9, డిసెంబర్ 2011, శుక్రవారం

మరలిరాని మన జాతి సంపద

కోహినూరు వజ్రం... మయూర సింహాసనం... శివాజీ ఖడ్గం... హౌప్‌ వజ్రం...తైమూరు చక్రవర్తి కెంపుల హారం
ఃబర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ః...ఇలా అనేక మన వారసత్వ సంపదలు దేశం వీడి ఏళ్ల్లు గడిచాయి. చాలా వరకు విదేశాల్ల్లో మ్యూజియాల్లో దర్శనమిస్త్తుంటే మరి కొన్ని మహరాణుల నగల మాటున మూలుగుతూ... కంటికి కనిపించనంత దూరంగా ఉన్నాయి. ఇవన్నీ మనవే అని యావత్‌ ప్రపంచానికి తెలిసినా... ఎప్పటికైనా అవి మన దేశానికి రాకుండా పోతాయా అంటూ... ఆశావాదుల్లా...కళ్లల్లో వత్తులేసుకుని నిరీక్షించడం మినహా..తిరిగి తెచ్చుకోలేని దుస్ధితి మనది... ఇంతకీ మన దేశాన్ని వీడిపోయిన అపార సంపదల్లో కొన్నింటిని తరచి చూస్తే....
రత్నగర్భగా పేరెన్నికగన్న మన భారతావనిలోని అపార సంపదపై దృష్టి కేంద్రీకరించిన అనేక మంది విదేశీయు లు అనేక దండ యాత్రలతో కొందరు.. వ్యాపారం పేరుతో మరి కొందరు..మన రాజుల్ని మచ్చిక చేసుకుని ఇంకొందరు మన దేశంలోకి అడుగుపెట్టి కోట్ల విలువ చేసే అనేక వజ్రవైఢూ ర్యాలను, బంగారు సంపదల్ని తరలిం చుకుపోయారు. వాస్తవాలు ప్రపంచావనికి తెలిసినా... మన కేంద్ర విదేశాం గ మంత్రిత్వశాఖ ఃమా సంపద మా కివ్వండంటూ విజప్తులు చేస్తూ... చేతులు దులుపుకోవటంతో ఇక మనం మన దేశం లో ఒకపðడు ఉండేదట.. అని అనుకుంటూ...వాటి చరిత్రల్ని.. పుస్తకాల పుటల్లో చదువుకుంటూ... ఎక్కడో ఓదగ్గర సురక్షితంగా ఉన్నా యని సంతృప్తిపడుతూ.. ఉండిపోవాల్సిందేనా అన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తున్న క్రమంలో ఇప్పటికే జనం సమస్యలే పట్టని మన నేతలు వీటిని తిరిగి రప్పించేం దుకు ఏమాత్రం తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తారో చూడాలి. కాస్త వివరాల్లోకి వెళ్తే...
కోహినూర్‌ వజ్రం :
భారత దేశ చరిత్రలో కోహినూర్‌ వజ్రానికి ఓ ప్రత్యేక స్ధానం ఉంది. మన కృష్ణాపరివాహక ప్రాంతంలో వజ్రం దొరికిన ఈ వజ్రం14వ శతాబ్దంలో మొఘ ల్‌చక్రవర్తి బాబరు చెంతకు చేరింది. ఆపై షాజహాన్‌ తన నెమలి సింహాసనంలో ఈవజ్రం పొదిగించాడనీ.మొఘలాయిల వారసత్వ సంపద గా వచ్చిన ఈవజ్రంపై కన్నేసిన నాదిర్షా 1739 లో ఢిల్లీపై దండెత్తి నాటి మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షాను ఓడించి...కోహినూర్‌ వివరాలు కను క్కు ని...తన సుహృద్భా వానికి చిహ్నంగా తల పాగాలు

మార్చి.. షా తలపాగాలోని వజ్రాన్ని చూసి ఃకోV్‌ా- ఇ-నూర్‌ః అని అప్రయత్నంగా అన్నాడని... దీంతో ఆ పేరే దానికి స్ధిరపడి పోయిందని చరిత్ర కారులు చెప్తారు.
నాదర్షా ఎత్తుకు పోయిన ఆ వజ్రం 1747లో కుర్దిష్‌ తెగల పై ఆయన దాడులని ప్రతిఘటించిన సొంత అనుచరగణం చేతిలో కన్ను మూయగా...వారి ద్వారానే 18వ దశకంలో మన దేశంలోని షాజాఅనే రాజుని చేరింది. అయితే షాజాని బంధించిన కాశ్మీర్‌ రాజుని ఓడించి నందుకు ప్రతిగా.. షుజాభార్య లాహౌర్‌ మహారాజు రంజిత్‌సింగ్‌కు అంద చేయగా.. ఆయన తన తదనంతరం కోహినూరు పూరీ జగన్నాధు డికి చెందేలా విల్లు రాసి చనిపోయాడు. అయితే అప్పటికే ఈ దేశంలో బ్రిటీష్‌ పాలకుల దాష్టికాలు ప్రారంభమై అపార సంపదని తమ దేశానికి తీసుకుపోవటం ప్రారంభించా రు.ఈక్రమంలోనే వారి పాలబడ్డ కోహి నూర్‌ను ఏప్రిల్‌ 6, 1850న హెచ్‌.ఎం.ఎస్‌. మీడియా నౌక ద్వారా బొం బాయి తీరం నుండి ఇంగ్లాడుకు ఎన్నో ఒడిదుడుకుల నడుమ తరలిం చుకుపోయారు.
అప్పట్లో ఈ వజ్రాన్ని తిరిగి భారతావనికి రప్పించేం దుకు రంజిత్‌ సింగ్‌ వారసుడైన దులీప్‌సింగ్‌ లార్డ్‌ డల్హౌసీతో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సరికదా దాన్ని విక్టోరియా మహారాణికి భద్రంగా పంపాడు. అత్యంత విలువైన ఆ వజ్రం బ్రిటీష్‌ మహారాణి కిరీటం లో చోటు దక్కించుకుని... నేడు అత్యంతభద్రత సందర్శ కులకు కనువిందు కలిగిస్తూ... సేద తీరుతోంది.
నెమలి సింహాసనం
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తాజ్‌మహల్‌ నిర్మాత మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ ఎంతో ఇష్టపడి తయారు చేయించుకున్న సింహాసనం ఇది. ఆయన పాలనంతా దాదాపు దీని మీద నుండే చేసావా రని చరిత్ర చెప్తున్న సత్యం. కొన్ని కేజీల బంగారంతో తయారు చేసిన దీనికి 108 కెంపులూ, 116 పచ్చలూ ఇంకా అనేక అమూల్య వజ్రాలూ, రత్నాలతో దాన్ని అలంకరించారని, దీనిపై భాగంలో అమర్చిన నెమలి ముత్యాల తో.. పింఛóమంతా పచ్చని కెంపులతో.. ప్రపంచంలోని కెంపుల్లో రెండో అతిపెద్ద కెంపు తైమూర్‌ రూబీ వంటి అమూల్య రత్నాలు ఆకర్షణీయంగా తయారైన ఈ సింహా సనాన్ని సైతం నాదిర్షా తరలించుకు పోయాడు
అప్పటికి ఆ సింహాసనం విలువ పదికోట్ల రూపాయలు అంటే తాజ్‌ మహల్‌ నిర్మాణానికి చేసిన ఖర్చు కన్నా దాదాపురెట్టింపు అన్న మాట. నాదిర్షా హత్య అనంత రం.. ఎవరి చేతికందినదివారు పట్టుకు పోయిన క్రమంలో ఈ నెమలి సింహాసనం పూర్తిగా ధ్వంస మైందని కొందరు చెప్తుం డ గా అది కాలక్రమంలో ఇరాన్‌ చేరిందని కొందరు చెప్తారు. కాగా ఇది అసలైన సింహా సనం కానే కాదని కేవల నకలు మాత్రమేనని ఇర్విన్స్‌ వంటి చరిత్ర కారులు వాదిం చిన సందర్భాలూ ఉన్నాయి.
హామీ హుళక్కేనా..

