30, ఏప్రిల్ 2011, శనివారం

తెలంగాణ ఏర్పాటుకుసీమాంధ్రులు రెడీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మెజార్టీ సీమాంధ్ర ప్రజలు, ప్రజా ప్రతినిధులు సిద్దంగా ఉన్నారని.. ఐతే కొంతమంది స్వార్థ సీమాంధ్ర రాజకీయ వ్యాపారుల కుట్రల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జాప్యానికి కారణమవుతోందని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథ్ అన్నారు.మీడియాతో ఆయన మాట్లాడుతూ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తీ కాగానే డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి జూన్ నెలాఖరుకి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. హైద్రాబాద్ రాజధానిగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉంటుందని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ఆయన ఉద్ఘాటించారు.

తననెవ్వ రూ శాసించలేరు : నాగం

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా తననెవ్వ రూ శాసించలేరని, ప్రజల ఆకాంక్ష మేరకే ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాను తప్ప తన స్వార్థం ఎంతమాత్రం లేదని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. శని వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మే9న టీడీపీ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీలకతీతంగా హాజరు కావాలని కోరారు. పదే పదే తెలంగాణ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం వల్లనే ఉద్యమానికి భంగం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

ఉద్యమ లక్ష్యాన్ని చాటడానికే ప్రజాభియాన్ యాత్ర

తెలంగాణ వాదాన్ని ప్రతి పల్లెకు చేర్చి ప్రతి ఒక్కరికి ఉద్యమ లక్ష్యాన్ని చాటడానికే ప్రజాభియాన్ యాత్రను చేపట్టినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శనివారం తన మూడో రోజు యాత్రని ప్రారంభిస్తూ.. జూన్ మాసం చివరి కల్లా ఎటూ తేల్చక పోతే తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నా రు. తెలంగాణ కోసం ఆరువందల మంది విద్యార్థుల ప్రాణత్యాగం కన్నా, ఈ పదవులు ముఖ్యం కాదని మంత్రి వ్యాఖ్యానించారు

పేరుకే దేశానికి స్వాతంత్రం వచ్చింది

దేశానికి పేరుకే స్వాతంత్రం వచ్చిందని... నేటికీ పూర్తిస్థాయిలో స్వేచ్ఛ లభించలేదని, అవినెతి మయమైపొఇన వ్యవస్థ కారణంగా అందని స్వాతంత్ర ఫలాలను సాధించుకునేందుకు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్దం కావాలని పిలుపు నిచ్చారు అన్నాహజారే .. శనివారం అవినీతికి వ్యతిరేకంగా పూణేలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీ మేరకు నిర్ణీత సమయంలో జనలోక్‌పాల్‌బిల్లు పార్లమెంట్ లో పాస్ కాకపోతే మరోసారి జంతరమంతర్ వద్ద దీక్షకు ప్రజలు సిద్ధంకావాలని అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం పడాలన్నారు.

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

జగన్ తో మా పొత్తు ఉండదు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తో పొత్తుకు తహ తహలడుతూనదంటూ వస్తున్న కధనాలు వాస్తవం కాదని బీజేపీ జాతీయ నాయకుడు ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్-టీడీపీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయ ని... దాని మరుగున పరిచేందుకు వైఎస్ జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మైనారిటీలకు పది శాతం రిజర్వ్ వేష న్స్ కలిపిస్తామంటే బెజెపి తో జత కడతామని జగన్ చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు

రాజకీయాలని శాసించాలని చూస్తున్న జగన్

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని...డి.ఎల్‌.రవీంద్రారెడ్డిని ఎంపిగా, వైఎస్‌ వివేకానంద రెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గె లుస్తారని రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్స్ పార్టీ పటిష్టం గా ఉన్న కడప పార్లమెంట్‌, పులివెందుల శాసనసభ ఎన్నికలు రావాల్సిన అవరమంతా ధన బలంతో విర్రవీగుతూ.. రాజకీయాలని శాసించాలని చూస్తూ.. పదవీకాంక్ష తోనే జగన్‌ ఎన్నికల ను ముందుకు తీసుకు వచ్చారన్నారు. ధనంతో ఓటర్లను కొనే రోజులు పోయాయని , ఇన్నాళ్ళు తమకు అండగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకొంతారని... ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధనంతో ఓటర్లను కొనే రోజులు పోయాయని అన్నారు.

జగన్‌ ఓటమే... వైఎస్‌ కుటుంబ దోపిడికి అడ్డు కట్ట..

కడప జిల్లా పులివెందులలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, అక్కడి ప్రజలు ఇప్పటికీ దోపిడి రాజ్యంలోనే మగ్గుతున్నారని, వీటిని అరికట్టాలంటే వైఎస్‌ తనయుడు జగన్‌ను ఓడించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిలుపునిచ్చారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుటుంబం, బంధువర్గం ఓ వంద మంది మాత్రమే కోట్లాది రూపాయలు ఆర్జించారే కానీ అక్కడి ప్రజల జీవితాలు మాత్రం దుర్భరమయ్యాయని ఆరోపించారు.
పులివెందులలో వైఎస్‌ కుటుంబాన్ని ఎదురిస్తే ప్రాణాలతో మిగలరని, అక్కడి జనం భయాందోళనల్లోనే బతకాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆయన చెప్పారు.

ఉద్యమ పోరాట స్వరూపాలను చూపే 'పోరుతెలంగాణ '

ప్రత్యేక తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న, ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఆత్మీయంగా వీడిపోవాల్సిన అవసరం ఉందని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. విద్యార్ధులు ఆత్మబలిదానాల తో తెలంగాణా రాదని.. బతుకి ఉండి పోరాటం చేస్తే తెలంగాణ సాధ్యమవుతుందన్న దే తన పోరుతెలంగాణ సినిమా ద్వారా చెప్తానని చెప్పారు. 1952 నుండి జరుగుతున్న తెలంగాణ ఉద్యమ వివిధ దశల పోరాట స్వరూపాలను ఆనాటి ముల్కి ఉద్యమం నుండి నేటి తెలంగాణ పోరాటం వరకు అన్ని విధాలా దృశ్యాలను ఈ చిత్రంలో చూపెట్టనున్నాnani నారాయణ మూర్తి చెప్పారు.

'నగరం నిద్రపోతున్న వేళ' ఆడియో విడుదల

‘నగరం నిద్రపోతున్న వేళ’ చిత్రం ఆడియో హైదరాబాద్‌, శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప ఆడియో సీడీలను విడుదల చేసి, తొలి సీడీని హీరో జగపతిబాబుకు అందజేశారు. ఈ వేడుకలో కథానాయిక చార్మి, తిప్పేస్వామి, నటుడు బాబూమోహన్‌, సహ నిర్మాత టేకుల ముక్తిరాజ్‌, దర్శకులు సాగర్‌, చంద్రసిద్ధార్థ, కాశీవిశ్వనాథ్‌, చంద్ర మహేష్‌, రాంప్రసాద్‌, గీత రచయితలు సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్‌, ఆదిత్యా మ్యూజిక్‌ దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

28, ఏప్రిల్ 2011, గురువారం

కడుపులు కాలడంతోనే జనం తిరుగుబాటు

 తెలంగాణ ఉద్యమం ఇంత జోరుగా సాగుతున్నాఆంధ్రా వలసవాదుల దోపిడీ కొనసాగుతూనే ఉందని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ ధ్వజమెత్తారు. అమరవీరుల ఆత్మ శాంతించాలంటే వారి ఆశయసాధనకోసం ఉద్యమించాల ని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.బొగ్గు, నీళ్ళు, గుట్టలు, ఇసు క, కలప తదితర సంపద తరలిపోతూ తమ కడుపులు కాలడంతోనే జనం తిరుగుబాటుచేసి వేరు తెలంగాణ కావాలంటున్నారన్నారు. ఇన్నేళ్ళ పోరులో సమైక్యవాదులు సంపన్నులైతే తెలంగాణ ప్రజలకు గోరీలే మిగిలాయని పేర్కొన్నారు. చిన్నరాష్ట్రాలను ఇచ్చిన బీజేపీ ఎవరో అడ్డుతగిలితే తెలంగాణను ఇవ్వలేదని, అలాగని మనం బోర్లా పడమని, ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించుకునేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఠాగూర్ 150వ జయంతి కి కొత్త ఐదు నాణెం

రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని త్వరలో   కొత్త ఐదు రూపాయల నాణెం  విడుదల చేయనున్నట్లు రిజర్వ్‌బ్యాంకు సమాచార కార్యాలయాధికారి   తెలిపారు.ఈ నాణెంలో ఒక వైపు అశోక స్థూపంలోని నాలుగు తలల చిహ్నం, కింద ఐదు రూపాయలు అని ముద్రించబడి ఉంటుం ది. మరో వైపు రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ ఉంటుంది. దీని కింద రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతిని గుర్తించే రీతిలో 1861 - 2011 అని ఉంటుంది.


గవర్నర్ పదవికి ఇక్బాల్ సింగ్ రాజీనామా?

నల్లధనం కేసులో అరెస్టయిన హసన్ అలీకి పాస్‌పోర్ట్ ఇప్పించిన వ్యవహారంలో ఇరుక్కుపోయిన పుదుచ్చేరి గవర్నర్ ఇక్బాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.  ఆయనపై పుదుచ్చేరిలో రోజుకో ఆరోపణ వస్తుండడంతో పాటు బుధవారం బంద్ సైతం జరగడం ఆయన్ను కాస్త ఆవేదనకు గురిచేసినట్టు తెలిసింది. పదవి నుంచి తప్పుకుని తనపై వచ్చిన అభియోగాలను ఎదుర్కొనేందుకు ఇక్బాల్ సింగ్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

నేడు, రేపు బాబా మహాసమాధి దర్శనం

నిన్న జరిగిన సత్యసాయి బాబా మహా సమాధిని చూసేందుకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు సత్య సాయి ట్రస్ట్ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో భక్తులు దర్శించుకోవచ్చని ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను అనుమతిస్తా మని వారు తెలిపారు.

పెళ్లి కొడుకైపోతున్న 'ఆవారా' కార్తి

టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్. ఒక్కో హీరోకీ పెళ్లి జరుగుతోంది. ఇప్పుడీ ట్రెండ్ కోలీవుడ్ కి కూడా పాకుతున్నట్టుంది. ఆమధ్య తమన్నాతో ఎఫైర్ నడుపు తున్నాడంటూ వార్తలు పుకార్ల ప్రచారం తో తబ్బి ఉబ్బి పోయిన కార్తీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నాడు.
ఐతే తమన్నా తో మాత్రం కాదు లెండి.. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటూ నొక్కివక్కనిస్తున్నాడు. హీరో సూర్య సోదరుడిగా వెండితెరకొచ్చిన కార్తి 'యుగానికొక్కడు', 'ఆవారా' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర య్యాడు.
కార్తి పెళ్లి విశేషాలని ఆయన తండ్రి, ప్రముఖ నటుడు అయిన శివకుమార్ మీడియాకి వెల్లడిస్తూ.. జూలై 3 న ఈరోడ్ కు చెందిన రంజనితో కార్తి చెప్పారు. పెళ్లి జరుపడానికి ముహూర్తాన్ని పెట్టినట్లు చెప్పారు.

26, ఏప్రిల్ 2011, మంగళవారం

నా ఆత్మహత్యనే 'నేనూ..నా రాక్షసి' కి మూలం

పూరి జగన్నాధ్‌ తాజాగా రూపొందించిన చిత్రం 'నేను... నా రాక్షసి' కథ వెనుక ఓ రియల్ స్టోరీ వుందట. ‘ఏ సమస్యకైనా ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదు’ అనే కాన్సెప్ట్‌తో దీనిని రూపొందిం చిన పూరి జగన్నాధ్‌ వ కధకు మూలం..ఆమధ్య భారీ నష్టాలతో ఆర్ధికంగా బొక్క బోర్లా పడ్డ పూరి అప్పులపాలై చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. అయితే, ఓ తెలియని వ్యక్తీ చెప్పిన మాట విని.. ఆలోచించి ఆ ప్రయత్నాన్ని విరమించుకు న్నాడట... పరిస్తితి తట్టుకుని నిలబdutoo.. తరువాత సక్సెస్‌లు సాధిస్తు.. ఇప్పుడు అప్పుల ఊబి లోంచి బైట పడ్డాడట. ఇలా... తన అనుభవంలోంచి కధనే కాస్త తనదైన స్త్య్లేలో మసాలాలు దట్టించి జనామీదికి వదులు తు 'నేను..నా రాక్షసి' అనే టైటిల్‌తో సినిమాగా మార్చాడ ట. అదండీ విషయం

శరవేగంగా రెడీ అవుతున్న 'బబ్లూ'

ఎస్‌.పి.జె. క్రియేషన్స్‌ పతాకంపై రవిచరణ్‌రెడ్డి దర్శకత్వంలో మనోతేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ, అదితీశర్మ కథానాయికగా గూడూరు శివరామకృష్ణ నిర్మిస్తున్న 'బబ్లూ' చిత్రం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ వారంలో ఆడియోను విడుదల చేస్తామని చక్కటి కమర్షియల్‌ అంశాలు కలగలిసిన ప్రేమకథాచిత్రమిదని నిర్మాత శివరామకృష్ణ తెలిపారు. చక్రి సంగీతం ఓ హైలైట్‌ అని, మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

పునీత్‌ హీరోగా 'పృథ్వి ఐ.ఎ.యస్‌.'

తెలుగులో 'పండుగాడు, జాకీ'గా పరిచయమైన పునీత్‌రాజ్‌కుమార్‌ ఐఎయస్‌ అధికారిగా నిజాయితీ పరుడైన జిల్లా కలెక్టర్‌ అక్రమ మైనింగ్‌ను ఎలా అరికట్టాడు, ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన అనుభవాలేమిటీ? అనే కథాంశంతో 'పృథ్వి ఐ.ఎ.యస్‌.' చిత్రం రూపొందింది. గత సంవత్సరం కన్నడంలో 'పృథ్వి' పేరుతో విడుదలై ఘనవిజయం సాధిం చిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు.
పునీత్‌రాజ్‌కుమార్‌, సరసన నటించారు. మళయాలం, కన్నడలో పేరొందిన పార్వతిమీనన్‌ నాయికగా నటించింది. మణికాంత్‌ కద్రి సంగీతం అందించారు. జాకప్‌ దర్శకత్వంలో కన్నడంలో రూపొం దిన చిత్రాన్ని తెలుగులో రాజేష్‌ ఫిల్మ్‌ 'పృథ్వి ఐ.ఎ.యస్‌.' పేరుతో అనువ దిస్తోంది.

