5, మార్చి 2011, శనివారం

12వ శతాబ్దంనాటి పాండవుల నిర్మిత ఆలయం

గోవాలోని మహాదేవాలయం 12వ శతాబ్దంనాటిది. దక్షిణ గోవాలోని తంబ్డెసుర్లాలోని అన్మోద్‌ ఘాట్‌ అడవులలో ఈ గుడి వుంది. ఈ ప్రాంతాన్ని భగవాన్‌ మహావీర్‌ అభయారణ్య ప్రాంతమంటారు. స్థానికుల కథనం ప్రకారం త్రాచుపాములు ఆ గుడిలో సంచరిస్తాయట. ఈ ప్రాంతంలో రబడానది పాయలుగా ప్రవహించి మాండోవీలో కలుస్తుంది. ఇక్కడ నెమళ్లు కానవస్తాయి. మహాదేవ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాదంబులు నిర్మించారట. శిల్ప నిర్మాణం యాదవ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దేవాలయంలో గర్భగృహం, స్థంబాల మండపం వున్నాయి. తల లేని నంది విగ్రహం కానవస్తుంది. హోయసాల, జైనుల సంస్కృతి శిల్ప సంపదలో కానవస్తాయి. కాదంబరాణి కమలాదేవి ఈ ఆలయాన్ని నిర్మించారంటారు. పాండవులు వనవాసంలో వుండగా, తొందర పడి ఈ ఆలయ నిర్మాణం చేశారనే వాదన వుంది. ఒకే రాత్రిలో నిర్మించిన కారణాన అసంపూర్ణంగానే వుందట.

తమిళ్‌ వైపు తాప్సీ చూపు

'ఝుమ్మందినాదం' సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన అందాలతార తాప్సీ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పరిచయం చేసిన నాయిక అంటే కొత్త సినిమాలు వెతుక్కుంటూ రావాలి కానీ తాప్సీకి మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. మలి చిత్రం విష్ణుతో కలిసి నటించిన 'వస్తాడు నా రాజు' సైతం నిరాశపరిచింది. తాప్సీతో పాటుగానే చిత్రరంగానికి వచ్చిన రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్‌ మాత్రం అవకాశాలు తన్నుకుంటూ పోతుండడం తాప్సీకి ఆశ్చర్యం కలిగిస్తోందట. దీంతో తన దృష్టి కేవలం తెలుగు చిత్రాలకే కాకుండా తమిళ చిత్రాలవైపు మళ్ళించింది. తమిళ అగ్రనటుడు సూర్య సినిమాలో నటించే అవకాశం తాప్సీని వరించిందని సమాచారం.

వెంకటేష్‌తో బెల్లంకొండ చిత్రం

వెంకటేష్‌ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్‌తో ఇటీవలనే 'నాగవల్లి' చిత్రాన్ని తీసిన బెల్లంకొండ ఆయనతోనే మరో చిత్రాన్ని చేస్తుండటం ఓ విశేషం. ఇక గోపీచంద్‌ మలినేనికి దర్శకుడిగా ఇది ద్వితీయ చిత్రం. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'డాన్‌ శీను' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తొలి చిత్రంతోనే హిట్‌ను కొట్టిన ఆయన ద్వితీయ చిత్రాన్ని వెంకటేష్‌ వంటి ప్రముఖ హీరోతో చేస్తున్నారు. కాగా ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