ప్రస్తుతం కాశ్మీర్‌ ముఖ్య మంత్రిగా ఉన్న ఒమర్‌ అబ్ధుల్లా విదే శాంగ మంత్రిగా కోహినూ రు వజ్రం, నెమలి సింహాసనాలను వెనక్కి తెచ్చేందుకుప్రయత్నాలు చేసు ్తన్న ట్లు ప్రకటన చేసి దశాబ్ధం గడిచినా కనీసం ఆదిశగా ప్రయత్నాలు దాదాపు శూన్యం అవ్వటంతో వీటికి ఇక నీళ్లొదులు కోవాల్సిన పరిస్ధితి నెలకొందన్నది మాత్రం యదార్ధం.

తాగితే ఏమవుతుంది?

'ఒక ఫోటోను కాల్చివేశాక, ఆ నుసిని కాఫీలో వేసుకుని తాగేస్తే ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుందా? ప్రాణాపాయం ఏర్పడుతుందా?, ఇలాంటి ఆలోచనలు ఆ సీన్లో నటించిన తారలకు రాలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ సన్నివేశం సూపర్‌హిట్‌ చిత్రం 'మరో చరిత్ర' లోనిదని, అందులో హీరోయిన్‌ తల్లి కోపంతో హీరో ఫోటో కాల్చివేస్తే, ఆ నుసిని అలాగే నాయికా కాఫీతోపాటు తాగేస్తుందనీ ఆ చిత్రం చూసిన చాలామందికి గుర్తుండే ఉంటుంది. తెలుగు వెర్షన్‌లో సరిత నటిస్తే, హిందీ (ఏక్‌ దూజే కేలియే)లో రతి అగ్నిహోత్రి నటించారు. దర్శకులు కె. బాలచందర్‌ ఆ సన్నివేశం తీస్తున్నప్పుడు - రెండు వేర్వేరు దృశ్యాలుగా తీసి కలపలేదు. ఫోటోను కాల్చడం, కాఫీ కప్పులో ఫోటో కాలిన నుసి వేయగానే, నాయిక అలాగే తాగడం - అన్నీ వరసగా తెరమీద కనబడగానే ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురవుతారు. ఆ సంగతి ఇటీవలే రతి అగ్నిహోత్రి గుర్తుకు తెచ్చుకుంటూ ''హిందీ వెర్షన్‌ 1979లో ఆరంభించారు. అప్పుడు నా వయసు 16. తెలుగు విశాఖపట్నంలో తీస్తే, హిందీ చిత్రం షూటింగ్‌ గోవాలో జరిగింది. అప్పుడు నాకు ప్రేమా దోమా, పెద్దలను ఎదరించడాలు వంటివేవీ తెలియదు. డైరెక్టరు ఎలా చెబితే అలా ఉత్సాహంగా చేయాలన్నదే నా ధ్యేయం. గోవాలో మండుటెండలో ఇసుక మీద పడుకుని ఉంటే, కమలహాసన్‌ నా పొట్టమీద బొంగరాన్ని తిప్పుతారు. ఒకపక్క ఒళ్లు కాలిపోతుంటే, చిలిపిగా 'ఎక్స్‌ప్రెషన్స్‌' ఇవ్వాలి. అలాగే - ఫోటో కాల్చిన సీన్‌. కాఫీలో కలిపి తాగమంటే అలాగే తాగేశాను కానీ ఆ తర్వాత ఏమవుతుందో అసలు ఆలోచించనే లేదు. లక్కీగా ఏమీ కాలేదనుకోండి... ఏమైనా ఆ సినిమాలో నటించడం ఓ స్వీట్‌ ఎక్స్‌పీరియన్స్‌'' అంటారు రతి.

'నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్‌ జయంతి డిసెంబర్‌ 12.

డైలాగ్‌ డెలివరీతో ప్రత్యేకత, అభినయంలో విలక్షణత చూపి నటుడిగా ఒక బ్రాండ్‌ ఏర్పరచుకున్నారు నూతన్‌
ప్రసాద్‌. నూతన్‌ ప్రసాద్‌ అనగానే - నూటొక్క జిల్లాల అందగాడు, నిత్యపెళ్లికొడుకు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది, కొత్త దేవుడు ఇలా చాలా గుర్తొస్తాయి.
రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడై, 'నీడలేని ఆడది' చిత్రంతో సినీ రంగంలోకి అడిగిడినా 'అందాల రాముడు' తో ప్రేక్షకులకు ముందు పరిచయమయ్యారు. నూతన్‌ ప్రసాద్‌ కామేడియన్‌గా, కామెడీ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభ చూపారు 475 చిత్రాల్లో. ''ఇది వరకు 'నూటొక్క జిల్లాల అందగాడు'ని ఇప్పుడు 'నూటొక్క జిల్లాల అవిటివాణ్ణి' కదండీ నేను'' అని 1989 ఏప్రిల్‌ నెలలో (ఫిబ్రవరి నెలలో బామ్మమాట బంగారు బాట చిత్రంలో నటిస్తూ కారు ప్రమాదంలో చిక్కుకుని మద్రాసు విజయా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా) అని తన మీద తనే సెటైర్లు వేసుకున్నారు. అప్పటి వరకు అవసరం వున్నా లేకపోయినా రాసుకు పూసుకు తిరిగిన అనేక మంది చికిత్సా కాలంలో అతి తక్కువ సంఖ్యలో వస్తుంటే నిరాశ నిస్పృహకు లోనై వేదాంత ధోరణి అలవర్చుకున్నారు. చికిత్స తర్వాత వీల్‌ చెయిర్‌కి పరిమితమై, మానసిక స్థైర్యం పెంచుకుని 20 ఏళ్ళపాటు అలా 110 చిత్రాల్లో నటించారు. యాక్సిడెంట్‌కి ముందు 365 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో, టెలివిజన్‌ కార్యక్రమాల్లో తన మాట విరుపు వినబడేలా చేసారు. నూతన ప్రసాద్‌ జయంతి డిసెంబర్‌ 12.

