమనం లో నలుపు ప్రాధాన్యత క్రమేపీ పెరుగుతోంది.

నిత్యం పూజించే నర, నారాయణులు నల్లని వారే.. మనం వాడుకునే ఎన్నో వాహనాలు నలుపు రంగు లోనే ఉంటాయి. ఇక మన వాహనాలు పరుగులు తీసే రోడ్డు దాదాపుగా నలుపే.. న్యాయ దేవత కళ్లకు కట్టే రిబ్బన్‌ నలుపు, న్యాయ వాదుల కోటు నలుపు, మనం చేతికి తొడిగే వాచ్‌, కాలికి వేసే చెప్పు, కళ్లకి తొడిగే అద్దాలు ఇలా ఏదైన నలుపు కి ప్రాధాన్యత పెరిగి నేటి

యువతరం నలుపు డ్రస్సులంటే తెగ మోజు పడుతు న్నారు.

ఒక్కప్పుడు పెళ్లిళ్లు,పేరంటాలలో తెలుపు బట్టలతో ధగధగలాడిపోయిన వారుసైతం నేడు నలుపుదుస్తుల వైపు మక్కువ చూపుతున్నారు. అంతే కాదు మన సినీతారలు వచ్చే ఏఫంక్షన్‌ అయినా తీసుకోండి దాదా పు ఈ తారలంతా నలుపు దుస్తులతోనే దర్శన మిస్తారు. అందుకు ప్రత్యేక కారణం... అభిమానులని ఇట్టే ఆకట్టుకునేందుకు అవకాశాలెక్కువగా ఉండేరంగు కాబట్టి.

ఉదాహరణకి చిరంజీవిని తీసుకోండి... సొంత సినిమా ఫంక్షన్‌ అంటే జీన్‌ ఫేంట్‌ నల్లషర్టు వేసు కుని, మిగిలిన వారికన్నా... భిన్నంగా కనిపిస్తుండగా... మహేష్‌ బాబు ఎక్కువగా ఫంక్షన్లకి తానెక్కువగా ఇష్టపడే బ్లాక్‌టీషర్ట్టుతొ దర్శనమిస్తాడు. అనుష్క అయితే షాపింగ్‌ కెళ్తే ముందు కొనేది నలుపురంగు డ్రస్సుల నేన ట. అందుకే చిన్న ఫంక్షనైనా నలుపు చీర కట్టుకొస్తుంటా అని ఆమధ్య ఓఇంటర్వూలో చెప్పుకొచ్చింది కూడా.

ఇకవరుస విజయాలతో దూసుకు పోతున్న గోపీచంద్‌ సైతం సినీ ఫంక్షన్లలో నలుపు దుస్తులతో కనిపిస్తాడు. ఆమధ్య జరిగిన కేన్స్‌ ఫెస్టివల్‌లో నియాన్‌ కాంతుల నడుమ నల్లని దుస్తులతో మెరిసి తన స్పెషలిటీ నిరూపించుకుంది. ఇలా సెల బ్రెటీలంతా నలుపుకు ప్రాధాన్యత ఇస్తు... ఫంక్షన్లలో తన ప్రత్యేకతని నిలుపుకుం టూ వస్తున్నారు.

ఇలా ఫ్యాషన్‌ ప్రపంచంలో నలుపు తన స్దానాన్ని పదిలపరుచుకుంటూ ఎవరు? అంటూ ప్రత్యేక గుర్తింపు నివ్వటమే కాకుండా.. ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ కలర్‌ బ్లాక్‌ అంటూ... యువతరానికి ఆనందాన్ని కలుగ చేస్తోందనటంలో ఆశ్చర్యం లేదు. నలుగురిలో మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే...నలుపు దుస్తుల్ని ధరించా ల్సిందే...నేడు వయసుతొ సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అంతా బ్లాక్‌లో కనిపిం చేందుకు తహతహ లాడుతున్నారు.

నేటి ప్యాషన్‌ ప్రపంచంలో కుర్రకారుని ఆకర్షిం చేందుకు అన్ని వస్త్ర కంపెనీలు నలుపు రంగు వస్త్రాలతో రూపొం దించిన అనేక రకరకాల దుస్తుల్ని మార్కెట్‌లోకి దించా యి. యువత నలుపు రంగులో ఉండే జీన్స్‌. టీషర్టులు, కురా తపైజామాలు షార్ట్‌లు కనిపిస్తుండగా... మహిళల కోసం అనేకరకాల ఎంబ్రయిడరీ డిజైన్లతో ప్రత్యే కఫ్యాషన్‌ డిజైన్లతో కూడిన చీరలు, స్కర్ట్టులు, ఫ్యాంట్లు, టైలు, కోట్లు, ఫ్రాక్స్‌ దర్శనమిస్తు న్నాయి. బ్లాక్‌కలర్‌ని స్టయిలిష్‌కి మారు పేరుగా, సెక్సీ కలర్‌గా పేరు తెచ్చుకు న్న ఈ రంగు ఇప్పుడు సగటు జీవికి కూడాఫేవరేట్‌ రంగుగా మారిపోయిందనటంలో సందేహం లదు.

నేడు వేసుకున్న దుస్తులకు

తగ్గట్టుగా

మ్యాచింగ్‌లు కూడా నలుపే కావాలని మొగ్గు చూపు తున్నారు. మెడలొ ధరించే దండలు, చెవులకు పెట్టుకునే రింగులు, డైమండ్‌తో చేయించుకున్నా... చేతి గాజులు, నడుం బెల్టు, హాంగ్‌ బ్యాగ్‌లు ఇలా ప్రతివస్తువూ నలుపు గా ఉండాలని కోరు కుంటున్నారంటే నేటి యువతరం నలుపుని ఎంత ఇష్టపడుతున్నారో ఇట్టే అర్ధం చేసుకోవ చ్చు.

నఖ శిఖపర్యంతం నలుపుతోనే తమకో ప్రత్యేకత వస్తు న్నప్పుడు ఇది అశుభమైన రంగని ఎందుకంటున్నారో అర్ధం చేసుకోలేక పోతున్నామన్నది నేటి తరం వేస్తు న్నప్రశ్న దీనికి సమాధానం మనం ఖచ్చితంగా ఇవ్వలేక పోయినా... ఇది యూనివర్శల్‌ కలర్‌ అందుకే ఫంక్షన్ల కెళ్లేప్పుడు ఎలాంటి రంగు దుస్తులు వేసుకెళ్లాలన్న కన్ఫ్యూజన్‌లో మీరుంటే నలుపు డ్రస్‌ని వేసుకొని వెళ్లండి... అది లేదంటే... నలుపు, తెలుపు కాంబి నేషన్‌ దుస్తులు వేసుకుంటే సరి అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు.

భారీ డిజైన్లకన్నా సింపుల్‌గా ఉండే డిజైన్లతో కూడిన దస్తులపై మక్కువ చూపిస్తున్నవారిలో ఎక్కువగా నలుపు కాంబినేషన్‌ వైపే చూస్తుంటా రని, అయితే సిప్లిసిటీకి, డిగ్నిటీకి ప్రతీకగా నిలచే నల్లని దుస్తులు వైపు ఎక్కువ మక్కువ చూపిం చడానికి కారణాలు అన్వేషిస్తే... నలుపు ధరిస్తే సన్నగా కనిపిస్తా మన్న భావన పెరగటం ఓ కారణం కాగా బంగారం, ముత్యాలు, వజ్రాలు ఎన్ని ఉన్నా సింపుల్‌ యాక్స రీస్‌ నలుపు కి సరిగ్గా మ్యాచ్‌ కావ టం కూడా మరో కారణమని... నిపుణులు చెప్తున్నారు.

సాధారణంగా త్వరగా రంగుని కోల్పోయే లక్షణాలు న్న ఈ నలుపు రంగు దుస్తులు కొనేప్పుడు నాణ్య మైన వస్త్రాలకే ప్రాధాన్యత ఇవ్వండి. బ్లాక్‌లోదొరికే చాలా రకాల షేడ్స్‌లో మీకు నచ్చిన వాటిలో మంచి ఫ్యాబ్రిక్‌కి చూసికొనుక్కోండి. ఎలాంటి రంగుదుస్తులు న్నా... టాప్‌, బాటమ్‌ ఎక్కడైనా మ్యాచ్‌ అయ్యి మీరు వేసుకునే దుస్తులకు గుర్తింపు తెచ్చే నలుపు రంగుని మీ జీవితంలొ ఓ భాగం చేసుకోండి. ఎక్క డున్నా మీ ప్రత్యేకత నిలుపుకునేందుకు నేడే ఓ నలుపు రంగుని దుస్తుల్ని కొనుక్కోండి.

సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌

పెరుగుతున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో నలుపు కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దాదాపు నేడు జరుగుతున్న అనేక ఫంక్షన్లలో నలుపు రంగు డ్రస్‌ వేసు కొచ్చిన వారే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ గా నిలబడుతున్నారనటం అతిశయోక్తి కాదె మో? మీకెన్ని రంగు రంగుల దుస్తులున్నా... ఒక్క నలుపు డ్రస్సయినా లేకుంటే మీకు ఫ్యాషన్‌ టేస్ట్‌ తెలియదన్నా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...

బతుకు 'దీపం' వెలిగేనా?

నిన్నటి వరకు గిర గిర తిరిగే కుమ్మరి చక్రం నేడు ఆగి పోయింది.

నాగరికత నేర్చాక తన చేతి వేళ్లతోనే సొగసులద్దుతూ... ప్రకృతిలోని మట్టికే ప్రాణ ప్రతిష్ట చేస్తూ...

ఈ జగానికి భోజన కంచం, మంచినీళ ్ల్లగ్లాసు, వంట పాత్రలని తయారు చేసిన చెయ్యి...

నేడు సాయం కోసం అర్ధిస్తోంది. దీపావళికి ప్రతి ఇంటా కాంతులు వెద జల్లే దీపాలకు ప్రమిదలనందించి పరమానందభరితుడైన ఈ సమాజ నేస్తం నేడు తన ఇంట్లో మిణుకుమంటున్న దీపం ఆగిపోకూడదని, తరతరాలుగా వస్తున్న ఈ కళ తనతోనే అంతరించి పోకూడదని కోరుకుంటున్నాడు.

దీపావళి అనగానే అందరి మదిలో ఏదో తెలియని ఆనందమే... చిచ్చుబుడ్లు మతాబులే కాదు వెలుగులు విరజిమ్మే దీపాలకే దీపావళి రోజున ప్రత్యేక స్ధానం ఉంది. ఎంత పేదవాడైనా ఆ రోజున ఖచ్చితంగా తన ఇంటి ముందు చిన్న పాటి దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో అలౌకిక ఆనందాన్ని పొందుతాడన్నది వాస్తవం.

దిబ్బి దిబ్బి దీపావళి.. మళ్లీ వచ్చే నాగులు చవితి అంటూ దీపావళి నాడు సాయంత్రం వేళల్లో ఆముదపు కర్రకు, గోగునార కర్రలకు చిగుళ్లలో దూదెను కట్టి వెలిగించి నేలకు కొట్లడంతో దీపావళి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దక్షిణ వైపు నుండి ముందుగా దీపా న్ని వెలిగించడం హిందూ సాంప్రదాయాలలో ఒకటిగా వస్తోంది. ఇలా దీపం వెలిగించడాన్ని ఉల్కాదానంగా పేర్కొంటారు. ఇది పితృదేవతలకు దారి చూపుతుందని ఓ నమ్మకం. ఈ దీపం వెలిగించా క ఇంట్లో నువ్వెల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ముందుగా ఆ దీపపు లకి్ఝకి నమస్కరించి...లకి్ఝపూజకి ఉపక్రమిస్తా రు. కలశంపై లకి్ఝదేవిని ఆవాహన చేసి లకి్ఝ పూజ అనంతరం దీపాలను ఇంటి ముందు వరుసగా పెట్టి బాణా సంచా కాల్చేందుకు సిద్దమవుతారు. అంటే మట్టి దీపాలను దేవతా మూర్తులుగా ప్రాధాన్యత ఇచ్చిన సాంప్రదా యం మనది.

ఒకపðడు దీప కాంతుల కోసం విరివిగా మట్టి ప్రమిదలనే ఉపయోగించేవారు. కానీ మారు తున్న కాలం తో అనేక మంది డిజైనర్లు తమ చేతి కి పనికలిపించి అనేక రకాల డిజైన్లు రూపొందించ డంతో వేలాది డిజైన్ల ప్రమిదలు బోలెడు లభ్యం కావ టం ప్రారంభమయ్యాయి. సాధారణ ప్రమిదలకన్నా... రంగులతో హొయలొలికించేలా రూపొందిన ఈ ప్రమిదలు అందర్నీ ఆకర్షించడంతో వీటి ప్రాముఖ్యత క్రమంగా పెరగటం ప్రారం భించింది.

ఈ క్రమంలో దీపావళికి పూజించే లకి్ఝ దేవి ఆకృతి ఉన్న దీపాల ప్రమిదలతో పాటు శిపార్వతులు, వినాయ కుడు ఇలా అనేక దేవతా స్వరూపాలు ప్రమిదలకు వచ్చి చేరాయి. ఒక దానిని మించి మరొకటి రూపొందించిన ఈ దీపపు ప్రమిదలు సాంప్ర దాయాలకు అనుగుణంగా ఉండటంతో పాటు చూడగనే ఆకర్షించేలా ఓ ప్రత్యేకత సంతరిం చుకునేలా ఉండటం వల్ల వాటివైపు ఎక్కువమం ది మక్కువ చూపారనే చెప్పాలి. దీపావళి జీవితం లో వెలుగు నింపే పండగగా పేరు. దీపావళికి వాడే ప్రమిదల్లో అనేక హొయలుతో రావటంతో మన స్ధానిక సాంప్రదాయ కుమ్మర్ల నోట మట్టి పడిందనే చెప్ప క తప్పదు. తరతరాలుగా మట్టినే నమ్ముకుని జీవిస్తున్న అనేక కుంటుంబాలు సమస్త మాన వాళికి కావాల్సిన అనేక రకాల పాత్రల తయారు చేసి అంద చేసేవారు. అయితే రాను రాను లోహపు పాత్రలు, స్టీల్‌ వాడకం పెరిగాక మట్టి కుండల్లో వంట చేసుకునే ప్రక్రియ దాదాపుగా అంతరించి పోయింది. మట్టి కుండల స్ధానంలో ప్లాస్టిక బిందెలు, వచ్చి చేరాయి. మట్టి కుండల్లో నీరు శ్రేష్టమని తెలిసినా దాని చల్లదనం ఆరోగ్యా న్నిస్తుందని తెలిసినా అంతా ఫ్రిజ్‌ల మీదే ఆధార పడి అనవసర రోగాలు కొనితెచ్చుకుంటుం డంతో తనది అక్కరకి రాని వృత్తిగా మారిపోయిం దన్న తపన పడుతున్న కుమ్మరులెందరో ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒకపðడు సారెపై అనేక ఆకృతులు రూపొందించి సమాజంలో తలలో నాలుకగా వ్యవహరించిన కుమ్మరి బ్రతుకు నేడు ఛిన్నాభిన్నమైపోయిం ది. అయినప్పటికే నేటికీ చాలా కుటుంబాలలో నిన్నటి తరంకి చెందిన వారు సారెతిపðతూ ప్రమిదలనైనా చేసి ఇచ్చేందుకు తాపత్రయ పడు తున్నారంటే అంతరించి పోతున్న కళని భావితరాలకు మచ్చుకైనా చూపించాలన్న తపనే కారణం.

కడుపు నింపని కులవృత్తి

కులవృత్తికి సాటి రావు గవ్వల చెన్నా... అంటూ నాడు కుల వృత్తులనుగౌరవించి.. భావితరా లకు అందించాలని తత్వవేత్త లు రాసినా ఇపðడా కుల వృత్తులు తమకు కనీసం కూడా పెట్టడం లేదన్న ఆవేదన చాలా మంది కుమ్మరి పని వారిలో ఉంది. ఏడాదిలో

కనీసం మూడునెలలు కూడా సరైన పని ఉండటం లేదని.. ప్రపంచమంతా ప్లాస్టిక మయమైపోవటంతో తమ పొట్టని నింపు కునేందుకు తమ వారసులు వేరే వృత్తులవైపు మళ్లుతున్నారని... దీంతో తమ వృత్తి మూల పడిపోతోం దని ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి తమ లోనూ ఎందరో నైపుణ్యం ఉన్న వారు ఉన్నా సరైన శిక్షణ, ప్రోత్సాహం కరువవుతుండటం వల్లే జీవనోపాది ్థకోసం వేరే మార్గాలను పట్టాల్సి వస్తోందని, తరతరాలుగా వస్తున్న ఈ వృత్తిని అంతరించుకొనిపోకుండా చూసుకునేం దుకు తామే నడుంబిగించి చేసిన మట్టి పాత్రల్ని అమ్మ కాలు జరిపేందుకు తిరుగుతున్నా సరైన ఆదరణ లభించ ట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు.