'అహనాపెళ్లంట' విజయానందం

చిన్న సినిమాలు ఆదరణ పొందితే అది పరిశ్రమకే ఆనందం. చిన్న సినిమా బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది అని అంటారు. తాజాగా విడుదలైన అహనాపెళ్లంట చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. పాతికేళ్ల క్రితం వచ్చిన జంధ్యాల అహనాపెళ్లంట ఇప్పటికీ క్లాసికల్‌ చిత్రంగా ఆదరణ పొందుతూనే ఉంది. అదే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కూడా వినోదానికి పెద్దపీఠవేస్తూ రూపొందించారు. ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా శనివారం ఫిలిం ఛాంబర్‌లో యూనిట్‌ సక్సెస్‌మీట్‌ ఏర్పాటుచేసింది. శ్రీహరి, దర్శక, నిర్మాతలు వీరభద్ర, అనీల్‌, సంగీత దర్శకుడు కుంచె రఘు, మాటల రచయిత శ్రీధర్‌, నటుడు నాగినీడు, సహదర్శకుడు సాయినాథప్రసాద్‌, డ్రాగన్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్నిచోట్ల నుండి సూపర్‌హిట్‌ టాక్‌తో సినిమా ప్రదర్శింపబడుతోందని దర్శకుడు వీరభద్ర తెలిపారు. ఇంతటి విజయం సాధిస్తుందని శ్రీహరి ముందే చెప్పారు. నరేష్‌, బ్రహ్మానందం పాత్రలు సినిమాకు బలాన్నిచ్చాయి. ఇచ్చిన మాటకోసం నిర్మాత ఈ చిత్రాన్ని రూపొందించారని ఆయన పేర్కొన్నారు.
పాజిటివ్‌ ఎనర్జీతో ఈ చిత్రం తీసినట్టు నిర్మాత చెప్పారు. శనివారం నుండి యూనిట్‌ విజయయాత్రలో పాల్గొంటుంది. వైజాగ్‌, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్‌లో ఈ యాత్ర జరుగుతుందన్నారు.
శ్రీహరి మాట్లాడుతూ వీరభద్రం వినిపించిన కథలో కొత్తదనం ఉంది. తొలుత అతడిపై నమ్మకం లేనప్పటికీ, కథ వివరించాక నమ్మకం కలిగింది. నిర్మాత చక్కగా ప్లాన్‌ చేసి చిత్రీకరణ జరిపారు. ఇతర యూనిట్‌ సభ్యులంతా పూర్తిసహకారాన్ని అందజేశారు. రీమిక్స్‌ పాటకు మంచి స్పందన లభిస్తోంది అన్నారు. ఈ సమావేశంలో మిగతా యూనిట్‌ సభ్యులంతా తమ స్పందన తెలియజేశారు.

'కారాలు... మిరియాలు' పాటలు

బ్లూరే ప్రొడక్షన్స్‌ నిర్మించిన 'కారాలు... మిరియాలు' పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాత డాక్టర్‌ డి.రామానాయుడు, ప్రసాద్‌ ల్యాబ్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ అతిథులుగా విచ్చేసి ఆడియో విడుదల చేశారు.
స్వీయదర్శకత్వంలో పసుపులేటి వెంకటరామారావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణి సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు చక్రి, నటి రత్నసాగర్‌, ప్రసన్నకుమార్‌, శివచెన్ను, రవీంద్ర పెండ్యాల, చిత్రకథానాయకుడు నవకేశ్‌, మహేష్‌రాయల్‌, రాఘవయ్య, సునీల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్‌ డి.రామానాయుడు మాట్లాడుతూ 'కొత్తవారితో, విదేశాల్లో తీసిన ఈ చిత్రం పేరు మాత్రం తెలుగుదనంతో ఉంది. రిస్క్‌తో సినిమా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. కథబాగుంటేనే సినిమా ఆదరణ పొందుతుంది. ఇలాంటి చిన్న చిత్రాలు ఇంకా రావాలి' అన్నారు.
'ఈ సినిమా యూనిట్‌ అంతా యువకులే. వారిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం ఉంది. ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది' అని రమేష్‌ప్రసాద్‌ పేర్కొన్నారు.చక్రి మాట్లాడుతూ 'ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న జంట మ్యూజిక్‌ డైరక్టర్లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. పాటలు బావున్నాయి' అన్నారు.
దర్శక, నిర్మాత పసుపులేటి వెంకటరామారావు మాట్లాడుతూ 'ఈ చిత్రాన్ని విదేశాల్లో చిత్రీకరించాం. కొత్త ఆలోచనతో తీసిన ప్రేమకథా చిత్రమిది. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది' అని చెప్పారు.
ఈ చిత్రంలో నవకేష్‌, మధుశాలిని, రత్నసాగర్‌, లండన్‌ సునీల్‌, హాలీవుడ్‌ నటుడు హ్యారీపోటర్‌ ఫేమ్‌ మైఖేల్‌గామన్‌ నటించారు.ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణి, ఛాయాగ్రహణం: మహేష్‌రాయల్‌, పాటలు; రవీంద్రపెండ్యాల.