శంకర్‌ విజయ”రహస్యం”

'సినిమా ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు ఆకర్షణీయంగా చూపించవచ్చు. కానీ అంతర్లీనంగా మన సమకాలీన జీవితంలో సామాన్య జనం చవిచూసే సమస్యలు, వాటిని ఎదుర్కోడానికి జరిగే పోరాటాలు ప్రతిబింబించాలని భావిస్తాను' అంటారు ప్రసిద్ధ దర్శకుడు శంకర్‌. తాజాగా ఆయన హిందీ చిత్రం 'త్రీ ఇడియట్స్‌' ఆధారంగా - మన విద్యా విధానం తీరు తెన్నులు, యువకుల ఆలోచనా ధోరణిని వినోదభరితంగా చూపే చిత్రాన్ని తీస్తున్నారన్నది తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ''నేను డిఎమ్‌ఇ ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. కానీ బిఇ చదవాలనుకుంటే సీటు దొరకలేదు. చదువుల తల్లిని - డబ్బులిచ్చి కొనుక్కునే దుస్థితికి లోనవ్వడం ఇష్టంలేక, నా ధ్యేయాన్ని మార్చుకుని చిత్రరంగంలో సహాయ దర్శకుడిగా ప్రవేశించాను. అప్పట్లోనే ఒక వార్త పేపర్లో వచ్చింది. ఓ విద్యార్థి - మామూలుగా సీటు దొరక్క, వికలాంగుల కోటాలో అయితే దొరుకుతుందన్నారని, తన వ్రేలిని తాను నరుక్కుని, దరఖాస్తు చేసుకున్నాడట! ఆ వార్త నన్నెంతగానో కలచివేసింది. అలాంటి అనుభవాల నేపథ్యంలోంచే 'జెంటిల్‌మేన్‌' (అర్జున్‌) కథను రూపొందించాను. జీవితానికి దూరంగా ఉండే సినిమాలలో ఎన్ని గొప్ప ఆకర్షణలను చొప్పించినా, అవి జనాన్ని ఆకట్టుకోలేవని నా నమ్మకం'' అంటారు శంకర్‌.

ఫిబ్రవరిలోనే ఉప పోరు

మరో రెండు నెలల వరకూ జగన్‌ మద్దతు ఎమ్మెల్యేలపై వేటు పడకపోవచ్చు. ఎందుకంటే... ఉప పోరు అంటూ జరిగితే అది ఫిబ్రవరిలోనే ఉండొచ్చు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభల్లో సీటు ఖాళీ అయిన ఆరు నెలల్లోపు ఎన్నిక నిర్వహించాలి. ఈ లెక్కన మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి అక్టోబర్‌ 30న మృతి చెందారు. ఈ తేదీని పరిగణలోనికి తీసుకుంటే, ఏప్రిల్‌ 30లోపు ఉప ఎన్నిక నిర్వహించాలి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అక్టోబర్‌ 8న ముసాయిదా విడుదలతో మొదలైంది. డిసెంబర్‌ మూడో తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, ఫొటోల సేకరణ కార్యక్రమం సాగుతుంది. డిసెంబర్‌ 17 వరకు దరఖాస్తుల విచారణ తతంగాన్ని పూర్తి చేసి జనవరి 5న సవరించిన తాజా జాబితాను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎన్నికల నిర్వహణ ఉండదు. ఏప్రిల్‌ వరకూ గడువు ఉన్నా... మార్చి, ఏప్రిల్‌లో విద్యార్థుల పరీక్షలుంటాయి. సిబ్బంది కొరత, పోలింగ్‌ కేంద్రాల సమస్య ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే అప్పటికే ఖాళీగా ఉన్న అన్ని స్థానాలను నోటిఫికేషన్‌ పరిధిలోకి తెస్తారు. ఇప్పటికిప్పుడు జగన్‌ మద్దతుదారులపై వేటు వేస్తే... ఫిబ్రవరిలోనే ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ కొద్ది సమయంలో ఉప ఎన్నికలకు వెళ్ళడం అధికార పార్టీకి తలనొప్పే కావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, అనర్హత పిటిషన్లను ఫిబ్రవరి వరకూ పెండింగ్‌లో ఉంచే వీలుంది.

భారతీయ మహిళకు ఒబామా పాలకవర్గంలో కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక భారతీయ మహిళను తమ పాలకవర్గంలో కీలక పదవిలో నియమించారు. ప్రీతి డి బన్సాల్‌ అనే ఈ మహిళ ను ప్రభుత్వ కార్యకలాపా లలో సమర్థత, తగిన పనితీరు, నిష్పా క్షికత వంటి వాటిని పెంపొం దించేందుకు కృషి చేసే ఒక స్వతంత్ర సంస్థ సభ్యునిగా నియ మించారు. 'ఇటువంటి ప్రభావాత్మక వ్యక్తులను ఈ ముఖ్య పదవులకు నియమిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. అంతేకాక వారు తమ గణనీయమైన నైపుణ్యాలను మాకు అందజేసేందుకు అంగీకరించినందుకు కృత జ్ఞడనై ఉంటాన'ని ఆయన అమెరికా అడ్మినిస్ట్రేటివ్‌ కాన్ఫరెన్సుకు సంబంధించిన సలహా మండలి ఇద్దరు సభ్యులను పరిచయం చేస్తూ పేర్కొన్నారు. ఒబామా పాలకవర్గం లో ఉన్నత పదవులలో ఉన్న సుమారు 24 మంది భారతీయ అమెరిక న్‌లలో బన్సాల్‌ ఒకరయ్యారు. వీరందరిలో యుఎస్‌ ఎయిడ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజీవ్‌ షాది అత్యున్నత స్థానం. బన్సాల్‌ 2009 నుంచి 2011 వరకూ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ కార్యాలయంలోని జనరల్‌ కౌన్సెల్‌లో సీనియర్‌ విధాన వ్యవహారాల సలహాదారుగా పని చేశారు. ఆమె 2010 నుంచి 2011 వరకూ కౌన్సెల్‌ ఉపాధ్యక్ష పదవి కూడా చేపట్టారు. ఒబామా పాలక వర్గంలో చేరడానికి ముందు ఆమె న్యూయార్క్‌ స్టేట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా పని చేశారు. అలాగే అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్త్తుల్లో ఒకరైన జాన్‌ పాల్‌ స్టీవెన్స్‌ వద్ద లా క్ల ర్కుగా పనిచేశారు. అంతకు ముందు ఆమె అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా కమిషన్‌కు కమిషనర్‌గా, అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమె హార్వర్డ్‌ లా స్కూల్‌, హార్వర్డ్‌ -రాడ్‌ క్లిఫ్‌ కాలేజీలలో కూడా విద్యాభ్యాసం చేశారు.