దూసుకు పోతున్న రాజస్ధాన్‌ ప్రమిదలు

ఇక కొల్‌కత్తా, రాజస్ధానీ కళాకారులు రూపొందించిన దీపాల ప్రమిదల అందాలు ఇట్టే కట్టిపడేస్తుండటంతో క్రమంగా అటువైపు మక్కువ చూపేవారు ఎక్కువవుతున్నారు. నగరా లతో పాటు చిన్న తరహా పట్టణా లలోనూ ఇపð డు ఈ ప్రమిదల అమ్మకం జోరందుకుంది. వివి ధ రంగులతో, అనేక రకాల డిజైన్లతో, కొత్త తర హాలూ రూపొందించిన ఈ ప్రమిదలు విభిన్న ఆకృతుల్లో, కళ్లు చెదిరేలా రూపొందించటంలో ఆయా రాష్ట్రాల కళాకారులు తమ నైపుణ్యం చాలానే ప్రదర్శిస్తూ.. దూసుకు పోతున్నారనే చెప్పక తప్పదు.

పొట్ట కొడుతున్న ప్లాస్టిక ప్రమిదలు...

కనీసం దీపావళికైనా పట్టెడన్నం తింటామని భావించిన సగటు కుమ్మరి కుటుంబాన్ని ఇప్పటికే రాజస్ధానీ , గుజరాత్‌, కోల్‌కత్తా ప్రమిదలు నోటి కాడ కూడుని లాగేస్తుంటే... మరోవైపు ప్లాస్టిక దీపాలు కూడా ఉన్న దాన్ని ఊడగొడుతోంది. చుక్కల నంటిన ధరలు కిందకి దిగి రాక పోవటంతో ఓనాడు ఘనంగా జరుపు కున్న దీపావళిని నేడు ఉన్నంతలో తూతూ మంత్రంగా జరిపేసుకునేందుకు ఏనాడో మానసికంగా సిద్ద మైన సగటు మనిషికి దీపాల ఆకృతిలో ఉన్న విద్యుత్‌ దీపాలు ఊరట నిచ్చాయనే చెప్పక తప్పదు.

కార్పొరేట్‌ దెబ్బ :

ఇప్పటికే పలు రకాలుగా తమ ప్రమిదలు వాడకం తగ్గిపోవటంతో తమ జీవన గమనమే మారి పోయిం దని...వీటికి తోడు మార్కెటింగ్‌ రంగంలో ప్రవేశించిన అనేక కార్పొరేట్‌ కంపెనీలు తమ ఔట్‌లెట్లలో అనేక రకాల కొవ్వెత్తులతో పాటు దీపపు ప్రమిదల కొవ్వెత్తులు కూడా అమ్మకాలు జరుపుతుండటంతో సాధారణ ప్రజలు కూడా తమవైపు చూడటం మానేసారన్నది కుమ్మరి కళాకారుల ఆవేదన.

మనమేం చేయాలి :

తరతరాలుగా సమాజానికి సేవలందిస్తూ... మట్టినే నమ్ముకుని జీవిస్తున్న కుమ్మరి కుల వృత్తుల వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో సగటు మనిషిగా మనకీ అంతే ఉంది. కనీసం ఈ దీపావళికైనా మీ ఊర్లో కుమ్మరి తయారు చేసిన ప్రమిదలు కొనండి. వాటికి మీరే రక రకాల రంగు లేసు కుని మీకు నచ్చినట్లు అలంకరించుకోండి. ఇందుకు పూసల దండలు, కుందన్‌లు, స్టిక్కర్లు, లేస్‌లు ఇలా ఇంట్లో మీకు అందుబాటులో ఉండే వాటితోనే అలంకరించుకుంటే... బాగుంటుంది ఓసారి ఆలోచించండి.

కుల వృత్తికి గుడ్‌ బై

నా చిన్నప్పటి నుండి ఈ వృత్తినే నమ్ము కుని కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు నాన్న. రోజంతా కష్టపడ్డా కనీసం కూలి కూడా వచ్చే అస్కారం లేకపోవటం, ఏరోజు బతుకు ఆరోజే అన్న చందంగా మారటంతో ఒకపðడు ఆనందంగా బతికిన మా కుటుంబం మట్టి వస్తువులు వాడకం తగ్గుముఖం పట్టాక చెల్లా చెదురైపోయింది. అందుకే కుల వృత్తికి గుడ్‌ బై చెప్పేసి నేనో ప్రయివేటు కంపెనీలో చేరి పోయా... -కానుగుల పరశురాం, గౌతమ్‌ నగర్‌, సిికింద్రాబాద్‌

ఆదాయం అంతంతే...

నేటికి మా ఇంట్లో అడపా దడపా పెళ్లిలకు కావాల్సిన కుండ లను, మట్టి పాత్రలని అమ్ముతాం. అయితే వాటిపై వచ్చే ఆదాయం అంతంత మాత్రమే.. అందుకే అమ్మతో ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టించా...నేనే సొంతంగా మరో వ్యాపా రం ప్రారంభించుకున్నా... కులవృత్తిని పక్కకు పెట్టడం కాస్త బాధాకరమైనదే... దాన్ని తగ్గించు కోవటానికే వినాయక చవితి, పండగల్లో మట్టితో చేసే విగ్రహాలను, ప్రమిదలను అమ్ముతున్నాం.

- ఇ.రాజు, దయానంద నగర్‌, మల్కజ్‌గిరి.

ఎంత కష్టపడ్డా ఫలితం సున్నా...

వయసుడుగుతున్నా...నిమిషానికో ఓ ప్రమిదని, పని నిమి షాలకో కుండని చేయగలను నేటికీ.. అన్నీ చేసి వాటిని ఎండ బెట్టి కాల్చి.. విరిగినవి పోగా మిగిలినవి మార్కెట్‌కి తీసుకుపోతే కొనేవారే కరువవుతున్నారు. దీపావళి కోసం ప్రమిదలు తయారుచేస్తున్నా... రోజంతా కష్టపడ్డా ఫలితం నిండు సున్నా... బజార్లోకి వచ్చిన అనేక రకాల ప్రమిదల ముందు మా ప్రమిదలు విల విల లాడుతున్నాయి. మిషన్లని ఉపయోగిస్తూ... పోత తరహాలో రాజస్ధాన్‌, కలకత్తా వాళ్లు మాలా సారె తిప్పకుండానే ప్రమిదలు చేసి పడేస్తున్నారు. రంగుల వాడుతు.. పింగాణీ దీపాల్ని పోలి ఉండటంతో అంతా అటువైపే మళ్లు తుండటం తో మమ్మల్ని పట్టించుకోవట్లేదు

-నరసింహ, కుమ్మరి, నరసింహ నగర్‌, మల్కజ్‌గిరి.

సేవాతత్పరతకి... శాల్యూట్‌

తనవాళ్ల కన్నా దేశమే మిన్న అన్న భావనతో ఖాకీ దుస్తుల్ని ధరించిన రోజే త్యాగాలకు సిద్దమై...
అను నిత్యం సరిహద్దుల్లో అప్రమత్తత ప్రదర్శిస్తూ... శత్రు దేశాల దాడుల్ని ఎదుర్కొంటూ..
కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుకుంటూనే మరోవైపు దేశంలో జరుగుతున్న అన్యాయాలు,
అక్రమాలను ఎదుర్కొంటూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ...
తమ కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన ఎందరో వీర జవాన్లను, పోలీసు అమర వీరులను
గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
వైద్యం తర్వాత పవిత్రమైంది పోలీసు వృత్తే! ఒక విధం గా చెప్పాలంటే వైద్యం కంటే కూడా పోలీసు వృత్తే మరింత పవిత్రమైంది. ఎందుకంటే ప్రాణం పోసే వైద్యుడికి విధి, నిర్వహణలో ప్రాణాపాయం బహుఅరుదు. కాని పోలీసుల విధి అలా కాదు. ముప్పు ఏమూల నుం చి ఎప్పుడైనా ముంచుకొని రావచ్చు. యావత్‌ జాతినీ దిగ్భ్రాంతికి గురిచేసిన ముంబయి మారణహోమంలో ప్రాణాలు పోగొట్టుకుంది. జాతీయతకు మారుపేరు లాంటి పార్లమెంటుపై దాడి ఘటనను ధైర్యంగా తిప్పికొట్టి అసువులు బాసిందీ పోలీసులే. నాగరికత ఏర్పడినప్పటి నుంచీ ఏదో రూపంలో పోలీసులు సమాజానికి సేవ చేస్తూనే ఉన్నారు. ఆసుపత్రి వరకూ వెళ్ళే పరిస్థితి ఎప్పుడూ రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంటే దాని అర్థం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనే. అలానే పోలీసు స్టేషన్‌కు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా రాకుండా ఉంటే మంచిదే. కాని నానా రకాల రుగ్మతల తో సతమతం అవుతున్న సమాజంలో అది సాధ్యమా పోలీసుల ప్రమేయం లేకుండా మనుగడ సాధించడం కుదురుతుందా కానే కాదు. మనిషి మనుగడకు వైద్యం ఎంత ప్రాణప్రదమో ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడే వృత్తి నిర్వహిస్తున్న పోలీసులు కూడా అంతే అవసరం. పోలీసు శాఖలో చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండవచ్చు. దానివల్ల పోలీసులపై కొంత వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు.
కాని ఇప్పటికీ ఎవరికి ఏ కష్టమొచ్చి నా ముందు గుర్తొచ్చేది పోలీసులే. అగ్నిప్రమాదాల వంటివి జరిగినప్పుడు కూడా ప్రజలు సంబంధిత అగ్నిమాపక శాఖతోపాటు మాకూ ఫోను చేస్తుంటారు. మేం కూడా అది మాకు సంబంధం లేదని వదిలివేయం. ప్రజలు బాధలో ఉన్నప్పుడు తమకేమీ పట్టనట్లు పోవడం పోలీసు రక్తంలోనే ఉండదు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు సాయం చేయమని అధికారులు ఆదేశాలు జారీ చేయరు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు లు వారంతట వారే రంగంలోకి దిగుతారు. ఎన్నో సంఘటనల్లో

ఇది రుజువైంది. 2008 నాటి ముంబయి మారణకాండలో రైల్వే స్టేషన్‌లో ముష్కరులు దాడి చేసినప్పుడు

జిల్లూ యాదవ్‌ అనే రైల్వే కానిస్టేబుల్‌ వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాల తో చెలరేగి పోతుంటే, అప్పటికే పెద్దసంఖ్యలో ప్రజలు చనిపోయి, మిగిలినవారు పారిపోతుంటే యాదవ్‌ మాత్రం తన వద్ద ఉన్న 303 పాతతరం తుపాకీతోనే ఉగ్రవాదంపై తిరగబడ్డాడు.
కాలంతోపాటు పోలీసు విధుల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్లేందుకు యావత్‌ పోలీసు శాఖ పట్టుదలతో శ్రమిస్తూనే ఉంది. నేరగాళ్ళు తన అస్త్ర, శస్త్రాలకు పదును పెడుతున్నారు. ఒకప్పుడు కత్తులు, కర్రలతో దుండగులు దాడులకు పాల్పడితే ఇప్పుడు ఉగ్రవాదులు ఎ.కె.47 వంటి అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్నారు. మనుషులు కనిపించకుండానే సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ఆస్తులు కొల్లగొడుతున్నారు. సరిహద్దులు

చెరిపేసే కొత్తతరం నేరగాళ్ళు పుట్టుకొస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక నేరగాళ్ళు విజృంభిస్తున్నారు. ముష్కరులను ఎదుర్కొనేందుకు భుజబలం కావాలి. సైబర్‌ నేరగాళ్లను ఎదుర్కొనేందుకు బుద్ధి బలం

కావాలి. ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ పోలీసుశాఖ ముందుకు వెళుతోంది. ఇందుకు ప్రభుత్వాలు కూడా ఇతోధఇకంగా సహకరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పోలీసులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. గతం లో ఎన్నడూ లేనంత భారీగా నిధులు మంజూరు చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా సైబర్‌ పోలీసుస్టేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత మనదే. పోలీసు శాఖ కంప్యూటరీకరణలోనూ మనమే ముందున్నాం. ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు మొదలు పోలీసుపనులన్నీ కంప్యూటర్‌ ద్వారానే జరుగుతున్నాయి. అందు కే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టిన సిసిటిఎన్‌ఎస్‌ ప్రాజెక్టులోమననే ప్రధాన భాగస్వామి గా చేసింది. వామపక్ష ఉగ్ర వా దంపై పైచేయి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచినఘనత కూడా మనకే సొంతం. అయితే సామర్థ్యంపరంగా ఎప్పటికప్పుడు మెరు గులు దిద్దుకుంటూనే పోలీసులకు కల్పించే వసతుల విషయం ఇంకా అనేక సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. ఈ దిశగా కసరత్తు జరుగుతోంది.
పోలీసులంటే త్యాగానికి ప్రతీకలు. అయితే దురదృష్టవశాత్తూ పోలీసులు చేస్తున్న మంచి పనుల కంటే ఒకరిద్దరు చేసే చెడు పనులే ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. వాస్తవానికి ఎప్పుడూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళ ని వారికికూడా పోలీసుల పట్ల దురభిప్రాయం నెలకొని ఉం టుంది. కాని ప్రజలు, పోలీసులు మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే సమాజంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతా యి. అందుకే ఇప్పుడు ఈ దిశగా కృషి మొదలుపెట్టాం. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ తమకు న్యాయం జరిగిందనే సంతృప్తితో తిరిగి వెళ్ళేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం.
అయితే పోలీసు వృత్తి ఎంతో సంక్లిష్టమైంది. సంఘటన ఏదైనా సరే బాధితులు ఎవరో, బాధ్యులు ఎవరో తేల్చి చెప్పడం కష్టం. కాని ఇప్పుడు ప్రజలు ఇన్‌స్టెంట్‌ ఫలితం ఆశిస్తున్నారు. దర్యాప్తు చేసే అవకాశం కూడా ఇవ్వడంలేదు. పోలీసులు మారాలి అని ఆశించే ప్రజలు ముందు సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలి. అయితే ఇందులో ముందు గా కృషి చేయాల్సింది పోలీసులే.
ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఇందుకు ముందుగా పై నుంచి అంటే అధికారుల నుంచి చొరవ తీసుకోవాలి.
త్యాగాలు నిరుపమానం.
గడచిన పదేళ్ళకాలంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం కారణంగా 180 మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకంగా వీరికి మావోయిస్టులతో వ్యక్తిగత వైరం ఏమీ లేదు. విధి నిర్వహణలో... శాంతిభద్రతల పరిరక్షణలో బలి పశువులు అవుతున్నారు. దేనికీ వెరువకుండా కృషి చేస్తున్నారు.
చిన్నాచితకా పొరపాట్లు జరిగినా అవన్నీ విధి నిర్వహణలో జరిగే పొరపాట్లే. అయితే పోలీసు పొరపాట్లు ప్రజ ల మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి కాబట్టి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సాధ్యమైనంత వరకూ ఏ పొరపాటుకీ తావులేకుండానే ప్రయత్నిస్తుంటారు. అందుకే ప్రతి సంఘటననూ సవాలుగా తీసుకుంటాం. అందుకు తగ్గ ట్టు ఎంతో కృషి చేస్తాం. వివాదాస్పదం కావాలని ఎప్పు డూ కోరుకోం. కాని పోలీసు విధి నిర్వహణ అత్యంత సున్నితమైనప్పుడు అన్నింటినీ తట్టుకోగలిగే మానసికస్థైర్యం అలవరచుకోవాలి. ఒకరిద్దరు పోలీసుల ప్రవర్తన కారణంగా వారి త్యాగాలు మరుగున పడిపోతున్నాయి.
ప్రజలకు ఇప్పటికీ పోలీసులంటే అమితమైన గౌరవం ఉంది. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. లేకపోతే నొప్పి కలగగానే అమ్మా అన్నట్లుగానే సమస్య రాగానే పోలీసులు గుర్తుకు రారు. మా అవసరం రాకపోతే సంతోషమే. కాని మేం అవసరం ఉన్నప్పుడూ మా విధి నిక్కచ్చిగా నిర్వహించగలగాలని కోరుకుంటున్నాం. ఇందుకు తగ్గట్టుగా సిబ్బందిని సమాయత్తపరుస్తున్నాం.