'తేడా'..'మాడా'..ల తర్వాత 'థర్డ్‌మ్యాన్‌'

నూనూగు మీసాలు మొలిస్తే మగాడు, నాజూకు జడవుంటే ఆడది. అదే నూనూగు మీసాలు, నాజూకు జడ ఒక్కరిలోనే వుండటం సాధ్యపడుతుందా... సృష్టికి విరుద్ధమైనా అది సాధ్య అని 'థర్డ్‌మ్యాన్‌' (బొమ్మాకాదు బొరుసూ కాదు) అనే కొత్తకథాంశంతో నిరూపించబోతున్నామని ధన్వంతరి క్రియేషన్స్‌ అధినేత లక్ష్మయ్యచారి తెలిపారు. ఆడది, మగాడు కాని వాణ్ణి కొందరు 'తేడా' అంటారు. మరికొందరు 'మాడా' అంటారు. కానీ ఈ చిత్రం తర్వాత వారిని 'థర్డ్‌మ్యాన్‌' అంటారని, ఆ పేరు ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి పేరు తెస్తుందని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఇంద్రమోహన్‌ తెలిపారు. కథ, కథనాల విషయాల్లో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా, ముంబాయి, వారణాసి, గంగానది తీరాల్లో నిజమైన హిజ్రాలతో, అఘోరాలతో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో చిత్రీకరణ జరుపుతామన్నారు. లవ్‌, యాక్షన్‌ సెంటిమెంట్‌ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: పోలూర్‌ ఘటికా చలం, పాటలు: రామ జోగయ్యశాస్త్రి, బిక్కికృష్ణ కథ, దర్శకత్వం: ఇంద్రమో హన్‌, సమర్పణ: పార్వతమ్మ కె., నిర్మాత: కె.లక్ష్మయ్యచారి.

పోసాని 'నిత్య పెళ్ళికొడుకు' కేరాఫ్ జగదంబ సెంటర్ .. సెన్సార్ కట్స్

పోసాని కృష్ణమురళి టైటిల్‌ పాత్ర పోషించిన నిత్య పెళ్ళికొడుకు చిత్రంలో గౌరీపండిట్‌, అంజలి, భావన, శివాజీరాజా ముఖ్య పాత్రధారులు. సెవెన్‌ హిల్స్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన జి.వి.సుబ్బయ్య నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు అళహరి.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 27-1-2011న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. మొదటి రీల్‌లో చిత్రీకరించిన దృశ్యంలో గల 'మీ ఫ్రంట్‌ ఒరిజినలా ప్యాడింగా, మీ బ్యాక్‌ ఒరిజనలా ప్యాడింగా' అనే వాక్యం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

2. మొదటి రీలులోనే మరో దృశ్యంలో 'అమ్మాయిలకు అబ్బాయిలు కావాలి... వాళ్ళకు కూడా జిల్‌ వుంటాది' అనే డైలాగ్‌ తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

3. మూడవ రీలులో పెదవితో పెదవి కలిపి శిరీషను ముద్దాడే దృశ్యాన్ని తొలగించడం వల్ల 4.12 అడుగులు ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

4. నాల్గవ రీలులో 'ముమైత్‌ ఖాన్‌' అని ఎక్కడ వచ్చినా అది వినబడకుండా తొలగించమన్నారు.

5. నాల్గవ రీలులోనే చిత్రీకరించిన ఓ సన్నివేశంలో భార్య స్వచ్ఛతను పరీక్ష చేసే మొత్తం దృశ్యాన్ని, హీరో అతని స్నేహితుడు మధ్య జరిగిన సంభాషణని శబ్దంతో సహా తొలగించారు.

6. రెండవ రీలులో నీటి జల్లులో రస్న, శిరీష పెదవి పెదవి కలిపి ముద్దాడే దృశ్యాన్ని తొలగించడం వల్ల 2.14 అడుగుల ఫిలిం కత్తెర పాలయింది.

7. ఏడవ రీలులో డ్రగ్స్‌ వాడంకి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 30.09 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

8. ఏడవ రీలులో పబ్‌లో హీరో, ఐశ్వర్య పాల్గొనగా చిత్రీకరించిన డ్యాన్స్‌ని తొలగించి ఫ్లాష్‌లా చూపమన్నందున 46.09 అడుగుల ఫిలిం కత్తెర పాలయింది.

9. ఏడవ రీలులోని ఐటమ్‌సాంగ్‌లో ఎక్స్‌పోజింగ్‌లో కూడిన క్లీవేజ్‌ దృశ్యాలను తొలగించడం వల్ల 60.04 అడుగుల ఫిలిం కత్తిరించబడింది.

10. పదకొండవ రీలులోని 'మగాడు మానసికంగా శారీరకంగా వ్యభిచారం చేస్తాడు' అనే డైలాగ్‌ శబ్దంతో సహా తొలగించారు.

11. పదమూడవ రీలులోని 'లంగాగాడు, లుచ్చాగాడు పదాలను తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

12. పన్నెండవ రీలులోని 'పక్కలో పడుకున్నావా', 'పిచ్చి నా కొడకా', 'బ్రోకర్‌ వెధవా', 'బుడ్డే కె బాల్‌' పదాలను తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

13. 14వ రీలులో ఆహుతయ్యే దృశ్యాలను సగానికి తగ్గించడం వల్ల 18.07 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

14. పన్నెండవ రీలులో గల 'ఆ చీర చింపింది నేను, నేనే కట్టుకుంటానంటే వద్దంటారేంటి?' డైలాగ్‌ని తొలగించి శబ్దం వినరాకూదన్నారు.

15. రెండవ రీలులో చిత్రీకరించిన 'బాబూ అక్కడ చెయ్యి పెట్టకూడదు రెస్ట్రిక్టెడ్‌ ఏరియా' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

16. తొమ్మిదవ రీలులో చిత్రీకరించిన దృశ్యంలో 'అక్కుం బక్కుం లేదా' అనే డైలాగ్‌ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

మొత్తం మీద 16 కట్స్‌లో 163.07 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది. 14 రీళ్ళ నిడివిగల 'నిత్య పెళ్ళికొడుకు' 11.3.11న విడుదలయింది.

బాబా మహాసమాధికి రంగం సిద్ధo

పుట్టపర్తి సత్య సాయి బాబా మహాసమాధికి రంగం సిద్ధమైంది. బాబా పార్థివదేహాన్ని సమాధి చేయడానికి వీలుగా కుల్వంత్ హాల్‌లో అన్ని ఏర్పాట్లూ చేశారు. ఏడు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుగల విస్తీర్ణంలో సమాధిని సిద్ధం చేశారు. బాబా అంత్యక్రియలకోసం పుణ్య నదీ జలాలు, ప్రత్యేక పట్టు వస్త్రాలు తెప్పించి ఉంచారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు బాబా మహా సమాధి కార్యక్రమం పూర్తి అవుతుంది.

చిరంజీవి మాట్లాడితే నైతికతా.. ?

రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబునాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించింది చంద్ర బాబేనని జగన్ సమపదిన్చిన్డానికి ప్రతిదీ లేక్కలున్నాయని, ప్రభుత్వానికి న్యాయ పరంగా చెల్లించిన విషయం తెలుసుకోవల్లన్నారు.
రాజకీయ్యాల్లో నైతికత విలువలకు తిలోదకాలిచ్చిన కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ పార్టీల న్ని daani గురించి మాట్లాడే హక్కు ఏనాడో కోల్పోయయని వ్యాఖ్యానించారు. వైఎస్ తిక్కట్లిచి, గెలిపించుకొన్న ఎమ్మెల్యేలు జగన్ వెంట తిరిగితే అనైతికతా...?, కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోసిన చిరంజీవి మాట్లాడితే నైతికతా.. అని సూటిగా ప్రశ్నించారు.

సిగ్గు, లజ్జ ఉంటె తక్షణం రాజీనామా చేయండి

ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలో తిరగడం నైతిక కాదని... తమ కాంగ్రెసు తరఫున గెలిచి వైయస్సార్ కాంగ్రెసులో తిరుగుతున్న శాసనసభ్యుల కు సిగ్గు, లజ్జ ఉంటె తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని మంత్రి రఘువీరా రెడ్డి డిమాండ్ చేసారు. మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ పథకాలను తాము నిలిపేస్తున్నట్లు జగన్ ప్రచారం చేసుకొంటూ రాజకీయాలు నడుపుతున్నాడని ఎక్కడా వాటి అమలు ఆగలేదని, ఉప ఎన్నికల వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.

అస్సోంలో అధికారం మాదే : గడ్కారీ ధీమా

అస్సోం రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తున్నట్టు తమ పార్టీ విజయం సాధిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళ వారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అస్సోంలో తమ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుంద ని, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం దేశం రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల తో తమ పార్టీ పటిష్టత మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసారాయన.

దమ్ముంటే మీరంతా రాజీనామా చేయండి

వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులకు ఆ పార్టీ ఫిర్యాదు మేరకు స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీ నేపథ్యంలో వైయస్ ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ ల మధ్య రాజీనామాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు జోరందుకున్నాయి.
మంగళ వారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్స్ పార్టీకి దమ్ముంటే తన శాసన స్భులందరి తో రాజీనామా చేయించి మళ్ళి ఎన్నికలకి సిధం కావాలని అన్నారు. రాజీనామా చేసే కాంగ్రెసు పార్టీ నాయకులు సోనియా ఫొటోతో పోటీ చేయాలని, తమ పార్టీ వైయస్సార్ ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని, ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నారు. కడప ఎన్నికల ఫలితాలే కాంగ్రెసుకు సమాధానమిస్తాయని ఆయన అన్నారు.

గెస్ట్ రోల్స్ కి పరిమితమై పోతున్న నితిన్

ఈ మధ్య సరైన సినిమాలు లేక, ఉన్నా అవి సక్సెస్ జేక.. చాటికిల్ల పడ్డ హీరో రేసులో బాగా వెనుకపడిపోయిన నితిన్ ఇప్పుడు పాత్ర దొరకడమే అరుదనుకోతున్నాడూ ఏమో.. సెకండ్ హీరో గా కూడా రెడీ ఐపోతున్నాడు. పవన్ సినిమాలో రెండూ పాత్రనే పోషించేందుకు సిద్దమైన నితిన్ ఇప్పుడు ప్రభాస్ కథానాయకుడుగా రాజమౌళి రూపొందించే సినిమాలో ఓ ముఖ్య పాత్రకు సెలెక్ట్ అయినట్లు సమాచారం.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో 'సై' సినిమా లో నితిన్ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం గెస్ట్ రోల్ అని తెలుస్తోంది.. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఈ చిత్రం 'ఈగ' సినిమా పూర్తయ్యాక ప్రారంభిస్తాడు.

నాగ ప్లేస్ లో అల్లు అర్జున్‌కి చోటిచ్చిన దశరథ్

ఈ మధ్యనే దర్శకుడు దశరథ్ ప్రభాస్ తో రూపొందించిన 'మిస్టర్ పెర్ ఫెక్ట్' హిట్ టాక్ తెచ్చు కావటంతో.. కాస్త గాప్ లో తన తదుపరి చిత్రం కోసం ప్లాన్ చేసుకుంటున్నడట . ఐతే గతంలో ఈ చిత్రాన్ని నాగార్జునతో రూపొందించాలని భావించినా.. ఇప్పుడు తాను అనుకున్న కధకి నాగ్ కన్నా అల్లు అర్జున్‌ అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట. దీంతో ఇటీవల దశరథ్ అర్జున్ ని కలసి కథ చెప్పడం జరిగిందట. కధ పక్కగా ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గుతున్నట్లు వుందని దీన్ని మార్చుకొంటే చేయటానికి అబ్యంతరం లేదని అర్జున్‌ చెప్పాడట. ఏది ఏమైనా వీరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్క డం ఖాయమని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల సమాచారం.

దాసరి 'రామ సక్కని తల్లి' అనుష్క?

బాలకృష్ణతో తీసిన 'పరమ వీర చక్ర' బాక్సాఫీసు ముందు పల్టీ కొట్టడంతో ఈ మధ్య ఒసేయ్...రాములమ్మా' రేంజ్ లో విజయశాంతి తో ఓ చిత్రానికి ప్లన్చేసాడు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు.

. త్వరలో మరో భారీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తునే 'రామ సక్కని తల్లి' అనే టైటిల్ ను చేశారు. అయితే, దాసరి వ్యవహారం ఇబ్బందులు గా ఉండటంతో.. విజయ శాంతి.. ఈ సినిమాకి నో చెప్పేసిందట దీంతో నేటి యంగ్ హీరోయిన్ తో ee చిత్రాన్ని దాసరి రూపొందించాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో అనుష్క నటించే అవకాశం వుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

కడపలో ధనం ఏరులై పారుతోంది.

లోక్‌పాల్ బిల్లును కుందిo చాలని   చూడటం దుర్మార్గమైన చర్య అని..  బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్‌లనూ తీసుకురావాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం త్రిశంకు స్వర్గంలో వే లాడుతోందన్నారు.చట్టాలు, బిల్లుల ద్వారా అ వినీతి నిర్మూలన సాధ్యం కాదన్నారు. అవినీతి ఎజెండాతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రచారాలు చేపడతామన్నారు.భారతదేశంలో ఏ పార్లమెంటు ఎన్నికలకు ఖర్చు పెట్టని విధంగా కడపలో ధనం ఏరులై పారుతోందని నారాయణ ఆరోపించారు.  ఎన్నికలు పేరు చెపితేనే భయపదీలా ఈ ఎన్నికల్ని మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసారాయన.

23, ఏప్రిల్ 2011, శనివారం

బొమ్మరిల్లు బాణిలో నడిచిన మిస్టర్ ఫెరఫెక్ట్.


బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: ప్రభాస్,తాప్సీ,కాజల్ ,ప్రకాష్ రాజ్,కె విశ్వనాధ్,నాసర్,బ్రహ్మానందం,రఘుబాబు తదితరులు.
కూర్పు: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ: విజయ్ కే చక్రవర్తి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం:దశరధ్

తన ఫార్ములాని తానీ ఫాలో అవుతూ ప్రేక్షకులు బాగా నచ్చిందని మెచ్చుకుని హిట్టు చేసారనే నెపంతో మళ్ళి అదే ఫార్మె లాకి కాస్త డోస్ పెంచి దిల్ రాజు నిర్మించిన చిత్రమే మిస్టర్ ఫెరఫెక్ట్.
ఇంతకీ కదేమిటంటే ..
దేనికీ రాజీపడని వ్యక్తిత్వం ఉన్న విక్కి(ప్రభాస్) ఈవ్యక్తి అయినా తనకోసం,తన సంతోషం కోసమే బ్రత కాలి... ఇతరులకూసం తన ఇస్తాలని మార్చుకో కూడదనే మనస్తత్వం. ఆస్ట్రేలియాలోఉండే విక్కీ ఓ సారి చెల్లి పెళ్ళికోసం ఇండియా వస్తాడు. ఇక్కడ విక్కి తండ్రి తన మిత్రుడు కూతురు ప్రియ(కాజల్) తో పెళ్లి చేయాలనీ భావిస్తారు.
ప్రియ తనకి చిన్ననాటి స్నేహితురాలు కూడా కావడంతో విక్కి అంగీకరించినా.మనం ప్రతీ సినిమాలో చూసినట్లే వ్యతిరేకమైన భావాలు గల వ్యక్తిత్వం ఈ హీరొయిన్ద్ర. మొదట విక్కీ వ్యవహారం నచ్చక చిరాకు పడ్డా తర్వాత నెమ్మదిగా ఆయన గారి ప్రేమలో పడ టమే కాక ఆయన గారి కోసం తన ఆలోచనలను,అలవాట్లను, చివరకి తను ఊహించుకొన్న జీవితాన్ని మార్చేసుకోవటానికి కూడా సిద్దపడుతుంది.