అటకెక్కిన 'ఆధార్‌'

దేశ పౌరులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న బృహత్తర లక్ష్య సాధనకోసం ఇన్ఫోసిస్‌ మాజీ చైర్మన్‌ నందన నీలేకని రూపొందించిన యూనిక్‌ గుర్తింపు కార్డుల (ఆధార్‌ కార్డుల) పథకానికి సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం తోసిపుచ్చింది. దీని స్థానే అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త బిల్లును తీసుకుని రావాలని ప్రభుత్వానికి కమిటీ సూచించింది. “యూనిక్‌ ఐడెంటిటీ అధారిటీ అథారిటీ (యుఐడిఎఐ) బిల్లుపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇదివరకే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అయితే, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ గుర్తింపు కార్డుల జారీ పథకం పనులను నందన్‌ నీలేకనికి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అప్పగించారు.
ఈ పథకాన్ని అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారు. చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐలను) ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలే కాక, యుపిఎలోని భాగస్వామ్య పార్టీలు వ్యతిరేకించడం వల్ల ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం నిలిపి వేయాల్సి వచ్చింది. తిరిగి అటువంటి చేదు అనుభవం ఎదురుకాకుండా, యుఐడిఎఐ బిల్లుకు బదులుగా కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని పార్లమెంటు స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. యుఐడిఎఐ బిల్లుపై కేంద్ర మంత్రి వర్గంలోనే ఏకాభిప్రాయం లేదు. 2-జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం విషయంలో ఇప్పటికే ప్రధానికీ ఆర్థిక, హోం మంత్రులకూ మధ్య పొరపొచ్చాలు తలెత్తాయి. ఈ తరుణంలో యుఐడిఎఐ బిల్లును బలవంతంగా ప్రవేశపెట్టి మరో చిచ్చును సృష్టించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా, ఈ పథకం అటు కాంగ్రెస్‌ ప్రణాళికలో కానీ, యుపిఎ ఉమ్మడి ప్రణాళికలో కాని లేదు. ఆధార్‌ కార్డుల పథకం హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌)కి పోటీ వస్తుందేమోనన్న సందేహాలను హోం మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. పైగా, జాతీయ భద్రత ప్రయోజనాల దృష్ట్యా ఆధార్‌ పథకాన్ని అనుమతించడం మంచిది కాదని కూడా ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాక, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా యుఐడిఎఐ పథకం పత్రాలను ఆడిట్‌ చేయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాక, యుఐడిఎఐ పథకం సేకరించిన వివరాలు నమ్మదగినవిగా లేవని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. యుఐడిఎఐకి అయ్యే వ్యయంలో సగం మొత్తంతో 2014 నాటికి దేశంలోని ప్రజలందరి వివరాలను సేకరించడం సాధ్యమేనని ఎన్‌పిఆర్‌ ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. అంతేకాక, ఆధార్‌ కార్డుల కోసం ప్రైవేట్‌ సంస్థల ద్వారా సేకరించే బయోమెట్రిక్‌ సమాచారం విశ్వసించ దగినదిగా ఉండకపోవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అంతేకాక, ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి సున్నితమైన, కీలకమైన సమాచారం చేరడం భద్రతా ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదని హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అన్నింటికీ మించి రాజకీయ నాయకులు తమ పరిధిలోని అంశాల్లోకి వృత్తివిద్యారంగాల్లోని వారిని రానివ్వరన్న నానుడి కూడా అసత్యం కాకపోవచ్చు. అందువల్ల ఇన్ఫోసిస్‌ వంటి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఐటి కంపెనీ అధిపతిగా విశేషమైన ప్రతిభను చూపిన నీలేకని ఈ వ్యవస్థలో ఇమడలేకపోయారనడానికి తాజా ఉదాహరణ.

చిక్కుల్లో మాజీ సిఎంలు

అక్రమ మైనింగ్‌ కేసులో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. ఎం. కృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఈ కుంభకోణంపై కృష్ణతోపాటు మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌. ధరంసింగ్‌ (కాంగ్రెస్‌), హెచ్‌. డి. కుమారస్వామి (జనతాదళ్‌ - సెక్యులర్‌)లపై కర్నాటక లోకాయుక్త కేసు నమోదు చేసింది. వీరు వారి వారి హయాంలో అక్రమ మైనింగ్‌ లీజులకు అనుమతినిచ్చారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త అబ్రహం టి జోసెఫ్‌ దాఖలు చేసిన ప్రయివేట్‌ పిటిషన్‌ను విచారించిన లోకాయుక్త కోర్టు న్యాయమూర్తి ఎన్‌ కె సుధీంద్రరావు కేసు నమోదు చేయాలని లోకాయుక్త ఎడిజిపిని ఆదేశించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి 2012 జనవరి ఆరో తేదీలోపు నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రులతో పాటు పది మంది బ్యూరోక్రాట్లకు ఈ అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉందని అబ్రహం టి జోసెఫ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని అబ్రహం ఆరోపించారు. కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (1999 - 2004) కేవలం పాత ధరలకే మైనింగ్‌ లీజుకు అనుమతినిచ్చారని పిటిషనర్‌ ఆరోపించారు. అంతటితో ఆగక అటవీ, పర్యావరణ శాఖ అధికారుల అభ్యంతరాలను కూడా తోసిరాజని కృష్ణ, రిజర్వు ఫారెస్ట్‌ భూముల్లోనూ లీజుకు అనుమతినిచ్చారన్నారు. ఇక 2005లో ముఖ్యమంత్రిగా ఉన్న ధరంసింగ్‌ వ్యవసాయ భూముల నుంచి ఇనుప ఖనిజం, ముడి మాంగనీస్‌ల రవాణాకు తాత్కాలిక అనుమతినిచ్చారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.23.22 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తర్వాత 2006-07 మధ్య సిఎంగా ఉన్న కుమారస్వామి, సాయి వెంకటేశ్వర మినరల్స్‌ మైనింగ్‌ లైసెన్సును ఆమోదించి, జంతాకల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లైసెన్సును పునరుద్ధరించారని అబ్రహం తెలిపారు. ఇటీవల కర్నాటక లోకాయుక్తగా పనిచేసిన జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా అబ్రహం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