మహిళలూ అతీతులు కారు
విధ్వంసం సంభవించినప్పుడు ప్రాణం కాపాడుకోవడం బదులు ప్రాణాలు కాపాడాలనే ధైర్యం పోలీసు యూనిఫాం ధరించిన ప్రతి ఒక్కరికీ పుట్టుకొస్తుంది. ఇందుకు మహిళా పోలీసులు కూడా అతీతం కాదు.
పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు ముష్కరులను నిలువరించేందుకు ప్రయత్నించి ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ కమలేష్‌కుమార్‌ప్రాణాలు పోగొట్టుకుంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు.

ప్రాంతాలకతీతం... ఈ ఉద్యోగం
పోలీసులకు ప్రాంతాలతో సంబంధం లేదు. యూనిఫాం ధరించగానే అన్నింటికీ అతీతం అన్న భావన కలుగుతుంది. తాను నిర్వర్తించాల్సిన పనే గుర్తుంటుంది. మరీ మెతకగా ఉంటే ఉద్యమకారులు తిరగబడి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తారు. కాస్త కఠినంగా వ్యవహరిస్తే పోలీసుల దురుసుగా ప్రవర్తించారంటారు.రెండింటి మద్యా బాలన్స్‌ చేయడం కత్తి మీద సామే. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రకాల ఉద్యమాల్లో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర నిజంగానే అభినందనీయం.

కె ఎస్‌ వ్యాస్‌
తీవ్రవాదాన్ని, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచి వేసిన వ్యక్తిగా పేరున్న వ్యాస్‌. ఎప్పటిలాగే 1993 జనవరి 27
ఉదయం జాగింగ్‌ కోసం ఎల్బీ స్టేడియంకి వచ్చిన
ఆయన్ని నక్సల్స్‌ అతి దారుణంగా హత్య చేసారు.

పరదేశీ నాయుడు
మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న సమయంలో ఈయన కూంబింగ్‌ కోసం వెళ్లి వస్తుండగా... 1993 నవంబర్‌ 14న నక్సల్స్‌ పేల్చిన క్లైమూర్‌మైన్‌కి గాయపడి మరణించారు.

ఉమేష్‌ చంద్ర
ఫ్యాక్షన్‌ నాయకులని గడగడలాడించి సామాన్య జనానికి అందుబాటులో ఉండే పోలీసు అధికారిగా పేరుతెచ్చుకున్న ఉమేష్‌ చంద్రని 1999 సెప్టెంబర్‌ 4న హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తావద్ద పట్టపగలే నక్సల్స్‌ హత్య చేసారు.

అమరవీరులెందరో....
తీవ్రవాది ముజీబ్‌ అహ్మద్‌ని పట్టుకునే క్రమంలో మరణించిన ఏసీపి కృష్ణప్రసాద్‌, ఎస్‌ఐ సైదులు, కానిస్టేబుల్‌ సాయిలు, హౌం గార్డు సత్యనారాయణ, బాలస్వామి ఇలా ఎందరో నిరం తరం తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని రక్షిస్తున్నారు.

వ్యాస రచయిత :
వి. దినేష్‌ రెడ్డి
డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, ఏపి

“ముత్యం”ముచ్చట్లు

ముత్యం అన్న పేరే స్వచ్ఛతకి మారు పేరు. అసలా పేరు లేకుండా మన భారతీయ సాంప్రదాయంలో...
పెళ్లిళ్లు, పేరంటాలు సాగవు, భద్రాచల రామయ్య, శ్రీశైల మల్లన్న, తిరుపతి వెంకన్న ఇలా...
ఏ దేవుళ్ల వేడుకుల లోనైనా ముత్యాలు లేకుండా ఆ కార్యక్రమాలని ఊహించుకోగలమా
అంతెందుకు మన పెళ్లిళ్లలోనే, ముత్యాల మండపం, ముత్యాల తలంబ్రాలు, ముత్యాల పల్లకీలు...
తెలుగింటి మగువలు వేసే అందమైన ముగ్గులకి ముత్యాల ముగ్గులంటూ సాంప్రదాయబధ్దంగా...
మన పెద్దలు ముత్యాలకే పెద్దపీట వేయగా దాన్నే తరతరాలుగా కొనసాగిస్తున్నామంటే....
మన భారతీయ సమాజంలో ముత్యాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఒకపðడు ఖరీదైన ఆభరణాల సరసన నిల బడి... ధీటుగా చూస్తున్న ముత్యాలు నేడు నకిలీ ల బారిన పడి విలవిల బోతున్నాయని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అతివలకు అందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో 'ముత్యాలు' ప్రధాన భూమిక పోషిస్తున్నాయనే చెప్పాలి.
నేటి ఆధునిక ప్రపంచంలో మారుతున్న ఫ్యాషన్‌కి తగ్గట్టు 'ముత్యం' కూడా తన పంధాని మార్చుకుని ఎవరికి కావాల్సిన విధంగా వారి ఆభరణాలలో ఒదిగిపోతూ ఎప్పటికపðడు సరికొత్త అందాలకు కారణమవుతూ వస్తోంది. నిరాడంబరతనే కాదు, అంతకు మించిన దర్పాన్ని, స్వచ్ఛత నీ, సౌకుమార్యాన్ని ఏక కాలంలో ప్రతిబంబించే ముత్యం నాటి మహారాజులనే నేడు సామాన్యుడి ఇంట కూడా చిరు నవ్వులు చిందిస్తోందంటే అతిశయోక్తి కాదేవెూ ఎంతటి అద్భుత సౌందర్య రాశి అయినా మెడలో చిన్నపాటి ముత్యాల హారం ఉందంటే ఆ సౌందర్యం అజరామరమే అవుతుంది. అందుకనేవెూ అతివల అందాన్నే కాదు వారి మనసుల్ని కూడా ముత్యమంత స్వచ్చతతో ఉన్న వారని పోలుస్తుంటారు.
నిత్య జీవనంలో మనిషి వినియోగించే అనేక రకాల అలంక రణలలో నవరత్నాలకో ప్రత్యేక స్ధానం ఉంది. అందులో ఎని మిది రత్నాలు మన భూభాగంలోనే దొరికేవయితే ముత్యం మాత్రం సముద్రంలో దొరికేది కావటం విశేషం.
సహజ ముత్యం ఎలా తయారవుతుందంటే....
ఆల్చిప్పలలో స్వాతి చినుకులు పడితే ముత్యంగా మారుతుందని మన కవులు చాలా అందంగా ప్రకృతి పరవశింప చేసాలా రాసినా... వాస్తవానికి సముద్రంలో నివసించే మెలస్కస్‌ జీవులు విడు దల చేసే కర్బన పదార్ధాల ద్వారా స్వఛ్ఛమైన ముత్యాలు ఏర్పడతా యి. ధృడ కవచాన్ని కలిగిన ఈ జీవుల్లోకి పరాన్న జీవులు కాని, ఇసుక రేణువుల కానీ ప్రవేశిస్తే... వాటిని బయటకు పంపే ప్రయ త్నంలో తన చుట్టూ ఉన్న ఆర్గో నైట్‌ కరంకియోలిస్‌ అనే కర్బన పదా ర్ధాన్ని విడుదల చేస్తుంది. దీనేనే 'నాక్రే' (మదర్‌ ఆఫ్‌ పెరల్‌) అని పిలు స్తారు. మెలస్కస్‌లో ప్రవేశించిన జీవుల ఆకారం, సైజుల ఆధారంగానే ముత్యాల పరిణామాలుంటాయి. ఇవి ఇసుక రేణు వు స్ధాయి నుండి సుమారు 500 క్యారెట్ల బరువున్న గుండు ఆకా రం వరకూ కూడా తయారవుతుంటాయి.
ప్రపంచంలోనే మేలిముత్యాలు దొరికే ప్రాంతాలుగా హిందూ, అరేబియా సముద్ర ప్రాంతాలని పేర్కొంటారు. ఇప్పటికి ఈ సముద్ర గర్భం నుండి ముత్యాల ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఎర్రసముద్రంలో దొరికే నల్లని ముత్యాలు ప్రపంచ దృష్టిని ఆక ర్షించినా.. అక్కడి కాలుష్యం వాటిపై కాటేసి... చాలా వరకు నల్ల ముత్యాల ఉత్పత్తి తగ్గిపోయిందనే చెప్పాలి.
ఇక ముత్యాల పరిశ్రమకు ఒకపðడు మారు పేరుగా నిలచిన ఇరాకలోేని బస్రా నేడు విలవిలబోతోంది. అక్కడి సముద్ర జలాల లో దొరికే సహజ ముత్యాలు ప్రపంచ వ్యాప్తంగా టన్నుల కొలది సరఫరా చేసినా... అక్కడ ఉండే చమురు నిక్షేపాలపౖౖెనే ప్రభుత్వా లు ఎక్కువ మక్కువ చూపడం, ఈ కారణంగానే సముద్ర జలాలు పూర్తిగా కలుషితమై బస్రా ముత్యాల పరిశ్రమని దెబ్బతీసింది. అడపా దడపా బస్రా నుండి స్తున్న ముత్యాలకు ప్రపంచ వ్యాప్తం గా నేటికీ మంచి గిరాకీ ఉండి లక్షల్లో ధర పలుకుతోంది.
ఇక మంచి ముత్యాలలో హంస, కుడుకల్‌, నూరి, సూర్తి ఇలా పలు పేర్లతో పిలిచే ముత్యాలు ఉన్నాయి. ఇవన్ని వేటికవే తమ ప్రత్యేకతని నిలుపుకున్నవి కావటం విశేషం.
'కల్చర్డ్‌ పెరల్స్‌' :
ముత్యాల వాడకం పెరిగాక తొలినాళ్లలో వాటి ఖరీదు ఎక్కువగా ఉన్న సమ యంలో మత్యాలేర్పడే తీరు తెన్నులపై పరిశోదనలు చేసిన శాస్త్రవేత్తలు ముత్యాల తయారికి అనువైన రసా యనం కాల్షియం కార్బనేట్‌గా నిర్ధారించి సాధారణ ముత్యపు చిప్పలలోకి దాన్ని ప్రవేశ పెట్టి ముత్యాలను తయారు చేయటంలో సక్సస్‌ అయ్యారు. ఇందుకు ఆద్యుడిగా జపాన్‌కి చెందిన శాస్త్రవేత్త మికామెతో కోకిచినే చెపðకోవాలి. దాదాపు 17 ఏళ్ల పాటు చేసిన అనేక ప్రయోగాల ఫలితంగా 1890 ప్రాంతంలో ముత్యాలని సృష్టించి సమస్త మానవాళి నీ ఆశ్చర్య చకితుల్ని చేసాడు. అయితే అప్పటికి సహజసిద్దంగా ముత్యాలు వెల్లువలా వస్తుం డటంతో నాటి సమాజం పెద్ద గా పట్టించుకోక పోయినా... 1940 తరువాత ఈయన రూపొందించిన తరహాలో తయార వుతున్న ముత్యాలనే మనం 'కల్చర్డ్‌ పెరల్స్‌'గా పిలుస్త్తున్నాం.
సహజ సిద్దంగానే తయ్యారయ్యే ముత్యాలు తరహాలోనే వీటిని కృత్రిమంగా ముత్యాలను తయారవుతున్న కల్చర్డ్‌ పెరల్స్‌ నేడు యావత్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. దీంతో ఓ పరిశ్రమగా ఈ ముత్యాల తయారీ కొనసాగుతోందనే చెప్పాలి.
ఈ కల్చర్డ్‌ పెరల్స్‌లో పెప్సీ, డ్రాష్‌, బివాకో, రైస్‌ ,సిడ్‌, బడ్‌, బటన్‌ ఇలా ఎన్నో రకాలున్నాయి. వీటిలో మార్కెట్‌లో ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువగా ఉన్నది రైస్‌ పేరుతో పిలవబడే ముత్యాలకే.
సెమీ 'కల్చర్డ్‌ పెరల్స్‌' :
పూర్తిగా యంత్రాల సాయంలో ప్లాస్టిక పూసల రూప కల్పన చేసినట్లే ఈ ముత్యపు ఆకారాలను తయారు చేసి, వాటిపై కర్బన పూత పూస్తారు. ఇవి దాదాపు మంచి ముత్యాలను పోలి ఉండ టంతో... వీటి రంగ ప్రవేశం తరువాత ఏది నకిలీ, ఏది మంచి దని తెలుసుకోవటం కోసం ఖచ్చితంగా నిపుణులను ఆశ్రయించ క తప్పదు. అనేక రంగుల్లో కనిపిస్తుంటాయి.
మాజోర్కా ముత్యాల పేరుతో మార్కెట్‌లో లభ్యమయ్యే ముత్యాలు ఇలా తయారైనవేనని నిపుణులు చెప్తుంటారు. ప్రజల్ని ఆకర్షించేందుకు వీటికి సెమీ 'కల్చర్డ్‌ పెరల్స్‌' అని పిలవటం మరో విశేషం.
ఎలాంటి ముత్యాలు కొనాలి...
వెన్నెల విరిసేంత తెల్లదనంతో ధృఢంగా, మందంగా ఉండే ముత్యాలు శ్రేష్టమైనవని, ఎలాంటి రంధ్రాలు , గీతలు లేని ముత్యాలు కొనడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే గులాబి, కాస్త నలుపు దనాన్ని కలిగి ఉండి ధవళ కాంతులు వెదజల్లే ముత్యాలు మంచివని, అయితే గోధుమ వర్ణం, పసుపు రంగుల్లో ఉన్నవి మంచి ముత్యా లంటూ అంటగట్టే ప్రయ త్నం ఎంతపేరున్న షాపు లోచేసినా కొనకపోవటం మంచిదని ఇవి చాలా తక్కువ నాణ్యత కలిగిన వని, వాతావరణ ప్రభా వంతో ముత్యాలు రంగు మరేతత్వం ఉండ టంతో మీరు వెూసపోయే ప్రమా దం ఉంది. ఎంతటి ఖరీ దైన ముత్యమైన దాని జీవన కాలం 100 నుండి 150 ఏళ్లు మాత్రమేనని.. ఆ తరువాత అవి రంగు మారిపోవటం ఖాయమని చెప్తున్నారు నిపుణులు.
మత్యాల నగరం మనదే...
ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ ముత్యాలకు పెట్టింది పేరుగా నిలిచిందనే చెప్పాలి. హైదరాబాద్‌లో నాణ్యమైన ముత్యాలకు పెట్టింది పేరుగా నిలిపేందుకు అప్పటి ఆరవ నిజాం ప్రభువు మహబూబ్‌ ఆలీఖాన్‌ ఎంత గానో కృషి చేసాడు ముత్యాలంటే అమితంగా ఇష్ట పడి దాదాపు తాను చేయించు కునే ప్రతి నగలోనూ ముత్యాలకు స్ధానం కలిపించిన ఆలీఖాన్‌ హర్యానాలోని నగల వర్తకుడైన రాందత్‌మలేజీని హైదరాబాద్‌ రప్పించుకునేవారని.. ఆ క్రమంలోనే ఆలీఖాన్‌ ప్రోద్భలంతో ఆయన కుమారుడైన కేదారీనాధ్‌ 1908లో ఛార్మినార్‌ దగ్గర లోని ఫత్తమట్టి ప్రాంతంలో ముత్యాల కోసం ప్రత్యేకంగా ఓ అంగడిని తెరిచి వ్యాపారం ప్రారంభించినట్ల్లు చెప్తారు. ఇలా భారత దేశంలోనే తొలిసారిగా ముత్యాల కోసం ప్రత్యేకంగా ఓ షాపు మన హైదరాబాద్‌లో నే ప్రారంభం కావటం గమ నార్హం. ఆపై అనేక మంది ఇక్కడ ముత్యాల వ్యాపారాలు ప్రారంభించడంతో హైదరాబా ద్‌ ముత్యాలకు ప్రత్యేక పేరే వచ్చింది.
చిన్న చూపు చూడొద్దు..
చాలా మంది ముత్యాలే కదా అని చిన్న చూపు చూస్తూ... ఇష్టానుసారం వాడి ఎక్కడ పడితే అక్కడ పడే స్తుంటారు. దీంతో అవి తమ సహజ రంగుల్ని కోల్పోయి గోధుమవర్ణంలో మారిపోతుంటే... మనం వెూసపోయా మని భావిస్తుంటారు. అయితే ముత్యాలు సహజ సిద్దంగా ఏర్పడినవి. ఇవి వేడిని తట్టుకోలేవు, అందుకే వీటిని ఏదైనా సాయంత్రం పూట జరిగే ఫంక్షన్లకి వేసుకు వెళ్లండి. ముఖ్యం గా ఇళ్లలో ఉండేపðడు వంట చేసేపðడు, అందునా వేసవిలో ధరించకుండా ఉండటమే మంచిది.వేడి తగిలితే అవి తమ రంగుని కోల్పోతాయన్న విషయం గుర్తెరగండి.
అలాగే భధ్రపరిచేపðడు ఎలా పడితే అలా ముత్యాలు పడేయకండి. అలాగే పూర్తి పొడిగా ఉండే వాతావరణం కూడా ముత్యాలకు పడదు. ఈ వాతావరణంలో అవి పగుళ్లకు నోచుకునే ప్రమాదం ఉంది. దీని వల్ల అవి గీతలు పడివాతావరణ ప్రభావానికి తొందరగా లోన య్యే అవకాశం ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసు కుంటే మంచిది.