తనకోసం నీ ఇష్టాలు మార్చుకోవడం అంటూ ప్రియతో విభేదించిన విక్కీ ...ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు ఉండాలి వేరొకరి కోసం మన ఇష్టాలు మార్చుకుంటే పోతే చివరకు మనకంటూ ఏదీ మిగలదు అని పెద్ద క్లాస్ పీకి ప్రియకు గుడ్ బై చెప్పేసి వచ్చిన దారినే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు.

అక్కడ తనలాంటి ఆలోచనలతోనే ఉన్న మ్యాగి(తాప్సి) తారస పడుతుంది .. ఒకరినొకరు ఇస్తా పడతారు. డేటింగ్ కు సిద్దపడతారు. మరి ఇండియాలోనే మిగిలిపోయిన ప్రియ చివరకు విక్కిని చేరుకొందా .. లేక విక్కిలో నే మార్పు వచ్చి ప్రియదగ్గరకి వచ్చాడా.. మేగి పరిస్తితి ఏంటి వస్తుంది అనేది తెరపై చూడాల్సిందే.

నటీ నటులు..
విక్కి గా ప్రభాస్ కాస్త ఫ్యామిలీ హీరోగా నిలవాలన్న తపనతో నటించాడనిపిస్తుంది. ఉన్నంతలో బెటర్ గా చేయడానికి యత్నించాడు. ప్రియగా కాజల్ పాత్ర దిల్ రాజు బృందావనంకి కొనసాగింపు లా ఓదార్పు పాత్ర. మ్యాగే గా తాప్సి చేసింది తక్కువా... పులకిన్తలేక్కువలా సా..గింది. ప్రకాష్ రాజ్,కె విశ్వనాధ్,నాసర్ లకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. బ్రహ్మానందం,రఘుబాబు ల కామెడి మరీ ఇరికించి నట్లు ఉండి పండలేదు సరి కదా ఇబ్బంది పెడుతుంది

సాంకేతిక వర్గం ...
చానాళ్ల తరువాత దసరద్ కి మరో సరి సత్తా చూపే అవకాశం వచ్చిందనే చెప్పాలి ఐతే స్క్రీన్ ప్లే లో లోపాలు బోలెడు మనల్ని విసిగిస్తాయి. విజయ్ కే చక్రవర్తి కెమెరా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ చాల మేరకు బోర్ నుంచి ప్రేక్షకుడిని కాపాడాయనే చెప్పాలి. పాటల్లో ప్రతిభ చూపాలని యత్నించిన దేవిశ్రీ ఎమోషనల్ సీన్స్ లో రీరికార్డింగ్ పైన కూడా దృష్టి పెడితే బాగుండేది.

చివరిగా... బొమ్మరిల్లు లా
అసభ్యత,అశ్లీలం లేకుండా ఫ్యామిలీలను టార్గెట్ చేసి దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఎ సెంటర్లలో న్చుతుంది కాని బి, సి సెంటర్ ల విషయం అనుమానమే.. ప్రభాస్ రూట్ మార్చి కొత్తగా కనిపించే ప్రయతం చేస్తే .. డాన్ని ప్రేక్షకులు ఎంత వరకు పట్టించు కొన్నారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాలి.

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ అకస్మిక మరణం

గమ్యం’, ‘నిన్న నేడు రేపు’, ‘సంభవామి యుగే యుగే’ ‘కళావర్ సింగ్’,‘ఎల్‌బిడబ్ల్యూ’ చిత్రాలకు సంగీతాన్ని అందిచిన వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ ఆకస్మికంగా మరణించారు. 33 ఏళ్ళ అనీల్ కు గుందేపూటు రావటంతో ఆయన కుటుంబ సబ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణిం చినట్లు అపోలో వైద్యులు చెప్పారు. గుంటూరు జిల్లా రెంటచింతల కు చెందిన్మ ఆయన సినిమా రంగంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో ఊహించని విధంగా అకాల మరణం చెందటం పట్ల చిత్ర పరిశ్రమ యావత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

21, ఏప్రిల్ 2011, గురువారం

నిత్యకి ఆ రెండే ఇబ్బంది పెడుతున్నాయి

'అలా...మొదలైంది' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నిత్యా మీనన్ ఇప్పుడున్న హీరోయిన్లందర్లోకీ ఎత్తు తక్కువ ఒకటి చాలదన్నట్టు వెయిట్ కూడా ఎక్కువగా వుండడం కూడా తెగ దిగులు పడుతోందట ఓ పక్క అవకాశాలు వస్తున్నా, మరోపక్కఈ రెండూ తన చాన్సులు ఎక్కడ మిన్గేస్తున్డూ అన్న దిగులు కూడా ఎక్కువగానే వుందట.
హైట్ పెంచడం ఎలాగూ తన చేతిలో లేదు కాబట్టి, కనీసం బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలూచిస్తూందట దీంటూ నాజూకుగా తయారయ్యేందుకు . ప్రస్తుతం జిమ్ కి వెళ్లి, చెమటలు పట్టేలా వర్కౌట్స్ చేస్తోంది. ఇవన్ని పూర్తయితే త్వరలోనే నాజూకైన కొత్త నిత్యాని చూస్తా మన్న మాట

కృష్ణ వంశి తో సిద్దమవుతున్న నాని

'అలా...మొదలైంది' సినిమా యంగ్ హీరోలలో హీరో నాని కెరీర్ కి ఓ గుర్తింపు తెచ్చింది. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' సినిమాలో నటిస్తూనే... మరోపక్క తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'సెగ' తో తన సత్తా చూపుతున్నాడు. కాగా ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం ననికి లభించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ జరుగుతోం దని . ఇప్పటికే కృష్ణ వంశీ కథ కూడా సిద్ధం చేశాడని సమాచారం. కాగా.. దర్సకత్వ శాఖ నుంచి వచ్చిన నాని కూడా త్వరలో దరకత్వం వహించాలని వువ్వుల్లోరుతున్నాడట ,

కొమురం భీం జల్ జంగల్ జమీన్ స్పూర్తితో పోరాటం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాజీలేని పోరాటాలతోనే సాధ్యమని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ అన్నారు. 60 యేళ్లుగా తెలంగాణ రాష్ట్రంను కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం లేదని, 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తెస్తామంటున్న టీఆర్ఎస్ తేలేక పోయిందన్నారు. మధ్యలో అడ్డుపడిన సీమాంధ్ర నాయకులు మాత్రం కోట్లు దండుకున్నారన్నార ని ఆరోపించారు. కొమురం భీం జల్ జంగల్ జమీన్ స్పూర్తితో పోరాటం చేయాల ని ఆయన పిలుపు నిచ్చారు.

సత్యసాయి ఆరోగ్యo తీవ్ర ఆందోళనకరం

సత్యసాయి ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని సత్యసాయి ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ సఫాయా తెలిపారు. బాబా ఆరోగ్యంపై గురువారం ఉదయం ఆయన తాజా హెల్త్ బులిటెన్‌ విడుదల చేస్తూ బాబా శరీరంలో అన్ని అవయవాలు పనితీరు పూర్తి గా బలహీనపడిందని, ప్రస్తుతం ఆయన శరీరం వైద్యానికి ఏ మాత్రం సహకరించటంలేదని కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతింది, రక్తపోటు దారుణంగా పడిపోయిందని తెలిపారు. ఇంకా వెంటిలేటర్ ద్వారా శ్వాస అందజేస్తున్నామని , హిమోడయాలసిస్ కొనసాగుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.దీంతో బాబాకు వైద్యం చేస్తున్న వైద్యుల తో పాటు భక్తులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాఋ

అప్పుడు పెద్ద రాక్ష సుడు వైఎస్ పీడి స్తే.. ఇప్పుడు పిల్ల రాక్షసుడు జగన్ పీడుస్తున్నాడు

2009 వరకు రాష్ట్రాన్ని వైఎస్ఆర్ అనే ఒక పెద్ద రాక్ష సుడు పట్టి పీడి స్తే ప్రస్తుతం అదే కోవలో పిల్ల రాక్షసుడు జగన్ పట్టి పీడిస్తున్నాడని దుయ్యబట్టారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. గురువారం ఆయన కడప ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుచోట్ల మాట్లాడుతూ సతీష్ రెడ్డి తాత దయతో యుఫ్పై ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వ చ్చిన వైఎస్‌ తమ స్వార్థమే పరమావధిగా మా ర్చుకొని గతాన్ని మరిచిపోయిన వైఎస్ఆర్ కుటుంబం యావత్తు భారీ గా రాష్ట్రాన్ని దోచుకుంటుందన్నారు.
2004 నాటికీ అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని నెట్టుకు రావటమే కాక.. ఎన్నికల ఖర్చుల కోసం భవన్నాన్ని అమ్ముకున్న స్తితి నించి రాజ ప్రసాదాలు లోకి మారిన పరిసతి ప్రజలు గమనించాలని సోచించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో చిత్తుగా ఓడిం చడం ద్వారానే ఆ రాక్షదుని అంతం చేయాలనీ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.


20, ఏప్రిల్ 2011, బుధవారం

డీఎల్‌కు ఇదే చివరి ఎన్నికలు : శోభ

100 మంది డమ్మీ జగన్‌లు, 60 మంది డమ్మీ విజయమ్మలను పోటీలో ఉంచినా వారి భారీ విజయాన్ని ఆపలేరన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి. జగన్ పార్టీ తరపున మైదుకూరు నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆమె కాసేపు మీడియాతో మాట్లాడుతూ... యువనేత జగన్‌ను ఓడించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అధికార దర్పంతో భయాందోళనలకు గురిచేస్తోంద ని ఆరోపించారు. పోలీసులతో దౌర్జన్యం చేసి ఈ ఎన్నికల్లో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి గెలవాలనుకుంటున్నారని, ఆయన చేసిన దౌర్జన్యాలకు ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని.. డీఎల్‌కు ఇదే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.

అవినీతి గుర్తు తెచ్చుకోనేలా వై.ఎస్‌.ఆర్‌ పార్టీ జెండా

వై.ఎస్‌ ముఖ్యమంత్రి హయాంలో ప్రజా సంక్షేమం పేరిట బంధువులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తోడ్పాటునిచ్చారని... చివరకి సామాన్యుడినితెలుగుదేశం నేతలు పట్టించుకోలేదు సరి కదా.. వాళ్ళని భయపెట్టి పులివెందులలో వార్డు మెంబరు నుంచి ఎంపి వరకు వై.ఎస్‌ కుటుంబ సభ్యులే పదవులు కొట్టేసి .. అంతా ప్రజాభిమనమని చాటుకోన్నారని ఆరో పించారు రేవంత్‌రెడ్డి, యర్రబల్లె దయాకరరావు, పయ్యావుల కేశవ్‌లు. పులివెందుల ప్రచారానికి వచ్చిన వారు విలేఖర్లతో మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో ఇంత వరకు ఎన్నడూ ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగలేదన్నారు. వైఎస్‌ ధౌర్జన్యాలకు, రిగ్గింగ్‌లకు పాల్పడి విజయం పొందుతూ వచ్చారన్నారు. ఈసారి ఉప ఎన్నికల్లో ప్రీ పోలింగ్‌ జరిగే ఓటర్లు వై.ఎస్‌ కుటుంబంపై కక్ష తీర్చుకొని వై.ఎస్‌.జగన్‌, విజయమ్మ, వివేకాలను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వై.ఎస్‌.అభివృద్ధి పథకాల పేరిట అవినీతి సొమ్మును సంపాదించారని, ఆ అవినీతి సొమ్మును గుర్తు తెచ్చుకొనేందుకు వై.ఎస్‌.ఆర్‌ పార్టీ జెండాలో ఆ పతకాలనే రూపొందించారని, ఆ జెండా అవినీతి జెండాగా అభివర్ణించారు.

ఆ అవలక్షణాలు చేసేది జగనే...

అవలక్షణాలు చేసేది జగనే, నిందలు మాత్రం వేరొకరి పైనా వేయటం ఆయనకీ సాటి ఎవరూ లేరని ఎద్దేవా చేసారు 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి. జగన్, విజయమ్మల పేర్లతో కాంగ్రెస్స్ నీచ రాజకీయాలకి పాలపడుతోందని చెప్తున్న జగన్.. ఇన్నాళ్ళు తన వెంటతిరిగిన సురేష్‌బాబు తో బిఎస్పీ పార్టీ తరపున నామినేషన్‌ వేయలేదా, ఆయన పార్టీ ఎప్పుడు మారారో చెప్పాలని, అలాగే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మీ పార్టీ వారు కాదా సమాజ్‌వాది పార్టీ తరపున నామినేషన్‌ వేయలేదా అని ఆయన ప్రశ్నించారు.
వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షుడు కడప పార్లమెంటు అభ్యర్థి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చిన్నాన్న వివేకాకు మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవం లేదట. నీవు పదేపదే ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు ఏ రాజనీతి శాస్త్రంలో ఉందో మేము చదువుకొని నేర్చుకొంటామన్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం ప్రాకులాడలేదా అని ఆరోపించారు. ఎన్నికలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు వస్తాయన్నది వాస్తవమన్నారు. వై.ఎస్‌.ఆర్‌ పార్టీ అంతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

ఎన్టీఆర్ 'ఊసరవిల్లి' పోస్టర్ ఫస్ట్ లుక్

రామ్‌- సమంతలతో బెల్లంకొండ మరో చిత్రం

రామ్‌-హన్సిక జంటగా ‘కందిరీగ’ తెరకె క్కిస్తున్న నిర్మాత బెల్లం కొండ సురేష్‌ తాజాగా రామ్‌ తోనే మరో సినిమా కి ప్లాన్ చేసారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్ కి సమంత జంటగా నటించనుంది. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. స్రవంతి రవికిశోర్‌ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

పవన్ 'గబ్బర్ సింగ్' లేటుగా వస్తాడట..