మళ్లి తెలుగులో గ్రేసిసింగ్‌

అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు''. అంటూ 'తప్పుచేసి పప్పుకూడు' చిత్రంలో మెరిసిన ముంబాయి భామ గ్రేసిసింగ్‌ మరో మారు తెలుగు చిత్రాల్లో కనిపించనుంది. బాలీవుడ్‌ సినిమా 'లగాన్‌'తో ఖ్యాతిగాంచిన గ్రేసిసింగ్‌ ఆవెంటనే తెలుగులో నాగార్జునతో 'సంతోషం'లో నటించింది. ఈ చిత్రం కమర్షియల్‌ బ్రేక్‌ ఇచ్చినప్పటికీ, బాలీవుడ్‌ సినిమాలపైనే దృష్టినిలిపింది. అయితే ఎందరో నాయికలు ముంబాయి నుండి వచ్చి తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మంచి పాత్రలు, అంతకుమించి పారితోషికం వంటివి ఇప్పుడు బాలీవుడ్‌ నాయికలను తెగ ఆకర్షిస్తున్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు గ్రేసిసింగ్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించగా, తన పాత హీరోలు నాగార్జున, మోహన్‌బాబు ఫ్రెండ్లీ ఆహ్వానం పలికినట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రేసి రెండు చిత్రాలు అంగీకరించిందట. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

సోలో' సెన్సార్ బిట్స్

నారా రోహిత్‌, నిషా అగర్వాల్‌, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, సాయాజీ షిండే, రావు రమేష్‌, శ్రీనివాసరెడ్డి ముఖ్యపాత్రలు ధరించిన చిత్రం 'సోలో'. ఎస్‌.వి.కె.సినిమా పతాకాన వంశీ కృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ, రచన, దర్శకత్వం పరశురామ్‌ (బుజ్జి).
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'సోలో' చిత్రాన్ని చూసి 4 కట్స్‌తో 22-11-11న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1. 'నీ యబ్బ' పదం సినిమాలో ఎక్కడ వున్నా తొలగించారు.
2. ఎనిమిదవ రీలులోని 'బాస్టర్డ్‌' పదం కత్తెర పాలయింది.
3. ఎనిమిదవ రీలులోనే హేండ్‌ జెస్ట్యూర్స్‌కి సంబంధించిన దృశ్యాలు కత్తెరింపునకు గురి అయ్యాయి.
4. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్‌ వాడకానికి సంబంధించిన సన్నివేశాలున్నప్పుడు చట్టబద్ధమైన హెచ్చరికని చూపమన్నారు.
4048. 81 మీటర్ల నిడివి గల 'సోలో' చిత్రం 25-11-11న విడుదలైంది.

ఓ మై ఫ్రెండ్‌ సెన్సార్ కట్స్

సిద్ధార్థ, శ్రుతిహాసన్‌, హన్సిక, నవదీప్‌, తనికెళ్ల భరణి, అలీ, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'ఓ మై ఫ్రెండ్‌'. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకాన దిల్‌రాజు నిర్మించారు.
ఈ చిత్రాన్ని చూసిన ఐదుగురు సభ్యుల 'ఇసి', 5కట్స్‌ ఇవ్వగా వాలంటరీగా నిర్మాత వాటిని కట్‌ చేయడంతో 'యు' సర్టిఫికెట్‌ని 9-11-11న జారీ చేసారు.
1. పార్క్‌లోని క్లీవేజ్‌ దృశ్యాన్ని తొలగించారు.
2. పార్క్‌లో లిప్‌ లాక్‌ (పెదవితో పెదవి కలిపి ముద్దాడిన) దృశ్యం.
3. 'యు బిచ్‌' అనే పదాలు
4. 'దొబ్బేయ్‌' అనే పదం
5. బైక్‌ మీద పింక్‌ డ్రెస్‌లో వెళ్ళేటప్పుడు క్లీవేజ్‌ దృశ్యం తొలగించారు.
ఈ డిజిటల్‌ సినిమా 11-11-11న విడుదలైంది.