పరమత సహనానికి ప్రతీక ముత్యం
గోల్కొండని పాలించే నవాబులు తానీషా కాలంలోనే భద్రాచల రాముడి కళ్యాణానికి శ్రీరామ నవమి నాడు ముత్యాలను తలంబ్రాలుగా పంపేవారు... అంటే ముత్యాలకున్న ప్రాధాన్యతనే కాదు... నాటి నవాబుల కాలం నుండే హైదరాబాద్‌ పరమత సహనానికి ప్రతీకగా నిలిచిందనే చెపðకోక తప్పదు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తోంది.
ముత్యాలు ఎలా భద్రపరచు కోవాలి..
ముత్యాల నగలు మీ అవసరం పూర్తయ్యాక మెత్తని బట్టలో కాసింత ఆలివ్‌ ఆయిల్‌ని వేసి ముత్యాలని జాగ్రత్తగా తుడిచి, ముఖ్‌ మాల్‌ బట్టతో ప్యాక చేసి దాచుకొంటే నిత్యం తళ తళ మెరుస్తుంటాయి.నిత్యం బీరువాలలో ఉంచేస్త్తే మీరు బట్టల సువా సన కోసం వేసే అనేక కెమికల్‌ బాల్స్‌ వాసనకి కూడా రంగు మారిపోతుంది. కనుక అడపా దడపా బైటకి తీసి వాడండి.
ముత్యాల నైపుణ్యం మనోళ్ల సొంతం
అలాగే ఎంత చిన్నని ముత్యానికైనా రంధ్రాలు చేయగల నైపుణ్యత హైదరాబాదీలకే సొంతం అనటంలో సందేహం లేదు. అందుకే ప్రపంచంలో పలు దేశాల నుండి ముత్యాలు ఇక్కడకి కేవలం రంధ్రాలు చేయటా నికే వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పెరల్‌ సిటీగా పేరున్న మన హైదరాబాద్‌లో ఆమధ్య ముత్యాల వ్యాపారం కాసింత మందగించినా... నేడు సామాన్యులకే కాదు యువతకి కూడా క్రేజీ ఆర్న్‌మెంట్‌ అయింది.

నవ్వితే... నవ వసంతమే...

ఓ సారి కళ్లు మూసుకుని పూలు లేని ప్రకృతిని, బోసినవ్వులు లేని చిన్నారుల ప్రపంచాన్ని ఊహించండి...
ఎంత భయంకరంగా ఉన్నాయో గమనించారా అంటే నవ్వుకున్న ప్రాధాన్యత అదన్నమాట.
చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిగా బతకాలి అంటూ గీత రచయితలు పాటలు రాసుకుంటే...
నవ్వటం ఓ యోగం... నవ్వించడం ఓ భోగం... నవ్వక పోవటం ఓ రోగం అంటూ జంధ్యాల లాంటి
హస్య రచయితలు నవ్వుకున్న ప్రాధాన్యతని చలోక్తులుగా జనం ముందు నిలిపారు.
నవ్వు నాలుగు విధాలు గా చేటన్న దిశ నుండి నవ్వు నాలుగు విధాల స్వీటన్న దిశకి
ప్రస్తుతం సమాజం చేరుకుందన్నది వాస్తవం.
నిత్య జీవితంలో కనిపించే కష్టాలని, పెరుగుతున్న ఒత్తిళ్లని అధిగ మించి మనసారా నవ్వునేందుకు చాలా మంది చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు చిన్న చిన్న ఆనందాలు, నవ్వులూ విర బూయని కుండా నిత్యం గంభీరతతో ఉండే ఇళ్లలో ఏదో దెయ్యాలు తాండవం చేస్తున్నట్లు వైపు కన్నెత్తి చూసేందుకు కూడా మనం భయ పడి పోతాం. మనిషి మనసుకుకి, దేహానికి హాయిన్చే ఆరోగ్యాన్నిచ్చే దివ్య ఔషధంగా నవ్వు వెలుగు చూసాక జీవన గమనంలో మరిన్ని నవ్వులు పూయించడం కోసమే లాఫింగ్‌ క్లబ్బులు కూడా పుట్టుకొచ్చా యన్నది వాస్తవం. ఇవి క్రమేపీ విస్తరిస్తూ... సమాజానికి ఆరోగ్యాన్ని పంచి పెట్టేందుకు ప్రతిన బూనినట్లు పనిచేస్తున్నాయి కూడా... లాఫింగ్‌ ధెరఫీ ప్రాధాన్యత ఏపాటిదో శంకర్‌దాదా సినిమా చూసిన వారికి అర్ధమయ్యే ఉంటుంది. ఈ క్రమంలో నవ్వు ఎన్ని లాభాలు చేకూరుస్తుందో తెలియ చేసే చిన్న ప్రయత్నం ఇది.
నవ్వటం ప్రారంభించండి....
సహజంగానే నిత్య చిరువవ్వుతో ఉండే ముఖం ఇట్టే మనల్ని ఆకర్షి స్తుంది. మరి ఆ చిరునవ్వుని మనం ఎందుకు సొంతం చేసుకుని ఇతరును మనవై తిపðకోకూడదన్న ఆలోచన మొదలైదే... అనవసర ఆలోచనల్ని వదిలి పెడుతూ...చిన్న చిన్న హాస్య సన్నివేశాలని గుర్తు చేసుకుంటూ నవ్వటం ప్రారంభించండి.
విసవిసలాడుతూ ఉండే వారి కన్నా... సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంరితో మాట్లాడేందుకే ఎక్కువ మంది ఇష్టపడతారన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని నవ్వుతూ మాట్లాడటం అలవాటు చేసుకోండి.
నవ్వు ఓ అంటువ్యాధి లాంటిది...
నిజమే... ఓ వ్యక్తి ఏడుస్తూ... కనిపిస్తే... మనం ఏడవం... కానీ తెగ నవ్వుతూ కనిపిస్తే.. ఆతని చేష్టలు చూసి మీకూ నవ్వొచ్చేస్తుంది. ఆయా వ్యక్తుల మధ్య సంబంధం కానీ, సందర్భంకానీ లేకపోయినా... నవ్వు ఇట్టే పాకి ఇతరులని నవ్వించే ప్రక్రియ ప్రారంభిస్తుందనటానికి ఇంత కన్నా ఉదాహరణ ఏముంటుంది. లాఫింగ్‌ క్లబ్‌లు, జోక్స క్లబ్బు ల్లోనూ జరిగేది ఇదే... నవ్వేందుకు.. నవ్వించేందుకు అప్పటికపðడు జోకులు వేసుకుని నవ్వుకునే సందర్భాలే అనేక. ఇక్కడంతా టేకిటీజీ పాలసీనే పాటించాలి. లేదంటే మీరే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది.
భావోద్వేగాలను అదుపులోకి తెండిలా...
మీరు గానీ మీరున్న వాతావరణంకానీ ఇబ్బందికరంగా తయారైతే... ఒక్కసారి ఏక బిగిన నవ్వేయండి... మొత్తం పరిస్ధితంతా కూల్‌ అయిపోవటమే కాదు... అక్కడితో భావోద్వేగాలు ఆగిపోయి.. మీతో పాటు అర్ధం కాకపోయినా చిరు నవ్వులతో నవ్వుల వాన మొదలవుతుంది. దీంతో అంత వరకు ఉన్న వేడి వాతావరణం ఒక్కసారిగా అద్భుతంగా మారి దాదాపు అందరి మనసులు ప్రశాంతత చెందుతాయి. అలాగే మీ మూడ్‌ బాగాల ఏదని మీకనిపించినపðడూ నవ్వే దానికి మంచి పరిష్కార మార్గం.
ఒత్తిడిని తగ్గించే నవ్వులు...
చాలా మంది మానసికంగా శారీరకంగా ఆలసిపోయి చేసే పనిపై దృష్టి పెట్టలేరు సరి కదా... విపరీతమైన చిరాకు ప్రదర్శిస్తుంటారు. దీంతో ఇంట్లో అయినా, ఆఫీస్‌లో అయినా వాతా వరణం కూడా గంభీరంగా మారిపోయి... ఏదో తెలియని ఇబ్బందికర పరిస్ధితిల్లో మీరున్నట్లు మీకే అనిపిస్తుంది. ఇలాంటపðడు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల్లా మారిపోయి ఏ మిస్టర్‌ బీన్‌నో, టామ్‌ అండ్‌ జెర్రీ కార్డున్‌ నెట్‌ వర్కనో చూస్తూ ఎంజారు చేేయండి .ఆఫీస్‌లో ఉంటే క్యాంటిన్‌కో, బైటకో వెళ్లి కాసేపు మాట్లాడండి. మీకిష్టమైన జోక ఒకటి చెప్పి నవ్వే ప్రయత్నం చేయండి. దీంతో మీ మూడ్‌ మారి మళ్లీ ప్రశాంతతని పొందియధాస్ధితికి వస్తారు.
రక్తపోటు తగ్గించే మందు ఇది...
నిత్యం మీ రక్తపోటు చూసుకునేందుకు స్పిగ్నో మీటర్‌ని వాడు తున్నారా అయితే ఈ సారి రక్తపోటు కొలుచుకున్న తరువాత కాసేపు ప్రశాంతంగా నవ్వండి... ఆపై మళ్లీ మీలోని రక్త పోటుని కొలుచుకోం డి. ఇట్టేే తగ్గుదల కనిపిస్తుంది. అంటే నవ్వు అధిక రక్తపోటు ఉన్న వారి పై ప్రభావం చూపి తగ్గిందనేగా అర్ధం. అంతర్జాతీయంగా జరిగిన అనే క పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడించాయి కూడా. సైకిలింగ్‌, ఇత ర వ్యాయామాలు చేస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతుందో నవ్వినా అంతే ఖర్చు కావటమే కాకుండా ప్రోటీన్లు, రోగాలతో పోరాడే బి సెల్స్‌, టి సెల్స్‌ కణాలు పెరిగి మెదడుని చురుకుగా ఉంచుతాయని తద్వారా గుండె కూడా చరుకుదనం కలిగి రక్తపోటుని తగ్గించుకునేందుకు మార్గం ఏర్పడుతుందని వైద్యులు చెప్తారు.
మతిమరుపు మాయం చేస్తున్న నవ్వు
నిత్యం నవ్వుతూ ఉంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పదే పదే నవ్వుతున్న వారిలో మరు పు మాయమవుతుండగా ఎపðడూ మూడీగా ఉండే వారు చివరకి ఏ విషయం మీద ఆలోచిస్తున్నావెూబీ కూడా తెలియనంత మతి మరుపు ని మూటగట్టుకుంటున్నట్ల్లు ఈ సర్వే తేల్చి చెప్పింది. అంటే నవ్వు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తోందో అర్ధమవుతోందా
ఉపాధి అవకాశాలిచ్చే నవ్వు...
నిజమేనండి బాబు... మీరే ఇంటర్వూకో వెళ్లేపðడు కాస్త చిరాకుగా ముఖం పెట్టారో మీ పని ఔట్‌. అదే చిరునవ్వుతో ఇంటర్వూ చేసే వారి ని పలకరించారనుకోండి... 50 శాతం మార్కులు ఇట్టే కొట్టేసారన్న మాటే... రిసెప్షనిస్టుల ఉద్యోగానికి మాట తీరెంత ముఖ్యవెూ నవ్వులు చిందించడం అంతే ముఖ్యం. నిత్యం నవ్వుతూ ఉండటం వల్లనే ఈ ఉద్యోగాలలో పనిచేసే మహిళలు ప్రత్యేక వ్యాయామమే అవసరం లేకుండా ముఖ కండరాలు చరుగుగా వ్యవహరిస్తూ...నిత్యయవ్వనులు గా చూపిస్తున్నాయని...ఎలాంటి ఖర్చు లేకుండా నవ్వులతోనే అందం పొందేస్తుంటే మీరెందుకు ప్రయత్నించకూడదో చెప్పండి.
అసలు ఏ ఉద్యోగంలో అయినా నవ్వుతూ మాట్లాడుతూ.. కలగొలుప ుగా ఉన్నా వారికే అనేక అవకాశాలు పుట్టుకొస్తుంటాయని గమనించం డి. నిత్యం నవ్వుతూ మాట్లావారు ఆత్మ విశ్వాసంతో, ధైర్యంగా ముందు కు వెళ్లగలడు, అందరినీ కలుపుకు పోతూ... మన్నలనీ పొందగలడు.
నవ్వితే 17... బిగిస్తే 43..
అవును మీరు నవ్వితే 17 కండరాలలో కదిలే కలయిక మీలో కొత్త ఉత్సాహాలనిస్తుంది. అదే మూతి బికించుకుని సమాజంతో మనకేం పని లేదన్నట్లు కూర్చొంటే 43 కండరాల బిగుసుకుని పని చేయటం మానేసి అనేక రోగాలు తెచ్చి పెడతాయని వైద్య పరిశోధనల్లో తేలిన అంశం. పసి పిల్లలు సగటున రోజుకు300 వందల సార్లు నవ్వుతుం టే పెద్దలు కేవలం 17 సార్లే నవ్వుతున్నారని, అయితే పురుషుల కన్నా స్త్రీలు 126 శాతం అధికంగా నవ్వుతున్నారని... అందువల్లనే వారిలో రోగ నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతోందని ఓ పరిశోధనలో తేలింది.
ఆఫీస్‌లోని వారో బైటవరోనే కాదు ఇంట్లో వాళ్లయినా మీరు చిరువ్వుతో చెపితే మాట వినేందుకు కనీసం ప్రయత్నిస్తారు. అలా కాకుండా హుం కరించారో.. ఓ వేళ తిరగ బడినా ఆశ్చర్యపోనఖ్ఖర్లే. సందర్భానుసారం గా జోక్స వేస్తు వాతావరణాన్ని మీకనుకూంగా మార్చుకోవాలంటే నవ్వే పెద్ద ఆయుధం.
ఏవిషయానైనా పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు సాగితే నవ్వుతూ బతకడం ఇట్టే అలవడుతుందన్న విషయం గుర్తెరి మీ జీవితంలో నవ్వు కి ఎంత ఎనలేని ప్రాధన్యత ఉందో గమనించి నవ్వుల సాగరంలో నిండిపోతే... మంచిది.

రోగాలని మాయం చేసే నవ్వులు...
నిజమే అనేక రోగాలను నవ్వే మాయం చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. మనం ఎంత నవ్వితే అందగా మనలోని అంత: స్రావీ గ్రంధులు అనేక హార్మన్లని సెరోటోనైస్‌, ఎండో సైస్‌ ఎంజైమ్‌లని విడుదల చేస్తాయి. ఇవి మనలోని రోగనిరోధకతని పెంచడమే కాకుండా పాటు మన ఆరోగ్య స్ధాయిని కూడా పెంచుతాయి. దీంతో ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుండి తక్షణ ఉపశమనాన్ని పొందుతామని నిపుణులు చెప్తున్నారు.