పోటీ పడి పెరుగుతున్న బంగారం,వెండి

న్యూఢిల్లిd: ఆల్‌టైం రికార్డు స్థాయి ధరలను కొనసాగించడంలో విలువైన లోహాలు పోటీ పడుతున్నాయి. గత కొద్ది వారాలుగా బంగారం, వెండి మధ్య జరుగుతున్న ధరల పెరుగుదల యుద్ధం మరింతకాలం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం నాటి బులియన్‌ సెషన్‌లో వెండి ధర ఏకంగా 1600 పెరిగి 53,200 రూపాయల సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. స్టాండర్డ్‌ బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే 175 రూపాయలు పెరిగి 21,220 రూపాయలకు చేరింది. ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్ళిళ్ల సీజన్‌లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగోళ్ళు సంతృప్తికరంగా సాగుతున్నాయని, అందువల్లే విలువైన లోహాల ధరల పెరుగుదల కొనసాగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, వారాంతంలో డెలివరీ అయ్యే వెండి ధర కిలోకు 655 రూపాయలు పెరిగి 52,300 రూపాయలకు చేరగా, 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 175 రూపాయలు పెరిగి 21,100 రూపాయలకు చేరింది. వంద వెండి నాణాల కొనుగోలు ధర 55,800, అమ్మకం ధర 56,300 రూపాయలుగా కొనసాగింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 31 సంవత్సరాల గరిష్ఠస్థాయిలో 35 డాలర్లకు చేరింది. లిబియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతుండడం, ప్రత్యామ్నాయ పెట్టుబడులకు బులియన్‌ మార్కెట్‌ అవకాశాలను అందిస్తుండడంతో ఔన్సు బంగారం ధర 17.5 డాలర్లు పెరిగి 1432.80 డాలర్లకు పెరిగింది.

యునెస్కో గుర్తించిన దేవాలయం

వెయ్యి సంవత్సరాల క్రితం చోళుల వంశానికి చెందిన రాజరాజ చోళులు తమిళనాడులోని తాంజావూరు జిల్లాలోని పెరుఉడయార్‌ శివునిగుడిని నిర్మించారు. దీనినే బృహదీశ్వర ఆలయం అనికూడా పిలుస్తారు. ఈ మధ్య యునెస్కో ఈ దేవాలయాన్ని గొప్ప చోళదేవాలయం అని గుర్తించింది. తమిళ నాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ప్రభుత్వ లోగోకూడా దేవాలయమే. గతంలో మొఖల్‌లు, భౌముని సుల్తానులు, తురుష్కులుదాడిచేసిన దేవాలయాలు చెక్కు చెదరలేదు. బృహదీశ్వరాలయం సంస్కృతి, చిత్రకళ, శిల్పసౌందర్యం, మతం, భాషలకు పెట్టింది పేరు. చోళుల వంశం సముద్రతీరంవరకు విస్తరించింది. ఈ దేవాలయం 1010లో నిర్మితమైంది. దీని ప్రత్యేకత ఏమనగా విమాన గోపురం 2016 అడుగుల ఎత్తున వుంటుంది. ఎనిమిది టన్నులు గల స్థూపాన్ని 100 అడుగుల్లో నిర్మించారు. దీనినే 'సారపళ్ళమ్‌' అంటారు. ఒకటవ రాజరాజచోళుడు 985 నుండి 1014 వరకు పాలన చేశారు. శివుని చెంతన శాంతిని గ్రహించాడు. రాజరాజచోళుడు మిలట్రీని విస్తరించడంలో, స్థానిక వ్యవస్థను కట్టుదిట్టం చేయడంలో నేర్పరి.
బృహదీశ్వర ఆలయంలో మరొక ప్రత్యేకత నంది విగ్రహం. ఇక్కడ బృహన్నాయకి, గణపతి, సుబ్రహ్మణ్య, దక్షిణామూర్తి, నటరాజ, విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ పెయింటింగులు అందరినీ ఆకర్షిస్తాయి. 17వ శతాబ్దికి చెందిన ఈ కళాఖండాలు ఎంతో సుందరంగా వుండి ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఆలయంలోని మరొక గోడపై శ్వేత ఐరావతంపై సుందరమూర్తి నాయనార్‌, వెళ్లడం కానవస్తుంది. మరొక చోళరాజరాజ గురువైన కరువూర్‌ దేవర్‌ పెయింటింగ్‌ కానవస్తుంది.
శివుని 81 నాట్యభంగిమలను ఈ దేవాలయ ప్రాకారాలపై చూడవచ్చు. మొత్తం నాట్యశాస్త్రమే ఇక్కడ కళ్లకు కట్టినట్టు గోచరిస్తుంది. ఓ రోజు ప్రధాన స్తపతి నంది విగ్రహం తదేక దృష్టితో చెక్కుతుండగా రాజరాజ రాజువెళ్ళి ఆ స్తపతి పక్కనే నుంచొని చూస్తున్నాడు. స్తపతి తన సేవకుడే పక్కన వున్నాడని తలచి తనకు ఒక కిళ్లిdని కట్టి ఇవ్వమన్నాడు. రాజు ఇచ్చిన కిళ్లిdని స్తపతి చూడకుండానే నోట్లో వేసుకున్నాడు.
స్తపతి తన పక్కన వున్నది రాజని గుర్తించక ఈ గొప్ప నందివిగ్రహాన్ని చెక్కిస్తున్న రాజుగారిని ప్రశంసిం చాడు. తరువాత పాన్‌ తింటున్న కిళ్లిd ద్వారా వచ్చిన ఉమ్మిని ఉయ్యటానికి పాత్రను ఇవ్వమన్నాడు. రాజు ఆ పాత్రను అలాగే ఇచ్చాడు. స్తపతి దానిలో ఉమ్మివేసి రాజును చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పాదాక్రాంతుడై క్షమాపణలు వేడుకున్నాడు. రాజు స్తపతిని లేవనెత్తి కౌగలించుకొని సప్తతికి సపర్యలు చేయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నాడు.
రాజరాజుకు ఇతరమతాలపై కూడా విశ్వాసం మెండు. నాగపట్నంలోని బౌద్ధుల విహారానికి ఒక గ్రామాన్నే కేటాయించాడు. బృహదీశ్వరాలయం తమిళ శైవ సిద్ధాంతానికి ప్రతీక. శివుడు సృష్టికర్త అలాగే రక్షకుడు, ధ్వంసకుడు కూడా. కర్మ నుండి విముక్తికై శివసాయుజ్యం పొందాలన్నాడు. శివునిలో అంతర్లీనం కాక పోయినా పాదాలవద్ద బిడ్డలుగానైనా ఉండాలన్నాడు. నటరాజ విగ్రహం శైవ సిద్ధాంతానికి ప్రతీక. శైవ సిద్ధాంతంలో దేవతారాధన ముఖ్యం.
నాయనార్‌ భక్తులు శివతత్వాన్ని ప్రచారం చేశారు. సంబంధర్‌, అప్పర్‌, సుందరమూర్తి, మాణిక్య వాసగర్‌, శైవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. మాణిక్యవాసగర్‌ రాసిన తిరువాసగం ప్రసిద్ధిచెందింది.
రాజరాజచోళుడు సముద్రంలో ప్రయాణించేవాడు. అనేక ద్వీపాలను జయించాడు. యునెస్కో తంజా వూరులోని దేవాలయంకూడా హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించడం ముదావహం.
తమిళనాడు సంస్కృతి పరిరక్షణలో తలమానికం వంటిది. ఈ దేవాలయ పరిరక్షణకు అందరూ నడుంబిగించాలి.
- దండు కృష్ణవర్మ