రేపు సంపూర్ణ చంద్ర గ్రహణం

సంపూర్ణ చంద్ర గ్రహణం శనివారం సంభవించనుంది. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. దీని తర్వాత మళ్లిd ఏడేళ్ల వరకూ చంద్రగ్రహణాన్ని దర్శించే అవకాశం లేనందున దీ నికి ప్రాధాన్యత పెరిగింది. మన దేశంలో ఈ గ్రహణం సాయంత్రం 6.15 నిముషాలకు ప్రారంభమై 7.36 నుంచి 8.28 వరకు ఉంటుంది. ఇంతకు ముందు జూన్‌ 15న ఏర్పడిన చంద్ర గ్రహణాన్ని మేఘాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల వారు దర్శించలేకపోయారని, ఈ సారి వాతావరణం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత చంద్ర గ్రహణం 2018లోనేనని వారు తెలిపారు.
శ్రీవారి ఆలయం మూసివేత
చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శనివారం మూసివేయనున్నట్లు టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఆలయం తెరచిఉండదని చెప్పారు. ఈ కారణంగా ఉదయం 6 గంటల తర్వాత భక్తులను వైకుంఠం -2 కాంప్లెక్సులోనికి అనుమతించరు. సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశారు. ఒక్క సుప్రభాతసేవకు మాత్రమే భక్తులను అనుమతించనున్నారు. రాత్రి 10.30 గంటలకు శ్రీవారి ఆలయం ద్వారాలు తెరచిన అనంతరం పుణ్యహవచనం, శుద్ధి, రాత్రి కైంకర్యాలు, పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు. రాత్రి 11.30 గంటలకు కార్తీక దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా చేస్తారు. శ్రీవారి భక్తులను వైకుంఠం-2 కంపార్టుమెంటులోకి శనివారం రాత్రి 10.30 గంటల నుంచి మాత్రమే అనుమతిస్తామని జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు.
పాలకమండలి సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఆదివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మెన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షత వహిస్తారు. పాలకమండలిలో ప్రధానంగా జనవరి 1వ తేదీన, జనవరి 5న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు దర్శన, వసతి అంశాల గురించి చర్చిస్తారు. ఆ రోజులలో విఐపిలకు మంజూరు చేసే పాసులు గురించి చర్చించే అవకాశం ఉంది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కావడం వల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్సులో గేట్లు విరిచేయడం, క్యూ లైన్లో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున అవకాశం ఉంది. అంతే కాక టిటిడి విద్యా సంస్థలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వేతనాల క్రమబద్ధీకరణపై చర్చించే అవకాశం ఉంది. మార్పులు చేర్పులపై ఎండోమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రమణాచారి, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజుకు సూచనలు చేసినట్లు సమాచారం.
రేపు శ్రీశైలంలో ఆలయం తలుపులు మూసివేత
కర్నూలు ,కెఎన్‌ఎన్‌బ్యూరో: త్రిపాదాధిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం శ్రీశైలంలోని బ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవాలయ ద్వార తలుపులు మూసివేయనున్నారు. ఉదయం 3.30 గంటలకు దేవాలయంలో మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, కాలపూజలు, హారతులు నిర్వహించిన తర్వాత 9 గంటల తర్వాత ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఆ రోజు సాయంత్రం జరిగే పల్లకి సేవ, స్వామివార్ల కల్యాణం, పయనింపు సేవ, ఏకాంత సేవలు కూడా రద్దు చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు ఆలయం ద్వారాలు తెరిచి, ఆలయాన్ని శుభ్రం చేసి, సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ, కాలపూజలు, హారతులు నిర్వహించిన తర్వాత 6 గంటల నుంచి భక్తులకు ధర్శనాలు, అభిషేకాలకు అనుమతిస్తారు.అలాగే జిల్లాలోని పలు దేవాలయాల తలుపులు కూడా చంద్రహ్రగణం సందర్భంగా మూసి వేయనున్నారు. ప్రధానంగా మంత్రాలయంలో రాఘవేంధ్రస్వామి, మహానందిలో నందీశ్వరుడు, అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి, ఉరుకుందలో నరసింహస్వామి ఆలయాల తలుపులు మూసివేస్తారు. మహానందిక్షేత్రంలో ఈనెల 10వ తేదీ ఉదయం 12 గంటల తర్వాత ఆలయాలను మూసివేస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. త్రిపాదాధిక చంద్రగ్రహణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు మహానివేదన అనంతం ఆలయాన్ని మూసివేస్తామన్నారు. మళ్ళీ 11వ తేదీ తెల్లవారు జామున సంప్రోక్షణ పూజలు నిర్వహించిన తర్వాత 7 గంటల నుంచి భక్తులకు దైవదర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు

మహేష్‌బాబు ఇంటిపై ఐటి దాడి

ప్రముఖ యువ హీరో మహేష్‌బాబు ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికా రులు గురువారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. 8 మందితో కూడిన అధికారుల బృందం ఆయన ఇంట్లో అణువణువునా సోదా చేశారు. మహేష్‌బాబు నటించిన దూకుడు సినిమా విజయవంతం కావడం తో భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చా యన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐటి శాఖ అధికారులు ఈ దాడి నిర్వహించారు. అలాగే, థమ్సప్‌, నవరతన్‌ ఆయిల్‌, యూనివర్సల్‌, జోస్‌ అలుకాస్‌ తదితర భారీ సంస్థలకు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మహే ష్‌బాబు ఆదాయం గణనీయంగా పెరిగి నందున తమ శాఖ సమర్పించిన రిటర్న్స్‌కు ఆయన ఇంట్లో ఉన్న డాక్యు మెంట్లకు పోల్చుకునేందుకు ఈ దాడులు దోహదపడతాయని ఐటి శాఖ అధికారులు భావిస్తున్నారు. నగదు, బంగారు ఆభర ణాలు, ఆస్తులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ఐటి అధికారులు తమ శోధనలో రికార్డు చేసుకున్నట్టు తెలిసింది. ఐటి దాడి జరుగుతున్న విషయం తెలుసుకొని షూటింగ్‌లో ఉన్న మహేష్‌బాబు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు.

ఎఫ్‌డిఐ నిలిపిన మధ్యంతర0

  • ఎఫ్‌డిఐ మంచిదే కానీ.. మిడ్‌ పొల్స్‌ను మేం కోరుకోవడం లేదు:ప్రణబ్‌ ముఖర్జీ
న్యూఢిల్లి: రిటైల్‌ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) అనుమతించాలని కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం తప్పుకాదని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. అయితే మధ్యంతర ఎన్నికలను నివారించడానికే యుపిఎ సర్కార్‌ వెనక్కు తగ్గిందని ఆయన పేర్కొనడం గమనార్హం. గురువారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుల సమావేశంలో ప్రణబ్‌ ముఖర్జీ మాట్టాడుతూ ప్రతిపక్షాల ఒత్తిడితో ఏకాభిప్రాయం కుదిరే వరకు ఎఫ్‌డిఐపై నిర్ణయం నిలిపివేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం(పిఎంఒ) ప్రకటించిందని తెలిపారు. సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించే వరకు ఎఫ్‌డిఐ నిర్ణయం నిలుపుదల చేసినట్లు ఆర్థికమంత్రి ఎంపీల సమావేశంలో స్పష్టం చేశారు. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం వల్ల వాల్‌-మార్ట్‌, టెస్కో వంటి సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తాయని, ఫలితంగా వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కొత్త విధానాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యానించిన విషయం విదితమే.
ప్రధాని నిర్ణయాన్ని అనేక విదేశీ కంపెనీలు స్వాగతించాయి. అయితే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎఫ్‌డిఐని తీవ్రంగా వ్యతిరేకించడంతో యుపిఎ సర్కార్‌ రెండు వారాల క్రితం తీసుకున్న నిర్ణయంపై పున: పరిశీలించి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. లోక్‌సభలో 18 మంది సభ్యులున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ యుపిఎలో కాంగ్రెస్‌ తరువాత రెండో అతిపెద్ద పార్టీ కావడం గమనార్హం. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతించడాన్ని అంగీకరించబోమని మమత స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకునపడింది. ఎఫ్‌డిఐలను ఉపసంహరించుకోకపోతే పార్లమెంటును సజావుగా నడవనీయమని బిజెపి, వామపక్షాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం ఎఫ్‌డిఐపై తన నిర్ణయాన్ని వాయిదే వేసుకోవాలని లేదా తమ విధానంపై ఓటింగ్‌కు సిద్ధం కావాలని బిజెపి, వామపక్షాలు సవాలు చేశాయి. మమత మద్దతు లేకపోతే ప్రభుత్వానికి లోక్‌సభలో బొటాబొటిగా మాత్రమే బలం ఉంటుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వానికి జరిగే నష్టం అపారం. కాగా, ఎఫ్‌డిఐపై తమ విధానాన్ని ఉపసంహరించుకోలేదని, కేవలం ఏకాభిప్రాయ సాధనలో భాగంగా నిర్ణయం వాయిదా వేసినట్లు ప్రభుత్వం వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించేంత వరకు ఎఫ్‌డిఐని ప్రవేశపెట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుపితో సహా ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లిd ఎన్నికలు జరుగనుండటం, తృణమూల్‌ వంటి మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించడంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మినహా ప్రభుత్వానికి మార్గాంతరం లేకపోయింది. యుపిఎ సర్కార్‌ ఎటువంటి రిస్క్‌ తీసుకోడానికి సిద్ధంగా లేకపోవడం గమనార్హం.