గగనతలంలో... చిరునవ్వుల ఉద్యోగం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో మహిళామణులు అనేక విమానయాన సంస్ధలలో పైలట్లుగా, కో పైలట్లు గా, అధికారిణిలుగా అనేక రకాల ఉద్యోగాలలో సేవలందిస్తున్నా... ఎయిర్‌ హౌస్టస్‌లుగా వారందిస్తున్న సేవలు
అద్భుతం అవెూఘంగానే చెప్తారు విమానం ఎక్కి తిరిగేవారెవరైనా..
మదిలో ఎన్ని కష్టాలున్నా... నిత్యం చిరునవ్వుతో తమ వద్దకు వచ్చే వారికి అతిధి సత్కారాలు అందించాల్సిన బాధ్యతని
సక్రమంగా. నెరువేరుస్తూ... ప్రశంసలందుకుంటున్న మహిళా మణులెంతో మంది ఉన్నారు.

అంద చందాలే ఈ ఉద్యోగానికి ప్రత్యేక అర్హతలైనా... కలగొలుపుగా మాట్లాడే తత్వం, ఎలాంటి పరిస్ధితిలోనూ ఎదుటవారిపై విసుగులేకుండా నవ్వుతునే వారు చెప్పేది వినాల్సిన అవసరం ఉన్న ఉద్యోగమిది. అందాల సోయగ ాలతో... రూప లావణ్యాలతో ప్రయాణీకులను కట ి్టపడేసే ముగ్గమనోహర మాటలతో ప్రవర్తించే ఈ ఎయిర్‌ హౌస్టస్‌లే దేశ విదేశీ విమానయాన సంస ్ధలకు పెద్ద ఆకర్షణగా నిలుస్తున్నారంటే సందేహం లేదు. ప్రయివేటు రంగంలోని విమాన యాన సంస్ధలే కాదు ప్రభుత్వ రంగంలో ఉన్న ఎయిరిండియా లాంటి సంస్ధలు కూడా తమ నష్టాలను పూడ్చుకు నేందుకు పైలెట్ల వేతనాల్లో కోతల్ని విధించినట్లే.... ఎయిర్‌ హౌస్టస్‌లుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు నో వర్క్‌, నోపే అన్న సిద్దాంతాన్ని అమలపరుస్తున్నా... నేటి యువతలో చాలా మంది ఎయిర్‌ హౌస్టస్‌లుగా పనిచేసేందుకు సిద్దపడుతునే అందుకు తగ్గ శిక్షణ పొందుతున్నారు ఇప్పటికే మన హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాలలో ఎయిర్‌ హౌస్టస్‌ శిక్షణ నిచ్చే సంస్ధలు చాలానే ఉన్నాయి.
అందంతో పాటు ఓర్పు, సహనం, నిత్య చిరునవ్వు అమ్మా యిలనే ఈ ఉద్యోగాలు వరిస్తాయి. ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ తమ సంస్ధలో పనిచేసే ఎయిర్‌ హౌస్టర్స్‌ నాజూకుగా ఉండాలని లేదంటే వారిని గగన విహారం నుండి తొలగించి సంస్ధ కార్యాలయాలకు మారుస్తామని చెప్పడంతో ఎయిర్‌ హౌస్టస్‌లు సుప్రీం తలుపు తట్టారు. ఇన్నాళ్లు తమ అందాలని తన వ్యాపారాభివృద్ధికి వినియో గించుకుని ఇపðడు కార్యాలయాల్లోకి నెట్టి వేయటపై నిలదీసారు. దీనిపై మహిళా సంఘాలు కూడా తీ వస్ధాయిలో స్పందించి కాసింత ఒళ్లు చేసినంత మాత్రాన ఉద్యోగానికి పనికి రావంటూ మహిళల పై ఎయిరిండియా వివక్ష చూపుతోందంటూ నిరస నలు చేపట్టాయి. ఇలా ఈ ఉద్యోగాలపై మక్కువ ఉన్నా ఉద్యోగ భద్రత కరు వైన నేపధ్యంలో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎయిర్‌హౌస్టస్‌ శిక్షణకు పంపేందుకు వెనకాడుతు న్నారన్నది వాస్తవం.
ఆర్ధిక మాద్యం కృంగదీస్తున్నా... ఒక్క భారత్‌లోనే కాదు, యావత్‌ ప్రపంచంలోని అనేక ప్రయివేటు విమానయాన సంస్ధల్లో దాదాపుగా తాత్కాలిక ప్రాతిపదికనే ఎయిర్‌ హౌస్టస్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తూ... ఎప్పటి కపðడు కొత్త కొత్త వారితో సేవలందించేలా కొత్త ప్రణాళికలు రచిస్తుండ టంతో అవకాశాలు దక్కించుకునేందుకు అనేక మంది మహిళలు సిద్దమవుతున్నారు.
ఎయిర్‌ హౌస్టస్‌గా పని చేయాలనుకునే వారు అనవసర భయాలను పక్కకు పెట్టి మానసికంగా, శారీరకంగా ధృఢ నిశ్చయంతో ఉండాలి. ఎత్తుకు తగ్గబరువు ఉండటమే కాదు... నిత్యం వ్యాయామం, ఎరోబిక్స, యోగా లాంటివి చేయాలి. పైగా రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రిస్తే కాని మరుచటి రోజు తాజాగా కనిపించరు. అయితే ఎయిర్‌ హౌస్టస్‌ ఉద్యోగంలో భూ ఉపరి తలానికి దాదాపు 30 వేల అడుగుల దూరంలో ప్రయాణం చేస్తుండటంతో ప్రయాణీకులతో పాటు డీ హైడ్రేషన్‌కి గురయ్యే అవకాశా లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వివిధ వాతావర ణాలలో ప్రయాణించడం వల్ల తరచూ అనారోగ్య సమస్య లు వస్తే వాటిని ధీటుగా ఎదుర్కొనేలా నీళ్లు, పండ్ల రసాలు క్రమం తప్పకుండా సేవించడం తప్పని సరి.
అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్లో పనిచేయాల్సి వచ్చినపðడు ప్రయాణీలకు ఆల్కాహాల్‌ కూడా అందచేయా ల్సిఉంటుంది. దీంతో వారు ఒక్కో సారి అతిగా ప్రవర్తించే అవకాశాలూ ఉన్నా యి. అలాంటి వారితోనూ మర్యాదగా, నవ్వుతూనే, సహనంతో వ్యవహరిస్తూ... సున్నితంగా ప్రవర్తించాల్సి ఉంటుంది.
అందుకే ఎయిర్‌ హౌస్టస్‌ శిక్షణా సంస లు ఇలాంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి శిక్షణ ఇస్తాయి. అలాగే వివిధ దేశాల భాషలు, వాటిపై నైపుణ్యాన్ని కూడా అందిస్తు... వృత్తి పరంగా వచ్చే ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సం సిద్దం చేస్తున్నాయి.ఓ విధంగా చూస్తే ఇదో వైట్‌ కాలర్‌ ఉద్యోగమే అయినా... అనేక దేశాలలో తిరగటం వల్ల ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకు నే అవకాశాలు బోలెడు ఉంటాయి. నిత్యం విమానాలలో ప్రయాణించే ప్రముఖులతోనూ, పారిశ్రామిక వేత్తలతో, సినీ తారలతో పరిచయాలు పెరిగే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా విమాన యానం అనగానే ముందుగా ఆయా దేశాల సాంప్రదాయాలకు తగ్గట్టు దుస్తులు ధరించి చిరునవ్వులతో స్వాగతం పలికే ఎయిర్‌ హౌస్టస్‌ ఉద్యోగం కత్తి మీద సాములాంటిదే అయి నా... అందాల మహిళలకు అద్భుత మైన ఉద్యోగంగానే దీన్ని పేర్కొనాలి. ఎయిర్‌ హౌస్టస్‌ శిక్షణ ఇచ్చే సంస్ధల వివరాలు వెబ్‌సైట్లలో కోకొల్లలుగా లభిస్తున్నాయి. ఓ సారి పరిశీలించండి.
వివిధ దేశాల విమాన యాన సంస్ధలలో పని చేస్తున్న ఎయిర్‌ హౌస్టస్‌లు 'లైఫ్‌'లో దర్శనమి స్తున్నారు. చూసి ఆనందించండి మరి.

జానపదం గుండె చప్పుళ్లు తప్పెటగుళ్లు

తెలుగు జీవన ప్రతిబింబాలుగా నిలచే సాంప్రదాయ కళలకు, జానపదాల పట్ల
నేటి తరానికి అవగాహన కల్పించడంలో చేస్తున్న నిర్లక్ష్యం.... వాటి పట్ల గ్రహణంగా మారి...
ఆదరణ కరువవుతూ... ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయన్నది వాస్తవం.
ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలకు
ప్రత్యేకత తెచ్చి పెట్టిన తప్పెటగుళ్లు చేరుతుండటం ఆందోళన కదలిగించే విషయం.
నేటికీ ఉత్తరాంధ్రా పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడి నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన తప్పెటగుళ్లు నృత్యమే... అవసానదశకు చేరుకున్న ఈ కళని ఈ ప్రాంతంలోనియాదవ కుటుంబాలు తమ సాంప్రదాయ కళపై మక్కువతో పెంచి పోషించాలని తపన పడుతున్నా.... రోజు రోజుకి తమ జీవన ప్రమాణాలు, సంపాదన తగ్గి పోతుం డటం కూడా ఈ కళని కాపాడుకోలేక పోతున్నామని వాపోతున్న వారు చాలా మంది ఉన్నారు.
ఒకప్పుడు పూర్తిగా ఈ కళనే జీవనాధారంగా నమ్ముకుని ఉత్తరాంధ్రా జిల్లాలో అనేక కుటుంబాలు ఉండేవంటే అతి శయోక్తి కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండ లం కేశవ రాయుని పాలెం, మురపాక, లోపింట, బుడు మూరు తో పాటు విజయనగరం, విశాఖ సరిహద్దు గ్రామాలలోనూ తప్పెటగుళ్లు కళని ప్రదర్శించే కళాకారులెందరో ఉండే వారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చి అనేక ప్రసంశలు పొందిన వారూ లేక పోలేదు.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సాగే ఈ కళా రూపా న్ని నేర్చుకునేందుకు నాడు యాదవుల లోనే ప్రత్యేక గురువులు కూడా ఉండేవారు. ఏడాది పాటు ఈ కళని నేర్పించడమే కాకుండా, ఎలాంటి గురు దక్షిణ ఆశించకుండా శిష్యుడికి కావాల్సిన అన్ని సౌకర్యాలు వారే చూసేవారంటే .. కళపై ఆనాటి పెద్దలకున్న మక్కువ తెలుపుతుంది.
అడపా దడపా... అనేక కార్య క్రమాలలో తప్పెటగుళ్ల నృత్యరీతు లు కనిపిస్తున్నా... ఇందులో పాడే పద్యాలు పాటలు.. అన్ని వంశ పారంపర్యంగా వల్లె వేస్తూ వచ్చినవే కావటం విశేషం.
ఈ నృత్యరీతికి తగిన ప్రామాణిక గ్రంధమంటూ ఏదీ లేక పోయినా. ఈ కళ ఆవిర్భావ విశే షాలు అందుబాటులో లేక పోయినా నేటి తరంలోనూ తమ పూర్వీకులు అందించిన ఈ కళని కాపాడుకొవాల న్న తపన కనిపిస్తునే ఉంది. ఉపాధి అవ కాశాలకు తగ్గట్టుగా పెరుగుతున్న అక్షరా స్యతా శాతం యాద వ కుటుంబాలలో పెరుగు తున్నా తమ ప్రాచీన కళ పట్ల మక్కువ ప్రద ర్శించే వారు చాలానే ఉన్నారు నేటికీ..
విచిత్రమైన వేషం...
కాళ్లకు, నడుముకు చిరుగజ్జెలు కట్టి, ప్రత్యేకంగా గజ్జెలుతో కుట్టించిన నిక్కరు, సాంప్రదాయంగా ధరించే లాల్చీతో పాటుగా తల పై కొట్టొచ్చే రంగుల పాగా, రంగు రంగుల కుచ్చిళ్లతో ఉండే కాశీ కోక, నడుంకి రెండు వైపులా వేలబ డుతూ... చూడముచ్చటగా... ఆకర్షించేలా ఉంటుంది తప్పెటగుళ్ల కళాకారుల వస్త్ర ధారణ. తొలినాళ్లలో ఈకళ కోసమే ప్రత్యే కంగా మట్టెకుండలను తయారు చేయిం చి.. వాటికి శుభ్రపరచిన మేకచర్మాలని, ఉడు ముల చర్మాలని తొడిగి వాయిద్యం గా వినియోగించే వారు.
అయితే ప్రదర్శనల సమయం లో అవి పగిలి పోతుండటంతో వాటి స్ధానంలో లోహ పు డబ్బాలను ప్రత్యేక వృత్తా కారం లో చేయించి వాడటం ప్రారంభించామని శ్రీకాకుళంకి చెందిన ఓ వృధ్ద కళా కారుడు చెప్పారు. ఈవాయిదాలను ఛాతిపై కట్టు కుని, లయ బధ్దంగా వాటిని వాయిస్తూ.. కళ్ల కు కట్టిన గజ్జెలతో... బృంద నాయకుడు పాడే జానపద పాటలకు తగ్గట్టుగా చుట్టూ తిరు గుతూ అద్భుత విన్యా సాలతో నృత్యం చేస్తారీ కళాకారులు.
సాము, గరిడీ విన్యాసాలు....
మధ్య మధ్యలో తమ వంశపారం పర్యంగా వచ్చిన సాము, గరడీలను ప్రదర్శిస్తూ... ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో 15-20 మంది ఓ బృందంగా ఏర్పడి ఈ నృత్యం చేస్తారు.
ఏకధాటిగా దాదాపు 4 గంటల పాటు ఎలాంటి విరామం లేకుం డా వీరి ప్రదర్శన జరిగేదంటే ఆశ్చర్యం కలిగించక మానదు. తప్పెటగుళ్ల ప్రదర్శనలు చూసేందుకు వచ్చే వారు కూడా అంతే భక్తి శ్రద్ద్ధలతో కళాకారుల నృత్యాన్ని , చేసే విన్యాసాలని ఆస్వాదించేవారు. ఈ తప్పెట గుళ్ల్ల ప్రదర్శనలో ఎక్కువగా కళాకారులు సారంగధర, శ్రీకృష్ణలీలలు, లవకుశ, ధర్మాంగద, చెంచుభామ ఇలా పలు పౌరా ణిక కళారూపాలను ప్రదర్శించేవారు. తమ కులదైవమైన గంగమ్మ పాటలతో పాటుగా శ్రీకృష్ణుడు జన్మాష్టమి, శ్రీకృష్ణ పరిణయం, సత్యభామ, జాంబ వతి ఇలా శ్రీ కృష్ణుని అష్ట భార్యలపైనా అనేక
పాట లను కూర్చి లయబద్దమైన నృత్యంతొ . గుండెెలపై ఉండే డప్పులను ఏకబిగిన వాయిస్తూ...భక్తిభావనతో పాడేవారు.
వర్షాల కోసం తప్పెటగుళ్ల ఆటలు..
గ్రామాలలో సరైన సమయంలో వర్షాలు పడక పోయిన సందర్భాలలో తప్పెటగుళ్ల ప్రదర్శన చేస్తే... వరుణుడు కరుణిస్తా డన్న నమ్మకం ఉంది. ఇందుకు తప్పెట గుళ్ల కళాకారులు ఓ కధని కూడా చెప్తారు. పూర్వం వర్షాల కోసం గ్రామంలో అంతా వరుణ దేవుడ్ని సంతోష పర్చడానికి వరుణ యాగం చేస్తుంటే...యాదవులు తమ ఆల మందలతో ఊరి చివర ఉండటం పట్ల ఆగ్రహించిన వరు ణుడు వీరిపై వడగళ్ల వాన కురిపించాడని. దీంతో తమ కుల దైవమైన శ్రీకృష్ణుడిని ప్రార్దిస్తే... చిటికెన వేలుతో గోవర్ధన గిరి ని ఎత్తి.. దాని కింద ఆశ్రయం కలిపించి.. యాదవులతో పాటు సమస్త లోకాన్ని రక్షించి... వరుణుడి కోపాన్ని చల్లార్చాడని.. అప్పటి ఆనందోత్సాహాల నుండే ఈ తప్పెటగుళ్ల కళ పుట్టు కొచ్చిందని... నాటి నుండి యాదవులు తప్పెటగుళ్లతో ఆడి పాడి తే... వరుణుడు ఆయా గ్రామాలపై కరుణ చూపించి వానలు కురిపిస్తాడని చెప్పారు. అందుకే వర్షాల కోసం తామతో తప్పెట గుళ్ల ప్రదర్శనలు ఏర్పాటు చేసుకున్న సందర్భాలూ అనేకం అని ఈ కళాకారులు చెప్పారు.
నటికీ ఉత్తరాంధ్రా జిల్లాలో జరిగే యాదవ పండుగలతో పాటు గ్రామదేవతల పండుగలు, జాతరలో తప్పెటగుళ్ల ప్రదర్శన కని పిస్తునే ఉంది. తమ కుల దేవత గంగమ్మని కొలిచే సందర్భం లో ఖచ్చితంగా ఆ ఊర్లో తప్పెటగుళ్లు ఆడి పాడాల్సిందే. నేటికీ అక్కడక్కడా తప్పెటగుళ్ల బృందాల నడుమ పోటీలు ఉత్తరాం ధ్రాలో జరుపుతూ.. ఈ కళను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుండటం అభినందనీయం. ఇప్పుడు ఉత్తరాంధ్రాలో జరిగే కార్య్‌క్రమాలతో పాటు ఏటా విశాఖపట్నం వేదికగా జరిగే విశాఖ ఉత్సవ్‌లోనూ ఈ జానపద కళాకారులు తమదైన శైలిలో ప్రదర్శన లిస్తూ... సభికుల్ని మైమరిపిస్తున్నారు.
కాపాడాల్సిన
బాధ్యత అందరిదీ
వేల ఏళ్ల నుండి మన సాంప్రదాయ కళలో ఒకటి గా మారిన ఈ తప్పెటగుళ్లు కళారూపం నేడు మారుతున్న కాలంతో పాటు మారుతోంది. ఉత్తరాంధ్ర యాస, భాషల్లో ఉండే పద మాధుర్యాన్ని ప్రపం చానికి అందించిన ఈ కళ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటునే ఎప్పటికప్పుడు కొత్త కొత్త పదాలతో సింగా రించుకుని జనం మధ్యకు వచ్చే ప్రయత్నాలు చేస్తునే ఉంది. కొందరి కృషివలురు కాలానికి ఎదురీదుతూ ఈ కళని కాపాడు కునేం దుకు చేస్తున్న ప్రయ త్నా లకు ప్రభుత్వం కూడా మరింత గా చేయూత అందిం చా ల్సిన అవసరం ఎం తుందో...
మన తెలుగుదనానికి ప్రతీక గా నిలుస్తున్న జాన పద కళా రూపాలని ఆదరించాల్సిన ఆశ్యకత కూడా మనపై అంతే ఉంది.
గుండె చప్పుళ్లు.. ఈ తప్పెట్లు
తొలి నాళ్లలో గుండెలపై దరువుల వేస్తూ సాగే ఈ నాట్యాన్ని గుండె తప్పెట్లుగా... పేర్కొనేవారని.. ఆపై దీని పేరు తప్పెట్లుగా మారిందని దాదాపు 400 ఏళ్ల నుండి దైవాంశ నృత్యంగా భావించే ఈ నృత్యాన్ని తప్పెటగుళ్లుగా వ్యవహరిస్తున్నట్లు తప్పెట గుళ్ల కళాకారులు చెప్తున్నారు. ఇంతటి ప్రాచీన కళకు నేడు ప్రజల నుండి ఆదరణ కరువవ్వటం వల్ల దీనిని ముందుకు తీసుకు వెళ్లాంటే భారంగా ఉందని... దీంతో కనీసం తమ భవిష్యతరానికి కూడా ఈ తప్పెటగుళ్లని నేర్పించగలమో లేదో అన్న సంశయాన్ని వ్యక్తం చేసారు మరికొందరు.
‘బంగారు”తప్పెట్లు
భీష్మఏకాదశి నాడు తమ కులదేవత అయిన గంగమ్మని భక్తి శ్రద్దలతో పూజిస్తూ సాగే ఈ తప్పెటగుళ్లలో మహిళలు కూడా పాలుపంచుకునే వారు. తొలి తప్పెట గుళ్ల కళాకారిణిగా యలమంచలి బంగారమ్మగా తమ తాతలు చెప్పుకునేవారని... ఆమెని ప్రేరణగా తీసుకుని అనేక మంది మహిళలు తప్పెటగుళ్లు నేర్చుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చేవారని, వీరు కేవలం భక్తి జానపదాలే కాకుండా... గాజులమ్మ పాట, పండ్లను అమ్మే వారి పాట, మందులోడి పాటలు పాడి జనాన్ని మైమరిం పించేవారనీ.. నేటికీ ఈ పాటలంటే పడిచచ్చేవారున్నారన్నారు.
సరస్వతికి ప్రత్యేక ప్రార్ధనలు
దాదాపు ఎక్కడ ప్రదర్శన జరిగినా... గణ నాధుడైన వినా యకుడిని ప్రార్ధించనిదే.. తమ ప్రదర్శన ప్రారంభించరు. ముఖ్యంగా ముందుకు వెనకకు అడుగులు వేస్తూ శరణు. శరణు గణపతి అంటూ... ప్రార్ధన చేసాక... తమకీ విద్యని ప్రసాదించింది సరస్వతీ దేవియేనన్న నమ్మకంతో ఆమెని భక్తి భావనతో కొలుస్తూ... పాటలు పాడుతూ వలయా కారంలో ఆనందంతో తిరుగుతూ... లయబధ్దంగా అడుగు లు వేస్తూ... సుదీర్ఘమైన గీతాలాపలనతో... చేసే ప్రార్ధనలు చూపరులను ఆకర్షించేలా సాగుతాయి.
ప్రచారానికే పరిమితమైపోతూ..
ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరిం చుకున్న ఈ తప్పెట గుళ్ల రూపం నేడు జనాదరణ కరువై విలవిల పోతోందన్నది వాస్త్తవం. ఉత్తరాంధ్రా జిల్లాలను నేతలు సందర్శించే సంద ర్బా లలో వారికి ఘన స్వాగతం పలికేప్పుడు నేటికీ అక్కడి నేతలు ఈ సాంప్రదాయ నృత్య కళాకారుల్ని ముందు వరు సలో ఉంచి ప్రోత్సహిస్తున్నా రు. ప్రభుత్వం అమలు పరిచే అనేక సంక్షేమ కార్యక్రమాలపైన, అనేక సమస్యపై జన చైత న్యానికి ప్రచారాస్త్రంగా ఇక్కడ తప్పెట గుళ్ల కళాకారుల సేవ ల్ని వాడుకుంటున్నారు అధికారులు.

