23, జనవరి 2011, ఆదివారం

కుడితిలో పడ్డ ఎలకలా జగన్ గ్యాంగ్

కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న జగన్‌మోహన్‌రెడ్డితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఝలక్ ఇచ్చారు. జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి గెలవాలని, ఆ తరువాత ఎవరి వెంట అయినా వెళ్లవచ్చని సీఎం వ్యాఖ్యలకు స్పందించి ప్రభుత్వానికి, కాంగ్రెస్స్ పార్టీకి వ్యతిరేకంగా జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలు రాజీనామా లకు సిద్ధపడటం అంత సులువు కాదు. సీఎం వ్యాఖ్యలకు తొందరపడి ఎలా స్పందిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న జాగ్రత్తలలో వీరు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జగన్ వర్గ నేతలు రచ్చబండలో పాల్గొనక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. హాజరుకాకపోతే వైఎస్ జలయజ్ఞానికి వీరు దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవు తాయి. రచ్చబండలో లబ్ధిదారులకు పలు రకాల పథకాలు పంపిణీ జరుగుతుంది. ఈ పరిస్థితులలో వీరు పాల్గొనకపోతే ఆ నియోజకవర్గంలోని ఇతర కాంగ్రెస్ నాయకులు, రెందోకేదర్ రేచిపోవటమే కాకుండా తమ ప్రాధాన్యాన్ని రచ్చబండలో పెంచు కునే అవకాశముంద న్న భయం వారిలో నెలకొలి పెందుకే కిరణ్ వ్యూహాత్మకంగా రాజీనామాల వ్యవహారం తెరపైకి తెచ్చారు. దీంతో రెచ్చిపోయే రాజీనామాలు చేఇంచి ప్రభుత్వాన్ని పడగొడితే వైఎస్ తెచ్చిన ప్రభుత్వాన్ని కూలగోట్టాదన్న అపప్రద తెచ్చేందుకు వ్యాఖ్యలు చేసారని అనీ చెప్పే వారూ లేకపోలేదు. మరి ఇప్పుడు జగన్ గ్యాంగ్ పరిస్తితి కుడితిలో పడ్డ ఎలకలా ఉందనీ చెప్పక తప్పదేమో.

కేంద్రం వేచి చూసే ధోరణికి స్వస్తి పలకలన్న సమైక్యాంధ్ర జేఏసీ

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని సమైక్యాంధ్ర జేఏసీ డిమాండ్ చేసింది. సీమాంధ్రలోని 14 వర్సిటీల్లోని విద్యార్థులంతా గాంధేయ మార్గంలో ఉద్యమిస్తున్నారని అయితే తెలంగాణాలో మాత్రం విద్యార్థులను వేర్పా టు వాదులు రెచ్చగొట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ శామ్యూల్ ఆవేదన వ్యక్తం చేసారు.

తెలంగాణాలో జరిగిన పీజీ పరీక్షలకు పది వేల మందికి గాను కేవలం 1500 మంది మాత్రమే పాల్గొని మిగిలిన వారు హాల్ టిక్కెట్లు చించివేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణికి స్వస్తి పలకాలని, సీమాంధ్ర ఎంపీలంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండే విధంగా వారిపై ఒత్తిడి తెస్తామన్నారు ఎన్ శామ్యూల్ .

నేడు పల్స్ పోలియో

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు సర్వం సిద్దం చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని, హైరిస్క్ గ్రూప్‌కు చెందిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యెక పోలియో బూత్‌ల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుంది.

తెలంగాణవాదులపై రౌడి ఎం ఎల్ ఎ దాడి హేయమన్న రాములమ్మ

మంత్రి దానం నాగేందర్‌ను అడ్డుకుని నిరసన తెలుపుతు న్న తెలంగాణవాదులను ఎమ్మెల్యే జ గ్గారెడ్డి విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దుతూ కార్యకర్తలచే తెలంగాణ దీక్ష శిబిరంపై దాడి చేయడం, అరాచక చర్యలకు పాల్పడడం సిగ్గు చేటని మెదక్ ఎంపీ విజయశాంతి వ్యాఖ్యానించారు.

ఈ దాడి సభ్య సమాజానికే ఏవగింపు కలిగిస్తోందని, ప్రైవేటు గుండాలచే దీక్షా శిబిరంలో కూర్చున్న తెలంగాణవాదులపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఈనెల 28న తెలంగాణ ముస్లింగర్జన

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్న ముస్లింలు సైతం ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారని జమాతే ఇస్లామి హింద్ ప్రకటించింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్‌లో మహాగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఎస్ఐవో అధ్యక్షు డు మొగద్‌హాదీ చెప్పారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ గర్జనకు అన్ని వర్గాల ముస్లింల తో పాటు తెలంగాణ వాదులు పెద్దసంఖ్యలో హాజరై విజయంతం చేయాలని కోరా రు.

రచ్చబండ రద్దు చేయకపోతే రచ్చ, రచ్చె....

తెలంగాణ దృష్టిని మరల్చడానికి రాష్ట్రప్రభుత్వం చేపట్టి న రచ్చబండ కార్యక్రమాన్ని రద్దుచేయాలని శాసనసభ టీఆర్ఎస్ ఉపనేత టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. ప్రజలు రచ్చబండ, రేషన్‌కార్డులు కాదని, తెలంగాణ కోరుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేట్టు కాంగ్రెస్‌నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొనిరావాలని హరీష్ రావు సూచించారు. జన అబిప్రాయాన్ని కాదని పోలీసు పహారాలో జరిగీ రచ్చ బండల్ని రచ్చ చేస్తామని హెచ్చరించారు.

ఫిబ్రవరి 22న అసెంబ్లీ ముట్టడి : మంద

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిన్చని పక్షంలో ఫిబ్రవరి 22న అసెంబ్లీని ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.

అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం ముందే చేయడం ఉషామె హ్రా కమిషన్ వర్గీకర ణకు అనుకూలంగా రిపోర్టు సమర్పించడంజరిగిందని, ఇప్పటికే ఏళ్ళ తరబడి నానుస్తున్న వర్గీకర ణ సాధించేందుకు జనవరి 31లోపు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకొని వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని పేర్కొన్న కాంగ్రెస్‌పార్టీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు జాప్యం చేస్తే వేలాదిగా తరలివచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చ రించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సొంత జిల్లాలోనే ముసలం

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కి సొంత జిల్లాలోనే ముసలం ప్రారంభమైంది. యువనేత జగన్మోహన రెడ్డి జనదీక్షకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు అయన ప్రత్యర్ధి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

పార్టీని విమర్శించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారని .. ఇప్పుడు తాను ముఖ్యమంత్రినే విమర్శిస్తున్నానని, మరి తనని రాజీనామా చేయమంటే చేయడానికి ... సస్పెండ్ చేసినా ఎమ్మెల్యేలను తప్పుకోవాలనడం ముఖ్యమంత్రి చేతగానితనానికి నిదర్శనం శాసనసభ్యులు రాజీనామా చేయాలని చెప్పే సి ఎం కూడా రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే ఆయనపై పీలేరు లో తానే పోటీ చేస్తానని సవాల్ విసిరారు.