హాయినిచ్చే కుషన్స్‌

వీధిలోంచి ఇలా ఇంట్లోకి రాగానే హాయిగా కాసేపు రిలాక్స్‌ అవ్వాలని ఎవరికుండదు చెప్పండి... అందుకు ఎదురుగా కనిపించే సోఫానో...
దివాన్‌నో ఆశ్రయించి అందులోని కుషన్‌ని సరి చేసుకుని నడుం చేరేసే వాళ్లు కూచుకున్నంత సేపు ఏదో తెలియనిప్రశాంతత పొందుతూ...
ఈకుషన్‌లపై మక్కువ చూపుతున్నారు..
ఇంటిని అందంగా అలంకరిం చుకోవటం ఇల్లాలిగా బాధ్యతే అన్న విషయాన్ని గుర్తించే ఇంటిని చూసి... ఇల్లాలి మనస్ధ త్వం చెప్పొచ్చని చెప్పారు మన పెద్ద లు... ఇప్పుడు దాదాపు ధనిక, మధ్య తరగతి అన్న తారతమ్యాలు లేకుండా ఇంటిని అలంకరించుకునేందుకు ఎక్కు వ మంది శ్రద్ద చూపిస్తున్నారిప్పుడు.
మారుతున్న కాలానుగుణంగా... ఇంటిలో చిన్న చిన్న మొక్క లు, రకరకాల పువ్వులతో కూడిన ఫ్లవర్‌ వాజ్‌లు, పక్షుల కిలకి లలతో పంజరాలు, ఆహ్లాదకరంగా అటు ఇటు కదులుతూ... హొయలొలికించే అనేక రంగు రంగుల చేప పిల్లలతో ఉండే ఎక్వేరియంలు ఇలా అనేక హంగులు నేడు గృహా లంకరణలో నిత్యమౖైెపోయాయి.
ఈ క్రమంలో దివాన్‌ కాట్‌లు, రకరకాల సోఫాలు ఇంటికి కొత్తవన్నెలు తెచ్చే లా కొనుగోలు చేయటమూ కాకుండా వాటిని అందంగా అలంకరించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నా రిప్పుడు గృహిణులు.
ఇంటి అలంకరణ ఓ కళ అనే చెప్పక తప్పదు, టీపాయ్‌ మొదలు, టివి స్టాండ్‌ వరకు, కర్టెన్‌ మొదలు సోఫా కవర్‌ వరకు అన్నీ ఆహ్లాదం పరిచేలా ఉండాల్సిందే.. ఇందు కు ఖర్చుకు వెనక్కి తగ్గకుండా.. తమ శక్తి కొలది కొనుగోలు చేస్తూ... ఇంటిని అలంకరించు కుంటున్నారు అంతా.
ఇంటికి వచ్చే అతిధులు ఎక్కువసేపు ఉండే డ్రాయింగ్‌ రూంలపైనా బాగా శ్రద్ద వహిస్తున్నారు. వచ్చే వారే కాదు... తాము కూడా అలసి సొలసి వచ్చి ఇంట్లో కాసేపు టివి చూసేందుకు హాయిగా ఏ దివాన్‌ పైనో, సోఫా లోనో కూర్చొనేలా వాటికి తగ్గ ట్టుగా ఎన్నో కుషన్‌లను కొనుగోలు చేసి అనేక హంగులతో వాటికి కవర్లు కుట్టి స్తూ... కొత్త అందాలతో ఆకర్షించే ప్రయ త్నం చేస్తున్నారు.ఇక ఆఫీస్‌లలోనూ సోఫాల కుషన్‌లకు ప్రత్యేక అలకరణ తప్పని సరి అయ్యింది. వచ్చిపోయేవారు కాసే పైనా రిలాక్సయ్యే లా మెత్తని కుషన్‌ని గోడరంగులకు, కర్టెన్ల రంగు లకు తగ్గట్టుగా చూడముచ్చటి రంగుల్లో కవరు తొడుగుతున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా అనేక కుషన్‌ కవర్లు, డిజైన్లు లభ్యమవుతున్నాయి.ఆఫీసైనా,ఇంట్లో డ్రాయిం గ్‌ రూం అయినా... బాల్కనీలోనో... లాన్‌లో ప్రత్యేకంగా చేయించుకున్న ఊయల అయి నా... మెత్తని కుషన్లు ఎంతలా కోరు కుంటున్నారో... వాటికి కొత్త అందాలను సంతరించుకునే లా కవర్‌ డిజైన్లపైనా అంతే మక్కువ చూపిస్తున్నారు.

కూర్చున్న కాసేపైనా కుషన్‌లలో సేద తీరేందుకు వీలుగా ఇండి యన్‌ ఫర్నీచర్‌ కుషన్‌ కవర్‌, ప్యాచ్‌ వర్కు కుషన్‌ కవర్‌, డై కుష న్‌, పింటక్‌ కుషన్‌, చౌర్‌ కుషన్‌, ఇలా చాలా రకాలు కుషన్లు అందుబాటులో ఉండగా... కవర్లలో మనకి ఎక్కువగా ఎంబ్రయి డరీ కుషన్‌ కవర్‌, సిల్క్‌ కుషన్‌ కవర్‌, సోఫా కుషన్‌ కవర్‌, కాట న్‌ కుషన్‌ కవర్‌, , డెకోరేటివ్‌ కుషన్‌ కవర్‌, లెదర్‌ కుషన్‌ కవర్‌ లభ్యమవుతున్నాయి. దీనికి తోడు రాజస్ధాని సంప్రదాయ కళలను రంగరించినవి, తెలుగింటి విరిబోణి కళంకారీ అందాలు ప్రత్యేక అందాలిచ్చేందుకు పోటీ పడుతున్నాయనే చెప్పక తప్పదు.
ఎంబ్రయిడరీ కవర్లు...
ఒకప్పుడు సూదీ దారంలో ఇళ్లలోనే తల దిండుకు తొగిగే గలేబు లకు లతలూ, పూలు వేసి అందంగా అలంకరించే వారు. అయితే నేటి ఆధునిక యుగంలో కాలంతో పాటు పరుగులు తీయా ల్సిన అవసరం ఎక్కువగా ఉండటంతో ఎంబ్రయిడరీ పనివారలకు కాసింత పని కల్పించేందుకు ఈ కుషన్‌ కవర్లు బాగా ఉపయోగ పడుతున్నాయనే చెప్పక తప్పదు. సోఫా కవర్లు, దివాన్‌ కవర్లుకు ఎవరి అభిరుచికి తగ్గట్టు వారికి అనేక డిజైన్లను కుట్టి అందిస్తు న్నారు. ఈ పని ఒకప్పుడు కుటీర పరిశ్రమగా ఉన్నా... నేడు చాలా మేరకు అభివృధ్ది చెంది వందలాది మందికి ఉపాధి చూపించేలా పరిశ్రమగా వర్ధిల్లింది.పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, శోభనం ఇలా సందర్భానుసారంగా కూడా అనేక డిజైన్లను రూపొందించి కవర్ల ను అందిస్తున్నారు డిజైనర్లు... వీటికి మార్కెట్‌లో ప్రత్యేక గిరాకీ ఉంది. ముందుగా అర్డర్లిచ్చి కుట్టించుకునే వారు కూడా అధికంగా ఉన్నారని ఎంబ్రయిడరీ యూనిట్‌ ప్రతినిధులు చెప్పారు.
పాచ్‌ వర్కు డిజైన్లు..

అనేక రకాల రంగులతో మీ డ్రాయింగ్‌ రూమ్‌ని చూడగానే ఆహ్లాద కరంగా మార్చేసే డిజైన్లు ఇవి. తెల్లని క్లాత్‌పై ఫైన్‌ ఫ్యాబ్రిక్‌తో వీటిని రూపొందిస్తారు కనుక వెలిసి పోయే ఆస్కారం తక్కువగా ఉంటుం ది.అందువల్ల వీటిపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. వివిధ కాంబినేషన్ల లో దొరికే ఈ పాచ్‌వర్కు కవర్లు తమ అభిరుచికి సరిగ్గా సరిపోతు న్నాయని పలువురు వినియోగదారులు చెప్పడం విశేషం.
సి ల్క్‌ కుషన్స్‌

కాసింత ఖరీదుగా కనిపించే ఈ కవర్లు మన్నిక లోనూబాగుంటాయి. అయితే ఇవి తక్కువ ధరలో దొరుకుతు న్నా... బోలెడు డబ్బు పోసి కొన్నారన్నపోజు మాత్రం కొట్టడం వీటి ప్రత్యేకత.

ఇవి నాణ్యమైన సిల్కుని సోఫా, దివాన్‌ కవర్లు కుట్టేందుకు వాడట మ కాకుండా వాటిపై ఫ్యాబ్రిక్‌తో అందాలకు వన్నె తెచ్చే డిజైన్లు రూపొంది స్తారు. బెడ్‌రూమ్‌లలో, లివింగ్‌ రూంలలో, ఇవి వాడుకుంటే... ఎక్కువగా మాసిపోవు. ఎక్కువకాలం మన్నుతాయి కూడా..ఈ సిల్క్‌ కుషన్లపై ఫ్యాబ్రిక్‌తో పాటు గా చిన్న చిన్న ఎంబ్రయిడరీలతో కూడి న కవర్లు కూడా ఇప్పుడు వస్తు ఆకర్షిస్తున్నాయి.
పింటక్‌ కుషన్‌

ఎదుటివారికి సైతం ఈర్ష్య పుట్టించేలా రూపొందే ఈ పింటక్‌ కుషన్సు ఎక్కువగా డైమండ్‌, సైవర్‌ ఆకారాల్లో లభ్యమవు తున్నాయి. వివిధ రకాల డిజైన్లలో, అనేక రంగుల్లో చూడ ముచ్చట గొలిపి క్లాసి కల్‌ లుక్‌తో ఉంటాయి.
లెదర్‌ డై కుషన్లు

కార్యాలయాలలో హుందాతనానికి ప్రతీ కగా ప్రత్యేకంగా రూపొందించ బడ్డ కవర్లు ఇవి. డై పద్దతిలో కొెబ్బ రి, స్పాంజ్‌ ఇలామెత్తని పదార్ధాల ను తనలో ఇముడ్చుకుని కుర్చీల ఆకారానికి తగ్గట్టు ఈ కవర్లను రూపొందిం చడం జరుగుతుంది. కంప్యూటర్ల పైన గంటల కొలదీ పనిచేసినా ఆఫీసుల్లో నిర్విరా మంగా మీటింగులు తదితర హడావిడి ఉన్నా కాసింత చేరబడితే చాలు. అన్నింటినీ మర్చిపోయే రిలాక్సు ఇచ్చే లా వీటిని తయారు చేసారు.
ఫాన్సీ కుషన్లు

రాజస్ధానీ అందాలు, గుజరాతీ సాంప్రదా య అల్లికలు, కుట్లు ఈ ఫ్యాన్సీ కుషన్లలో ఎక్కువగా కనిపిస్లాయి. పెళ్లిలలోనూ, సమావేశాలలోనూ.. పార్టీలకు వేసే ప్రత్యేక సోఫాలలోఎంతో ఆకర్షణీయంగా కని పించే... ఈ తరహా ఫ్యాన్సీ కుషన్‌ కవర్లను వాడు తున్నారు.
కుషన్ల తయారీలో ప్రత్యేక శిక్షణ
కుటీర పరిశ్రమకు ధీటుగా తయార వుతు న్న కుషన్‌ పరిశ్రమని మన రాష్ట్రంలోనూ ప్రోత్సహించేందుకు అనేక స్వచ్చంధ సంస్ధలు నడుంబిగిం చాయి.ఇప్పటికే కొబ్బరి పంట ఎక్కువగా పండే ఉభయగోదా వరి, విశాఖ, విజయనగరం, జిల్లా లతో పాటు కృష్ణ, గోదావరి నదీ పరి వాహ కాలలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పీచుతో కుషన్ల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా యి. అనేక స్వయం శక్తి సంఘాల ప్రతినిధులు కొబ్బరి పీచుతో కుషన్లు రూపొంది స్తుండ గా... మరి కొన్ని సంఘాలు వాటికి తగ్గ కవర్ల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఎంబ్రయిడరీ, లెదర్‌ తదితరాలతో కవర్లు రూపొందించి ఉపాధి పొందుతున్నారు అనేక మంది.