ఢిల్లీ నుండి కేసీఆర్‌ ఎందుకొచ్చేసాడో?

ప్రత్యేక తెలంగాణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీని పార్లమెంట్‌లో నిలదీయాలని.. తెరాస అధినేత కేసీఆర్‌పై తెలుగుదేశం శాసనసభా పక్షం తీవ్ర స్ధాయిలో విరుచుకు పడింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శనివారం మీడియాలో మాట్లాడుతూ....తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

తెలంగాణా ఇచ్చేది కేంద్రమే అయినప్పుడు..అక్కడ నిలదీసి తెలంగాణా సాధించుకు వస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ సోనియా ఇంటి ముందు కూర్చొనకుండా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా పోరాటాలు చేస్తాం అనియూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లాలూచీపడి, కుమ్మక్కై కేసీఆర్ ఢిల్లీ తిరిగి వచ్చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీసారు.

సహాయ ‘నిరాకరణ”కు మేం ఒప్పుకోం

ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాల మేరకు సహాయ నిరాకరణని తాత్కాలికంగా నిలపి వేసున్న తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించడం పట్ల ఆదిలాబాద్‌ ఉద్యోగ సంఘాల నేతలు విరుచుకు పడుతున్నారు.
ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఏక పక్ష నిర్ణయాలు తీసుకుని జేఏసీ నేతలు లాలూచీ పడి సహాయ నిరాకరణని విరమింప చేసారని ఆరోపించారు. తెలంగాణా ఉద్యోగ జేఏసీతో సంబంధం లేకుండా తాము ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని... తెలంగాణా వచ్చే వరకు తమ జిల్లాలో సహాయ నిరాకరణ కొనసాగుతుందని తేల్పి చెప్పారు.