అంధకారంలో... బ్రెయిలీ విద్య


ప్రపంచ చారిత్రక పరిణామంలో చదవలేని వినలేని చీకటి కోణాలెన్నో అలాగే కళ్ళు లేక కదలరాక అంధుల జీవితాలు చరిత్ర కాలగర్భంలోనే మిగిలిపోయాయి. వైకల్యమనే చెరసాలలో కన్నీళ్ళను కష్టాలను నేస్తాలుగా చేసుకొని జీవిస్తున్న వికలాంగులకు నిరంతరం జీవన్మరణమే. అయితే కాలక్రమంలో చీకటి చరిత్రలో పొడిచిన వేగుచుక్కల కాంతి కిరణాలే ఈనాటి ప్రగతికి మార్గ సోపానాలు.
అంధుల మార్గ సోపానమైన బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌ను సక్రమంగా నడపటం లేదు. దాంతో రాష్ట్రంలో అంధులకు బ్రెయిలీ లిపి అందని ద్రాక్షలా.. మిగిలిపోయింది.
ప్రభుత్వాలు పాలకులే అంధులపై తమకున్న కనీస బాధ్యతను విస్మరి స్తున్నారు. సమాజ అభివృద్ధిలో మాకు సైతం వాటా కల్పించి చదువ ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సిన వారే మాపై సవతి తల్లి ప్రేమ చూపితే ఎలా తన చిన్న తనంలోనే తన తండ్రిని అను కరిస్తూన్న క్రమంలో తను అంధత్వాన్ని స్వీకరించాడు. అయినా బాధ పడకుండా చదువుకోవా లనే తపనతో నాలాంటి అంధులకు సైతం విధ్వనందించాలనే ఉద్దేశంతో లూయి బ్రెయిలీ, మహౌన్నతమైన మేధస్సు నుండి ఉద్బ వించిందే బ్రెయిలీ లిపి.
1832 సంవత్సరంలో తయారు చేయబడి వాడుకలోకి వచ్చింది. బ్రెయిలీ లిపికున్న విశిష్ఠత గొప్పతనం ఏంటంటే - మొత్తం ప్రపంచ భాషలోకెల్లా బ్రెయిలీ లిపి మాత్రం ఒక్కటే. ఇప్పుడున్న కంప్యూటర్స్‌ సాఫ్ట్‌వేర్‌లకి అనుకూలంగా లిపి తీర్చిదిద్దిన గొప్ప మేధావి అయిన బ్రెయిలీ కూడా అంధుడే కదా, ప్రీకర్‌సన్‌, డాట్‌ మాట్రిక్స ఈనాటి ప్రింటర్స్‌కు ఆధారమైన పరికరాన్ని రూపొందించిన ప్రజ్ఞాశాలి మన లూయీబ్రెయిలి.
ఇంతటి గొప్ప చరిత్ర వుండి అంధుల కోసం ఉద్భవించిన బ్రెయిలీ లిపి మన రాష్ట్రంలో వున్న వేలాది అంధ విద్యార్థుల కోసం పాఠ్య పుస్త కాలు, బ్రెయిలి పలకలు, బ్రెయిలీ నోట్స్‌, టైప్‌బోర్డ్‌, మార్బల్‌బోర్డ్‌, పెగ్‌బోర్డ్‌లు అందించడానికి రాష్ట్రంలో ఒకే ఒక్క బ్రెయిలీ ప్రెస్‌ 1986 లో ఏర్పాటైంది. మన రాష్ట్రంలో ఉన్న అంధ విద్యార్ధులకి 12వేల పుస్త కాలు అవసరం కాగా 2 నుండి 3 వేల పుస్తకాలు ఏ మేరకు సరిపోత ాయో మీరే ఆలోచించండి. మేము కూడా చదువుకుంటాము. దేశ సంపూర్ణ అక్షరాస్యతలో మాకూ వాటా ఉందని ప్రభుత్వాలకు పాలకు లకు ఎన్నిసార్లు గుర్తుచేసినా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నది.
పుస్తకాల ముద్రణకు పశ్చిమ జర్మనీ నుండి 1986 తెప్పించిన ఒరిజి నల్‌ హైడర్‌ బర్గ్‌ మిషన్‌ 5 నిమిషాల్లో 200 పేజీలు ముద్రణ చేయగలదు. కానీ ఇది గత పది సంవత్సరాలుగా రిపేరు చేయబడు తుంది. ప్రతి 2 నెలలకోసారి దీనికి రిపేరు ఖర్చు అరవై వేల రూపా యలు మాత్రమే. హిస్టోరియా డాటా ఎంట్రి మిషన్లు రెండుంటే ఇవి కూడా అధ్వాన్నంగానే ఉన్నాయి. ఏ మాత్రం పనిచేయకుండా మూల కు మూలుగుతున్నాయి. 5 కంప్యూటర్‌లుంటే వైరస్‌ పున్యామానీ ఇవి కూడా అంధ విద్యార్థుల పట్ల పక్షపాతం చూపిస్తున్నాయి. కంప్యూటర్‌ లను సరిచేసి పనిచేయించడానికి దిక్కు, మొక్కుమొక్కు లేదు. 4 చిన్న ప్రింట్‌ మిషన్లు ఉన్నాయి. ఇవి గంటకి 200 పేజీలు ప్రింట్‌ చేయగల దు. ప్రతి గంటకి 15 నిమిషాలు విశ్రాంతి అవసరం.
ఎందుకంటే ప్రింటింగ్‌ మిషన్లకి ఎసి వుంటేనే సక్రమంగా పని చేయ గలవు. గత కొంత కాలంగా ప్రింటింగ్‌ మిషన్ల నీడిల్స్‌ రిపేరులో వుం టేనే పట్టించుకునే నాథుడే లేదు. అయితే యంత్రాలు సరిగా పనిచేయ డానికి ఇక ఎసి గురించి చింతన దండగేకదా. అందుకే 12 వేల పుస కాల డిమాండ్‌కు కేవలం 2-3వేల పుస్తకాలే ప్రింట్‌ అవుతుంటే చాలీ చాలని పుస్తకాలతో విద్యార్థులు పడే ఇబ్బంది ఊహించలేం. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకే పుస్తకాలు అందక పాఠాలు ఎలా చెప్పా లో తెలియని పరిస్థితి. జి.ఓ.ఎం.ఎస్‌ 410 ప్రకారం స్కూల్‌ ఎడ్యుకేష న్‌ ప్రీగా పేపర్‌ ఇవ్వాలి గత మూడు సంవత్సరాలుగా మానేసి 2011 ఫిబ్రవరిలో పేపర్‌ కొంత ప్రెస్‌కి ఇచ్చింది. పేపర్‌ లేక కూడా పుస్తకాల ప్రింట్‌ నిలిచి పోయింది మరి.
ప్రింటింగ్‌, డిస్పాచ్‌, ప్రూఫ్‌ రీడింగ్‌, బైండింగ్‌, డాటా ఎంట్రీ, స్టోరేజీ, లైబ్రరీ మొత్తం మిషనరీ ఆఫీ సు నిర్వహణ అన్నింటికీ కేవలం 4 గదుల భవనం ఉండటంతో ఇరుకు గదుల్లో ఇవన్నీ సాధ్యం కాక ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. నూతన భవన నిర్మాణానికి నూతన మిషనరీ ఇప్పిం చాలని 1999లోనే ఉద్యోగులు ముఖ్యమంత్రి అధికా రులకు విజ్ఞప్తి చేసినా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే మిగిలిపోయింది.
బ్రెయిలీ ప్రెస్‌ 1986లో ఏర్పాటైనపుడు మొత్తం 32 మంది స్టాఫ్‌ వుంటే ప్రస్తు తం 10మంది స్టాఫ్‌ మాత్రమే. విద్య ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్ది స్టాఫ్‌ని తగ్గించి బ్రెయిలీ ప్రెస్‌ని నిర్వీర్యం చేయాలనో ఆలోచనే విడ్డూరం. మరీ వీరికి 1993-1998, 2003,2009 సంవత్సరాలలో పిఆర్‌సి నాలుగుసార్లు పెరిగితే ఇప్పటికీ 1993 పిఆర్‌సి ప్రకారమే జీతాలు ఇస్తున్నారు. ఇదెక్కడి న్యాయం దేశంలో అత్యధికంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జీతాలు తమ ఇష్టానుసారంగా పెంచుకోవచ్చు. అందినంత స్వాహా చేయవచ్చు. కానీ బ్రెయిలీ ప్రెస్‌ ఉద్యోగుల కు పెంచిన పీఆర్‌సి ప్రకా రం జీతాలు ఇవ్వరా
ఇప్పటికైనా బ్రెయిలీ ప్రెస్‌ సక్రమంగా నిర్వహణ జరగాలంటే ఆర్థిక పరిస్థితులు చాలా ప్రాధాన్యం. అయితే ప్రభుత్వానికి ఈ చిన్న విష యం కూడా పట్టడం లేదు. 100 రోజుల్లో 2కోట్లు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటిస్తే అది ఇంకా ఫైనాన్స్‌ డిపార్ట్‌్‌ మెంట్‌లోనే కోటి 36 లక్షలకు కుదించబడి ఫైలు మూలకు మూలుగుతుంది. ముఖ్యమంత్రి ప్రకటించిన 100రోజుల గడువు ముంచుకొస్తుంది. కానీ తగ్గించిన బడ్జెట్‌నైనా ఇచ్చిన పాపానపోలేదు. దేవుడైతే కరుణించాడుకానీ పూజారి వరం ఇవ్వలేదు అన్నటు గా తయారయ్యింది. బడ్జెట్‌ కేటాయింపులు క్రమంగా తగ్గించి బ్రెయిలీప్రెస్‌ను భవిష్యత్‌లో కను మరుగు చేయాలనే ప్రభుత్వ ఆలోచన సరళి మార్చు కోవాలి. రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే అంధుల విద్య కూడా సంపూర్ణ అక్షరాస్యతలో భాగమే కదా.బ్రెయిలీ విద్య ఇప్పటికైనా అంధులందరికీ అందేలా ప్రమాణాలు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బ్రెయిలీ ప్రెస్‌ను ఆధునీక రిం చి, నూతన కంప్యూటర్‌ అటాచ్‌ మెంట్‌ హైడల్‌బర్గ్‌ ప్రింటింగ్‌ మిష న్‌ దీని సామర్థ్యం కాని 300 పేజీలు ప్రిం ట్‌ చేస్తుం ది. ఈ మిషన్‌ అలాగే రిపేర్‌ లో వున్నది. కంప్యూట ర్స్‌, హిస్టోరియా డాటా ఎంట్రి మిషన్లు, 4 చిన్న ప్రింటింగ్‌ మిషన్లకు ఆధునీకరించాలి.
బ్రెయిలీ ప్రెస్‌పై అవగాహన కలిగిన వ్యక్తుల్ని నియమించాలి. 1-10వ తరగతి పుస్తకాలే కాకుండా యూనివర్సిటీ స్థాయి వరకు పుస్తకాలు ప్రింట్‌ చేయాలి. 1-10 వర కు బ్రెయిలీ లిపిలో చదువుకున్న విద్యార్థి ఒకసారి ఇంటర్‌పె ౖస్థాయి విద్యను సాధారణ లిప ిలో చదవడం సాధ్యం కాదు
అంధులకు చేయూతనిస్తే వీరు సైతం అద్భుతాలు సృష్టిస్తారన్నది వాస్త వం. బ్రెయిలీ లిపిని ప్రపంచానికి పరిచయం చేసింది. కూడా అంధుడే కదా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోమించిన ఎరిక విహ్నేరియా అంధుడే. 2010 సివిల్స్‌లో 78వ ర్యాంకుతో ఐఎఎస్‌ సాధిం చిన స్వాతి కూడా అంధురాలే కదా. ఈమె చదివింది బ్రెయిలీ పుస్తకాలే. యూరోపియన్‌ యూనియన్‌ 27 సభ్యదేశాల సమావేశాల ప్రసంగా లను స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మనీ, చైనా భాషల్లోకి అనువదించింది కూడా అంధురాలైన ఆలేక్సి యా కూడా బ్రెయిలీ లిపిలో నే చదువుకుంది. అందుకే ఆలేక్సియా కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఈ సంవత్సరం యంగ్‌ అచీవర్స్‌ అవార్డ్‌ను ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను అంధులకు అవకాశమిస్తే మేము సైతం దేనికి తీసిపోమన్నది రుజువు చేశారు. కనుక ప్రభుత్వం ఇకనైనా బ్రెయిలీ ప్రెస్‌ను పునరుద్ధరించాలి.
ఏటా ముద్రించేవి మూడు వేలే..
మన రాష్ట్రంలో అంధులకు విద్యనందించేందుకుగాను 10వ తరగతి వరకు మాత్రమే రాష్ట్ర ప్రభు త్వం 8 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ప్రైవేట్‌ వ్యక్తులు 10 రెసిడెన్షియల్‌ పాఠశాలలను నిర్వహిస్తు న్నారు. వీటిలో మొత్తం విద్యార్థులు 1800పైగానే చదువుకుంటున్నారు. వీరందరికి సంవత్సరా నికిగాను 12వేల బ్రెయిలి పుస్తకాలు, 2 వేల బ్రెయిలి పలకలు స్టిక్స, మార్బల్‌ బోర్డ్స్‌, సెగ్‌ బోర్డ్‌ లు, టేప్‌బోర్టులు అవసరమవుతున్నాయి. కానీ ప్రతి విద్యా సంవత్సరం బ్రెయిలి ప్రెస్‌ నుండి 2, 3 వేల పుస్తకాలు మాత్రమే ప్రింట్‌ అవుతున్నాయి.

కోతలే బోలెడు...
సంవత్సరం - కేటాయింపు - విడుదల - కోతశాతం
2008-09. 15లక్షలు. 10 లక్షలు. 44.
2009-10. 10లక్షలు. 5 లక్షలు. 50.
2010-11. 10లక్షలు. 4 లక్షలు. 40.
2011-12. లేమీ లేవు.
- పోడిశెట్టి రాజశేఖర్‌.

సింహాలతో.. సహవాసం

ఎంత పెంచుకున్న కుక్క పిల్లతో అయినా కలసి పడుకునేందుకు ఇష్టం చూపించం సరికదా? వీలైనంత వరకు మనింట్లో ఎలాంటి పెంపుడు జంతువున్నా... నిద్రించే సమయంలో దూరంగా ఉంచేందుకు ప్రయత్ని స్తుంటారు. అయితే ఉక్రయిన్‌కి చెందిన ఓ ప్రయివేటు జూ అధినేత అలెగ్జాండెర్‌ ఫిలెషెన్కో ఏకంగా సింహాలున్న బోనులో ఐదు వారాల పాటు ఉండి గిన్నిస్‌ రికార్డు సృష్టిం చెడమే కాకుండా సింహంతో సహవాసం ప్రమాదమేం కాదని తెలియ చేయడానికి సిద్దమ య్యాడు.
ఈ ఏడాది ఆగష్టు 3న తన నిర్ణయాన్ని అమలు పరిచే క్రమంలో బోను లోకి వెళ్లిన ఆయన ఆఫ్రికా దేశం నుండి తెచ్చిన ఆడ సింహాం కాత్య, మగ సింహం సామ్‌సన్‌ల చెంతన గడిపే సాహసాన్ని చేపట్టాడు. ఇందుకు తగ్గ ప్రచారం పొందడమే కాకుండా సింహాలు కౄర జంతువులే అయినా... వాటితో సన్నిహిత్యంగా ఉంటే మాన వాళికి అనుకూలంగా కూడా వ్యవహరిస్తాయని చెప్పడమే తన లక్ష్యంగా చెప్పాడాయన.
పైగా ఇలా 5 వారాల పాటు సింహాలతో పాటు బోను లో ఉండి స్దానిక మీడియాతో పాటు వివిధ వార్తా సంస్ధల ప్రచారంతో స్పందించే వారు అం దించే డబ్బులతో సింహాల జీవన విధా నాన్ని పెంపొందించడానికివినియో గిస్తానని సింహాల గూర్చి ప్రపంచానికి చాటి చెప్తా నని వెల్లడించాడు
ఇక సింహాల బోనులో ఉన్న ఆయన సింహాలతో పాటుగానే భోజనాదులు చేస్తూ... వాటితోనే నిద్రిస్తూ... స్వతహాగా కళాకారుడైన అలె గ్జాండర్‌ పలు చిత్రాలను కూడా గీసి గత ఐదు వారాలుగా చాలా హేపీగా గడిపేసాడు. ఏమాత్రం భయం లేకుండా ఎంతలా కాలాన్ని గడిపేశాడో మీరే చూడండి....
అయితే ఈయనగారిని చూసి మీరూ మీ ఇంట్లోని జంతువులతో కల్సి మరిన్ని వారాలు గడిపేస్తే గిన్నిస్‌ రికార్డొకటి వచ్చి పడుంటుందని భావిస్తున్నా? మరెందుకాలస్యం రడీ అవ్వండి.

చిన్న బల్బుకి ఎంత వెలుగు

  • ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ చూసినా...
  • చిన్న చిన్న బల్బులు అద్భుత కాంతినిస్తూ ..
  • ఇంత కాంతి నిచ్చే ఈ బల్బుమరెంత ఎంత బిల్లు...
  • చేతికి తెప్పిస్తుందోననే భయం చాలా మందిలో ఉంది.
అయితే తక్కువ విద్యుత్‌ వినియోగించుకొనే సిఎఫ్‌ఎల్‌ బల్బులు మీ విద్యుత్‌ బిల్లుల్లో భారీ ఆదా చూపిస్తాయి.
కం పాక్ట్‌ ఫ్లోరోసెంట్‌ లాంప్‌ అనబడే సిఎఫ్‌ఎల్‌ బల్బ్‌ మొదటగా మార్కెట్‌లోకి వచ్చినా ఎందుకో జనాల ఆదరణకు నోచుకోలేక పోయిందనే చెప్పాలి. కారణం వాటి ఖరీదు ఎక్కువ కావటమే కావచ్చు. అయితే ఇప్పుడు రెండు పుల్లల్లాగా అటాచబుల్‌ సిఎఫ్‌ ఎల్‌, దానికే ఉండే కాపర్‌ వైండింగ్‌ గల మాగ్నటిక్‌ బలాస్ట్‌తో మార్కెట్‌లోకి రావడం... అదీ చాలా చవకగా కూడా లభిస్తుం డటంతో పాటు వోల్టే జ్‌ హేచ్చు తగ్గులని తట్టుకుని నిలబడుతుం డటం తో సాధారణంగా మనకి ఇళ్లలో కనిపించే బల్బ్‌ల ఉనికి క్రమేపీ కోల్పోయేలా చేసిందనే చెప్పాలి.
అయితే నేటికీ గృహ అవసరాలకు వాడే విద్యుత్‌ తగ్గించుకోవాలని భావించే వారికి సిఎఫ్‌ఎల్‌ బల్బ్‌ల పట్ల్ల ఎన్నో అనుమానాలున్నా యి. వాటి నాణ్యత పైనా వస్తున్న ఆరోపణలని నివృత్తి చేస్తూ... వాటిని నివృత్తి చేసేకోణమిది.
ఒకప్పుడు సిఎఫ్‌ఎల్‌ బల్బ్స్‌ వచ్చిన తొలినాళ్లలో వాటిని సామాన్యుడు చూసి ఆనందించడమే కానీ ఖరీదు చెయ్యలేని ధరల్లో ఉండేవి. ఓవేళ ముచ్చట పడి అంత ధర పెట్టి కొనాలను కున్నా వాటి మన్నిక ఎలాగో తెలీయక ఇబ్బం దులు పడటమెెందుకులే అన్నభావనతో చాలా మంది కొనక ఆగిపోయారన్నది వాస్తవం. ఆమధ్య చైనా వస్తువులు మన మార్కెట్లోకి వెల్లు వెత్తి, ఎక్కడ చూసినా సిఎఫ్‌ఎల్‌ బల్బ్‌లని విస్తృ తంగా వినియోగంలోకి తెచ్చే లా చేసింది. దీంతో కేవలం పాతిక రూపాయల కే ఈ బల్బులు లభ్యం అవుతుం డటంతో జనం వేలం వెర్రి గా కొనేసి.. ఇళ్లలో సాధా రణ బల్బుల కి బదులుగా వాడే వారు. అయితే ఇవి ప్రసరింప చేసే వెలుతురు చాలా తక్కువగా ఉన్నా.. నీలిరంగు కల గల్సిన తెల్ల ని కాంతికిబాగా ఆకర్షితులు కావటంతో చైనా నుండి దిగుమతి అయినఈ బల్బులు తమ హవా చూపించాయనే చెప్పాలి....
లేని తలనొప్పి తెచ్చి పెట్టిన బల్బు
చైనా నుండి దిగుమతి అయిన ఈ సిఎఫ్‌ఎల్‌ బల్బులు ... నాణ్యత లేకున్నా... ధరతక్కువగా ఉండటంతో చాలా మంది కొనుగోళ్లు జరపడమే కాకుండా....చిన్నారుల చదువులకి వాడటం ప్రారంభిం చారు. అసలే ఇవి అందించే కాంతి తక్కువ కావటం మూలాన మెల్లమెల్లగా చదువుకునే విద్యార్ధులలో తల నొప్పులు, దృష్టి లోపా లు రావటం ప్రారంభించాయి.
అయితే సడన్‌గా తమ చిన్నారులు కళ్లకు సంబంధించిన వ్యాదులతో బాధ పడుతుండటంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళితే ఇదంతా చైనా బల్బు ల చలవేనని తేల్చి చెప్పడంతో.... క్రమేపీ వీటి వాడకం తగ్గిందనే చెప్పక తప్పదు.
ఈక్రమంలోనే ఇక వెలుతురు ఎక్కువ ఇస్తూ.... లేత వంకాయ రంగు కలసిన తెలుపు కాంతిని ప్రసరింప చేస్తూ ఆకర్షణీయంగా ఉండే... సిఎఫ్‌ఎల్‌ బల్బులని అనేకకంపెనీలు మార్కె ట్‌ లోకి దించాయి.
చైనా బల్బ్స్‌ మీద ప్రజలకి ఆసక్తి తగ్గి పోవ టంతోపాటు కాస్త ధరఎక్కువగా ఉన్నా. గతంలో పదే పదే కొన్న బల్బులకి తగ్గట్లు అన్ని బ్రాండెడ్‌ బల్బ్స్‌కి వారంటీ లభిస్తుండటం... వోల్టేజి ఒడిదుడుకులకు తట్టుకునే లా ఉండటం ముఖ్యం గా భారీగా వచ్చే కరెంటు బిల్లులు తగ్గించు కునేం దుకు తగిన ప్రత్యామ్నా యం మరొకటి కని పిం చకపోవటంతో ఊహిం చని విధంగా సామాన్యు లు సైతం వీటి వైపు మొగ్గు చూపారు.
లోవోల్టేజీకి ట్యూబ్‌లైట్స్‌ వెలగవు సరికదా.... సాధా రణ బల్బ్‌ కిరోసిన్‌ దీపాన్ని తలపిస్తున్న సమయంలో ఈ బ్రాండె డ్‌ సిఎఫ్‌ఎల్‌ బల్బ్స్‌ సగటు జీవిని ఆదుకున్నాయి. ఓ ఇంట్లో సిఎఫ్‌ఎల్‌ బల్బ్‌ దెెదీప్య మానముగా వెలుగుతుంటే... దాని వాడ కంపై ఎంక్వైరీ జరిపి చుట్టూ ప్రక్కలజనం కూడా వీటి వాడకంపై మక్కువ చూడటంతో నేడు చాలా చోట్ల అవసరానికి మించి కూడా సిఎఫ్‌ఎల్‌బల్బ్స్‌ తమ సేవలందిసు ్తన్నాయి.
బిల్లుల భారాన్ని తగ్గించుకోండిలా...
పిగ్మీబల్బ్‌స్ధానంలో 5వాట్స్‌ ఎంట్రీ లెవెల్‌గా ఉండే సిఎఫ్‌ఎల్‌ బల్బ్‌ పెట్టుకుంటే... బాత్‌ రూంలకి, బాల్కనీలకి, చిన్ని చిన్ని గదుల్లోన కాస్త వెలుతురు కోసం వాడే ఏరియాల్లో, ఎప్పుడూ వేసి ఉంచే గ్యారేజ్‌లలో, మెట్ల మీదకీ వీటిని శుభ్రముగా వాడుకోవ చ్చు. చాలా బాగా వెలుతు రుని ఇస్తుంది. ఒక పిగ్మీ బల్బ్‌ రోజుకి పన్నెండు గంటలపాటు వాడితే...గంటకి 15వాట్లు చొప్పున రోజుకి 180వాట్లు ఖర్చవుతుం ది. అలా నెలకి 5400 వాట్ల విద్యుత్‌ వాడుతున్నట్లే. అదే 5 వాట్స్‌ సిఎఫ్‌ఎల్‌ని రోజుకి పన్నెండు గంటలు వాడితే... గంటకు 5వాట్లు - 60 వాట్లు నెలకి 1800 వాట్లు వాడకం అవుతుంది అన్నమాట.
ఇలా మీరు వాడే ట్యూబ్‌ లైట్లు , ఇతర సాధారణ బల్బులని పరిగణ లోకి తీసుకుంటే మీకు కరెంటు బిల్లు ఎంత తడిపి మోపెడు అవు తోందో అర్ధం చేసుకోండి.
తక్షణం మీరు వెంటనే సిఎఫ్‌ఎల్‌బల్బ్‌ల లోకంలోకి మారి పోవా లనిపించడం లదూ.... మరెందుకాలస్యం... సిఎఫ్‌ఎల్‌కి మారి మీ విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించు కోండి....

'లిటిల్‌ ఫ్రాన్స్‌' పుదుచ్చేరి

అనేక కులాలు, మతాలు కలగల్సి భిన్నత్వంలో ఏకత్వంగా కనిపించే మనభారత దేశంలో ఃలిటిల్‌ ఫ్రాన్స్‌ః ఒకటుందంటే నమ్మకం కలగట్లేదా
అయితే మీరు ఖచ్చితంగా ఓ సారి పాండిచ్చేరిని చూసి రావాల్సిందే. ఇక్కడ భారత దేశంలో పాటు ఫ్రెంచ్‌ దేశానికి సంబంధించిన వేష భాషలు మనకి కనిపించి అచ్చెరువు గొలుపుతాయి.
నేటికీ నాటి పాలకులు అవలంబించిన సాంప్రదాయాలనే అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తూ ... పర్యాటకులని విశేషంగా కట్టుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదేవెూ.
మన దేశంలో తొలి నాళ్లలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి నాటి ఫ్రెంచి పాలకులకు ఆవాసంగా పేరు పొంది.. రాష్ట్రం గా అవతరించినా.. వారి నాగరికతతో పాటు హిందూ సంస్కృతినీ తనలో మిళితం చేసుకుని గతవైభవాలను చాటుతో పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది.
ప్రెంచి వారు ఈ భారత దేశానికి వర్తకం నిమిత్తం వచ్చేపðడు తొలి సారిగా ఈ ప్రాంతాన్ని చేరుకుని తమ భాషలో ఃకఠఛీజీఛిజ్ఛిటడః అని పిలిచే వారట. అంటే కొత్త ఊరు అనే అర్ధం. అప్పటికే తమిళులు ఎక్కు వగా ఉండే ఆ ప్రాంతంలోని వారు కూడా ఫ్రెంచి వారిని ఆకర్షించేలా తమ ప్రాంతాన్ని పుదు ొ కొత్త, చ్చేరి ొ ఊరు అని తమిళంలో పుదుచ్చేరిగా పిలుచుకునే వారని...కాల క్రమంలో ఫ్రెంచ్‌ వారు దానిని పాండిచ్చేరిగా పిలవటంతో అదే పేరు ఇప్పటికీ కొనసాగుతోందన్నది చరిత్ర కారులు చెప్తారు. వివిధ రాష్ట్రాలు తమ తమ ప్రాంతాలలో వివిధ నగరాలకు గతంలో ఉన్న ప్రాధాన్యత పేర్లను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి పేర్లు మారుస్తున్న క్రమంలో ప్రస్తుతం గోవా సర్కారు పాండి చ్చేరి పేరును పుదుచ్చేరిగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
పురాణ కాలం నుండి పాండిచ్చేరి ప్రాంతా నికి అత్యధిక ప్రాధాన్యత ఉందని చరిత్ర కారులు చెప్తారు. ఇక్కడే అగస్త మహాముని తన ఆశ్రమాన్ని నిర్వహించే వాడని, సంస్కృత విద్యాలయ నిర్వాహణ కూడా ఈ ప్రాంతం లో జరిగినట్లు ఇక్కడ దొరికిన అనేక ఆధారాలు చెప్తున్నట్లు వారు పేర్కొం టారు. క్రీస్తు శకం 2వ శతాబ్ధలోనే పాండిచ్చేరి పొడుకె వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ది కెక్కిందని... ప్రస్తుతం పాం డిచ్చేరి కి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న అరికిమేడునే అప్పట్లో పొడుకె అని పిలిచే వారని హాంటింగ్‌ ఫోర్డ్‌ అనే రచయిత తన రచనల్లో పేర్కొన్నాడు.
ఇటీవల పురావస్తు శాఖ జరిపిన అరికి మేడులో జరిపిన తవ్వకాలలో అనేక రోమన్‌ సాంప్రదాయ పాత్రలు లభించడంతో ఈ ప్రాంతాన్ని నౌకా కేంద్రంగా చేసుకుని వర్తక వ్యాపారాలను రష్యన్లు నిర్వహించే వారన్న వాదనలకు మరింత బలం చేకూరింది.
ఇక క్రీస్తు శకం 4వ శతాబ్దర నుండి ఈ ప్రాంతాన్ని పల్లవులు, చోళులు, పాండ్య చక్రవర్తులు, విజయనగర మహారాజుల ఆధీనంలో ఉండేదని... వారి రాజరికాలు పతనమ య్యాక స్ధానిక నాయకత్వాలు, జమిందారీ వ్యవస్ధలు పునాదులూ రుకుంటున్న క్రమంలో 1673లో ఈస్టిండియా కంపెనీ పేరుతో వచ్చిన ఫ్రెంచి వారు వర్తక కేంద్రంగా దీనిని ఏర్పాటు చేసుకుని చివరికి ఫ్రెంచి అధికారిక కేంద్రం చేసుకున్నారని... మనకి చరిత్ర చెప్తున్న సత్యం.
సముద్ర మార్గం గుండా రవాణా చేసుకునేందుకు పాండిచ్చేరి ముఖ్య కేంద్రం కావటంతో అప్పట్లో దీని కోసం ప్రెంచి వారితో బ్రిటీష్‌ పాల కులు, డచ్‌ దేశీయులు అనేక యుద్ధాలు చేసినట్లు చివరికి ఒప్పందాలు కుదుచ్చుకుని పుదుచ్చేరిపై అధికారాన్ని పంచుకున్నట్ల్లు చరిత్రకారులు వెల్లడిస్తుండగా... 1850 నుండి పుదుచ్చేరి, యానాం, కరైకాల్‌, చందే ర్‌ నగర్‌, మాహే ప్రాంతాలు ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్నాయని.. భార త దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా... 1954 వరకు కొనసా గినట్లు చెప్తారు.
స్వాతంత్రానికి పూర్వం ఎక్కువగా ప్రెంచి పాలకుల చేతిలో ఉన్నందు వల్లో ఏవెూ... నేటికీ ఆ పోకడలు పాండిచ్చేరిలో కనిపిస్తాయి. విభిన్న సంస్కృతుల కలబోతతో గత చరిత్రకు సాక్ష్యాలుగా ఫ్రెం చి పాలకులు కట్టించిన అనేక కట్డడాలు నేడు పాండిచ్చేరిని పర్యాటక కేంద్రంగా మార్చ డంలో ప్రధాన భూమిక పోషిస్తు న్నాయని చెప్పడం అతి శయోక్తి కాదేవెూ.
ఇక ఈ రాష్ట్రంలో విభిన్న వాతావరణానికి తగ్గట్టుగానే ఈ రాష్ట్రంలోని జిల్లాలు కూడా వేర్వేరు చోట్ల ఉండటం ఓ విశేషం. యానాం, మాహె, కరైకాల్‌, పుదుచ్చేరి అనే నాలుగు జిల్లాల సముదాయంగా ఉంది పాండిచ్చేరీ రాష్ట్రం.
బంగాళా ఖాతం తీరాన తమిళనాడుకు అంతర్భాగంగా ఉన్న 293 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో పాండిచ్చేరి ఉంటే... మరి కొంత దూరంలో 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కరైకాల్‌ విస్తరించి ఉంది. ఇక మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకి నాడకు 25 కిలో మీటర్ల దూరంలో 30 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో బంగాళా ఖాతాన్ని ఆనుకుని ఉన్న పట్టణంగా యానాం ప్రసిద్ది కెక్కగా అరేబియా సముద్ర తీరంలో కేవలం 9 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మహె విస్తరించి ఉంది. ఇలా పలు చోట్ల విసిరేయబడ్డ ప్రాంతాలతో విభిన్నంగా కనిపించే ఈ రాష్ట్రానికి ప్రత్యేక సరిహద్దులంటూ లేకపోవటం ఓ విడ్డూరం కాగా... ఈ రాష్ట్ర జనాభా అంతా

కల్సి 12 లక్షలు పైచిలుకు ఉంటుందని ఓ అంచనా. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా ఉన్నప్పటికీ అన్నిటి కన్నా విశిష్ట విరసిల్లుతోంది పాండిచ్చేరి మాత్రమే.
ఇక్కడ దాదాపు రెండు కిలో మీటర్ల పొడవుడే సెరినిటీ బీచ్‌ తన ప్రకృతి అందాలతో మనల్ని కట్టి పడేస్తుందనటంలో సందేహంలేదు. ఈ బీచ్‌ ఒడ్డున నిర్మించిన మహాత్ముడి విగ్రహం, నాటి పాలకుల యుద్దాలకు స్మారకంగా నిర్మించిన చిహ్నాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పైగా ఈ బీచ్‌ ఒడ్డున నిర్మించిన లైట్‌హౌస్‌ గత 150 ఏళ్లుగా నిరంత రాయంగా తన సేవల్ని అందిస్తూ...చరిత్ర సృష్టిస్తుండగా... ఇక్కడి ఫ్రెంచి కట్టడాలు వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా మన కి ఆహ్వానాలు పలుకుతూ ఆకర్షిస్తుంటాయి. వీటి చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి పర్యాటకుడి మదిలో కలుగ చేసేలా వీటి నిర్మాణం ఉందనే చెప్పాలి.
ఃఐలండ్‌ ఆఫ్‌ పీస్‌ః బొటానికల్‌
ఇక పాండిచ్చేరిని సందర్శించే ప్రతి పర్యాటకుడు రమణీయ పూల అందాలకు నెలవైన ఃఐలండ్‌ ఆఫ్‌ పీస్‌ః బొటానికల్‌ గార్డెన్‌ని సందర్శించి తీరాల్సిందే. ఇక్కడ మనదేశంలో లభ్యమయ్యేఅనేక పూల జాతులతో పాటు విదే శాల నుండి తెచ్చిన అనే క పూల మెక్కలను పెం చుతూ... ప్రశాంతతకి, పచ్చ దనానికి మారు పేరుగా కనువిందు చేస్తు న్నారీ గార్డెన్‌ నిర్వాహకులు. అలాగే ఇక్కడికి దగ్గర్లో ఉన్న భారతీ పార్కు కూడా పచ్చదనానికి నెలవై ఉండగా... ఇందులోని నెలకొల్పిన మ్యూజి యం తన శిల్ప కళా సంపదతో మనల్ని కట్టి పడేస్తుంది.ఇక్కడి శిల్పా లు ఒకదానిని మించి మరొకటి అన్నట్లు విశేషంగా ఆకటు ్టకుంటాయి.
అవర్‌ లేడీ ఆఫ్‌ చర్చి :
ఇక పాండిచ్చేరీకి 4కిలో మీటర్ల దూరంలో ఉన్న పురాతన చర్చిని ఆరోగ్యం ప్రసాదించే పిలుస్తారు.1690లో అనియా కపురంలో నిర్మించబడిన ఈ చర్చిని ఇప్పటికి అనేక మార్లు పున:నిర్మాణం చేసారు. 1843 లో సెయింట్‌ ఆంధోనీ ప్రతిష్టించిన క్రీస్తు విగ్రహా లు ఆకట్టుకునేలా ఉంటా యి. ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శిస్తే... ఆరోగ్యం సిద్ధి స్తుందని ఇక్కడి వారి నమ్మకం. అత్యంత ఆకర్షణీయంగా చిత్రీకరించిన అనేక చిత్రాలు, గ్లాస్‌ పెయింటింగ్‌లు చూపరులను ఆకట్టుకుంటాయి.
షాపింగ్‌ ఫెస్టివల్‌
పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో పాండిచ్చేరి సర్కారు పాండిచ్చేరిలో ఏటా నిర్వహించే షాపింగ్‌ ఫెస్టివల్‌ గూర్చి ప్రత్యేకంగా చెపðకోవా ల్సిందే. ఈ ఫెస్టివల్‌ని సందర్శించే వారికి లక్కీ కూపన్లు, బంపర్‌ ప్రైజు లంటూ ప్రత్యేక బహుమతులు అందిస్తోంది. ఇక్క డ అనేక రకాల తమిళ, ఫ్రెంచి ఫర్నీచర్‌తో పాటుగా ఎలక్ట్రానిక్స వస్తువుల, చేతితో తయారు చేసిన కాగితపు అలంకరణలు పాండిచ్చేరీ సాంప్రదాయ దుస్తులు, గృహౌపకరణాలు ఇలా అనేక రకాల వస్తువులతో పాటు ప్రత్యేక రాయితీలతో వాహనాదులను కూడా అమ్మకానికి ఈ ఫెస్టివల్‌లో పెడతారు. కేవలం కొనుగోలు కోసమే కాకుండా ఈ ఫెస్టివల్‌లో జరిగే సాంస్క ృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలను కూడా భారీగా నిర్వహిస్తారు.ీ కార్యక్రమాలకు ప్రతి రోజు పాండిచ్చేరీ ముఖ్యమంత్రి హాజరవుతారు.
ఎలా వెళ్లాలంటే....
ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలలతో పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న పాండిచ్చేరిని జీవిత కాలంలో ఓసారైనా చూసి తరించాల్సిందే. ఇక్కడి పోవాలనుకునే వారు చెన్నై ఎయిర్‌ పోర్డులో దిగి 135 కిలో మీటర్లు వేరే వాహనంలో పోవాల్సి ఉంటుంది. రైలు మార్గంలో అయితే మధు రై, త్రివేండ్రం, విల్లు పురం రైల్వేస్టేషన్లలో దిగి సులభంగా ఇక్కడికి చేరు కోవచ్చు. అతిధుల్ని ఆహ్వానించేలా ప్రభుత్వ టూరిజం సంస్ధతో పాటు వివిధ ప్రయివేటు సంస్ధలు కాటేజీలు నిర్వహిస్తున్నాయి. చౌక ధరల్లో మరి కొన్ని వసతి సౌకర్యాలు అందిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుండి పాండిచ్చేరికి ప్రత్యేక ప్యాకేజీలతో టూర్‌లు నిర్వహిస్తున్నాయి. మరెందు కాలస్యం.... ఈసారి శీతాకాలాన్ని సరదాగా పాండిచ్చేరిలో గడిపేందుకు ప్లాన్‌ చేసుకోండి.


నాలుగు జిల్లాల సముదాయం
ఆధ్యాత్మికతకు తోడుగా ప్రకృతి రమణీయత కలగల్సి విశేషంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న పాండిచ్చేరీ రాష్ట్రమంతా ఒక్క దగ్గరే ఉందా అంటే అలా లేదు. యానాం, మాహె, కరైకాల్‌, పుదుచ్చేరి అనే
నాలుగు జిల్లాల సముదాయం ఇది.


ఆకట్టుకునే ఎక్వేరియం
బొటానికల్‌ గార్డెల్‌లో ఉండే భారీ ఎక్వేరియం కూడా తన ప్రత్యేకతని నిలుపుకుంటూ ఆకర్షించడంలో తనవంతు పాత్ర పోషిస్తోంది. ఇక్కడ విశ్వంలో అరుదుగా కనిపించే ఆర్నమెంట్‌ చేపలు తమ అందాలను ఆరబోస్తు తెగ ఆకట్టుకుంటాయి.


శ్రీ అరబిందో ఆశ్రమం
పుదుచ్చేరీలోని శ్రీ అరబిందో ఆశ్రమం విశాల ప్రాంగణంతో అద్భుత ప్రకృతితో ఆహ్వానం పలుకుతూ ఉంటుంది.
ఈ ఆశ్రమంలో అరవింద, మదర్‌ సమాధులని అనేక పుష్పగుచ్ఛాలతో అలంకరించి దర్శించే వారికి ప్రశాంతతని చేకూ రుస్తుంటాయి. ప్రతి ఏటా ఆగష్టు 15వ తేదీన అరవిందుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడకి లక్షలాది అరవిం ద భక్త్తులు తరలి వస్త్తారు. వీరిలో భారత దేశంతో పాటు అనేక దేశాల వారు మనకి కనిపిస్తారు.
ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్‌ నుండి వచ్చిన వారికి 'ఆంధ్ర ఆశ్రమం' ప్రత్యేకంగా ఆశ్రయం కలిపిస్తూ సేవలందిస్తోంది.
అనేక మంది విధ్యా ధీకులు సేవలందిస్తున్న ఈ ఆశ్రమంలో యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తారు.ఇక ఈ ఆశ్రమంలో లభించే అనేక ఆయుర్వేద ఔషధాలు, చేతి వృత్తులతో చేసిన అనేక వస్తువులు నాణ్యతకు మన్నికకు పేరెన్నిక గన్నవి.