హిందీ ‘దబాంగ్’ కి రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ అనే చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. .ఇటీవల విడుదలైన ‘తీన్ మార్’ కి వసూళ్లు బాగుండటంతో ... ఈ చిత్రం మీద కూడా భారీ అంచనాలున్నాయి. అయితే యధావిధిగా తీన్మార్ లా ఈ సినిమా చేస్తే ఫ్లాప్ కావడం ఖాయమని భావించిన హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ ని, ఇంకా పటిష్టంగా తెలుగుదనానికి దగ్గరగా, ప్రేక్షకులు మెచ్చేల తీర్చిదిద్దాలని భావిస్తూ...మరికొంత సమయం కావాలని భావిస్తున్నాడట.. పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించడంతో హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ చిత్రం రూపొందటం ఖాయంగా కనిపిస్తోంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో పక్కా కమర్షియల్ ఫిలిం గా 'గబ్బర్ సింగ్' రూపొందటం ఖాయం.

సాక్షి వార్తలకు రేటు కట్టి జగన్ ఖాతాలోకి..?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటరీ స్థానం అభ్యర్థి జగన్‌కు చెందిన దినపత్రిక, ఛానల్‌లలో జగన్‌కు అనుకూలంగా వస్తున్న వార్తలన్నింటినీ పెయిడ్ న్యూస్‌గా పరిగణించి, ఎన్నికల ఖర్చులో లెక్కించాలని టీడీపీపీ నేత నామా నాగేశ్వరావు చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈ మేరకు త్వరలోనే స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్(డీజీ) అక్షయ్ రావత్ వెల్లడించారు. దేశంలో చాలా మంది రాజకీయ నేతలకు సొంత ఛానెళ్లు, పత్రికలు ఉన్నాయని, మరికొందరికి అనుకూల మీడియా ఉందని ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్పష్టమైన విధానాలను రూపొందించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాక్షి కథనాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఓ ప్రశ్నకి సమాధానంగా చెప్పారాయన . దీంతో సాక్షిలో వస్తున్న జగన్ అనుకూల వార్తలు పైడ్ న్యూస్ గా పరిగణిస్తే.. ఇబ్బందులు తప్పవని జగన్ వర్గం తలలు పట్టుకోంటోంది .

సమంతా చుట్టూ తిరుగుతున్నశింబు

నయన తారతో ప్రేమ వ్యవహారం నడిపి ఆపై బొక్కబోర్ల పడ్డ తమిళ హీరో శింబు ఇప్పుడు సమంతా ప్రేమలో పడ్డాడని సినిమా సర్కిల్స్ లో కధనాలు వినిపిస్తున్నాయి. అమ్మడు నటించిన 'ఏ మాయ చేశావే', 'బృందావనం' చిత్రాలni తెగ చూసేసి.. ఈవిడ అందానికి ఫ్లాట్ ఐపోయాడట ... తను నటించే సినిమాలలో వరుసగా సమంతనే బుక్ చేయమంటు నిర్మాతలపై తెగ వత్తిడి తెస్తుండటమే కాకుండా. సమయం దొరికితే సమంతా కి ఫోన్ చేసి మాట్లాడాలనే ప్రయత్నిస్తున్నాడట. ... మొత్తానికి శింబు సమంతా చుట్టూ తిరుగుతున్నాడు!

సోనియా మతం మీకెందుకు?

యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మతంపై సమాచారం వెల్లడించడం అంటీ వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడ టమే అని జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్, జస్టిస్ ఏకే పట్నాయక్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రజాసమాచార అధికారి నుంచి ఈ వివరాలను హర్యానా మాజీ డీజీపీ పీసీ వాధ్వా సమాచార హక్కు చట్టం కింద సోనియా ఆమె పిల్లల మతం, విశ్వాసం ఏంటో బహిర్గతం చేయాలంటూ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి చేష్టలు తగనివని ఇంతకు ముందు ఈ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.

రెహ్మాన్ లేకుండానే వర్మ 'రంగేల' సీక్వెల్

రక్త చరిత్ర రెండు పార్టులుగా తీసిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. . గతంలో తన బాణీ తో బాలీవుడ్ని కొత్తపుంతలు తొక్కించిన 'రంగీలా'ని తెరకెక్కించి తన సత్తా చూపిన వర్మ ఇప్పుడు దానికి సీక్వెల్ తీయాలనేది ప్లాన్ చేసుకొంటున్నాడట.
ఈమధ్య ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ ని కలిసి ఈ ప్రాజక్టు గురించి డిస్కస్ చేస్తూనే .. మ్యూజిక్ చేయాలని కోరినా.. ప్రస్తుతం బిజీగా ఉన్నా అంటూ రెహ్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట .

ఐతే వర్మ మాత్రం రెహ్మాన్ తో పనిలేకుండా రంగేల స్క్రిప్ట్ తయారుచేసేసుకుని , సెట్స్ ఎక్కాలని భావిస్తున్నాడని తెలుస్తోంది.

18, ఏప్రిల్ 2011, సోమవారం

జగన్ హీరోగా జగన్నాయకుడు

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం త్వరలో రానుందని సమాచారం.   దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం ఇడుపుల పాయ వద్ద ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేపట్టిన ఓదార్పు యాత్ర, కాంగ్రెసులో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టిన ఓదార్పు, తండ్రి ఆశయాలు సాధించే వ్యక్తిగా ఇలా ఈ సంవత్సరంన్నరగా జగన్ ఎదుర్కొంటున్న సమస్యలను   తదితర విషయాలు పొందు పరుస్తూ శ్రీరామ్ అనే దర్శకుడు చిత్రం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి జగన్నాయకుడు అనే పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

ఉత్తరాది వేడుకలకి యన్టీఆర్ గుడ్ బై

మన సినిమా వాళ్ల పెళ్లిళ్ళన్నీ ఈమధ్య ఉత్తరాది సంప్రదాయ పద్ధతి కే పెద్ద పీట వేస్తూ జరుగుతున్నాయి. మన సంప్రదాయం కాని సంగీత్, మెహందీ లకు మన పెళ్ళిలో చోటు దక్కిన్చుకోన్నాయి , అయితే తన వివాహంలో తెలుగు సంప్రదాయాలకు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ.... ఓ తెలుగు పల్లెలో.. ఓ కలవారి ఇంట జరిగే అంగరంగ వైభవంగా... మమతల వేడుకలా జరగాలని కోరుకొంతున్నాన్ని చెపుతున్నాడు యన్టీఆర్.
'పెళ్లి పుస్తకం' సినిమాలోని 'శ్రీరస్తు...శుభమస్తు..శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం' పాటలో బాపుగారు చూపించిన పద్ధతిలో యన్టీఆర్ వివాహ వేడుక ఉంటుందన్న మాట! శుభలేఖతో బాటు స్వీట్లు పంచే పద్ధతిki చేక్చేప్పి... గతంలో ఉన్నా సాంప్రదాయాలనే అనుసరిస్తూ... స్వయంగా కుటుంబ సబ్యులతో వెళ్లి పేరు పేరునా ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే శూతిన్గ్లకి సెలవులు ప్రకటించిన యన్టీఆర్. సోమవారం నాడు హైదరాబాదులో సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, రామానాయుడు, చిరంజీవి, రాఘవేంద్రరావు, రాజమౌళి, వినాయక్ ల ఇళ్లకు వెళ్లి, పెళ్లి శుభలేఖల్ని స్వయంగా ఇచ్చి ఆహ్వానించి వచ్చా డు. తెలుగింటి సాంప్రదాయానికి ప్రతీకగా నిలచే తాతకి తగ్గ మనవడిగా నిలవాలన్నది ఆయనగారి తపనకి హర్షించాల్సిందే..

ఒకే రోజు ఆరు సినిమాలు..జనాలు థియేటర్లవైపు రాలేదు...

సినిమారంగం పరిస్థితి ఏమాత్రం బాలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. పరిస్థితి బాగా లేకుంటే ఒకే రోజు ఆరు సినిమాలు ఎలా విడుదలవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. గతవారం ఏప్రిల్‌ 8వ తేదీన నాలుగు డబ్బింగ్‌ చిత్రాలు, రెండు స్ట్రయిట్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఈ ఆరు చిత్రలకు కనీసస్థాయి ఓపెనింగ్స్‌ లేవు. థియేటర్లన్నీ వెలవెలబోయాయి. శివాజీ నటించిన 'లోకమే కొత్తగా', సూపర్‌గుడ్‌ సంస్థ తీసిన 'మంచివాడు' చిత్రాలకు కనీస స్థాయి కలక్షన్స్‌ రాలేదు.
ఈ చిత్రాల ఫలితాన్ని ముందుగా అంచనావేసినప్పటికీ, ఇంత ఇదిగా ఉంటాయని మాత్రం వాణిజ్య వర్గాలు భావించలేదు. హీరోలమంటూ సినిమాకు లక్షల్లో డిమాండ్‌ చేసేవారు, తమకున్న ఇమేజ్‌ ఎలాంటిది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్ద్యం ఉందా? విషయాన్ని గ్రహిస్తే మంచిదని సినీపండితులు సలహా ఇస్తున్నారు. ఇక డబ్బింగ్‌ చిత్రాలది కూడా సేమ్‌ సిట్యూవేషన్‌. ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీ పూర్తికావడంతోనే రిలీజ్‌ చేసినా, జనాలు థియేటర్లవైపు రాలేదు.

గంగపుత్రులు సెన్సార్ కట్స్

పి. సునీల్‌ కుమార్‌రెడ్డి రచన, స్క్రీన్‌ ప్లే దర్శకత్వం సమకూర్చిన 'గంగపుత్రులు' చిత్రాన్ని కె.బి.ఆర్‌. ప్రొడక్షన్స్‌, శ్రావ్య ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మించారు. సుబ్బరాజు, గాయత్రి, రామ్‌, తన్మయి, మహేష్‌, రావు రమేష్‌ ముఖ్యపాత్రలు పోషించారు.
అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' ఈ చిత్రాన్ని చూసి 9 కట్స్‌తో 81.12 అడుగుల ఫిలిం కత్తిరించి 24-3-2011న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1. మూడవ రీలులోని ...
ఎ) రెండో పాటలో బొడ్డు చూపెడుతూ, చిత్రీకరించిన క్లీవేజ్‌ షాట్స్‌ని 4.07 అడుగుల నిడివికి కత్తిరించారు. అయితే అంగీకారయోగ్యమైన అంతే నిడివిగల మరో షాట్‌ని ఉంచారు.
బి) పయిట లేకుండా ఇసుకపై హీరోయిన్‌ వెల్లకిలా పరుండే దృశ్యాలను 9.14 అడుగుల మేర కత్తెరించి, అంతే నిడివిగల అంగీకరింపబడిన మరో దృశ్యాన్ని ఉంచడానికి అంగీకరించారు.
సి) హీరోయిన్‌ సముద్రంలో స్నానం చేసే సన్నివేశాలను 32.02 అడుగుల నిడివికి కత్తెరించి ఆ దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.
డి) మూడవ పాటలో చనుకట్టు ఎక్స్‌పోజర్‌కి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 21-02 అడుగులు నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
ఇ) సన్నిహితంగా ప్రేమించుకునే దృశ్యాలు, హీరోయిన్‌ తన దుస్తులు విప్పేసే దృశ్యాలను 4.13 అడుగులమేరకు తొలగించి, అంతే నిడివిగల అంగీకృతమైన వేరే దృశ్యాలను ఉంచడానికి అంగీకరించారు.
ఎఫ్‌) తెల్లని బ్రా వేసుకుని నీలిరంగు చీర ధరించి చనుకట్టు పై చేతులుంచుకున్న దృశ్యాలను తొలగించడం ద్వారా 28.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
2. నాలుగవ రీలులో...
ఎ) సన్నివేశంలో చిత్రీకరించిన జలయజ్ఞం, సోంపేట, గంగవరం పదాలను బాడకోవ్‌ పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
బి) పయిట లేకుండా హీరోయిన్‌ పై బీచ్‌లో చిత్రీకరించిన దృశ్యాలను 7.08 అడుగుల నిడివి మేరకు కత్తిరించి అంగీకృతమైన అదే నిడివిగల వేరే దృశ్యాలను ఉంచడానికి అంగీకరించాలి.
సి. బీచ్‌లో హీరోతో మాట్లాడుతున్న హీరోయిన్‌ ఎక్స్‌పోజ్‌ చేసేలా చిత్రీకరించిన దృశ్యాలను తొలగించడమో బ్లర్‌ చేయడమో చేయాలని సూచించగా బ్లర్‌ చేసారు.
ఈ రకంగా 108.06 అడుగుల ఫిలింని కత్తిరించడం, 26.10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరించి వేరే షాట్స్‌తో కలపడం వల్ల మొత్తం 81.12 అడుగుల పొడవు ఫిలిం కత్తెరింపుకు గురి అయింది. 3354.90 మీటర్ల నిడివిగల 'గంగపుత్రులు' చిత్రం విడుదలయింది.

17, ఏప్రిల్ 2011, ఆదివారం

రెండెకరాల నుంచి రెండు వేల కోట్ల కి ఎలా ఎదిగారో...

రెండెకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తికి ఎలా ఎదిగారో... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెపితే తాము టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆస్తులపై విచారణ జరపడానికి ఉ సిద్ధమేనని సవాల్ విసిరారు టిఆర్ఎస్ నేత తారక రామారావు. ఆది వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత మామకే పంగనామాలు పెట్టిన చంద్రబాబు డిసెంబరు 9 ప్రకటన తరువాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడన్నారు. టిడిపిలో ఎన్టీఆర్ కుటుంబం తప్ప ముఖ్య నాయకులు ఎవరు లేరని.. అల్లాంటి పార్టీ నేతలు తమ పార్టీని కుటుంబ పార్టీ అంటూ విమర్శలు చేయటం విద్దురంగా ఉందన్నారు. తెలంగాణ కోరుకునే ప్రజలందరూ టిఆర్ఎస్ సభ్యులేన న్న విషయాన్నీ తెలుగుదేశం నేతలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

నేరగాళ్ళ సరసన త్వరలో జగన్

హసన్ అలీ, మధు కోడ వంటి నేరగాళ్ళ సరసన త్వరలో జగన్ కూడా చేరుతాడని కడప పార్ల మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీం ద్రారెడ్డి చెప్పా రు. జగన్ తన అఫిడివి ట్‌లో తెలిపిన విధంగా ఆయన ఆస్తులు లేవని, వేలాది కోట్ల రూపాయల ను ఆస్తులని పేర్కొనలేదని, వాటిని వెల్లడిం చా లని డీఎల్ డిమాండ్ చేశారు. తం డ్రి సీఎం పదవి అడ్డు పెట్టుకొని కోట్లా ది రూపాయల అక్రమ సంపాదనకు, ఆర్థిక నేరాలకు ఒడి గట్టాడని విమర్శ లు గుప్పించారు. తం డ్రి సీఎం పదవి అడ్డు పెట్టుకొని కోట్లా ది రూపాయల అక్రమ సంపాదనకు, ఆర్థిక నేరాలకు ఒడి గట్టాడని విమర్శ లు గుప్పించారు.

ఆ ముగ్గురిపై వేటుకు రంగం సిద్దం

గత కొంత కాలం గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనర్హత అంశంపై సాగాదీత ధోరణి కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎట్టకేలకు న్యాయనిపుణుల సలహాల తో వారిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. పార్టీ గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన పోచారం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న బాలనాగిరెడ్డి, ప్రసన్న కుమార్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ డిప్యూటి స్పీకర్‌ను కోరిన విషయం తెలిసిందే...శాసనసభ స్పీకర్ గా ఇన్‌చార్జి హోదాలో ఉపసభాపతే విధులను నిర్వర్తిస్తున్నందున సభ్యుల అనర్హత వేటును పరిశీలించే అధికారంపై సందిగ్ధత నెలకొ నడంతో ఆదివారం న్యాయ నిపుణుల సహలను సేకరించారు ఆయన. కాగా కాంగ్రెస్స్ పార్టీ కి చెందిన నలుగురుపై వేటుకు రంగం సిద్దం చేసుకోన్నందునే.. తనపై విమర్శలు రాకుండా ఉండేందుకే ఉపసభాపతి.. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తోంది

16, ఏప్రిల్ 2011, శనివారం

నే ఎవ్వరి మాటా వినను

తెలంగాణ విషయంలో ఎవరి మాటా వినేది లేదని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో సాధనా యాత్రను చేపట్టనున్నామని .. అందువల్లే కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. కొందరు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని .. తెలంగాణా అంశంలో పార్టీలో కొన్ని అభిప్రాయ భేదాలున్న మాట వాస్తవమే ఐనప్పటికీ అన్ని విషయాల్లోనూ పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటానని పత్రికల్లో తనపై వచ్చిన వార్తా కథనాలు అవాస్తవమని అన్నారు.

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

బుల్లితెరపైకి దూసుకొస్తున్న వెంకటేష్

సినిమాల కన్నా సీరియల్స్‌కు లభిస్తున్న ఆదరణ రోజు రోజుకు పెరిగి పోతుండటంతో ఇప్పుడు బుల్లితెరపై కనిపించడానికి పెద్ద పెద్ద తారలు కూడా సిద్దమైపోతున్నారు. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ లాంటి అగ్ర కధానాయకులు హీరోయిన్లు , సీనియర్‌ నటులు బుల్లితెరపై కూడా నటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి బాటలో మరో అగ్రహీరో .. విక్టరీ వెంకటేష్ కూడా పయనించనున్నాడు. ఎప్పటి నుంచో స్వామి వివేకానంద పాత్ర పోషించాలనుకుంటున్న వెంకటేష్‌ . వివేకానందుని జీవితచరిత్రను సినిమా రూపొందించడానికి కూడా ప్రయత్నించాడు. అయితే, రెండున్నర గంటల్లో ఆ కథ చెప్పడం సాధ్యమయ్యే పని కాదని సినిమా నిర్మాణాన్ని విరమించుకుని, టీవీ సీరియల్ గా తీయాలని అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ సీరియల్‌ సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది!

సూపర్ స్టార్ సింహాసనం పాట రీమిక్స్

అప్పుడెప్పుడో.. చిరంజీవి కొండవీటి రాజా లోని మంచమేసి దుప్పటేసి పాటకి. ఈ మధ్య చినుకులా రని.. నదులుగా సాగి.. అంటూ చిందేసిన అల్లరి నరేష్ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ పాటకి డ్యాన్స్ చేసి పారేస్తున్నాడు. .. అందులోనూ 'సింహాసనం' సినిమాలోని 'ఆకాశంలో ఒక తార... నా కోసమొచ్చింది ఈవేళ' అనే సూపర్ హిట్ సాంగ్ . అల్లరి నరేష్, పూర్ణ జంటగా గతంలో 'సీమ శాస్త్రి' సినిమాని రూపొందించిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న 'సీమ టపాకాయ్' సినిమా లో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాట ఆడియోకే హైలైట్ అవుతుందని నిర్మాత చెబుతు...ఈ సినిమా ఆడియోను ఈ నెల 18 న హైదరాబాదులో ఘనంగా రిలీజ్ చేస్తామని చెప్పారు.

14, ఏప్రిల్ 2011, గురువారం

‘అంకుశం’ రామిరెడ్డి మరిక లేరు

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి గురువారం కన్నుమూశారు. . సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన మరణిం చినట్లు విదులు చెప్పారు.
 ‘అంకుశం’ సినిమాలో విలన్ గా అశేష ఆంధ్ర ప్రేక్షకుల మన్నన పొందిన రామిరెడ్డి ప్రతి నాయకుడిగా
 అమ్మోరు, అనగనగా ఒకరోజు, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, పెద్దరికం, గాయం,  ఓసేయ్ రాములమ్మ సినిమాల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రామిరెడ్డి మృతి పట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

మాస్ సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న సిమ్రాన్

లుగు, తమిళ భాషల్లో కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ కథానాయికగా రాణించిన సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సస్స్ కాకపోవటంతో దర్శకురాలిగా మారుతోంది. పనిలో పనిగా తనే నిర్మాతగా కూడా మరి ఇటీవల హిందీలో హిట్ అయిన చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనుకుంటోంది. అయితే, దీనికి వేరే దర్శకుడిని ఎంపిక చేయలనుకొంటూంది

అలాగే, మరో సినిమాకి తనే దర్శకత్వం వహిం చేందుకు సన్నాహాలు శేస్తున్న ఈ అమ్మడు ఇన్నాళ్లూ కమర్షియల్ చిత్రాలలో తను పోషించిన మాస్ పాత్రలే ప్రధానంగా మాస్ ప్రేక్షకుల టేస్ట్ తనకు తెలుసనీ, తన సినిమా కూడా కమర్షియల్ పంథాలోనే ఉంటుందనీ సిమ్రాన్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథ రెడీ అవుతోందట ఎనీ హౌ సిమ్రాన్ సక్సస్స్ ని కోరుకొండ మనం కూడా ...

రీమేక్ ల 'రాణి' గా మారుతున్నా త్రిష

చెన్నయ్ ముద్దుగుమ్మ త్రిషకు ఈమధ్య రీమేక్ ల కథానాయికగా పేరు వస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు తనెక్కువగా రీమేక్ సినిమాలలోనే నటిస్తోంది. ఈ రోజు రిలీజ్ అవుతున్న 'తీన్ మార్' హిందీలో వచ్చిన 'లవ్ ఆజ్ కల్' సినిమాకు రీమేక్ కాగా, ప్రస్తుతం తను వెంకటేష్ తో చేస్తున్న సినిమా మలయాళంలో వచ్చిన 'బాడీగార్డ్' సినిమాకు రీమేక్. ఇదిలా ఉంచితే, తమిళంలో తాజాగా మరో రీమేక్ సినిమా ఆఫర్ కూడా త్రిషకు వచ్చింది. ఇటీవల హిందీలో వచ్చిన 'బ్యాండ్ బాజా బారత్' హిట్ సినిమాను యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ తమిళంలో రీమేక్ చేస్తోంది. ఒరిజినల్ లో అనుష్క శర్మ పోషించిన శృతి కక్కర్ పాత్రను త్రిషకు ఆఫర్ చేశారట. త్రిష కూడా ఇందులో నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.

కృష్ణ వంశీ ట్రేడ్ మార్క్ సినిమా 'మొగుడు'

ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో ఈ మద్య కృష్ణ వంశీ బాగా వెనిక బడి పోయాడు. ఇంతకు ముందు మాస్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన 'మహాత్మ' చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కా క పోవటంతో మళ్ళి తన ఫ్యామిలీ డ్రామాలకు తెర లేపాడు.. అందులో భాగంగానే గోపీచంద్ హీరోగా ఈసారైనా హిట్ మూవీ అందించాలని ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా 'మొగుడు' చిత్రాన్ని రూపొందిస్తున్నాడట.

గతంలో తానుఅందించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ, సూపర్ హిట్ అయ్యాయి అలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీయడంలో వున్న తన అనుభవాన్ని ఇక్కడ కూడా ఉపయోగించి, హిట్ కొట్టాలనుకుంటున్నాడని టాలీవుడ్ సమాచారం!

ఎయిర్ పోర్టులో ప్రీతి బూతు పురాణం

వెంకి, ప్రిన్స్ మహేష్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన సొట్టబుగ్గల భామ బాలీవుడ్ తార ప్రీతిజింటాను చంఢిఘర్ ఎయిర్పోర్ట్లో అధికారులు అడ్డుకొన్నారు. . కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ భాగస్వామి కూడా ఐన అమ్మడు ఎవరో తమకు తెలియదనడంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించక పోగా అడ్డగించి ఐడీ కార్డును చూపించాలనికోరడంతో జింటాకు, ఎక్కడో చిర్రెక్కింది. అంతే.. ఐడీ కార్డును చూపడానికి జింటా మొండికేసి.. నోటికొచ్చిన బూతులతో సీఐఎస్ఎఫ్ అధికారుల తో వాగ్వాదం కి దిగింది. విషయం ముదిరి వివాదస్పదమౌతుందని గ్రహించిన ఉన్నతాధికారులు కలుగచేసికొని పరిస్థితిని చక్కదిద్దుతూ.. సెలబ్రిటిలకు, సాధారణ ప్రజలకు నియమాలు వేర్వేరుగా వుండవని కాస్త జింతాకూ క్లాసు పీకారు. దీంతో ఐడీ కార్డును చూపీ విమానం ఎక్కేయడంతో అక్కడ ప్రీతి బూతు పురాణానికి తెరపడింది.

13, ఏప్రిల్ 2011, బుధవారం

డల్లాస్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైన 'ఎల్బీడబ్ల్యూ'

చిన్న సినిమాగా విడుదలై మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న 'ఎల్బీడబ్ల్యూ'. ఈ చిత్రం ఇప్పుడు డల్లాస్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.

భారతదేశం నుండి కేవలం మూడు చిత్రాలు మాత్రమే ఫెస్టివల్‌కు ఎంపికయ్యాయి. 'దోబీఘాట్‌, రోబో'తో పాటుగా 'ఎల్బీడబ్ల్యూ' చిత్రం ఎంపికైందని నిర్మాతల్లో ఒకరైన కిరణ్‌ భూనేటి ఆనందం వెలిబుచ్చారు.

ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం యాభై రోజుల వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకాదరణ ఉంటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం అని హీరోలు సిద్ధు, అభిజిత్‌, హీరోయిన్లు నిశాంతి, చిన్మయి తెలిపారు.

'రాజ్‌أ సెన్సార్ కట్స్

వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన 'రాజ్‌' చిత్రంలో సుమంత్‌, ప్రియమణి విమలారామన్‌, అజయ్‌, అలి, గిరిబాబు ముఖ్య పాత్రధారులు. కుమార్‌ బ్రదర్స్‌ పతాకాన కుమార్‌ బ్రదర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జగన్‌.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'రాజ్‌'ని చూసి 11 కట్స్‌లో 89.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరించి 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన

ఎ) 'ఎవతైనా వలలో వేసుకుందా' డైలాగ్‌ని సౌండ్‌తో సహా కత్తిరించారు.

బి) స్విమ్మింగ్‌ ఫూల్‌ నుంచి నైట్‌ షర్ట్‌ తో బయటకు వచ్చే ప్రియమణికి సంబంధించిన క్లోజ్‌ అప్‌ దృశ్యాలను తొలగించడం ద్వారా 5.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

2. ఒకటి రెండు రీళ్లలోనే బీచ్‌లో ఎర్రటి దుస్తులతో ఉన్న వారి క్లీవేజ్‌ దృశ్యాలను తొలగించడం ద్వారా 5.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.

3. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'అది జరగలేదా' డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

4. మూడు నాలుగు రీళ్ళలో

ఎ) 'ఖాళీగా వున్నాం వచ్చి హెల్ప్‌ చేయమంటావా'

బి) 'ఎంత తొందరగా పెళ్ళాంని ప్రెగ్నెంట్‌ చేస్తే అంత తొందరగా మనం పార్టీ చేసుకోవచ్చు' అనే డైలాగ్స్‌ శబ్దంతో సహా తొలగింపుకు గురి అయ్యాయి.

5. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన పాటలో హీరోయిన్‌ రెడ్‌ టవల్‌తో డ్యాన్స్‌ చేసే దృశ్యాలను తొలగించడం వల్ల 79.00 అడుగుల నిడివి గల ఫిలిం కత్తెర పాలయింది.

6. అయిదు ఆరు రీళ్ళలో గల 'డాన్‌ పెరియన్‌ చాంపేన్‌' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

7. తొమ్మిది పది రీళ్ళలో

ఎ) 'నాది కనిపించ లేదు' అనే డైలాగ్‌లో 'నాది' అనే పదం వినబడకుండా

బి) గోకుతున్నావా అనే పదం వినరాకుండా

సి) 'పోసుకువచ్చా' అనేది వినబడకుండా తొలగించారు.

14 రీళ్ళ నిడివిగల 'రాజ్‌' చిత్రం 18.3.11న విడుదలయింది.

దొంగల ముఠా 'సెన్సార్' కట్స్

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'దొంగలముఠా' చిత్రంలో రవితేజ, ఛార్మి, లక్ష్మి మంచు, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, సుబ్బరాజ్‌, సుప్రీత్‌ ముఖ్యపాత్రధారులు. శ్రేయ ప్రొడక్షన్స్‌ పతాకాన రూపొందిన ఈ చిత్రానికి సహ నిర్మాత సుమన్‌ వర్మ, నిర్మాత కిరణ్‌ కుమార్‌ కోనేరు.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'దొంగలముఠా'ని చూసి 16-3-2011న 2 కట్స్‌తో 10 అడుగుల నిడివి ఫిలిం కత్తిరించి 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. మూడు నాలుగు రీళ్ళలోని 'గెస్ట్‌ లు ఏదో చేసుకుంటూ వుండొచ్చుకదా' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

2. ఏడవ రీలులో చార్మీ రాక్స్‌మీద పాకే దృశ్యాన్ని తొలగించడం ద్వారా 10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

12 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 18.3.11న విడుదల అయింది.

కుట్రలు తిప్పి కొడదాం రండి

ఐక్య ఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని టీఆర్‌ఎస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, వీటిని తిప్పి కొట్టేందుకు పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు, మహిళ లు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి 25 వరకు టీ ఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాలను తెలంగాణా అంతటా జరపాలని ఆమె కేడర్ కి సూచించారు

త్వ రలోనే లోక్‌సభకు మధ్యంతరం

కేంద్రంలో అంతా సవ్యంగా లే దని అవినీతి కుంభకోణాలు, అంతర్గత కలహాలు పెచ్చు పెరుగుతున్నాయని ..
అందువల్ల త్వ రలోనే లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు ఖాయమంటూ ముఖ్యమంత్రి య డ్యూరప్ప జోస్యం చెప్పారు. బుధ వారం ఆయన బెంగళూరు లో మీడియాతో మాట్లాడుతూ పలు అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్న కేంద్రంలోని యూపీయే ప్ర భుత్వం ఏ క్షణంలోనైనా అధికారం కోల్పోయే అవకా శాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటూ.. వాటిని సమర్ధ వతంగాఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం గా ఉందన్నారు

12, ఏప్రిల్ 2011, మంగళవారం

ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య పోరు

కడప లోకసభ స్థానంలో ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరులో వైయస్ జగన్ విజయం సాధిస్తారని  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు దీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ..కడపలో కాంగ్రెసు పార్టీకి ఓటమి తప్పదని, ప్రభుత్వం ఆభాసు పాలవుతుందని అన్నారు. తెలంగాణా అంశంపై తమ అధినేతకు స్పష్టమైన విధి విధానం ఉందని గెలిచిన తర్వాత పార్లమెంటు సభ్యుడి హోదాలో తెలంగాణపై తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు.

వెనక్కి తగ్గినా వంశి?

తన రాజీనామా విషయంలో  వెనక్కి తగ్గనని చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ  హైడ్రామా నడుమ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. గత పక్షం రోజులుగా కృష్ణ తెలుగుదేశంలో రేగిన చిచ్చు  చివరికి నారా, నందమూరి కుటుంబాల మద్య  భగ్గుమనేల చేసింది. ఈ నేపద్యంలో రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు వల్లభనేని వంశీ ప్రకటించడం కొంత ఊరట కలిగించే అంశమే.


కొండారెడ్డి హత్యకేసులో పరిటాల రవి బావమరిది అరెస్ట్

కాంగ్రెస్ నేత తగరకుంట కొండారెడ్డి హత్యకేసులో నిందితుడు గా ఉన్న   టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు బాలాజీని పోలీసులు  అరెస్ట్ చేశారు. మంగళవారం అత్య్నత నాటకీయ పరిణామాల మధ్య ఆయనతో పాటు 11మంది టీడీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపద్యంలో వారి వద్ద నుంచి మూడు తుపాకులు, వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న పరిటాల రవి చిన్నాన్న ఎల్ నారాయణ చౌదరి కోసం ముమ్మర గాలింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. .

ప్రశాంతి నిలయం బోసిపోయింది

గత 16 రోజులు గా సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యసాయి బాబా ఆరోగ్యంపై మంగళవారం ఉదయం తాజా బులెటిన్ విడుదల డాక్టర్ సఫాయా చేసారు.  బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తుందని  హృదయ స్పందన, బీపీ నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా మూత్రపిండాలకు డయాలసిస్ కొనసాగుతోందని త్వరలోనే... ఈ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు

మరో వైపు  శ్రీరామనవమి వేడుకలతో కోలాహలంగా ఉండే  పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం నేడు బోసిపోయి కనిపించింది.  ప్రతి ఏటా శ్రీరామ నవమినాడు భక్తులను ఉద్దేశించి బాబా చేసే ప్రసంగం నేడు వినిపించక పోవటంతో ఇక్కడి సత్తెమ్మ దేవాలయంలో  గ్రామస్తులతో కలసి తరలి వస్తున్న భక్తులు బాబా ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు నిర్వహిస్తున్నారు

14 నుంచి కెసిఆర్‌ చండీయాగం

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్‌ నిర్వహించ తలపెట్టనున్న చండీయాగం కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి చండీయాగం మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మహబూబ్‌ నగర్‌ మాజీ ఎంపీ ఎపి జితేందర్‌ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రం చండీయాగానికి అనుకూలంగా ఉందా లేదా అని గత మూడు రోజుల నుంచి వేద పండితులతో వచ్చి యాగం నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. మొదటి రోజు కెసిఆర్‌ దంపతులు పాల్గొంటారని సమాచారం.

తెలంగాణ ఉద్యమ దశాబ్ధ ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఉద్యమ దశాబ్ధ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగుతాయని కార్యక్రమాల వివరాలను వెల్లడించారు ఎమ్మెల్యే జి అరవిందరెడ్డి.

14న అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి, టీఆర్ఎస్ పతాక ఆవిష్కర ణా

15న ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వసతి గృహాల్లో పం డ్లు, మిఠాయిలు పంపిణీ
16న శ్రమదానం

17న నియోజకవర్గ కేం ద్రంలో రక్తదాన శిబిరం

18న ఉచిత వైద్య శిబిరాలు, కంటి అద్దాల పంపిణీ

19న తెలంగాణ సాధన కోసం 1949 నుంచి అమరులైనవారికి నివాళులర్పించడం, నియోజకవర్గ కేం ద్రాల్లో కాగడాల ప్రదర్శన
20న తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో మహిళలచే మార్చ్

21న శ్రీకృష్ణ కమిటీ వ్యతిరేక సదస్సు

22న తెలుగు, ఉర్దూ భాష ల్లో కవి సమ్మేళనం

24న జిల్లా కేంద్రంలో సంబరాలు, వివిధ రంగాలకు సేవ చేసిన విశిష్ట వ్యక్తులకు సన్మానం

ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్‌ 13.

మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణార్జున యుద్ధం, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణావతారం, కంచుకోట, ఉండమ్మా బొట్టుపెడతా, బాంధవ్యాలు, బాలరాజుకథ, అందాల రాముడు, మహాకవి క్షేత్రయ్య, బాలభారతం, ఆత్మీయులు, శ్రీకృష్ణపాండవీయం, దాన వీర శూర కర్ణ, సీతాకళ్యాణం' తదితర చిత్రాల్లో అసమాన నటన ప్రదర్శించి ఎన్టీఆర్‌ అభిమానం పొందిన ధూళిపాళ
విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌ గా ఆ పాత్రల్లో రాణించడానికి ఉచ్ఛారణలోని ప్రత్యేకత, స్పష్టమైన ఉచ్చారణ, పాత్రోచిత నటన ప్రధాన కారణాలయ్యాయి. వీర, రౌద్ర, రసాల పాత్రలలో ఎలా ఒదిగి పోయినారో సాత్విక పాత్రల్లోనూ అదే విధంగా ఒదిగిపోయి ఆ పాత్ర కళ్ళముందు కనిపించేలా నటించేసే ధూళిపాళ 300 చిత్రాలకు పైగా నటించారు.
చివరి దశలో సన్యాసం స్వీకరించి కామేశ్వరానంద స్వామిగా మారి 2007లో తనువు చాలించారు. ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్‌ 13.

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

టీటీడీ చైర్మన్‌గా రాయపాటి

సుదీర్ఘకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తిరుమల వెంకన్న ఆశీస్సులు లభించాయి. టీటీడీ చైర్మన్‌గా రాయపాటి నియామకాన్ని 10 జన్‌పథ్‌కు నివేదించటంతో మార్గం సుగమమైనట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.

అంతకుముందు ఆయన బోర్డు సభ్యుడిగా పనిచే సిన రాయపాటి 2004లో మంత్రి పదవి ఆశించి భంగపడి, టీటీడీ చైర్మన్ పదవి ఆశించారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేయాలన్నది తన చిరకాల వాంఛ అని అనేకమార్లు ముఖ్యుల వద్ద ప్రస్తావించిన ఆయన ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. ఉగాది రోజున బోర్డును ప్రకటించాల్సి ఉన్నా వాయిదా పడింది.

హాజారే దీక్ష వెనక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం

హాజారే దీక్ష వెనక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని, తెరవెనుక నుంచి కథ వారే నడుపుతున్నారని ఎన్సీపీ మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌ ఆరోపించారు. ఒకప్పుడు హజారే చేపట్టిన ఆందోళన కారణంగా జైన్ లాగే మాలిక్‌ కూడా మంత్రి పదవి కోల్పోయిన విషయం తెలిసిందే

అన్నాహజారే ఓ ‘ఫ్రాడ్’

ఒకవైపు అన్నాహజారే ఢిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతు ఇస్తున్నట్లు స్వయంగా శివసేన అధినేత బాల్‌ఠాక్రే ప్రకటించగా మరోవైపు శివసేన ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్‌దాదా జైన్ మాత్రం ప్రముఖ సంఘసంస్కర్త, గాంధేయవాదిగా వెలుగొందుతున్న అన్నాహజారే ‘ఫ్రాడ్’ అని, ఆయన కార్యకర్తలు నేరస్తులు, బ్లాక్ మెయిలర్లని, అనవసరంగా ఆయన్ని మహాత్మాగాంధీని చేయవద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సర్వత్రా ఆశ్చర్య పోయేలా చేసారు.

గతంలో జైన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు మరో నలుగురు మంత్రులకు వ్యతిరేకంగా అన్నాహజారే ఆందోళన చేపట్టారు. అప్పటినుంచి అన్నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తునే .. ఇందులోభాగంగానే అన్నాకు దీటుగా జైన్ కూడా నిరాహార దీక్ష చేప ట్టిన విషయం తెలిసిందే. సావంత్ కమిషన్ విచారణలో హజారే అవినీతి బయటపడిందని, అనవసరంగా ఆయనను గాంధీతో పోల్చవద్దంటూ వ్యాఖ్యానించారు

నటి సుజాతకి చిత్ర ప్రముఖులు కన్నీటి వీడ్కోలు

ప్రేయసిగా, అందమైన అక్కగా, మంచి అమ్మగా ఇలా ఎన్నో పాత్రలకు జీవంపోసిన నటి సుజాత. ఆమె బుధవారం మృతిచెందిన విషయం తెలి సిందే. ఈమె అంత్యక్రియలు కీల్‌పాక్ క్రిస్టియన్ శ్మశానవాటికలో జరిగాయి. ఈ సందర్భంగా సుజాత భౌతికకాయానికి పలువురు చిత్ర ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు సుజాత భౌతిక కాయానికి ఆమె నివాసంలో పలువురు చిత్ర ప్రముఖులు నివాళులర్పించారు.

భక్తులను తికమకపెడుతున్న బులెటిన్‌లు

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ సఫాయా విడుదల చేస్తున్న బులెటిన్‌లు భక్తులను తికమకపెడుతున్నాయి. ఐసీయూలోనికి ఇతరులను అనుమతించక పోయినా, కనీసం అద్దాల బయటి నుంచి అయినా కొందరికైనా బాబాను చూపించవచ్చు కదా? భక్తుల కోరిక మేరకు అద్దాల బయటి నుంచి వీడియో చిత్రీకరించి చూపడానికి అభ్యంతరం ఏమిటి? అనేవి కోట్లాది మంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. బాబాకు అత్యంత రహస్యంగా వైద్యం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బి జే పీతోనే సుపరిపాలన : హేమమాలిని

బి జే పీతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని ప్రముఖ నటి హేమమాలిని పేర్కొన్నారు. గత 50 సంవత్సరాలుగా అధికార పీఠాన్ని అంటిపెట్టుకున్న కాంగ్రెస్ వల్ల చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగకపోవడం శోచనీయమన్నారు. భారతదేశంలో అవినీతి పెల్లుబుకుతోందని, ఐదేళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో పలు అభివృద్ధి పథకాలు అమలుచేసి దేశాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెలామ్ని, వాజ్‌పాయి, అద్వానీ వంటి నాయకులు ప్రజలు మెచ్చిన పాలనను అందించి, చరిత్రలో నిలిచిపోయారన్నారు.

రేపటి నుంచి నారాయణ 48 గంటల దీక్ష

హజారే కి మద్దతుగా నేడు ర్యాలీలు

ప్రజలు ఇచ్చే అధికారమే కావాలి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఉప ఎన్నికల కష్టాలు ఒక్కొక్కటిగా వచ్చి పడుతున్నాయి. కడప లోక్‌సభ అభ్యర్థిత్వం కొలిక్కి వచ్చిందని భావిస్తున్న సమయంలో, పులివెందుల సమస్యగా మారబోతోంది. మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని వైఎస్ వివేకానందరెడ్డి పట్టుబడుతున్నారు. ప్రజలు ఇచ్చే అధికారమే తనకు కావాలని.. నామినేటెడ్ పదవులు వద్దని ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసినందున మంత్రి పదవి కూడా నామినేటెడ్ వంటిదేనని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఇదో 'నిప్పు' సత్యాగ్రహం...

ఓ వృద్ధుడు.. ఏడు పదుల వయసు మీద పడుతున్న యోధుడు! ఆయన ఒంటిపై తెల్లని దుస్తులు... స్వచ్ఛమైన ఆయన వ్యక్తిత్వంలానే! ఒక్కడే వచ్చాడు.. ఆర్భాటాల్లేవు... ఆడంబరాల్లేవు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కూర్చున్నాడు. దేశ జవసత్వాలను పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి భూతంపై బిల్లు ఎక్కు పెట్టాడు! చినుకు చినుకు కలిసి.. తుదకు వరదైనట్లు.. ఒక్కొక్కరు చేతులు కలిపారు. ఉత్తుంగ తరంగాలయ్యారు! అక్రమార్జనలపై ఉప్పెనయ్యారు. అందుకు స్ఫూర్తిగా నిలిచాడు సత్యాగ్రహాల గాంధేయవాది.. అన్నా హజారే!

ఆయన పిలుపందుకుని.. హిమాచలం మొదలు కన్యాకుమారి దాకా జన ప్రభంజనం పోటెత్తింది. ప్రభువుల అవినీతి ఇంకానా ఇకపై సాగదంటూ నినదించింది! రాజకీయ జెండాల్లేవు. ఊకదంపుడు ఉపన్యాసాల్లేవు. మాటల తూటాలే! ఒకటే లక్ష్యం... అవినీతి రహిత భారతం! ఆగని పయనం.. లంచగొండితనాన్ని తుదముట్టించేంత వరకూ! మరణించేదాకా పోరు.. భారతమ్మను పాప పంకిలం నుంచి బయటపడేసేందుకు! అవినీతిపై పోరాటానికి ఇప్పటిదాకా కోటలు దాటని మాటలే. ఇప్పుడు చేతలు ఉద్యమాలయ్యాయి.

ఇదో 'నిప్పు' సత్యాగ్రహం... అవినీతి నేతలపై.. సొంత జలగలపై! దేశం నలు దిక్కులా అగ్గి రగిలించింది... హస్తినలో సెగలు పుట్టించింది! విపత్తు వచ్చినంతగా ఢిల్లీ పీఠం కలవరపడింది! భీష్మించుకున్న సర్కారు కాస్తంత మెడలు వంచింది! అవినీతిపై పవిత్ర యుద్ధానికి సమర భేరీ మోగించిన హజారే డిమాండ్ల పరిశీలనకు అయిష్టంగానే అయినా తలూపింది. అవినీతిపై పాశుపతాస్త్రంగా ఉండాలని ఆశిస్తున్న లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనకు పౌర సమాజానికి సగ భాగం కట్టబెట్టింది!

7, ఏప్రిల్ 2011, గురువారం

ధర్మాన కుటుంబంలో జగన్ చిచ్చు

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తన కుటుంబమంతా కృషి చేస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. తాను తన సోదరులకు, కుటుంబానికి దూరమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుందని.తన సోదరుడు ధర్మాన ప్రసాద రావు మంత్రి గా కాంగ్రెస్స్ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తాను  రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయకూడదని లేదు కదా అని ఎదురు ప్రశ్నించారు. 
సోనియా తన కుటుంబంలో చిచు పెట్టిందని చేప్తున్న జగన్ ధర్మాన కుటుంబంలోనూ అదేపని చేశాడంటూ వస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు.  తామంతా ఐకమత్యంగానే ఉన్నామని, ఉంటామని ..రాజకీయంగా ఎవరి మార్గం వారు ఎంచుకున్నంత మాత్రాన ఈ విధమైన ప్రచారాలు చేయడం కొంతమందికి తగదన్నారు.. రాజకీయాలు మధ్యలో వచ్చాయని, రాజకీయాల కంటే ముందు రక్త సంబంధం, అనుబంధం ఉన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు..ప్రస్తుతం తానూ కాంగ్రెస్లో ఉన్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేరుగా చేరి పార్టీ అభివృద్ధికి దోహద పడాలంటూ తనకు తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని, జిల్లా నలుమూలల నుంచి నాయకులు వచ్చి స్వాగతిస్తున్నట్లు కృష్ణదాస్ చెప్పారు.




రానున్న రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే

రానున్న రోజులు జగన్ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవేనని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. అధికార కాంగ్రెస్, ఇతర పార్టీలతో ప్రజలు విసిగి పోయార ని . కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రతి పక్షాల చేతకాని తనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని దీంతో రాష్ట్ర ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చూస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టిన పథకాలు సక్రమంగా అమలు కావాలంటే తమ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు.

కాంగ్రెస్ హామీని మరచిపోయింది

ఇచ్చిన హామీలను విస్మరించి, విద్యుత్ చార్జీలను పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పి.అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. 2014 వరకు విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మరచిపోయిందని దుయ్యబట్టారు. సేవాపరమైన సమస్యలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం చార్జీల పెంపుతో మరింత ఇక్కట్లపాలు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో వర్షాభావ పరిస్థితుల్లోనూ సక్రమంగా విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తెరగాలని అశోక్ చెప్పారు.


విపరీత, వికార బుద్ధిలా ఉంది

 ప్రపంచకప్ విజయంతో కోట్లాది మంది భారతీయుల్లో ఉల్లాసం, ఉత్సాహం తొణికిసలాడుతోందని బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ తెలిపారు. దేశప్రజలందరినీ ఏకతాటిపైకి తేవటంలో క్రికెట్‌ను, సినిమాను మించింది మరొకటి లేదని తన బ్లాగ్‌లో  పేర్కొన్నారు.   కోట్లాది ప్రజలను రంజింపజేశారు..కానీ వారం రోజుల్లోపే వారి ప్రవర్తనలో రానున్న విచిత్ర మార్పు తనకెందుకో విపరీత, వికార బుద్ధిలా అనిపిస్తోందని అసంతృప్తి వెలిబుచ్చారు.

దీనికంతటికీ అసలు కారణం శుక్రవారం ప్రారంభంకానున్న ఐపీఎల్ నాలుగో సీజన్  టోర్నమెంట్‌లో భారత క్రికెటర్లందరూ ఒకే జట్టుకు ఆడకుండా వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తూ పోరాడుకోవటం అమితాబ్‌కు అస్సలు నచ్చలేదు. అందుకే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు

ఖాకీల చేతిలో ప్రశాంత నిలయం బందీ

ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తి ప్రస్తుతం ఖాకీ వలయంలో చిక్కుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా పుట్టపర్తిలో భారీగా పోలీసులను మోహరించారు. ఎటుచూసినా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలను అనుమతించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా సోదాలు చేస్తున్నారు. దీంతో ప్రేమను పంచే ప్రశాంతి నిలయానికి పోలీసుల సంకెళ్లేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ప్రస్తుతం పుట్టపర్తిలో ప ది మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది దాకా ఎస్‌ఐలు, సుమారు 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో? పోలీసులు అతిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో? దీన్ని ప్రభుత్వం ఎం దుకు ప్రోత్సహిస్తోందో? అంతుచిక్కడం లేదని భక్తులు వాపోతున్నారు.





చేవెళ్ల అంటూ కోట్లు నోక్కేసారు

ప్రాణహిత-చేవెళ్ల ప్రా జెక్టు పేరుతో కాంగ్రెస్ నాయకులు, సంబంధిత కాంట్రాక్టర్ భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఎ మ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి ఆరోపిం చారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే సర్వే పేరుతో రూ. వెయ్యి కోట్లు మెక్కారని, మరో రూ.250 కోట్లు నొక్కేయడానికి పైరవీలు చేస్తున్నారన్నారు. టెండర్ పూర్తయి ఆరు సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదని పే ర్కొన్నారు. రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సాగునీరు అందిస్తామని శంకుస్థాపనలు చేశారే తప్ప ఒరిగిందేమీ లేదన్నారు.

6, ఏప్రిల్ 2011, బుధవారం

అన్నా హజారేకు మేథా మద్దతు

అన్నా హజారే చేపట్టిన నిరాహారదీక్షకు ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ తన మద్దతును ప్రకటించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న అవినీతిని రూపుమాపడానికి వెంటనే జన్‌లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ చొరవ తీసుకోవాలన్నారు.

అన్నాహజారే దీక్షకు దేశ వ్యాప్త మద్దతు

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మంగళవారం నుంచి దేశరాజధాని న్యూఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది. జన్‌లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని అన్నా ప్రారంభించిన దీక్షకు మద్దతుగా పెద్దఎత్తున ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. యోగా గురువు బాబా రాందేవ్, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్, ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేడీ, జనతాదళ్(యునెటైడ్) నాయకుడు శరద్ యాదవ్ తదితర ప్రముఖులు ఆయనకు మద్దతు ప్రకటించారు.

రజని విజయ రహస్యం ఇదీ..

పనిపై ఆసక్తి, అలుపెరుగని శ్రమే సూపర్‌స్టార్ రజనీకాం త్ విజయ రహస్యమని దర్శకుడు ఎస్‌పీ.ముత్తురామన్ పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చాలా మంది దర్శకులు, నటులు ఐదారు చిత్రాలతోనే తెరమరుగవుతున్నారన్నారు.

అందుకు కారణం స్క్రిప్ట్‌లపై పూర్తిగా దృష్టి సారించకపోవడమేనని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఏవీఎం.మెయ్యప్పన్ లాంటి నిర్మాతలు పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైతేనే సెట్‌పైకి వెళ్లేవారన్నారు. రజనీకాంత్ నేటికి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారం టే అందుకు ఆయన పడే శ్రమ, పనిపై ఆసక్తే కారణమని ముత్తురామన్ వ్యాఖ్యానించారు.

పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే

హిందీ భాషా వ్యతిరేకినని చెప్పుకునే కరుణానిధి ఏ మొహం పెట్టుకుని ఉత్తరాదికి చెందిన ఖుష్బూను ఎన్నికల ప్రచారానికి పిలిచారని ప్రముఖ హాస్యనటుడు సెంథిల్‌ప్రశ్నించారు. కరుణానిధి కలర్ టీవీలను ఉచితంగా ఇచ్చి, కేబుల్ కనెక్షన్‌ల ద్వారా ఏడాదికి రూ. 500 కోట్లను తన ఇంటికి తరలిస్తున్నారని ఆరోపించారు. పెళ్లికి ముందు సెక్స్ ఆమోదయోగ్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖుష్బూను తూర్పారబట్టిన పీఎంకే, వీసీకే పార్టీ నేతలు ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తున్న పార్టీకి ఎలా మద్దతుగా నిలిచారని నిలదీశారు. పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే కపట రాజకీయాలు ఆడే పార్టీలన్నీ ఒకే గొడుగుకిందకి చేరాయని, వాటిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఓటర్లకు పిలుపునిచ్చారు.

చెన్నైలో ‘పీపుల్ ఫర్ జగన్’ కి శ్రీకారం

తమిళనాడులోని వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులను ఏకం చేసేందుకు జగన్ యూత్ ఫోర్స్ నేతృత్వంలో ‘పీపుల్ ఫర్ జగన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా యువత హాజరయ్యారు. తమిళనాడులో ఉన్న అపారమైన యువశక్తిని, తెలుగు వారిని ఒక గొడుగు కిందికి తీసుకురావచ్చ ని, జగన్ స్ఫూర్తితో నవ సమాజ నిర్మించాలని, ప్రజలను భాగస్వామ్యం చేసి సేవా కార్యక్రమాల్ని విస్తృత పరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి తెలిపారు. తన వంతుగా తమిళనాడులోని యువశక్తిని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

సాయి కిరణ్ ఇంటర్వ్యూ

మొదటి సినిమా ‘నువ్వే కావాలి’తో మెగాహిట్ సాధించినా తొలి ప్రాధాన్యం మాత్రం బుల్లితెరకేనంటూ వర్ధమాన టీవీ, సినీ నటుడు సారుుకిరణ్ స్పష్టం చేశారు. ప్రముఖ సినీగాయకుడు రామకృష్ణ కుమారుడే సాయికిరణ్. నటుడిగానే కాకుండా గాయకుడుగా కూడా రాణిస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యంతో కూడిన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తుండి పోవాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. బుల్లితెరను తన మజిలీగా మలచుకున్న సాయికిరణ్ న్యూస్‌లైన్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సినీరంగంలోకి రాకముందు..
హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి చెన్నైలో ఉద్యోగంలో చేరా. పనిలో పనిగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. సినిమా రంగంలో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాను. నటుడిగా ప్రయాణం ప్రారంభించా.
మొదటి సినిమా గురించి..
నేను నటించిన మొదటి సినిమా ‘నువ్వే కావాలి’. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజులకే మంచి టాక్ వచ్చింది. ఆ చిత్రం సూపర్‌డూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ సినిమాలో నేను పాడిన ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట కూడా నాకు మంచి పేరు తె చ్చి పెట్టింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో పాడా. ‘ప్రేమించు’వంటి మరికొన్ని చిత్రాల్లో నటించా.

పాటలు పాడడం గురించి..
మా నాన్న వీ రామకృష్ణ ప్రముఖ సినీగాయకులుగా మీకందరికీ తెలిసిందే. ఆయన ప్రభావం నాపై ఉంది. పాటలు, పౌరాణిక పద్యాలంటే నాకు చాలా ఇష్టం. అయితే సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని నిర్మాత, దర్శకులను బలవంతం చేయను. వారు పాడమంటే అందుకు సిద్ధం.
ఏ తరహా పాత్రలు ఇష్టమంటే..
వైవిధ్యంతో కూడిన పాత్రలంటే నాకిష్టం. ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల అవి తప్పితే వేరేవి చేయలేరనే ముద్ర పడుతుంది. అందుకే వైవిధ్యంతో కూడిన పాత్రలను, నెగటివ్ షేడ్‌లు ఉండే పాత్రలైనా చేయడానికి సిద్ధం

బుల్లి తెర గురించి..
నేడు సినిమాలకంటే బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. టీవీ సీరియల్స్‌ద్వారా ప్రతి ఇంట్లో మన గురించి తెలుస్తుంది. ఎక్కువ ప్రచారం కూడా వస్తుంది. పైగా ఎక్కువ సీరియల్స్‌తోపాటు వైవిధ్యంతో కూడిన పాత్రలను చేసే వీలుంటుంది. బుల్లితెరకే నా మొదటి ప్రాధాన్యత.

ప్రస్తుతం నటిస్తున్న సీరియల్స్..
సుందరకాండ సీరియల్‌లో నటిస్తున్నా. మే నెలలో మహాభారతం సీరియల్ ప్రారంభమవుతుంది.

ఇక నా వ్యక్తిగతానికి వస్తే.. బాపు, రామానాయుడువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటా. వారితో కలిసి పనిచేయడం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెంపొందుతాయి. సినీరంగంలో నేను అమితంగా అభిమానించే నటుడు రజనీకాంత్. నేను ఆయన అభిమానిని. నటుడిగా గొప్ప అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటా. 55 సంవత్సరాలు దాటాక ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతా.

5, ఏప్రిల్ 2011, మంగళవారం

లిమిటెడ్ కంపెనీగా టీఆర్‌ఎస్

టీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎంపీ రమేశ్‌రాథోడ్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని .. . ఉద్యమాన్ని కొన్ని పార్టీల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని...టీఆర్‌ఎస్ పై విరుచుకు పడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని.. వీరిని తెలంగాణా ద్రోహులని ప్రకటించి హడావిడి చేసిన కే సి ఆర్ ఇప్పుడు మౌనంగా.. ఉండటం వెనుక ఒప్పందాలు జరిగి ఉంటాయని విమర్శించారు.

కేసీఆర్ కాళ్లు మొక్కి ఆ పని చేయిస్తా

కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామంటే, కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా ఆ పని చేయిస్తానని... తెల్లారేపాటికి తెలంగాణ ఇస్తారా అంటూ కాంగ్రెస్‌కు ప్రజా ఫ్రంట్ కన్వీనర్ గద్దర్ సవాల్ విసిరారు. కాంగ్రెసోళ్లు తెలంగాణను తేలేకపోయారు... ఐక్యంగా పోరాడి రాష్ట్రం సాధించుకుందాం రండని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణకమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయం హింసను ప్రేరేపించే విధంగా ఉన్నదని, రాజకీయ పార్టీలు డెడ్‌లైన్లు పెట్టడాన్ని ఆయన విమర్శిస్తూ, అన్నింటికి పరిష్కారం స్వపరిపాలనే అన్నారు.



సత్య సాయి ఆరోగ్య పరిస్థితిపై సిఎం సమీక్ష

సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వ హించారు. మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు అయ్యారు. కాగా ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుట్టపర్తి పర్యటన కు వెళ్ళాల్సి ఉండగా... అది ఇంకా ఖరారు కాలేదు.

బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగు

సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై ఆయన తాజా బులిటెన్ విడుదల చేశారు.

బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు... హార్ట్ బీట్, బీపీ నార్మల్‌ గానే ఉన్నట్లు వెల్లడించారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ..ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని ఆయన తెలిపారు.

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉప ఎన్నికల్లో గెలుపు మాదే : నన్నపనేని

కడప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించిన ఆమె అందుకు రుజు వులు చూపించగలరా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే దుస్థితికి దిగజారదని స్పష్టం చేశారు. కడప ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరు కదా అన్న ప్రశ్నకు మైసూరారెడ్డి ఉన్నారు కదా...ఎవరు అభ్యర్థులుగా ఉన్నా గెలవడమే తమ లక్ష్యమన్నారు.

"దమ్మరో దమ్" పై హైకోర్టుకెళ్లనున్న గోవా మంత్రి

రానా, అభిషేక్ బచ్చన్, బిపాసా బసు, దీపికా పదుకునె నటిస్తున్న "దమ్మరో దమ్" చిత్రంపై హైకోర్టుకెళ్లనున్నట్లు గోవా పర్యాటక మంత్రి నీలకంఠ హలార్కర్ తెలిపారు. చిత్ర దర్శకుడు రోహన్ సిప్పీ గోవా ప్రతిష్టను దిగజార్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు.

ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అసెంబ్లీలో సైతం లేవనెత్తారు గోవా మాజీమంత్రి మిక్కీ . ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించనీయకుండా అడ్డుకోవాలని ప్రజలకి సూచిన్చారాయన. భారతదేశంలోనే ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న గోవాను చిత్రంలో దారుణంగా చూపారనీ, ఈ చిత్రం వల్ల పర్యాటకం కేంద్రంగా భాసిల్లుతున్న గోవాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సోనియా ఇక ఇటలీకి వెళ్లక తప్పదు

డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పార్టీకి క్వార్టర్ బాటిల్ గుర్తు ఇచ్చి ఉండాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి ఎద్దేవా చేశారు. తాగిన మైకంలో విజయకాంత్ తన అభ్యర్థిని ప్రచారసభలో కొట్టడం దారుణమన్నారు. జీ స్పెక్ట్రం కుంభకోణంలో రాజా ఒక్కరే నిందితుడు కాదని ఇందు లో దయాలు అమ్మాళ్, రాజాత్తి అమ్మాల్, కనిమొళి, చిదంబరం కూడా ఉన్నారని, చిదంబరం దేశంలోనే పెద్ద కోటీశ్వరుడు ... ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో రూ. 50 వేల కోట్లను దాచి ఉంచారని ఆరోపించారు. మాఫి యా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు పాల్వాకు లెసైన్స్ ఇవ్వకూడదని హోంమంత్రి చిదంబరం అప్పటి టెలి కాం శాఖ మంత్రి రాజాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఇక రోజు లు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని, సోనియాగాంధీ ఇక ఇటలీకి వెళ్లక తప్పని పరిస్థితి వస్తుం దని అన్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం తథ్యమన్నారు.

పూనం నగ్నప్రదర్సన ప్లేస్ మారింది

మొన్నా మధ్య భారత జట్టు ప్రపంచకప్‌ గెలుచుకుంటే... ఆ క్రీడామైదానంలోనే తాను నగ్నప్రదర్శన చేస్తానని సంచలన ప్రకటన చేసిన బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే .. మాచ్ విన్ అయ్యాక మనిషి కనిపించాడ మానేయతమే కాకుండా. మీడియాకి అందుబాటులో లేకుండా సెల్ స్విచా ఆఫ్ చేసి పడేసింది. నగ్నప్రదర్శన పూర్తిగా వ్యక్తిగతమైనది పెద్దలకు ఇదొక చికిత్సాధ్యయనం లాంటిది ఇది ఎంతమాత్రం నేరం కాదు అని గర్వంగా ప్రకటించు కొన్న ఈ భామా.. తన ప్రదర్సన ముంబై లో జరగకపోవటం విచారం వ్యక్తం చేస్తూ... ప్రేమనగరంగా ఖ్యాతిగడించిన పారిస్‌కు మర్చేసినట్లు సన్నిహితుల వద్ద ప్రకటించిందట. అభిమానుల నిరాసాని అర్ధం చేసుకొనే పూనమ్‌ పాండే గుర్తించారో నగ్నప్రదర్శన చేస్తానంటూ ప్రకటించింద ట. భారత్‌లో కాకుంటే మరే దేశంలోనైనా తన నగ్నప్రదర్శనకు అవకాశం కల్పించాలని కూడా అమ్మడు బికికిఐ కి చేసిన విజ్ఞప్తి పై ఇప్పటికే భోపాల్‌ కోర్టులో ఓ కేసు నమోదైంది. అంతేగాక ముంబై పోలీస్‌ కమిషనర్‌కు కూడా బిజెపి మహిళా నేత అరుప్‌ పట్నాయక్‌ ఫిర్యాదుచేశారు. ఈనేపధ్యంలో పూనమ్‌ తన పంతం ఎలా నేరవేర్చుకొంటుందోచూడాలి

మా ఆయన తగ్గితే.. పులివెందుల బరిలో నేనున్నా

దివంగత మహానేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్.విజయలక్ష్మిపై తన భర్త రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి పోటీకి వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నట్టు సతీమణి వైఎస్.సౌభాగ్యమ్మ తన కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగాది పర్వదినాన.. వివేకా కుటుంబ సభ్యులంతా ఇంట్లో సమావేశమై.. పులివెందుల ఎన్నికల గురించి మాట్లాడు కొన్నట్లు తెలుస్తోంది. పులివెందులలో పోటీ తప్పుకోవడం ద్వారా వైయస్ అంటే అధిష్టానానికి అభిమానం ఉందనే సానుభూతిని కడప పార్లమెంట్ స్తానంలో ఉపయోగించుకోవాలని తద్వారా పార్లమెంటు అభ్యర్థిగా వివేకాను పోటీకి నిలిపితే జగన్ మెజార్టీ భారీగా తగ్గిన్చవచ్చాన్న వాదనతో సౌభాగ్యమ్మ అంగీకరించలేదు సరికదా... తన భర్త వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పడంతో అడిసగా కాంగ్రెస్స్ పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆత్మగౌరవం కోసం రాజీనామాలివ్వల్సిందే

తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు పదవులను పట్టుకుని వేలాడుతూ రాజీనామాలు చేయకపోవడంతోనే కేంద్రం స్పందించడంలేదన్నారు.

ఇప్పటికైనా తెలంగాణలోని ఎంపీ,ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఆదరిస్తున్న అందరికి 'ఉగాది' శుభాకాంక్షలు

పోచారంకి పూలు.. చంద్రబాబు కి చెప్పులు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ వి షయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన వ్యక్తం చేసింది. ఆది లాబాద్ జిల్లా బెల్లం పల్లెలో తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక ఈ విన్నూత్న నిరసన కార్యక్రమం చేసింది.

శివాజి హీరోగా పెళ్ళాం ఊరెళితే... సీక్వెల్

శ్రీకాంత్, వేణు కాంబినేషన్ లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్సకత్వంలో వచ్చిన పెళ్ళాం ఊరెళితే చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది.శివాజి హీరోగా ఈ చిత్రం త్వరలో తెరకెక్కబోతోంది. కామిడీ చిత్రాల డైరక్టర్ గాంధీ ఈ సినిమా కి డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం..గతంలో అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ, శ్రీరామచంద్రులు వంటి ఫ్యామిలీ చిత్రాలలో నటించిన శివాజి ఈ చిత్రం తో మళ్ళి ఓ వెలుగు వేలుగుటాడని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి.

14 న పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ చిత్రం ఈ నెల 14 వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాత గణేష్ బాబు ప్రకటించారు.

ఈ సందర్బంగా నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...పవన్‌కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అద్భుతం. పవన్‌కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే వంద శాతం స్క్రీన్‌మీద ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుం దన్నారు.

ఎన్టిఆర్ వివాహానికి ఆనందసాయి భారీ సెట్

మే ఐదున జరగబోయే ఎన్టిఆర్ వివాహానికి భారీ సెట్ వేస్స్ భాద్యతలు సినీ ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి తీసుకొన్నారు. తాజాగా పనిచేసిన శక్తి చిత్రం విడుదలై రిజల్ట్ ఎలా ఉన్నా అందులోని ఆనందసాయి వేసిన సెట్స్ కు మంచి పేరు వచ్చాయి. 35 అడుగుల కాళికా దేవి విగ్రహాన్ని ఆయన రూపొందించిన తీరు చిత్ర సీమలో నే కాదు యావత్ ఆంధ్ర దేశమంతా
చర్చనీయాంశంగా మారింది. ఈ నేపద్యంలో ఎన్టిఆర్ వివాహానికి పెళ్లి సెట్ వేసీ అవకాశం రావటం తో ఉబ్బి, తబ్బిబ్బవుతున్నాడు.

గొంతు తడిపేందుకు.. బీరు, విస్కీలు పుష్కలం

అసలే వేసవి కాలం.. అందులో భ గ్గున మండే ఎండలు.. గుక్కెడు నీళ్లు తాగి దూప తీర్చుకోవడం కంటే చల్లని బీరు తాగి సేద తీరడమే మేలంటున్నా రు 'బీర్' ప్రియులు. గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్లు దొరకకున్నప్పటికీ చల్లని బీర్లు మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అం తటా మద్యం దుకాణాలు వెలిశాయి. ఇక ప్రతి పల్లెలోనూ, పల్లెల్లోనీ వాడల్లోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. పల్లెల్లో చెంబెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సి ఉండగా బీర్లు మాత్రం ప్రతి పల్లెలోని ప్రతి గల్లీలో దొరుకుతున్నాయి.

మంచినీళ్లు దొరకకున్నప్పటికీ బీర్లు మాత్రం పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోనప్పటికీ అబ్కారీ అధికారుల పుణ్య మా..! అని పల్లె పల్లెల్లో వెలసిన బెల్ట్‌షాపుల మూలంగా చల్లని బీర్లు లభిస్తున్నాయి.

పల్లె ప్రజానీకానికి తాగునీరందించేందుకు పెద్దగా శ్రద్ధాసక్తులు కనబరచని ప్రభుత్వం ప్రతి ఏటా మద్యం విక్రయాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఫలితంగా ఇటు మద్యం దుకాణాలతోపాటు అటు దాబాలు, బెల్ట్‌షాపుల్లో చల్లనీ బీరు, విస్కీలు పుష్కలం గా లభిస్తున్నాయి.

తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చేందుకు నిరాకరించే మందుబాబులు చల్లని బీర్లు తెచ్చుకుని తాగడంపైనే మక్కువ కనబరుస్తున్నారు.

స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా?

భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా అన్నంత ఆనందం ప్రతి ఒక్కరిలో కలిగిందని అమితాబ్ ట్విట్టర్‌లో రాసుకున్నారు. సాధారణంగా భారత్ మ్యాచ్ జరిగేటప్పుడు తాను అసలు చూడనని, అయినా 33 పరుగులకు 2 వికెట్లు పడిపోయినా.. చివరి మ్యాచ్ విన్నింగ్ షాట్ లో కెప్టెన్ ధోని సిక్స్ కొట్టేవరకూ టెలివిజన్‌కు అత్తుకుపోయి కూర్చున్నానని ఆయన తెలిపారు. భారత్ గెలిచినా ఆనందంలో.. నేనే అది గెలిచానన్న ఫీలింగ్ కలిగి చిన్నపిల్లలా మాదిరిగా అభిషేక్, ఐశ్వర్యల తో కలిసి కారు టాప్‌పై కూర్చుని త్రివర్ణ ప్రతాకాన్ని ఊపడం చెప్పనలవి కాని గొప్ప అనుభూతి అని అన్నారు. అల్లాగే సినీ ఇండస్ట్రీ లో సాద్యం కాని రజని, గజనీ, ధోనీల అపూర్వ కలయిక క్రికెట్ తో సాధ్యమైంది అని తెగ ఆనంద పడిపోయారు అమితాబ్...

3, ఏప్రిల్ 2011, ఆదివారం

భారత జట్టుపై జరిమానా

వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంకంటే ఎక్కువ సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకపోవడంతో ప్రపంచకప్ విజేత భారత జట్టుపై ఐసీసీ మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో జరిమానావిధించాడు. భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ నిబంధన 2.5.1 ను అతిక్రమించడంతో ఐసీసీ విధించిన ఈ జరిమానాను భారత జట్టు అంగీకరించింది

కడపలో ఉప ఎన్నికల యుద్ధం

కడపలో ఉప ఎన్నికల యుద్ధం జరగబోతోందని అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పులివెందులలో బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ప్రయత్నిస్తోందన్నారు. అలాగే కడపలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి టీడీపీకి సహకరించేలా రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు సోనియాగాంధీ, వైఎస్ఆర్‌ల మధ్య జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు.

15న జగన్ నామినేషన్

కడప పార్లమెంట్ స్థానానికి ఈనెల 15వ తేదీ వైఎస్ఆర్ పార్టీ తరపున మాజీ ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 16న పులివెందుల అసెంబ్లీకి విజయమ్మ నామినేషన్ వేయనుండగా అదేరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నామినేషన్ వేయనున్నారు.

2, ఏప్రిల్ 2011, శనివారం

మనమే విజేతలం.. మీరు నమ్మండి,, నమ్మకపోండి ...

శ్రీలంక బౌలర్ కులశేఖర వేసిన వేసిన బంతిని సిక్స్‌గా మలిచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా పది బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. శ్రీలంకపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించింది. ప్రపంచ కప్ టైటిల్ భారత్ దక్కించుకోవడం ద్వారా సచిన్ టెండూల్కర్ కలను నెరవేర్చింది. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్ సాధించింది. భారత ఆటగాళ్లు మైదానంలోకి చేరుకుని ఆనంద భాష్పాలతో విజయాన్ని ఆనందించారు. హర్భజన్ సింగ్ సంతోషంతో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు అది గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ప్రపంచ కప్ పూర్తి కావడంతో ఆయన భారత కోచ్‌ పదవి నుంచి తప్పుకోబోతున్నాడు. భారతదేశమంతటా దీపావళి పర్వదినమే కనిపించింది. పెద్ద యెత్తున టపాసులు పేలుస్తూ విజయాన్ని తనివి తీరా ఆస్వాదించారు.