అబ్బే! నేను పోటీ చేయట్లే....

తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు వసున్న కధనాలను ఖండించారు పిసిసి ఛీఫ్‌ డి.శ్రీనివాసరావు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ...... ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కావాలని తాను అధిష్టానవర్గంని కోరలేదని, బరిలో తాను లేనని స్పష్టం చేశారు తన భవిష్యత్'ని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా నిర్ణయిస్తారని చెప్పారు.
కడప జిల్లాలో తెలుగుదేశం పార్ధీకి చెందిన వారితో రాష్ట్ర మంత్రులు సమావేశమై విందు రాజకీయాలు నడపడం ఆశ్చర్యమేమీ లేదని... వారికి బలంలేదు... ఆ స్ధానంలో తమ అభ్యర్ధికి ఓటు వేయించాల్సింది కోరటంలో తప్పేముంది.రాజకీయాలలో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరని, ఎన్నికలలో గెలుపు కోసం ఎవరి సహాయమైనా కోరవచ్చునని..దీనిని కొందరు అనవసర రాధ్ధాంతం చేస్తున్నారని జగన్‌ వర్గాన్ని ఎత్తి పొడిచారు డి.శ్రీనివాస్‌.

కాంగ్రెస్‌ - డిఎంకెల మధ్య సీట్ల చిచ్చు

తమిళనాట కాంగ్రెస్‌ - డిఎంకెల మధ్య ఎన్నికల అవగాహన చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వానికి ఎసరు పెట్టినట్లు ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధిక సీట్లు కేటాయించాలనటం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.

ఈనేపథ్యంలో కరుణానిధి శనివారం మీడియాతో మాట్లాడుతూ డీఎంకె-కాంగ్రెస్‌ల మధ్య ఇంకా సీట్ల సర్థుబాట్లు పూర్తి కాలేని..తగినంత బలం లేకుండా ఎక్కువ సీట్లు ఆశించడం న్యాయం కాదన్నారు. కాంగ్రెస్ వైఖరి ఇలాగే కొనసాగితే కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటామని కరుణ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అది శాసనసభ? సీమాంధ్ర సభ? : తెరాస

తెలంగాణ సభ్యులు లేకుండా శాసనసభా సమావేశాలను నిర్వహించుకుంటున్నారని, అది సీమాంధ్ర శాసనసభగా నడుస్తోందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు కాపాడుతున్నారని..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి..సమైక్యాంధ్ర కుట్ర చేస్తున్నారని, ఇద్దరు కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కుమ్మక్కులో భాగంగానే కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారని, తెలుగుదేశం నాయకులు తమ ఎంపిటీసీ సభ్యులను కాంగ్రెసుకు అప్పగిస్తున్నారని, రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు వెళ్తున్నారని..ప్రజా ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిరెడ్డికి ముఖ్యంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు

నిన్న రాత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన సీమంధ్ర, తెలంగాణా తెలుగుదేశం ఎమ్మెల్యే ల సమావేశం ఫలితాలనిచ్చింది. ప్రతిరోజూ అసెంబ్లీని స్తంభిపచేయటం ద్వార ప్రజల్లో చెడ్డపేరు రావటమే కాకుండా... అధికార పార్టీ తప్పిన్చుకొనేందుకు అవకాశం ఇస్తున్నామని, ఇప్పటికే ఉద్యోగులు సహాయ నిరాకరణను విరమించటంతో సమావేశాలు సజవుగాజరిగేల అంతా హాజరు కావాలని బాబు తేల్చి చెప్పడంతో నిన్నటి వరకు అసెంబ్లీని భహిష్కరించిన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

మిలియన్ మార్చ్ వాయిదా?

ఈ నెల పదవ తేదీన తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ మిలియన్ మార్చ్ ఆందోళనను వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారమ రాత్రి వరకు పలుమార్లు సమావేశమైన నేతలు మోడి పట్టుదలకి పోయి విద్యార్థుల జీవితాలతో అడుకొంతున్నమన్న అపప్రద తెచ్చుకొనే కన్నా పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులతో ‘చలో సెక్రటేరియట్’ నిర్వహించ డమే మంచిదని చెప్పడంతో. వాయిదా విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే యుద్యోగు లు సహాయనిరాకరణ విరమించుకోవటం, మిలియన్ మార్చ్ పై హై కోర్ట్ నోటీసులు జారీచేయటం కూడా జెఎసి పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది.